🌹. గీతోపనిషత్తు -296 🌹


*🌹. గీతోపనిషత్తు -296 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 18-2
 
*🍀 18-2. పరతత్వము - ఈశ్వరుడగు ప్రభువు జీవుల పుట్టుకకు, వారి ఆలన పాలనకు కూడ స్వామియై యుండును. కనుక సాధారణ ప్రభువుల యందు ఉన్నటువంటి ఈశ్వరునే ప్రభువుగ భావింపవలెను. ప్రభువుల యందున్న ప్రభువును చూచుట నేర్వవలెను. ప్రతి ఒక్కరు తనయందలి ఈశ్వరుడు తమను అను నిత్యము గమనించు చున్నాడని తెలిసి యుండవలెను. అట్టి ఎరుక వలన మనము అతిక్రమించి వర్తించుటను అరికట్టును. అట్టి వానిని కామిని, మోహిని, ఆసురి లక్షణములు స్పృశింప లేవు.🍀*

*గతి ర్బరా ప్రభు స్పాక్షీ నివాస శ్శరణం సుహృత్ |*
*ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ II 18*

*తాత్పర్యము : నేనే సమస్త జీవులకు గతి (లక్ష్యము). సమస్తమును భరించువాడను నేనే. సమస్తమునకు ప్రభువును నేనే. సాక్షియు నేనే. అందరికి నివాస స్థానము నేనే. నీకు హితమొనర్చు వాడను నేనే. నేనే సృష్టి స్థితి లయములకు మూలము. శాశ్వతమగు బీజమును కూడ నేనే.*

*వివరణము : ప్రభువు : ఎవరి నుండి సమస్తము వ్యక్తమై ఆధారపడి యున్నదో అతడే ప్రభువు. సాధారణ ప్రభువునకు, ఈశ్వరుడగు ప్రభువునకు తేడా యున్నది. సాధారణ ప్రభువులు పుట్టిన వారిని పాలింతురు. ఈశ్వరుడగు ప్రభువు జీవుల పుట్టుకకు, వారి ఆలన పాలనకు కూడ స్వామియై యుండును. కనుక సాధారణ ప్రభువుల యందు ఉన్నటువంటి ఈశ్వరునే ప్రభువుగ భావింపవలెను. ప్రభువుల యందున్న ప్రభువును చూచుట నేర్వవలెను. అట్లే మనలను భరించు వారియందు ఉన్న ఈశ్వరుని గుర్తించి మన్నించ వలెను.*

*సాక్షి : అందరియందున్న ఈశ్వరుడే, అందరి చేష్టలకు సాక్షి. ప్రతి ఒక్కరు తనయందలి ఈశ్వరుడు తమను అను నిత్యము గమనించు చున్నాడని తెలిసి యుండవలెను. అట్టి ఎరుక వలన మనము అతిక్రమించి వర్తించుటను అరికట్టును. లోనుండియే ఈశ్వరుడు తాను అహర్నిశలు గమనించు చున్నాడని తెలిసిన వాడు సత్యమునే పలుకును. ధర్మమునే ఆచరించును. కర్తవ్యమునే నిర్వర్తించును. అట్టి వానిని కామిని, మోహిని, ఆసురి లక్షణములు స్పృశింప లేవు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment