గీతోపనిషత్తు - 92

🌹. గీతోపనిషత్తు - 92 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 26 - 5 . ప్రాణాయామ యజ్ఞము - ప్రణవము ప్రాణమై, ప్రాణము స్పందనమై పంచ ప్రాణములుగ నేర్పడి దేహమును నిర్వర్తించుచు నుండును. వీనిననుసరించి మరి ఐదు చిల్లర ప్రాణములు వున్నవి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచప్రాణములు. ఇవి ఆధారముగనే జీవుడు దేహము నందుండును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚

Part 5

తాననగ తనయందు జరుగు స్పందనమే అని తెలియును. స్పందనము నుండే అనగా తననుండే మనసు, శ్వాస రెండు ప్రవాహములుగ నేర్పడి దేహ మేర్పడినదని తెలియును. దేహము తన నివాసమేకాని, తాను కాదనియు తెలియును. నివాస పరిణామము నివసించువాని పరిణామము కన్న చాల పెద్దది.

ప్రతి జీవియు అతని శరీరమున అతని బొటన వేలంత మాత్రమే యుండును. బొటన వ్రేలికి, శరీరమునకు గల వ్యత్యాసమే నివాసమునకు, నివాసికి కూడ కలదు. తాను నివసించు దేహము తనకొక వసతియేగాని, బంధము కాదని తెలియును. వసతి గృహము నుండి బయటకు, లోనికి ఎట్లు రాకపోకలు చేయ వచ్చునో అట్లే దేహము నుండి తాను రాకపోకలు చేయవచ్చును అని తెలియును.

తాను 'హంస స్వరూపు'డని లేక 'పక్షి' యని, ద్వంద్వ శబ్దము తన రెక్కలని, తన శరీరము అస్థికలతో కూడిన పంజరమని, పంజరమున బంధింపబడి నుండనవసరము లేదని తెలియును.

పై తెలియుట లన్నియు యింకను సిద్ధించుట కాదు. ఈ తెలియుట ప్రాణాయామ యజ్ఞమున ఒక శుభ పరిణామము. దీని వలన ఒక నూతన వికాసము, నూతనమైన రుచి సాధకునకు కలిగి ప్రాణాయామ హోమమునకు మరింత ఉద్యుక్తుడు కాగలడు.

ప్రణవము ప్రాణమై, ప్రాణము స్పందనమై పంచ ప్రాణములుగ నేర్పడి దేహమును నిర్వర్తించుచు నుండును. ఈ పంచప్రాణములు ముఖ్యప్రాణములు. వీని ననుసరించి మరి ఐదు చిల్లర ప్రాణములు వున్నవి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచప్రాణములు. ఇవి ఆధారముగనే జీవుడు దేహము నందుండును.

పంచప్రాణములు సరిగ దేహమునందు పనిచేయుచున్నప్పుడు జీవుడు దేహమున స్వత చెంది యుండును. వీని సామ్యమును జీవుడు తన ప్రవర్తన ద్వారా నిలుపుకొనవలెనే గాని చెదరగొట్టుకొనకూడదు.

కావుననే జీవుని ప్రవర్తనమునకు, అతని స్వస్థత లేక అస్వస్థతకు సంబంధమున్నది. ప్రాణము బలముగ నున్నచో మనసునకు బలము

కలుగును.

ప్రాణము బలముగ లేనిచో మనసు బలహీనపడి ప్రాణమును మరింత బలహీన పరచును. మనసు దుర్బలత ప్రాణమునకు సహితము హాని కలిగించ కలదని తెలియవలెను. “క్షుద్రం హృదయ దౌర్బల్యమ్" అని భగవద్గీత తెలుపుచున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

06 Dec 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 177

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 177 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మార్కండేయ మహర్షి - 3 🌻

20. అనేక పాపాలు చేస్తూ తిర్యగ్జీవనులలో, పశుపక్ష్యాదులలో పుడుతూ నరకాలలో వేగుటు ఏమీ తెలియకుండా పరిభ్రమించే జీవులు ఇప్పుడున్న మానవులు. ఈ తిరిగే సంసారచక్రంలో వీళ్ళుచేసే పాపపుణ్యాలు, వీళ్ళు చనిపోయినపుడు నీడలాగా ఆ జీవులను అనుసరించి దుఃఖాలను ఇచ్చేటటువంటి మరొకజన్మను ఇస్తూ ఉంటాయి. ధన సంపాదనచేస్తూ సుఖంతప్ప మరొక కార్యక్రమం ఏమీలేనటువంటివాళ్ళున్నారే, వాళ్ళునస్తికుల అనబడతారు. వాళ్ళకు ఈ లోకమే సుఖప్రదంగా కనపడుతుంది. మరికొందరున్నారు,

21. ఇందులో కాస్త ఉత్తములు వాళ్ళు. వాళ్ళు ఉపవాసములుచేసి, తీర్థములు సేవించి వేదాధ్యయనము చేసేవాళ్ళు. దేహాన్ని కృశింపచేసుకుంటూ ఎవో వ్రతములు చేసుకోవటం అనే లక్షణం కొందరిలో ఉంటుంది. ఆ లక్షణాలతో సద్గృహస్థులై ధర్మాన్ని ఆచరిస్తూ సుపుత్రులను పొందుతారు. వాళ్ళకేమో ఇహసుఖము ఉంటుంది, ఆముష్మిక సుఖమూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ కూడా సుఖపడతారు. అయితే వారిలో ధనమోహం ఉండదు. సుఖంగా ఉంటూనే, ధనానికి కట్టుపడరు. అజ్ఞానంలో ఉండరు. వాళ్ళు ఇక్కడ సమృద్ధిని పొందుతారు.తరువాత స్వర్గాన్ని చూస్తారు.

22. నాస్తికుడు ఇక్కడమాత్రమే సుఖాన్ని అనుభవించి నరకానికే వెళతాడు, పుణ్యంచేయకపోవటంచేత.

ధనాన్ని స్వార్థంకోసం మూటకట్టుకోవటమేతప్ప దానిని సద్వినియోగం చెయాలేనివాళ్ళు ఇక్కడే సుఖం ఉందని అనుకుంటారు. ధనాదుల్ని పొందికూడా ధర్మమార్గంలో ఉండటంచేత ఇహమూ, పరమూ రెండూ పొందుతారు ఉత్తములు. అది రెండోతరగతి.

23. మరొక తరగతి, నాస్తికులే! వాళ్ళళ్ళో సత్యంలేదు. ఆచారంలేదు. భక్తిలేదు. ఇదికాక ఏది చేయకూడదో అదే చేస్తారు. వాళ్ళు పాపం చేస్తుంటారు. మూర్ఖత్వంతో తమకు ధనం మాత్రం ఉంటే చాలు అనే భావంతో బ్రతుకుతారు. ఆ పాపం తమ కోసమే నిత్యమూ చేస్తుంటారు. పాపం చేయటానికే తమ ధనాన్ని వాడుకుంటారు. అటువంటి వాల్లు ఇక్కడకూడా నరకమే అనుభవిస్తారు, చనిపోయిన తరువాత ఎలాగూ నరకమే పొందుతారు. ఐహికమూ, ఆముష్మికము రెండూ వీరికి లేవు.

24. ఆ విధంగా మనుష్యులను మూడుతరగతులుగా విభజించారు. ఇక్కడ సుఖం ఉండి, పరసుఖం లేనివాడు. ఇక్కడా, అక్కడా కూడా సుఖం కలిగినవాడు, ఇక్కడా అక్కదా ఖూడా సుఖంపొందలేనివాడు. ఐహికంలోనూ, ఆముష్మికం లోనూ ఇలా ఉన్నారు మనుష్యులు. వాళ్ళ కర్మ ఇలా ఉంది.

25. తరువాత ధర్మరాజు, “బ్రాహ్మణులయొక్క సదాచారసంపత్తివల్ల వాళ్ళకు వచ్చే తేజస్సు, శక్తుల వంటివాటి స్వరూపమేదో” చెప్పమన్నాడు. “బ్రాహ్మణుడికి అసాధ్యం అనేది ఎమీలేదు. వేద వేదాంగములు చదివి ధర్మ మార్గంలో జీవిస్తూ విరాగులైనటువంటి బ్రాహ్మణులు తపస్సుచేస్తే, అన్నిటికీ వాళ్ళు సమర్థులే అవుతారు. తపస్సు, శమదమాది షట్సంపతులన్నీ కలిగిన బ్రాహ్మణుడికి అసాధ్యమేదీ లేదు” అని మార్కండేయుడు ధర్మరాజుకు ధర్మబోధ చేశాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

06 Dec 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 116

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 116 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 21 🌻

🌻. సర్వశూన్య స్థితి యందు ఎరుక 🌻

485. సంస్కారములు పూర్తిగా నాశనము కాగానే ఇంతవరకు సంస్కారములలో చిక్కువడిన పూర్ణచైతన్యమునకు పూర్తి విమోచనము ప్రాప్తించి, పరిశుద్ధమైన మహాచైతన్యముగా రూపాంతరమందినది.

486. మహాచైతన్యము మిథ్యాహం యొక్క చైతన్యమును గాదు, దివ్యాహం (నేను భగవంతుడను) యొక్క చైతన్యమును గాదు. ఇచ్చట చైతన్యమే ఉన్నది.(బాహ్యమునకు మాత్రము) భగవంతుడు లేడు.

అనగా సర్వకాల సర్వావస్థల యందు, సర్వత్రా శాశ్వతుడై యున్న భగవంతుడు, ఇచ్చట లేకపోవుట ఎట్లు సంభవించును? భగవంతుడు ఎన్నడు ఉండకపోవుట సంభవించదు. కాని--

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

06 Dec 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 80 / Sri Vishnu Sahasra Namavali - 80

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 80 / Sri Vishnu Sahasra Namavali - 80 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

పూర్వాషాడ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం

🍀 80. అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః|| 🍀

🍀 747) అమానీ -
నిగర్వి, నిరహంకారుడు.

🍀 748) మానద: -
భక్తులకు గౌరవము ఇచ్చువాడు.

🍀 749) మాన్య: -
పూజింపదగిన వాడైన భగవానుడు.

🍀 750) లోకస్వామీ -
పదునాలుగు భువనములకు ప్రభువు.

🍀 751) త్రిలోకథృక్ -
ముల్లోకములకు ఆధారమైన భగవానుడు.

🍀 752) సుమేధా: -
చక్కని ప్రజ్ఞ గలవాడు.

🍀 753) మేధజ: -
యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.

🍀 754) ధన్య: -
కృతార్థుడైనట్టివాడు.

🍀 755) సత్యమేధ: -
సత్య జ్ఞానము కలవాడు.

🍀 756) ధరాధర: -
భూమిని ధరించి యున్నవాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 80 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Poorvashada 4TH Padam

🌻 amānī mānadō mānyō lōkasvāmī trilōkadhṛt |
sumedhā medhajō dhanyaḥ satyamedhā dharādharaḥ || 80 || 🌻

🌻 747. Amānī:
He who, being of the nature of Pure Consciousness, has no sense of identification with anything that is not Atman.

🌻 748. Mānadaḥ:
One who by His power of Maya induces the sense of self in non-self. Or one who has regard and beneficence towards devotees. Or one who destroys in the knowing ones the sense of identification with the non-self.

🌻 749. Mānyaḥ:
One who is to be adored by all, because He is the God of all.

🌻 750. Lokasvāmī:
One who is the Lord of all the fourteen spheres.

🌻 751. Trilokadhṛt:
One who supports all the three worlds.

🌻 752. Sumedhāḥ:
One with great and beneficent intelligence.

🌻 753. Medhajaḥ:
One who arose from Yaga (a kind of sacrifice).

🌻 754. Dhanyaḥ:
One who has attained all His ends and therefore is self-satisfied.

🌻 755. Satyamedhāḥ:
One whose intelligence is fruitful.

🌻 756. Dharādharaḥ:
One who supports the worlds by His fractiosn like Adisesha.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

06 Dec 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 150, 151 / Vishnu Sahasranama Contemplation - 150, 151

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 150, 151 / Vishnu Sahasranama Contemplation - 150, 151 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻150. పునర్వసుః, पुनर्वसुः, Punarvasuḥ🌻

ఓం పునర్వసవే నమః | ॐ पुनर्वसवे नमः | OM Punarvasave namaḥ

పునర్వసుః, पुनर्वसुः, Punarvasuḥ

పునః పునః వసతి శరీరేషు క్షేత్రజ్ఞరూపేణ ప్రాణుల శరీరములయందు క్షేత్రజ్ఞ (జీవ) రూపమున జన్మ పరంపరలో మరల మరల విష్ణువు తాను వసించుచుండును.

:: భగవద్గీత - సాఙ్ఖ్య యోగము ::

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ॥ 22 ॥

చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరములగు క్రొత్త బట్టలనెట్లు ధరించుచున్నాడో, అట్లే దేహియగు ఆత్మయు శిథిలములైన పాతశరీరములను వదిలి ఇతరములగు క్రొత్త శరీరములను ధరించుచున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 150🌹

📚. Prasad Bharadwaj

🌻150. Punarvasuḥ🌻

OM Punarvasave namaḥ

Punaḥ punaḥ vasati śarīreṣu kṣetrajñarūpeṇa / पुनः पुनः वसति शरीरेषु क्षेत्रज्ञरूपेण Resides in the bodies again and again in the form of the Kṣetrajña or Jīva.

Bhagavad Gītā - Chapter 2

Vāsāṃsi jīrṇāni yathā vihāya navāni gr̥hṇāti naro’parāṇi,
Tathā śarīrāṇi vihāya jīrṇā nyanyāni saṃyāti navāni dehī. (22)

:: श्रीमद्भगवद्गीता - साङ्ख्य योग ::

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा न्यन्यानि संयाति नवानि देही ॥ २२ ॥

As after rejecting worn out clothes - a man takes up other new ones, likewise after rejecting worn out bodies the embodied one unites with other new ones.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः ।
अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॥ १६ ॥

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥

Bhrājiṣṇurbhojanaṃ bhoktā sahiṣṇurjagadādijaḥ ।
Anagho vijayo jetā viśvayoniḥ punarvasuḥ ॥ 16 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 151/ Vishnu Sahasranama Contemplation - 151🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻151. ఉపేంద్రః, उपेन्द्रः, Upendraḥ🌻

ఓం ఉపేంద్రాయ నమః | ॐ उपेन्द्राय नमः | OM Upendrāya namaḥ

ఉపేంద్రః, उपेन्द्रः, Upendraḥ

య ఉపగతవానింద్రమనుజత్వేన కేశవః ।

స్వీకృతవామనరూపస్స ఉపేంద్ర ఇతీర్యతే ॥

అనుజుని అనగా తమ్ముని రూపమున ఇంద్రుని సమీపమున చేరియున్నవాడు. లేదా ప్రసిద్ధుడగు ఇంద్రుని కంటెను పై గానున్న ఇంద్రుడు.

:: హరివంశము - ద్వితీయ ఖండము, ఎకోనవింశోఽధ్యాయము ::

మమోపరి యథేంద్ర స్త్వం స్థాపితో గోభిరీశ్వరః ।

ఉపేంద్ర ఇతి కృష్ణ త్వాం గాస్యంతి భువి దేవతాః ॥ 46 ॥

నేను ఎట్లు ఇంద్రుడనో అట్లే నీవు నాకు పైగా ఇంద్రుడుగా ఈశ్వరుడుగా (స్వామిగా) గోవులచే నిలుపబడితివి. అందుచేత కృష్ణా! నిన్ను భూమియందూ, దేవతలును ఉపేంద్రుడు అని గానము చేయుదురు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::

క. అదితియుఁ గశ్యపుఁడును నన, విదితుల రగు మీకుఁ గురుచచేషంబున నే

నుదయించితి వామనుఁ డన్ఁ, ద్రిదశేంద్రానుజుఁడనై ద్వితీయభవనమున్‍.

రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అను పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపంలో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు.

(శ్రీకృష్ణుడు జన్మించినపుడు దేవకీ వసుదేవుల పూర్వజన్మల వృత్తాంతాలను ఈశ్వరుడైన మహా విష్ణువు తెలియజేస్తూ దేవకీదేవి పూర్వం స్వాయంభువ మన్వంతరంలో 'పృశ్ని' అనే మహాపతివ్రతయని, వసుదేవుడు 'సుతపుడు' అనే ప్రజాపతియని తెలియజేస్తారు.

వారు తీవ్రమైన తపస్సు చేసి శ్రీమహావిష్ణువు సాక్షాత్కారము పొంది, బిడ్డలు లేనందున విష్ణువుతో సమానమైన పుత్రుడిని అర్థిస్తారు. వారి మొరాలకించి తన సాటివాడు మరొకడు లేనందున, తానే ఆ మన్వంతరములో "పృశ్నిగర్భుడుగా", వారి రెండవ జన్మలైన అదితీ కశ్యపులకు వామనుడిగా, మూడవజన్మలో దేవకీ వసుదేవులకు కృష్ణుడిగా జన్మించిన వృత్తాంతం తెలియజేస్తారు.)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 151🌹

📚. Prasad Bharadwaj

🌻151. Upendraḥ🌻

OM Upendrāya namaḥ

Ya upagatavānindramanujatvena keśavaḥ,
Svīkr̥tavāmanarūpassa upendra itīryate.

य उपगतवानिन्द्रमनुजत्वेन केशवः ।
स्वीकृतवामनरूपस्स उपेन्द्र इतीर्यते ॥

One born as the younger brother of Indra. Or One who is greater than Indra.

Harivaṃśa - Part 2, Chapter 19

Mamopari yathendra stvaṃ sthāpito gobhirīśvaraḥ,
Upendra iti Kr̥ṣṇa tvāṃ gāsyanti bhuvi devatāḥ. (46)

:: हरिवंशे द्वितीय खंडे एकोनविंशोऽध्यायः ::

ममोपरि यथेन्द्र स्त्वं स्थापितो गोभिरीश्वरः ।
उपेन्द्र इति कृष्ण त्वां गास्यन्ति भुवि देवताः ॥ ४६ ॥

The cows have established You superior to me as my master. Therefore, O Kr̥ṣṇa - the dwellers of Earth and the Devās will sing about You, addressing You as Upendra.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3

Tayorvāṃ punarevāhamadityāmāsa kaśyapāt,
Upendra iti vikhyāto vāmanatvācca vāmanaḥ. (42)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे तृतीयोऽध्यायः ::

तयोर्वां पुनरेवाहमदित्यामास कश्यपात् ।
उपेन्द्र इति विख्यातो वामनत्वाच्च वामनः ॥ ४२ ॥

In the next millennium, I again appeared from the two of you, who appeared as My mother, Aditi, and My father, Kaśyapa. I was known as Upendra, and because of being a dwarf, I was also known as Vāmana.

(Lord Viṣṇu explains the previous births of Devaki and Vasudeva who begot him as their Son for the third time. During Svāyambhuva millennium, they as Pr̥śni and Sutapa, underwent severe austerities with the desire for progeny. When Lord Viṣṇu appeared before them and offered benediction, they expressed the desire to have a son exactly like Him. Since there is none comparable to Him, He Himself appeared as Pr̥śnigarbha through them. He again appeared from the two of them, who took birth as Aditi and Kaśyapa as Upendra or Vamana. The third incarnation was, of course, Śrī Kr̥ṣṇa through Devaki and Vasudeva.)

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः ।
अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥

ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః ।
అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥

Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ ।
Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

06 Dec 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 123

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 123 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 53 🌻

ఇది సాక్షాత్తు యమధర్మరాజు చేత ఉపదేశింప బడినటువంటిది. వైదికమైనటువంటిది. సనాతనమైనటువంటిది. గురుశిష్య సంవాదరూపమైనటువంటిది. యోగ్యులైన, అధికారులైనటువంటి వారికి, శిష్యులకి తెలియజేసినట్లైతే, వాళ్ళు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి అనువైనటువంటిది.

చెప్పినటువంటి వారు కూడా, ఆత్మనిష్ఠులై, బ్రహ్మనిష్ఠులై, బ్రహ్మలోకమున పూజించబడేటటుంవంటి, ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి వ్యాఖ్యానము. ఈ కఠోపనిషత్తు అంతర్గతమైనటువంటిదని, నచికేతోపాఖ్యానము అనే పేరున కూడా పిలుస్తారు.

ఎవరీ శ్రేష్ఠము, రహస్యమునైన నాచికేతోపాఖ్యానమును శుచియై, బ్రహ్మజ్ఞానుల సభయందు గాని, శ్రాద్ధకాలమందుగాని, వినిపించుట అనంత ఫలకారి అగును.

ఇది ఫలశృతి అన్నమాట. రహస్యమైనటువంటిది, శ్రేష్ఠమైనటువంటిది, అధికారులకు మాత్రమే సాధ్యమైనటువంటిది, సరియైనటువంటి సద్గురువు కృప చేత మాత్రమే సాధింపగలినటువంటిది అయినటువంటి ఈ ఆత్మోపదేశము, ఈ నాచికేతోపాఖ్యానము అనేటటువంటి దాని ద్వారా అందివ్వబడుతున్నటువంటిది.

ఇది సర్వకాల సర్వావస్థలలోను కూడా మానవులు ఆశ్రయించ దగినటువంటిది. బ్రహ్మజ్ఞానులు ఉన్నటువంటి సభలో ఈ కఠోపనిషత్తు తప్పక ఆశ్రయించ వలసినటువంటి ఉపనిషత్తు. అందువలననే, చాలా సాంప్రదాయములలో గురుపూర్ణిమ కాలములలో, ఈ కఠోపనిషత్తుని చదువుతారు.

ఇది చాలా విశేషఫలవంతమైనటువంటిది కాబట్టి, ఆత్మోపదేశమునకు అర్హమైన కాలము శ్రాద్ధకాలము. శ్రద్ధతో నిర్వహించబడి, జీవుని యొక్క జనన మరణ చక్రమంతా బోధించబడేటటువంటి, శ్రాద్ధకాలమందు కూడా ఈ ఆత్మోపదేశమునకు అర్హమైనటువంటి, నాచికేతోపాఖ్యానమును మానవులు తప్పక అధ్యయనం చేయాలి. అలా చేసినట్లయితే, అనంతమైనటువంటి ఫలం లభిస్తుంది. .- విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

06 Dec 2020

శ్రీ శివ మహా పురాణము - 288

🌹 . శ్రీ శివ మహా పురాణము - 288 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

69. అధ్యాయము - 24

🌻. శ్రీరామునకు పరీక్ష - 4 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

శివుని యాజ్ఞచే ఈశ్వరి యగు సతి అచటకు వెళ్లి ఇట్లు తలపోసెను. వనములో సంచరించే రాముని ఏవిధముగా పరీక్షించవలెను? (45). నేను సీతారూపమును ధరించి రాముని వద్దకు వెళ్ళెదను. రాముడు విష్ణువు అయినచో, ఆయనకు అంతయూ తెలియగలదు. కానిచో తెలియదు (46).

ఇట్లు తలంచి ఆమె సీతారూపమును దాల్చి రాముని వద్దకు వెళ్లెను. మోహపరాయణయైన సతి ఈ తీరున రాముని పరీక్షించుటకు పూనుకొనెను (47). రఘురాముడు సీతా రూపములో నున్న సతిని చూచి శివానామమును జపించుచూ నవ్వి ఆ సత్యమునెరింగి నమస్కరించి ఇట్లు పలికెను (48).

రాముడిట్లు పలికెను -

సతీ! నీవు అను రాగముతో చెప్పుము. నీకు నమస్కారము. శివుడు ఎచటకు వెళ్లినాడు? నీవు భర్త తోడు లేకుండా ఒంటరిగా ఈ అడవిలోనికి ఏల వచ్చితివి?(49). ఓ సతీ! నీవు నీ రూపమును వీడి ఈ రూపము నేల ధరించితివి? ఓ దేవీ! నీవు నాయందు దయను చేసి ఇట్లు చేయుటకు గల కారణమును చెప్పుము (50).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు సతీదేవి రాముని ఈ మాటలను విని విస్మితురాలాయెను. శివుని వచనము అమోఘమని ఆమెకు తలపునకు వచ్చి, చాల సిగ్గుపడెను (51). రాముడు విష్ణువేయని ఎరింగి, తన రూపమును మరల పొంది, మనస్సులో శివుని పాదములను స్మరించి, ప్రసన్నమైన బుద్ధిగలదై సతీదేవి ఇట్లు పలికెను (52).

స్వతంత్రుడు, పరమేశ్వరుడునగు శివ ప్రభుడు నాతో, మరియు గణములతో గూడి భూమిని పర్యటిస్తూ, ఈ అడవికి కూడా వచ్చినాడు (53). ఆయన ఇచట లక్ష్మణునితో గూడి సీతను వెదుకుటలో తత్పరుడై ఉన్నట్టియు, సీతా విరహముచే దుఃఖితమగు మనస్సు గల్గిన నిన్ను చూచినాడు (54).

ఆయన నీకు నమస్కరించి, విష్ణువు యొక్క గొప్ప మహిమను ఆనందముతో ప్రశంసించి, ఆ మర్రిచెట్టు క్రింద నిలబడి యున్నాడు (55). ఆయన ఇప్పుడు చతుర్భుజుడగు విష్ణువును చూడక పోయిననూ చూచినట్లే సంతసించెను. నీ ఈ పవిత్రమగు రూపమును చూచి, ఆయన ఆనందమును పొందినాడు (56).

శంభుని ఆ మాటలను విన్న పిదప, నాకు మనస్సులో భ్రాంతి కలిగినది . ఓ రామా! ఆయన ఆజ్ఞచే నేను నిన్ను పరీక్షించితిని (57). రామా! నీవు విష్ణువే యని నాకు తెలిసినది. నీ ప్రభుశక్తిని పూర్ణముగా నేను చూచితిని. నా సందేహము తొలగినది. ఓ మహా బుద్ధిశాలీ! అయినను, నా మాటను నీవు వినుము (58).

నీవు శివునకు నమస్కరింపదగినవాడవు ఎట్లు అగుదువు? నా ఎదుట సత్యమును పలుకుము. నా ఈ సంశయమును నివారింపుము. నాకు వెంటనే మనశ్శాంతిని కలిగించుము (59).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వికసించిన పద్మముల వంటి నేత్రములు గల శ్రీరాముడు ఆమె ఈ మాటను విని, తన ప్రభువగు శంభు విస్మరించెను. ఆయనకు హృదయములో ప్రేమ ఉప్పొంగెను (60). ఓ మహర్షీ! రాముడు సతి అనుజ్ఞ లేకుండుటచే, శివుని వద్దకు వెళ్లలేదు. ఆయన మహిమను మనస్సులో భావన చేసి రాఘవుడు సతీదేవితో నిట్లనెను (61).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు సతీ ఖండలో రామ పరీక్షా వర్ణన మనే ఇరుది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

06 Dec 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 131, 132 / Sri Lalitha Chaitanya Vijnanam - 131, 132

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 70 / Sri Lalitha Sahasra Nama Stotram - 70 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 131, 132 / Sri Lalitha Chaitanya Vijnanam - 131, 132 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖

🌻 131. 'శాంతిమతీ 🌻

శాంతమగు మనసు కలది శ్రీలలిత అని అర్థము.

శాంతమనగా ఇంద్రియ నిగ్రహస్థితి. సన్నివేశములతో సంబంధములేక అన్ని సమయములయందు శాంతము ప్రకటించు మనసు.

శ్రీదుర్గ, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు యుద్ధమునందు కూడ ప్రశాంతమగు మనసు కలిగియున్నట్లు మన వాజ్ఞయము తెలుపును. దీనివలన తెలియునదే మనగా, వీరి స్థిర శాంత చిత్తమునకు కారణము అంతరంగమును వారు పరతత్త్వముతో ఏర్పరచుకొనిన నిశ్చలమగు బంధమే.

అట్టివారికి బాహ్య ప్రపంచమంతయూ ఒక నాటకరంగముగ గోచరించును. అందు జరుగు మార్పులన్నియు, జగన్నాటక సూత్రధారియగు దైవము చేతియందుండునని తెలిసి, దైవముతో ముడిపడి కార్యములను నిర్వర్తింతురు.

కర్తృత్వము దైవమునదే అని తెలిసి యుందురు. తమవంతు కర్తవ్యమును నిమిత్తమాత్రముగ నిర్వర్తించుచుందురు. నిజమునకు యిట్టివారియందు దైవమే తన కర్తృత్వమును నిర్వర్తించును. వారు దైవమునందు ఉండుటచే వారి చిత్తము శాంతముగ నుండును.

శ్రీలలిత సృష్టి యున్నప్పుడు, లేనప్పుడు, సృష్టించుచున్నప్పుడు కూడ పరమ శివుని తోనే యుండుటచే ఆమెను మించిన శాంతిమతులు లేరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 131 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Śantimatī शन्तिमती (131) 🌻

She is never harsh to Her devotees. She tolerates certain acts of Her devotees that are not considered appropriate. Śanti means peace. She appears peaceful and tolerates only certain acts of Her devotees. She too has a tolerance level.

Once that level is crossed by Her devotees, She does not hesitate to initiate corrective measures. The corrective measures are carried out through Her ministers like Aśvārūdā or Vārāhi Devi-s.

With this nāma, Her act of benediction ends. Nāma-s 132 to 155 discuss Her as Nirguṇa Brahman or Her formless form. Worshipping Her as Nirguṇa (without attributes or qualities) form is considered as an important aspect of worship and the result of such worship is described in nāma-s 156 to 195.

It is also interesting to note that Vāc Devi-s have chosen to discuss her nirguṇa worship first and saguṇa (with attributes) worship later (196-248).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 132 / Sri Lalitha Chaitanya Vijnanam - 132 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖

🌻 132. 'నిరాధారా' 🌻

వేరొక ఆధారము లేనిది శ్రీలలిత అని అర్థము.

సకల చరాచర జగత్తునకును శ్రీలలితయే ఆధారము. ఆమెయే సమస్తమును కాలక్రమమున నిర్వర్తించును. సర్వసృష్టి ప్రణాళిక ఆమెదే. శక్తి ఆమెదే. త్రిగుణములు కూడ ఆమెనుండి పుట్టినవే. త్రిమూర్తులు కూడ ఆమె సంతానమే.

ఇక యితరుల గూర్చి చెప్పనేల? ఆమెకామెయే ఆధారము. మరియొక ఆధారము లేదు. పరతత్వము ఆమెయందున్నప్పటికీ, స్వభావపరముగ ఆమె పనియే చేయును. చేత అంత శ్రీలలితయే.

సృష్టి సమస్యలను కూడ ఆమెయే పరిష్కరించును. భక్తులకు, జ్ఞానులకు, యోగులకు, దేవతలకు, అసురులకు అందరికిని ఆమె ఆధారము. ఆమె వారిపై ఆధారపడదు. తమపై ఆధారపడు వారిపై ఆధారపడుట బలహీనత. విపత్కర సమయములలో ఆమే దుర్గగను,

కాళిగను, మహిషాసుర మర్దినిగను అవతరించి దుష్ట సంహారము చేయును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 132 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Nirādhārā निराधारा (132) 🌻

She is without support. She does not depend upon anybody. Chāndogya Upaniṣad (VII.24.1) asks “That which is infinite is immortal and that which is finite is mortal. It rests on its own power – or not even on that power (as it depends on nothing else, not even its own power). This is known as nirādhārā.

Śaktī is worshipped both internally and externally; but internal worship leads to quicker realisation. External worship is further divided into two categories- Vedic and Tantric.

Internal worship is also divided into two categories, one is with form and another is without form. Worshipping Her internally without attributing any form is considered to yield desired results leading to quicker realisation of the Self.

The pure form of consciousness is Śaktī. Śiva Sūtra (1.1.) says caitanymātmā. This means that pure consciousness is Ātma. Only by worshipping Her, detachment from saṁsāra becomes possible, which ultimately leads to liberation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

06 Dec 2020

6-DECEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 570 / Bhagavad-Gita - 570🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 150, 151 / Vishnu Sahasranama Contemplation - 150, 151🌹
3) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 123🌹
4) 🌹. శివ మహా పురాణము - 288 🌹 
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 144 🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 70 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 131, 132 / Sri Lalita Chaitanya Vijnanam - 131, 132🌹
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 481 / Bhagavad-Gita - 481 🌹

09) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 92 📚
10) 🌹 Light On The Path - 45🌹
11) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 177🌹 
12) 🌹 Seeds Of Consciousness - 241 🌹   
13) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 116 🌹
15) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 80 / Sri Vishnu Sahasranama - 80🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 570 / Bhagavad-Gita - 570 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 14 🌴*

14. దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ||

🌷. తాత్పర్యం : 
దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మికగురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగువారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస యనునవి శారీరిక తపస్సని చెప్పబడును.

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వివిధ తపస్సులను, నిష్ఠలను వివరింపనెంచి తొలుత దేహసంబంధమైన తపోనిష్ఠలను వివరించుచున్నాడు. ప్రతియొక్కరు దేవదేవునకు లేదా దేవతలకు, పూర్ణులును యోగ్యులును అగు బ్రాహ్మణులకు, గురువునకు, తల్లిదండ్రుల వంటి పెద్దలకు, వేదజ్ఞానపారంగతుడైనవానికి గౌరవమొసగవలెను లేదా గౌరవమొసగుటను నేర్వవలెను. 

వీరందరును నిక్కముగా సరియైన గౌరవమందవలసినవారు. అంతియేగాక మనుజుడు అంతర్బాహ్యముల శుచిత్వమును పాటించుచు,వ్యవహారమున సరళత్వమును నేర్వవలెను.

 శాస్త్రమునందు తెలుపబడనటువంటి దానినెన్నడును అతడు ఆచరించరాదు. శాస్త్రమందు మైథునమన్నది వైవాహిక జీవనమునందు తప్ప అన్యముగా అంగీకరింపబడనందున అతడు అవివాహిక సంబంధమును కలిగియుండరాదు. ఇదియే బ్రహ్మచర్యమనబడును.ఇవియే దేహపరమైన తపోనిష్ఠలు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 570 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 14 🌴*

14. deva-dvija-guru-prājña-
pūjanaṁ śaucam ārjavam
brahmacaryam ahiṁsā ca
śārīraṁ tapa ucyate

🌷 Translation : 
Austerity of the body consists in worship of the Supreme Lord, the brāhmaṇas, the spiritual master, and superiors like the father and mother, and in cleanliness, simplicity, celibacy and nonviolence.

🌹 Purport :
The Supreme Godhead here explains the different kinds of austerity and penance. First He explains the austerities and penances practiced by the body. 

One should offer, or learn to offer, respect to God or to the demigods, the perfect, qualified brāhmaṇas and the spiritual master and superiors like father, mother or any person who is conversant with Vedic knowledge. These should be given proper respect. One should practice cleansing oneself externally and internally, and he should learn to become simple in behavior. 

He should not do anything which is not sanctioned by the scriptural injunctions. He should not indulge in sex outside of married life, for sex is sanctioned in the scripture only in marriage, not otherwise. This is called celibacy. These are penances and austerities as far as the body is concerned.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 150, 151 / Vishnu Sahasranama Contemplation - 150, 151 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻150. పునర్వసుః, पुनर्वसुः, Punarvasuḥ🌻*

*ఓం పునర్వసవే నమః | ॐ पुनर्वसवे नमः | OM Punarvasave namaḥ*

పునర్వసుః, पुनर्वसुः, Punarvasuḥ
పునః పునః వసతి శరీరేషు క్షేత్రజ్ఞరూపేణ ప్రాణుల శరీరములయందు క్షేత్రజ్ఞ (జీవ) రూపమున జన్మ పరంపరలో మరల మరల విష్ణువు తాను వసించుచుండును.

:: భగవద్గీత - సాఙ్ఖ్య యోగము ::
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ॥ 22 ॥

చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరములగు క్రొత్త బట్టలనెట్లు ధరించుచున్నాడో, అట్లే దేహియగు ఆత్మయు శిథిలములైన పాతశరీరములను వదిలి ఇతరములగు క్రొత్త శరీరములను ధరించుచున్నది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 150🌹*
📚. Prasad Bharadwaj 

*🌻150. Punarvasuḥ🌻*

*OM Punarvasave namaḥ*

Punaḥ punaḥ vasati śarīreṣu kṣetrajñarūpeṇa / पुनः पुनः वसति शरीरेषु क्षेत्रज्ञरूपेण Resides in the bodies again and again in the form of the Kṣetrajña or Jīva.

Bhagavad Gītā - Chapter 2
Vāsāṃsi jīrṇāni yathā vihāya navāni gr̥hṇāti naro’parāṇi,
Tathā śarīrāṇi vihāya jīrṇā nyanyāni saṃyāti navāni dehī. (22)

:: श्रीमद्भगवद्गीता - साङ्ख्य योग ::
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा न्यन्यानि संयाति नवानि देही ॥ २२ ॥

As after rejecting worn out clothes - a man takes up other new ones, likewise after rejecting worn out bodies the embodied one unites with other new ones.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः ।
अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॥ १६ ॥

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥

Bhrājiṣṇurbhojanaṃ bhoktā sahiṣṇurjagadādijaḥ ।
Anagho vijayo jetā viśvayoniḥ punarvasuḥ ॥ 16 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 151/ Vishnu Sahasranama Contemplation - 151🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻151. ఉపేంద్రః, उपेन्द्रः, Upendraḥ🌻*

*ఓం ఉపేంద్రాయ నమః | ॐ उपेन्द्राय नमः | OM Upendrāya namaḥ*

ఉపేంద్రః, उपेन्द्रः, Upendraḥ
య ఉపగతవానింద్రమనుజత్వేన కేశవః ।
స్వీకృతవామనరూపస్స ఉపేంద్ర ఇతీర్యతే ॥

అనుజుని అనగా తమ్ముని రూపమున ఇంద్రుని సమీపమున చేరియున్నవాడు. లేదా ప్రసిద్ధుడగు ఇంద్రుని కంటెను పై గానున్న ఇంద్రుడు.

:: హరివంశము - ద్వితీయ ఖండము, ఎకోనవింశోఽధ్యాయము ::
మమోపరి యథేంద్ర స్త్వం స్థాపితో గోభిరీశ్వరః ।
ఉపేంద్ర ఇతి కృష్ణ త్వాం గాస్యంతి భువి దేవతాః ॥ 46 ॥

నేను ఎట్లు ఇంద్రుడనో అట్లే నీవు నాకు పైగా ఇంద్రుడుగా ఈశ్వరుడుగా (స్వామిగా) గోవులచే నిలుపబడితివి. అందుచేత కృష్ణా! నిన్ను భూమియందూ, దేవతలును ఉపేంద్రుడు అని గానము చేయుదురు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::
క. అదితియుఁ గశ్యపుఁడును నన, విదితుల రగు మీకుఁ గురుచచేషంబున నే
    నుదయించితి వామనుఁ డన్ఁ, ద్రిదశేంద్రానుజుఁడనై ద్వితీయభవనమున్‍.

రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అను పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపంలో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు.

(శ్రీకృష్ణుడు జన్మించినపుడు దేవకీ వసుదేవుల పూర్వజన్మల వృత్తాంతాలను ఈశ్వరుడైన మహా విష్ణువు తెలియజేస్తూ దేవకీదేవి పూర్వం స్వాయంభువ మన్వంతరంలో 'పృశ్ని' అనే మహాపతివ్రతయని, వసుదేవుడు 'సుతపుడు' అనే ప్రజాపతియని తెలియజేస్తారు. 

వారు తీవ్రమైన తపస్సు చేసి శ్రీమహావిష్ణువు సాక్షాత్కారము పొంది, బిడ్డలు లేనందున విష్ణువుతో సమానమైన పుత్రుడిని అర్థిస్తారు. వారి మొరాలకించి తన సాటివాడు మరొకడు లేనందున, తానే ఆ మన్వంతరములో "పృశ్నిగర్భుడుగా", వారి రెండవ జన్మలైన అదితీ కశ్యపులకు వామనుడిగా, మూడవజన్మలో దేవకీ వసుదేవులకు కృష్ణుడిగా జన్మించిన వృత్తాంతం తెలియజేస్తారు.)

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 151🌹*
📚. Prasad Bharadwaj 

*🌻151. Upendraḥ🌻*

*OM Upendrāya namaḥ*

Ya upagatavānindramanujatvena keśavaḥ,
Svīkr̥tavāmanarūpassa upendra itīryate.

य उपगतवानिन्द्रमनुजत्वेन केशवः ।
स्वीकृतवामनरूपस्स उपेन्द्र इतीर्यते ॥

One born as the younger brother of Indra. Or One who is greater than Indra.

Harivaṃśa - Part 2, Chapter 19
Mamopari yathendra stvaṃ sthāpito gobhirīśvaraḥ,
Upendra iti Kr̥ṣṇa tvāṃ gāsyanti bhuvi devatāḥ. (46)

:: हरिवंशे द्वितीय खंडे एकोनविंशोऽध्यायः ::
ममोपरि यथेन्द्र स्त्वं स्थापितो गोभिरीश्वरः ।
उपेन्द्र इति कृष्ण त्वां गास्यन्ति भुवि देवताः ॥ ४६ ॥

The cows have established You superior to me as my master. Therefore, O Kr̥ṣṇa - the dwellers of Earth and the Devās will sing about You, addressing You as Upendra.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3
Tayorvāṃ punarevāhamadityāmāsa kaśyapāt,
Upendra iti vikhyāto vāmanatvācca vāmanaḥ. (42)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे तृतीयोऽध्यायः ::
तयोर्वां पुनरेवाहमदित्यामास कश्यपात् ।
उपेन्द्र इति विख्यातो वामनत्वाच्च वामनः ॥ ४२ ॥

In the next millennium, I again appeared from the two of you, who appeared as My mother, Aditi, and My father, Kaśyapa. I was known as Upendra, and because of being a dwarf, I was also known as Vāmana.

(Lord Viṣṇu explains the previous births of Devaki and Vasudeva who begot him as their Son for the third time. During Svāyambhuva millennium, they as Pr̥śni and Sutapa, underwent severe austerities with the desire for progeny. When Lord Viṣṇu appeared before them and offered benediction, they expressed the desire to have a son exactly like Him. Since there is none comparable to Him, He Himself appeared as Pr̥śnigarbha through them. He again appeared from the two of them, who took birth as Aditi and Kaśyapa as Upendra or Vamana. The third incarnation was, of course, Śrī Kr̥ṣṇa through Devaki and Vasudeva.)

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः ।अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥

ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః ।అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥

Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ ।Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 123 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 53 🌻*

ఇది సాక్షాత్తు యమధర్మరాజు చేత ఉపదేశింప బడినటువంటిది. వైదికమైనటువంటిది. సనాతనమైనటువంటిది. గురుశిష్య సంవాదరూపమైనటువంటిది. యోగ్యులైన, అధికారులైనటువంటి వారికి, శిష్యులకి తెలియజేసినట్లైతే, వాళ్ళు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి అనువైనటువంటిది. 

చెప్పినటువంటి వారు కూడా, ఆత్మనిష్ఠులై, బ్రహ్మనిష్ఠులై, బ్రహ్మలోకమున పూజించబడేటటుంవంటి, ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి వ్యాఖ్యానము. ఈ కఠోపనిషత్తు అంతర్గతమైనటువంటిదని, నచికేతోపాఖ్యానము అనే పేరున కూడా పిలుస్తారు.

ఎవరీ శ్రేష్ఠము, రహస్యమునైన నాచికేతోపాఖ్యానమును శుచియై, బ్రహ్మజ్ఞానుల సభయందు గాని, శ్రాద్ధకాలమందుగాని, వినిపించుట అనంత ఫలకారి అగును.
   
      ఇది ఫలశృతి అన్నమాట. రహస్యమైనటువంటిది, శ్రేష్ఠమైనటువంటిది, అధికారులకు మాత్రమే సాధ్యమైనటువంటిది, సరియైనటువంటి సద్గురువు కృప చేత మాత్రమే సాధింపగలినటువంటిది అయినటువంటి ఈ ఆత్మోపదేశము, ఈ నాచికేతోపాఖ్యానము అనేటటువంటి దాని ద్వారా అందివ్వబడుతున్నటువంటిది. 

ఇది సర్వకాల సర్వావస్థలలోను కూడా మానవులు ఆశ్రయించ దగినటువంటిది. బ్రహ్మజ్ఞానులు ఉన్నటువంటి సభలో ఈ కఠోపనిషత్తు తప్పక ఆశ్రయించ వలసినటువంటి ఉపనిషత్తు. అందువలననే, చాలా సాంప్రదాయములలో గురుపూర్ణిమ కాలములలో, ఈ కఠోపనిషత్తుని చదువుతారు.

ఇది చాలా విశేషఫలవంతమైనటువంటిది కాబట్టి, ఆత్మోపదేశమునకు అర్హమైన కాలము శ్రాద్ధకాలము. శ్రద్ధతో నిర్వహించబడి, జీవుని యొక్క జనన మరణ చక్రమంతా బోధించబడేటటువంటి, శ్రాద్ధకాలమందు కూడా ఈ ఆత్మోపదేశమునకు అర్హమైనటువంటి, నాచికేతోపాఖ్యానమును మానవులు తప్పక అధ్యయనం చేయాలి. అలా చేసినట్లయితే, అనంతమైనటువంటి ఫలం లభిస్తుంది. .- విద్యా సాగర్ గారు 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 144 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
136

Sloka:
 Virajam paramakasam dhruvamanandamavyayam | Agocharam tatha gamyam nama rupa vivarjitam | Tadaham brahma kaivalyam iti bodhah prajayate ||

Meditating on the Guru gives you the knowledge that you are the non-dual Absolute which is pure, eternal, blissful, indestructible, invisible, of the form of higher sky (Paramakasam), inscrutable and beyond name and form”.

“Paramakasam” indicates one who pervades Anda, Pinda and Brahamanda. (In other words, pervades everything from the smallest unit of matter to the infinite cosmos). By describing the benefits, Siva is encouraging us to meditate. That is Siva’s nature. That is why, Guru is worshiped as Siva. 

On the other hand, Brahma would analyze how many lives we’ve been mediating from, how much meditation we’ve done so far etc. Vishnu will ask us to keep meditating. Neither Brahma nor Vishnu will deviate from what they usually say.

Next, they are describing how we go from meditating on the Guru principle to the state of self-realization.

Sloka:
Yatha nija svabhavena keyura katakadayah | Suvarnatvena tishthanti tathaham brahma sasvatam ||

I am the eternal Absolute though appearing to be confined to be a limited form, just as the different ornaments like ankles, bracelets, etc., are of different shapes, though all of them are made of the same gold.
Siva is telling us what the result of such mediation is.

Sloka: 
Evam dhyayan param brahma sthatavyam yatra kutracit | Kito bhrnga iva dhyanat brahmaiva bhavati swayam ||

One must meditate on the Absolute wherever he is. As he goes on doing that, the practicant himself becomes Brahman just as the insect turns into the carpenter bee.

The carpenter bee picks up a worm and places it in a small pit made of mud. Every day, the bee goes to the pit and stings the worm. 

The worm is immersed in thinking about the bee, worried that it would get stung again. As it continues to think about the bee, it gets transformed slowly into a carpenter bee. 

That is how we should be. Only when we meditate on the Guru will we realize the form of the Guru, the Guru principle and the power of the Guru.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 288 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
69. అధ్యాయము - 24

*🌻. శ్రీరామునకు పరీక్ష - 4 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

శివుని యాజ్ఞచే ఈశ్వరి యగు సతి అచటకు వెళ్లి ఇట్లు తలపోసెను. వనములో సంచరించే రాముని ఏవిధముగా పరీక్షించవలెను? (45). నేను సీతారూపమును ధరించి రాముని వద్దకు వెళ్ళెదను. రాముడు విష్ణువు అయినచో, ఆయనకు అంతయూ తెలియగలదు. కానిచో తెలియదు (46). 

ఇట్లు తలంచి ఆమె సీతారూపమును దాల్చి రాముని వద్దకు వెళ్లెను. మోహపరాయణయైన సతి ఈ తీరున రాముని పరీక్షించుటకు పూనుకొనెను (47). రఘురాముడు సీతా రూపములో నున్న సతిని చూచి శివానామమును జపించుచూ నవ్వి ఆ సత్యమునెరింగి నమస్కరించి ఇట్లు పలికెను (48).

రాముడిట్లు పలికెను -

సతీ! నీవు అను రాగముతో చెప్పుము. నీకు నమస్కారము. శివుడు ఎచటకు వెళ్లినాడు? నీవు భర్త తోడు లేకుండా ఒంటరిగా ఈ అడవిలోనికి ఏల వచ్చితివి?(49). ఓ సతీ! నీవు నీ రూపమును వీడి ఈ రూపము నేల ధరించితివి? ఓ దేవీ! నీవు నాయందు దయను చేసి ఇట్లు చేయుటకు గల కారణమును చెప్పుము (50).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు సతీదేవి రాముని ఈ మాటలను విని విస్మితురాలాయెను. శివుని వచనము అమోఘమని ఆమెకు తలపునకు వచ్చి, చాల సిగ్గుపడెను (51). రాముడు విష్ణువేయని ఎరింగి, తన రూపమును మరల పొంది, మనస్సులో శివుని పాదములను స్మరించి, ప్రసన్నమైన బుద్ధిగలదై సతీదేవి ఇట్లు పలికెను (52). 

స్వతంత్రుడు, పరమేశ్వరుడునగు శివ ప్రభుడు నాతో, మరియు గణములతో గూడి భూమిని పర్యటిస్తూ, ఈ అడవికి కూడా వచ్చినాడు (53). ఆయన ఇచట లక్ష్మణునితో గూడి సీతను వెదుకుటలో తత్పరుడై ఉన్నట్టియు, సీతా విరహముచే దుఃఖితమగు మనస్సు గల్గిన నిన్ను చూచినాడు (54).

ఆయన నీకు నమస్కరించి, విష్ణువు యొక్క గొప్ప మహిమను ఆనందముతో ప్రశంసించి, ఆ మర్రిచెట్టు క్రింద నిలబడి యున్నాడు (55). ఆయన ఇప్పుడు చతుర్భుజుడగు విష్ణువును చూడక పోయిననూ చూచినట్లే సంతసించెను. నీ ఈ పవిత్రమగు రూపమును చూచి, ఆయన ఆనందమును పొందినాడు (56). 

శంభుని ఆ మాటలను విన్న పిదప, నాకు మనస్సులో భ్రాంతి కలిగినది . ఓ రామా! ఆయన ఆజ్ఞచే నేను నిన్ను పరీక్షించితిని (57). రామా! నీవు విష్ణువే యని నాకు తెలిసినది. నీ ప్రభుశక్తిని పూర్ణముగా నేను చూచితిని. నా సందేహము తొలగినది. ఓ మహా బుద్ధిశాలీ! అయినను, నా మాటను నీవు వినుము (58).

నీవు శివునకు నమస్కరింపదగినవాడవు ఎట్లు అగుదువు? నా ఎదుట సత్యమును పలుకుము. నా ఈ సంశయమును నివారింపుము. నాకు వెంటనే మనశ్శాంతిని కలిగించుము (59).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వికసించిన పద్మముల వంటి నేత్రములు గల శ్రీరాముడు ఆమె ఈ మాటను విని, తన ప్రభువగు శంభు విస్మరించెను. ఆయనకు హృదయములో ప్రేమ ఉప్పొంగెను (60). ఓ మహర్షీ! రాముడు సతి అనుజ్ఞ లేకుండుటచే, శివుని వద్దకు వెళ్లలేదు. ఆయన మహిమను మనస్సులో భావన చేసి రాఘవుడు సతీదేవితో నిట్లనెను (61).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు సతీ ఖండలో రామ పరీక్షా వర్ణన మనే ఇరుది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 70 / Sri Lalitha Sahasra Nama Stotram - 70 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 131, 132 / Sri Lalitha Chaitanya Vijnanam - 131, 132 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |*
*శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖*

*🌻 131. 'శాంతిమతీ 🌻*

శాంతమగు మనసు కలది శ్రీలలిత అని అర్థము.

శాంతమనగా ఇంద్రియ నిగ్రహస్థితి. సన్నివేశములతో సంబంధములేక అన్ని సమయములయందు శాంతము ప్రకటించు మనసు. 

శ్రీదుర్గ, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు యుద్ధమునందు కూడ ప్రశాంతమగు మనసు కలిగియున్నట్లు మన వాజ్ఞయము తెలుపును. దీనివలన తెలియునదే మనగా, వీరి స్థిర శాంత చిత్తమునకు కారణము అంతరంగమును వారు పరతత్త్వముతో ఏర్పరచుకొనిన నిశ్చలమగు బంధమే. 

అట్టివారికి బాహ్య ప్రపంచమంతయూ ఒక నాటకరంగముగ గోచరించును. అందు జరుగు మార్పులన్నియు, జగన్నాటక సూత్రధారియగు దైవము చేతియందుండునని తెలిసి, దైవముతో ముడిపడి కార్యములను నిర్వర్తింతురు. 

కర్తృత్వము దైవమునదే అని తెలిసి యుందురు. తమవంతు కర్తవ్యమును నిమిత్తమాత్రముగ నిర్వర్తించుచుందురు. నిజమునకు యిట్టివారియందు దైవమే తన కర్తృత్వమును నిర్వర్తించును. వారు దైవమునందు ఉండుటచే వారి చిత్తము శాంతముగ నుండును. 

శ్రీలలిత సృష్టి యున్నప్పుడు, లేనప్పుడు, సృష్టించుచున్నప్పుడు కూడ పరమ శివుని తోనే యుండుటచే ఆమెను మించిన శాంతిమతులు లేరు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 131 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Śantimatī शन्तिमती (131) 🌻*

She is never harsh to Her devotees. She tolerates certain acts of Her devotees that are not considered appropriate. Śanti means peace. She appears peaceful and tolerates only certain acts of Her devotees. She too has a tolerance level.  

Once that level is crossed by Her devotees, She does not hesitate to initiate corrective measures. The corrective measures are carried out through Her ministers like Aśvārūdā or Vārāhi Devi-s. 

With this nāma, Her act of benediction ends. Nāma-s 132 to 155 discuss Her as Nirguṇa Brahman or Her formless form. Worshipping Her as Nirguṇa (without attributes or qualities) form is considered as an important aspect of worship and the result of such worship is described in nāma-s 156 to 195. 

 It is also interesting to note that Vāc Devi-s have chosen to discuss her nirguṇa worship first and saguṇa (with attributes) worship later (196-248).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 132 / Sri Lalitha Chaitanya Vijnanam - 132 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |*
*శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖*

*🌻 132. 'నిరాధారా' 🌻*

వేరొక ఆధారము లేనిది శ్రీలలిత అని అర్థము.

సకల చరాచర జగత్తునకును శ్రీలలితయే ఆధారము. ఆమెయే సమస్తమును కాలక్రమమున నిర్వర్తించును. సర్వసృష్టి ప్రణాళిక ఆమెదే. శక్తి ఆమెదే. త్రిగుణములు కూడ ఆమెనుండి పుట్టినవే. త్రిమూర్తులు కూడ ఆమె సంతానమే. 

ఇక యితరుల గూర్చి చెప్పనేల? ఆమెకామెయే ఆధారము. మరియొక ఆధారము లేదు. పరతత్వము ఆమెయందున్నప్పటికీ, స్వభావపరముగ ఆమె పనియే చేయును. చేత అంత శ్రీలలితయే. 

సృష్టి సమస్యలను కూడ ఆమెయే పరిష్కరించును. భక్తులకు, జ్ఞానులకు, యోగులకు, దేవతలకు, అసురులకు అందరికిని ఆమె ఆధారము. ఆమె వారిపై ఆధారపడదు. తమపై ఆధారపడు వారిపై ఆధారపడుట బలహీనత. విపత్కర సమయములలో ఆమే దుర్గగను,
కాళిగను, మహిషాసుర మర్దినిగను అవతరించి దుష్ట సంహారము చేయును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 132 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Nirādhārā निराधारा (132) 🌻*

She is without support. She does not depend upon anybody. Chāndogya Upaniṣad (VII.24.1) asks “That which is infinite is immortal and that which is finite is mortal. It rests on its own power – or not even on that power (as it depends on nothing else, not even its own power). This is known as nirādhārā.

Śaktī is worshipped both internally and externally; but internal worship leads to quicker realisation. External worship is further divided into two categories- Vedic and Tantric.  

Internal worship is also divided into two categories, one is with form and another is without form. Worshipping Her internally without attributing any form is considered to yield desired results leading to quicker realisation of the Self.

The pure form of consciousness is Śaktī. Śiva Sūtra (1.1.) says caitanymātmā. This means that pure consciousness is Ātma. Only by worshipping Her, detachment from saṁsāra becomes possible, which ultimately leads to liberation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 481 / Bhagavad-Gita - 481 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 26 🌴*

26. అన్యే త్వేవమజానన్త: శ్రుత్వాన్యేభ్య ఉపాసతే |
తేపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణా: ||

🌷. తాత్పర్యం : 
ఇంకొందరు ఆధ్యాత్మికజ్ఞానముతో పరిచయము లేకున్నను ఇతరుల నుండి పరమపురుషుని గూర్చి శ్రవణము చేసి అతనిని పూజించుట నారంభింతురు. ప్రామానికుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తిగలవారగుటచే వారును జనన,మార్గమును తరింపగలరు.

🌷. భాష్యము :
ఆధునిక సమాజమునందు ఆధ్యాత్మిక విషయములను గూర్చిన విద్యయన్నది ఏ మాత్రము లేనందున ఈ శ్లోకము వారికి ప్రత్యేకముగా వర్తించును. ఆధునిక సమాజములో కొందరు నాస్తికులుగా, నిర్వీశ్వరవాదులుగా లేదా తత్త్వవేత్తలుగా గోచరించినను వాస్తవమునకు సరియైన తత్త్వజ్ఞానము ఎవ్వరికినీ లేదు. 

కనుక సాధారణ మనుజునకు సంబంధించినంత వరకు అతడు సజ్జనుడైనచో శ్రవణము ద్వారా పురోగతి నొందుటకు అవకాశము కలదు. అట్టి శ్రవణ విధానము అత్యంత ముఖ్యమైనది. ఆధునిక జగములో కృష్ణభక్తి ప్రచారము చేసిన శ్రీచైతన్యమహాప్రభువు ఈ శ్రవణవిధానమునకు మిక్కిలి ప్రాధాన్యము నొసగిరి. 

ఏలయన ప్రామాణికులైన వారినుండి కేవలము శ్రవణము చేయుట ద్వారానే సామాన్యుడు పురోభివృద్ధిని పొందగలడని శ్రీచైతన్యమహాప్రభువు తెలిపియుండిరి. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 481 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 26 🌴*

26. anye tv evam ajānantaḥ
śrutvānyebhya upāsate
te ’pi cātitaranty eva
mṛtyuṁ śruti-parāyaṇāḥ

🌷 Translation : 
Again there are those who, although not conversant in spiritual knowledge, begin to worship the Supreme Person upon hearing about Him from others. Because of their tendency to hear from authorities, they also transcend the path of birth and death.

🌹 Purport :
This verse is particularly applicable to modern society because in modern society there is practically no education in spiritual matters. 

Some of the people may appear to be atheistic or agnostic or philosophical, but actually there is no knowledge of philosophy. As for the common man, if he is a good soul, then there is a chance for advancement by hearing. This hearing process is very important. 

Lord Caitanya, who preached Kṛṣṇa consciousness in the modern world, gave great stress to hearing because if the common man simply hears from authoritative sources he can progress, especially, according to Lord Caitanya, if he hears the transcendental vibration of Krishna chanting
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు - 92 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 26 - 5 . ప్రాణాయామ యజ్ఞము - ప్రణవము ప్రాణమై, ప్రాణము స్పందనమై పంచ ప్రాణములుగ నేర్పడి దేహమును నిర్వర్తించుచు నుండును. వీనిననుసరించి మరి ఐదు చిల్లర ప్రాణములు వున్నవి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచప్రాణములు. ఇవి ఆధారముగనే జీవుడు దేహము నందుండును. 🍀*

*📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚*
Part 5

తాననగ తనయందు జరుగు స్పందనమే అని తెలియును. స్పందనము నుండే అనగా తననుండే మనసు, శ్వాస రెండు ప్రవాహములుగ నేర్పడి దేహ మేర్పడినదని తెలియును. దేహము తన నివాసమేకాని, తాను కాదనియు తెలియును. నివాస పరిణామము నివసించువాని పరిణామము కన్న చాల పెద్దది. 

ప్రతి జీవియు అతని శరీరమున అతని బొటన వేలంత మాత్రమే యుండును. బొటన వ్రేలికి, శరీరమునకు గల వ్యత్యాసమే నివాసమునకు, నివాసికి కూడ కలదు. తాను నివసించు దేహము తనకొక వసతియేగాని, బంధము కాదని తెలియును. వసతి గృహము నుండి బయటకు, లోనికి ఎట్లు రాకపోకలు చేయ వచ్చునో అట్లే దేహము నుండి తాను రాకపోకలు చేయవచ్చును అని తెలియును. 

తాను 'హంస స్వరూపు'డని లేక 'పక్షి' యని, ద్వంద్వ శబ్దము తన రెక్కలని, తన శరీరము అస్థికలతో కూడిన పంజరమని, పంజరమున బంధింపబడి నుండనవసరము లేదని తెలియును. 

పై తెలియుట లన్నియు యింకను సిద్ధించుట కాదు. ఈ తెలియుట ప్రాణాయామ యజ్ఞమున ఒక శుభ పరిణామము. దీని వలన ఒక నూతన వికాసము, నూతనమైన రుచి సాధకునకు కలిగి ప్రాణాయామ హోమమునకు మరింత ఉద్యుక్తుడు కాగలడు.

ప్రణవము ప్రాణమై, ప్రాణము స్పందనమై పంచ ప్రాణములుగ నేర్పడి దేహమును నిర్వర్తించుచు నుండును. ఈ పంచప్రాణములు ముఖ్యప్రాణములు. వీని ననుసరించి మరి ఐదు చిల్లర ప్రాణములు వున్నవి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచప్రాణములు. ఇవి ఆధారముగనే జీవుడు దేహము నందుండును.

 పంచప్రాణములు సరిగ దేహమునందు పనిచేయుచున్నప్పుడు జీవుడు దేహమున స్వత చెంది యుండును. వీని సామ్యమును జీవుడు తన ప్రవర్తన ద్వారా నిలుపుకొనవలెనే గాని చెదరగొట్టుకొనకూడదు. 

కావుననే జీవుని ప్రవర్తనమునకు, అతని స్వస్థత లేక అస్వస్థతకు సంబంధమున్నది. ప్రాణము బలముగ నున్నచో మనసునకు బలము
కలుగును. 

ప్రాణము బలముగ లేనిచో మనసు బలహీనపడి ప్రాణమును మరింత బలహీన పరచును. మనసు దుర్బలత ప్రాణమునకు సహితము హాని కలిగించ కలదని తెలియవలెను. “క్షుద్రం హృదయ దౌర్బల్యమ్" అని భగవద్గీత తెలుపుచున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 45 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 4 - THE 3rd RULE
🌻 Kill out desire of comfort. - Be happy as those are who live for happiness. - 2 🌻

202. How shall the man become happy? The answer is: by realizing that the Self is bliss. It is said in the Brahma Sutras that Brahman is Bliss, Brahman is Ananda. The man has now to realize this. He is no longer moved by pleasure nor by pain. 

They have ceased to attract him; they came from contact between forms, but he has reached equilibrium. He is therefore likely to sink into the condition of being neither happy nor unhappy. But he must learn to be happy as those are who live for happiness.

203. It is the bliss of the Self, that deep abiding bliss, the sense of contentment and joy, which is an essential part of the spiritual life, and the most difficult part of that life to realize in consciousness. 

It is a very marked fact about the great Mystics and Saviours of men that the side of sorrow has shown itself very much in their lives. Jesus was a man of sorrow. Gautama, the Buddha, left his splendid palaces and gardens and loving friends to seek the cure for the sorrow of the world. 

The same is true when we look on the lives of all the great leaders of mankind. Sorrow touched them very deeply. But they were not overcome by the sorrow. In those men there was an abiding joy, and the sorrow is profoundly exaggerated by the man who looks upon them from outside. 

As grief hovers over them, as anxiety, harassments, troubles, worries, and woes rain upon them from all directions, naturally they are judged’ by men to be sorrowful. But that does not follow. 

They are not worried, harassed or distressed by these things, however much they may attend to them, and may do whatever may be necessary for the sake of the world. Underneath it all there is the heart of peace. Therefore you always find them saying: “My peace remaineth.”

204. The disciple feels the sorrow of the world. That he cannot escape; it will throw a shadow over him – an unavoidable shadow. The whole of the world’s sorrow has to find its echo in him. He feels sorrow, and continues to feel pity for the ignorant and the suffering, for their rebellion and revolt. 

At the stage we are considering there is danger for him – that he may cease to feel for others; then just in proportion as he ceases to feel he loses his utility. The Great Ones feel helpless pity for those under the sway of karma; pity because of Their own inability to help them, for there are places where They cannot help, where men must go through their experiences by themselves. 

Despite the knowledge that it should be so, and despite Their absolute contentment with the Law, They are standing aside and watching it work; still there is this pain and sympathy – pity, which has in it a certain element of sorrow.

205. That will always remain as something of a shadow. In losing the power to sympathize a man would lose the power to help. Just as his life flows into the ignorant he feels the pleasure and pain of the ignorant, and he lightens their trouble by feeling it himself.

206. With all this pressing upon him it is ever necessary that the disciple should be reminded that the Self is bliss. He must keep the heart of joy, must deliberately cultivate in himself the spirit of contentment and happiness. One way to do this is to practise meditation upon the divine bliss – deep, intense bliss, not equalled by anything belonging to this earth, because it is the very essence and nature of the Self. 

A man can develop that aspect only by the deliberate cultivation of joy and contentment, and by looking at the world and recognizing that evil is avidya, unwisdom. In the midst of sorrows he is to be happy; he must teach himself that pain is in the vehicle while the life is ever joy.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 177 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మార్కండేయ మహర్షి - 3 🌻*

20. అనేక పాపాలు చేస్తూ తిర్యగ్జీవనులలో, పశుపక్ష్యాదులలో పుడుతూ నరకాలలో వేగుటు ఏమీ తెలియకుండా పరిభ్రమించే జీవులు ఇప్పుడున్న మానవులు. ఈ తిరిగే సంసారచక్రంలో వీళ్ళుచేసే పాపపుణ్యాలు, వీళ్ళు చనిపోయినపుడు నీడలాగా ఆ జీవులను అనుసరించి దుఃఖాలను ఇచ్చేటటువంటి మరొకజన్మను ఇస్తూ ఉంటాయి. ధన సంపాదనచేస్తూ సుఖంతప్ప మరొక కార్యక్రమం ఏమీలేనటువంటివాళ్ళున్నారే, వాళ్ళునస్తికుల అనబడతారు. వాళ్ళకు ఈ లోకమే సుఖప్రదంగా కనపడుతుంది. మరికొందరున్నారు, 

21. ఇందులో కాస్త ఉత్తములు వాళ్ళు. వాళ్ళు ఉపవాసములుచేసి, తీర్థములు సేవించి వేదాధ్యయనము చేసేవాళ్ళు. దేహాన్ని కృశింపచేసుకుంటూ ఎవో వ్రతములు చేసుకోవటం అనే లక్షణం కొందరిలో ఉంటుంది. ఆ లక్షణాలతో సద్గృహస్థులై ధర్మాన్ని ఆచరిస్తూ సుపుత్రులను పొందుతారు. వాళ్ళకేమో ఇహసుఖము ఉంటుంది, ఆముష్మిక సుఖమూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ కూడా సుఖపడతారు. అయితే వారిలో ధనమోహం ఉండదు. సుఖంగా ఉంటూనే, ధనానికి కట్టుపడరు. అజ్ఞానంలో ఉండరు. వాళ్ళు ఇక్కడ సమృద్ధిని పొందుతారు.తరువాత స్వర్గాన్ని చూస్తారు. 

22. నాస్తికుడు ఇక్కడమాత్రమే సుఖాన్ని అనుభవించి నరకానికే వెళతాడు, పుణ్యంచేయకపోవటంచేత.
ధనాన్ని స్వార్థంకోసం మూటకట్టుకోవటమేతప్ప దానిని సద్వినియోగం చెయాలేనివాళ్ళు ఇక్కడే సుఖం ఉందని అనుకుంటారు. ధనాదుల్ని పొందికూడా ధర్మమార్గంలో ఉండటంచేత ఇహమూ, పరమూ రెండూ పొందుతారు ఉత్తములు. అది రెండోతరగతి. 

23. మరొక తరగతి, నాస్తికులే! వాళ్ళళ్ళో సత్యంలేదు. ఆచారంలేదు. భక్తిలేదు. ఇదికాక ఏది చేయకూడదో అదే చేస్తారు. వాళ్ళు పాపం చేస్తుంటారు. మూర్ఖత్వంతో తమకు ధనం మాత్రం ఉంటే చాలు అనే భావంతో బ్రతుకుతారు. ఆ పాపం తమ కోసమే నిత్యమూ చేస్తుంటారు. పాపం చేయటానికే తమ ధనాన్ని వాడుకుంటారు. అటువంటి వాల్లు ఇక్కడకూడా నరకమే అనుభవిస్తారు, చనిపోయిన తరువాత ఎలాగూ నరకమే పొందుతారు. ఐహికమూ, ఆముష్మికము రెండూ వీరికి లేవు.

24. ఆ విధంగా మనుష్యులను మూడుతరగతులుగా విభజించారు. ఇక్కడ సుఖం ఉండి, పరసుఖం లేనివాడు. ఇక్కడా, అక్కడా కూడా సుఖం కలిగినవాడు, ఇక్కడా అక్కదా ఖూడా సుఖంపొందలేనివాడు. ఐహికంలోనూ, ఆముష్మికం లోనూ ఇలా ఉన్నారు మనుష్యులు. వాళ్ళ కర్మ ఇలా ఉంది.

25. తరువాత ధర్మరాజు, “బ్రాహ్మణులయొక్క సదాచారసంపత్తివల్ల వాళ్ళకు వచ్చే తేజస్సు, శక్తుల వంటివాటి స్వరూపమేదో” చెప్పమన్నాడు. “బ్రాహ్మణుడికి అసాధ్యం అనేది ఎమీలేదు. వేద వేదాంగములు చదివి ధర్మ మార్గంలో జీవిస్తూ విరాగులైనటువంటి బ్రాహ్మణులు తపస్సుచేస్తే, అన్నిటికీ వాళ్ళు సమర్థులే అవుతారు. తపస్సు, శమదమాది షట్సంపతులన్నీ కలిగిన బ్రాహ్మణుడికి అసాధ్యమేదీ లేదు” అని మార్కండేయుడు ధర్మరాజుకు ధర్మబోధ చేశాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 241 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 90. The first witnessing is that of 'I am', the primary prerequisite for all further witnessing, but to whom is the first witnessing of 'I am' occurring? 🌻*

The first thing that you came to know was that 'you are' or 'I am'. It is the first thing that you are a witness to, the primary and mandatory prerequisite for all further witnessing to occur. 

Once this 'I am' takes hold of you it grows to gigantic proportions, this expansion is so enormous that you lose awareness of the 'I am' itself in the process and go about your various activities.

 It is the 'I am' that is witnessing the world, but who is witnessing the 'I am'? That's the question to which you have to find an answer and that is what all the 'Sadhana' (practice) is for.
 🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 116 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 21 🌻*

*🌻. సర్వశూన్య స్థితి యందు ఎరుక 🌻*

485. సంస్కారములు పూర్తిగా నాశనము కాగానే ఇంతవరకు సంస్కారములలో చిక్కువడిన పూర్ణచైతన్యమునకు పూర్తి విమోచనము ప్రాప్తించి, పరిశుద్ధమైన మహాచైతన్యముగా రూపాంతరమందినది.

486. మహాచైతన్యము మిథ్యాహం యొక్క చైతన్యమును గాదు, దివ్యాహం (నేను భగవంతుడను) యొక్క చైతన్యమును గాదు. ఇచ్చట చైతన్యమే ఉన్నది.(బాహ్యమునకు మాత్రము) భగవంతుడు లేడు. 

అనగా సర్వకాల సర్వావస్థల యందు, సర్వత్రా శాశ్వతుడై యున్న భగవంతుడు, ఇచ్చట లేకపోవుట ఎట్లు సంభవించును? భగవంతుడు ఎన్నడు ఉండకపోవుట సంభవించదు. కాని--

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 80 / Sri Vishnu Sahasra Namavali - 80 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*పూర్వాషాడ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*

*🍀 80. అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః|| 🍀*

 🍀 747) అమానీ - 
నిగర్వి, నిరహంకారుడు.

🍀 748) మానద: - 
భక్తులకు గౌరవము ఇచ్చువాడు.

🍀 749) మాన్య: - 
పూజింపదగిన వాడైన భగవానుడు.

🍀 750) లోకస్వామీ - 
పదునాలుగు భువనములకు ప్రభువు.

🍀 751) త్రిలోకథృక్ - 
ముల్లోకములకు ఆధారమైన భగవానుడు.

🍀 752) సుమేధా: - 
చక్కని ప్రజ్ఞ గలవాడు.

🍀 753) మేధజ: - 
యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.

🍀 754) ధన్య: - 
కృతార్థుడైనట్టివాడు.

🍀 755) సత్యమేధ: - 
సత్య జ్ఞానము కలవాడు.

🍀 756) ధరాధర: - 
భూమిని ధరించి యున్నవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 80 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Poorvashada 4TH Padam*

*🌻 amānī mānadō mānyō lōkasvāmī trilōkadhṛt |*
*sumedhā medhajō dhanyaḥ satyamedhā dharādharaḥ || 80 || 🌻*