శివగీత - 25 / The Siva-Gita - 25

🌹. శివగీత - 25 / The Siva-Gita - 25 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్దా ధ్యాయము
🌻. శివ ప్రాదుర్భావము - 1 🌻

శ్రీ సూత ఉవాచ!

ఏవ ముక్త్యా ముని శ్రేష్టే - గతే తస్మిన్నిజాశ్రమ మ్,

అధ రామగి రౌ రామ ! - పుణ్యే గోదావరీ తటే 1

శివ లింగం ప్రతిష్టాప్య - కృత్వా దీక్షాం యధా విధి,

భూతి భూషిత సర్వాంగో- రుద్రాక్షా భరణై ర్యుతః 2

అభిషిచ్య జలై: పూర్నై - ర్గౌతమీ సింధు సంభవై:,

అర్చ యిత్వా వన్య పుష్పై -స్తద్వ ద్వన్య ఫలై రపి 3

భస్మచ్చ న్నో భస్మ శాయీ - వ్యాఘ్రచర్మా సనే స్థితః,

నామ్నాం సహస్రం ప్రజప - న్నక్తం దివ మనన్యదీ: 4

మా సమేకం ఫలాహారో - మాసం పర్ణా శన స్తతః ,

మా సమేకం జలాహారో - మాసంచ పవ నాశనః 5

శాంతో దాంతః ప్రసన్నాత్మా - ధ్యాయన్నే వం మహేశ్వరమ్,

హృత్పంకజే సమాసీన - ముమా దేహార్ధ ధారిణమ్ 6

చతుర్బుజం త్రిణ యనం - విద్యుత్పింగ జటాధరమ్,

కోటి సూర్య ప్రతీకాశం - చంద్ర కోటి సుశీతలమ్ 7

సర్వాభరణం సంయుక్తం - నాగ యజ్ఞో ఓప వీతినమ్,

వ్యాఘ్ర చర్మాంబర ధరం - వరదా భయ దారిణమ్ ? 8

వ్యాఘ్ర చర్మోత్త రీయం చ - సురా సుర నమస్కృతమ్,

పంచ వక్త్రం చంద్ర మౌళిం- త్రిశూల డమరూధరమ్ 9

నిత్యంచ శాశ్వతం శుద్ధం - ధ్రువ మక్షర మవ్యయమ్,

ఏవం నిత్యం ప్రజ ప్రతో -గతం మాస చతుష్టయమ్ 10

సూతుడు శౌనకాదులకు చెప్పెను:

ఈ ప్రకారముగా నగస్త్య మహారుషి శ్రీరామునకు పదేశించి తన ఆశ్రమమునకు తరలి పోగా నిక్కడ శ్రీరామ చంద్రుడు పునీతంబైన గోదావరీ నదీ తటంబున ఉన్న రామగిరిలో శివ లింగమును స్థాపించి శాస్త్రోక్త ముగా దీక్షను స్వీకరించిన వాడై సర్వాంగములకు భస్మమును త్రిరేఖలతో నలంకరించు కొని శివ లింగమును అరణ్య పత్రి పుష్పాదులతో పూజించి పులి చర్మాసనము పై ఆసీనుడై రాత్రింబవళ్ళు అనన్య మనస్సు గలవాడై వేద సార శివ సహస్రనామములను పటిస్తూ,

ఒక మాసము ఫలముల చేత, మరో మాసము పత్రముల చేతను, మరో మాసము జలము చేతను, ఆ పై మాసము గాలి వాయువునే ఆహారముగా మార్చుకొని శాంతి , కాంతి , మున్నగు సద్గుణములను అలవరచుకొని స్వచ్చ మైన మనస్సు

తోడ హృద్గత పరాత్పరుని, అర్ధనారీశ్వరుని, నాలుగు చేతులు గల ముక్కంటి ని,

ఎరుపు మెరుపులవలె నున్న, జటా జూటముల దాల్చినట్టి కోటి సూర్య ప్రకాశము గలవాడు,

కోటి చంద్ర సుశీత లుండు, సమస్తాబరణాలంకృతుండును, నాగ యజ్ఞో పవీత దారియు, పులి చర్మోత్త రీయముగా దాల్చిన వాడు,

వరదాభయ హస్తము గలవాడు సమస్త దేవ దానవా (సురాసుర ) దుల చేత నమస్కరించు కొనదగినవాడు పంచ ముఖములను, ఉడు రాజశేఖరుడు ను, డమరుక త్రిశూల ధారియు, శాశ్వతుడు పరిశుద్దుడును, అవ్యయుడగు మహేశ్వరుని ధ్యానిస్తూ చతుర్మాసములను గడిపెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 25 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 04 :
🌻 Shiva Praadurbhaavam - 1 🌻

Suta said to Saunaka sages:

In this way sage Agastya initiated Sri Rama and went back to his hermitage.

Here near the bank of sacred Godavari river, Sri Rama established a Shivalinga on a hilltop, and in the prescribed manner he underwent the deeksha.

He smeared all his body parts with holy ash in a three horizontal lined fashion, worshiped Shivalinga with forest flowers and leaves being seated on the tiger skin.

He chanted the Veda Saara shiva Sahasranamavali.

This way he spent one month living only by eating fruits, next month he lived by eating only leaves, next month he sustained himself only on water, subsequent month he survived only by consuming air.

He remained pious and maintained all pious qualities like serenity, sense control etc. and with a cleansed heart he meditated on Lord Maheshwara who resides in the heart,

who is higher than the highest, who is of androgenous form (Ardhanareeshwara), 

who has four hands and three eyes, who is like lightening flash of red color,

who has braided (matted) hair, who has an aura which equals the brilliance of crores of suns, whose aura is as cool as the coolness of crores of moons combined, who wears many ornaments,

who wears snake as a sacred thread, who wears tiger skin as garments, who keeps one hand in blessing posture, who is saluted by all gods and demons, who has five faces,

who wears a crescent moon on his head, who holds a damaru (musical instrument), and trident, who is eternal, who is unblemished,

who is imperishable. In this way Rama spent four months of Deeksha.

🌹 🌹 🌹 🌹 🌹

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 22

Image may contain: outdoor
🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 22 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 10 🌻

ఎప్పుడైతే నువ్వు జ్ఞాత స్థానంలో సాక్షిగా వుంటావో, ఎప్పుడైతే మిగిలిన 24, పిండాండ పంచీకరణలో చెప్పబడినటువంటి 24 నీకు స్వాధీనమై నువ్వు సాక్షిగా వుంటావో, అప్పుడు సేవకుడిగా వుంటావు. కర్తవ్యం చేస్తావు. ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవై వుంటావు.

అంతా ఈశ్వరప్రసాదంగా చూస్తావు. కర్మకి అంటకుండా వుంటావు. మాలిన్యము లేకుండా వుంటావు. ఇంకేమిటి? సహజ సమరస శాంత స్వభావంతో వుంటావు. ఈ మూడూ గుర్తుపెట్టుకోవాలి.

సహజ సమరస శాంత స్వభావంతో ఎవరైతే వుంటారో వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానమునకు అర్హులు. ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి అంశాలను ఇందులో ప్రతిపాదిస్తున్నారు.

కాబట్టి మనం తప్పక ప్రయత్నించి అనేక జీవితములుగా అనేక జన్మలుగా మాటిమాటికీ ప్రలోభపెడుతూ నీ వెనక పడుతున్నటువంటి నిన్ను వాటి వెంట తిప్పుకునేటటువంటి ధన, కనక, వస్తు, వాహన స్త్రీ వ్యామోహ - స్త్రీ అంటే ఇక్కడ ఒక స్త్రీలనే కాదు సుమీ.

మానవులందరూ స్త్రీలే. పరమాత్మ ఒక్కడే పురుషుడు. ప్రకృతి అంతా స్త్రీత్వమే. కాబట్టి ఇక్కడ స్త్రీ అన్న శబ్దం వాడినప్పుడల్లా ప్రకృతి చేత ప్రేరణ పొందబడుతున్న వారందరూ స్త్రీలే. కాబట్టి గుణముల చేత ప్రేరితమవుతున్న వారందరూ స్త్రీలే. సర్వజీవులూ స్త్రీలే అని అర్ధం.

కాబట్టి ఇటువంటి జీవభావంతో శరీరమే నేను అనేటటువంటి వ్యామోహంతో కూడుకున్నటువంటి వారు ఎవరైతే వుంటారో, మోహము -వ్యామోహము , విస్తృతి కలిగినటువంటి మోహము వ్యామోహము. వ్యావృత్తి కలిగినటువంటి మోహము వ్యామోహము.

కాబట్టి అటువంటి దాని బారిన పడకుండా మానవజీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానమును అందిపుచ్చుకోవడానికి ఎవరైతే ప్రయత్నంచేస్తుంటారో వారి జన్మ ధన్యము.

ఎవరికైతే ఈ “స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంతాభృశం వాదినః” అనే సత్యాన్ని గుర్తించినటువంటి వారున్నారో, ఎవరైతే జగత్ భ్రాంతిలో పడకుండా వున్నారో, “బ్రహ్మ సత్యం జగన్మిధ్య” అను సూత్రమును తన జీవితమునందు తాను సిద్ధిపొందాలనేటటువంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి వున్నారో వారి జన్మ ధన్యము.

కాబట్టి మనలో ఆ రకమైన జగత్తుకి సంబంధించినటువంటి ప్రేరణలు కలుగగానే వాటిల్లో ఉన్నటువంటి దోషభావాన్ని గుర్తెరగాలి. ఏమిటి వాటిల్లో ఉన్నటువంటి దోషభావము అంటే నిన్ను మొహములో చిక్కుకునేటట్లుగా చేస్తుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 82

No photo description available.
🌹. మనోశక్తి - Mind Power - 82 🌹
Know Your Infinite Mind

🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ

చివరి భాగం
🌻 Q 79:--పూర్ణాత్మ vs దేహం 🌻

Ans :--

1) మనం మన దేహాన్ని ఒక పూర్ణాత్మ గా పరిగణిస్తే దేహంలోని జీవకాణాలన్నీ అంశాత్మలు గా పరిగణించవచ్చు. కాబట్టి అంశాత్మల చైతన్య పరిణామం పూర్ణాత్మ చైతన్య పరిణామం అవుతుంది.

2) దేహం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. జీవకణాలు మృతి చెంది మరలా పడుతుంటాయి. అలాగే అంశాత్మలు మరణిస్తూ పునర్జన్మ తీసుకుంటుంటాయి. కానీ అంశాత్మలు సాధించిన జ్ఞానం, పురోగతికి సంబందించిన information స్టోర్ అవుతుంటుంది.

3) జీవకణం కొంత time జీవించివుంటుంది.దాని అభివృద్ధి అయ్యాక మరణిస్తుంది. మరల జన్మ తీసుకుంటుంది.అలాగే శరీరానికి కొంత టైం ఉంటుంది, సమిష్టిగా జీవకణాలన్నీ(అంశాత్మలన్ని)అభివృద్ధి చెందాక దేహం నశిస్తుంది.

4) మన దేహంలోని భాగాలను గమనిద్దాం. ముక్కు యొక్క అనుభవాలు ఏముంటాయి.... చెడు లేదా మంచి వాసనలు పసిగట్టగలగడం. అలాగే దేహం లోని ప్రతిభాగానికి ఇలాగే వాటి లక్ష్యాలుంటాయి, అనుభవాలు వుంటాయి. ఈ విధంగా దేహంలోని ప్రతి జీవకణం యొక్క అనుభవాల information ఆత్మలో store అవుతుంది. అలాగే total దేహంలో ఉన్న ఆత్మ యొక్క అనుభవం పూర్ణాత్మ యొక్క అనుభవం అవుతుంది.

5) అంశాత్మలు అభివృద్ధి చెంది పూర్ణాత్మ లు అవుతాయి.లీనమవ్వడం అనేది ఈ సృష్టిలో లేనేలేదు.ఏదైనా అనంతకాలం కొనసాగుతూనే వుంటుంది.

6) పూర్ణాత్మ యొక్క అంశాత్మలు higher లోకాలలో, lower లోకాలలో జన్మ తీసుకుని ఉంటాయి, ఈ అంశాత్మలన్ని కలసి సాధించిన ప్రగతి ఒక పూర్ణాత్మ ప్రగతి అవుతుంది. అంశాత్మలన్ని చైతన్యశక్తి ద్వారా అనుసంధానింపబడి ఉంటాయి. కావున ప్రతి అంశాత్మ ఎలాంటి జ్ఞానం కావాలన్నా అంతర్ ప్రయాణం ద్వారా పొందవచ్చు.

7) web system =

పూర్ణాత్మ + అంశాత్మలు.

ప్రతి అంశాత్మను ఒక website అనుకుందాం.

అంశాత్మ = google, facebook, youtube ఈ websites అన్నీ internet ద్వారానే పనిచేస్తాయి.ఇక్కడ internet అంటే చైతన్యశక్తి.

ఒక అంశాత్మ సాధించిన పురోగతి ఇతర అంశాత్మలుకు కూడా చేరవేయబడుతుంది.

8) websystem= 

భూమి+దానిపైన ఉన్న లోకాలు+ఇతర జీవజాతులు ఇక్కడ భూమి పై నివసించే మానవులు ఇతర జీవజాతులు యొక్క పురోగతి భూమి యొక్క పురోగతి అవుతుంది.

భూమి ఇతర లోకాలన్నీ web system కి internet (చైతన్యశక్తి)ద్వారా connect అయి ఉంటాయి.

ఈ విధంగా భూమి పై నివసించే జీవరాసులన్నీ ఈ websystem కి కనెక్ట్ అయితే ఇతర లోకాల ఇన్ఫర్మేషన్ ని కూడా తెలుసుకోవచ్చు.అలాగే మన లోకం గురించి తెలుసుకోవాలంటే ఇతర లోకాలవాళ్ళు వాళ్లు కూడా websystem కి connect అయితే మన information వారు తెలుసుకోవచ్చు.

ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.
🌻. సమాప్తం... 🌻

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 17 / Sri Gajanan Maharaj Life History - 17

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 17 / Sri Gajanan Maharaj Life History - 17 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 4వ అధ్యాయము - 2 🌻
ఇక దీనివలన జానకిరాంకు ఏమయిందో వినండి: ఉగాది రోజున వేపచిగుళ్ళకు ఒక ప్రత్యేకత ఉన్నట్టు, అక్షయతిదియ రోజున చింతకాయ కూరకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. జానకిరాం ఆరోజున చాలామంది స్నేహితులకు మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించాడు. 

ఆ భోజనంలో ముఖ్యవంటకం ఈ చింతకాయ కూర. ఈకూర వచ్చినవారికి వడ్డించినప్పుడు చూస్తే దానినిండా చిన్నపురుగులు ఉన్నట్టు కనిపించింది. దీనితో వచ్చినవారికి తలతిరిగినట్టు అయి, భోజనం చెయ్యకుండానే వచ్చిన అతిధులు వెళ్ళిపోయారు. 

దీనివల్ల ఈ కంసాలికి చాలానిరాశ కలిగి, తను నిప్పు శ్రీమహారాజుకు ఇవ్వక చేసినతప్పు వల్లనే ఇలా జరిగింది అని వెంటనే తట్టింది. వంటకాలన్నీ వృధాఅయ్యాయి. 

శ్రీగజానన్ స్వఛ్ఛమయిన నీటివంటివారు మరియు రాజాధిరాజు, అటువంటి వారినినేను ఒక ముష్టివానిగా చూసాను. భూత, భవిష్య వర్తమానాలు తెలిసిన ఆయనను నేను ఒక పిచ్చివానిగా భావించాను.

ఒక కల్పవృక్షాన్ని నేను ముళ్ళపొద అనుకున్నాను. అయన చింతామణి నేను అయనని ఒక దరిదృడు అనుకున్నాను. ఆయన దైవిక శక్తిని తెలుసుకోలేక పోయాను. నా దురదృష్టంవల్ల ఒక గొప్ప యోగి ఆశీర్వాదాలు పొందే అవకాశం పోగొట్టుకున్నాను. 

నేను ఈ భూమిమీద, అనవసరమయిన 2 కాళ్ళ జంతువుని, బరువుని మాత్రమే. ఇలా తనని తాను చాలా నిందించుకుంటాడు. శ్రీమహారాజు దగ్గరకి వెళ్ళ లొంగిపోవడానికి చివరకి నిశ్చయించు కుంటాడు. కొద్దిగా చింతకాయ కూర తనతో తీసుకొని, బనకటలాల్ ఇంటికి వెళ్ళి తన దురదృష్టాన్ని వర్నిస్తాడు. ఈ పురుగులతో నిండిఉన్న కూర చూడమని బనకటలాల్తో అంటాడు. 

అతిధులు అందరూ భోజనం చెయ్యకుండా వెళ్ళిపోవడంతో నేను పూర్తిగా అప్రతిష్ట పాలు అయ్యాను, ఇది అంతా నాస్వయంకృతంవల్లనే. ఈరోజు ఉదయం నేను శ్రీమహారాజుకు నిప్పు ఇవ్వడానికి నిరాకరించాను దానిఫలితం ఇది. మీరు వాడిన చింతకాయల లోనే పురుగులు ఉన్నాయేమో అని బనకటలాల్ అతనితో అన్నాడు. 

చింతకాయలు కొత్తవి, పురుగులు లేనివి అని జానకిరాం బదులు చెప్పాడు. నేను ఇప్పుడు కోరుకునేది ఏమంటే శ్రీగజానన్ కు సాష్టాంగపడి, నాతప్పు క్షమించమని వేడుకోవడం. శ్రీగజానన్ దగ్గరకు జానకిరాం వెళ్ళి, సాష్టాంగపడి, ఓ మహారాజ్ నాతప్పులకు నన్ను క్షమించమని వేడుకున్నాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 17 🌹 
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 4 - part 2 🌻
Now listen to what happened to Jankiram by this incident. 

Neem leaves have a special significance on the New Year’s Day (Gudi Padwa), so does the tamarind curry on Akshaya Tritiya day. Shri Jankiram had invited many people for lunch on that day and the main dish was tamarind curry. 

When this curry was served to the people it was seen full of small dirty worms. It created nausea amongst the people gathered to eat and caused many people to leave the house without eating any food. 

The gold smith felt very sorry and it suddenly occurred to him that this happened because he had refused to provide fire for the pipe of Shri Gajanan Maharaj. He thought to himself, Shri Gajanan is the pure water of Janhavi, the king of Kings and I treated Him like a beggar. 

He is the knower of the past, the present and the future and I thought Him to be a mad person. A Kalpavriksha was thought by me to be a thorny bush. He is a Chintamani and I thought Him to be splint. 

I could not understand His divine power. By my ill luck I lost an opportunity of getting the Blessings from a great Saint. I am a mere burden to this earth, an animal of two legs.” Thinking so, he condemned himself again and again and at last he decided to go and surrender at the feet of Shri Gajanan Maharaj . 

He took some tamarind curry with him, went to Bankatlal's house and narrated his misfortune to Bankatlal. He said Bankatlalji look to this curry full of worms. I am completely disgraced as all the invitees for lunch had to go without food. It is all due to my own fault. 

This morning I had refused the fire for the pipe of Shri Gajanan Maharaj and this is the result. Bankatlal said that the tamarind used by him might have been infested by worms. Jankiram said, The tamarind was new and clear. 

Now all that I want is to prostrate before Shri Gajanan and beg His pardon for my blunder. Jankiram went and falling at the feet of Shri Gajanan said, O Maharaj I beg to be pardoned for all my mistakes. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 🇸‌🇪‌🇪‌🇩‌🇸‌ 🇴‌🇫‌ 🇨‌🇴‌🇳‌🇸‌🇨‌🇮‌🇴‌🇺‌🇸‌🇳‌🇪‌🇸‌🇸‌ - 114 🌹

🌹 🇸‌🇪‌🇪‌🇩‌🇸‌ 🇴‌🇫‌ 
🇨‌🇴‌🇳‌🇸‌🇨‌🇮‌🇴‌🇺‌🇸‌🇳‌🇪‌🇸‌🇸‌ - 114 🌹
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 The seed of spiritual life grows in secret silence and darkness until its appointed hour of activation on the divine plane of existence beyond consciousness, mind and body. 🌻*

If you are examining deeply the real nature of your being behind the idea of "I am", your spiritual progress is central and inevitable. 

On this path of realization of the absolute state of being, it is ignorant to become emotionally disturbed about your rate of progress or whether the great realization will happen quickly or slowly, in the present body or some future body.

The seed of spiritual life grows in secret silence and darkness until its appointed hour of activation on the divine plane of existence beyond consciousness, mind and body. 

It is enough for consciousness to be ever looking into its own center of "I am" with increasing detachment and right order of external life without adding to the troubles and problems that come with useless desires and fears.

To be ever fretfully exercising mental imagination and physical exertions toward the ultimate state of being is a misunderstanding in consciousness of going away from central awareness of being to try to get the result of it from outside in the mind and body. 

You are not your mind or body, so why do you look so hard to your mind or body to give you the self-realization you need? 

Conscious attention must look within the very core of itself and go through the ultimate gateway of "I am"...
🌹 🌹 🌹 🌹 🌹

Twelve Stanzas from the Book of Dzyan - 11

🌹 🇹‌🇼‌🇪‌🇱‌🇻‌🇪‌ 🇸‌🇹‌🇦‌🇳‌🇿‌🇦‌🇸‌ 🇫‌🇷‌🇴‌🇲‌ 🇹‌🇭‌🇪‌ 🇧‌🇴‌🇴‌🇰‌ 🇴‌🇫‌ 🇩‌🇿‌🇾‌🇦‌🇳‌ - 11 🌹
🌴 The Prophetic Record of Human Destiny and Evolution
🌴

🌻 STANZA III - The Sowing of Love - 2 🌻

22. The Stellar Period had defined a New Round. At this point it would be impossible to return to the past, since all bridges would be burnt. And they would be burnt by none other than man himself. 

The most important thing was 
to discern where the Light was and where the darkness was, and what the past and the future meant for him. 

Through wise discernment of the essence of all things, he was able to build the saving bridge that would span the abyss and lead him to the Kingdom of the Light. 

But, all too often, people were stubbornly closing their eyes, unwilling to glimpse the Bright Path which was right beneath their feet, and blindly burnt the bridges that would lead them to the shore of Salvation. 

Insisting on their own way, these blind ones were depriving themselves forever of the Kingdom of Eternal Fires, preferring to remain instead 
in the total gloom of ignorance. 

Thus began to unfold the stratification of humanity, which was to make the last step beyond the border of the darkness or the Light. That was their Final Choice, for the Period — as designated by the stars — had so determined. 

23. Love once again came to life in the world and diffused the Almighty Rays, which were even able to pierce through the most incredibly dense masses of petrified Matter. And, little by little, people began to open their eyes. 

They had long known that even a stone was capable of loving, protecting, guarding, and 
bringing happiness to their owners — owners whom they indeed loved. Yes, the world was brimming over with Love.
 
Man beheld how a flower which he had mercilessly torn from its stem would incline its beautiful little head towards him, dedicating the last moments of its life to a declaration of Love — Love for him, a man. 

Yes, a flower is able to love 
even a slayer that has brutally severed the thread of its marvellous, innocent life. Flowers forgive everything, because they sincerely love man — even men who are most in “love” with the money they receive for the “goods” they sell. 

The flowers very much hoped that people would open their eyes and understand how it was even painful to love them... Indeed, humanity was coming nearer to this understanding, for the language of one flower was always understandable to another member of the floral kingdom.

 After all, it was not so long ago that human beings were flowers themselves, covering the whole planet in a carpet of beautiful bloom. But the Gods did not pluck them... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 🇦‌🇻‌🇦‌🇹‌🇦‌🇷‌ 🇴‌🇫‌ 🇹‌🇭‌🇪‌ 🇦‌🇬‌🇪‌ 🇲‌🇪‌🇭‌🇪‌🇷‌ 🇧‌🇦‌🇧‌🇦‌ 🇲‌🇦‌🇳‌🇮‌🇫‌🇪‌🇸‌🇹‌🇮‌🇳‌🇬‌ - 68 🌹

🌹 🇦‌🇻‌🇦‌🇹‌🇦‌🇷‌ 🇴‌🇫‌ 🇹‌🇭‌🇪‌ 🇦‌🇬‌🇪‌ 🇲‌🇪‌🇭‌🇪‌🇷‌ 🇧‌🇦‌🇧‌🇦‌ 🇲‌🇦‌🇳‌🇮‌🇫‌🇪‌🇸‌🇹‌🇮‌🇳‌🇬‌ - 68 🌹
Chapter 18
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 🇼‌🇭‌🇦‌🇹‌ 🇮‌🇸‌ 🇴‌🇺‌🇷‌ 
🇸‌🇹‌🇷‌🇪‌🇳‌🇬‌🇹‌🇭‌ - 2 🌻*

To guide human consciousness through these seven shadows is his duty, and he takes on this duty to help guide others, whether one seeks his help or not The Avatar is our guide; his guidance is our strength. That guidance reveals the path  
toward Truth through these seven shadows. 

If we accept him as our strength to cross these worlds of shadows, we have to depend on his guidance completely, just as a traveler in a foreign country must depend on a guide to find his way through unfamiliar foreign land. 

But, how does one depend on him? Once we have accepted him as our guide, his guidance becomes our strength, and so we do not need the pride of material strength. 

The world prides itself in wealth, name, fame, intellect, authority, education, etc., but one has to remain detached from these material attainments, because they are not really strengths. They are only attachments. 

The one way to be detached from these forces of the world is to accept him as one's guide. It is by his guidance that one finds the strength to be led beyond the boundary of happiness and misery.  

How does one remain detached? Let us suppose money represents the strength of the world. A banker is always in contact with money. A banker deals with money all day long, millions of dollars are deposited and are drawn out, and the banker keeps a careful account of the money that is deposited and withdrawn.

 However, he remains detached from the money itself, because he knows the money does not belong to him. In the same way, one should remain detached from the material strength of the world, knowing that money is only a form of attachment to the world. 

The banker knows full well that the money does not belong to him, and we should know that his attachment does not belong on the path of Truth. Money is simply one of many attachments. 

To remain detached from money and the many other strengths of the world, one must be attached to the Truth, and this can only be achieved by accepting the guidance of the Avatar who leads one to realize Truth.
🌹 🌹 🌹 🌹 🌹

8-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 452 / Bhagavad-Gita - 452🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 240 / Sripada Srivallabha Charithamrutham - 240🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 120🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 142🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 56 / Sri Lalita Sahasranamavali - Meaning - 56 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 59🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 27🌹
8) 🌹. శివగీత - 24 / The Shiva-Gita - 25 🌹
9) 🌹. సౌందర్య లహరి - 66 / Soundarya Lahari - 67🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 366 / Bhagavad-Gita - 366🌹

11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 192🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 68 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 64 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 79 🌹
15) 🌹 Seeds Of Consciousness - 144 🌹
16) 🌹. మనోశక్తి - Mind Power - 82🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 28🌹
18) 🌹 Twelve Stanzas from the Book of Dzyan - 11🌹
18) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 22🌹
19) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 7 🌹
20)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 452 / Bhagavad-Gita - 452 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -09 🌴*

09. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మమిచ్ఛాప్తుం ధనంజయ ||

🌷. తాత్పర్యం : 
ఓ అర్జునా! ధనంజయా! స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో, భక్తియోగమునందలి విధివిధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధిచేసికొనుము.

🌷. భాష్యము : 
ఈ శ్లోకమున రెండు విధములైన భక్తియోగావిదానములు తెలుపబడినవి. అందు మొదటిది దివ్యప్రేమ ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురాగమును వాస్తవముగా వృద్దిచేసికొనినవారికి సంబంధించినది. 

దివ్యప్రేమ ద్వారా పరమపురుషుని యెడ అనురాగమును పెంపొందించుకొనినవారికి రెండవ పధ్ధతి పేర్కొనబడినది. ఈ రెండవ తరగతికి పలు విధివిధానములు నిర్దేశింపబదియున్నవి. శ్రీకృష్ణుని యెడ అనురాగాము కలిగిన స్థితికి మనుజుడు అంత్యమున ఉద్ధరింపబడుటకు వాటిని అనుసరింపవచ్చును.

భక్తియోగమనగా ఇంద్రియముల పవిత్రీకరణమని భావము. ప్రస్తుతము భౌతికస్థితిలో ఇంద్రియములు భోగతరములై యున్నందున అపవిత్రములై యుండును. కాని భక్తియోగాభ్యాసముచే ఇంద్రియములు పవిత్రములు కాగలవు. 

పవిత్రస్థితిలో అవి శ్రీకృష్ణభగవానునితో ప్రత్యక్ష సంబంధమునకు రాగలవు. ఈ జగమున నేను ఒక యజమాని సేవలో నిలిచినప్పుడు, నిజముగా ప్రేమతో అతనిని సేవింపను. కేవలము కొంత ధనమును పొందుటకే సేవను గూర్తును. 

అదేవిధముగా యజమాని సైతము ప్రేమను కలిగియుండడు. నా నుండి సేవను గ్రహించి, నాకు ధనమొసగుచుండును. కనుక ఇచ్చట ప్రేమ అనెడి ప్రశ్నయే ఉదయింపదు. కాని ఆధ్యాత్మికజీవితమున శుద్ధమగు ప్రేమస్థాయికి ప్రతియొక్కరు ఎదుగవలసినదే. 

ప్రస్తుత ఇంద్రియములచే నిర్వహింపబడెడి భక్తియోగాభ్యాసము చేతనే అట్టి ప్రేమస్థాయి ప్రాప్తించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 452 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 09 🌴*

09. atha cittaṁ samādhātuṁ
na śaknoṣi mayi sthiram
abhyāsa-yogena tato
mām icchāptuṁ dhanañ-jaya

🌷 Translation : 
My dear Arjuna, O winner of wealth, if you cannot fix your mind upon Me without deviation, then follow the regulative principles of bhakti-yoga. In this way develop a desire to attain Me.

🌹 Purport :
In this verse, two different processes of bhakti-yoga are indicated. 

The first applies to one who has actually developed an attachment for Kṛṣṇa, the Supreme Personality of Godhead, by transcendental love. And the other is for one who has not developed an attachment for the Supreme Person by transcendental love. 

For this second class there are different prescribed rules and regulations one can follow to be ultimately elevated to the stage of attachment to Kṛṣṇa.

Bhakti-yoga is the purification of the senses. At the present moment in material existence the senses are always impure, being engaged in sense gratification. 

But by the practice of bhakti-yoga these senses can become purified, and in the purified state they come directly in contact with the Supreme Lord. 

In this material existence, I may be engaged in some service to some master, but I don’t really lovingly serve my master. I simply serve to get some money. And the master also is not in love; he takes service from me and pays me. 

So there is no question of love. But for spiritual life, one must be elevated to the pure stage of love. That stage of love can be achieved by practice of devotional service, performed with the present senses.

This love of God is now in a dormant state in everyone’s heart. And, there, love of God is manifested in different ways, but it is contaminated by material association. 

Now the heart has to be purified of the material association, and that dormant, natural love for Kṛṣṇa has to be revived. That is the whole process.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 240 / Sripada Srivallabha Charithamrutham - 240 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయం 49
*🌻. అగ్ని ఉపాసనయే అగ్ని యఙ్ఞం 🌻*

శ్రీపాదులు ఒకసారి నాతో ఇలా అన్నారు," శంకరభట్టూ! మనం చేసేది అగ్నిఉపాసన. నీ అగ్ని ఉపాసన గాడిపొయ్యి వెలిగించి, వంట చేయడమే. 

నీ గాడిపొయ్యిలోని అగ్నికి స్వతఃశక్తి లేదు. నా యోగాగ్ని కలవడంవల్ల ఆ పొయ్యిమీద నీవు చేసేవంట ప్రసాదరూపమై భక్తుల కష్టాలను, బాధలను పోగొట్టగల్గుతుంది. ఈ గాడిపొయ్యి ఇంకొక 9 సంవత్సరాలు మాత్రమే వెలుగుతుంది. అంటే నా 30వ యేట నేను నా శరీరాన్ని గుప్తపరచుకుంటాను. 

ఆ తర్వాత 3 సంవత్సరాలు శ్రద్ధ ఉన్న భక్తులకు మాత్రమే తేజోరూపంలో దర్శనం ఇస్తాను. అటు తరువాత కూడా మనం మొదలు పెట్టిన ఈ అగ్నియఙ్ఞం ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగు తుంది’

🌷. కర్మధ్వంస విధానాలు 🌻

ఒకసారి నవదంపతులు శ్రీపాదుల దర్శనార్థం వచ్చారు. ప్రభువులు వారిద్దరిని పంచదేవ్ పహాడ్లోని తమ దర్బారు లో ఉండమని ఆదేశించారు. రెండోరోజు ఆ యువకుడు మరణించాడు. పాపం! ఆ యువతికి ఇది పరమదుస్సహ మైన వైధవ్యం, ఆమె శోకదేవతకు మారు రూపంలా ఉంది. 

బంధువులు వచ్చారు, శవాన్ని ఏం చెయ్యాలో? శ్రీపాదులని ఏం అడగాలో? వారికి తెలియడంలేదు. అప్పుడే దర్బారు వచ్చిన శ్రీపాదులు కర్మ అనివార్యం అని సూచించారు. అప్పుడు ఆ స్త్రీ, "చైతన్యస్వరూపులు, అగ్నిరూపులు అయిన శ్రీపాదులకు అసాధ్యం అనేది ఏదీ లేదని విన్నాను. ఈ అభాగ్యురాలికి మాంగల్య భిక్షను ఇమ్మని," కోరింది. 

వెంటనే శ్రీపాదులు "విశ్వాసో ఫలదాయకం," నాపైన నీకు అలాంటి దృఢమైన నమ్మకం ఉంటే నీ భర్త ఖచ్చితంగా సజీవుడు అవుతాడు. అయితే కర్మ సిద్ధాంతాలకు వ్యతి రేకం కాకుండా ఒక ఉపాయం చెప్తాను. నీ భర్త బరువుతో సమానంగా కట్టెలను తీసుకొని రా. 

అవి గాడిపొయ్యిలో వేసి అన్నం వండుదాము. నీ వైధవ్యం, నీ భర్త శరీరం కాలి దగ్ధం అవడం, తరువాత వండే శ్రాద్ధాన్నం, మృత్యు రూపంలో ఉన్న కర్మస్పందనలు మొదలైన అమంగళాలు అన్ని కట్టెలతోపాటుగా కాలి భస్మం అవుతాయి," అని చెప్పారు
 ఆ రకంగా చేయగానే ఆమె భర్త తిరిగి జీవితుడు అయ్యాడు. 

ఈ విధంగా శ్రీపాదులు తమ అగ్నియఙ్ఞం ద్వారా కొన్ని సార్లు భక్తుల కర్మలని కట్టెలలోకి ఆకర్షించి, వాటితో వండి, వాళ్ళ కర్మ ధ్వంసం చేసేవారు. 

ఒకసారి ఒక బీద బ్రాహ్మ ణుడు జీవితంపై విసుగెత్తి ఆత్మహత్య చేసుకోవాలన్న తపనతో గురువుల వద్దకు వచ్చాడు. శ్రీపాదులు మండు తున్న కొరివిని తీసి ఆ బ్రాహ్మణుడికి వాత పెట్టారు. 

బాధ పడుతున్న ఆ బ్రాహ్మణుడితో తాము కనక ఆ పని చేసి ఉండక పోయినట్లయితే అతడు నిజంగానే ఆత్మహత్య చేసుకొనేవాడని, తాము అశుభ స్పందనలను రద్దు చేసా మని చెప్పి ఆ చల్లారిన కొరివిని ఇంటికి తీసుకుపొమ్మని ఆఙ్ఞాపించారు.

 ఇంటికి వెళ్ళి చూస్తే అది బంగారంగా మారి ఉంది. దానితో అతని దరిద్రబాధ తీరిపోయింది. ఒక్కొక్క సారి భక్తులని ప్రత్యేకమైన కాయకూరలు తెమ్మని చెప్పి, వారి కర్మలని వాటిలోకి ఆకర్షించి, వండించి, దానిని ప్రసా దంలా పంచేవారు. 

వివాహం కాని ఒక యువతికి కుజదోషం పోవడానికి కందులు తెమ్మని వాటితో వంటకం చేయించి ఆ అమ్మాయితో సహా అందరిని తినమని ఆదేశించారు. కర్మబంధ విముక్తురాలైన ఆ అమ్మాయికి చక్కటి వరుడు దొరికి వివాహం అయ్యింది. 

కొందరిని వంటకి ఆవు నెయ్యి తెమ్మనేవారు. జబ్బు పడ్డ భక్తునికి ఆ రాత్రంతా ఆరకుండా దీపం వెలిగించి ఉంచమని చెప్పారు. నిర్భాగ్య స్థితిలో ఉన్న మరొక భక్తుని వారం రోజులపాటు అఖండ దీపం ఆవు నేతితో వెలిగించి ఉంచమని చెప్పారు. 

అతడికి లక్ష్మీకటాక్షం సిద్ధించింది. ఈ విధంగా భక్తులకు వారి మీద ఉన్న నమ్మ కానికి అనుగుణంగా రకరకాల పద్ధతుల ద్వారా, భక్తుల బాధలను తీర్చేవారు. 

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 240 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 26
*🌻 Kanayaka Puranam - 2 🌻*

In those days Vysyas used to worship Parameswari very much. Due to intense devotion, some people used to offer their children to Parameswari. Such ‘offered girls’ used to be called ‘goura balikas’. The  boys were called ‘Bala nagaras’. There used to be a strict rule that Goura balikas should be married to Bala nagaras only.

 Bhaskaracharya used to give special  deeksha called ‘chaitanya kriya yogam’ to Gaura balikas and Bala nagaras. They used to be transformed into yogins and yogis from the childhood. 

Bhaskaracharya’s belief was that children born to such people would be superior and their families would be happy with wealth and luck and live with mutual love like ‘Gouri and Shankar’. These 18 towns were specially sacred ones. Nagareswara Mahadeva was the head of those divine towns and Kusuma Shresti was the King ruling those towns.  

Bhaskaracharya’s wish was that one new type of creation should be brought into the prakruthi (nature). As there was no issue to the Kusuma  Shresti couple, Bhaskaracharya conducted ‘Puthra Kameshti Yagam’. Arya Mahadevi manifested in that yajna kundam and gave two fruits to them.  

As a result, on one Dasami in the first  half of the month of ‘Vysakha’, on Friday in the Punarvasu star, Vasavee  Kanyaka was born. As a twin brother to Vasavee Kanyaka, one male child was also born. 

They named this male child ‘Virupaksha’. Vasavee Kanyaka was really My divine sister.  

Virupaksha was born with the ‘amsa’ of Nandeeswara as Her twin brother. Previously Silada Maharshi went to Himalayas while taking stones as food.  

He had darshan of Hymavathi Maha Devi and prayed, ‘Amma! You are the daughter of a mountain (saila puthri).  Because I eat stones, I am also a ‘Saila Puthra’.  

Please grant me the fortune of being born as your brother. Sri Hymavathi said, ‘Maharshi! In this birth, I will marry Parameswara.  

You be our vahana (vehicle) as Nandeeswara. When I take birth in Kaliyugam as Kanyaka Parameswari, you will also be born as my twin brother.  

I am gifting you the same stone on which I did tapas. You take this stone  to ‘jyesta sailam’. At the time of ‘sankusthapana’, this stone should be  kept in the pit and a fort should be built on it. 

 In Kaliyugam, the Sadvysya King Kusuma Shresti will build this fort. Later, I and the couples belonging to 102 gothras will enter into ‘agni kundam’ and reach Kailasam again.  

At the end of Kaliyugam, my brother Sripada Srivallabha takes avathar as Kalki, kill crores of people of bad character and establish ‘dharma’.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 120 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 5 🌻* 

తన ఆవశ్యకములకై ఇతరులపై ఎట్లును ఆధారపడక తప్పదు. అది తప్పనిసరిగా గాక, తోటి వారి యెడల తమ వృత్తికర్మను నిండయిన ప్రేమతో నిర్వర్తించినచో తన అవసరములవియే తీరుటయే గాక, అతిలోకమయిన ఆనందము నిలుచును. 

ప్రేమ విస్తారమగు కొలది, ఆనందము అఖండమగును. ఆ రుచి యందు, దారాపుత్రాదుల యెడ ప్రత్యేక మమకారము తెలియకుండును. 

తనను ఎంత ప్రేమగా తాను ఆదరించునో, అట్టి ప్రేమ ఒరుల యెడ చూపి వర్తించుటే ధర్మము. ధర్మాచరణలో నిలిచే ఆనందమే మోక్షము. అనుషంగికముగ లభించు నట్టివే అర్థకామములు. 

మోక్షము ఎప్పుడో కలిగే స్థితి కాదు. లోకములోని జీవులతో తనకు తాదాత్మ్యము ఏర్పడి, తనను తాను మరచేంతగా ఎదలో ప్రేమ నిండుతుందో, ఆ క్షణమే పూర్వకర్మల అలవాటుల వలన ఏర్పడిన కామ క్రోధాదులు, సుఖదుఃఖాది బంధములు తొలగును. 

తేలినదేమంటే ప్రేమయే మోక్షము. ఇట్టి అఖండమయిన పరమ ప్రేమ హృదయమంతా నిండాటలంటే, ఊరకే ప్రేమ మయములగు లోక క్షేమాన్ని గూర్చిన తలంపులు చాలవు. ఆచరణ కావాలి. మనస్సును ఆచరణలోకి దింపినపుడు ప్రేమ గాఢమగును. 

కావున లోక హితానికై తన జీవ లక్షణానికి సరిపోవు కార్యక్రమాన్ని ఒక గంట అయినా రోజులో చేపట్టాలి. క్రమంగా దినచర్య అంతా అదే కావాలి. 

మనసు అర్పించకుండా యాంత్రికంగా సేవలో పాల్గొన్నచో కూడా మంచిదే కాని తన ఉద్ధరణ ఆలస్యమగును. మనసా వాచా కర్మణ లోకహితాచరణకు జీవితాన్ని అర్పించుకొన్న కొలదీ పరమగురువులు తమ ప్రణాళికా నిర్వహణలోకి మనల్ని పరికరాలుగా ఉపయోగించుకుంటారు. అపుడు మనం చేసేవి అని ఉండదు. మన ద్వారా వాండ్లే చేస్తుంటారు.
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 142 🌹*
*🌴 Dealing with Obstacles - 4 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Spiritual Instruments - 2 🌻*

The solution consists in correcting our action and also in finding the source of the problem through analytic thinking. In order to eliminate it from its source, we have to strengthen the soul aspect. 

For this we have the yoga-teachings or the teachings of the masters. Prayers and contemplation help to align the personality with the soul. We also can work with sound, colour and number. 

Yoga exercises are significant in order to overcome obstacles in the body and to strengthen the etheric network. 

When we trust in the activity of Nature, work for others with good will and forget what we need ourselves, our needs will be cared for.

Trust in the teachings of the Great Ones is the only support through which we can move forward. Many people are afraid of this and prefer to remain under the cover of the thoughts of the personality. 

The shadow always proposes not to go into the light and to do what is pleasant to the personality. 

Everything the wisdom teachings say, the personality likes to revolt against. This comes from its old habits. When we try to give it a new habit, the old habits don’t allow the new ones to enter. 

From the viewpoint of personality always some sacrifice is claimed to walk on the path of the soul.

🌻 🌻 🌻 🌻 🌻
Sources : Master K.P. Kumar: Saturn / Jupiter / notes from seminars / Master E. Krishnamacharya: The Yoga of Patanjali.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 56 / Sri Lalita Sahasranamavali - Meaning - 56 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 105

509. మేదోనిష్ఠా - 
మేదస్సు ధాతువును ఆశ్రయించి యుండునది.

510. మధుప్రీతా - 
మధువులో ప్రీతి కలిగినది.

511. బందిన్యాది సమన్వితా - 
బందినీ మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది.

512. దధ్యన్నాసక్త హృదయా - 
పెరుగు అన్నం ఇష్టపడునది.

513. కాకినీ రూపధారిణీ - 
కాకినీ పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండునది.

🌻. శ్లోకం 106

514. మూలాధారాంభుజారూఢా - 
మూలాధార పద్మములో అధివసించునది.

515. పంచ వక్త్రా - 
ఐదు ముఖములతో నుండునది.

516. అస్థి సంస్థితా - 
ఎముకలను ఆశ్రయించి ఉండునది.

517. అంకుశాది ప్రహరణా - 
అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.

518. వరదాది నిషేవితా - 
వరదా మొదలైన నలుగురు పరివార దేవతలచే సేవింపబడునది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 56 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 56 🌻*

509 ) Medho nishta -   
She who is in the fatty layer

510 ) Madhu preetha -   
She who likes honey

511 ) Bhandinyadhi samanvidha -   
She who is surrounded by Shakthis called Bandhini

512 ) Dhadyanna saktha hridhaya -   
She who likes curd rice

513 ) Kakini roopa dharini -   
She who resembles “Kakini”

514 ) Mooladrambujarooda -   
She who sits on the mooladhara kamala or the lotus which is the basic support

515 ) Pancha vakthra -   
She who has five faces

516 ) Sthithi samsthitha -   
She who is in the bones

517 ) Ankusathi praharana -   
She who holds Ankusha and other weapons

518 ) Varadadhi nishevitha -   
She who is surrounded by Vardha and other shakthis

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 59 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 35

*🌻. 35. తత్తు విషయత్యాగాత్‌ సంగత్యాగాత్‌ చ ॥ - 2 🌻* 

భగవంతుని చేరే క్రమాన్ని అన్వయ క్రమమంటారు. అంతఃకరణను శుద్ధిచెసుకొనె (క్రమాన్ని వ్యతిరేక క్రమమంటారు. ఈ రెండు భక్త ప్రహ్లాదుని విషయంలో మనం గమనించవచ్చును. 
 
కమలాక్షునర్చించు కరములు కరములు 
శ్రీనాథు వర్చించు జిహ్వ జిహ్వ  
సురరక్షకుని జూచు చూడ్ములు చూడ్ములు 
శేషశాయికి మొక్కు శిరము శిరము 
విష్ణునాకర్ణించు వినులు వినులు 
మధువైరి దవిలిన మనము మనము 
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మిది బుద్ధిబుద్ధి 
 
దేవదేవుని జింతించు దినము దినము 
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు 
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు 
దండ్రీ ! హరిజేరు మనియెడి తండ్రి తండ్రి 
 
తాః శ్రీ హరిని పూజించే చేతులే చేతులు. శ్రీనాథుని వర్షించే నాలుకే నాలుక. శ్రీపతిని చూచే చూపులే చూపులు. శేషశాయికి (మొక్కే శిరస్సే శిరస్సు. విష్ణు కథలను వినే చెవులే చెవులు. మధుసూదనుని తలచి మనసే మనసు. భగవంతునికి 
ప్రదక్షిణ చేసే పాదాలే పాదాలు.

 పురుషోత్తముని యందు నిలిపె బుద్ధె బుద్ది. దేవదేవుని గురించి ఆలోచించే దినమె దినము. చక్రధారి గురించి బోధించె గురువే గురువు. శ్రీహరిని చేరవలెనని చెప్పే తంద్రె తండ్రి.  
 
భక్త ప్రహ్లాదుడు తన తండ్రితో చెప్పిన విధమిది. ఇంద్రియా లన్నింటినీ, 
వాటి వాటి భోగ్య విషయాల మీద ప్రవర్తింపనీయక భగవంతుని మీద బాహ్య భక్తి కొరకు ఉపయోగిస్తూ చివరకు ముఖ్య భక్తుడిగా మారడానికి సాధనను తెలివాడు. ఇది అన్వయ క్రమనాధన.   
 
కంజాక్షునకు గాని కాయంబు కాయమే ? 
పవనకుంభిత చర్మభస్తి గాక 
వైకుంఠు బొగడదని వక్రంబు వక్రమె గ 
ధమ ధమ ధ్వనితోడి ధక్క గాక 
హరి పూజనము లేని హస్తంబు హస్తమె ? 
తరుశాఖ నిర్మిత దర్విగాక 
కమలేశు జూడని కన్నులు కన్నులే ? 
తను కుద్యజాల రంధ్రములు గాక 
ఆ. చక్రి చింత లెని జన్మంబు జన్మమె " 
తరళ సలిల బుద్చుదంబు గాక 
విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే ? 
పాదయుగము తోడి పశువు గాక 
 
తా : శ్రీహరికి అంకితంగాని శరీరం శరీరమెనా ? అది గాలితో నింపిన 
కొలిమి తిత్తిగాని. వైకుంఠుని స్తుతి చెయని నోరు నోరెనా ? అది కేవలం ఢథమథఢమ మోగే ధక్కగాని. హరి పూజనం చేయని చెతులు చేతులెనా ? అవి కొయ్యతో చేసిన తెడ్లు గాని. కమలేశుని చూడని కన్నులు కన్నులినా? శరీరమనే గోడకు చేసిన రంధ్రాలుగాని. చక్రధారిని గురించి ఆలోచించని జన్మ జన్మేనా ? అది క్షణ భంగురమైన నీటి బుడగ గాని. విష్ణు భక్తిలేని పాండిత్యం ఎందుకు పనికి వస్తుంది ? ఆ పండితుడు రెండు కాళ్ళ పశువు గాని. 
 
ఆ భగవంతునికే అంకితమై భక్తి సాధనకు ఉపయోగపడని ఇంద్రియాలు ఎందుకూ కొరగానివని, జన్మ వ్యర్థమని చెప్పడం చేత ఇంద్రియాలను విషయాల వైపుకు వెళ్ళనియకూడదని వ్యతిరేక క్రమాన్ని చెప్తున్నారు. అయితే మనం ప్రపంచంలో చేయవలసిన పనులు మానుకోవాలా? అంటే విషయ సంగత్వం లేకుండా ఎలా చెసుకోవాలో కూడా చెప్తున్నారు. 
 
శా. పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్‌, భాషించుచున్‌, హాస లీలా నిద్రాదుల సేయుచుం, దిరుగుచున్‌ లక్తించుచున్‌, సంతత 
శ్రీ నారాయణ పాదపద్మ యుగలీ చింతామృతాన్వాద సంధానుండై మరచెన్‌ సురారి సుతు దేతద్విశ్వమున్‌ భూవరా |! 
 
తాః అన్న పానాదులను ఆరగిస్తున్నప్పుడు, వినోదిస్తున్నప్పుడు, నిద్రకు ఉపక్రమిస్తున్నప్తుడు, తిరుగుతున్నప్పుడు, విషయాలను గ్రహిస్తున్నప్తుడు కూడా ఆ శ్రీహరి పాద పద్మాల చింతనామృతాన్ని నిరంతరం గ్రోలుతున్న వాడై ఈ విశ్వాన్నే మరచిపోవుచుండును, అని ప్రహ్లాదుని గురించి హిరణ్యకశిపునకు చెబుతున్నారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 27 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌹 I offer my prostrations Guru in the form of Sat, Chit, Ananda. 🙏🌹*

Verse 1: 
I offer my prostrations to the Guru lineage, beginning with Lord Dattatreya, continuing with countless incarnations such as Sri Narasimha Saraswati, proceeding all the way to my present Guru in the form of Sat, Chit, Ananda.
 
One must commence with this prayer:

 Now, the method of absorbing the energy of the Gu Ru mantra by way of inhalation and exhalation while meditating upon Guru through the Guru mantra, is being explained.
 
Verse 2: Venerable Guru, who is – the cause of the Universe, the form is the Universe, the occupant of innumerable physical bodies, ever free, of countless forms, the cause of all, undivided, filled with Consciousness, whole and complete, endless, beneficent, directly manifested in the syllables Gu and Ru, and eternal, should be meditated upon in the lotus of one’s heart that has been purified by the revolution of the two swans, Hamsa and Soham.
 
This is the gist of the dhyana sloka (verse for contemplation) 
It is evident to all that we live by breathing in and out. 

Like inside a furnace, with inhalation and exhalation energy is generated, and that immeasurable energy that is created flows through all the internal organs and helps us to live. 

The swan symbolizes breathing. Air goes in. The air that is breathed in does not come out unchanged. It enters the heart, purifies the blood inside, undergoes a change and then comes out. 

Therefore, the swan that goes in is different from the swan that comes out. These are the two swans. We exist because of the swinging action of these two swans. One swan is called Hamsa. The other swan is called Soham. 
Gu Ru is the divine mantra consisting of two syllables. 

These syllables are the direct, comprehensible form of Guru. When these two syllables are linked to the two swans and breathing in and out is performed continuously absorbing the mantra into the heart, it is called Ajapa Japa. 

To the one who performs this without break, in addition to the ordinary heart, the yoga heart that is located on the right side also gets cleansed.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 25 / The Siva-Gita - 25 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్దా ధ్యాయము
*🌻. శివ ప్రాదుర్భావము - 1 🌻*

శ్రీ సూత ఉవాచ!
ఏవ ముక్త్యా ముని శ్రేష్టే - గతే తస్మిన్నిజాశ్రమ మ్,
అధ రామగి రౌ రామ ! - పుణ్యే గోదావరీ తటే 1
శివ లింగం ప్రతిష్టాప్య - కృత్వా దీక్షాం యధా విధి,
భూతి భూషిత సర్వాంగో- రుద్రాక్షా భరణై ర్యుతః 2
అభిషిచ్య జలై: పూర్నై - ర్గౌతమీ సింధు సంభవై:,
అర్చ యిత్వా వన్య పుష్పై -స్తద్వ ద్వన్య ఫలై రపి 3
భస్మచ్చ న్నో భస్మ శాయీ - వ్యాఘ్రచర్మా సనే స్థితః,
నామ్నాం సహస్రం ప్రజప - న్నక్తం దివ మనన్యదీ: 4
మా సమేకం ఫలాహారో - మాసం పర్ణా శన స్తతః ,
మా సమేకం జలాహారో - మాసంచ పవ నాశనః 5
శాంతో దాంతః ప్రసన్నాత్మా - ధ్యాయన్నే వం మహేశ్వరమ్,
హృత్పంకజే సమాసీన - ముమా దేహార్ధ ధారిణమ్ 6
చతుర్బుజం త్రిణ యనం - విద్యుత్పింగ జటాధరమ్,
కోటి సూర్య ప్రతీకాశం - చంద్ర కోటి సుశీతలమ్ 7
సర్వాభరణం సంయుక్తం - నాగ యజ్ఞో ఓప వీతినమ్,
వ్యాఘ్ర చర్మాంబర ధరం - వరదా భయ దారిణమ్ ? 8
వ్యాఘ్ర చర్మోత్త రీయం చ - సురా సుర నమస్కృతమ్,
పంచ వక్త్రం చంద్ర మౌళిం- త్రిశూల డమరూధరమ్ 9
నిత్యంచ శాశ్వతం శుద్ధం - ధ్రువ మక్షర మవ్యయమ్,
ఏవం నిత్యం ప్రజ ప్రతో -గతం మాస చతుష్టయమ్ 10

సూతుడు శౌనకాదులకు చెప్పెను: 

ఈ ప్రకారముగా నగస్త్య మహారుషి శ్రీరామునకు పదేశించి తన ఆశ్రమమునకు తరలి పోగా నిక్కడ శ్రీరామ చంద్రుడు పునీతంబైన గోదావరీ నదీ తటంబున ఉన్న రామగిరిలో శివ లింగమును స్థాపించి శాస్త్రోక్త ముగా దీక్షను స్వీకరించిన వాడై సర్వాంగములకు భస్మమును త్రిరేఖలతో నలంకరించు కొని శివ లింగమును అరణ్య పత్రి పుష్పాదులతో పూజించి పులి చర్మాసనము పై ఆసీనుడై రాత్రింబవళ్ళు అనన్య మనస్సు గలవాడై వేద సార శివ సహస్రనామములను పటిస్తూ, 

 ఒక మాసము ఫలముల చేత, మరో మాసము పత్రముల చేతను, మరో మాసము జలము చేతను, ఆ పై మాసము గాలి వాయువునే ఆహారముగా మార్చుకొని శాంతి , కాంతి , మున్నగు సద్గుణములను అలవరచుకొని స్వచ్చ మైన మనస్సు 
తోడ హృద్గత పరాత్పరుని, అర్ధనారీశ్వరుని, నాలుగు చేతులు గల ముక్కంటి ని, 

ఎరుపు మెరుపులవలె నున్న, జటా జూటముల దాల్చినట్టి కోటి సూర్య ప్రకాశము గలవాడు,
 కోటి చంద్ర సుశీత లుండు, సమస్తాబరణాలంకృతుండును, నాగ యజ్ఞో పవీత దారియు, పులి చర్మోత్త రీయముగా దాల్చిన వాడు,  

వరదాభయ హస్తము గలవాడు సమస్త దేవ దానవా (సురాసుర ) దుల చేత నమస్కరించు కొనదగినవాడు పంచ ముఖములను, ఉడు రాజశేఖరుడు ను, డమరుక త్రిశూల ధారియు,  శాశ్వతుడు పరిశుద్దుడును, అవ్యయుడగు మహేశ్వరుని ధ్యానిస్తూ చతుర్మాసములను గడిపెను.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 25 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 04 : 
*🌻 Shiva Praadurbhaavam - 1 🌻*

Suta said to Saunaka sages:

 In this way sage Agastya initiated Sri Rama and went back to his hermitage.

Here near the bank of sacred Godavari river, Sri Rama established a Shivalinga on a hilltop, and in the prescribed manner he underwent the deeksha. 

He smeared all his body parts with holy ash in a three horizontal lined fashion, worshiped Shivalinga with forest flowers and leaves being seated on the tiger skin.

He chanted the Veda Saara shiva Sahasranamavali. 

This way he spent one month living only by eating fruits, next month he lived by eating only leaves, next month he sustained himself only on water, subsequent month he survived only by consuming air. 

He remained pious and maintained all pious qualities like serenity, sense control etc. and with a cleansed heart he meditated on Lord Maheshwara who resides in the heart, 

who is higher than the highest, who is of androgenous form (Ardhanareeshwara), who has
four hands and three eyes, who is like lightening flash of red color, 

who has braided (matted) hair, who has an aura which equals the brilliance of crores of suns, whose aura is as cool as the coolness of crores of
moons combined, who wears many ornaments, 

who wears snake as a sacred thread, who wears tiger skin as garments, who keeps one hand in blessing posture, who is saluted by all gods and demons, who has five faces, 

who wears a crescent moon on his head, who holds a damaru (musical instrument), and trident, who is eternal, who is unblemished, 

who is imperishable. In this way Rama spent four months of Deeksha.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 17 / Sri Gajanan Maharaj Life History - 17 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 4వ అధ్యాయము - 2 🌻*

ఇక దీనివలన జానకిరాంకు ఏమయిందో వినండి: ఉగాది రోజున వేపచిగుళ్ళకు ఒక ప్రత్యేకత ఉన్నట్టు, అక్షయతిదియ రోజున చింతకాయ కూరకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. జానకిరాం ఆరోజున చాలామంది స్నేహితులకు మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించాడు. 

ఆ భోజనంలో ముఖ్యవంటకం ఈ చింతకాయ కూర. ఈకూర వచ్చినవారికి వడ్డించినప్పుడు చూస్తే దానినిండా చిన్నపురుగులు ఉన్నట్టు కనిపించింది. దీనితో వచ్చినవారికి తలతిరిగినట్టు అయి, భోజనం చెయ్యకుండానే వచ్చిన అతిధులు వెళ్ళిపోయారు. 

దీనివల్ల ఈ కంసాలికి చాలానిరాశ కలిగి, తను నిప్పు శ్రీమహారాజుకు ఇవ్వక చేసినతప్పు వల్లనే ఇలా జరిగింది అని వెంటనే తట్టింది. వంటకాలన్నీ వృధాఅయ్యాయి. 

శ్రీగజానన్ స్వఛ్ఛమయిన నీటివంటివారు మరియు రాజాధిరాజు, అటువంటి వారినినేను ఒక ముష్టివానిగా చూసాను. భూత, భవిష్య వర్తమానాలు తెలిసిన ఆయనను నేను ఒక పిచ్చివానిగా భావించాను.

ఒక కల్పవృక్షాన్ని నేను ముళ్ళపొద అనుకున్నాను. అయన చింతామణి నేను అయనని ఒక దరిదృడు అనుకున్నాను. ఆయన దైవిక శక్తిని తెలుసుకోలేక పోయాను. నా దురదృష్టంవల్ల ఒక గొప్ప యోగి ఆశీర్వాదాలు పొందే అవకాశం పోగొట్టుకున్నాను. 

నేను ఈ భూమిమీద, అనవసరమయిన 2 కాళ్ళ జంతువుని, బరువుని మాత్రమే. ఇలా తనని తాను చాలా నిందించుకుంటాడు. శ్రీమహారాజు దగ్గరకి వెళ్ళ లొంగిపోవడానికి చివరకి నిశ్చయించు కుంటాడు. కొద్దిగా చింతకాయ కూర తనతో తీసుకొని, బనకటలాల్ ఇంటికి వెళ్ళి తన దురదృష్టాన్ని వర్నిస్తాడు. ఈ పురుగులతో నిండిఉన్న కూర చూడమని బనకటలాల్తో అంటాడు. 

అతిధులు అందరూ భోజనం చెయ్యకుండా వెళ్ళిపోవడంతో నేను పూర్తిగా అప్రతిష్ట పాలు అయ్యాను, ఇది అంతా నాస్వయంకృతంవల్లనే. ఈరోజు ఉదయం నేను శ్రీమహారాజుకు నిప్పు ఇవ్వడానికి నిరాకరించాను దానిఫలితం ఇది. మీరు వాడిన చింతకాయల లోనే పురుగులు ఉన్నాయేమో అని బనకటలాల్ అతనితో అన్నాడు. 

చింతకాయలు కొత్తవి, పురుగులు లేనివి అని జానకిరాం బదులు చెప్పాడు. నేను ఇప్పుడు కోరుకునేది ఏమంటే శ్రీగజానన్ కు సాష్టాంగపడి, నాతప్పు క్షమించమని వేడుకోవడం. శ్రీగజానన్ దగ్గరకు జానకిరాం వెళ్ళి, సాష్టాంగపడి, ఓ మహారాజ్ నాతప్పులకు నన్ను క్షమించమని వేడుకున్నాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 17 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 4 - part 2 🌻*

Now listen to what happened to Jankiram by this incident. 

Neem leaves have a special significance on the New Year’s Day (Gudi Padwa), so does the tamarind curry on Akshaya Tritiya day. Shri Jankiram had invited many people for lunch on that day and the main dish was tamarind curry. 

When this curry was served to the people it was seen full of small dirty worms. It created nausea amongst the people gathered to eat and caused many people to leave the house without eating any food. 

The gold smith felt very sorry and it suddenly occurred to him that this happened because he had refused to provide fire for the pipe of Shri Gajanan Maharaj. He thought to himself, Shri Gajanan is the pure water of Janhavi, the king of Kings and I treated Him like a beggar. 

He is the knower of the past, the present and the future and I thought Him to be a mad person. A Kalpavriksha was thought by me to be a thorny bush. He is a Chintamani and I thought Him to be splint. 

I could not understand His divine power. By my ill luck I lost an opportunity of getting the Blessings from a great Saint. I am a mere burden to this earth, an animal of two legs.” Thinking so, he condemned himself again and again and at last he decided to go and surrender at the feet of Shri Gajanan Maharaj . 

He took some tamarind curry with him, went to Bankatlal's house and narrated his misfortune to Bankatlal. He said Bankatlalji look to this curry full of worms. I am completely disgraced as all the invitees for lunch had to go without food. It is all due to my own fault. 

This morning I had refused the fire for the pipe of Shri Gajanan Maharaj and this is the result. Bankatlal said that the tamarind used by him might have been infested by worms. Jankiram said, The tamarind was new and clear. 

Now all that I want is to prostrate before Shri Gajanan and beg His pardon for my blunder. Jankiram went and falling at the feet of Shri Gajanan said, O Maharaj I beg to be pardoned for all my mistakes. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 67 / Soundarya Lahari - 67 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

67 వ శ్లోకము

*🌴. పెద్ద వారి దయ సంపాదించుటకు, అందరిలో అమ్మని దర్శించుట, సకల కార్య విజయము 🌴*

శ్లో:67. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహు రధరపానాకులతయా 
కరగ్రాహ్యం శమ్భోర్ముఖ ముకురవృన్తం గిరిసుతే కథంకారం బ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితమ్ ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా ! పర్వత రాజ కుమారీ ! నీ తండ్రి గారిచే గారాబముగా చేతి కొసలచే తడుప బడినదియు, మరియు పతి అయిన శివుని చేత పానకమాడు వేళ తడబడి మాటి మాటికి పైకి ఎత్తబడి శివుని చేత పట్టుకొనబడి ముఖము అనెడు అద్దమునకు పిడి అని నీ చుబుకమును వర్ణించ తరము కాదు కదా. 

🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయసం, తాంబూలము నివేదించినచో గొప్ప గొప్ప వారి, ఉన్నతోద్యోగుల సహాయము లభంచునని, స్నేహ పూర్వకముగా ఉండగలరు అని చెప్పబడింది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 67 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 67 

*🌴 Friendliness of higher officials and Appearance in Person of the Goddess 🌴*

67. Karagrena sprustam thuhina-girina vatsalathaya Girisen'odasthama muhur adhara-pan'akulataya; Kara-grahyam sambhor mukha-mukura-vrintham Giri-sute Kadham-karam bramas thava chubukam aupamya-rahitham. 
 
🌻 Translation :
Oh daughter of the mountain, how can we describe the beauty of your chin, which was with affection caressed, by the tip of his fingers by your father himavan, which was oft lifted by the lord of the mountain, Shiva, in a hurry to drink deeply from your lips; which was so fit to be touched by his fingers; which did not have anything comparable, and which is the handle of the mirror of your face.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
 If one chants this verse 1000 times a day for 45 days, offering paysam and thambulam as prasadam, they will get an opportunity to see the lord in person, achieve success in all respects, get help from higher officials.

🌻 BENEFICIAL RESULTS: 
Royal and governmental favours, power to visualise Devi, suuccess of plans. 
 
🌻 Literal Results:  
Loved by all, rejuvenation.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 366 / Bhagavad-Gita - 366 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 15 🌴

15. స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ||

🌷. తాత్పర్యం :
ఓ పురుషోత్తమా! సర్వకారణుడా! సర్వేశ్వరుడా! దేవదేవా! జగన్నాథా! నీవొక్కడవే నీ అంతరంగశక్తి ద్వారా నిజాముగా నిన్నెరుగుదువు.

🌷. భాష్యము :
అర్జునుడు మరియు అతని మార్గమును అనుసరించువారివలె భక్తియుతసేవ ద్వారా శ్రీకృష్ణునితో సంబంధమును కలిగియున్నవారికే ఆ దేవదేవుడు విడితుడు కాగలడు. 

దానవ, నాస్తికప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఎన్నడును ఎరుగలేరు. శ్రీకృష్ణభగవానుని నిజతత్త్వము నుండి దూరముగా గొనిపోవు మానసికకల్పనము వాస్తవమునకు గొప్ప పాపము. ఆ విధముగా శ్రీకృష్ణుని ఎరుగజాలనివారు గీతకు వ్యాఖ్యానమును చేయరాడు. భగవద్గీత శ్రీకృష్ణుని ఉపదేశము. 

అది కృష్ణసంబంధవిజ్ఞానమై యున్నందున కృష్ణుని నుండి దానిని అర్జునుడు అవగతము చేసికొన రీతిలోనే మనము అవగతము చేసికొనవలెను. దానినెన్నడును నాస్తికులైనవారి నుండి గ్రహింపరాదు.

శ్రీమద్భాగవతమున పరతత్త్వమును గూర్చి ఇట్లు తెలుపబడినది (1.2.11)

వదన్తి తత్ తత్త్వవిదస్తత్త్వమ్ యద్ జ్ఞానమద్వయం |
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ధ్యతే ||

పరతత్త్వమనునది నిరాకారబ్రహ్మము, పరమాత్మ, అంత్యమున భగవానునిగా వివధదశలలో అనుభవమునకు వచ్చును. అనగా పరతత్త్వావగాహనలో మనుజుడు అంత్యమున శ్రీకృష్ణభగవానుని అనుభూతికి చేరును. ఆ దేవదేవుని స్వరూపమును సామాన్యమానవుడు గాని, బ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభూతి కలిగిన ముక్తపురుషుడు గాని అవగతము చేసికొనలేడు. 

కనుక అట్టివారు శ్రీకృష్ణుడు స్వయముగా పలికిన భగవద్గీత శ్లోకముల ద్వారా ఆ భగవానుని నిజతత్త్వమును అవగతము చేసికొనుటకు యత్నింపవచ్చును. నిరాకారవాదులు కొన్నిమార్లు కృష్ణుని భగవానుడు గాని లేదా అతని అధికారమును గాని అంగీకరింతురు. అయినప్పటికి ఆ ముక్తపురుషులలో పెక్కురు అతనిని పురుషోత్తమునిగా ఎరుగాజాలరు. 

కనుకనే అర్జునుడిచ్చట శ్రీకృష్ణుని “పురుషోత్తముడు” అనుచు సంబోధించినవాడు. పురుషోత్తముడైనను జీవులందరికీ అతడే తండ్రి యని జనులు తెలియకపోవచ్చునని అర్జునుడు అతనిని “భూతభావన” అనియు సంబోదించినాడు. ఆ దేవదేవుని సకలజీవులకు తండ్రిగా తెలిసినను అతడే దివ్యనియామకుడని మనుజుడు తెలియకపోవచ్చును గావున అతడు ఇచ్చట “భూతేశ” (పరమనియామకుడు) అనియు సంబోధించినాడు. 

అతనిని జీవులను నియమించువానిగా అవగతము చేసికొనినను దేవతలందరికీ అతడే మూలమని మనుజుడు తెలియకపోవచ్చును కావున అర్జునుడు శ్రీకృష్ణుని దేవతాపూజ్యుడైన దేవదేవుడనియు కీర్తించినాడు. సర్వదేవతా పూజ్యుడైన భగవానుని అవగతము చేసికొనినను అతడే సర్వమునకు అధిపతి యని మనుజుడు తెలిసికొనలేకపోవచ్చును కావున అతడు తిరిగి “జగత్పతి” యని సంబోధింపబడినాడు. 

ఈ విధముగా కృష్ణునికి సంబంధించిన నిజతత్త్వము అర్జునుని అనుభవముచే ఈ శ్లోకము నందు నిర్ధారితమైనది. కనుక కృష్ణుని యథార్థముగా తెలిసికొనుట కొరకు మనము అర్జునుని అడుగుజాడలను అనుసరింపవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 366 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 15 🌴

15. svayam evātmanātmānaṁ
vettha tvaṁ puruṣottama
bhūta-bhāvana bhūteśa
deva-deva jagat-pate

🌷 Translation : 
Indeed, You alone know Yourself by Your own internal potency, O Supreme Person, origin of all, Lord of all beings, God of gods, Lord of the universe!

🌹 Purport :
The Supreme Lord, Kṛṣṇa, can be known by persons who are in a relationship with Him through the discharge of devotional service, like Arjuna and his followers. Persons of demonic or atheistic mentality cannot know Kṛṣṇa. 

Mental speculation that leads one away from the Supreme Lord is a serious sin, and one who does not know Kṛṣṇa should not try to comment on Bhagavad-gītā. Bhagavad-gītā is the statement of Kṛṣṇa, and since it is the science of Kṛṣṇa, it should be understood from Kṛṣṇa as Arjuna understood it. It should not be received from atheistic persons.

As stated in Śrīmad-Bhāgavatam (1.2.11):

vadanti tat tattva-vidas
tattvaṁ yaj jñānam advayam
brahmeti paramātmeti
bhagavān iti śabdyate

The Supreme Truth is realized in three aspects: as impersonal Brahman, localized Paramātmā and at last as the Supreme Personality of Godhead. So at the last stage of understanding the Absolute Truth, one comes to the Supreme Personality of Godhead. 

A common man or even a liberated man who has realized impersonal Brahman or localized Paramātmā may not understand God’s personality.

Such men, therefore, may endeavor to understand the Supreme Person from the verses of Bhagavad-gītā, which are being spoken by this person, Kṛṣṇa. 

Sometimes the impersonalists accept Kṛṣṇa as Bhagavān, or they accept His authority. Yet many liberated persons cannot understand Kṛṣṇa as Puruṣottama, the Supreme Person. 

Therefore Arjuna addresses Him as Puruṣottama. Yet one still may not understand that Kṛṣṇa is the father of all living entities. Therefore Arjuna addresses Him as Bhūta-bhāvana. 

And if one comes to know Him as the father of all the living entities, still one may not know Him as the supreme controller; therefore He is addressed here as Bhūteśa, the supreme controller of everyone. 

And even if one knows Kṛṣṇa as the supreme controller of all living entities, still one may not know that He is the origin of all the demigods; therefore He is addressed herein as Deva-deva, the worshipful God of all demigods. 

And even if one knows Him as the worshipful God of all demigods, one may not know that He is the supreme proprietor of everything; therefore He is addressed as Jagat-pati. Thus the truth about Kṛṣṇa is established in this verse by the realization of Arjuna, and we should follow in the footsteps of Arjuna to understand Kṛṣṇa as He is.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 193 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
42. అధ్యాయము - 17

*🌻. గుణనిధి చరిత్ర - 6 🌻*

దీక్షిత ఉవాచ |

హం హేsసత్పుత్రజనని నిత్యం సత్య ప్రభాషిణి || 52

యదా యదా త్వాం సంపృచ్ఛే తనయః క్వ గతస్త్వితి | తదా తదేతి త్వం బ్రూయాన్నాథేదానీం స నిర్గతః || 53

అధీత్యాధ్యయనార్థం చ ద్విత్రైర్మి త్రై స్సయుగ్బహిః | కుతస్తే శాటకః పత్ని మాంజిష్ఠో యో మయార్పితః || 54

లంభ##తే యోsనిశం ధామ్మి తథ్యం బ్రూహి భయం త్యజ | సాంప్రతం నేక్ష్యతే సోsపి భృంగారో మణిమండితః || 55

పట్టసూత్రమయీ సాపి త్రిపటీ యా మయార్పితా | క్వ దాక్షిణాత్యం తత్కాంస్యం గౌడీ తామ్రఘటీ క్వ సా || 56

దీక్షితుడిట్లు పలికెను -

ఓసీ!దుష్టకుమారుని తల్లీ! నీవు నిత్యము సత్యమునే పలుకుచుంటివి కాబోలు! (52). 

కుమారుడు ఎక్కడకు వెళ్లినాడు అని నేను ప్రశ్నించిన ప్రతిసారి, ' నాథా! ఇప్పటి వరకు చదువుకొని ఇద్దరు ముగ్గురు మిత్రులతో కలిసి చదువుకొనుటకొరకై ఇప్పుడే బయటకు వెళ్లినాడు' అని చెప్పెడిదానవు (53). 

హేపత్నీ! నేను నీకు చక్కగా ప్రకాశించే ఎర్రని పట్టుచీరను ఇచ్చియుంటిని. అది ఏమైనది?(54)

భయమును వీడి సత్యమును చెప్పుము. మరియు, మణులను పొదిగిన బంగరు గిన్నె కానవచ్చుట లేదు (55). 

నేను నీకు మూడు పేటల పట్టుతో నేసిన పట్టు పంచను ఇచ్చితిని. అది కనబడుటలేదు. దక్షిణ దేశము నుండి కొని తెచ్చిన ఇత్తడి పాత్ర ఏది? గౌడ దేశము నుండి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడ నున్నది (56).

నాగదంతమయీ సా క్వ సుఖ కౌతుక మంచికా | క్వసా పర్వతదేశీయా చంద్రకాంతిరివాద్భుతా || 57

దీపకవ్యగ్ర హస్తాగ్రా లంకృతా శాలభంజికా | కిం బహూక్తేన కులజే తుభ్యం కు ప్యామ్యహం వృథా || 58

తదాభ్యవ హరిష్యేహ ముపయంస్యామ్యహం యదా | అనపత్యోsస్మి తేనాహం దుష్టేన కులదూషిణా || 59

ఉత్తిష్ఠానయ పాథస్త్వం తసై#్మ దద్యాస్తి లాంజలిమ్‌ | అపుత్రత్వం వరం నౄణాం కుపుత్రాత్కుల పాంసనాత్‌ || 60

ఏనుగు దంతముతో చేసినది, సుఖమును ఉత్సాహమును కలిగించునది, పర్వత ప్రాంతములో తయారైనది, వెన్నెల వలె అద్భుతముగా ప్రకాశించునది యగు మంచము ఎక్కడ ఉన్నది?(57) 

చేతిలో దీపమును పట్టుకొని ప్రకాశించే శాలభంజిక యేది? ఇన్ని మాటలేల? నీవు కులస్త్రీవి. నీపై కోపించుట వ్యర్థము (58).

నేను వివాహమును చేసుకున్న తరువాతనే భుజించెదను. దుష్టుడు, కులపాంసనుడు అగు వాడు నా కుమారుడే కాదు (59). 

లెమ్ము. నీటిని తెమ్ము. వానికి నువ్వులను, నీళ్లను వదలి వేయుము. కుల దూషకుడగు కుపుత్రుని కంటె మానవులకు పుత్రుడు కలగకుండుటయే మేలు (60).

త్యజేదేకం కులస్యార్థే నీతిరేషా సనాతనీ | స్నాత్వా నిత్యవిధిం కృత్వా తస్మిన్నేవాహ్ని కస్యచిత్‌ || 61

శ్రోత్రియస్య సుతాం ప్రాప్య పాణిం జగ్రాహ దక్షితః || 62

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యు పాఖ్యానే గుణనిధి చరిత్ర వర్ణనం నామ సప్తదశోsధ్యాయః (17).

కులము కొరకు ఒకనిని విడువవలెనని సనాతన ధర్మము చెప్పుచున్నది. అతడు స్నానము చేసి నిత్యకర్మననుష్ఠించి, అదే దినమున ఒకానొక (16) 

శ్రోత్రియుని కుమార్తెను వివాహమాడెను (62).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సృష్ట్యు పాఖ్యానమనే మొదటి ఖండలో గుణనిధి చరిత్ర యను పదునేడవ అధ్యాయము ముగిసినది (17).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 🇦‌🇻‌🇦‌🇹‌🇦‌🇷‌ 🇴‌🇫‌ 🇹‌🇭‌🇪‌ 🇦‌🇬‌🇪‌ 🇲‌🇪‌🇭‌🇪‌🇷‌ 🇧‌🇦‌🇧‌🇦‌ 🇲‌🇦‌🇳‌🇮‌🇫‌🇪‌🇸‌🇹‌🇮‌🇳‌🇬‌ - 68 🌹*
Chapter 18
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 🇼‌🇭‌🇦‌🇹‌ 🇮‌🇸‌ 🇴‌🇺‌🇷‌ 🇸‌🇹‌🇷‌🇪‌🇳‌🇬‌🇹‌🇭‌ - 2 🌻*

To guide human consciousness through these seven shadows is his duty, and he takes on this duty to help guide others, whether one seeks his help or not The Avatar is our guide; his guidance is our strength. That guidance reveals the path  
toward Truth through these seven shadows. 

If we accept him as our strength to cross these worlds of shadows, we have to depend on his guidance completely, just as a traveler in a foreign country must depend on a guide to find his way through unfamiliar foreign land. 

But, how does one depend on him? Once we have accepted him as our guide, his guidance becomes our strength, and so we do not need the pride of material strength. 

The world prides itself in wealth, name, fame, intellect, authority, education, etc., but one has to remain detached from these material attainments, because they are not really strengths. They are only attachments. 

The one way to be detached from these forces of the world is to accept him as one's guide. It is by his guidance that one finds the strength to be led beyond the boundary of happiness and misery.  

How does one remain detached? Let us suppose money represents the strength of the world. A banker is always in contact with money. A banker deals with money all day long, millions of dollars are deposited and are drawn out, and the banker keeps a careful account of the money that is deposited and withdrawn.

 However, he remains detached from the money itself, because he knows the money does not belong to him. In the same way, one should remain detached from the material strength of the world, knowing that money is only a form of attachment to the world. 

The banker knows full well that the money does not belong to him, and we should know that his attachment does not belong on the path of Truth. Money is simply one of many attachments. 

To remain detached from money and the many other strengths of the world, one must be attached to the Truth, and this can only be achieved by accepting the guidance of the Avatar who leads one to realize Truth.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 64 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 27
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. దీక్షా విధి - 5 🌻*

వహ్నావఖిల తత్త్వానామాలయే వ్యాహృతే హరౌ | నీయమానం క్రమాత్సర్వం తత్రాధ్వానం స్మరేద్భుదః. 42

తాడనేన వియోజ్యైవాదాయాపాద్య శామ్యతామ్‌ | ప్రకృత్యాహృత్యజుహుయాద్యథోక్తే జాతవేదసి. 43

పండితుడు అఖిలత త్త్వములకును నిలయమైన వహ్నియమందును, వ్యహృతుడగు హరియందును సమస్తమైన అర్చనామార్గము క్రమముగ ఉంచబడుచున్నట్లు స్మరిచంపవలెను. తాడనముచే విడదీసి, గ్రహించి, శమింపచేసి ప్రకృతిచే స్వీకరించిన, పూర్వోక్తమైన అగ్నియందు హోమము చేయవలెను.

గర్భాధానం జాతకర్మ భోగం చైవలయం తథా| హుత్వాష్టౌ తత్ర తత్త్రైవ తతః శుద్ధన్తు హోమయేత్‌ . 44

గర్భాధానమును, జాతకర్మను, భోగమును, లయమును, ఆ అగ్నియందే ఎనిమిది హోమములు చేసి, పిమ్మట శుద్ధహోమము చేవలెను.

శుద్ధం తత్త్వం సముద్ధృత్య పూర్ణాహుత్యా తు దేశికః సన్ధయేద్ధిపరే తత్త్వే యావదవ్యాకృతం క్రమాత్‌. 45

గురువు శుద్ధతత్త్వమును గ్రహించి, దానిని అవ్యాకృతమువరకును క్రమముగ పూర్ణహుతిచే పరతత్త్వము నందు హోమము చయవలెను.

తత్పరం జ్ఞానయేగేన విలాప్య పరమాత్మని | విముక్తబన్ధనం జీవం పరస్మిన్నవ్యయే పదే. 46

నిర్వృతం పరమానన్దే శుద్ధే బుద్ధే స్మరేద్బుధః దద్యాత్పూర్ణాహుతిం పశ్చాదేవం దీక్షాసమాప్యతే. 47

పండితుడు, జ్ఞానయోగముచేత ఆ పరమున పరమాత్మయందు విలీనముచేసి, బంధ విముక్తడై జీవుడు సుద్ధము, జ్ఞానస్వరూపము, నిర్వికారము, పరమానందరూపము అగు పరమాత్మయందు ఆనందము పొందు చున్నట్లు భావింపవలెను.

పిమ్మట పూర్ణాహుతి ఇవ్వవలెను. ఈ విధముగా దీక్ష పూర్తియగును.

ప్రమోగమన్త్రాన్‌ వక్ష్యామి యైర్దీక్షాహోమసంలయః | ఓం యం భూతాని విశుద్దం హుం ఫట్‌ |

అనేన తాడనం కుర్యాద్వియోజనమిహ ద్వయమ్‌. 48

దీక్షా-హోమ-విలయముల కుపయుక్తములగు ప్రయోగ మంత్రములను చెప్పెదను. ''ఓం యం భూతాని విశుద్ధం హుం ఫట్‌'' అను మంత్రముచే తాడనమును, వియోజనమును చేయవలెను.

ఓం యం భూతాన్యా పాతయే7హమ్‌ | ఆదానం కృత్వా చానేన ప్రకృత్యా యోజనం శృణు |

ఓం యం భూతాని పుంశ్చాహో.
''ఓం యం భూతాన్యాపాతయేహమ్‌'' 

అను మంత్రముచే ఆదానము చేయవలెను. ప్రకృతితో యోజనము చేయు మంత్రమును వినుము, 'ఓం యం భూతాని పుంశ్చాహో'' అనునది ప్రయోజన మంత్రము.

హోమమన్త్రం ప్రవక్ష్యామి తతః పూర్ణాహుతేర్మనుమ్‌ | 49

ఓం భూతాని సంహర స్వాహా ఓం అం ఓం నమో భగవతే వాసుదేవాయ వౌషట్‌

పూర్ణాహుత్యనన్తరే తు తత్త్వే శిష్యం తు సాధయేత్‌ | ఏవం త్తత్వాని సర్వాణి క్రమాత్సంశోధయేద్బుధః. 50

హోమ మంత్రమును, పిమ్మట పూర్ణాహుతి మంత్రమును చెప్పెను- ''ఓం భూతాని సంహర స్వాహా'' అనునది హోమమంత్రము ''ఓం శ్రీం ఓం నమోభగవతే వాసుదేవాయ వౌషట్‌'' అనునది పూర్ణాహుతి మంత్రము. పూర్ణాహుత్యనంతరము తత్త్వమునందు శిష్యుని సాధించవలెను. ఈ విధముగా బుధుడు క్రమముగ సర్వతత్త్వ సంశోధనము చేయవలెను.

నమోన్తేన స్వబీజేన తాడనాది పురః సరమ్‌ | ఓం వాం కర్మేన్ద్రి యాణి -
ఓం దేం బుద్ధీన్ద్రియాణి- యం బీజేన సమానన్తు తాడనాదిప్రయోగకమ్‌. 51

నమః అనునది అంతమునందుగల ఆయా తత్త్వముల బీజములతో తాడనాది పూర్వకముగా తత్త్వసంశోధనము చేయవలెను. 'ఓం వాం కర్మేన్ద్రియాణి నమః' 'ఓం దేం బుద్ధీన్ద్రియాణి నమః' ఇత్యాది విధమున చేయవలెను. తాడనాది ప్రయోగము 'యం' బీజముతో చేసినట్లె చేయవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 79 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అష్టావక్ర – సుప్రభ - 3 🌻*

14. ఆకాశంలోని కొన్నికొన్ని విశేషమైన ప్రదేశాలలో, జీవకోటి పొందేటువంటి కొన్ని అతివిచిత్రమయినటువంటి అనుభూతులు ఏ ఆనందాన్ని ఏ మార్గంలో అనుభవించే వీలుందో, ఆయాఅనుభూతులిచ్చే ఆ ప్రదేశాలకు ఆయా లోకాలని పేరు. 

15. చంద్రమండలం, అంగారక మండలం దాటిన తరువాత భౌతికలోకాలు లేవనిచెప్పవచ్చును. బృహస్పతిలోకం దాటినతరువాత లేనేలేవని చెప్పవచ్చును.
ఉదాహరణకు – ప్రేతలోకం ఉంది. 

16..జీవులు శరీరాన్ని వదిలిపెట్టి చంద్రమండలంచుట్టూ తిరుగుతారు. అక్కడికి వెళతారు. ఈ చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతున్న పరిభ్రమణ కాలంలో వాళ్ళుచేసిన కర్మకు అనుకూల మయినటువంటి(లోకం) శరీరం, భార్య, భర్త ఇత్యాదులన్నీ పొందుతారు. 

17. అట్టి గర్భావాసంలోకి వెళ్లి తమయొక్క ఆ కర్మను అనుభవించటానికి జన్మలను ఎత్తుతారు. భూమిమీదకివచ్చి మళ్ళీ జన్మించేవారకు, చంద్రలోకంలో ఉంటారు. చంద్రమండలం అంటే చంద్రలోకం. చంద్రగోళం కాదు. 

18. చంద్రగోళంచుట్టూ జీవులు తిరిగేటటువంటి – పరిభ్రమించేటటువంటి space (రోదసి) ని చంద్రమండలం – చంద్రలోకం అని పేర్కొన్నారు. చంద్రగోళం మనకు భౌతికంగా కనబడుతుంది. కాని చంద్రలోకం కనబడదు. 

19. అంటే ప్రత్యక్షంగా – భౌతికంగా కనబడేటటు వంటి గోళాన్ని ఆశ్రయించిన లోకము మనకు కనపడటంలేదు. ఇక ఆ పైనున్న దివ్యలోకాలు అలాగ కనబడే భౌతికమయిన గోళాన్ని ఆశ్రయించిన లోకాలుకూడా కావు. ఏ గోళాన్నీ అవి ఆశ్రయించలేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 🇹‌🇼‌🇪‌🇱‌🇻‌🇪‌ 
🇸‌🇹‌🇦‌🇳‌🇿‌🇦‌🇸‌ 🇫‌🇷‌🇴‌🇲‌ 🇹‌🇭‌🇪‌ 🇧‌🇴‌🇴‌🇰‌ 🇴‌🇫‌ 🇩‌🇿‌🇾‌🇦‌🇳‌ - 11 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

*🌻 STANZA III - The Sowing of Love - 2 🌻*

22. The Stellar Period had defined a New Round. At this point it would be impossible to return to the past, since all bridges would be burnt. And they would be burnt by none other than man himself. 

The most important thing was to discern where the Light was and where the darkness was, and what the past and the future meant for him. 

Through wise discernment of the essence of all things, he was able to build the saving bridge that would span the abyss and lead him to the Kingdom of the Light. 

But, all too often, people were stubbornly closing their eyes, unwilling to glimpse the Bright Path which was right beneath their feet, and blindly burnt the bridges that would lead them to the shore of Salvation. 

Insisting on their own way, these blind ones were depriving themselves forever of the Kingdom of Eternal Fires, preferring to remain instead in the total gloom of ignorance. 

Thus began to unfold the stratification of humanity, which was to make the last step beyond the border of the darkness or the Light. That was their Final Choice, for the Period — as designated by the stars — had so determined. 

23. Love once again came to life in the world and diffused the Almighty Rays, which were even able to pierce through the most incredibly dense masses of petrified Matter. And, little by little, people began to open their eyes. 

They had long known that even a stone was capable of loving, protecting, guarding, and bringing happiness to their owners — owners whom they indeed loved. Yes, the world was brimming over with Love.
 
Man beheld how a flower which he had mercilessly torn from its stem would incline its beautiful little head towards him, dedicating the last moments of its life to a declaration of Love — Love for him, a man. 

Yes, a flower is able to love even a slayer that has brutally severed the thread of its marvellous, innocent life. Flowers forgive everything, because they sincerely love man — even men who are most in “love” with the money they receive for the “goods” they sell. 

The flowers very much hoped that people would open their eyes and understand how it was even painful to love them... Indeed, humanity was coming nearer to this understanding, for the language of one flower was always understandable to another member of the floral kingdom.

 After all, it was not so long ago that human beings were flowers themselves, covering the whole planet in a carpet of beautiful bloom. But the Gods did not pluck them... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 28 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. బ్రహ్మంగారి తిరుగు ప్రయాణం – శిష్యుల సంవాదం ::🌻*

హైదరాబాద్ లో కొద్దికాలం గడిపిన బ్రహ్మంగారు తిరిగి తన ఊరికి రావాలని నిర్ణయించుకున్నాడు.

బ్రహ్మంగారికి సిద్దయ్య అనే వ్యక్తీ అభిమాన శిష్యుడిగా మారాడు.ఇది మిగిలిన శిష్యులకు కొద్దిగా కోపాన్ని కలిగించింది. బ్రహ్మంగారు కూడా సిద్ధయ్య మీద ఎక్కువ అభిమానాన్ని ప్రదర్శించేవారు. శిష్యుల్లో సిద్ధయ్య మీదా ఏర్పడిన భావాన్ని తొలగించాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు అందుకు తగిన సమయం కోసం ఎదురుచూడటం మొదలు పెట్టారు.

హైదరాబాద్ నుంచి కడపకు పయనం సాగించారు బ్రహ్మంగారు, ఆయన శిష్య బృందం.ఆ మార్గ మధ్యలో స్వామివారు ఒక కుక్క కళేబరాన్ని సృష్టించారు. అది జీర్ణదశలో పురుగులతో నిండి, అతి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. అందరూ ఆ దుర్గంధాన్ని భరించలేక పోయారు. బ్రహ్మంగారు ఆ కుక్క శరీరం వేపు నడవటం మొదలుపెట్టారు. ఆ కుక్క శరీరం నుంచి వస్తున్న దుర్గంధం భరించలేక, మిగిలిన శిష్యులందరూ కొంచెం వెనకగా నడవటం ప్రారంభించారు. అయితే, సిద్ధయ్య ఒక్కడూ మాత్రం వేరే ఎటువంటి ఆలోచన లేక, గురువునే అనుసరిస్తూ వచ్చాడు.

అందరూ ఆ కుక్క మృతదేహాన్ని సమీపించారు. వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ నిలబడి, శిష్యులను కూడా ఆగమని చెప్పారు. అప్పుడాయన తన శిష్యులతో – “మీరందరూ పెద్ద కులంవారమనీ సిద్ధయ్య కంటే తెలివితేటలు ఎక్కువగా వున్నాయనీ అనుకోవటం నేను గ్రహించాను. మీకు నిజంగా నేనంటే గురు భక్తి వుంటే, ఈ శుకనాన్ని తినండి.. అప్పుడే నేను మిమ్ముల్నినా నిజమైనా శిష్యులుగా గుర్తిస్తాను”అన్నారు.

ఆ మాట వినటంతోటే శిశ్యులందరూ నిర్ఘాంతపోయారు.
‘దూరంగా నిలబడే, కుక్క శరీరం నుంచి వస్తున్న వాసనను భరించలేని తాము మాంసాన్ని ఎలా తినగలం ‘ అని ఆలోచించడం మొదలుపెట్టారు. అది గ్రహించిన బ్రహ్మంగారు సిద్దయ్యను, శునక మాంసాన్ని తినమని ఆదేశించారు. సిద్ధయ్య గురువుగారైన వీరబ్రహ్మేంద్రస్వామి మీద ఉన్న నమ్మకంతో క్షణం కూడా ఆలోచించకుండా ఆ మాంసాన్ని స్వీకరించాడు.

అప్పుడు స్వామి వారు శిష్యులవైపు తిరిగి “ఇప్పటికైనా సిద్ధయ్యకు గురువు అంటే ఎంత అభిమానము, గౌరవమో ఉన్నాయో తెలిసిందా?! నన్ను త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు. అహర్నిశలూ నా మాటమీద విశ్వాసము, గౌరవము ఉంచుతాడు. నేను ఏమని ఆజ్ఞాపించినా, దాన్ని నేరవేర్చే దృఢ సంకర్పం కలిగిఉంటాడు. 

అందుకే సిద్దయ్య అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ,అభిమానం. ఎవరైతే నన్ను అభిమానంతో కొలుస్తారో వారిని నేను గుర్తిస్తాను.వారే నా ప్రేమకు పాత్రులవుతారు ” అని చెప్పారు.

వీరబ్రహ్మేంద్రస్వామి అలా చెప్పడంతో శిష్యులందరూ తమ తప్పు తెలుసుకున్నారు. పశ్చాత్తాపం చెందారు.

”గురువుగారూ, మా తప్పులను క్షమించండి.మేం మీకు శిష్యులుగా వున్నప్పటికీ కులం,అహంకారం,గర్వం వంటి వాటిని దూరంగా తరిమివేయ లేకపోయాము. ఆ కారణం వల్లే సిద్దయ్యపట్ల చులకన భావంతో తక్కువగా చూస్తున్నాము. మీ భోధనల వల్ల మా మనసులో పేరుకుపోయిన అంధకారం మాయమైంది ” అంటూ వినయంగా చెప్పారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 82 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

*చివరి భాగం*

🌻 Q 79:--పూర్ణాత్మ vs దేహం 🌻

Ans :--
1) మనం మన దేహాన్ని ఒక పూర్ణాత్మ గా పరిగణిస్తే దేహంలోని జీవకాణాలన్నీ అంశాత్మలు గా పరిగణించవచ్చు. కాబట్టి అంశాత్మల చైతన్య పరిణామం పూర్ణాత్మ చైతన్య పరిణామం అవుతుంది.

2) దేహం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. జీవకణాలు మృతి చెంది మరలా పడుతుంటాయి. అలాగే అంశాత్మలు మరణిస్తూ పునర్జన్మ తీసుకుంటుంటాయి. కానీ అంశాత్మలు సాధించిన జ్ఞానం, పురోగతికి సంబందించిన information స్టోర్ అవుతుంటుంది.

3) జీవకణం కొంత time జీవించివుంటుంది.దాని అభివృద్ధి అయ్యాక మరణిస్తుంది. మరల జన్మ తీసుకుంటుంది.అలాగే శరీరానికి కొంత టైం ఉంటుంది, సమిష్టిగా జీవకణాలన్నీ(అంశాత్మలన్ని)అభివృద్ధి చెందాక దేహం నశిస్తుంది.

4) మన దేహంలోని భాగాలను గమనిద్దాం. ముక్కు యొక్క అనుభవాలు ఏముంటాయి.... చెడు లేదా మంచి వాసనలు పసిగట్టగలగడం. అలాగే దేహం లోని ప్రతిభాగానికి ఇలాగే వాటి లక్ష్యాలుంటాయి, అనుభవాలు వుంటాయి. ఈ విధంగా దేహంలోని ప్రతి జీవకణం యొక్క అనుభవాల information ఆత్మలో store అవుతుంది. అలాగే total దేహంలో ఉన్న ఆత్మ యొక్క అనుభవం పూర్ణాత్మ యొక్క అనుభవం అవుతుంది.

5) అంశాత్మలు అభివృద్ధి చెంది పూర్ణాత్మ లు అవుతాయి.లీనమవ్వడం అనేది ఈ సృష్టిలో లేనేలేదు.ఏదైనా అనంతకాలం కొనసాగుతూనే వుంటుంది.

6) పూర్ణాత్మ యొక్క అంశాత్మలు higher లోకాలలో, lower లోకాలలో జన్మ తీసుకుని ఉంటాయి, ఈ అంశాత్మలన్ని కలసి సాధించిన ప్రగతి ఒక పూర్ణాత్మ ప్రగతి అవుతుంది. అంశాత్మలన్ని చైతన్యశక్తి ద్వారా అనుసంధానింపబడి ఉంటాయి. కావున ప్రతి అంశాత్మ ఎలాంటి జ్ఞానం కావాలన్నా అంతర్ ప్రయాణం ద్వారా పొందవచ్చు.

7) web system =
పూర్ణాత్మ + అంశాత్మలు.
ప్రతి అంశాత్మను ఒక website అనుకుందాం.

అంశాత్మ = google, facebook, youtube

ఈ websites అన్నీ internet ద్వారానే పనిచేస్తాయి.ఇక్కడ internet అంటే చైతన్యశక్తి.

ఒక అంశాత్మ సాధించిన పురోగతి ఇతర అంశాత్మలుకు కూడా చేరవేయబడుతుంది.

8) websystem=
భూమి+దానిపైన ఉన్న లోకాలు+ఇతర జీవజాతులు

ఇక్కడ భూమి పై నివసించే మానవులు ఇతర జీవజాతులు యొక్క పురోగతి భూమి యొక్క పురోగతి అవుతుంది.

భూమి ఇతర లోకాలన్నీ 
web system కి internet (చైతన్యశక్తి)ద్వారా connect అయి ఉంటాయి.

ఈ విధంగా భూమి పై నివసించే జీవరాసులన్నీ ఈ websystem కి కనెక్ట్ అయితే ఇతర లోకాల ఇన్ఫర్మేషన్ ని కూడా తెలుసుకోవచ్చు.అలాగే మన లోకం గురించి తెలుసుకోవాలంటే ఇతర లోకాలవాళ్ళు వాళ్లు కూడా websystem కి connect అయితే మన information వారు తెలుసుకోవచ్చు.

ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.

🌻. సమాప్తం... 🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹 🇸‌🇪‌🇪‌🇩‌🇸‌ 🇴‌🇫‌ 
🇨‌🇴‌🇳‌🇸‌🇨‌🇮‌🇴‌🇺‌🇸‌🇳‌🇪‌🇸‌🇸‌ - *114 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 The seed of spiritual life grows in secret silence and darkness until its appointed hour of activation on the divine plane of existence beyond consciousness, mind and body. 🌻*

If you are examining deeply the real nature of your being behind the idea of "I am", your spiritual progress is central and inevitable. 

On this path of realization of the absolute state of being, it is ignorant to become emotionally disturbed about your rate of progress or whether the great realization will happen quickly or slowly, in the present body or some future body.

The seed of spiritual life grows in secret silence and darkness until its appointed hour of activation on the divine plane of existence beyond consciousness, mind and body. 

It is enough for consciousness to be ever looking into its own center of "I am" with increasing detachment and right order of external life without adding to the troubles and problems that come with useless desires and fears.

To be ever fretfully exercising mental imagination and physical exertions toward the ultimate state of being is a misunderstanding in consciousness of going away from central awareness of being to try to get the result of it from outside in the mind and body. 

You are not your mind or body, so why do you look so hard to your mind or body to give you the self-realization you need? 

Conscious attention must look within the very core of itself and go through the ultimate gateway of "I am"...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 22 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 10 🌻*

ఎప్పుడైతే నువ్వు జ్ఞాత స్థానంలో సాక్షిగా వుంటావో, ఎప్పుడైతే మిగిలిన 24, పిండాండ పంచీకరణలో చెప్పబడినటువంటి 24 నీకు స్వాధీనమై నువ్వు సాక్షిగా వుంటావో, అప్పుడు సేవకుడిగా వుంటావు. కర్తవ్యం చేస్తావు. ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవై వుంటావు. 

అంతా ఈశ్వరప్రసాదంగా చూస్తావు. కర్మకి అంటకుండా వుంటావు. మాలిన్యము లేకుండా వుంటావు. ఇంకేమిటి? సహజ సమరస శాంత స్వభావంతో వుంటావు. ఈ మూడూ గుర్తుపెట్టుకోవాలి. 

సహజ సమరస శాంత స్వభావంతో ఎవరైతే వుంటారో వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానమునకు అర్హులు. ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి అంశాలను ఇందులో ప్రతిపాదిస్తున్నారు.

 కాబట్టి మనం తప్పక ప్రయత్నించి అనేక జీవితములుగా అనేక జన్మలుగా మాటిమాటికీ ప్రలోభపెడుతూ నీ వెనక పడుతున్నటువంటి నిన్ను వాటి వెంట తిప్పుకునేటటువంటి ధన, కనక, వస్తు, వాహన స్త్రీ వ్యామోహ - స్త్రీ అంటే ఇక్కడ ఒక స్త్రీలనే కాదు సుమీ. 

మానవులందరూ స్త్రీలే. పరమాత్మ ఒక్కడే పురుషుడు. ప్రకృతి అంతా స్త్రీత్వమే. కాబట్టి ఇక్కడ స్త్రీ అన్న శబ్దం వాడినప్పుడల్లా ప్రకృతి చేత ప్రేరణ పొందబడుతున్న వారందరూ స్త్రీలే. కాబట్టి గుణముల చేత ప్రేరితమవుతున్న వారందరూ స్త్రీలే. సర్వజీవులూ స్త్రీలే అని అర్ధం.
    
కాబట్టి ఇటువంటి జీవభావంతో శరీరమే నేను అనేటటువంటి వ్యామోహంతో కూడుకున్నటువంటి వారు ఎవరైతే వుంటారో, మోహము -వ్యామోహము , విస్తృతి కలిగినటువంటి మోహము వ్యామోహము. వ్యావృత్తి కలిగినటువంటి మోహము వ్యామోహము. 

కాబట్టి అటువంటి దాని బారిన పడకుండా మానవజీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానమును అందిపుచ్చుకోవడానికి ఎవరైతే ప్రయత్నంచేస్తుంటారో వారి జన్మ ధన్యము. 

ఎవరికైతే ఈ “స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంతాభృశం వాదినః” అనే సత్యాన్ని గుర్తించినటువంటి వారున్నారో, ఎవరైతే జగత్ భ్రాంతిలో పడకుండా వున్నారో, “బ్రహ్మ సత్యం జగన్మిధ్య” అను సూత్రమును తన జీవితమునందు తాను సిద్ధిపొందాలనేటటువంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి వున్నారో వారి జన్మ ధన్యము. 

కాబట్టి మనలో ఆ రకమైన జగత్తుకి సంబంధించినటువంటి ప్రేరణలు కలుగగానే వాటిల్లో ఉన్నటువంటి దోషభావాన్ని గుర్తెరగాలి. ఏమిటి వాటిల్లో ఉన్నటువంటి దోషభావము అంటే నిన్ను మొహములో చిక్కుకునేటట్లుగా చేస్తుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 7 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 7 🌻*

16. అత్యంత పరిమితమైన అభావము అభివ్యక్తమైనప్పుడు దాని ఆవిష్కారం క్రమక్రమముగా బయటకి నిగి నిగిడి అనంతముగా వ్యాపించెను.

17. సర్వములో అంతర్నిహితమై యున్నది ఏదైనను అభావమే. సర్వములో చైతన్యం కూడా అభావమై యున్నది

భావము X అభావము
అభావము X ఆభాసము

EVERYTHING X NOTHING
NOTHING X Nothingness
శూన్యం = vacum

Notes: సృష్టి రూపమున వ్యాపాకమై ఉన్న భగవంతుని సృష్టికర్త యనియు, ఈశ్వరుడు అనియు అందురు. ఈశ్వర-శబ్దము, సందర్భము ననుసరించి 'పరమాత్మ' అనికూడా నొప్పును. ఇట్టి ఈశ్వరునకు పరుడు ఎవడు? పరమేశ్వరుడు, పరేశుడు.

పరుడు=ఆవలివాడు (God, the beyond state)
పరాత్పరుడు= పరునకు ఆవలి వాడు (God,the beyond state)
పారాత్ + పరః = పరాత్పరః
(God, The beyond beyond state)
పరుడు=ప్రకృతి మాయను దాటిన వాడు.

బ్రహ్మ=సృష్టికర్త, జగత్కర్త,ఈశ్వరుడు
పరబ్రహ్మము=సృష్టికర్తను మించిన వాడు (పరమాత్ముడు)
ఈశ్వరుడు=జగత్కర్త (Creator)
పరమేశ్వరుడు=(God, the Beyond State of Creation)

18.పరాత్పర పరబ్రహ్మస్థితి అనూహ్యమైన అనన్యమైన పరిశుద్ధ స్వరూపము. సమస్తజ్ఞానము సమస్త అంతర సత్యములు దాగియున్న పరమనిధి. 

అవాంగ్మానస గోచరమైన అవ్యక్తస్థితి. ఇది పరిమితమును గాదు, అపరిమితమును గాదు. సగుణమును కాదు, నిర్గుణమును కాదు. సాకారమును కాదు,నిరాకారమును కాదు. అనంత అగోచర స్థితి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹