*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 333-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 333-1🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 333 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 333 - 1🌹
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*

*🌻 333-1. 'వారుణీ మదవిహ్వలా' 🌻* 

*'వారుణీ - రసపానముచే కలుగు మదముచే తన్మయత్వము చెందినది శ్రీమాత అని అర్థము. వరుణుడు పశ్చిమమునకు అధిపతి. మిత్రుడు తూర్పున కధిపతి. మిత్రా వరుణులు అశ్వినీ దేవతలు. సృష్టి కధిపతులు. అర్ధనారీశ్వర తత్వములోని నరతత్వము మిత్రుడు కాగా, నారీ తత్వము వరుణుడగు చున్నది. మిత్రా వరుణులు సృష్టి తూర్పు పడమరల కధిపతులు. ఒకరు ప్రజ్ఞ మరియొకరు పదార్థముగ క్రమముగ లోకము లన్నియూ ఏర్పరతురు.*

*మిత్రుడు పురుషుడు, అనగా వసించువాడు. వరుణుడు ప్రకృతి, అనగా పురుషునికి ఉపాధి లేక నివాసము. ఇట్లు అన్నిటి యందును వసనము, వసనమున కాధారమగు వాహనము గోచరించును. ప్రకృతి పురుషులీ విధముగ జీవసృష్టిని కావించుదురు. పై కార్యక్రమములో వరుణుని పాత్ర విశిష్టమైనది. ఏడు లోకముల పదార్థమును క్రమముగ ఏర్పరచుచు పురుషునికి ఆవాసములను కూర్చును. అందు పురుషుడు వసించును. కార్య మంతయు వరుణునిదే. వరుణుని యందు శక్తి ప్రవాహముగ వారుణి యున్నది. వారుణి శ్రీమాతయే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 333-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*

*🌻 333-1. Vāruṇi-mada-vihvalā वारुणि-मद-विह्वला (333) 🌻*

*Vāruṇi is the extract of dates that is allowed to brew and when consumed causes inebriation. By consuming this, She forgets the surroundings and concentrates on Her inner Self (possibly meaning Śiva) is the literal meaning of this nāma. This will be further explained in nāma 878.*

*There is a nāḍi (nerve) called vāruṇi which can be controlled by breath. This nāḍi plays a significant role in excretion of bodily waste. If this nāḍi is brought under control by proper breathing exercises, one will never feel tiredness in the body. Sages keep this nāḍi under their control to cope up with longer duration of meditation. She is said to be in form of this nāḍi. This nāma could not have been conceptualised by any human brain to convey such an intricate meaning, other than Vāc-devi-s.* 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 115 🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 115 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నిన్ను నువ్వు ప్రేమించు, ఎందుకంటే ప్రేమ గుండానే నువ్వు సమశృతిలో సాగుతావు. సంపూర్ణుడవుతావు. నిన్ను నువ్వు విమర్శించకు. నీకో ఆత్మ యివ్వబడింది. ఉనికిలో ఒక భాగం యివ్వబడింది. వ్యక్తి అంతకు మించి అడక్కూడదు. 🍀*

*నిన్ను నువ్వు ప్రేమించు, ఎందుకంటే ప్రేమ గుండానే నువ్వు సమశృతిలో సాగుతావు. సంపూర్ణుడవుతావు. నిన్ను నువ్వు విమర్శించకు. నీకు గొప్ప అందమైన శరీరం యివ్వబడింది. నీకు మనసనే అద్భుతమైన యాంత్రిక నిర్మాణం యివ్వబడింది. దాన్ని సరిగా వుపయోగిస్తే దానికెంతో ప్రాముఖ్యముంది. అది అధికారిగా మారితే ప్రమాదం. నువ్వు అధికారిగా వుంటే ప్రమాదముండదు. అది అద్భుతమైన సేవకుడు. నీకో ఆత్మ యివ్వబడింది. ఉనికిలో ఒక భాగం యివ్వబడింది. వ్యక్తి అంతకు మించి అడక్కూడదు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 48 🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 48 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
* సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 36. ధీరత 🌻*

*కుంభయుగమున మా గురుపరంపరను చేరుటకు, మా బృందముతో చేతులు కలిపి జగత్కళ్యాణ కార్యములు నిర్వర్తించుటకు అవకాశము మెండు. ఎవరైతే తనయందు ఈ క్రింద తెలిపిన లక్షణములను వికసింప చేసుకోగలరో, వారు మా కార్యక్రమమందలి స్వల్ప భాగమును నిర్వర్తించుటకు అర్హతను సంపాదించు కొనగలరు. ఈ క్రింద తెలిపిన లక్షణములన్నియు వికసించుట వలన మాత్రమే, అట్టి అర్హత లభించును.*

*1) పరిపూర్ణ బాధ్యతతో వైద్యము చేయుట;*
*2) 2) ధర్మజ్ఞానము గలిగి, విషమ పరిస్థితుల యందు ధర్మనిర్ణయము చేయగలుగుట;*
*3) పవిత్ర గ్రంథములను వివరించుట, బోధించుట; ఆచరణాత్మకముగ యోగజీవనమును, నిర్వర్తించుచూ యోగవిద్య నభ్యసింపజేయుట;*

*సృజనాత్మక శక్తితో, నిర్మాణాత్మకమగు సంఘసేవా కార్యక్రమములను నిర్వర్తించుట, బాధ్యతపడుటకు భయపడువారు, సంకోచించువారు, సందేహ పడువారు యోగమార్గమునకు అనర్హులు. బాధ్యతలను ఉత్సాహముగ స్వీకరించి, నిర్వర్తించి, సఫలీకృతులగు ధీరులే యోగవిద్యను ఆకళింపు చేసుకొని ఉత్తీర్ణులు కాగలరు. ధీరత మీకును, మాకును మధ్య సూత్రము వంటిది. ధీరతయే సమస్త విజయములకు కారణము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🌹 DAILY WISDOM - 209 🌹

*🌹 DAILY WISDOM - 209 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 27. Karma Yoga of the Gita is Divine Action 🌻*

*There is a transcendental type of activity which the human mind in its present state cannot understand, and that is the significance behind the great gospel of the karma yoga of the Gita. Karma yoga can be said to be a transcendental action. It is not my action or your action; it is not activity in a commercial sense. It is an activity which is commensurate with the law of the cosmos. It is, again, an activity which is based on samkhya buddhi—we have not to forget this point. The enlightenment of the samkhya, to which we made reference earlier, is the basis of this action called ‘yoga' in the Bhagavadgita.*

*The karma yoga of the Gita is therefore divine action, in one sense. It is not human action, because the human sense of values gets overcome, transcended in the visualisation of the involvement of the seer in the seen universe. Every thought becomes a kind of universal interpretation of things, and every action becomes a universal action. That action is divine action, and universal action is God acting—the two are not separate—and this action cannot produce reaction. Therefore there is no bondage in performing this kind of action.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 531 / Vishnu Sahasranama Contemplation - 531🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 531/ Vishnu Sahasranama Contemplation - 531🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻531. మహర్షిః కపిలాచార్యః, महर्षिः कपिलाचार्यः, Maharṣiḥ Kapilācāryaḥ🌻*

*ఓం మహర్షయేకపిలాచార్యాయ నమః | ॐ महर्षयेकपिलाचार्याय नमः | OM Maharṣayekapilācāryāya namaḥ*

కపిలాచార్యః, कपिलाचार्यः, Kapilācāryaḥ

మహర్షిః కపిలాచార్యః ఇత్యేకం సవిశేషణం ।
మహాంశ్చాసావృషిశ్చేతి మహర్షిః కపలో హరిః ॥
దేవహూత్యాత్మసమ్భూతః కృత్స్నవేదస్య దర్శనాత్ ।
అన్యే తు వేదైకదేశదర్శనాదృషయః స్మృతాః ॥
శుద్దాత్మతత్త్వజ్ఞానస్య సాఙ్ఖ్యస్యాచార్య ఇత్యయమ్ ।
మహర్షిః కపిలాచార్య ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

*ఇక్కడ 'మహర్షిః' విశేషణముగా 'కపిలాచార్యః' విశేష్యముగా సవిసేషణమగు ఒకే నామముగా ఈ రెండు పదములును గ్రహించబడును. ఇతరులు వేదపు అల్పాంశమును దర్శించినవారు అగుటచే ఋషులు అనబడుదురు. వేద మంత్ర ద్రష్టకు 'ఋషి' అని వ్యవహారము. కపిలుడు సమగ్ర వేదమునే దర్శించెను. కావున మహాన్ అగు ఋషి లేదా మహర్షి అగును. దేవహూతీ కర్దమ ప్రజాపతులకు విష్ణుదేవుడే పుత్రుడుగా జన్మించెను. ఈతడు 'కపిలః' అను నామము కలవాడును, శుద్ధ తత్త్వ విజ్ఞానమగు సాంఖ్య దర్శనమునకు ఆచార్యుడును కావున 'కపిలాచార్యః' అనబడును.*

:: శ్రీమద్భగవద్గీత విభూతి యోగము ::
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః ।
గన్ధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ॥ 26 ॥

*నేను చెట్లన్నిటియందును రావిచెట్టును. దేవర్షులలో నారదుడను. గంధర్వులలో చిత్రరథుడను. సిద్ధులలో కపిలమునీంద్రుడను నేనే అయియున్నాను.*

:: శ్వేతాశ్వతరోపనిషత్ - పఞ్చమోఽధ్యాయః ::
ఓం ద్వే అక్షరే బ్రహ్మపరే త్వనన్తే విద్యాఽవిద్యే నిహితే యత్ర గూఢే । 
క్షరం త్వవిద్యా హ్యమృతం తువ్ దియా । 
విద్యాఽవిద్యే ఈశతే యస్తుసోఽన్యః ॥ 1 ॥
యోఽయోనిం యోని మదితిష్ఠ త్యేకో విశ్వాని రూపాణి యోనిశ్చ సర్వాః ।
ఋషిం ప్రసూతం కపిలం యస్తమగ్రేజ్ఞానైర్భి జాయమానం చ పశ్యేత్ ॥ 2 ॥

*విద్య, అవిద్య అనునవీరెండునూ నాశరహితములు, అపరిచ్ఛిన్నములు. పరబ్రహ్మమునందు నిగూఢముగా ఉంచబడినవి. అవిద్య నశించునది, విద్య అమృతము. ఎవడు విద్యా అవిద్యలను నియమించుచున్నాడో, అతడు వాటికంటె అన్యముగానున్నవాడు. పృథివ్యాది సకల యోనులను, సకల రూపములను అయా ఉత్పత్తి స్థానములను ఎవడు అధిష్ఠించియున్నాడో, సర్వజ్ఞుడును కపిలవర్ణముగలవాడునూనగు హిరణ్యగర్భుని ఆదిలో ఎవడు సృజించెనో, సృష్టిసమయములో ఎవడు ధర్మజ్ఞాన వైరాగ్య భాగ్యములను భరించియున్నాడో, అతడే పరమాత్మ.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 531🌹*
📚. Prasad Bharadwaj

*🌻531. Maharṣiḥ Kapilācāryaḥ🌻*

*OM Maharṣayekapilācāryāya namaḥ*

महर्षिः कपिलाचार्यः इत्येकं सविशेषणं ।
महांश्चासावृषिश्चेति महर्षिः कपिलो हरिः ॥
देवहूत्यात्मसम्भूतः कृत्स्नवेदस्य दर्शनात् ।
अन्ये तु वेदैकदेशदर्शनादृषयः स्मृताः ॥
शुद्दात्मतत्त्वज्ञानस्य साङ्ख्यस्याचार्य इत्ययम् ।
महर्षिः कपिलाचार्य इति सङ्कीर्त्यते बुधैः ॥ 

Maharṣiḥ kapilācāryaḥ ityekaṃ saviśeṣaṇaṃ,
Mahāṃścāsāvr‌ṣiśceti maharṣiḥ kapilo hariḥ.
Devahūtyātmasaṃbhūtaḥ kr‌tsnavedasya darśanāt,
Anye tu vedaikadeśadarśanādr‌ṣayaḥ smr‌tāḥ.
Śuddātmatattvajñānasya sāṃkhyasyācārya ityayam,
Maharṣiḥ kapilācārya iti saṃkīrtyate budhaiḥ.

*This is one Name with an adjective; mahān r‌ṣiḥ is Mahar‌ṣiḥ i.e., He is great as he saw with intuitive vision the entire body of Vedas. Others are only ordinary r‌ṣis as they saw only a part of the knowledge of Sāṅkhya which is also Truth.*

:: श्रीमद्भगवद्गीत विभूति योग ::
अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः ।
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥ २६ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 10
Aśvatthaḥ sarvavr‌kṣāṇāṃ devarṣīṇāṃ ca nāradaḥ,
Gandharvāṇāṃ citrarathaḥ siddhānāṃ kapilo muniḥ. 26.

*Among all trees, I am the Aśvattha i.e., fig tree and Nārada among the divine sages. Among the Gandharvas I am Citraratha and among the perfected ones, the sage Kapila.*

Śvetāśvatara Upaniṣat - Chapter 5
Oṃ dve akṣare brahmapare tvanante vidyā’vidye nihite yatra gūḍe, 
Kṣaraṃ tvavidyā hyamr‌taṃ tuv diyā,
Vidyā’vidye īśate yastuso’nyaḥ. 1.
Yo’yoniṃ yoni maditiṣṭha tyeko viśvāni rūpāṇi yoniśca sarvāḥ,
R‌ṣiṃ prasūtaṃ kapilaṃ yastamagrejñānairbhi jāyamānaṃ ca paśyet. 2.

*In the Immutable, infinite Supreme Brahman remain hidden the two: knowledge and ignorance. Ignorance leads to worldliness and knowledge, to Immortality. Brahman, who controls both knowledge and ignorance, is different from both.*

*He, the non-dual Brahman, who rules over every position; who controls all forms and all sources; who, in the beginning, filled with knowledge the omniscient Hiranyagarbha, His own creation, whom He beheld when He (Hiranyagarbha) was produced - He is other than both knowledge and ignorance.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥
Maharṣiḥ kapilācāryaḥ kr‌tajño medinīpatiḥ,Tripadastridaśādhyakṣo mahāśr‌ṃgaḥ kr‌tāntakr‌t ॥ 57 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/ 

🌹. శ్రీమద్భగవద్గీత -134 / Bhagavad-Gita - 134 🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 134 / Bhagavad-Gita - 134 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 15 🌴*

*15. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ |*
*తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్ ||*

🌷. తాత్పర్యం :
*నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపపడగా, అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్టితమై యుండును.*

🌷. భాష్యము :
కేవలము శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కర్మనొనరింపవలసిన అవసరము (యజ్ఞార్థకర్మ) ఈ శ్లోకమునందు మరింత నొక్కి చెప్పబడినది. యజ్ఞపురుషుడైన విష్ణువు ప్రీత్యర్థమే మనము కర్మ చేయవలెనన్నచో కర్మకు సంబంధించిన మార్గదర్శకత్వమును బ్రహ్మమునందే పొందవలెను. కనుకనే వేదములు కర్మనొనరించుటకు మార్గదర్శక సూత్రములై యున్నవి. వేదనిర్దేశము లేకుండా ఒనరింపబడెడి కర్మము వికర్మగా(అప్రమాణికకర్మ) లేదా పాపకర్మగా తెలియబడును. కనుక కర్మఫలము నుండి రక్షింపబడుటకు ప్రతియొక్కరు వేదముల నుండి మార్గదర్శకత్వమును పొందవలెను. 

సాధారణ జీవతమున మనుజుడు దేశము యొక్క రాజ్యంగ నిర్దేశము నందు పనిచేయు రీతి ప్రతి యెక్కరును భగవానుని నిర్దేశములోనే కర్మ నొనరించవలెను. వేదములందలి అట్టి నిర్దేశములు ప్రత్యక్షముగా అతని శ్వాస ద్వారా ప్రకటనమై యున్నవి. అస్య మహతో భూతస్య నిశ్యసితమేతత్ యద్ ఋగ్వేదో యజుర్వేద: సామవేదో(థర్వాంగిరస: -ఋగ్బేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదమనెడి నాలుగు వేదములు దేవదేవుని శ్వాస నుండి బహిర్గతమైనవి (బృహదారాణ్యకోపనిషత్తు 4.5.11). 

భగవానుడు సర్వశక్తిసమన్వితుడు కావున శ్వాస ద్వారాను భాషించగలడు. శ్రీకృష్ణభగవానుడు తన ప్రతి ఇంద్రియము ద్వారా ఇతరేంద్రియ కార్యములను సైతము చేయగలిగిన శక్తిసామర్థ్యములు కలిగియున్నాడని తెలుపుచు బ్రహ్మసంహిత ఈ విషయమును నిర్దారించచున్నది. అనగా భగవానుడు శ్వాస ద్వారాను మాట్లాడగలడు. కన్నుల ద్వారాను సృజింపగలడు. వాస్తవమునకు అతడు ప్రకృతిని వీక్షించుట ద్వారానే జీవులను సృష్టించెనని తెలుపబడినది. బద్ధజీవులను ఆ విధముగా ప్రకృతి గర్భమున సృజించిన పిమ్మట వారు ఏ విధముగా తరిగి తన ధామమును చేరగలరో తెలుపుటకు అతడు వేదవిజ్ఞానమునందు నిర్దేశములు నొసగెను. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 134 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 15 🌴*

*15. karma brahmodbhavaṁ viddhi brahmākṣara-samudbhavam*
*tasmāt sarva-gataṁ brahma nityaṁ yajñe pratiṣṭhitam*

🌷Translation :
*Regulated activities are prescribed in the Vedas, and the Vedas are directly manifested from the Supreme Personality of Godhead. Consequently the all-pervading Transcendence is eternally situated in acts of sacrifice.*

🌷 Purport :
Yajñārtha-karma, or the necessity of work for the satisfaction of Kṛṣṇa only, is more expressly stated in this verse. If we have to work for the satisfaction of the yajña-puruṣa, Viṣṇu, then we must find out the direction of work in Brahman, or the transcendental Vedas. The Vedas are therefore codes of working directions. 

Anything performed without the direction of the Vedas is called vikarma, or unauthorized or sinful work. Therefore, one should always take direction from the Vedas to be saved from the reaction of work. As one has to work in ordinary life by the direction of the state, one similarly has to work under direction of the supreme state of the Lord. 

Such directions in the Vedas are directly manifested from the breathing of the Supreme Personality of Godhead. It is said, asya mahato bhūtasya niśvasitam etad yad ṛg-vedo yajur-vedaḥ sāma-vedo ’tharvāṅgirasaḥ. “The four Vedas – namely the Ṛg Veda, Yajur Veda, Sāma Veda and Atharva Veda – are all emanations from the breathing of the great Personality of Godhead.” (Bṛhad-āraṇyaka Upaniṣad 4.5.11)
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🌹. నిత్య పంచాంగము Daily Panchangam 26, ఆదివారము, డిసెంబర్ 2021 భాను వాసరే

*🌹.  నిత్య పంచాంగము - శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 26, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ సూర్య స్తుతిః 🍀*

*యతః సామమయశ్చైవ తతో నాథ త్రయీమయః |*
*త్వమేవ బ్రహ్మణో రూపం పరంచాపరమేవ చ || 9||*
*మూర్తామూర్తస్తథా సూక్ష్మః స్థూలరూపస్తథా స్థితః |*
*నిమేషకాష్ఠాదిమయః కాలరూపః క్షయాత్మకః |*
*ప్రసీద స్వేచ్ఛయా రూపం స్వతేజః శమనం కురు || 10 ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ సప్తమి 20:09:45 వరకు 
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 29:26:28 
వరకు తదుపరి హస్త
యోగం: ఆయుష్మాన్ 10:24:56 
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: విష్టి 08:12:45 వరకు
వర్జ్యం: 12:24:00 - 14:01:20
దుర్ముహూర్తం: 16:20:43 - 17:05:06
రాహు కాలం: 16:26:16 - 17:49:29
గుళిక కాలం: 15:03:02 - 16:26:16
యమ గండం: 12:16:34 - 13:39:48
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:38
అమృత కాలం: 22:08:00 - 23:45:20
సూర్యోదయం: 06:43:39
సూర్యాస్తమయం: 17:49:29
వైదిక సూర్యోదయం: 06:47:32
వైదిక సూర్యాస్తమయం: 17:45:36
చంద్రోదయం: 00:01:31
చంద్రాస్తమయం: 11:51:22
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: సింహం
మిత్ర యోగం - మిత్ర లాభం 
29:26:28 వరకు తదుపరి 
మానస యోగం - కార్య లాభం
పండుగలు : కాలాష్టమి
Kalashtami
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 172 / Sri Lalita Sahasranamavali - Meaning - 172 🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 172 / Sri Lalita Sahasranamavali - Meaning - 172 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 172. స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా ।*
*మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః ॥ 172 ॥ 🍀*

🍀 926. స్తోత్రప్రియా : 
స్తోత్రములు అనిన ఇస్టము కలిగినది

🍀 927. స్తుతిమతే : 
స్తుతించుట అనిన ఇస్టము కలిగినది

🍀 928. శ్రుతిసంస్తుతవైభవా : 
వేదములచేత స్తుతింపబడెడి వైభవము కలిగినది

🍀 929. మనస్వినీ : 
మనస్సు కలిగినది

🍀 930. మానవతీ : 
అభిమానము కలిగినది

🍀 931. మహేశే : 
మహేశ్వర శక్తి

🍀 932. మంగాళాకృతి: : 
మంగలప్రదమైన రూపము కలిగినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 172 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 172. Stotrapriya stutimati shruti sanstuta vaibhava*
*Manasvini manavati maheshi mangalakrutih ॥ 172 ॥ 🌻*

🌻 926 ) Stotra priya - She who likes chants

🌻 927 ) Sthuthi mathi -   
She who gives boons for those who sing her chants

🌻 928 ) Sthuthi samsthutha vaibhava -   
She who is worshipped by the Vedas

🌻 929 ) Manaswaini -   
She who has a stable mind

🌻 930 ) Manavathi -   
She who has big heart

🌻 931 ) Mahesi - She who is the greatest goddess

🌻 932 ) Mangala kruthi - She who does only good.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  

https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🌹 Osho Daily Meditations - 113 🌹

*🌹 Osho Daily Meditations - 113 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 113. BREAVERY 🍀*

*🕉 You have been taught very egoistical ideals--“Be brave." What nonsense! How can an intelligent person avoid fear? 🕉*
 
*Everybody is afraid-they have to be. Life is such that one has to be. And people who become fearless become fearless not by becoming brave-because brave people have only repressed their fear; they are not really fearless. A person becomes fearless by accepting his or her fears. It is not a question of bravery. It is simply seeing into the facts of life and realizing that fears are natural. One accepts them! The problem arises when you want to reject them. You have been taught very egoistical ideals-"Be brave." What nonsense! How can an intelligent person avoid fear?*

*The bus driver goes on honking, and you stand in the middle of the road unafraid, or a bull comes charging at you, and you stand there unafraid-this would be stupid! An intelligent person has to jump out of the way. Or if there is nobody on the road, and then too you are afraid and start running, there is a problem; otherwise, fear is natural. It is not that there will be no fears in life. You will come to know that ninety percent of your fears are just imagination. About ten percent are real, so one has to accept them. Become more responsive, sensitive, and alert, and this will be enough. You will become aware that you can use your fears as stepping stones.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 124 🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 124 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 9 🌻* 

*అఖండమయిన పరమ ప్రేమ హృదయమంతా నిండాటలంటే, ఊరకే ప్రేమ మయములగు లోక క్షేమాన్ని గూర్చిన తలంపులు చాలవు. ఆచరణ కావాలి. మనస్సును ఆచరణలోకి దింపినపుడు ప్రేమ గాఢమగును. కావున లోక హితానికై తన జీవ లక్షణానికి సరిపోవు కార్యక్రమాన్ని ఒక గంట అయినా రోజులో చేపట్టాలి. క్రమంగా దినచర్య అంతా అదే కావాలి.*

*మనసు అర్పించకుండా యాంత్రికంగా సేవలో పాల్గొన్నచో కూడా మంచిదే కాని తన ఉద్ధరణ ఆలస్యమగును. మనసా వాచా కర్మణ లోకహితాచరణకు జీవితాన్ని అర్పించుకొన్న కొలదీ పరమగురువులు తమ ప్రణాళికా నిర్వహణలోకి మనల్ని పరికరాలుగా ఉపయోగించు కుంటారు. అపుడు మనం చేసేవి అని ఉండదు. మన ద్వారా వాండ్లే చేస్తుంటారు.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🌹. వివేక చూడామణి - 172 / Viveka Chudamani - 172 🌹

*🌹. వివేక చూడామణి - 172 / Viveka Chudamani - 172 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -19 🍀*

*560. శరీరము దాని భాగములు, ప్రాణములు, బుద్ది మొదలగునవి నశించినప్పటికి; చెట్టుకు ఆకు, పువ్వు, పండు వలె చెట్టుకు ఎట్టి సంబంధము లేనట్లు, యోగికి కూడా తన శరీర భాగములను గూర్చి పట్టింపు లేదు. ఎందువలనంటే అది తన ఆత్మ పై ఎట్టి ప్రభావమును చూపదు. ఆత్మ స్వచ్ఛము, బ్రహ్మానంద స్వరూపము కావున; చెట్టు ఏవిధముగా జీవించి ఉంటుందో అలానే ఆత్మకు ఎట్టి చావు లేదు.*

*561. సృతులు బ్రహ్మము యొక్క నిజమైన స్వభావమును ఈ విధముగా వర్ణించాయి. ‘జ్ఞానముతో నిండి ఉన్నది. అది సత్యము, దీని వలన కనిపిస్తున్న పరిమితులన్ని నశింపబడతాయి’.*

*562. ఇంకను సృతులు ఏమి చెప్పుచున్నవంటే ‘ఆత్మ పూర్తిగా శాశ్వతమైనది. అట్టి శాశ్వతత్వము కలిగిన ఆత్మ అశాశ్వతమైన నాశనమయ్యే వస్తు విశేషముల మధ్యలో మార్పులతో కూడిన వాటికి అంటకుండా మధ్యలో మార్పులతో కూడిన వాటి మధ్య ఉన్నవి’.*

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 172 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -19 🌻*

*560. The destruction of the body, organs, Pranas and Buddhi is like that of a leaf or flower or fruit (to a tree). It does not affect the Atman, the Reality, the Embodiment of
Bliss – which is one’s true nature. That survives, like the tree.*

*561. The Shrutis, by setting forth the real nature of the Atman in the words, "The Embodiment of Knowledge" etc., which indicate Its Reality, speak of the destruction of the apparent limitations merely.*

*562. The Shruti passage, "Verily is this Atman immortal, my dear", mentions the immortality of the Atman in the midst of things perishable and subject to modification.*

*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🌹 . శ్రీ శివ మహా పురాణము - 494 🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 494 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 39

*🌻. శివుని యాత్ర - 4 🌻*

అందరు ఇట్లు పలికిరి-

మహాదేవా! మహేశ్వరా! పార్వతీ మహాదేవిని వివాహమాడుట కొరకై మాతో గూడి శీఘ్రమే బయలు దేరుము. దయను చూపుము (44). అపుడు జ్ఞానముచే సంతుష్టమైన మనస్సు గల విష్ణువు భక్తితో శంకరునకు నమస్కరించి సందర్భమునకు అనురూపమగు మాటలను ఇట్లు పలికెను (45).

విష్ణువు ఇట్లు పలికెను-

దేవ దేవా! మహాదేవా! శరణు జొచ్చిన వారిపై నీకు ప్రీతి మెండు. నీవు నీ భక్తుల కార్యములను చక్కబెట్టెదవు. ఓ ప్రభూ! నావిన్నపమును వినుము (46). శంభో! శంకరా! నీవు పార్వతీ దేవిని గృహ్యసూత్రములలో చెప్పబడిన విధానములో వివాహమాడదగుదువు (47). హే హరా! నీవు వివాహవిధిని పాటించినచో, లోకము నందు ఆ విధి అంతటా ఖ్యాతిని పొందగలదు (48). ఓ నాథా! వారి కులధర్మమునను సరించి మండప స్థాపనమును, నాందీముఖమును ప్రీతి పూర్వకముగా అనుష్ఠించి, లోకములో నీ కీర్తిని విస్తరింపజేయుము (49).

బ్రహ్మ ఇట్లు పలికెను-

విష్ణువు ఇట్లు పలుకగా, లోకాచారమునందు శ్రద్ధ గల శంభుపరమేశ్వరుడు ఆ కర్మలను యథావిధిగా చేసెను (50). ఆయనచే నియోగింపబడని నేను మునులతో గూడి అచట అభ్యుదయమునకు తగిన ఆ కర్మలను అన్నింటినీ ప్రీతితో ఆదరముతో చేసితిని (51). ఓ మహర్షీ! కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, భాగురి, గురుడు, కణ్వుడు, బృహస్పతి, శక్తి, జమదగ్ని పరాశరుడు (52), మార్కండేయుడు, శిలాపాకుడు, అరుణపాలుడు, అకృతశ్రముడు, అగస్త్యుడు, చ్యవనుడు, గర్గుడు, మరియు శిలాదుడు అచటకు విచ్చేసిరి (53).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🌹. గీతోపనిషత్తు -296 🌹

*🌹. గీతోపనిషత్తు -296 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 18-2
 
*🍀 18-2. పరతత్వము - ఈశ్వరుడగు ప్రభువు జీవుల పుట్టుకకు, వారి ఆలన పాలనకు కూడ స్వామియై యుండును. కనుక సాధారణ ప్రభువుల యందు ఉన్నటువంటి ఈశ్వరునే ప్రభువుగ భావింపవలెను. ప్రభువుల యందున్న ప్రభువును చూచుట నేర్వవలెను. ప్రతి ఒక్కరు తనయందలి ఈశ్వరుడు తమను అను నిత్యము గమనించు చున్నాడని తెలిసి యుండవలెను. అట్టి ఎరుక వలన మనము అతిక్రమించి వర్తించుటను అరికట్టును. అట్టి వానిని కామిని, మోహిని, ఆసురి లక్షణములు స్పృశింప లేవు.🍀*

*గతి ర్బరా ప్రభు స్పాక్షీ నివాస శ్శరణం సుహృత్ |*
*ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ II 18*

*తాత్పర్యము : నేనే సమస్త జీవులకు గతి (లక్ష్యము). సమస్తమును భరించువాడను నేనే. సమస్తమునకు ప్రభువును నేనే. సాక్షియు నేనే. అందరికి నివాస స్థానము నేనే. నీకు హితమొనర్చు వాడను నేనే. నేనే సృష్టి స్థితి లయములకు మూలము. శాశ్వతమగు బీజమును కూడ నేనే.*

*వివరణము : ప్రభువు : ఎవరి నుండి సమస్తము వ్యక్తమై ఆధారపడి యున్నదో అతడే ప్రభువు. సాధారణ ప్రభువునకు, ఈశ్వరుడగు ప్రభువునకు తేడా యున్నది. సాధారణ ప్రభువులు పుట్టిన వారిని పాలింతురు. ఈశ్వరుడగు ప్రభువు జీవుల పుట్టుకకు, వారి ఆలన పాలనకు కూడ స్వామియై యుండును. కనుక సాధారణ ప్రభువుల యందు ఉన్నటువంటి ఈశ్వరునే ప్రభువుగ భావింపవలెను. ప్రభువుల యందున్న ప్రభువును చూచుట నేర్వవలెను. అట్లే మనలను భరించు వారియందు ఉన్న ఈశ్వరుని గుర్తించి మన్నించ వలెను.*

*సాక్షి : అందరియందున్న ఈశ్వరుడే, అందరి చేష్టలకు సాక్షి. ప్రతి ఒక్కరు తనయందలి ఈశ్వరుడు తమను అను నిత్యము గమనించు చున్నాడని తెలిసి యుండవలెను. అట్టి ఎరుక వలన మనము అతిక్రమించి వర్తించుటను అరికట్టును. లోనుండియే ఈశ్వరుడు తాను అహర్నిశలు గమనించు చున్నాడని తెలిసిన వాడు సత్యమునే పలుకును. ధర్మమునే ఆచరించును. కర్తవ్యమునే నిర్వర్తించును. అట్టి వానిని కామిని, మోహిని, ఆసురి లక్షణములు స్పృశింప లేవు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🌹. నిత్య పంచాంగము Daily Panchangam 25, శనివారము, డిసెంబర్ 2021 స్థిర వాసరే

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 25, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రం 🍀*

*మంగళప్రద్రం పద్మాక్షం కస్తూరీ తిలకోజ్జ్వలమ్ |*
*తులస్యాది మనఃపూజ్యం తీర్థాద్రీశం భజామహే || 6 ||*
*స్వామిపుష్కరిణీతీర్థవాసం వ్యాసాదివర్ణితమ్ |*
*స్వాంఘ్రీసూచితహస్తాబ్జం సత్యరూపం భజామహే || 7 ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు, మృగశిర మాసం
తిథి: కృష్ణ షష్టి 20:10:28 వరకు తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 29:06:22 వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: ప్రీతి 11:25:20 వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం: గార 07:55:47 వరకు 
వర్జ్యం: 12:28:40 - 14:08:24
దుర్ముహూర్తం: 08:11:58 - 08:56:21
రాహు కాలం: 09:29:38 - 10:52:51
గుళిక కాలం: 06:43:11 - 08:06:25
యమ గండం: 13:39:18 - 15:02:31
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:38
అమృత కాలం: 22:27:04 - 24:06:48
సూర్యోదయం: 06:43:11
సూర్యాస్తమయం: 17:48:58
వైదిక సూర్యోదయం: 06:47:07
వైదిక సూర్యాస్తమయం: 17:45:04
చంద్రోదయం: 23:09:03
చంద్రాస్తమయం: 11:13:52
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: సింహం
లంబ యోగం - చికాకులు, అపశకునం 29:06:22 వరకు తదుపరి ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
పండుగలు : క్రిస్టమస్‌,Merry Christmas
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

25-DECEMBER-2021 శుక్రవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 25, శుక్రవారం, డిసెంబర్ 2021 స్థిర వాసరే 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 296 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 495🌹 
4) 🌹 వివేక చూడామణి - 172 / Viveka Chudamani - 172🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -124🌹  
6) 🌹 Osho Daily Meditations - 113 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 172 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 172 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  