శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 98, 99 / Sri Lalitha Chaitanya Vijnanam - 98, 99

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 54 / Sri Lalitha Sahasra Nama Stotram - 54 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 98 / Sri Lalitha Chaitanya Vijnanam - 98 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖


🌻 98. 'సమయాచారతత్పరా' 🌻

వైదిక సమయాచారములతో పూజించు పద్ధతియందు మిక్కిలి ఆసక్తి చూపునది శ్రీదేవి యని అర్థము.

వైదిక షోడశ ఉపచార పూజావిధానము, శ్రీచక్ర పూజా విధానము గురుముఖమున పొంది వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో శ్రీదేవిని ఆరాధించుట, గురుముఖమున పొందిన యోగమును కూడ వినయ విధేయతలతో భక్తిశ్రద్ధలతో నిర్వర్తించుకొనుట సమయాచారమని తెలియబడుచున్నది.


1. గురు కటాక్షము (ఉపదేశము),

2. 2. వినయము,

3. 3. విధేయత,

4. భక్తి,

5. 5. శ్రద్ధ.


శ్రీదేవి పూజనమునకు గాని, యోగ మార్గముద్వారా ఆమె ప్రచోదనమునకు గాని, అత్యవసరమగు అర్హతలు. ముందు తెలుపబడిన నామములలోవలె 6. అప్రకటితుడై, 7. దీక్షితుడై ఆరాధకుడు, ఆరాధనము కావించవలెను. 8. సాధనా మార్గమున దృఢత్వము, 9. నిత్యానుసంధానము అవసరము.

ఇట్లే తొమ్మిది లక్షణములతో అభ్యాసము చేయువానికి కాలక్రమమున కుండలినీ శక్తి (శ్రీదేవి) మూలాధారము నుండి ఊర్థ్వముఖియై మణిపూరకమును చేరును. అపుడారాధనమున శ్రీదేవి పాదపూజ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వర్తించుకొనుచు, ఆ పాదముల దివ్యకాంతి వైభవము ఊహించుచు దర్శించుటకు ప్రయత్నింప వలెను.

నలుబది నాలుగవ నామమున శ్రీదేవి పాదముల గోళ్ళనుండి ప్రసరించు దివ్యకాంతులు అజ్ఞానమును తొలగించి, జ్ఞానము నొసగునని తెలుపబడినది. రజస్తమోగుణములు హరింపబడి సత్త్వగుణము ఆవిష్కరింప బడుటకు దేవి పాదములను హృదయమందు అత్యంత సుందరముగను, కోమలముగను, కాంతివంతముగను, అలంకార యుతముగను, పసుపు పారాణి దిద్దబడిన వానిగను, గోళ్ళనుండి తేజోమయమగు కాంతులు విరజిమ్ము చున్నట్లుగను, ఊహించుట, భావించుట, దర్శించుట చేయవలెను.

అనుపమానము, అతి సుందరము, అత్యంత శక్తిమంతము అగు పాదములను ఆరాధన చేయుటమే ముఖ్యము. పాదధ్యానము చేతనే, అజ్ఞానము నాశన మగును. హృదయమందలి కల్మషములు

హరింపబడుట కిది యొక్కటియే మార్గము. ఈ సందర్భమున 44, 45, 46 నామములు మరల పఠించుట ఉత్తమము.

హృదయమున కల్మషములు హరింపబడగా, స్తోత్రాదికములు గావించి, తాంబూలాది పర్యంతము శ్రీదేవికి హృదయమున ఉపచారములు చేసినచో దేవి చైతన్యము హృదయము నుండి ఊర్ధ్వగతి చెంది విశుద్ధిని చేరగా మణిమయ కాంతులతో కూడిన దేవి దర్శనము కాగలదు.

అవి అన్నియు శ్రీదేవి చంద్రకళా కాంతులు. అటుపైన మంగళహారతి సమయమునకు ఆజ్ఞను చేరిన శ్రీదేవి ధ్యాన పరవశులైన ఆరాధకులకు సహస్రదళ కమలమునందు సదాశివునితో చేరును. శ్రీరామకృష్ణ పరమహంసవంటి మహాభక్తులీ విధముగ దేవి పూజనమున సర్వమును పొందిరి.

ఆ మహాత్మునికి దేవిని పూజించు చుండగ లోన సుషుమ్న మార్గమున మూలాధారమున నున్నదేవి, ఊర్థ్వగతి చెందుచు, తరచూ సహస్రారము చేరుచుండెడిది ఆయన తన్మయుడై సమాధిస్థితి పొందుచు నుండెడివాడు.

ఇటీవలి కాలమున శ్రీరామకృష్ణుని కన్న పరమభక్తుడు మరియొకరు గోచరింపరు. అమ్మ అనుగ్రహమున అతను సమస్తమును తెలుసుకొనెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 98 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Samayācāra-tatparā समयाचार-तत्परा (98) 🌻

Worshipping Lalitai in the cakra-s of kuṇḍalinī, beginning from mūlādhāra cakra is called samayācāra.

This is explained in Rudrayāmala, an ancient scripture, as told by Śiva Himself to Śaktī. This nāma means that She likes samayācāra worship.

This worship can be done only mentally. Initiation from a Guru is the first step in this worship. This initiation will culminate in pūrṇa abhiṣeka (mantra bath) that will be performed by guru to the disciple.

The initiation by the guru will make the kuṇḍalinī ascend from the perineum to the six cakra-s. Guru will guide his disciple at each level and at each cakra. Guru will not perform the mantra bath on the disciple unless he is convinced that the disciple has attained a particular stage from where, the disciple could carryon on his own.

Guru also will not perform this ritual unless the disciple pursues the right path of Self realisation. After this ritual of mantra bath, there is yet another ritual called mahā veda samskāra, a fire ritual. 

This mahā veda saṃskāra will be done only on the day of mahā navami (ninth day of Dasara celebrations) which occurs once in a year. (After completing all such formalities, the sādhaka (practitioner) will have to go to an isolated place and commences his samayācāra meditation, i.e. meditation on the six cakra-s and the sahasrāra. There is a prescribed procedure for this worship.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹.


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 99 / Sri Lalitha Chaitanya Vijnanam - 99 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ‖ 38 ‖


🌻 99. 'మూలాధారైక నిలయా' 🌻

మూలాధారము తన నివాస స్థానముగ గలది శ్రీదేవియని అర్థము.

మూలమున శక్తి, శిరస్సు పైభాగమున శివుడు, రెంటిని అనుసంధానము చేయు సుషుమ్న, వీని మధ్య సమస్త లోకములు భావింప వచ్చును. మూలాధార చక్రమున కుండలినీ శక్తి నిద్రించుచుండును. ఉపదేశ మార్గమున దేవి మేల్కాంచగలదు. సృష్టి యందామె స్థానము మూలయే. సహస్రారము చేరినచో శివునితో ఐక్యము చెందును. అప్పుడు సృష్టి అదృశ్యమగును. ఆమె శివుని నుండి దిగివచ్చుటయే సృష్టి. మూలాధారమున స్థిరముగ నుండుట స్థితి. తిరోధానము చేయుట లయము.

యోగము, ఆరాధనము, మార్గముల ద్వారా జీవుడు తిరోధానము చెందుటకు కూడ అమ్మయే సూత్రధారిణి, ఆమె జీవుని సుషుమ్న మార్గము ద్వారా ఊర్ధ్వమునకు గొనిపోవుచుండగ జీవునికి మాయా మోహములు వీడును. తాను శివశక్తి స్వరూపుడే అని తెలియును. వెంట నుండి జీవుని దేవుని వద్దకు తోడ్కొనిపోవునది అమ్మయే. జీవుని వెన్నంటి యుండి వానికి సమస్త లోకానుభవము అందించి, సర్వవిధముల పరితృప్తిని గావించి పరిపూర్ణుని చేయును. ఏయే జీవునకు, ఏ అనుభూతి కలుగవలెనో నిర్ణయించి, తదనుభూతి నందించి పరితృప్తుని గావించుచు తోడ్కొని పోవును.

ప్రతి పద్మమునందు గల ప్రతి దళము ఒక లోకానుభవమునకు సంకేతము. మూలాధారము నుండి సహస్రారమునకు గల మార్గమున

అన్ని పద్మముల దళముల అనుభూతులు పూర్తి గావించుచు ముందుకు తోడ్కొని పోవునేగాని అసంపూర్ణముగ తోడ్కోనిపోవుట యుండదు. జగన్మాతకు జీవులందరు తన సంతానమే యగుట వలన, అందరునూ శివ సమాను లవవలెనని భావించు చుండును. శివుడు పరిపూర్ణుడు. తన భర్త. తన సంతానము కూడ భర్తతో సరిసమానమగు పరిపూర్ణతను పొందుటకు శ్రీదేవి చేయు కృషి అనిర్వచనీయము. సమస్త గురు పరంపర జీవోద్ధరణమునకు ఆమె నియోగించు యోగసైన్యము.

అదియొక మహా సైన్యము. అమ్మ అనుగ్రహ విశేషముతో వారు కారుణ్యమూర్తులై జీవుల నుద్ధరించుటయే తమ జీవనముగ సృష్టియందు నిలచియున్నారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 99 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mūlādhāraika-nilayā मूलाधारैक-निलया (99) 🌻

She resides in mūlādhāra cakra. Mūla means root and ādhāra means support. That is why mūlādhāra cakra is called the base (foundational) cakra. A detailed study of mūlādhāra cakra is made from nāma-s 514 to 520.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


20 Nov 2020

No comments:

Post a Comment