*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము -14 🌴*
*14. అన్నాద్భావన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవ: |*
*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ: కర్మసముద్భవ: ||*
🌷. తాత్పర్యం :
*జీవదేహములన్నియును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ధ్యానములపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞముచే కలుగగా, విహితకర్మము నుండి యజ్ఞము ఉద్బవించుచున్నది.*
🌷. భాష్యము :
శ్రీమద్భగవద్గీత గొప్ప వ్యాఖ్యాతలైన శ్రీల బలదేవవిద్యాభూషణులు ఈ విధముగా తెలిపిరి. “యే ఇంద్రాద్యంగతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణు మభ్యర్చ్యతచ్చేష మశ్నన్తి తేన తద్దేహయాత్రాం సంపాదయన్తి, తే సన్త: సర్వేశ్వరస్య యజ్ఞాపురుషస్య భక్తా: సర్వకిల్భిషై; అనాదికాలవివృద్ధై: ఆత్మానుభవప్రతిబన్ధకై ర్నిఖిలై: పాపై: విముచ్యన్తే”. యజ్ఞపురుషుడని (సర్వయజ్ఞభోక్త) తెలియబడు శ్రీకృష్ణభగవానుడు దేవతలందరికీ ప్రభువు.
దేహము నందలి వివిధ అంగములు దేహమునకు సేవ చేయురీతి ఆ దేవతలందరును భగవానుని సేవను గూర్చుదురు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతల సృష్టిపరిపాలనకై నియమింపబడిన అధికారులై నందున వారి ప్రీతి కొరకై వేదములు యజ్ఞములను నిర్దేశించుచున్నది. తద్ద్వారా వారు ప్రియమునొంది ధాన్యమును సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు వలసిన గాలిని, వెలుతురు, నీటిని అందించగలరు.
శ్రీకృష్ణభగవానుని అర్చించినప్పుడు ఆతని అంగములైన దేవతలు అప్రయత్నముగా పూజింపబడుచున్నందున ప్రత్యేముగా ఆ దేవతలను అర్చింపనవసరము లేదు. ఈ కారణముననే భక్తులు(కృష్ణభక్తిభావన యందున్నవారు) తొలుత ఆహారమును కృష్ణునకు అర్పించి పిదప గ్రహింతురు (ఈ విధానము ద్వారా దేహము ఆధ్యాత్మికముగా పుష్టినొందగలదు). ఆ విధమైన కర్మ ద్వారా పూర్వపాపములన్నియు నశించుటయే కాక, దేహము సర్వభౌతిక కల్మషములకు అతీతమగుచున్నది.
అంటువ్యాధి ప్రబలినప్పుడు రోగనిరోధక ఔషధము అట్టి అంటువ్యాధి నుండి మనుజుని రక్షించురీతి, విష్ణువుకు అర్పింపబడిన ఆహారము మనలను విషయాసక్తత నుండి రక్షించును. ఇట్టి విధానము నవలంబించువాడు భక్తుడని పిలువబడును. కావున కృష్ణప్రసాదమును స్వీకరించు భక్తుడు ఆత్మానుభవమార్గములో అవరోధముల వంటి పూర్వపాపములను నశింపజేసికొనుచున్నాడు.
ఈ విధముగా వర్తించనివాడు పాపభారమును క్రమముగా పెంచుకొనిపోవుచు పాపఫలముల ననుభవించుటకు హీనమైన శునక, సుకరాదుల దేహమును తయారుచేసికొనును. ఈ భౌతికదేహము కల్మషభూయిష్టమైనట్టిది. భగవత్ప్రసాడామును(విష్ణువునకు అర్పింపబడిన ఆహారము) స్వీకరించువాడు మాత్రమే వాని ప్రభావము నుండి రక్షింపబడుచున్నాడు. ఆ విధముగా నొనరింపనివాడు దాని కల్మషముచే ప్రభావితుడు కాగలడు.
వాస్తవమునకు ధ్యానము మరియు కూరగాయలే ఆహారయోగ్యములు. ధ్యానము, కూరగాయాలు, ఫలములు మొదలగువాటిని మానవుడు భుజింపగా, ధ్యానపు వ్యర్థశేషమును గడ్డిని, చెట్లను జంతువులు ఆహారముగా స్వీకరించును. మాంసభక్షణము చేయుటకు అలవాటుపాడనివారు. అనగా చివరికి మనము భూఉత్పత్తులు సమృద్ధియైన వర్షముపై ఆధారపడియుండును. అట్టి వర్షము ఇంద్రుడు, చంద్రుడు, సూర్యాది దేవతలచే నియమింపబడుచున్నది.
ఆ దేవతలందరును శ్రీకృష్ణభగవానుని సేవకులు. అట్టి భగవానుడు యజ్ఞముచే సంతృప్తినొందును. గావున కనీసము ఆహారపదార్థముల కొరత నుండి రక్షింపబడుటకైనను యజ్ఞమును (ముఖ్యముగా ఈ యుగమునకు నిర్దేశింపబడిన సంకీర్తనా యజ్ఞమును నిర్వహింపవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 133 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 3 - Karma Yoga -14🌴*
*14. annād bhavanti bhūtāni parjanyād anna-sambhavaḥ*
*yajñād bhavati parjanyo yajñaḥ karma-samudbhavaḥ*
🌷Translation :
*All living bodies subsist on food grains, which are produced from rains. Rains are produced by performance of yajña [sacrifice], and yajña is born of prescribed duties.*
🌷 Purport :
Śrīla Baladeva Vidyābhūṣaṇa, a great commentator on the Bhagavad-gītā, writes as follows:
ye indrādy-aṅgatayāvasthitaṁ yajñaṁ sarveśvaraṁ viṣṇum abhyarcya tac-cheṣam aśnanti tena tad deha-yātrāṁ sampādayanti, te santaḥ sarveśvarasya yajña-puruṣasya bhaktāḥ sarva-kilbiṣair anādi-kāla-vivṛddhair ātmānubhava-pratibandhakair nikhilaiḥ pāpair vimucyante.
The Supreme Lord, who is known as the yajña-puruṣa, or the personal beneficiary of all sacrifices, is the master of all the demigods, who serve Him as the different limbs of the body serve the whole. Demigods like Indra, Candra and Varuṇa are appointed officers who manage material affairs, and the Vedas direct sacrifices to satisfy these demigods so that they may be pleased to supply air, light and water sufficiently to produce food grains.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment