మైత్రేయ మహర్షి బోధనలు - 89


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 89 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 75. ప్రత్యేక దృష్టి - 1 🌻


మహత్తర విషయములు ఎప్పుడునూ అతి సామాన్యముగ ప్రారంభమగును. ఆర్భాటమసలే యుండదు. నదీ ప్రవాహము పుట్టుకను గమనించినచో పై సత్యము తెలియనగును. కాకతాళీయముగ మహాత్ములచే మహాకార్యములిట్లే ప్రారంభింపబడినవి. మహాత్ముల బోధనలు కూడ నిగూఢ రహస్యముల నిట్లే వెలిబుచ్చు చుండును.

శ్రద్ధ, భక్తి, ఏకాగ్ర దృష్టి కలవారు మాత్రమే వీటిని గమనింపగలరు. ఇతరులకు సత్యపరమైన విషయములు అంతగ గోచరింపవు. ఆరంభము లెప్పుడును సామాన్యముగ నుండుట ప్రకృతి విధానము. శ్రీ కృష్ణ జననము, పరశురామ, శ్రీ రామ జననము ఇత్యాదివి కూడ ఇట్లే సామాన్యముగ జరిగినవి. అందువలన అతి సామాన్య విషయముల యందు అశ్రద్ధ పనికిరాదని మా హెచ్చరిక.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 151


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 151 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. తల నించీ హృదయంలోకి దిగు. అప్పుడు నీ సమస్యలన్నీ అదృశ్యమవుతాయి. రహస్యం మిగిలే వుంటుంది. రహస్యాలు అద్భుతమయినవి, జీవించాల్సినవి. 🍀


మనం అందరం మేథస్సుకు వేలాడుతూ వుంటాం. అది ఒక్కటే మన సమస్య. దానికొకటే పరిష్కారం. తల నించీ హృదయంలోకి దిగు. అప్పుడు నీ సమస్యలన్నీ అదృశ్యమవుతాయి. అది మెదడు సృష్టించినవి. అప్పుడు అన్ని స్పష్టమవుతాయి.

మనం సమస్యల్ని ఎట్లా సృష్టిస్తూ పోతూన్నాయో స్పష్టమవుతుంది. రహస్యం మిగిలే వుంటుంది. సమస్యలు అదృశ్యమవుతాయి. ఆవిరవుతాయి. రహస్యాలు అద్భుతమయినవి. అవి పరిష్కరించాల్సినవి కావు. అవి జీవించాల్సినవి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 250 -6. సృష్టి జరగదు, సృష్టించడానికి తగిన స్థలం ఉంటే తప్ప / DAILY WISDOM - 250 - 6. Unless there is Space to Create, there Cannot be Creation


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 250 / DAILY WISDOM - 250 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 6. సృష్టి జరగదు, సృష్టించడానికి తగిన స్థలం ఉంటే తప్ప. 🌻

ఆధునిక ఖగోళ శాస్త్రం మరియు భౌతిక రంగంలో మహా విస్ఫోటనం (బిగ్‌-బ్యాంగ్‌) యొక్క సిద్ధాంతాలు మరియు విశ్వం ఆవిర్భావ కారణానికి సంబంధించిన ఇతర వివరణలు మనకు ఉన్నాయి. విశ్వం సర్వవ్యాప్త స్థితి నుండి ఎక్కువ మరింత ఎక్కువ వైవిధ్యభరితమైన రూపాలు మరియు మరింత బాహ్య ఆకారాలలోకి ఉద్భవించిందని భావించే ప్రక్రియను గ్రంథాలు వివరిస్తాయి. సర్వోన్నత జీవి తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు, ఆ విశ్వవ్యాప్త స్పృహ యొక్క ఏకాగ్రత కారణంగానే దాని అసలైన స్వంత స్వచ్ఛమైన స్థితి నుండి, తార్కికంగా భిన్నంగా ఉండటానికి ఇష్టపడే నిర్ణయించుకున్న విశ్వ చర్యగా సృష్టిని చెప్పవచ్చు.

సృష్టించడానికి స్థలం లేకపోతే, సృష్టి ఉండదు, మరియు సృష్టించడానికి సమయం లేకపోతే, అప్పుడు కూడా సృష్టి ఉండదు. సృష్టి ప్రారంభం అంటే, స్థలం మరియు సమయం యొక్క తక్షణ, సహ-సమాన మరియు సహ-శాశ్వత పరస్పర భాగస్వామ్యం యొక్క మిశ్రమంలో దర్శించడాన్ని సూచిస్తుంది. స్థలం మరియు సమయం అనేది సృష్టి యొక్క ప్రాథమిక స్థావరం, ఆధారం. సృష్టి యొక్క మాతృక. సంపూర్ణత యొక్క ఒక సంకల్పం తీవ్రమైన శక్తివంతమైన కంపనంగా మారుతుంది. దానిలో స్థలం మరియు సమయం స్వయంగా కరిగిపోయి, ఒదిగిపోతుంది; అంటే, స్థలం-సమయం అని పిలువబడేది సర్వవ్యాప్త ప్రకంపన యొక్క అంతులేని సముద్రం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 DAILY WISDOM - 250 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 6. Unless there is Space to Create, there Cannot be Creation 🌻


As we have in the field of modern astronomy and physics the theories of the Big Bang and related descriptions of the cause of the universe, the scriptures delineate the process in which one can consider the universe as having evolved from the state of an original ubiquitous continuum, into greater and greater diversified forms and more and more externalised shapes. The affirmation mostly centres round the enunciation that the Supreme Being was engaged in tapas, which is the original concentration of the Universal Consciousness in a cosmic act of willing and deciding to be something logically differentiated from its own pure being.

Unless there is space to create, there cannot be creation, and unless there is time to create, there would not be creation even then. The beginning of creation implies, therefore, the projection of space and time in a blend of instantaneous, co-eval and co-eternal mutual participation. Space-time is the fundamental base, the matrix of creation. The Will of the Absolute becomes an intensely powerful vibration into which the space-time complex reduces itself; that is to say, what is known as space-time is itself an unending sea of omnipresent vibration.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 20 / Agni Maha Purana - 20


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 20 / Agni Maha Purana - 20 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 8

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. కిష్కిందకాండ వర్ణనము - 1 🌻


నారదుడు పలికెను.

రాముడు పంపా సరస్సు చేరి దుఃఖించెను. పిమ్మట శబరి వద్దకు వెళ్లెను. పిమ్మట హనుమంతడు సుగ్రీవుని వద్దకు తీసికొనిపోగా ఆతనిని తన మిత్రినిగ చేసికొనెను.

సుగ్రీవుడు చూచుచుండగా ఒక బాణము చేత ఏడు తాళవృక్షములను భేదించి, దుందుభి శరీరమును పది యోజనముల దూరము విసరెను.

ఆతని సోదరుడును, వైరము చేయుటచే శత్రవును ఆగు వాలిని చంపి ఋశ్యమూకముపై ఉన్న ఆతనికి కిష్కింధను, వానరరాజ్యమును, రుమను, తారను ఇచ్చెను. సుగ్రీవుడు ఇట్లు పలికెను. ''రామా! నీకు సీత లభించు నట్లు చేసెదను.

రాముడు ఆ మాటలు విని మాల్యవత్పర్వతముపై వర్షాకాలము నాలుగు మానములను గడపెను. కిష్కింధలో ఉన్న సుగ్రీవుడు మరల కనబడక పోగా లక్ష్మణుడ రాముడు చెప్పిన విధమున ఆతనితో ఇట్లు చెప్పెను. ''నీవు రాముని దగ్గరకు వెళ్లుము. వాలి రామునిచే నిహతుడై వెళ్లిన మార్గము ఇంకను మూసివేయబడలేదు. సుగ్రీవా! మాటమీద నిలబడుము. వారి మార్గమును అనుసరించకుము''.

వానరాధిపతి యైన సుగ్రీవుడు ''కార్యాసక్తుడనైన నేను గడచిన కాలమును గుర్తించ జాలకపోతిని'' అని పలికి రాముని వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు పలికెను.

సుగ్రీవుడు పలికెను: వానురరులనందరిని పిలిపించితిని. నీ అభిలాష ప్రకారము వారిని సీతాన్వేషణమ నిమిత్తమై పంపగలను. వారు తూర్పుదిక్కు మొదలైన దిక్కులందు సీతను మానములోపున అన్వేషించవలెను. మాసము దాటినచో వారిని చంపెదను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana -20 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 8

🌻 Kishkinda Kand - 1 🌻

Nārada said:

1. Having gone to the lake of Pampā, Rāma stayed there (that) night thinking (of what to do). Then he was (met and) taken to Sugrīva by Hanūmat. Rāma made friendship (with Sugrīva).

2. After having pierced the seven Tāla trees with a single arrow and (even as others) were seeing, threw away the body of Dundubhi[1] by his foot to a distance of ten yojanas.

3-4. Having killed Vālin,[2] his (Sugrīva’s) enemy, who had been the cause of enmity, he bestowed on him the monkey-kingdom of Kiṣkindhā (as well as) Rumā and Tārā on the Ṛṣyamūka (mountains). That ruler of Kiṣkindhā (Sugrīva) told (Rāma), “I will do in such a way, O Rāma! by which you will be getting back Sītā”.

5-7. Having heard that, he (Rāma) spent the four months on the Mālyavat (mountain). As Sugrīva had not come to Kiṣkindhā to see (Rāma), Lakṣmaṇa (met him and) spoke to him the words of Rāma, “(You) go to Rāghava. The way in which Vālin was killed is not yet closed. O Sugrīva! You stand by at this juncture. Do not take to the course of Vālin.” Sugrīva said, “I did not realize the elapse of time on account of my preoccupation.”

8-9. Saying so, he (Lakṣmaṇa) went away. The lord of the monkeys (Sugrīva) (approached) Rāma, bowed and said, "All the monkeys have been brought in order to search for Sītā. As desired by you, I shall send them. Let them search for Jānakī in the (direction of) east etc. Let them return in a month. (If they come) after a month I will kill them.”


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 571 / Vishnu Sahasranama Contemplation - 571


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 571 / Vishnu Sahasranama Contemplation - 571 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 571. దివఃస్పృక్, दिवःस्पृक्, Divaḥspr‌k 🌻

ఓం దివస్పృశే నమః | ॐ दिवस्पृशे नमः | OM Divaspr‌śe namaḥ

దివఃస్పృక్, दिवःस्पृक्, Divaḥspr‌k

స విష్ణురేవ భగవాన్ దివస్పృక్ స్పర్శనాద్దివః

స్పృశించువాడు 'స్పృక్‍' అనబడును. ద్యులోకమును స్పృశించువాడు దివఃస్పృక్‍. ఆయా జ్యోతిస్సుల రూపమున పరమాత్ముడు ద్యులోకమును చేరి అచట వెలుగుచుండును గదా!

మరియూ త్రివిక్రమ అనగా వామనావతారమున పరమాత్ముడు భూమిని, ఆకాశమును సైతమూ తన పాదాములతో విక్రమించెనుగనుక దివఃస్పృక్‍ అనబడును.


:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::

మ. ఒకపాదంబున భూమిఁ గప్పి దివి వేఱొంటన్ నిరోధించి యొం
డొకటన్ మీఁది జగంబులెల్లఁ దొడి, యొం డొంటిన్ విలంఘించి, ప
ట్టక బ్రహ్మాండ కటాహముం బగిలి వేండ్రంబై పరుల్ గానరా
కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్‍. (625)

విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్నీ, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్నీ, పై లోకాలను కప్పివేసినాడు. క్రమముగా అన్నింటినీ దాటిపోయినాడు. ఆ మహారూపము పట్టకపోవడమువల్ల బ్రహ్మాండ భాండం పెటపెటలాడి బ్రద్దలైపోసాగినది. ఆయన తప్ప ఇంక యెవ్వరూ కనిపించకుండా పోయినారు. ఆ విశ్వరూపుడు మాటలకూ, చూపులకూ అందరానివాడై శోభించినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 571🌹

📚. Prasad Bharadwaj

🌻 571. Divaḥspr‌k 🌻


OM Divaspr‌śe namaḥ

स विष्णुरेव भगवान् दिवस्पृक् स्पर्शनाद्दिवः /

Sa viṣṇureva bhagavān divaspr‌k sparśanāddivaḥ


The one who touches is called Spr‌k. In the form of celestial bodies, the Lord is spread all across the heavens and hence He is Divaḥspr‌k.

Moreover, during the Vāmana incarnation, He touched and conquered the heavens in a single foot step. Because of this as well, he is called Divaḥspr‌k.


:: श्रीमद्भागवते अष्टमस्कन्धे एकविंशोऽध्यायः ::

पदैकेन मयाक्रान्तो भूर्लोकः खं दिशस्तनोः ।
स्वर्लोकस्ते द्वितीयेन पश्यतस्ते स्वमात्मना ॥ ३१ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 21

Padaikēna mayākrāntō bhūrlōkaḥ khaṃ diśastanōḥ,
Svarlōkastē dvitīyēna paśyatastē svamātmanā. 31.


With one step I have occupied Bhūrloka, and with My body I have occupied the entire sky and all directions. And in your presence, with My second step, I have occupied the upper planetary system.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divispr‌k sarvadr‌g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


16 Mar 2022

16 - MARCH - 2022 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 16, మార్చి 2022 బుధవారం, సౌమ్య వాసరే 🌹 
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 173 / Bhagavad-Gita - 173 - 4-11 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 571 / Vishnu Sahasranama Contemplation - 571🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 20 / Agni Maha Purana 20 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 250 / DAILY WISDOM - 250 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 151 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 89 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 16, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*పండుగలు మరియు పర్వదినాలు : లేవు.*

*🍀. శ్రీ గణేశ అష్టకం - 3 🍀*

*3. వివిధ-మణి-మయూఖైః శోభమానం విదూరైః*
*కనక-రచిత-చిత్రం కణ్ఠదేశేవిచిత్రం ।*
*దధతి విమలహారం సర్వదా యత్నసారం*
*గణపతిమభివన్దే వక్రతుణ్డావతారమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం గొప్ప కాదు. తప్పు చేయకుండా ఉండడమే ముఖ్యమైనది. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 13:41:08 వరకు
తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: మఘ 24:21:29 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: ధృతి 26:38:32 వరకు
తదుపరి శూల
కరణం: తైతిల 13:36:08 వరకు
వర్జ్యం: 11:57:30 - 13:36:38
దుర్ముహూర్తం: 12:00:45 - 12:48:56
రాహు కాలం: 12:24:50 - 13:55:10
గుళిక కాలం: 10:54:31 - 12:24:51
యమ గండం: 07:53:52 - 09:24:12
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:48
అమృత కాలం: 21:52:18 - 23:31:26
సూర్యోదయం: 06:23:33
సూర్యాస్తమయం: 18:26:09
వైదిక సూర్యోదయం: 06:27:06
వైదిక సూర్యాస్తమయం: 18:22:36
చంద్రోదయం: 16:50:07
చంద్రాస్తమయం: 05:08:18
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: సింహం
చర యోగం - దుర్వార్త శ్రవణం 24:21:29
వరకు తదుపరి స్థిర యోగం - శుభాశుభ 
మిశ్రమ ఫలం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 173 / Bhagavad-Gita - 173 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 11 🌴*

*11. యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్ |*
*మమ వర్త్మానువర్తన్తే మనుష్యా: పార్థ సర్వశ: ||*

🌷. తాత్పర్యం :
*ఎవరు ఏ విధముగా నన్ను శరణువేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థా! ప్రతియొక్కరు అన్నివిధములా నా మార్గమునే అనుసరింతురు.*

🌻. భాష్యము :
ప్రతి యొక్కరు శ్రీ కృష్ణభగవానునే అతని వివిధ రూపము లందు అన్వేషించుచున్నారు. నిరాకార బ్రహ్మజ్యోతి తేజము నందును మరియు కణములతో సహా సర్వమునందు నిలిచియుండు సర్వవ్యాపియైన పరమాత్మ యందును దేవదేవుడైన శ్రీకృష్ణుడు కేవలము పాక్షికముగా అనుభూతమగుడును. విశుద్ధభక్తులే అతనిని పూర్ణముగా అనుభూతమొనర్చుకొనగలరు. అనగా శ్రీకృష్ణుడే ప్రతియెక్కరికిని అనుభవధ్యేయమై యున్నాడు. 

ఆ విధముగా ప్రతియొక్కరు ఆ దేవదేవుని పొందగోరిన విధము ననుసరించి తృప్తిని బడయుచుందురు. ఆధ్యాత్మికజగత్తునందు సైతము శ్రీకృష్ణుడు భక్తులు కోరినరీతిగా దివ్యభావనలో వారితో వర్తింతును. ఒక భక్తుడు కృష్ణుని పరమ యజమనిగా కోరవచ్చును. మరియొకరు అతనిని స్నేహితునుగా పొందగోరువచ్చును. ఇంకొకరు పుత్రునిగా కోరవచ్చును. ఇంకను ఒకడు ప్రియునిగా కోరవచ్చును. తన యెడగల ప్రేమస్థాయి ననుసరించి శ్రీకృష్ణుడు వారికి సమముగా వరదానము కావించును. భౌతికజగమునందు కూడా అట్టి పరస్పర భావవినియము కలదు. 

నిరాకారత్వమునందును స్థిరముగా నెలకొనజాలనివారు తిరిగి భౌతికజగమునకు వచ్చి కర్మల యెడ గల నిద్రాణముగా నున్న తమ కోరికలను ప్రదర్శింతురు. వారికి ఎన్నడును ఆధ్యాత్మికజగములందు ప్రవేశము లభింపడు. కేవలము భౌతికజగమునందే వర్తించుటకు వారికి అవకాశము కల్పింపబడును. కామ్యకర్మరతులైనవారికి శ్రీకృష్ణభగవానుడు యజ్ఞేశ్వరుని రూపమున వారి విధ్యుక్తధర్మములకు తగిన ఫలమును ఒసగుచుండును. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 173 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 11 🌴*

*11. ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmy aham*
*mama vartmānuvartante manuṣyāḥ pārtha sarvaśaḥ*

🌷 Translation : 
*As all surrender unto Me, I reward them accordingly. Everyone follows My path in all respects, O son of Pṛthā.*

🌹 Purport :
Everyone is searching for Kṛṣṇa in the different aspects of His manifestations. Kṛṣṇa, the Supreme Personality of Godhead, is partially realized in His impersonal brahma-jyotir effulgence and as the all-pervading Supersoul dwelling within everything, including the particles of atoms. But Kṛṣṇa is fully realized only by His pure devotees. 

Consequently, Kṛṣṇa is the object of everyone’s realization, and thus anyone and everyone is satisfied according to one’s desire to have Him. In the transcendental world also, Kṛṣṇa reciprocates with His pure devotees in the transcendental attitude, just as the devotee wants Him. One devotee may want Kṛṣṇa as supreme master, another as his personal friend, another as his son and still another as his lover. Kṛṣṇa rewards all the devotees equally, according to their different intensities of love for Him. In the material world, the same reciprocations of feelings are there, and they are equally exchanged by the Lord with the different types of worshipers. 

Some of them, who are not firmly situated even in the impersonal existence, return to this material field to exhibit their dormant desires for activities. They are not admitted into the spiritual planets, but they are again given a chance to act on the material planets. For those who are fruitive workers, the Lord awards the desired results of their prescribed duties, as the yajñeśvara; and those who are yogīs seeking mystic powers are awarded such powers.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 571 / Vishnu Sahasranama Contemplation - 571 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 571. దివఃస్పృక్, दिवःस्पृक्, Divaḥspr‌k 🌻*

*ఓం దివస్పృశే నమః | ॐ दिवस्पृशे नमः | OM Divaspr‌śe namaḥ*

*దివఃస్పృక్, दिवःस्पृक्, Divaḥspr‌k*

*స విష్ణురేవ భగవాన్ దివస్పృక్ స్పర్శనాద్దివః*

*స్పృశించువాడు 'స్పృక్‍' అనబడును. ద్యులోకమును స్పృశించువాడు దివఃస్పృక్‍. ఆయా జ్యోతిస్సుల రూపమున పరమాత్ముడు ద్యులోకమును చేరి అచట వెలుగుచుండును గదా!*

*మరియూ త్రివిక్రమ అనగా వామనావతారమున పరమాత్ముడు భూమిని, ఆకాశమును సైతమూ తన పాదాములతో విక్రమించెనుగనుక దివఃస్పృక్‍ అనబడును.*

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
మ. ఒకపాదంబున భూమిఁ గప్పి దివి వేఱొంటన్ నిరోధించి యొం
      డొకటన్ మీఁది జగంబులెల్లఁ దొడి, యొం డొంటిన్ విలంఘించి, ప
      ట్టక బ్రహ్మాండ కటాహముం బగిలి వేండ్రంబై పరుల్ గానరా
      కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్‍. (625)

*విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్నీ, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్నీ, పై లోకాలను కప్పివేసినాడు. క్రమముగా అన్నింటినీ దాటిపోయినాడు. ఆ మహారూపము పట్టకపోవడమువల్ల బ్రహ్మాండ భాండం పెటపెటలాడి బ్రద్దలైపోసాగినది. ఆయన తప్ప ఇంక యెవ్వరూ కనిపించకుండా పోయినారు. ఆ విశ్వరూపుడు మాటలకూ, చూపులకూ అందరానివాడై శోభించినాడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 571🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 571. Divaḥspr‌k 🌻*

*OM Divaspr‌śe namaḥ*

स विष्णुरेव भगवान् दिवस्पृक् स्पर्शनाद्दिवः / 
*Sa viṣṇureva bhagavān divaspr‌k sparśanāddivaḥ*

*The one who touches is called Spr‌k. In the form of celestial bodies, the Lord is spread all across the heavens and hence He is Divaḥspr‌k.*

*Moreover, during the Vāmana incarnation, He touched and conquered the heavens in a single foot step. Because of this as well, he is called Divaḥspr‌k.*

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे एकविंशोऽध्यायः ::
पदैकेन मयाक्रान्तो भूर्लोकः खं दिशस्तनोः ।
स्वर्लोकस्ते द्वितीयेन पश्यतस्ते स्वमात्मना ॥ ३१ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 21
Padaikēna mayākrāntō bhūrlōkaḥ khaṃ diśastanōḥ,
Svarlōkastē dvitīyēna paśyatastē svamātmanā. 31.

*With one step I have occupied Bhūrloka, and with My body I have occupied the entire sky and all directions. And in your presence, with My second step, I have occupied the upper planetary system.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divispr‌k sarvadr‌g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 20 / Agni Maha Purana - 20 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 8*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. కిష్కిందకాండ వర్ణనము - 1 🌻*

నారదుడు పలికెను. 

రాముడు పంపా సరస్సు చేరి దుఃఖించెను. పిమ్మట శబరి వద్దకు వెళ్లెను. పిమ్మట హనుమంతడు సుగ్రీవుని వద్దకు తీసికొనిపోగా ఆతనిని తన మిత్రినిగ చేసికొనెను.

సుగ్రీవుడు చూచుచుండగా ఒక బాణము చేత ఏడు తాళవృక్షములను భేదించి, దుందుభి శరీరమును పది యోజనముల దూరము విసరెను.

ఆతని సోదరుడును, వైరము చేయుటచే శత్రవును ఆగు వాలిని చంపి ఋశ్యమూకముపై ఉన్న ఆతనికి కిష్కింధను, వానరరాజ్యమును, రుమను, తారను ఇచ్చెను. సుగ్రీవుడు ఇట్లు పలికెను. ''రామా! నీకు సీత లభించు నట్లు చేసెదను.

రాముడు ఆ మాటలు విని మాల్యవత్పర్వతముపై వర్షాకాలము నాలుగు మానములను గడపెను. కిష్కింధలో ఉన్న సుగ్రీవుడు మరల కనబడక పోగా లక్ష్మణుడ రాముడు చెప్పిన విధమున ఆతనితో ఇట్లు చెప్పెను. ''నీవు రాముని దగ్గరకు వెళ్లుము. వాలి రామునిచే నిహతుడై వెళ్లిన మార్గము ఇంకను మూసివేయబడలేదు. సుగ్రీవా! మాటమీద నిలబడుము. వారి మార్గమును అనుసరించకుము''.

వానరాధిపతి యైన సుగ్రీవుడు ''కార్యాసక్తుడనైన నేను గడచిన కాలమును గుర్తించ జాలకపోతిని'' అని పలికి రాముని వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు పలికెను.

సుగ్రీవుడు పలికెను: వానురరులనందరిని పిలిపించితిని. నీ అభిలాష ప్రకారము వారిని సీతాన్వేషణమ నిమిత్తమై పంపగలను. వారు తూర్పుదిక్కు మొదలైన దిక్కులందు సీతను మానములోపున అన్వేషించవలెను. మాసము దాటినచో వారిని చంపెదను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -20 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

Chapter 8
*🌻 Kishkinda Kand - 1 🌻*

Nārada said:

1. Having gone to the lake of Pampā, Rāma stayed there (that) night thinking (of what to do). Then he was (met and) taken to Sugrīva by Hanūmat. Rāma made friendship (with Sugrīva).

2. After having pierced the seven Tāla trees with a single arrow and (even as others) were seeing, threw away the body of Dundubhi[1] by his foot to a distance of ten yojanas.

3-4. Having killed Vālin,[2] his (Sugrīva’s) enemy, who had been the cause of enmity, he bestowed on him the monkey-kingdom of Kiṣkindhā (as well as) Rumā and Tārā on the Ṛṣyamūka (mountains). That ruler of Kiṣkindhā (Sugrīva) told (Rāma), “I will do in such a way, O Rāma! by which you will be getting back Sītā”.

5-7. Having heard that, he (Rāma) spent the four months on the Mālyavat (mountain). As Sugrīva had not come to Kiṣkindhā to see (Rāma), Lakṣmaṇa (met him and) spoke to him the words of Rāma, “(You) go to Rāghava. The way in which Vālin was killed is not yet closed. O Sugrīva! You stand by at this juncture. Do not take to the course of Vālin.” Sugrīva said, “I did not realize the elapse of time on account of my preoccupation.”

8-9. Saying so, he (Lakṣmaṇa) went away. The lord of the monkeys (Sugrīva) (approached) Rāma, bowed and said, "All the monkeys have been brought in order to search for Sītā. As desired by you, I shall send them. Let them search for Jānakī in the (direction of) east etc. Let them return in a month. (If they come) after a month I will kill them.”

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 250 / DAILY WISDOM - 250 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 6. సృష్టి జరగదు, సృష్టించడానికి తగిన స్థలం ఉంటే తప్ప. 🌻*

*ఆధునిక ఖగోళ శాస్త్రం మరియు భౌతిక రంగంలో మహా విస్ఫోటనం (బిగ్‌-బ్యాంగ్‌) యొక్క సిద్ధాంతాలు మరియు విశ్వం ఆవిర్భావ కారణానికి సంబంధించిన ఇతర వివరణలు మనకు ఉన్నాయి. విశ్వం సర్వవ్యాప్త స్థితి నుండి ఎక్కువ మరింత ఎక్కువ వైవిధ్యభరితమైన రూపాలు మరియు మరింత బాహ్య ఆకారాలలోకి ఉద్భవించిందని భావించే ప్రక్రియను గ్రంథాలు వివరిస్తాయి. సర్వోన్నత జీవి తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు, ఆ విశ్వవ్యాప్త స్పృహ యొక్క ఏకాగ్రత కారణంగానే దాని అసలైన స్వంత స్వచ్ఛమైన స్థితి నుండి, తార్కికంగా భిన్నంగా ఉండటానికి ఇష్టపడే నిర్ణయించుకున్న విశ్వ చర్యగా సృష్టిని చెప్పవచ్చు.*

*సృష్టించడానికి స్థలం లేకపోతే, సృష్టి ఉండదు, మరియు సృష్టించడానికి సమయం లేకపోతే, అప్పుడు కూడా సృష్టి ఉండదు. సృష్టి ప్రారంభం అంటే, స్థలం మరియు సమయం యొక్క తక్షణ, సహ-సమాన మరియు సహ-శాశ్వత పరస్పర భాగస్వామ్యం యొక్క మిశ్రమంలో దర్శించడాన్ని సూచిస్తుంది. స్థలం మరియు సమయం అనేది సృష్టి యొక్క ప్రాథమిక స్థావరం, ఆధారం. సృష్టి యొక్క మాతృక. సంపూర్ణత యొక్క ఒక సంకల్పం తీవ్రమైన శక్తివంతమైన కంపనంగా మారుతుంది. దానిలో స్థలం మరియు సమయం స్వయంగా కరిగిపోయి, ఒదిగిపోతుంది; అంటే, స్థలం-సమయం అని పిలువబడేది సర్వవ్యాప్త ప్రకంపన యొక్క అంతులేని సముద్రం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 250 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 6. Unless there is Space to Create, there Cannot be Creation 🌻*

*As we have in the field of modern astronomy and physics the theories of the Big Bang and related descriptions of the cause of the universe, the scriptures delineate the process in which one can consider the universe as having evolved from the state of an original ubiquitous continuum, into greater and greater diversified forms and more and more externalised shapes. The affirmation mostly centres round the enunciation that the Supreme Being was engaged in tapas, which is the original concentration of the Universal Consciousness in a cosmic act of willing and deciding to be something logically differentiated from its own pure being.*

*Unless there is space to create, there cannot be creation, and unless there is time to create, there would not be creation even then. The beginning of creation implies, therefore, the projection of space and time in a blend of instantaneous, co-eval and co-eternal mutual participation. Space-time is the fundamental base, the matrix of creation. The Will of the Absolute becomes an intensely powerful vibration into which the space-time complex reduces itself; that is to say, what is known as space-time is itself an unending sea of omnipresent vibration.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 151 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. తల నించీ హృదయంలోకి దిగు. అప్పుడు నీ సమస్యలన్నీ అదృశ్యమవుతాయి. రహస్యం మిగిలే వుంటుంది. రహస్యాలు అద్భుతమయినవి, జీవించాల్సినవి. 🍀*

*మనం అందరం మేథస్సుకు వేలాడుతూ వుంటాం. అది ఒక్కటే మన సమస్య. దానికొకటే పరిష్కారం. తల నించీ హృదయంలోకి దిగు. అప్పుడు నీ సమస్యలన్నీ అదృశ్యమవుతాయి. అది మెదడు సృష్టించినవి. అప్పుడు అన్ని స్పష్టమవుతాయి.*

*మనం సమస్యల్ని ఎట్లా సృష్టిస్తూ పోతూన్నాయో స్పష్టమవుతుంది. రహస్యం మిగిలే వుంటుంది. సమస్యలు అదృశ్యమవుతాయి. ఆవిరవుతాయి. రహస్యాలు అద్భుతమయినవి. అవి పరిష్కరించాల్సినవి కావు. అవి జీవించాల్సినవి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 89 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 75. ప్రత్యేక దృష్టి - 1 🌻*

*మహత్తర విషయములు ఎప్పుడునూ అతి సామాన్యముగ ప్రారంభమగును. ఆర్భాటమసలే యుండదు. నదీ ప్రవాహము పుట్టుకను గమనించినచో పై సత్యము తెలియనగును. కాకతాళీయముగ మహాత్ములచే మహాకార్యములిట్లే ప్రారంభింపబడినవి. మహాత్ముల బోధనలు కూడ నిగూఢ రహస్యముల నిట్లే వెలిబుచ్చు చుండును.*

*శ్రద్ధ, భక్తి, ఏకాగ్ర దృష్టి కలవారు మాత్రమే వీటిని గమనింపగలరు. ఇతరులకు సత్యపరమైన విషయములు అంతగ గోచరింపవు. ఆరంభము లెప్పుడును సామాన్యముగ నుండుట ప్రకృతి విధానము. శ్రీ కృష్ణ జననము, పరశురామ, శ్రీ రామ జననము ఇత్యాదివి కూడ ఇట్లే సామాన్యముగ జరిగినవి. అందువలన అతి సామాన్య విషయముల యందు అశ్రద్ధ పనికిరాదని మా హెచ్చరిక.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹