శ్రీ విష్ణు సహస్ర నామములు - 68 / Sri Vishnu Sahasra Namavali - 68

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 68 / Sri Vishnu Sahasra Namavali - 68 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

అనూరాధ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం

🌻 68. అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ‖ 68 ‖ 🌻

🍀 633) అర్చిష్మాన్ -
తేజోరూపుడు.

🍀 634) అర్చిత: -
సమస్త లోకములచే పూజింపబడువాడు.

🍀 635) కుంభ: -
సర్వము తనయందుండువాడు.

🍀 636) విశుద్ధాత్మా -
పరిశుద్ధమైన ఆత్మ స్వరూపుడు.

🍀 637) విశోధనః -
తనను స్మరించు వారి పాపములను నశింప చేయువాడు

🍀 638) అనిరుద్ధః -
శత్రువులచే అడ్డగింపబడనివాడు.

🍀 639) అప్రతిరథ: -
తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు.

🍀 640) ప్రద్యుమ్న: -
విశేష ధనము కలవాడు.

🍀 641) అమిత విక్రమ: -
విశేష పరాక్రమము గలవాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 68 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Anuradha 4th Padam

🌻 68. arciṣmānarcitaḥ kuṁbhō viśuddhātmā viśōdhanaḥ |
aniruddhōpratirathaḥ pradyumnōmitavikramaḥ || 68 || 🌻

🌻 633. Arciṣmān:
He by whose rays of light (Archish), the sun, the moon and other bodies are endowed with rays of light.

🌻 634. Arcitaḥ:
One who is worshipped by Brahma and other Devas who are themselves the objects of worship in all the worlds.

🌻 635. Kumbhaḥ:
He who contains in Himself every thing as in a pot.

🌻 636. Viśuddhātmā:
Being above the three Gunas, Satva, Rajas and Tamas, the Lord is pure spirit and is also free from all impurities.

🌻 637. Viśōdhanaḥ:
One who destroys all sins by mere remembrance.

🌻 638. Aniruddhaḥ:
The last one of the four Vyuhas - Vasudeva, Samkarshana, Pradyumna and Aniruddhaḥ. Or one who, cannot be obstructed by enemies.

🌻 639. Aprati-rathaḥ:
One who has no Pratiratha or an equal antagonist to confront.

🌻 640. Pradyumnaḥ:
One whose Dyumna or wealth is of a superior and sacred order. Or one of the four Vyuhas.

🌻 641. Amitavikramaḥ:
One of unlimited prowess. Or one whose prowess cannot be obstructed by any one.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 104

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 104 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 9 🌻

433. అంతర్ముఖ చైతన్య ప్రగతిలో, ఒకటవ భూమికనుండి ఆరవభూమిక వరకు క్రమక్రమముగా వివిధమైన భిన్నసంస్కారములు నామాత్రా విశిష్టమై (ఇంకా అసలు సంస్కారములే లేవు అన్నంతవరకు) పూర్తిగా క్షీణించి పోయినవి. కానీ ద్వంద్వ సంస్కార అవశేషముల చూఛాయ "జాడ" మాత్రము మిగిలియున్నది.

434. ఇచ్చట మానవునిలోనున్న భగవంతుడు మనస్సుతో తాదాత్మ్యమును చెంది "నేను మనస్సు" ననెడి అనుభవమును పొందు చుండును.

435 ఆరవ చైతన్య భూమికలో మానవుని స్థితిలో నున్న మానసిక చైతన్యుడైన భగవంతుడు, భగవంతుని ముఖాముఖీ సుస్పష్టముగా చూడగలిగి నప్పటికీ భగవంతుని సమస్తములో సర్వత్రా చూచుచున్నప్పటికీ, తానింకను మానసిక చైతన్యమందు హత్తుకు పోయి, మనస్సే తాను, తానే,-మనస్సు అన్నట్టి స్థితి యండుండుటచేత; తనను భగవంతునిలో చూడలేకున్నాడు. 

436.ఇతడు భౌతిక సూక్ష్మ లోకములందలి వస్తువులను కూడా చూడగల్గును.ఇంకనుద్వైతమునందే, ఎరుక కలవాడై యున్నాడు.తాను "మనస్సు"గా, భగవంతుని నుండి వేరగుచున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2020

శివగీత - 119 / The Siva-Gita - 119

🌹. శివగీత - 119 / The Siva-Gita - 119 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 15

🌻. భక్తి యోగము - 8 🌻

పయసా సర్పిషా చాపి - మధు నేక్షుర సేనవా,

పక్వామ్ర పలజే నాపి - నారికేళ జలేన వా 36

గందో దకేన వామాం యో -రుద్ర మంత్రం సముచ్చరన్,

అభిసిం చేత్తో నాన్యః కశ్చిత్ప్రి యతమో మమ 37

అధిత్యాభి ముఖో భూత్వా - హ్యూర్ధ్వ బాహుర్జలె స్థితః,

మాం ధ్యాయ న్రవి బింబస్త - మధర్వాంగిరసం జపేత్ 38

ప్రవిశేన్మే శరీర రేసౌ -గృహం గృహ పతిర్యదా,

బృహ ద్రధం తరం వామ - దేవ్యం దేవ వ్రతానిచ. 39

తద్యోగ యాజ్య దేహాంశ్చ - యోగాయతి మమాగ్రతః,

ఇహ శ్రియం పరాం భుక్త్వా -మమ సాయుజ్య మాప్నుయాత్ 40

ఈశావాస్యాది మంత్రాన్యో - జపేన్నిత్యం మమాగ్రతః,

మత్సా యుజ్య మవాప్నోతి - మమ లోకే మహీయతే 41

భక్తి యోగో మయా ప్రోక్త - ఏవం రఘుకులో ద్వహ,

సర్వ కామ ప్రదో మత్తః కి - మన్య చ్చ్రో తు మిచ్చసి.42

ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతాయాం పంచ దశో ధ్యాయః

బృహద్రధం తరమున వామ దేవ్యమును, దేవవ్రతములను వీటికి సంబందించిన యాగము (యజ్ఞము ) చేయ కావలసిన మంత్రములను నా యెదుట నెవడు గానము చేయునో అట్టివాడు ఇహలోకములో సమస్త సంపదలను పొంది యంత్య సమయమున మత్సా యుజ్యమును బడయును.

ఎవడీ శావాశ్యాది మంత్రములను నా ఎదుట ప్రతి నిత్యము జపించునో వాడు నా సాయుజ్యమున పొందును. కావున ఓయీ దాశరధీ! భక్తియోగము నీ చేత నిట్లు పదేశింప బడినది . ఇది సమస్త కోరికలను మోక్షము నొసగును. ఇకను నేమి యడుగ నుంటివో ప్రశ్నింపుము.

ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గత మైన శివ గీతలో పదునైదవ అధ్యాయము సమాప్తము

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 119 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 15

🌻 Bhakthi Yoga - 8 🌻

With milk, ghee, honey, sugarcane juice, mango juice, coconut water, sandal paste, using any of these substances one who does Abhishekam to be uttering Rudra hymns, there is none who is more dearer than him to me.

One who stands inside the water facing east and raising his two hands upwards considering me in the rising sun one who chants the Atharvangirasa hymns would merge in me as easily as one enters freely in his own house without any restrictions.

The sacrifices related to Vamadevyam, Devavratam, Brihadradantam one who performs for me he would gain all riches in his life and after death would reach my abode. one who regularly chants the hymns of the ISavasya upanishad, they would reach my abode.

Therefore O son of Dashratha!, this Bhakti Yoga as preached by me when read by anyone, has the capability to fulfill all desires and gives salvation. if you have further questions to ask, you may do so.

Here ends the 15th chapter of Shiva Gita from padma Purana Uttara khanda

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 165

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 165 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జాబాలిమహర్షి - 5
🌻

25. నేటి గుజరాత్‌లో, గోపాలకుడైన సాక్షాత్తూ శ్రీకృష్ణుని నగరమైన ద్వారాపట్టణంలోనే గోవుల పరిస్థితి పరమదారుణంగా ఉంది! ద్వారకా పట్టణం, కృష్ణపూజ, గోపూజ, కృష్ణాష్టమి అని ఏవేవో పండుగలు చేసుకుంటాం, మనం వండుకుని తినడానికి! పిండివంటలు వండుకోవటానికే మనం ఈ పండుగలు చేసుంకుంటున్నామా అనిపిస్తుంది.

26. కనీసం కృష్ణాష్టమి నాడైనా మనం గోవులను స్మరిస్తున్నామా? ధర్మాన్ని ఆచరిస్తున్నామా? ఎంత భ్రష్టత్వం వచ్చిందంటే, ఇంతకన్నా దుఃఖం ఏమీలేదు.

27. ఎంతో అజ్ఞానం, ఎంతో నిస్పృహ, జడత్వం, మొండితనం ఉంటే తప్ప అవి చూడలేము. చూచి తట్టుకోలేము. జీవనోపాధికోసమేనా ఇటువంటి భయంకరమైన పాపాలుచేయటం! కోటానుకోట్ల జీవరాశులను కేవలం చంపటానికై పుట్టిస్తున్నారు. చేపలనో, కోళ్ళనో, పశువులనో – చంపటంకోసమే నేడు పుట్టిస్తున్నారు.

28. సహజంగా జీవకోటి ఎంత ఉందో, ఆ ఉన్నవాటిలో, తమకు అవసరమైనంత వరకు, దొరికినంత మటుకు చంపటం కాదు. వాటిని వ్యాపారం కోసం పుట్టించి చంపటమే ఘోరమయిన విషయం! అయితే ఎందుకు ఇదంతా చెయడం, దేనికోసం అంటే ధనం కోసమే! అమితమైన భోజనం ఉన్నవాళ్ళే వీళ్ళందరూ. వీళ్ళకు అన్నవస్త్రాదులకు లోటులేదు. దారిద్య్రం లేదు. జీవనం సుఖంగా ఉంది. సిరిసంపదలు ఉన్నవి. కాని ధనదాహం!

29. లోపల భారతీయుడి మనస్సులో కాస్తయినా ఆర్యధర్మం మిగిలి ఉంటే, ఈ ఘోరమయిన పాపమ్యొక్క ఫలం ఎలా ఉంటుందో గ్రహించగలడు. కానీ లోపల ఉండవల్సిన ఆ ధార్మికబుద్ధి, ఆ జ్ఞానమూ ఎందుకు పోయింది? ఈ ధనాశ – ధనపిశాచం ఎప్పుడయితే వచ్చిందో, ధర్మం హరించుకుపోయింది.

30. పిశాచాలు ఉన్నచోట దేవతలు ఉంటారా? ఆ ధనపిశాచం లోపలికిరాగానే హృదయంలో ఉన్న దివ్యత్వం, ఆర్యసంస్కృతి, ఋషులు అంతా ఎక్కడికో పోతారు. కాబట్టే ఈ దౌర్భల్యం ఏర్పడింది. ఈనాడు మన దేశ పరిస్థితులు ఇలా ఉండటానికి కారణం అదే!

31. పాపం పెరిగిపోయిన తరువాత నిదర్శనం ఏముంటుంది? కొంచెం పుణ్యం, కొంచెం పాపంతో ఉండేవాడు; కొంచెం పాపం చేసినట్లయితే, “ఈ పాపం చేస్తున్నావు జాగ్రత్త!” అని స్వప్నంలో ఎవరో కనబడి చెప్పటం జరుగుతుంది. పూర్తిగా పాపంలో ఉండేవాడికి ఎవరూ కనబడరు.

32. కాబట్టి పుణ్యపాపమిశ్రమ జీవనంలో, పుణ్యంమీద శ్రద్ధ ఉండేవాడికి పాపక్షయం అయ్యే అవకాశం ఉంది. ఈ కారణంచేత నేడు మన దేశంలో ఏ క్షణాన ఏమవుతుందో ఎవరిఖీ తెలియని స్థితి వచ్చింది.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2020

శ్రీ శివ మహా పురాణము - 277

🌹 . శ్రీ శివ మహా పురాణము - 277 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

65. అధ్యాయము - 20

🌻. సతి కైలాసమునకు పయనమగుట - 4 🌻

అపుడు శివుడు మార్గమధ్యమునుండి ప్రీతితో దక్షుని వెనుకకు పంపెను. ప్రేమతో నిండిన హృదయము గల శంభుడు గణములతో గూడి తన ధామను చేరుకొనెను (51). శివుడు విష్ణువు మొదలగు దేవతలకు వెనుకకు మరలుడని అనుజ్ఞ ఇచ్చెను. కాని వారు పరమానందముతో, భక్తితో శివుని వెనుక వెళ్లిరి (52).

శివుడు వారందరితో, తన గణములతో, మరియు తన భార్యతో గూడి హిమవత్పర్వతమునందు ప్రకాశించేతన ధామమును ఆనందముతో చేరుకొనెను (53). అచటకు చేరిన పిదప, దేవతలను, మునులను, ఇతరులను అందరిని ఆదరముతో మిక్కిలి సన్మానము చేసి ఆనందముతో సాగనంపెను (54).

ఆ విష్ణువు మొదలగు దేవతలు, మునులు అందరు శివునితో మాట్లాడి, నమస్కరించి, స్తుతించి, ఆనందముతో నిండిన ముఖములు గల వారై తమ తమ స్థానములకు వెళ్లిరి (55). శివుడు కూడ లోకరీతిని అనుసరించు వాడై తన భార్యయగు దాక్షాయణితో గూడి మిక్కిలి ఆనందించిన వాడై హి మవత్పర్వత మైదానములలో విహరించెను (56).

జగత్కారణమగు ఆ శంకరుడు సతీ దేవితో గూడి ఆనందముగా నుండెను. ఓ మహర్షీ! కొంతకాలము తరువాత ఆయన పర్వత రాజమగు కైలాసమును చేరుకొనెను (57). స్వాయంభువ మన్వంతరములో పూర్వము వృషభవాహనుని వివాహము జరిగినది. ఆ వృత్తాంతమునంతనూ నేను మీకు చెప్పితిని (58).

వివాహసమయము నందుగాని, యజ్ఞ ప్రారంభమునందుగాని ఎవరైతే వృషభధ్వజుని చక్కగా పూజించి స్థిరచిత్తులై ఈ గాథను వినెదరో (59), వారికి ఆ వివాహాది శుభకర్మలన్నియూ సర్వదా నిర్విఘ్నముగా కొనసాగును (60).

ఈ శుభగాథను ఆనందముతో వినే కన్య సుఖసౌభాగ్యములతో, శీలాచారములతో, సద్గుణములతో కూడినదై పతివ్రతయై పుత్ర సంతానమును పొందును (61).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహిత యందు సతీఖండలో సతీ వివాహ వర్ణనమనే ఇరువది యవ అధ్యాయము ముగిసినది (20).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2020

గీతోపనిషత్తు - 80

🌹. గీతోపనిషత్తు - 80 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 18. అమలిన కర్మ - చిత్తమునకు ఏడు గుణములబ్బును. అవి ఈ విధముగ నున్నవి. 1. కోరికలేమి, 2. నిస్సంకల్పము, 3. కర్మఫల సంగత్యాగము, 4. నిత్యతృప్తి, 5. నిరాశ్రయత, 6. నిరాశ, 7. అపరిగ్రహము. ఈ ఏడు గుణము లబ్బినచో నిగ్రహింపబడిన చిత్తము గలవాడై యుండును. అట్టివాడు నిర్వర్తించు కర్మల నుండి బంధనము పుట్టదు. 🍀

📚. 4. జ్ఞానయోగము - 21 📚

నిరాశీ ర్యతచిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః |

శారీరం కేవలం కర్మ కుర్వ న్నాప్నోతి కిల్బిషమ్ || 21

ఆశ లేనివాడును, చిత్త నిర్వహణము కలవాడును, ఏ వస్తువును పరిగ్రహింపనివాడును చేయు కర్మనుండి ఎట్టి పాపము (మలినము) పుట్టదు అని యర్థము. 19వ శ్లోకమున సంకల్పము, కోరిక లేకుండుటను గూర్చి దైవము తెలిపినాడు. 20వ శ్లోకమున నిత్యతృప్తి, నిరాశ్రయత, కర్మఫలసంగ త్యాగము తెలిపినాడు. ఈ శ్లోకమున ఆశ లేకుండుట, అపరిగ్రహము, చిత్త నిగ్రహము తెలిపినాడు.

ఆశ లేనివానికి చిత్తము పలువిధముల పరుగులెత్తదు. ఆశ, కోరిక లేక తృప్తిగ జీవించువానికి, చిత్తము స్థిరపడి సంకల్పములు లేని స్థితి కూడ కలుగును. దీనికి అపరిగ్రహము తోడైనచో చిత్తము లోతుగ స్థిరపడును. ఈ శ్లోకము చేరుసరికి చిత్తమునకు ఏడు గుణములబ్బును. అవి ఈ విధముగ నున్నవి.

1. కోరికలేమి, 2. నిస్సంకల్పము, 3. కర్మఫల సంగత్యాగము, 4. నిత్యతృప్తి, 5. నిరాశ్రయత, 6. నిరాశ, 7. అపరిగ్రహము.

ఈ ఏడు గుణము లబ్బినచో నిగ్రహింపబడిన చిత్తము గలవాడై యుండును. అట్టివాడు నిర్వర్తించు కర్మల నుండి బంధనము పుట్టదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 98, 99 / Sri Lalitha Chaitanya Vijnanam - 98, 99

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 54 / Sri Lalitha Sahasra Nama Stotram - 54 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 98 / Sri Lalitha Chaitanya Vijnanam - 98 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖

🌻 98. 'సమయాచారతత్పరా' 🌻

వైదిక సమయాచారములతో పూజించు పద్ధతియందు మిక్కిలి ఆసక్తి చూపునది శ్రీదేవి యని అర్థము.

వైదిక షోడశ ఉపచార పూజావిధానము, శ్రీచక్ర పూజా విధానము గురుముఖమున పొంది వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో శ్రీదేవిని ఆరాధించుట, గురుముఖమున పొందిన యోగమును కూడ వినయ విధేయతలతో భక్తిశ్రద్ధలతో నిర్వర్తించుకొనుట సమయాచారమని తెలియబడుచున్నది.

1. గురు కటాక్షము (ఉపదేశము),

2. 2. వినయము,

3. 3. విధేయత,

4. భక్తి,

5. 5. శ్రద్ధ.

శ్రీదేవి పూజనమునకు గాని, యోగ మార్గముద్వారా ఆమె ప్రచోదనమునకు గాని, అత్యవసరమగు అర్హతలు. ముందు తెలుపబడిన నామములలోవలె 6. అప్రకటితుడై, 7. దీక్షితుడై ఆరాధకుడు, ఆరాధనము కావించవలెను. 8. సాధనా మార్గమున దృఢత్వము, 9. నిత్యానుసంధానము అవసరము.

ఇట్లే తొమ్మిది లక్షణములతో అభ్యాసము చేయువానికి కాలక్రమమున కుండలినీ శక్తి (శ్రీదేవి) మూలాధారము నుండి ఊర్థ్వముఖియై మణిపూరకమును చేరును. అపుడారాధనమున శ్రీదేవి పాదపూజ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వర్తించుకొనుచు, ఆ పాదముల దివ్యకాంతి వైభవము ఊహించుచు దర్శించుటకు ప్రయత్నింప వలెను.

నలుబది నాలుగవ నామమున శ్రీదేవి పాదముల గోళ్ళనుండి ప్రసరించు దివ్యకాంతులు అజ్ఞానమును తొలగించి, జ్ఞానము నొసగునని తెలుపబడినది. రజస్తమోగుణములు హరింపబడి సత్త్వగుణము ఆవిష్కరింప బడుటకు దేవి పాదములను హృదయమందు అత్యంత సుందరముగను, కోమలముగను, కాంతివంతముగను, అలంకార యుతముగను, పసుపు పారాణి దిద్దబడిన వానిగను, గోళ్ళనుండి తేజోమయమగు కాంతులు విరజిమ్ము చున్నట్లుగను, ఊహించుట, భావించుట, దర్శించుట చేయవలెను.

అనుపమానము, అతి సుందరము, అత్యంత శక్తిమంతము అగు పాదములను ఆరాధన చేయుటమే ముఖ్యము. పాదధ్యానము చేతనే, అజ్ఞానము నాశన మగును. హృదయమందలి కల్మషములు

హరింపబడుట కిది యొక్కటియే మార్గము. ఈ సందర్భమున 44, 45, 46 నామములు మరల పఠించుట ఉత్తమము.

హృదయమున కల్మషములు హరింపబడగా, స్తోత్రాదికములు గావించి, తాంబూలాది పర్యంతము శ్రీదేవికి హృదయమున ఉపచారములు చేసినచో దేవి చైతన్యము హృదయము నుండి ఊర్ధ్వగతి చెంది విశుద్ధిని చేరగా మణిమయ కాంతులతో కూడిన దేవి దర్శనము కాగలదు.

అవి అన్నియు శ్రీదేవి చంద్రకళా కాంతులు. అటుపైన మంగళహారతి సమయమునకు ఆజ్ఞను చేరిన శ్రీదేవి ధ్యాన పరవశులైన ఆరాధకులకు సహస్రదళ కమలమునందు సదాశివునితో చేరును. శ్రీరామకృష్ణ పరమహంసవంటి మహాభక్తులీ విధముగ దేవి పూజనమున సర్వమును పొందిరి.

ఆ మహాత్మునికి దేవిని పూజించు చుండగ లోన సుషుమ్న మార్గమున మూలాధారమున నున్నదేవి, ఊర్థ్వగతి చెందుచు, తరచూ సహస్రారము చేరుచుండెడిది ఆయన తన్మయుడై సమాధిస్థితి పొందుచు నుండెడివాడు.

ఇటీవలి కాలమున శ్రీరామకృష్ణుని కన్న పరమభక్తుడు మరియొకరు గోచరింపరు. అమ్మ అనుగ్రహమున అతను సమస్తమును తెలుసుకొనెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 98 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Samayācāra-tatparā समयाचार-तत्परा (98) 🌻

Worshipping Lalitai in the cakra-s of kuṇḍalinī, beginning from mūlādhāra cakra is called samayācāra.

This is explained in Rudrayāmala, an ancient scripture, as told by Śiva Himself to Śaktī. This nāma means that She likes samayācāra worship.

This worship can be done only mentally. Initiation from a Guru is the first step in this worship. This initiation will culminate in pūrṇa abhiṣeka (mantra bath) that will be performed by guru to the disciple.

The initiation by the guru will make the kuṇḍalinī ascend from the perineum to the six cakra-s. Guru will guide his disciple at each level and at each cakra. Guru will not perform the mantra bath on the disciple unless he is convinced that the disciple has attained a particular stage from where, the disciple could carryon on his own.

Guru also will not perform this ritual unless the disciple pursues the right path of Self realisation. After this ritual of mantra bath, there is yet another ritual called mahā veda samskāra, a fire ritual. 

This mahā veda saṃskāra will be done only on the day of mahā navami (ninth day of Dasara celebrations) which occurs once in a year. (After completing all such formalities, the sādhaka (practitioner) will have to go to an isolated place and commences his samayācāra meditation, i.e. meditation on the six cakra-s and the sahasrāra. There is a prescribed procedure for this worship.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹.

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 99 / Sri Lalitha Chaitanya Vijnanam - 99 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ‖ 38 ‖

🌻 99. 'మూలాధారైక నిలయా' 🌻

మూలాధారము తన నివాస స్థానముగ గలది శ్రీదేవియని అర్థము.

మూలమున శక్తి, శిరస్సు పైభాగమున శివుడు, రెంటిని అనుసంధానము చేయు సుషుమ్న, వీని మధ్య సమస్త లోకములు భావింప వచ్చును. మూలాధార చక్రమున కుండలినీ శక్తి నిద్రించుచుండును. ఉపదేశ మార్గమున దేవి మేల్కాంచగలదు. సృష్టి యందామె స్థానము మూలయే. సహస్రారము చేరినచో శివునితో ఐక్యము చెందును. అప్పుడు సృష్టి అదృశ్యమగును. ఆమె శివుని నుండి దిగివచ్చుటయే సృష్టి. మూలాధారమున స్థిరముగ నుండుట స్థితి. తిరోధానము చేయుట లయము.

యోగము, ఆరాధనము, మార్గముల ద్వారా జీవుడు తిరోధానము చెందుటకు కూడ అమ్మయే సూత్రధారిణి, ఆమె జీవుని సుషుమ్న మార్గము ద్వారా ఊర్ధ్వమునకు గొనిపోవుచుండగ జీవునికి మాయా మోహములు వీడును. తాను శివశక్తి స్వరూపుడే అని తెలియును. వెంట నుండి జీవుని దేవుని వద్దకు తోడ్కొనిపోవునది అమ్మయే. జీవుని వెన్నంటి యుండి వానికి సమస్త లోకానుభవము అందించి, సర్వవిధముల పరితృప్తిని గావించి పరిపూర్ణుని చేయును. ఏయే జీవునకు, ఏ అనుభూతి కలుగవలెనో నిర్ణయించి, తదనుభూతి నందించి పరితృప్తుని గావించుచు తోడ్కొని పోవును.

ప్రతి పద్మమునందు గల ప్రతి దళము ఒక లోకానుభవమునకు సంకేతము. మూలాధారము నుండి సహస్రారమునకు గల మార్గమున

అన్ని పద్మముల దళముల అనుభూతులు పూర్తి గావించుచు ముందుకు తోడ్కొని పోవునేగాని అసంపూర్ణముగ తోడ్కోనిపోవుట యుండదు. జగన్మాతకు జీవులందరు తన సంతానమే యగుట వలన, అందరునూ శివ సమాను లవవలెనని భావించు చుండును. శివుడు పరిపూర్ణుడు. తన భర్త. తన సంతానము కూడ భర్తతో సరిసమానమగు పరిపూర్ణతను పొందుటకు శ్రీదేవి చేయు కృషి అనిర్వచనీయము. సమస్త గురు పరంపర జీవోద్ధరణమునకు ఆమె నియోగించు యోగసైన్యము.

అదియొక మహా సైన్యము. అమ్మ అనుగ్రహ విశేషముతో వారు కారుణ్యమూర్తులై జీవుల నుద్ధరించుటయే తమ జీవనముగ సృష్టియందు నిలచియున్నారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 99 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mūlādhāraika-nilayā मूलाधारैक-निलया (99) 🌻

She resides in mūlādhāra cakra. Mūla means root and ādhāra means support. That is why mūlādhāra cakra is called the base (foundational) cakra. A detailed study of mūlādhāra cakra is made from nāma-s 514 to 520.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 112 / Sri Gajanan Maharaj Life History - 112

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 112 / Sri Gajanan Maharaj Life History - 112 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 20వ అధ్యాయము - 7 🌻

అదే విధంగా శ్రీగజానన్ మహారాజు కృపవల్ల, దాదా కొల్హాట్కరుకు కుమారుడు కలిగాడు. అతని పేరు రాజా. ఈ యొగి కృపకి హద్దులులేవు. 16 సం. వయసుగల శ్రీరామచంద్రపాటిల్ కుమార్తె చంద్రభాగకు కష్టతరమైన కాన్పు అయింది. సాధారణంగా కాన్పు అనేది, స్త్రీ జాతికి, బాధతో కూడిన విషయం.

ఆనవాయితీ ప్రకారం లాడెగాం నుండి తన తల్లి ఇంటికి కాన్పుకు వచ్చింది. కాన్పు తరువాత కొన్నిరోజులు జ్వరంతో బాధ పడింది. దానిని మొదట టైఫైడుగా ఘోషించారు. చాలామంది వైద్యులు చికిత్స చేసారు కానీ జ్వరం తగ్గలేదు. ప్రతి వైద్యుడు ఆమెవ్యాధిని వేరు వేరుగా విశ్లేషించారు. వారి అభిప్రాయాలలో ఏకతలేదు. ఈ ఫలితం లేని చికిత్సలతో అలసిపోయి, చికిత్సకోసం శ్రీమహారాజును శరణు కోరడం కోసం పాటిల్ నిర్ణయించాడు. 

శ్రీగజానన్ మహారాజును ధ్యానిస్తూ ఆమెకు విభూది, తీర్ధం అతను ఇవ్వడం మొదలు పెట్టాడు. శ్రీమహారాజులో అతనికి ఉన్న గొప్ప విశ్వాశానికి చంద్రభాగ కోలుకుంటున్న చిహ్నాలు కనిపించాయి. ఒకానొక సమయంలో మంచమీదనుండి కదలలేని ఆమె, ఇప్పుడు శ్రీమహారాజు దర్శనానికి వెళ్ళగలుగుతోంది. 

శ్రీమహారాజు యొక్క విభూది మరియు తీర్ధం ప్రభావం అటువంటిది. తనలో నిజమయిన విశ్వాసం ఉన్నవాళ్ళని భగవంతుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారు, కాబట్టి తాముచేసే పూజలలో భక్తులకు అచంచలమైన విశ్వాసం ఉండాలి. 

రామచంద్రపాటిల్ భార్య అయిన జనక్ బాయి, విధిరాతవల్ల పడవలసిన బాధలనుండి తప్పించుకోలేక పోయింది. ఉదర సంబంధమయిన బాధతో ఆమెకు నిరంతరం కడుపు నొప్పిగా ఉండేది. మందులు తాత్కాలిక ఉపశమనం ఇచ్చేవి, ఆమె బాధలు కొనసాగాయి. 

చివరికి ఈ వ్యాధి ఆమె మెదడును దెబ్బతీసింది. ఆమె వెర్రిదానిలా ప్రవర్తించడం మొదలు పెట్టింది. ఆమె మాట్లాడే మాటమీద అంకుశం తప్పి ఒకోసారి ఆకలి వేస్తున్నా జ్ఞానంకూడా ఆమెకు పోయేది. కొంతమంది క్షుద్రశక్తులు ఆమెను వెంటాడుతున్నాయన్నారు. మరికొంతమంది అదొకరకమైన వ్యాధి అని విశ్లేషంచారు. 

పాటిల్ సత్తా ఉన్న అధికారి అవడంవల్ల గ్రామంలో చాలామంది శత్రువులను శృష్టించుకున్నాడని, వాళ్లలో శక్తిలేని వాళ్ళు ఎదురు తిరగలేక ఈవిధమయిన గారడి ప్రయోగించారు అని వాళ్ళు అన్నారు. మందులు అన్నివిధాలయిన ఉపశమనాలు ప్రయత్నించారు, పాటిల్ ధనవంతుడు అవడంతో కొంతమంది దుష్టులు చాలా మోసగించారు. ఈ నిమిత్తం అతను చాలాధనం ఖర్చుచేసాడు. కానీ భార్యకు ఏవిధమయిన ఉపశమనం కలగలేదు. 

ప్రయత్నాలన్నిటితో విసిగిపోయి, ఇక శ్రీగజానన్ మహారాజు మావైద్యుడు, యోగి, భగవంతుడు సర్వస్వం. నాభార్య ఆయన కోడలు. అదినా నమ్మకం, కాబట్టి ఆమెకు మరి ఏవిధమయిన చికిత్స అవసరంలేదు అని అతను అన్నాడు. ఆ తరువాత తన భార్యను ఉదయాన్నే తొందరగా లేచి, స్నానంచేసి మఠానికి వెళ్ళి శ్రీగజానన్ మహారాజు సమాధికి రోజూ ప్రదక్షిణాలు చెయ్యమన్నాడు. ఆమె తన భర్త మాటను పాటించి ఆయన సలహా ప్రకారం చెయ్యడం మొదలు పెట్టింది. ఆప్రదక్షిణాలు వృధాకాలేదు, ఆమె వ్యాధినుండి విముక్తి పొందింది. 

నిజాయితీగా అసలయిన యోగులకు చేసిన సేవ ఎప్పటికీ వృధాకాదు, కానీ అది పూర్తి అచంచలమైన విశ్వాసంతో చెయ్యాలి. శ్రీగజానన్ మహారాజు తరువాత బాలాభవ్ ఆయన స్థానం గ్రహించి, కొన్ని చమత్కారాలు చేసాడు. వైశాకశుద్ధ షష్టినాడు ఇతను షేగాంలోనే వైకుంఠం పొందాడు. తరువాత అతని స్థానం నారాయణ గ్రహించాడు. 

బాలాభవ్ వైకుంఠం ప్రాప్తిపొందినప్పుడు, నారాయణకు నందూరాలో శ్రీ గజానన్ మహారాజు కలలో కనబడి, షేగాం వెళ్ళి భక్తులను కాపాడవలసిందిగా చెప్పారు. నారాయణ కొన్నాళ్లు అధికారంలో ఉండి, చైత్రశుద్ధ షష్టి నాడు సమాధి తీసుకున్నాడు. యోగులకు సేవ చెయ్యడం అనేది గొప్ప పుణ్యకార్యం, కానీ పూర్వం చేసిన మంచి పనులు మన భాగంలో లేకపోతే ఇది సాధ్యంకాదు. ఆకాశంలో నక్షత్రాలలా శ్రీగజానన్ మహారాజు గొప్పతనాలు లెఖ్కలేనివి. 

నేను బుద్ధిహీనుడిని, తెలివిలేని వాడిని, కాబట్టి మహాసాగరం వంటి శ్రీమహారాజు జీవితంగురించి వర్ణించలేక పోయాను. ఆయన నాచేత ఎంత చెప్పిచారో అంతేనేను చెప్పాను. కలం రాసినా, ఆరాయడం అనే గొప్పతనం కలందికాదు. కలం పట్టుకున్న వాడు వ్రాసాడు. కలం రాయడంలో ఒకసాధనం మాత్రమే. ఇదే ఈవిషయంలో కూడా. నేను కలాన్ని అయ్యాను. మరియు రాసిన వారు శ్రీగజానన్ మహారాజు. నేను ఈ పవిత్ర గ్రంధం వ్రాయడం ఆయనవల్లనే. 

ఓ శ్రోతలారా దీనికి ఎంతమాత్రం నేను మెప్పు పొందదగను. కావున దాసగణు రచించిన ఈ గజానన్ విజయ గ్రంధం చివరికి చేరుతోంది. ఇక చివరి అధ్యాయం ముందు ఉంది. 

శుభం భవతు, శ్రీహరి హరార్పణమస్తు 

20. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 112 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 20 - part 7 🌻

The lady, who once could not move from her bed, was now able to go to the Samadhi of Shri Gajanan Maharaj for Darshan. That was the effect of the Udi and Tirtha of Shri Gajanan Maharaj . 

God always blesses them, who have real faith in him. The devotee, therefore, should have full and unshakable faith in the subject of his worship. Janakabai, wife of Ramchandra, could not escape the sufferings destined for her. Due to gastric trouble, she used to have continuous stomach ache. 

The medicines used to give her only temporary relief. At last the ailment affected her brain and she started behaving like a lunatic. She lost control on what she said and at times lost sense of hunger also. Some said that evil spirits haunted her, while others diagnosed it as some sort of a disease. 

They said that Patil, being an executive officer of the village, had created many enemies and the weaker ones, unable to retaliate, must have tried a magic spell on his wife. Medicines and all the other types of remedies were tried, and Patil, being a rich man, was fully exploited by unscrupulous people. 

In the process, he spent lot of money, but his wife did not get any relief. Tired of all these efforts, he said, “Now Shri Gajanan Maharaj will be our doctor, saint, God and everything. My wife is his daughter in law. That is my belief and so she needs no other remedies hereafter.” 

Then he asked his wife to take a bath early in the morning, go to the Math and perform Pradakshina of the Samadhi of Shri Gajanan Maharaj every day. She obeyed her husband and started doing as advised. The Pradakshinas were not wasted and she was cured of her ailment. 

Sincere service to a real saint is never wasted, but it should be done with full and unshakable faith. After Shri Gajanan Maharaj, Balabhau took his place and performed somw miracles. He attained Vaikunth at Shegaon on Vaisakh Vadya Shashty, and Narayan then took his place. 

When Balabhau attained Vaikunth, Shri Gajanan Maharaj appeared in Narayan’s dream at Nandura and told him to go to Shegaon and protect to devotees going there. Narayan held the authority for some days and, then, went into Samadhi on Chaitra Sudha Shashty. 

Service to a real saint is great Punya, but it is not possible without past good deeds to your credit. Like the stars in the sky, the legends of Shri Gajanan Maharaj are uncountable. I am an ignorant man and so am unable to describe the ocean like life of Shri Gajanan Maharaj. I have said only that much, which has been told by him to say. 

The pen writes, but it recieves no credit for the writing. In fact, the one who holds the pen writes. A pen is only a means to do that writing. Some is the case here; I have become a pen and the writer is Shri Gajanan Maharaj. It is by His grace, that I have written this Holy Book. 

O listeners, I own no credit for this at all. So, this Gajanan Vijay Granth, composed by Dasganu, is nearing the end and now the final chapter is ahead. 

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Twenty 

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 108

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 108 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -38 🌻

ఆగ్ర్యమ్య బుద్ధి అంటే అగ్రస్థితిలో వున్నటువంటి బుద్ధి. మనం ఇప్పటి వరకూ మాట్లాడుకున్న అంశాలను స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారు. మీ ఇంట్లో ఒక వజ్రం ఉందనుకోండి. ఆ వజ్రాన్ని ఎక్కడ పెడుతారు సాధారణంగా? మీ వంటింట్లో ఉన్నటువంటి కప్పులు, సాసర్లు, బిందెలు, గిన్నెలు... అక్కడ వెతికారు అనుకోండి, ఆ వజ్రం కనబడుతోందా?

సాధారణంగా ఈ వజ్రమంత విలువైన దానిని ఎక్కడ పెడుతాము? ఎక్కడో ఒక చోట భద్రమైనటువంటి స్థితిలో పెడుతాము. భద్రమైనటువంటి స్థానంలో పెడుతాము. ఎందుకని? చాలా విలువైనది కాబట్టి. మరి వాటిని సామాన్యంగా మనం వెతికితే, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పడవేసి వెతికితే అది కనపడుతుందా అంటే, ఆ వస్తువులన్నిటిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది.

అట్లాగే మనలో భద్రమైనటువంటి స్థానంలో, భద్రమైనటువంటి స్థితిలో స్వస్వరూప జ్ఞానమున్నది, స్వప్రకాశము కూడా ఉన్నది. అదే ఆత్మ. అర్థం అయ్యిందా అండి. బుద్ధి గుహయందు ఉన్నటువంటి హృదయాకాశ స్థానములో, నిరంతరాయంగా వెలుగుతూ ఉన్నటువంటి, స్వప్రకాశము ఏదైతే ఉన్నదో అది ఆత్మ. ఇది భద్రంగా ఉంది. అతి సూక్ష్మంగా ఉంది, గుహ్యంగా ఉంది, రహస్యంగా ఉంది, భద్రమైన స్థితిలో వుంది, భద్రమైన స్థానంలో ఉంది.

ఒక్కొక్కదానిని విరమించుకుంటూ, ఒక్కొక్క దానియందున్న సంగత్వాన్ని పోగొట్టుకుంటూ, ఆసక్తులను పోగొట్టుకొంటూ, ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోకి మరలడం ద్వారా, మనస్సును మరలించడం ద్వారా, నీ మనస్సు సదా గిన్నెల చుట్టూ, సదా విషయముల చుట్టూ, సదా తినే పదార్థముల చుట్టూ, సదా భోగించేటటువంటి లక్షణాల చుట్టూ, మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు, ఏ బట్టలు కట్టుకుందాం? ఏ భోజనం చేద్దాం? ఏ రకంగా సుఖాన్ని పొందుదాం? ఏ రకంగా విశ్రాంతి తీసుకుందాం? ఏ రకంగా అలంకారం చేద్దాం? ఈ రకంగా బాహ్యమైనటువంటి విషయాల చుట్టూ, బాహ్యమైనటువంటి వస్తువుల చుట్టూ, మనస్సు పనిచేస్తూ ఉంటే, బుద్ధి కూడా మనసును అనుసరించి, నిర్ణయాలు చేస్తూ ఉంటుంది బాహ్యముగానే.

ఏ నివృత్తి మార్గానికి, స్వస్వరూప ఆత్మజ్ఞానానికి, ఉపయోగపడవలసినటువంటి బుద్ధి ఉన్నదో, దానిని బాహ్యమైనటువంటి విషయాల కొరకు, బాహ్యమైనటుంవంటి వస్తు జ్ఞానము కొరకు, వ్యవహార నిర్ణయము కొరకు, వాడుకోవడం ఎటువంటి దంటే, కంట్లో ఆపరేషన్‌ చేయడానికి ఉపయోగించ వలసినటువంటి కత్తిని, కూరగాయలు కోయడానికి ఉపయోగించ రాదా? అంటే, అది కూడా కత్తే, కోయడానికి ఉపయోగ పడుతుందా? పడదా? పడుతుంది. కానీ, ఒకసారి కూరగాయలు కోస్తే మరల కంట్లో ఆపరేషన్స్‌ చేయడానికి ఉపయోగపడదు. ఇప్పుడు మన బుద్ధి ఇలాగే తయారైంది.

బుద్ధి నివృత్తి మార్గం ద్వారా స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందటానికి ఉపయోగపడవలసిన సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. అది ఎంత సూక్ష్మమైనది అంటే, సూర్యకిరణాలను కూడా నిలువుగా ఛేదించగలిగేటటువంటి సమర్థత కలిగినంత సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. దానిని ఇప్పుడు మనము బిందెల చుట్టు, కడవల చుట్టు, భౌతికమైన, స్థూలమైనటువంటి విషయాల చుట్టూ, వస్తువుల చుట్టూ తిప్పుతున్నాము.

ఈ రకమైనటువంటి అభ్యాసదోషం చేత మన బుద్ధి స్థూలతని సంతరించుకుంది. తన సూక్ష్మతను పోగొట్టుకుంది. ఇప్పుడు పునః ఏం చేయాలట? దానిని వెనక్కు తిప్పుకుని, మనస్సును విరమింప చేసి, బుద్ధిని విరమింప చేసి, దానికి మూలమైనటువంటి, కారణమైనటువంటి, మహతత్వమునందు, అవ్యక్తము నందు దానిని స్థిరపరచి బుద్ధిగుహ యందు విచారణ చేసి, దృష్టి నిలిపి, హృదయాకాశము నందు సదా ప్రకాశిస్తున్నటువంటి, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మానవులు పొందాలి.

అలా ఎవరైతే పొందుతారో వాళ్ళకి, ఆ సాక్షాత్కార జ్ఞానం, ఆ జన్మపర్యంతం అంటే, జనన మరణాలను దాటటానికి అదే సోపానముగా పనికి వస్తుంది. అదే అవకాశంగా పనికి వస్తుంది. ఈ జనన మరణ చక్రంలోనుంచి బయటపడగలుగుతాడు. కర్మబంధాలలోనుంచి బయటపడగలుగుతాడు. మోహంలోనుంచి బయటపడగలుగుతాడు.

ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మానవజన్మని ధన్యత చెందించగల సర్వసమర్థమైనటువంటి సాధన ఏదైనా ఒకటి ఉంది అంటే, అది ఆత్మవిచారణ, ఆత్మసాక్షాత్కార జ్ఞానము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2020

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 39 / Sri Devi Mahatyam - Durga Saptasati - 39

🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 39 / Sri Devi Mahatyam - Durga Saptasati - 39 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 11

🌻. నారాయణీ స్తుతి - 3 🌻

19. ఐంద్రీస్వరూపాన్ని ధరించి కిరీటము, మహావజ్రాయుధము కలిగి వేయి కన్నులతో ప్రకాశిస్తూ, వృత్రాసురుని ప్రాణాలు తీసిన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.

20. శివదూతీ స్వరూపంలో రాక్షస మహాసేనలను రూపమాపిన భయంకరాకారవు, మహాగర్జారావాలు చేసేదానవు అయిన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.

21. కోఱలతో భయంకరంగా ఉండు ముఖం గలదానవు, వుట్టెల పేరును ఆభరణంగా ధరించిన దానవు, ముండుని వధించినదానవు అయిన ఓ చాముండా! నారాయణీ! నీకు ప్రణామాలు.

22. సంపదవు, లజ్ (వినమ్రత)వు, పరావిద్య (బ్రహ్మజ్ఞానం)వు, శ్రద్ (నిష్ఠ)వు, పుష్టి (సమృద్ధి )వి, స్వధా మంత్రమవు, సుస్థిరవు, మహారాత్రివి, మహామాయవు అయిన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.

23. ధారణాశక్తి గల బుద్ధివి, సరస్వతివి, శ్రేష్ఠురాలవు, సంపదవు, శివపత్నివి, నీలవర్ణవు, దైవశక్తివి అయిన ఈశ్వరీ! ఓ నారాయణీ! నీకు ప్రణామాలు, అనుగ్రహించు.

24. సర్వస్వరూపాలు గలదానవు, సర్వపరిపాలకురాలవు, సర్వశక్తి సంపన్నవు అయిను ఓ దేవీ! దుర్గా! నీకు ప్రణామాలు. ఓ దేవీ! భయాల నుండి మమ్మల్ని రక్షించు.

25. ఓ కాత్యాయనీ! నీకు ప్రణామాలు, మూడుకన్నులతో అలంకరింపబడిన ఈ నీ ప్రసన్నముఖం మమ్మల్ని సర్వభూతాల నుండి రక్షించు గాక!

26. ఓ భద్రకాళీ ! నీకు ప్రణామాలు. భయంకరంగా మండుతూ, మిక్కిలి తీక్ష్మమై, రాక్షసులను నిశ్శేషంగా పరిమార్చే నీ త్రిశూలం మమ్మల్ని భయం నుండి కాపాడు గాక!

27. ఓ దేవీ! రాక్షసుల పరాక్రమాన్ని హరించేదీ, తన నాదంతో జగత్తును నింపేదీ అయిన నీ ఘంట మమ్మల్ని తన బిడ్డల వలే పాపాల నుండి కాపాడు గాక!

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 39 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

CHAPTER 11

🌻 Hymn to Narayani - 3 🌻

19. 'Salutation be to you, O Narayani, you who have a diadem and a great thunderbolt, are dazzling with a thousand eyes, and took away the life of Vrtra, O Aindri!

20. 'Salutation be to you, O Narayani, O you who in the form of Sivaduti slew the mighty hosts of the daitya, O you of terrible form and loud throat!

21. 'Salutation be to you, O Narayani, O you who have a face terrible with tusks, and are adorned with a garland of heads, Chamunda, O slayer of Munda!

22. 'Salutation be to you, O Narayani, O you who are good fortune, modesty, great wisdom, faith, nourishment and Svadha, O you who are immovable O you, great Night and great Illusion.

23. 'Salutation be to you, O Narayani, O you who are intelligence and Sarasvati, O best one, prosperity, consort of Vishnu, dark one, nature, be propitious.

24. 'O Queen of all, you who exist in the form of all, and possess every might, save us from error, O Devi. Salutation be to you, Devi Durga!

25. 'May this benign countenance of yours adorned with three eyes, protect us from all fears. Salutation be to you, O Katyayani!

26. 'Terrible with flames, exceedingly sharp destroyer of all the asuras, may your trident guard us from fear. salutation be to you, O Bhadrakali!

27. 'May your bell that fills the world with its ringing, and destroys the prowess of the daityas, guard us, O Devi, as a mother protects her children, from all evils.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 118, 119 / Vishnu Sahasranama Contemplation - 118, 119

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 118, 119 / Vishnu Sahasranama Contemplation - 118, 119 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻118. శుచిశ్రవాః, शुचिश्रवाः, Śuciśravāḥ🌻

ఓం శుచిశ్రవసే నమః | ॐ शुचिश्रवसे नमः | OM Śuciśravase namaḥ

యస్య సంతి హి శుచీని శ్రవాంసి స శుచిశ్రవాః ।

నామాని శ్రవణీయాని యస్య సోఽచ్యుత ఉచ్యతే ॥

శుచులు అనగా పవిత్రములగు శ్రవస్సులు అనగా గుణములను తెలియజేయు వినసొంపైన నామాలు ఎవనికి కలవో అట్టివాడు శుచిశ్రవః.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 118 🌹

📚. Prasad Bharadwaj

🌻118. Śuciśravāḥ🌻

OM Śuciśravase namaḥ

Yasya saṃti hi śucīni śravāṃsi sa śuciśravāḥ,

Nāmāni śravaṇīyāni yasya so’cyuta ucyate.

यस्य संति हि शुचीनि श्रवांसि स शुचिश्रवाः ।

नामानि श्रवणीयानि यस्य सोऽच्युत उच्यते ॥

The One who is glorified with pure and pleasing to hear divine names is Śuciśravāḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः ।अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః ।అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥

Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ।Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 119 / Vishnu Sahasranama Contemplation - 119 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻119. అమృతః, अमृतः, Amr̥taḥ🌻

ఓం అమృతాయ నమః | ॐ अमृताय नमः | OM Amr̥tāya namaḥ

న విద్యతే మృతం యస్య మరణం సోఽమృతః స్మృతః జర (వార్ధక్యం / ముసలితనం), మరణమూ లేనివాడు అను బృహదారణ్యకోపనిషద్వచన ప్రమాణము ననుసరించి మృతము లేనివాడు. ఇతనికి మృతి లేదు.

:: బృహదారణ్యకోపనిషత్ - షష్ఠాధ్యాయః, చతుర్థం బ్రాహ్మణమ్ ::

స వా ఏష మహా నజ ఆత్మాఽజరోఽమరోఽమృతోఽభ యో బ్రహ్మా భయం వై బ్రహ్మాభయగ్‍ం హి వై బ్రహ్మ భవతి య ఏవం వేద ॥ 25 ॥

ఈ పురుషుడు మహాత్ముడు, అజుడు, ఆత్మయే. ఈతడు జరామరణములు లేనివాడు, అమరుడు, అమృతుడు, అభయస్వరూపుడగు పరబ్రహ్మము. ఈ ప్రకారము ఎవడు తెలిసికొనునో అతడు భయరహితుడగు పరబ్రహ్మ స్వరూపమే.

:: భగవద్గీత - గుణత్రయ విభాగయోగము ::

బ్రహ్మణో హి ప్రతిష్ఠాఽహ మమృతస్యావ్యయస్య చ ।

శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ ॥ 27 ॥

నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వత ధర్మస్వరూపమును, దుఃఖమిశ్రితముకాని నిరతిశయ, అచంచల ఆనందస్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయము అనగా బ్రహ్మముయొక్క స్వరూపమును అయియున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 119 🌹

📚. Prasad Bharadwaj

🌻119. Amr̥taḥ🌻

OM Amr̥tāya namaḥ

Na vidyate mr̥taṃ yasya maraṇaṃ so’mr̥taḥ smr̥taḥ / न विद्यते मृतं यस्य मरणं सोऽमृतः स्मृतः He who has no decrepitude and maraṇaṃ or death and is immortal.

Br̥hadāraṇyaka Upaniṣat - Section IV, Chapter IV

Sa vā eṣa mahā naja ātmā’jaro’maro’mr̥to’bha yo brahmā bhayaṃ vai brahmābhayagˈṃ hi vai brahma bhavati ya evaṃ veda. (25)

:: बृहदारण्यकोपनिषत् - षष्ठाध्यायः, चतुर्थं ब्राह्मणम् ::

स वा एष महा नज आत्माऽजरोऽमरोऽमृतोऽभ यो ब्रह्मा भयं वै ब्रह्माभयग्‍ं हि वै ब्रह्म भवति य एवं वेद ॥ २५ ॥

That great, birth-less Self is undecaying, immortal, undying, fearless and Brahman (infinite). Brahman is indeed fearless. He who knows It as such becomes the fearless Brahman.

Bhagavad Gītā - Chapter 14

Brahmaṇo hi pratiṣṭhā’ha mamr̥tasyāvyayasya ca,

Śāśvatasya ca dharmasya sukhasyaikāntikasya ca. (27)

:: श्रीमद्भगवद्गीता - गुणत्रय विभागयोग ::

ब्रह्मणो हि प्रतिष्ठाऽह ममृतस्याव्ययस्य च ।

शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥ २७ ॥

For I am the basis of the Infinite, the Immortal, the Indestructible and of eternal Dharma and unalloyed Bliss.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः ।अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః ।అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥

Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ।Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2020

20-NOVEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 554 / Bhagavad-Gita - 554 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 118, 119 / Vishnu Sahasranama Contemplation - 118, 119🌹
3)🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 39 / Sri Devi Mahatyam - Durga Saptasati - 39🌹 
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 108🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 127 🌹
6) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 114 / Gajanan Maharaj Life History - 114 🌹
7) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 54 🌹* 
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 98, 99 / Sri Lalita Chaitanya Vijnanam - 98, 99🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 466 / Bhagavad-Gita - 466🌹

10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 80 📚
11) 🌹. శివ మహా పురాణము - 278🌹
12) 🌹 Light On The Path - 34🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 165 🌹
14) 🌹. శివగీత - 119 / The Siva-Gita - 119🌹* 
15) 🌹 Seeds Of Consciousness - 229 🌹   
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 104 🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 68 / Sri Vishnu Sahasranama - 68 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 554 / Bhagavad-Gita - 554 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 21 🌴*

21. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మాన: |
కామ: క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ||

🌷. తాత్పర్యం : 
కామము, క్రోధము, లోభము అనునవి మూడు నరకద్వారములై యున్నవి. అవి ఆత్మనాశకరములు కావున బుద్ధిమంతుడైన ప్రతిమనుజుడు వాటిని త్యజించి వేయవలయును.

🌷. భాష్యము :
అసురజీవనము ఆరంభము ఇచ్చట వర్ణింపబడినది. ప్రతివాడును తన కామమును పూర్ణము చేసికొన యత్నించును. అందులకు అతడు విఫలుడైనచో క్రోధము, లోభము ఉదయించును. అసురయోనులకు పతనముచెంద నిచ్చగింపని ప్రతి బుద్ధిమంతుడును ఈ ముగ్గురు శత్రువులను తప్పక విడువ యత్నింపవలయును. భౌతికబంధము నుండి ముక్తినొందు నవకాశము లేని రీతిలో అవి ఆత్మను నాశనము చేయ సమర్థములై యున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 554 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 21 🌴*

21. tri-vidhaṁ narakasyedaṁ
dvāraṁ nāśanam ātmanaḥ
kāmaḥ krodhas tathā lobhas
tasmād etat trayaṁ tyajet

🌷 Translation : 
There are three gates leading to this hell – lust, anger and greed. Every sane man should give these up, for they lead to the degradation of the soul.

🌹 Purport :
The beginning of demoniac life is described herein. One tries to satisfy his lust, and when he cannot, anger and greed arise. A sane man who does not want to glide down to the species of demoniac life must try to give up these three enemies, which can kill the self to such an extent that there will be no possibility of liberation from this material entanglement.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 118, 119 / Vishnu Sahasranama Contemplation - 118, 119 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻118. శుచిశ్రవాః, शुचिश्रवाः, Śuciśravāḥ🌻*

*ఓం శుచిశ్రవసే నమః | ॐ शुचिश्रवसे नमः | OM Śuciśravase namaḥ*

యస్య సంతి హి శుచీని శ్రవాంసి స శుచిశ్రవాః ।
నామాని శ్రవణీయాని యస్య సోఽచ్యుత ఉచ్యతే ॥

శుచులు అనగా పవిత్రములగు శ్రవస్సులు అనగా గుణములను తెలియజేయు వినసొంపైన నామాలు ఎవనికి కలవో అట్టివాడు శుచిశ్రవః.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 118🌹*
📚. Prasad Bharadwaj 

*🌻118. Śuciśravāḥ🌻*

*OM Śuciśravase namaḥ*

Yasya saṃti hi śucīni śravāṃsi sa śuciśravāḥ,
Nāmāni śravaṇīyāni yasya so’cyuta ucyate.

यस्य संति हि शुचीनि श्रवांसि स शुचिश्रवाः ।
नामानि श्रवणीयानि यस्य सोऽच्युत उच्यते ॥

The One who is glorified with pure and pleasing to hear divine names is Śuciśravāḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः ।अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః ।అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥

Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ।Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 119 / Vishnu Sahasranama Contemplation - 119🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻119. అమృతః, अमृतः, Amr̥taḥ🌻*

*ఓం అమృతాయ నమః | ॐ अमृताय नमः | OM Amr̥tāya namaḥ*

న విద్యతే మృతం యస్య మరణం సోఽమృతః స్మృతః జర (వార్ధక్యం / ముసలితనం), మరణమూ లేనివాడు అను బృహదారణ్యకోపనిషద్వచన ప్రమాణము ననుసరించి మృతము లేనివాడు. ఇతనికి మృతి లేదు.

:: బృహదారణ్యకోపనిషత్ - షష్ఠాధ్యాయః, చతుర్థం బ్రాహ్మణమ్ ::

స వా ఏష మహా నజ ఆత్మాఽజరోఽమరోఽమృతోఽభ యో బ్రహ్మా భయం వై బ్రహ్మాభయగ్‍ం హి వై బ్రహ్మ భవతి య ఏవం వేద ॥ 25 ॥

ఈ పురుషుడు మహాత్ముడు, అజుడు, ఆత్మయే. ఈతడు జరామరణములు లేనివాడు, అమరుడు, అమృతుడు, అభయస్వరూపుడగు పరబ్రహ్మము. ఈ ప్రకారము ఎవడు తెలిసికొనునో అతడు భయరహితుడగు పరబ్రహ్మ స్వరూపమే.

:: భగవద్గీత - గుణత్రయ విభాగయోగము ::
బ్రహ్మణో హి ప్రతిష్ఠాఽహ మమృతస్యావ్యయస్య చ ।
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ ॥ 27 ॥

నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వత ధర్మస్వరూపమును, దుఃఖమిశ్రితముకాని నిరతిశయ, అచంచల ఆనందస్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయము అనగా బ్రహ్మముయొక్క స్వరూపమును అయియున్నాను. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 119🌹*
📚. Prasad Bharadwaj 

*🌻119. Amr̥taḥ🌻*

*OM Amr̥tāya namaḥ*

Na vidyate mr̥taṃ yasya maraṇaṃ so’mr̥taḥ smr̥taḥ / न विद्यते मृतं यस्य मरणं सोऽमृतः स्मृतः He who has no decrepitude and maraṇaṃ or death and is immortal.

Br̥hadāraṇyaka Upaniṣat - Section IV, Chapter IV

Sa vā eṣa mahā naja ātmā’jaro’maro’mr̥to’bha yo brahmā bhayaṃ vai brahmābhayagˈṃ hi vai brahma bhavati ya evaṃ veda. (25)

:: बृहदारण्यकोपनिषत् - षष्ठाध्यायः, चतुर्थं ब्राह्मणम् ::

स वा एष महा नज आत्माऽजरोऽमरोऽमृतोऽभ यो ब्रह्मा भयं वै ब्रह्माभयग्‍ं हि वै ब्रह्म भवति य एवं वेद ॥ २५ ॥

That great, birth-less Self is undecaying, immortal, undying, fearless and Brahman (infinite). Brahman is indeed fearless. He who knows It as such becomes the fearless Brahman.

Bhagavad Gītā - Chapter 14
Brahmaṇo hi pratiṣṭhā’ha mamr̥tasyāvyayasya ca,
Śāśvatasya ca dharmasya sukhasyaikāntikasya ca. (27)

:: श्रीमद्भगवद्गीता - गुणत्रय विभागयोग ::
ब्रह्मणो हि प्रतिष्ठाऽह ममृतस्याव्ययस्य च ।
शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥ २७ ॥

For I am the basis of the Infinite, the Immortal, the Indestructible and of eternal Dharma and unalloyed Bliss.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः ।अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః ।అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥

Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ।Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 39 / Sri Devi Mahatyam - Durga Saptasati - 39 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

*అధ్యాయము 11*
*🌻. నారాయణీ స్తుతి - 3 🌻*

19. ఐంద్రీస్వరూపాన్ని ధరించి కిరీటము, మహావజ్రాయుధము కలిగి వేయి కన్నులతో ప్రకాశిస్తూ, వృత్రాసురుని ప్రాణాలు తీసిన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.

20. శివదూతీ స్వరూపంలో రాక్షస మహాసేనలను రూపమాపిన భయంకరాకారవు, మహాగర్జారావాలు చేసేదానవు అయిన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.

21. కోఱలతో భయంకరంగా ఉండు ముఖం గలదానవు, వుట్టెల పేరును ఆభరణంగా ధరించిన దానవు, ముండుని వధించినదానవు అయిన ఓ చాముండా! నారాయణీ! నీకు ప్రణామాలు.

22. సంపదవు, లజ్ (వినమ్రత)వు, పరావిద్య (బ్రహ్మజ్ఞానం)వు, శ్రద్ (నిష్ఠ)వు, పుష్టి (సమృద్ధి )వి, స్వధా మంత్రమవు, సుస్థిరవు, మహారాత్రివి, మహామాయవు అయిన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.

23. ధారణాశక్తి గల బుద్ధివి, సరస్వతివి, శ్రేష్ఠురాలవు, సంపదవు, శివపత్నివి, నీలవర్ణవు, దైవశక్తివి అయిన ఈశ్వరీ! ఓ నారాయణీ! నీకు ప్రణామాలు, అనుగ్రహించు.

24. సర్వస్వరూపాలు గలదానవు, సర్వపరిపాలకురాలవు, సర్వశక్తి సంపన్నవు అయిను ఓ దేవీ! దుర్గా! నీకు ప్రణామాలు. ఓ దేవీ! భయాల నుండి మమ్మల్ని రక్షించు.

25. ఓ కాత్యాయనీ! నీకు ప్రణామాలు, మూడుకన్నులతో అలంకరింపబడిన ఈ నీ ప్రసన్నముఖం మమ్మల్ని సర్వభూతాల నుండి రక్షించు గాక!

26. ఓ భద్రకాళీ ! నీకు ప్రణామాలు. భయంకరంగా మండుతూ, మిక్కిలి తీక్ష్మమై, రాక్షసులను నిశ్శేషంగా పరిమార్చే నీ త్రిశూలం మమ్మల్ని భయం నుండి కాపాడు గాక!

27. ఓ దేవీ! రాక్షసుల పరాక్రమాన్ని హరించేదీ, తన నాదంతో జగత్తును నింపేదీ అయిన నీ ఘంట మమ్మల్ని తన బిడ్డల వలే పాపాల నుండి కాపాడు గాక! 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 39 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

*CHAPTER 11* 
*🌻 Hymn to Narayani - 3 🌻*

 19. 'Salutation be to you, O Narayani, you who have a diadem and a great thunderbolt, are dazzling with a thousand eyes, and took away the life of Vrtra, O Aindri!

20. 'Salutation be to you, O Narayani, O you who in the form of Sivaduti slew the mighty hosts of the daitya, O you of terrible form and loud throat!

21. 'Salutation be to you, O Narayani, O you who have a face terrible with tusks, and are adorned with a garland of heads, Chamunda, O slayer of Munda!

22. 'Salutation be to you, O Narayani, O you who are good fortune, modesty, great wisdom, faith, nourishment and Svadha, O you who are immovable O you, great Night and great Illusion.

23. 'Salutation be to you, O Narayani, O you who are intelligence and Sarasvati, O best one, prosperity, consort of Vishnu, dark one, nature, be propitious.

24. 'O Queen of all, you who exist in the form of all, and possess every might, save us from error, O Devi. Salutation be to you, Devi Durga!

25. 'May this benign countenance of yours adorned with three eyes, protect us from all fears. Salutation be to you, O Katyayani!

26. 'Terrible with flames, exceedingly sharp destroyer of all the asuras, may your trident guard us from fear. salutation be to you, O Bhadrakali!

27. 'May your bell that fills the world with its ringing, and destroys the prowess of the daityas, guard us, O Devi, as a mother protects her children, from all evils. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 108 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -38 🌻*

ఆగ్ర్యమ్య బుద్ధి అంటే అగ్రస్థితిలో వున్నటువంటి బుద్ధి. మనం ఇప్పటి వరకూ మాట్లాడుకున్న అంశాలను స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారు. మీ ఇంట్లో ఒక వజ్రం ఉందనుకోండి. ఆ వజ్రాన్ని ఎక్కడ పెడుతారు సాధారణంగా? మీ వంటింట్లో ఉన్నటువంటి కప్పులు, సాసర్లు, బిందెలు, గిన్నెలు... అక్కడ వెతికారు అనుకోండి, ఆ వజ్రం కనబడుతోందా? 

సాధారణంగా ఈ వజ్రమంత విలువైన దానిని ఎక్కడ పెడుతాము? ఎక్కడో ఒక చోట భద్రమైనటువంటి స్థితిలో పెడుతాము. భద్రమైనటువంటి స్థానంలో పెడుతాము. ఎందుకని? చాలా విలువైనది కాబట్టి. మరి వాటిని సామాన్యంగా మనం వెతికితే, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పడవేసి వెతికితే అది కనపడుతుందా అంటే, ఆ వస్తువులన్నిటిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. 

అట్లాగే మనలో భద్రమైనటువంటి స్థానంలో, భద్రమైనటువంటి స్థితిలో స్వస్వరూప జ్ఞానమున్నది, స్వప్రకాశము కూడా ఉన్నది. అదే ఆత్మ. అర్థం అయ్యిందా అండి. బుద్ధి గుహయందు ఉన్నటువంటి హృదయాకాశ స్థానములో, నిరంతరాయంగా వెలుగుతూ ఉన్నటువంటి, స్వప్రకాశము ఏదైతే ఉన్నదో అది ఆత్మ. ఇది భద్రంగా ఉంది. అతి సూక్ష్మంగా ఉంది, గుహ్యంగా ఉంది, రహస్యంగా ఉంది, భద్రమైన స్థితిలో వుంది, భద్రమైన స్థానంలో ఉంది.

        ఒక్కొక్కదానిని విరమించుకుంటూ, ఒక్కొక్క దానియందున్న సంగత్వాన్ని పోగొట్టుకుంటూ, ఆసక్తులను పోగొట్టుకొంటూ, ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోకి మరలడం ద్వారా, మనస్సును మరలించడం ద్వారా, నీ మనస్సు సదా గిన్నెల చుట్టూ, సదా విషయముల చుట్టూ, సదా తినే పదార్థముల చుట్టూ, సదా భోగించేటటువంటి లక్షణాల చుట్టూ, మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు, ఏ బట్టలు కట్టుకుందాం? ఏ భోజనం చేద్దాం? ఏ రకంగా సుఖాన్ని పొందుదాం? ఏ రకంగా విశ్రాంతి తీసుకుందాం? ఏ రకంగా అలంకారం చేద్దాం? ఈ రకంగా బాహ్యమైనటువంటి విషయాల చుట్టూ, బాహ్యమైనటువంటి వస్తువుల చుట్టూ, మనస్సు పనిచేస్తూ ఉంటే, బుద్ధి కూడా మనసును అనుసరించి, నిర్ణయాలు చేస్తూ ఉంటుంది బాహ్యముగానే. 

ఏ నివృత్తి మార్గానికి, స్వస్వరూప ఆత్మజ్ఞానానికి, ఉపయోగపడవలసినటువంటి బుద్ధి ఉన్నదో, దానిని బాహ్యమైనటువంటి విషయాల కొరకు, బాహ్యమైనటుంవంటి వస్తు జ్ఞానము కొరకు, వ్యవహార నిర్ణయము కొరకు, వాడుకోవడం ఎటువంటి దంటే, కంట్లో ఆపరేషన్‌ చేయడానికి ఉపయోగించ వలసినటువంటి కత్తిని, కూరగాయలు కోయడానికి ఉపయోగించ రాదా? అంటే, అది కూడా కత్తే, కోయడానికి ఉపయోగ పడుతుందా? పడదా? పడుతుంది. కానీ, ఒకసారి కూరగాయలు కోస్తే మరల కంట్లో ఆపరేషన్స్‌ చేయడానికి ఉపయోగపడదు. ఇప్పుడు మన బుద్ధి ఇలాగే తయారైంది.

      బుద్ధి నివృత్తి మార్గం ద్వారా స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందటానికి ఉపయోగపడవలసిన సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. అది ఎంత సూక్ష్మమైనది అంటే, సూర్యకిరణాలను కూడా నిలువుగా ఛేదించగలిగేటటువంటి సమర్థత కలిగినంత సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. దానిని ఇప్పుడు మనము బిందెల చుట్టు, కడవల చుట్టు, భౌతికమైన, స్థూలమైనటువంటి విషయాల చుట్టూ, వస్తువుల చుట్టూ తిప్పుతున్నాము.

        ఈ రకమైనటువంటి అభ్యాసదోషం చేత మన బుద్ధి స్థూలతని సంతరించుకుంది. తన సూక్ష్మతను పోగొట్టుకుంది. ఇప్పుడు పునః ఏం చేయాలట? దానిని వెనక్కు తిప్పుకుని, మనస్సును విరమింప చేసి, బుద్ధిని విరమింప చేసి, దానికి మూలమైనటువంటి, కారణమైనటువంటి, మహతత్వమునందు, అవ్యక్తము నందు దానిని స్థిరపరచి బుద్ధిగుహ యందు విచారణ చేసి, దృష్టి నిలిపి, హృదయాకాశము నందు సదా ప్రకాశిస్తున్నటువంటి, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మానవులు పొందాలి. 

అలా ఎవరైతే పొందుతారో వాళ్ళకి, ఆ సాక్షాత్కార జ్ఞానం, ఆ జన్మపర్యంతం అంటే, జనన మరణాలను దాటటానికి అదే సోపానముగా పనికి వస్తుంది. అదే అవకాశంగా పనికి వస్తుంది. ఈ జనన మరణ చక్రంలోనుంచి బయటపడగలుగుతాడు. కర్మబంధాలలోనుంచి బయటపడగలుగుతాడు. మోహంలోనుంచి బయటపడగలుగుతాడు.

ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మానవజన్మని ధన్యత చెందించగల సర్వసమర్థమైనటువంటి సాధన ఏదైనా ఒకటి ఉంది అంటే, అది ఆత్మవిచారణ, ఆత్మసాక్షాత్కార జ్ఞానము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Guru Geeta - Datta Vaakya - 128 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
120

We discussed that the Sadguru never gets angry, but if he does get angry, the anger will not go away until the devotee is benefited. It’s not enough for the devotee to apologize. Until the devotee is truly transformed, he will show his anger. 

The Guru will reprimand the disciple in many ways. He will scold him all the time, he will scold him using different words. He will recollect over and over and scold the disciple. If you think the Guru’s scolding was over that afternoon, he will continue to scold till the evening. He will scold in new ways. 

Sometimes, he’ll even attribute a new wrong-doing to you. What do we think then? We may occasionally lose faith in the Guru. “I did not commit that mistake that he’s scolding me for, why is he scolding me for this?”. But, until he uproots the poison in you from the root, he will not stop. He will keep scolding . 

Sometimes, he may scold you every time he sees you. Sometimes, he may chase you down and scold you. Sometimes, he may call for you and scold you. He will sit you down and scold you. It’s so hard when he sits us down and scolds us. 

He will seem to set up this session, where he sits you in front of him, settles into a comfortable position after his meal, makes sure you’ve been well fed too and scolds you for hours on end. How do we feel then? Should we think that our Guru has gone crazy? Should we think we’ve gone crazy?  

Or, are we going insane listening to the Guru’s words? But, there’s one thing in the Guru’s heart that’s constant throughout all of this: Until you turn a new leaf – until the Guru’s resolve to benefit you is complete, the anger will not subside.   

The Guru’s compassion is boundless. It goes on for generations and lifetimes. It forgives the wrong-doers and gives them a better state. To understand this better, we should look at the story of Nemi from Bhagavatam as an example.

Nemi Tata was a king. He did not have children for a very long time. He meditated on Brahma and received a boon that he would have a good son. But, when he still didn’t have a son, Nemi conducted a big Yajna. 

Once, during the days the yajna was in progress, he got very thirsty. Unable to bear the thirst, he drank the water that was kept in a pot right there. The next morning, the priests saw the empty pot. When they realized that the king drank all the water, the priests lamented.  

The priests had saved that water that was being sanctified by the mantras for the queen the next day so she could have a good son. But, the king already drank the water.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 112 / Sri Gajanan Maharaj Life History - 112 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 20వ అధ్యాయము - 7 🌻*

అదే విధంగా శ్రీగజానన్ మహారాజు కృపవల్ల, దాదా కొల్హాట్కరుకు కుమారుడు కలిగాడు. అతని పేరు రాజా. ఈ యొగి కృపకి హద్దులులేవు. 16 సం. వయసుగల శ్రీరామచంద్రపాటిల్ కుమార్తె చంద్రభాగకు కష్టతరమైన కాన్పు అయింది. సాధారణంగా కాన్పు అనేది, స్త్రీ జాతికి, బాధతో కూడిన విషయం.

 ఆనవాయితీ ప్రకారం లాడెగాం నుండి తన తల్లి ఇంటికి కాన్పుకు వచ్చింది. కాన్పు తరువాత కొన్నిరోజులు జ్వరంతో బాధ పడింది. దానిని మొదట టైఫైడుగా ఘోషించారు. చాలామంది వైద్యులు చికిత్స చేసారు కానీ జ్వరం తగ్గలేదు. ప్రతి వైద్యుడు ఆమెవ్యాధిని వేరు వేరుగా విశ్లేషించారు. వారి అభిప్రాయాలలో ఏకతలేదు. ఈ ఫలితం లేని చికిత్సలతో అలసిపోయి, చికిత్సకోసం శ్రీమహారాజును శరణు కోరడం కోసం పాటిల్ నిర్ణయించాడు. 

శ్రీగజానన్ మహారాజును ధ్యానిస్తూ ఆమెకు విభూది, తీర్ధం అతను ఇవ్వడం మొదలు పెట్టాడు. శ్రీమహారాజులో అతనికి ఉన్న గొప్ప విశ్వాశానికి చంద్రభాగ కోలుకుంటున్న చిహ్నాలు కనిపించాయి. ఒకానొక సమయంలో మంచమీదనుండి కదలలేని ఆమె, ఇప్పుడు శ్రీమహారాజు దర్శనానికి వెళ్ళగలుగుతోంది. 

శ్రీమహారాజు యొక్క విభూది మరియు తీర్ధం ప్రభావం అటువంటిది. తనలో నిజమయిన విశ్వాసం ఉన్నవాళ్ళని భగవంతుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారు, కాబట్టి తాముచేసే పూజలలో భక్తులకు అచంచలమైన విశ్వాసం ఉండాలి. 

రామచంద్రపాటిల్ భార్య అయిన జనక్ బాయి, విధిరాతవల్ల పడవలసిన బాధలనుండి తప్పించుకోలేక పోయింది. ఉదర సంబంధమయిన బాధతో ఆమెకు నిరంతరం కడుపు నొప్పిగా ఉండేది. మందులు తాత్కాలిక ఉపశమనం ఇచ్చేవి, ఆమె బాధలు కొనసాగాయి. 

చివరికి ఈ వ్యాధి ఆమె మెదడును దెబ్బతీసింది. ఆమె వెర్రిదానిలా ప్రవర్తించడం మొదలు పెట్టింది. ఆమె మాట్లాడే మాటమీద అంకుశం తప్పి ఒకోసారి ఆకలి వేస్తున్నా జ్ఞానంకూడా ఆమెకు పోయేది. కొంతమంది క్షుద్రశక్తులు ఆమెను వెంటాడుతున్నాయన్నారు. మరికొంతమంది అదొకరకమైన వ్యాధి అని విశ్లేషంచారు. 

పాటిల్ సత్తా ఉన్న అధికారి అవడంవల్ల గ్రామంలో చాలామంది శత్రువులను శృష్టించుకున్నాడని, వాళ్లలో శక్తిలేని వాళ్ళు ఎదురు తిరగలేక ఈవిధమయిన గారడి ప్రయోగించారు అని వాళ్ళు అన్నారు. మందులు అన్నివిధాలయిన ఉపశమనాలు ప్రయత్నించారు, పాటిల్ ధనవంతుడు అవడంతో కొంతమంది దుష్టులు చాలా మోసగించారు. ఈ నిమిత్తం అతను చాలాధనం ఖర్చుచేసాడు. కానీ భార్యకు ఏవిధమయిన ఉపశమనం కలగలేదు. 

ప్రయత్నాలన్నిటితో విసిగిపోయి, ఇక శ్రీగజానన్ మహారాజు మావైద్యుడు, యోగి, భగవంతుడు సర్వస్వం. నాభార్య ఆయన కోడలు. అదినా నమ్మకం, కాబట్టి ఆమెకు మరి ఏవిధమయిన చికిత్స అవసరంలేదు అని అతను అన్నాడు. ఆ తరువాత తన భార్యను ఉదయాన్నే తొందరగా లేచి, స్నానంచేసి మఠానికి వెళ్ళి శ్రీగజానన్ మహారాజు సమాధికి రోజూ ప్రదక్షిణాలు చెయ్యమన్నాడు. ఆమె తన భర్త మాటను పాటించి ఆయన సలహా ప్రకారం చెయ్యడం మొదలు పెట్టింది. ఆప్రదక్షిణాలు వృధాకాలేదు, ఆమె వ్యాధినుండి విముక్తి పొందింది. 

నిజాయితీగా అసలయిన యోగులకు చేసిన సేవ ఎప్పటికీ వృధాకాదు, కానీ అది పూర్తి అచంచలమైన విశ్వాసంతో చెయ్యాలి. శ్రీగజానన్ మహారాజు తరువాత బాలాభవ్ ఆయన స్థానం గ్రహించి, కొన్ని చమత్కారాలు చేసాడు. వైశాకశుద్ధ షష్టినాడు ఇతను షేగాంలోనే వైకుంఠం పొందాడు. తరువాత అతని స్థానం నారాయణ గ్రహించాడు. 

బాలాభవ్ వైకుంఠం ప్రాప్తిపొందినప్పుడు, నారాయణకు నందూరాలో శ్రీ గజానన్ మహారాజు కలలో కనబడి, షేగాం వెళ్ళి భక్తులను కాపాడవలసిందిగా చెప్పారు. నారాయణ కొన్నాళ్లు అధికారంలో ఉండి, చైత్రశుద్ధ షష్టి నాడు సమాధి తీసుకున్నాడు. యోగులకు సేవ చెయ్యడం అనేది గొప్ప పుణ్యకార్యం, కానీ పూర్వం చేసిన మంచి పనులు మన భాగంలో లేకపోతే ఇది సాధ్యంకాదు. ఆకాశంలో నక్షత్రాలలా శ్రీగజానన్ మహారాజు గొప్పతనాలు లెఖ్కలేనివి. 

నేను బుద్ధిహీనుడిని, తెలివిలేని వాడిని, కాబట్టి మహాసాగరం వంటి శ్రీమహారాజు జీవితంగురించి వర్ణించలేక పోయాను. ఆయన నాచేత ఎంత చెప్పిచారో అంతేనేను చెప్పాను. కలం రాసినా, ఆరాయడం అనే గొప్పతనం కలందికాదు. కలం పట్టుకున్న వాడు వ్రాసాడు. కలం రాయడంలో ఒకసాధనం మాత్రమే. ఇదే ఈవిషయంలో కూడా. నేను కలాన్ని అయ్యాను. మరియు రాసిన వారు శ్రీగజానన్ మహారాజు. నేను ఈ పవిత్ర గ్రంధం వ్రాయడం ఆయనవల్లనే. 

ఓ శ్రోతలారా దీనికి ఎంతమాత్రం నేను మెప్పు పొందదగను. కావున దాసగణు రచించిన ఈ గజానన్ విజయ గ్రంధం చివరికి చేరుతోంది. ఇక చివరి అధ్యాయం ముందు ఉంది. 
  శుభం భవతు, శ్రీహరి హరార్పణమస్తు 
    20. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 112 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 20 - part 7 🌻*

The lady, who once could not move from her bed, was now able to go to the Samadhi of Shri Gajanan Maharaj for Darshan. That was the effect of the Udi and Tirtha of Shri Gajanan Maharaj . 

God always blesses them, who have real faith in him. The devotee, therefore, should have full and unshakable faith in the subject of his worship. Janakabai, wife of Ramchandra, could not escape the sufferings destined for her. Due to gastric trouble, she used to have continuous stomach ache. 

The medicines used to give her only temporary relief. At last the ailment affected her brain and she started behaving like a lunatic. She lost control on what she said and at times lost sense of hunger also. Some said that evil spirits haunted her, while others diagnosed it as some sort of a disease. 

They said that Patil, being an executive officer of the village, had created many enemies and the weaker ones, unable to retaliate, must have tried a magic spell on his wife. Medicines and all the other types of remedies were tried, and Patil, being a rich man, was fully exploited by unscrupulous people. 

In the process, he spent lot of money, but his wife did not get any relief. Tired of all these efforts, he said, “Now Shri Gajanan Maharaj will be our doctor, saint, God and everything. My wife is his daughter in law. That is my belief and so she needs no other remedies hereafter.” 

Then he asked his wife to take a bath early in the morning, go to the Math and perform Pradakshina of the Samadhi of Shri Gajanan Maharaj every day. She obeyed her husband and started doing as advised. The Pradakshinas were not wasted and she was cured of her ailment. 

Sincere service to a real saint is never wasted, but it should be done with full and unshakable faith. After Shri Gajanan Maharaj, Balabhau took his place and performed somw miracles. He attained Vaikunth at Shegaon on Vaisakh Vadya Shashty, and Narayan then took his place. 

When Balabhau attained Vaikunth, Shri Gajanan Maharaj appeared in Narayan’s dream at Nandura and told him to go to Shegaon and protect to devotees going there. Narayan held the authority for some days and, then, went into Samadhi on Chaitra Sudha Shashty. 

Service to a real saint is great Punya, but it is not possible without past good deeds to your credit. Like the stars in the sky, the legends of Shri Gajanan Maharaj are uncountable. I am an ignorant man and so am unable to describe the ocean like life of Shri Gajanan Maharaj. I have said only that much, which has been told by him to say. 

The pen writes, but it recieves no credit for the writing. In fact, the one who holds the pen writes. A pen is only a means to do that writing. Some is the case here; I have become a pen and the writer is Shri Gajanan Maharaj. It is by His grace, that I have written this Holy Book. 

O listeners, I own no credit for this at all. So, this Gajanan Vijay Granth, composed by Dasganu, is nearing the end and now the final chapter is ahead. 
||SHUBHAM BHAVATU||
 Here ends Chapter Twenty 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 54 / Sri Lalitha Sahasra Nama Stotram - 54 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 98, 99 / Sri Lalitha Chaitanya Vijnanam - 98, 99 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |*
*అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖*

*🌻 98. 'సమయాచారతత్పరా' 🌻*

వైదిక సమయాచారములతో పూజించు పద్ధతియందు మిక్కిలి ఆసక్తి చూపునది శ్రీదేవి యని అర్థము.

వైదిక షోడశ ఉపచార పూజావిధానము, శ్రీచక్ర పూజా విధానము గురుముఖమున పొంది వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో శ్రీదేవిని ఆరాధించుట, గురుముఖమున పొందిన యోగమును కూడ వినయ విధేయతలతో భక్తిశ్రద్ధలతో నిర్వర్తించుకొనుట సమయాచారమని తెలియబడుచున్నది.

1. గురు కటాక్షము (ఉపదేశము), 
2. 2. వినయము, 
3. 3. విధేయత,
4. భక్తి, 
5. 5. శ్రద్ధ. 

శ్రీదేవి పూజనమునకు గాని, యోగ మార్గముద్వారా ఆమె ప్రచోదనమునకు గాని, అత్యవసరమగు అర్హతలు. ముందు తెలుపబడిన నామములలోవలె 6. అప్రకటితుడై, 7. దీక్షితుడై ఆరాధకుడు, ఆరాధనము కావించవలెను. 8. సాధనా మార్గమున దృఢత్వము, 9. నిత్యానుసంధానము అవసరము.

ఇట్లే తొమ్మిది లక్షణములతో అభ్యాసము చేయువానికి కాలక్రమమున కుండలినీ శక్తి (శ్రీదేవి) మూలాధారము నుండి ఊర్థ్వముఖియై మణిపూరకమును చేరును. అపుడారాధనమున శ్రీదేవి పాదపూజ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వర్తించుకొనుచు, ఆ పాదముల దివ్యకాంతి వైభవము ఊహించుచు దర్శించుటకు ప్రయత్నింప వలెను. 

నలుబది నాలుగవ నామమున శ్రీదేవి పాదముల గోళ్ళనుండి ప్రసరించు దివ్యకాంతులు అజ్ఞానమును తొలగించి, జ్ఞానము నొసగునని తెలుపబడినది. రజస్తమోగుణములు హరింపబడి సత్త్వగుణము ఆవిష్కరింప బడుటకు దేవి పాదములను హృదయమందు అత్యంత సుందరముగను, కోమలముగను, కాంతివంతముగను, అలంకార యుతముగను, పసుపు పారాణి దిద్దబడిన వానిగను, గోళ్ళనుండి తేజోమయమగు కాంతులు విరజిమ్ము చున్నట్లుగను, ఊహించుట, భావించుట, దర్శించుట చేయవలెను. 

అనుపమానము, అతి సుందరము, అత్యంత శక్తిమంతము అగు పాదములను ఆరాధన చేయుటమే ముఖ్యము. పాదధ్యానము చేతనే, అజ్ఞానము నాశన మగును. హృదయమందలి కల్మషములు
హరింపబడుట కిది యొక్కటియే మార్గము. ఈ సందర్భమున 44, 45, 46 నామములు మరల పఠించుట ఉత్తమము. 

హృదయమున కల్మషములు హరింపబడగా, స్తోత్రాదికములు గావించి, తాంబూలాది పర్యంతము శ్రీదేవికి హృదయమున ఉపచారములు చేసినచో దేవి చైతన్యము హృదయము నుండి ఊర్ధ్వగతి చెంది విశుద్ధిని చేరగా మణిమయ కాంతులతో కూడిన దేవి దర్శనము కాగలదు. 

అవి అన్నియు శ్రీదేవి చంద్రకళా కాంతులు. అటుపైన మంగళహారతి సమయమునకు ఆజ్ఞను చేరిన శ్రీదేవి ధ్యాన పరవశులైన ఆరాధకులకు సహస్రదళ కమలమునందు సదాశివునితో చేరును. శ్రీరామకృష్ణ పరమహంసవంటి మహాభక్తులీ విధముగ దేవి పూజనమున సర్వమును పొందిరి. 

ఆ మహాత్మునికి దేవిని పూజించు చుండగ లోన సుషుమ్న మార్గమున మూలాధారమున నున్నదేవి, ఊర్థ్వగతి చెందుచు, తరచూ సహస్రారము చేరుచుండెడిది ఆయన తన్మయుడై సమాధిస్థితి పొందుచు నుండెడివాడు. 

ఇటీవలి కాలమున శ్రీరామకృష్ణుని కన్న పరమభక్తుడు మరియొకరు గోచరింపరు. అమ్మ అనుగ్రహమున అతను సమస్తమును తెలుసుకొనెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 98 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Samayācāra-tatparā समयाचार-तत्परा (98) 🌻*

Worshipping Lalitai in the cakra-s of kuṇḍalinī, beginning from mūlādhāra cakra is called samayācāra.  

This is explained in Rudrayāmala, an ancient scripture, as told by Śiva Himself to Śaktī. This nāma means that She likes samayācāra worship.  

This worship can be done only mentally. Initiation from a Guru is the first step in this worship. This initiation will culminate in pūrṇa abhiṣeka (mantra bath) that will be performed by guru to the disciple.  

The initiation by the guru will make the kuṇḍalinī ascend from the perineum to the six cakra-s. Guru will guide his disciple at each level and at each cakra. Guru will not perform the mantra bath on the disciple unless he is convinced that the disciple has attained a particular stage from where, the disciple could carryon on his own.  

Guru also will not perform this ritual unless the disciple pursues the right path of Self realisation. After this ritual of mantra bath, there is yet another ritual called mahā veda samskāra, a fire ritual.  

This mahā veda saṃskāra will be done only on the day of mahā navami (ninth day of Dasara celebrations) which occurs once in a year. (After completing all such formalities, the sādhaka (practitioner) will have to go to an isolated place and commences his samayācāra meditation, i.e. meditation on the six cakra-s and the sahasrāra. There is a prescribed procedure for this worship.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹.

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 99 / Sri Lalitha Chaitanya Vijnanam - 99 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |*
*మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ‖ 38 ‖*

*🌻 99. 'మూలాధారైక నిలయా' 🌻*

మూలాధారము తన నివాస స్థానముగ గలది శ్రీదేవియని అర్థము.

మూలమున శక్తి, శిరస్సు పైభాగమున శివుడు, రెంటిని అనుసంధానము చేయు సుషుమ్న, వీని మధ్య సమస్త లోకములు భావింప వచ్చును. మూలాధార చక్రమున కుండలినీ శక్తి నిద్రించుచుండును. ఉపదేశ మార్గమున దేవి మేల్కాంచగలదు. సృష్టి యందామె స్థానము మూలయే. సహస్రారము చేరినచో శివునితో ఐక్యము చెందును. అప్పుడు సృష్టి అదృశ్యమగును. ఆమె శివుని నుండి దిగివచ్చుటయే సృష్టి. మూలాధారమున స్థిరముగ నుండుట స్థితి. తిరోధానము చేయుట లయము. 

యోగము, ఆరాధనము, మార్గముల ద్వారా జీవుడు తిరోధానము చెందుటకు కూడ అమ్మయే సూత్రధారిణి, ఆమె జీవుని సుషుమ్న మార్గము ద్వారా ఊర్ధ్వమునకు గొనిపోవుచుండగ జీవునికి మాయా మోహములు వీడును. తాను శివశక్తి స్వరూపుడే అని తెలియును. వెంట నుండి జీవుని దేవుని వద్దకు తోడ్కొనిపోవునది అమ్మయే. జీవుని వెన్నంటి యుండి వానికి సమస్త లోకానుభవము అందించి, సర్వవిధముల పరితృప్తిని గావించి పరిపూర్ణుని చేయును. ఏయే జీవునకు, ఏ అనుభూతి కలుగవలెనో నిర్ణయించి, తదనుభూతి నందించి పరితృప్తుని గావించుచు తోడ్కొని పోవును.

ప్రతి పద్మమునందు గల ప్రతి దళము ఒక లోకానుభవమునకు సంకేతము. మూలాధారము నుండి సహస్రారమునకు గల మార్గమున
అన్ని పద్మముల దళముల అనుభూతులు పూర్తి గావించుచు ముందుకు తోడ్కొని పోవునేగాని అసంపూర్ణముగ తోడ్కోనిపోవుట యుండదు. జగన్మాతకు జీవులందరు తన సంతానమే యగుట వలన, అందరునూ శివ సమాను లవవలెనని భావించు చుండును. శివుడు పరిపూర్ణుడు. తన భర్త. తన సంతానము కూడ భర్తతో సరిసమానమగు పరిపూర్ణతను పొందుటకు శ్రీదేవి చేయు కృషి అనిర్వచనీయము. సమస్త గురు పరంపర జీవోద్ధరణమునకు ఆమె నియోగించు యోగసైన్యము.

అదియొక మహా సైన్యము. అమ్మ అనుగ్రహ విశేషముతో వారు కారుణ్యమూర్తులై జీవుల నుద్ధరించుటయే తమ జీవనముగ సృష్టియందు నిలచియున్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 99 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Mūlādhāraika-nilayā मूलाधारैक-निलया (99) 🌻*

She resides in mūlādhāra cakra. Mūla means root and ādhāra means support. That is why mūlādhāra cakra is called the base (foundational) cakra. A detailed study of mūlādhāra cakra is made from nāma-s 514 to 520.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు - 80 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 18. అమలిన కర్మ - చిత్తమునకు ఏడు గుణములబ్బును. అవి ఈ విధముగ నున్నవి. 1. కోరికలేమి, 2. నిస్సంకల్పము, 3. కర్మఫల సంగత్యాగము, 4. నిత్యతృప్తి, 5. నిరాశ్రయత, 6. నిరాశ, 7. అపరిగ్రహము. ఈ ఏడు గుణము లబ్బినచో నిగ్రహింపబడిన చిత్తము గలవాడై యుండును. అట్టివాడు నిర్వర్తించు కర్మల నుండి బంధనము పుట్టదు. 🍀*

*📚. 4. జ్ఞానయోగము - 21 📚*

*నిరాశీ ర్యతచిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః |*
*శారీరం కేవలం కర్మ కుర్వ న్నాప్నోతి కిల్బిషమ్ || 21*

ఆశ లేనివాడును, చిత్త నిర్వహణము కలవాడును, ఏ వస్తువును పరిగ్రహింపనివాడును చేయు కర్మనుండి ఎట్టి పాపము (మలినము) పుట్టదు అని యర్థము. 19వ శ్లోకమున సంకల్పము, కోరిక లేకుండుటను గూర్చి దైవము తెలిపినాడు. 20వ శ్లోకమున నిత్యతృప్తి, నిరాశ్రయత, కర్మఫలసంగ త్యాగము తెలిపినాడు. ఈ శ్లోకమున ఆశ లేకుండుట, అపరిగ్రహము, చిత్త నిగ్రహము తెలిపినాడు. 

ఆశ లేనివానికి చిత్తము పలువిధముల పరుగులెత్తదు. ఆశ, కోరిక లేక తృప్తిగ జీవించువానికి, చిత్తము స్థిరపడి సంకల్పములు లేని స్థితి కూడ కలుగును. దీనికి అపరిగ్రహము తోడైనచో చిత్తము లోతుగ స్థిరపడును. ఈ శ్లోకము చేరుసరికి చిత్తమునకు ఏడు గుణములబ్బును. అవి ఈ విధముగ నున్నవి. 

1. కోరికలేమి, 2. నిస్సంకల్పము, 3. కర్మఫల సంగత్యాగము, 4. నిత్యతృప్తి, 5. నిరాశ్రయత, 6. నిరాశ, 7. అపరిగ్రహము. 

ఈ ఏడు గుణము లబ్బినచో నిగ్రహింపబడిన చిత్తము గలవాడై యుండును. అట్టివాడు నిర్వర్తించు కర్మల నుండి బంధనము పుట్టదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 277 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
65. అధ్యాయము - 20

*🌻. సతి కైలాసమునకు పయనమగుట - 4 🌻*

అపుడు శివుడు మార్గమధ్యమునుండి ప్రీతితో దక్షుని వెనుకకు పంపెను. ప్రేమతో నిండిన హృదయము గల శంభుడు గణములతో గూడి తన ధామను చేరుకొనెను (51). శివుడు విష్ణువు మొదలగు దేవతలకు వెనుకకు మరలుడని అనుజ్ఞ ఇచ్చెను. కాని వారు పరమానందముతో, భక్తితో శివుని వెనుక వెళ్లిరి (52). 

శివుడు వారందరితో, తన గణములతో, మరియు తన భార్యతో గూడి హిమవత్పర్వతమునందు ప్రకాశించేతన ధామమును ఆనందముతో చేరుకొనెను (53). అచటకు చేరిన పిదప, దేవతలను, మునులను, ఇతరులను అందరిని ఆదరముతో మిక్కిలి సన్మానము చేసి ఆనందముతో సాగనంపెను (54).

ఆ విష్ణువు మొదలగు దేవతలు, మునులు అందరు శివునితో మాట్లాడి, నమస్కరించి, స్తుతించి, ఆనందముతో నిండిన ముఖములు గల వారై తమ తమ స్థానములకు వెళ్లిరి (55). శివుడు కూడ లోకరీతిని అనుసరించు వాడై తన భార్యయగు దాక్షాయణితో గూడి మిక్కిలి ఆనందించిన వాడై హి మవత్పర్వత మైదానములలో విహరించెను (56). 

జగత్కారణమగు ఆ శంకరుడు సతీ దేవితో గూడి ఆనందముగా నుండెను. ఓ మహర్షీ! కొంతకాలము తరువాత ఆయన పర్వత రాజమగు కైలాసమును చేరుకొనెను (57). స్వాయంభువ మన్వంతరములో పూర్వము వృషభవాహనుని వివాహము జరిగినది. ఆ వృత్తాంతమునంతనూ నేను మీకు చెప్పితిని (58).

వివాహసమయము నందుగాని, యజ్ఞ ప్రారంభమునందుగాని ఎవరైతే వృషభధ్వజుని చక్కగా పూజించి స్థిరచిత్తులై ఈ గాథను వినెదరో (59), వారికి ఆ వివాహాది శుభకర్మలన్నియూ సర్వదా నిర్విఘ్నముగా కొనసాగును (60). 

ఈ శుభగాథను ఆనందముతో వినే కన్య సుఖసౌభాగ్యములతో, శీలాచారములతో, సద్గుణములతో కూడినదై పతివ్రతయై పుత్ర సంతానమును పొందును (61).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహిత యందు సతీఖండలో సతీ వివాహ వర్ణనమనే ఇరువది యవ అధ్యాయము ముగిసినది (20).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 165 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. జాబాలిమహర్షి - 5 🌻*

25. నేటి గుజరాత్‌లో, గోపాలకుడైన సాక్షాత్తూ శ్రీకృష్ణుని నగరమైన ద్వారాపట్టణంలోనే గోవుల పరిస్థితి పరమదారుణంగా ఉంది! ద్వారకా పట్టణం, కృష్ణపూజ, గోపూజ, కృష్ణాష్టమి అని ఏవేవో పండుగలు చేసుకుంటాం, మనం వండుకుని తినడానికి! పిండివంటలు వండుకోవటానికే మనం ఈ పండుగలు చేసుంకుంటున్నామా అనిపిస్తుంది. 

26. కనీసం కృష్ణాష్టమి నాడైనా మనం గోవులను స్మరిస్తున్నామా? ధర్మాన్ని ఆచరిస్తున్నామా? ఎంత భ్రష్టత్వం వచ్చిందంటే, ఇంతకన్నా దుఃఖం ఏమీలేదు. 

27. ఎంతో అజ్ఞానం, ఎంతో నిస్పృహ, జడత్వం, మొండితనం ఉంటే తప్ప అవి చూడలేము. చూచి తట్టుకోలేము. జీవనోపాధికోసమేనా ఇటువంటి భయంకరమైన పాపాలుచేయటం! కోటానుకోట్ల జీవరాశులను కేవలం చంపటానికై పుట్టిస్తున్నారు. చేపలనో, కోళ్ళనో, పశువులనో – చంపటంకోసమే నేడు పుట్టిస్తున్నారు. 

28. సహజంగా జీవకోటి ఎంత ఉందో, ఆ ఉన్నవాటిలో, తమకు అవసరమైనంత వరకు, దొరికినంత మటుకు చంపటం కాదు. వాటిని వ్యాపారం కోసం పుట్టించి చంపటమే ఘోరమయిన విషయం! అయితే ఎందుకు ఇదంతా చెయడం, దేనికోసం అంటే ధనం కోసమే! అమితమైన భోజనం ఉన్నవాళ్ళే వీళ్ళందరూ. వీళ్ళకు అన్నవస్త్రాదులకు లోటులేదు. దారిద్య్రం లేదు. జీవనం సుఖంగా ఉంది. సిరిసంపదలు ఉన్నవి. కాని ధనదాహం!

29. లోపల భారతీయుడి మనస్సులో కాస్తయినా ఆర్యధర్మం మిగిలి ఉంటే, ఈ ఘోరమయిన పాపమ్యొక్క ఫలం ఎలా ఉంటుందో గ్రహించగలడు. కానీ లోపల ఉండవల్సిన ఆ ధార్మికబుద్ధి, ఆ జ్ఞానమూ ఎందుకు పోయింది? ఈ ధనాశ – ధనపిశాచం ఎప్పుడయితే వచ్చిందో, ధర్మం హరించుకుపోయింది. 

30. పిశాచాలు ఉన్నచోట దేవతలు ఉంటారా? ఆ ధనపిశాచం లోపలికిరాగానే హృదయంలో ఉన్న దివ్యత్వం, ఆర్యసంస్కృతి, ఋషులు అంతా ఎక్కడికో పోతారు. కాబట్టే ఈ దౌర్భల్యం ఏర్పడింది. ఈనాడు మన దేశ పరిస్థితులు ఇలా ఉండటానికి కారణం అదే!

31. పాపం పెరిగిపోయిన తరువాత నిదర్శనం ఏముంటుంది? కొంచెం పుణ్యం, కొంచెం పాపంతో ఉండేవాడు; కొంచెం పాపం చేసినట్లయితే, “ఈ పాపం చేస్తున్నావు జాగ్రత్త!” అని స్వప్నంలో ఎవరో కనబడి చెప్పటం జరుగుతుంది. పూర్తిగా పాపంలో ఉండేవాడికి ఎవరూ కనబడరు. 

32. కాబట్టి పుణ్యపాపమిశ్రమ జీవనంలో, పుణ్యంమీద శ్రద్ధ ఉండేవాడికి పాపక్షయం అయ్యే అవకాశం ఉంది. ఈ కారణంచేత నేడు మన దేశంలో ఏ క్షణాన ఏమవుతుందో ఎవరిఖీ తెలియని స్థితి వచ్చింది.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 119 / The Siva-Gita - 119 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 15
*🌻. భక్తి యోగము - 8 🌻*

పయసా సర్పిషా చాపి - మధు నేక్షుర సేనవా,
పక్వామ్ర పలజే నాపి - నారికేళ జలేన వా 36
గందో దకేన వామాం యో -రుద్ర మంత్రం సముచ్చరన్,
అభిసిం చేత్తో నాన్యః కశ్చిత్ప్రి యతమో మమ 37
అధిత్యాభి ముఖో భూత్వా - హ్యూర్ధ్వ బాహుర్జలె స్థితః,
మాం ధ్యాయ న్రవి బింబస్త - మధర్వాంగిరసం జపేత్ 38
ప్రవిశేన్మే శరీర రేసౌ -గృహం గృహ పతిర్యదా,
బృహ ద్రధం తరం వామ - దేవ్యం దేవ వ్రతానిచ. 39
తద్యోగ యాజ్య దేహాంశ్చ - యోగాయతి మమాగ్రతః,
ఇహ శ్రియం పరాం భుక్త్వా -మమ సాయుజ్య మాప్నుయాత్ 40
ఈశావాస్యాది మంత్రాన్యో - జపేన్నిత్యం మమాగ్రతః,
మత్సా యుజ్య మవాప్నోతి - మమ లోకే మహీయతే 41
భక్తి యోగో మయా ప్రోక్త - ఏవం రఘుకులో ద్వహ,
సర్వ కామ ప్రదో మత్తః కి - మన్య చ్చ్రో తు మిచ్చసి.42
ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతాయాం పంచ దశో ధ్యాయః

బృహద్రధం తరమున వామ దేవ్యమును, దేవవ్రతములను వీటికి సంబందించిన యాగము (యజ్ఞము ) చేయ కావలసిన మంత్రములను నా యెదుట నెవడు గానము చేయునో అట్టివాడు ఇహలోకములో సమస్త సంపదలను పొంది యంత్య సమయమున మత్సా యుజ్యమును బడయును. 

ఎవడీ శావాశ్యాది మంత్రములను నా ఎదుట ప్రతి నిత్యము జపించునో వాడు నా సాయుజ్యమున పొందును. కావున ఓయీ దాశరధీ! భక్తియోగము నీ చేత నిట్లు పదేశింప బడినది . ఇది సమస్త కోరికలను మోక్షము నొసగును. ఇకను నేమి యడుగ నుంటివో ప్రశ్నింపుము. 

ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గత మైన శివ గీతలో పదునైదవ అధ్యాయము సమాప్తము 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 119 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 15
*🌻 Bhakthi Yoga - 8 🌻*

With milk, ghee, honey, sugarcane juice, mango juice, coconut water, sandal paste, using any of these substances one who does Abhishekam to be uttering Rudra hymns, there is none who is more dearer than him to me. 

One who stands inside the water facing east and raising his two hands upwards considering me in the rising sun one who chants the Atharvangirasa hymns would merge in me as easily as one enters freely in his own house without any restrictions. 

The sacrifices related to Vamadevyam, Devavratam, Brihadradantam one who performs for me he would gain all riches in his life and after death would reach my abode. one who regularly chants the hymns of the ISavasya upanishad, they would reach my abode.

Therefore O son of Dashratha!, this Bhakti Yoga as preached by me when read by anyone, has the
capability to fulfill all desires and gives salvation. if you have further questions to ask, you may do so.

Here ends the 15th chapter of Shiva Gita from padma Purana Uttara khanda

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 229 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 78. On the state of non-beingness, beingness as the 'I am' has occurred, who that is, is not important, the 'I am' is important, stay there. 🌻*

You were never born. This knowledge 'I am' has quite spontaneously occurred on your unborn state without any reason, just like a dream spontaneously occurring with no reason and volition at all. 

The so-called person or whoever has come to be is of no importance: it is the feeling 'I am', which in its wordless nascent state is important, you have to reside there.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 104 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 9 🌻*

433. అంతర్ముఖ చైతన్య ప్రగతిలో, ఒకటవ భూమికనుండి ఆరవభూమిక వరకు క్రమక్రమముగా వివిధమైన భిన్నసంస్కారములు నామాత్రా విశిష్టమై (ఇంకా అసలు సంస్కారములే లేవు అన్నంతవరకు) పూర్తిగా క్షీణించి పోయినవి. కానీ ద్వంద్వ సంస్కార అవశేషముల చూఛాయ "జాడ" మాత్రము మిగిలియున్నది.

434. ఇచ్చట మానవునిలోనున్న భగవంతుడు మనస్సుతో తాదాత్మ్యమును చెంది "నేను మనస్సు" ననెడి అనుభవమును పొందు చుండును.

435 ఆరవ చైతన్య భూమికలో మానవుని స్థితిలో నున్న మానసిక చైతన్యుడైన భగవంతుడు, భగవంతుని ముఖాముఖీ సుస్పష్టముగా చూడగలిగి నప్పటికీ భగవంతుని సమస్తములో సర్వత్రా చూచుచున్నప్పటికీ, తానింకను మానసిక చైతన్యమందు హత్తుకు పోయి, మనస్సే తాను, తానే,-మనస్సు అన్నట్టి స్థితి యండుండుటచేత; తనను భగవంతునిలో చూడలేకున్నాడు. 

436.ఇతడు భౌతిక సూక్ష్మ లోకములందలి వస్తువులను కూడా చూడగల్గును.ఇంకనుద్వైతమునందే, ఎరుక కలవాడై యున్నాడు.తాను "మనస్సు"గా, భగవంతుని నుండి వేరగుచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 68 / Sri Vishnu Sahasra Namavali - 68 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*అనూరాధ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*

*🌻 68. అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |*
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ‖ 68 ‖ 🌻*

🍀 633) అర్చిష్మాన్ - 
తేజోరూపుడు.

🍀 634) అర్చిత: - 
సమస్త లోకములచే పూజింపబడువాడు.

🍀 635) కుంభ: - 
సర్వము తనయందుండువాడు.

🍀 636) విశుద్ధాత్మా - 
పరిశుద్ధమైన ఆత్మ స్వరూపుడు.

🍀 637) విశోధనః - 
తనను స్మరించు వారి పాపములను నశింప చేయువాడు

🍀 638) అనిరుద్ధః - 
శత్రువులచే అడ్డగింపబడనివాడు.

🍀 639) అప్రతిరథ: - 
తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు.

🍀 640) ప్రద్యుమ్న: - 
విశేష ధనము కలవాడు.

🍀 641) అమిత విక్రమ: - 
విశేష పరాక్రమము గలవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 68 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Anuradha 4th Padam*

*🌻 68. arciṣmānarcitaḥ kuṁbhō viśuddhātmā viśōdhanaḥ |*
*aniruddhōpratirathaḥ pradyumnōmitavikramaḥ || 68 || 🌻*