కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 22

Image may contain: outdoor
🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 22 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 10 🌻

ఎప్పుడైతే నువ్వు జ్ఞాత స్థానంలో సాక్షిగా వుంటావో, ఎప్పుడైతే మిగిలిన 24, పిండాండ పంచీకరణలో చెప్పబడినటువంటి 24 నీకు స్వాధీనమై నువ్వు సాక్షిగా వుంటావో, అప్పుడు సేవకుడిగా వుంటావు. కర్తవ్యం చేస్తావు. ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవై వుంటావు.

అంతా ఈశ్వరప్రసాదంగా చూస్తావు. కర్మకి అంటకుండా వుంటావు. మాలిన్యము లేకుండా వుంటావు. ఇంకేమిటి? సహజ సమరస శాంత స్వభావంతో వుంటావు. ఈ మూడూ గుర్తుపెట్టుకోవాలి.

సహజ సమరస శాంత స్వభావంతో ఎవరైతే వుంటారో వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానమునకు అర్హులు. ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి అంశాలను ఇందులో ప్రతిపాదిస్తున్నారు.

కాబట్టి మనం తప్పక ప్రయత్నించి అనేక జీవితములుగా అనేక జన్మలుగా మాటిమాటికీ ప్రలోభపెడుతూ నీ వెనక పడుతున్నటువంటి నిన్ను వాటి వెంట తిప్పుకునేటటువంటి ధన, కనక, వస్తు, వాహన స్త్రీ వ్యామోహ - స్త్రీ అంటే ఇక్కడ ఒక స్త్రీలనే కాదు సుమీ.

మానవులందరూ స్త్రీలే. పరమాత్మ ఒక్కడే పురుషుడు. ప్రకృతి అంతా స్త్రీత్వమే. కాబట్టి ఇక్కడ స్త్రీ అన్న శబ్దం వాడినప్పుడల్లా ప్రకృతి చేత ప్రేరణ పొందబడుతున్న వారందరూ స్త్రీలే. కాబట్టి గుణముల చేత ప్రేరితమవుతున్న వారందరూ స్త్రీలే. సర్వజీవులూ స్త్రీలే అని అర్ధం.

కాబట్టి ఇటువంటి జీవభావంతో శరీరమే నేను అనేటటువంటి వ్యామోహంతో కూడుకున్నటువంటి వారు ఎవరైతే వుంటారో, మోహము -వ్యామోహము , విస్తృతి కలిగినటువంటి మోహము వ్యామోహము. వ్యావృత్తి కలిగినటువంటి మోహము వ్యామోహము.

కాబట్టి అటువంటి దాని బారిన పడకుండా మానవజీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానమును అందిపుచ్చుకోవడానికి ఎవరైతే ప్రయత్నంచేస్తుంటారో వారి జన్మ ధన్యము.

ఎవరికైతే ఈ “స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంతాభృశం వాదినః” అనే సత్యాన్ని గుర్తించినటువంటి వారున్నారో, ఎవరైతే జగత్ భ్రాంతిలో పడకుండా వున్నారో, “బ్రహ్మ సత్యం జగన్మిధ్య” అను సూత్రమును తన జీవితమునందు తాను సిద్ధిపొందాలనేటటువంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి వున్నారో వారి జన్మ ధన్యము.

కాబట్టి మనలో ఆ రకమైన జగత్తుకి సంబంధించినటువంటి ప్రేరణలు కలుగగానే వాటిల్లో ఉన్నటువంటి దోషభావాన్ని గుర్తెరగాలి. ఏమిటి వాటిల్లో ఉన్నటువంటి దోషభావము అంటే నిన్ను మొహములో చిక్కుకునేటట్లుగా చేస్తుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment