🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 48 🌹


*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 48 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
* సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 36. ధీరత 🌻*

*కుంభయుగమున మా గురుపరంపరను చేరుటకు, మా బృందముతో చేతులు కలిపి జగత్కళ్యాణ కార్యములు నిర్వర్తించుటకు అవకాశము మెండు. ఎవరైతే తనయందు ఈ క్రింద తెలిపిన లక్షణములను వికసింప చేసుకోగలరో, వారు మా కార్యక్రమమందలి స్వల్ప భాగమును నిర్వర్తించుటకు అర్హతను సంపాదించు కొనగలరు. ఈ క్రింద తెలిపిన లక్షణములన్నియు వికసించుట వలన మాత్రమే, అట్టి అర్హత లభించును.*

*1) పరిపూర్ణ బాధ్యతతో వైద్యము చేయుట;*
*2) 2) ధర్మజ్ఞానము గలిగి, విషమ పరిస్థితుల యందు ధర్మనిర్ణయము చేయగలుగుట;*
*3) పవిత్ర గ్రంథములను వివరించుట, బోధించుట; ఆచరణాత్మకముగ యోగజీవనమును, నిర్వర్తించుచూ యోగవిద్య నభ్యసింపజేయుట;*

*సృజనాత్మక శక్తితో, నిర్మాణాత్మకమగు సంఘసేవా కార్యక్రమములను నిర్వర్తించుట, బాధ్యతపడుటకు భయపడువారు, సంకోచించువారు, సందేహ పడువారు యోగమార్గమునకు అనర్హులు. బాధ్యతలను ఉత్సాహముగ స్వీకరించి, నిర్వర్తించి, సఫలీకృతులగు ధీరులే యోగవిద్యను ఆకళింపు చేసుకొని ఉత్తీర్ణులు కాగలరు. ధీరత మీకును, మాకును మధ్య సూత్రము వంటిది. ధీరతయే సమస్త విజయములకు కారణము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment