శ్రీ మదగ్ని మహాపురాణము - 20 / Agni Maha Purana - 20


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 20 / Agni Maha Purana - 20 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 8

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. కిష్కిందకాండ వర్ణనము - 1 🌻


నారదుడు పలికెను.

రాముడు పంపా సరస్సు చేరి దుఃఖించెను. పిమ్మట శబరి వద్దకు వెళ్లెను. పిమ్మట హనుమంతడు సుగ్రీవుని వద్దకు తీసికొనిపోగా ఆతనిని తన మిత్రినిగ చేసికొనెను.

సుగ్రీవుడు చూచుచుండగా ఒక బాణము చేత ఏడు తాళవృక్షములను భేదించి, దుందుభి శరీరమును పది యోజనముల దూరము విసరెను.

ఆతని సోదరుడును, వైరము చేయుటచే శత్రవును ఆగు వాలిని చంపి ఋశ్యమూకముపై ఉన్న ఆతనికి కిష్కింధను, వానరరాజ్యమును, రుమను, తారను ఇచ్చెను. సుగ్రీవుడు ఇట్లు పలికెను. ''రామా! నీకు సీత లభించు నట్లు చేసెదను.

రాముడు ఆ మాటలు విని మాల్యవత్పర్వతముపై వర్షాకాలము నాలుగు మానములను గడపెను. కిష్కింధలో ఉన్న సుగ్రీవుడు మరల కనబడక పోగా లక్ష్మణుడ రాముడు చెప్పిన విధమున ఆతనితో ఇట్లు చెప్పెను. ''నీవు రాముని దగ్గరకు వెళ్లుము. వాలి రామునిచే నిహతుడై వెళ్లిన మార్గము ఇంకను మూసివేయబడలేదు. సుగ్రీవా! మాటమీద నిలబడుము. వారి మార్గమును అనుసరించకుము''.

వానరాధిపతి యైన సుగ్రీవుడు ''కార్యాసక్తుడనైన నేను గడచిన కాలమును గుర్తించ జాలకపోతిని'' అని పలికి రాముని వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు పలికెను.

సుగ్రీవుడు పలికెను: వానురరులనందరిని పిలిపించితిని. నీ అభిలాష ప్రకారము వారిని సీతాన్వేషణమ నిమిత్తమై పంపగలను. వారు తూర్పుదిక్కు మొదలైన దిక్కులందు సీతను మానములోపున అన్వేషించవలెను. మాసము దాటినచో వారిని చంపెదను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana -20 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 8

🌻 Kishkinda Kand - 1 🌻

Nārada said:

1. Having gone to the lake of Pampā, Rāma stayed there (that) night thinking (of what to do). Then he was (met and) taken to Sugrīva by Hanūmat. Rāma made friendship (with Sugrīva).

2. After having pierced the seven Tāla trees with a single arrow and (even as others) were seeing, threw away the body of Dundubhi[1] by his foot to a distance of ten yojanas.

3-4. Having killed Vālin,[2] his (Sugrīva’s) enemy, who had been the cause of enmity, he bestowed on him the monkey-kingdom of Kiṣkindhā (as well as) Rumā and Tārā on the Ṛṣyamūka (mountains). That ruler of Kiṣkindhā (Sugrīva) told (Rāma), “I will do in such a way, O Rāma! by which you will be getting back Sītā”.

5-7. Having heard that, he (Rāma) spent the four months on the Mālyavat (mountain). As Sugrīva had not come to Kiṣkindhā to see (Rāma), Lakṣmaṇa (met him and) spoke to him the words of Rāma, “(You) go to Rāghava. The way in which Vālin was killed is not yet closed. O Sugrīva! You stand by at this juncture. Do not take to the course of Vālin.” Sugrīva said, “I did not realize the elapse of time on account of my preoccupation.”

8-9. Saying so, he (Lakṣmaṇa) went away. The lord of the monkeys (Sugrīva) (approached) Rāma, bowed and said, "All the monkeys have been brought in order to search for Sītā. As desired by you, I shall send them. Let them search for Jānakī in the (direction of) east etc. Let them return in a month. (If they come) after a month I will kill them.”


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2022

No comments:

Post a Comment