*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 9 🌻*
*అఖండమయిన పరమ ప్రేమ హృదయమంతా నిండాటలంటే, ఊరకే ప్రేమ మయములగు లోక క్షేమాన్ని గూర్చిన తలంపులు చాలవు. ఆచరణ కావాలి. మనస్సును ఆచరణలోకి దింపినపుడు ప్రేమ గాఢమగును. కావున లోక హితానికై తన జీవ లక్షణానికి సరిపోవు కార్యక్రమాన్ని ఒక గంట అయినా రోజులో చేపట్టాలి. క్రమంగా దినచర్య అంతా అదే కావాలి.*
*మనసు అర్పించకుండా యాంత్రికంగా సేవలో పాల్గొన్నచో కూడా మంచిదే కాని తన ఉద్ధరణ ఆలస్యమగును. మనసా వాచా కర్మణ లోకహితాచరణకు జీవితాన్ని అర్పించుకొన్న కొలదీ పరమగురువులు తమ ప్రణాళికా నిర్వహణలోకి మనల్ని పరికరాలుగా ఉపయోగించు కుంటారు. అపుడు మనం చేసేవి అని ఉండదు. మన ద్వారా వాండ్లే చేస్తుంటారు.*
....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment