*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మనలో విచ్చుకున్న పద్మ పరిమళమే పరమానందం, విశ్రాంతి, ఉత్సవం. వ్యక్తి ఆ సంపూర్ణతని అందుకోవాలి. సంతృప్తిని అందుకోవాలి. కారణం వ్యక్తికి విధి అందించినవన్నీ సమకూరాయి. అవి వునికిలోకి ప్రవహించాయి. 🍀*
*పద్మాన్ని అంతిమంగా వికసించే చైతన్యానికి ప్రతీకగా భావించారు. ఇప్పుడు నువ్వు మొగ్గవి. ముడుచుకుని వున్నావు. నీ పరిమళమింకా బహిర్గతం కాలేదు. సన్యాసితనమన్నది పూల కేసరాల్ని విచ్చుకునేలా చేసేది. సన్యాసం సూర్యోదయం లాటిది. గురువుతో వుండడమంటే సూర్యకాంతిలోకి వెళ్ళడం లాంటిది. సూర్యోదయమవుతూనే పద్మ పత్రాలు విచ్చుకోవడం మొదలుపెడతాయి. సహజంగా అక్కడ నిర్బంధం లేదు. గొప్ప పరిమళం వ్యాపిస్తుంది.
*ఆ పరిమళమే పరమానందం, విశ్రాంతి, ఉత్సవం, వ్యక్తి ఆ సంపూర్ణతని అందుకోవాలి. సంతృప్తిని అందుకోవాలి. కారణం వ్యక్తికి విధి అందించినవన్నీ సమకూరాయి. అవి వునికిలోకి ప్రవహించాయి. తన సామర్థ్యాన్ని బట్టి వ్యక్తి తన సృజనని నిర్వర్తించాడు. అంతిమ చైతన్యం అపురూపమైంది. అది అనంత సంతృప్తికి రూపాంతరం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment