*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
* సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 35. చపలమతి 🌻*
*చపలచిత్తుల యందు మేము ప్రత్యేక శ్రద్ధ వహింతుము. చపలచిత్తము అంటురోగమువంటిది. చపలచిత్తులు స్థిర చిత్తమునకై ప్రాకులాడువారిని భ్రష్టులను చేయగలరు. చపలచిత్తుల భాషణమున, చేతల యందు సత్యాసత్యములు, ధర్మాధర్మములు, జ్ఞాన అజ్ఞానములు మిళితములై గమనించు వారిని కలవరపరచుచుండును. ఇట్టి వారిని ఏక్షణమునందైననూ వారి అహంకార ద్వారమున అజ్ఞానము మింగి వేయగలదు. వీరొక భ్రాంతి జీవనమున పడి, వారి భ్రాంతి జీవనమే దివ్యజీవనమని నమ్మి, పామరులను అట్టి భ్రాంతికి గురిచేయు చుందురు.*
*తరచూ వీరి వలన జాతికి అపాయములు సంభవించు చుండును. జీవితమున అశ్రద్ధ, నిర్లక్ష్యము, పొగరుమోతుతనము కలిగిన వారు అట్టి ఆపదకు అవకాశము లేర్పరచుచుందురు, చపలచిత్తము నిర్మూలించుకొనుటకు దీక్షగా ఏదో ఒక సత్కార్యమును దీర్ఘకాలము నిర్వర్తించుటయే పరిష్కారము. అట్టి దీక్షాకంకణులకు స్ఫూర్తిని, శక్తిని, మా గురుపరంపర అందివ్వగలదు. దీక్ష, శిక్షణము అనుస్యూతము జీవితమున సాగుచుండవలెను. ఇట్లు పండ్రెండు సంవత్సరములు సాగినచో చిత్తచాపల్యము అను అపాయమునుండి ఉద్ధరింపబడుటకు అవకాశము గలదు.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment