విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 571 / Vishnu Sahasranama Contemplation - 571


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 571 / Vishnu Sahasranama Contemplation - 571 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 571. దివఃస్పృక్, दिवःस्पृक्, Divaḥspr‌k 🌻

ఓం దివస్పృశే నమః | ॐ दिवस्पृशे नमः | OM Divaspr‌śe namaḥ

దివఃస్పృక్, दिवःस्पृक्, Divaḥspr‌k

స విష్ణురేవ భగవాన్ దివస్పృక్ స్పర్శనాద్దివః

స్పృశించువాడు 'స్పృక్‍' అనబడును. ద్యులోకమును స్పృశించువాడు దివఃస్పృక్‍. ఆయా జ్యోతిస్సుల రూపమున పరమాత్ముడు ద్యులోకమును చేరి అచట వెలుగుచుండును గదా!

మరియూ త్రివిక్రమ అనగా వామనావతారమున పరమాత్ముడు భూమిని, ఆకాశమును సైతమూ తన పాదాములతో విక్రమించెనుగనుక దివఃస్పృక్‍ అనబడును.


:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::

మ. ఒకపాదంబున భూమిఁ గప్పి దివి వేఱొంటన్ నిరోధించి యొం
డొకటన్ మీఁది జగంబులెల్లఁ దొడి, యొం డొంటిన్ విలంఘించి, ప
ట్టక బ్రహ్మాండ కటాహముం బగిలి వేండ్రంబై పరుల్ గానరా
కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్‍. (625)

విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్నీ, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్నీ, పై లోకాలను కప్పివేసినాడు. క్రమముగా అన్నింటినీ దాటిపోయినాడు. ఆ మహారూపము పట్టకపోవడమువల్ల బ్రహ్మాండ భాండం పెటపెటలాడి బ్రద్దలైపోసాగినది. ఆయన తప్ప ఇంక యెవ్వరూ కనిపించకుండా పోయినారు. ఆ విశ్వరూపుడు మాటలకూ, చూపులకూ అందరానివాడై శోభించినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 571🌹

📚. Prasad Bharadwaj

🌻 571. Divaḥspr‌k 🌻


OM Divaspr‌śe namaḥ

स विष्णुरेव भगवान् दिवस्पृक् स्पर्शनाद्दिवः /

Sa viṣṇureva bhagavān divaspr‌k sparśanāddivaḥ


The one who touches is called Spr‌k. In the form of celestial bodies, the Lord is spread all across the heavens and hence He is Divaḥspr‌k.

Moreover, during the Vāmana incarnation, He touched and conquered the heavens in a single foot step. Because of this as well, he is called Divaḥspr‌k.


:: श्रीमद्भागवते अष्टमस्कन्धे एकविंशोऽध्यायः ::

पदैकेन मयाक्रान्तो भूर्लोकः खं दिशस्तनोः ।
स्वर्लोकस्ते द्वितीयेन पश्यतस्ते स्वमात्मना ॥ ३१ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 21

Padaikēna mayākrāntō bhūrlōkaḥ khaṃ diśastanōḥ,
Svarlōkastē dvitīyēna paśyatastē svamātmanā. 31.


With one step I have occupied Bhūrloka, and with My body I have occupied the entire sky and all directions. And in your presence, with My second step, I have occupied the upper planetary system.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divispr‌k sarvadr‌g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


16 Mar 2022

No comments:

Post a Comment