25-DECEMBER-2021 శుక్రవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 25, శుక్రవారం, డిసెంబర్ 2021 స్థిర వాసరే 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 296 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 495🌹 
4) 🌹 వివేక చూడామణి - 172 / Viveka Chudamani - 172🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -124🌹  
6) 🌹 Osho Daily Meditations - 113 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 172 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 172 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 25, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రం 🍀*

*మంగళప్రద్రం పద్మాక్షం కస్తూరీ తిలకోజ్జ్వలమ్ |*
*తులస్యాది మనఃపూజ్యం తీర్థాద్రీశం భజామహే || 6 ||*
*స్వామిపుష్కరిణీతీర్థవాసం వ్యాసాదివర్ణితమ్ |*
*స్వాంఘ్రీసూచితహస్తాబ్జం సత్యరూపం భజామహే || 7 ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు, మృగశిర మాసం
తిథి: కృష్ణ షష్టి 20:10:28 వరకు తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 29:06:22 వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: ప్రీతి 11:25:20 వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం: గార 07:55:47 వరకు 
వర్జ్యం: 12:28:40 - 14:08:24
దుర్ముహూర్తం: 08:11:58 - 08:56:21
రాహు కాలం: 09:29:38 - 10:52:51
గుళిక కాలం: 06:43:11 - 08:06:25
యమ గండం: 13:39:18 - 15:02:31
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:38
అమృత కాలం: 22:27:04 - 24:06:48
సూర్యోదయం: 06:43:11
సూర్యాస్తమయం: 17:48:58
వైదిక సూర్యోదయం: 06:47:07
వైదిక సూర్యాస్తమయం: 17:45:04
చంద్రోదయం: 23:09:03
చంద్రాస్తమయం: 11:13:52
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: సింహం
లంబ యోగం - చికాకులు, అపశకునం 29:06:22 వరకు తదుపరి ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
పండుగలు : క్రిస్టమస్‌,Merry Christmas
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -296 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 18-2
 
*🍀 18-2. పరతత్వము - ఈశ్వరుడగు ప్రభువు జీవుల పుట్టుకకు, వారి ఆలన పాలనకు కూడ స్వామియై యుండును. కనుక సాధారణ ప్రభువుల యందు ఉన్నటువంటి ఈశ్వరునే ప్రభువుగ భావింపవలెను. ప్రభువుల యందున్న ప్రభువును చూచుట నేర్వవలెను. ప్రతి ఒక్కరు తనయందలి ఈశ్వరుడు తమను అను నిత్యము గమనించు చున్నాడని తెలిసి యుండవలెను. అట్టి ఎరుక వలన మనము అతిక్రమించి వర్తించుటను అరికట్టును. అట్టి వానిని కామిని, మోహిని, ఆసురి లక్షణములు స్పృశింప లేవు.🍀*

*గతి ర్బరా ప్రభు స్పాక్షీ నివాస శ్శరణం సుహృత్ |*
*ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ II 18*

*తాత్పర్యము : నేనే సమస్త జీవులకు గతి (లక్ష్యము). సమస్తమును భరించువాడను నేనే. సమస్తమునకు ప్రభువును నేనే. సాక్షియు నేనే. అందరికి నివాస స్థానము నేనే. నీకు హితమొనర్చు వాడను నేనే. నేనే సృష్టి స్థితి లయములకు మూలము. శాశ్వతమగు బీజమును కూడ నేనే.*

*వివరణము : ప్రభువు : ఎవరి నుండి సమస్తము వ్యక్తమై ఆధారపడి యున్నదో అతడే ప్రభువు. సాధారణ ప్రభువునకు, ఈశ్వరుడగు ప్రభువునకు తేడా యున్నది. సాధారణ ప్రభువులు పుట్టిన వారిని పాలింతురు. ఈశ్వరుడగు ప్రభువు జీవుల పుట్టుకకు, వారి ఆలన పాలనకు కూడ స్వామియై యుండును. కనుక సాధారణ ప్రభువుల యందు ఉన్నటువంటి ఈశ్వరునే ప్రభువుగ భావింపవలెను. ప్రభువుల యందున్న ప్రభువును చూచుట నేర్వవలెను. అట్లే మనలను భరించు వారియందు ఉన్న ఈశ్వరుని గుర్తించి మన్నించ వలెను.*

*సాక్షి : అందరియందున్న ఈశ్వరుడే, అందరి చేష్టలకు సాక్షి. ప్రతి ఒక్కరు తనయందలి ఈశ్వరుడు తమను అను నిత్యము గమనించు చున్నాడని తెలిసి యుండవలెను. అట్టి ఎరుక వలన మనము అతిక్రమించి వర్తించుటను అరికట్టును. లోనుండియే ఈశ్వరుడు తాను అహర్నిశలు గమనించు చున్నాడని తెలిసిన వాడు సత్యమునే పలుకును. ధర్మమునే ఆచరించును. కర్తవ్యమునే నిర్వర్తించును. అట్టి వానిని కామిని, మోహిని, ఆసురి లక్షణములు స్పృశింప లేవు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 494 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 39

*🌻. శివుని యాత్ర - 4 🌻*

అందరు ఇట్లు పలికిరి-

మహాదేవా! మహేశ్వరా! పార్వతీ మహాదేవిని వివాహమాడుట కొరకై మాతో గూడి శీఘ్రమే బయలు దేరుము. దయను చూపుము (44). అపుడు జ్ఞానముచే సంతుష్టమైన మనస్సు గల విష్ణువు భక్తితో శంకరునకు నమస్కరించి సందర్భమునకు అనురూపమగు మాటలను ఇట్లు పలికెను (45).

విష్ణువు ఇట్లు పలికెను-

దేవ దేవా! మహాదేవా! శరణు జొచ్చిన వారిపై నీకు ప్రీతి మెండు. నీవు నీ భక్తుల కార్యములను చక్కబెట్టెదవు. ఓ ప్రభూ! నావిన్నపమును వినుము (46). శంభో! శంకరా! నీవు పార్వతీ దేవిని గృహ్యసూత్రములలో చెప్పబడిన విధానములో వివాహమాడదగుదువు (47). హే హరా! నీవు వివాహవిధిని పాటించినచో, లోకము నందు ఆ విధి అంతటా ఖ్యాతిని పొందగలదు (48). ఓ నాథా! వారి కులధర్మమునను సరించి మండప స్థాపనమును, నాందీముఖమును ప్రీతి పూర్వకముగా అనుష్ఠించి, లోకములో నీ కీర్తిని విస్తరింపజేయుము (49).

బ్రహ్మ ఇట్లు పలికెను-

విష్ణువు ఇట్లు పలుకగా, లోకాచారమునందు శ్రద్ధ గల శంభుపరమేశ్వరుడు ఆ కర్మలను యథావిధిగా చేసెను (50). ఆయనచే నియోగింపబడని నేను మునులతో గూడి అచట అభ్యుదయమునకు తగిన ఆ కర్మలను అన్నింటినీ ప్రీతితో ఆదరముతో చేసితిని (51). ఓ మహర్షీ! కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, భాగురి, గురుడు, కణ్వుడు, బృహస్పతి, శక్తి, జమదగ్ని పరాశరుడు (52), మార్కండేయుడు, శిలాపాకుడు, అరుణపాలుడు, అకృతశ్రముడు, అగస్త్యుడు, చ్యవనుడు, గర్గుడు, మరియు శిలాదుడు అచటకు విచ్చేసిరి (53).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 172 / Viveka Chudamani - 172 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -19 🍀*

*560. శరీరము దాని భాగములు, ప్రాణములు, బుద్ది మొదలగునవి నశించినప్పటికి; చెట్టుకు ఆకు, పువ్వు, పండు వలె చెట్టుకు ఎట్టి సంబంధము లేనట్లు, యోగికి కూడా తన శరీర భాగములను గూర్చి పట్టింపు లేదు. ఎందువలనంటే అది తన ఆత్మ పై ఎట్టి ప్రభావమును చూపదు. ఆత్మ స్వచ్ఛము, బ్రహ్మానంద స్వరూపము కావున; చెట్టు ఏవిధముగా జీవించి ఉంటుందో అలానే ఆత్మకు ఎట్టి చావు లేదు.*

*561. సృతులు బ్రహ్మము యొక్క నిజమైన స్వభావమును ఈ విధముగా వర్ణించాయి. ‘జ్ఞానముతో నిండి ఉన్నది. అది సత్యము, దీని వలన కనిపిస్తున్న పరిమితులన్ని నశింపబడతాయి’.*

*562. ఇంకను సృతులు ఏమి చెప్పుచున్నవంటే ‘ఆత్మ పూర్తిగా శాశ్వతమైనది. అట్టి శాశ్వతత్వము కలిగిన ఆత్మ అశాశ్వతమైన నాశనమయ్యే వస్తు విశేషముల మధ్యలో మార్పులతో కూడిన వాటికి అంటకుండా మధ్యలో మార్పులతో కూడిన వాటి మధ్య ఉన్నవి’.*

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 172 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -19 🌻*

*560. The destruction of the body, organs, Pranas and Buddhi is like that of a leaf or flower or fruit (to a tree). It does not affect the Atman, the Reality, the Embodiment of
Bliss – which is one’s true nature. That survives, like the tree.*

*561. The Shrutis, by setting forth the real nature of the Atman in the words, "The Embodiment of Knowledge" etc., which indicate Its Reality, speak of the destruction of the apparent limitations merely.*

*562. The Shruti passage, "Verily is this Atman immortal, my dear", mentions the immortality of the Atman in the midst of things perishable and subject to modification.*

*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 172 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -19 🌻*

*560. The destruction of the body, organs, Pranas and Buddhi is like that of a leaf or flower or fruit (to a tree). It does not affect the Atman, the Reality, the Embodiment of
Bliss – which is one’s true nature. That survives, like the tree.*

*561. The Shrutis, by setting forth the real nature of the Atman in the words, "The Embodiment of Knowledge" etc., which indicate Its Reality, speak of the destruction of the apparent limitations merely.*

*562. The Shruti passage, "Verily is this Atman immortal, my dear", mentions the immortality of the Atman in the midst of things perishable and subject to modification.*

*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 124 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 9 🌻* 

*అఖండమయిన పరమ ప్రేమ హృదయమంతా నిండాటలంటే, ఊరకే ప్రేమ మయములగు లోక క్షేమాన్ని గూర్చిన తలంపులు చాలవు. ఆచరణ కావాలి. మనస్సును ఆచరణలోకి దింపినపుడు ప్రేమ గాఢమగును. కావున లోక హితానికై తన జీవ లక్షణానికి సరిపోవు కార్యక్రమాన్ని ఒక గంట అయినా రోజులో చేపట్టాలి. క్రమంగా దినచర్య అంతా అదే కావాలి.*

*మనసు అర్పించకుండా యాంత్రికంగా సేవలో పాల్గొన్నచో కూడా మంచిదే కాని తన ఉద్ధరణ ఆలస్యమగును. మనసా వాచా కర్మణ లోకహితాచరణకు జీవితాన్ని అర్పించుకొన్న కొలదీ పరమగురువులు తమ ప్రణాళికా నిర్వహణలోకి మనల్ని పరికరాలుగా ఉపయోగించు కుంటారు. అపుడు మనం చేసేవి అని ఉండదు. మన ద్వారా వాండ్లే చేస్తుంటారు.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 113 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 113. BREAVERY 🍀*

*🕉 You have been taught very egoistical ideals--“Be brave." What nonsense! How can an intelligent person avoid fear? 🕉*
 
*Everybody is afraid-they have to be. Life is such that one has to be. And people who become fearless become fearless not by becoming brave-because brave people have only repressed their fear; they are not really fearless. A person becomes fearless by accepting his or her fears. It is not a question of bravery. It is simply seeing into the facts of life and realizing that fears are natural. One accepts them! The problem arises when you want to reject them. You have been taught very egoistical ideals-"Be brave." What nonsense! How can an intelligent person avoid fear?*

*The bus driver goes on honking, and you stand in the middle of the road unafraid, or a bull comes charging at you, and you stand there unafraid-this would be stupid! An intelligent person has to jump out of the way. Or if there is nobody on the road, and then too you are afraid and start running, there is a problem; otherwise, fear is natural. It is not that there will be no fears in life. You will come to know that ninety percent of your fears are just imagination. About ten percent are real, so one has to accept them. Become more responsive, sensitive, and alert, and this will be enough. You will become aware that you can use your fears as stepping stones.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 172 / Sri Lalita Sahasranamavali - Meaning - 172 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 172. స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా ।*
*మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః ॥ 172 ॥ 🍀*

🍀 926. స్తోత్రప్రియా : 
స్తోత్రములు అనిన ఇస్టము కలిగినది

🍀 927. స్తుతిమతే : 
స్తుతించుట అనిన ఇస్టము కలిగినది

🍀 928. శ్రుతిసంస్తుతవైభవా : 
వేదములచేత స్తుతింపబడెడి వైభవము కలిగినది

🍀 929. మనస్వినీ : 
మనస్సు కలిగినది

🍀 930. మానవతీ : 
అభిమానము కలిగినది

🍀 931. మహేశే : 
మహేశ్వర శక్తి

🍀 932. మంగాళాకృతి: : 
మంగలప్రదమైన రూపము కలిగినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 172 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 172. Stotrapriya stutimati shruti sanstuta vaibhava*
*Manasvini manavati maheshi mangalakrutih ॥ 172 ॥ 🌻*

🌻 926 ) Stotra priya - She who likes chants

🌻 927 ) Sthuthi mathi -   
She who gives boons for those who sing her chants

🌻 928 ) Sthuthi samsthutha vaibhava -   
She who is worshipped by the Vedas

🌻 929 ) Manaswaini -   
She who has a stable mind

🌻 930 ) Manavathi -   
She who has big heart

🌻 931 ) Mahesi - She who is the greatest goddess

🌻 932 ) Mangala kruthi - She who does only good.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  

https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment