*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*
*🌻 332-2. 'వామనయనా' 🌻*
*శ్రీమాత పరమశివుని నుండి ఎడమ భాగముగ వ్యక్తమై, శివునికి ఎదురుగ కూర్చుండును. శివుడు సూర్యాత్మక ప్రజ్ఞ అయినపుడు శ్రీమాత చంద్రాత్మక ప్రజ్ఞ. శివతత్త్వమే శ్రీమాత యందు ప్రతిబింబించి సృష్టి వెలుగులో నిలచును. ఎదురు బదురుగ నుండి సహకరించుకొనుట ఉన్నతమగు సిద్ధి. వ్యతిరేకించుటగా అది కనిపించునుగానీ వ్యతిరేకమున సహకారము కూడ కలదు.*
*ఉత్తరమున సప్తఋషులందరూ వుండగ అగస్త్యుడు దక్షిణమున కేగుట, ఉత్తరమునకు మరల పోకుండుట సమతుల్యము కొఱకే. భూమి సమతుల్యమునకు అగస్త్యుడట్లు చేసెను. అట్లే సమస్త సృష్టి సమతుల్యమునకు శ్రీమాత అట్లు చేసినది. ఆమె పశ్చిమమున చేరి మూలాధారమున నుండగ శివతత్త్వము సహస్రారమున నుండును. ఆమె మూలాధార నిలయ. శ్రీమాత పశ్చిమమును తన చూపులతో రక్షించుచు నుండును. అందువలన వామనయన.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 332-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*
*🌻 332-2. Vāma-nayanā वाम-नयना (332) 🌻*
*The one who grants boons. In Viṣṇu Sahasranāma nāma 330 is also Varadā. Granting boons is the general quality of all Gods and Goddesses. In certain forms of Gods and Goddesses the right palm is used as a gesture of granting boons. There is a special significance for this nāma. She does not grant boons through Her palms. Her sacred feet give boons. She is kāmadāyinī (nāma 63). Otherwise nāma 83 will not have any meaning. The significance of this nāma is further strengthened by nāma 117.*
*Saundarya Laharī (verse 4) perfectly describes this nāma. It says, “You are the refuge of all the worlds! All gods except you vouchsafe protection to devotees and grant their desires by gestures of their hands. You alone do not show varada and abhaya gestures. It is so because Your feet are by themselves powerful to protect those in the grip of fear and grant more that what is desired for by devotees.” Such niceties describe the ease with which She grants boons. It is also said that She is to be worshipped by concentration (through meditation) on ninth lunar day (navami) when She becomes the giver of boons to all the worlds.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment