మైత్రేయ మహర్షి బోధనలు - 89
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 89 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 75. ప్రత్యేక దృష్టి - 1 🌻
మహత్తర విషయములు ఎప్పుడునూ అతి సామాన్యముగ ప్రారంభమగును. ఆర్భాటమసలే యుండదు. నదీ ప్రవాహము పుట్టుకను గమనించినచో పై సత్యము తెలియనగును. కాకతాళీయముగ మహాత్ములచే మహాకార్యములిట్లే ప్రారంభింపబడినవి. మహాత్ముల బోధనలు కూడ నిగూఢ రహస్యముల నిట్లే వెలిబుచ్చు చుండును.
శ్రద్ధ, భక్తి, ఏకాగ్ర దృష్టి కలవారు మాత్రమే వీటిని గమనింపగలరు. ఇతరులకు సత్యపరమైన విషయములు అంతగ గోచరింపవు. ఆరంభము లెప్పుడును సామాన్యముగ నుండుట ప్రకృతి విధానము. శ్రీ కృష్ణ జననము, పరశురామ, శ్రీ రామ జననము ఇత్యాదివి కూడ ఇట్లే సామాన్యముగ జరిగినవి. అందువలన అతి సామాన్య విషయముల యందు అశ్రద్ధ పనికిరాదని మా హెచ్చరిక.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
16 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment