*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 8 🌻*
*తన ఆవశ్యకములకై ఇతరులపై ఎట్లును ఆధారపడక తప్పదు. అది తప్పనిసరిగా గాక, తోటి వారి యెడల తమ వృత్తికర్మను నిండయిన ప్రేమతో నిర్వర్తించినచో తన అవసరములవియే తీరుటయే గాక, అతిలోకమయిన ఆనందము నిలుచును. ప్రేమ విస్తారమగు కొలది, ఆనందము అఖండమగును. ఆ రుచి యందు, దారాపుత్రాదుల యెడ ప్రత్యేక మమకారము తెలియకుండును.*
*తనను ఎంత ప్రేమగా తాను ఆదరించునో, అట్టి ప్రేమ ఒరుల యెడ చూపి వర్తించుటే ధర్మము. ధర్మాచరణలో నిలిచే ఆనందమే మోక్షము. అనుషంగికముగ లభించు నట్టివే అర్థకామములు. మోక్షము ఎప్పుడో కలిగే స్థితి కాదు. లోకములోని జీవులతో తనకు తాదాత్మ్యము ఏర్పడి, తనను తాను మరచేంతగా ఎదలో ప్రేమ నిండుతుందో, ఆ క్షణమే పూర్వకర్మల అలవాటుల వలన ఏర్పడిన కామ క్రోధాదులు, సుఖదుఃఖాది బంధములు తొలగును. తేలినదేమంటే ప్రేమయే మోక్షము.*
....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment