🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మార్కండేయ మహర్షి - 3 🌻
20. అనేక పాపాలు చేస్తూ తిర్యగ్జీవనులలో, పశుపక్ష్యాదులలో పుడుతూ నరకాలలో వేగుటు ఏమీ తెలియకుండా పరిభ్రమించే జీవులు ఇప్పుడున్న మానవులు. ఈ తిరిగే సంసారచక్రంలో వీళ్ళుచేసే పాపపుణ్యాలు, వీళ్ళు చనిపోయినపుడు నీడలాగా ఆ జీవులను అనుసరించి దుఃఖాలను ఇచ్చేటటువంటి మరొకజన్మను ఇస్తూ ఉంటాయి. ధన సంపాదనచేస్తూ సుఖంతప్ప మరొక కార్యక్రమం ఏమీలేనటువంటివాళ్ళున్నారే, వాళ్ళునస్తికుల అనబడతారు. వాళ్ళకు ఈ లోకమే సుఖప్రదంగా కనపడుతుంది. మరికొందరున్నారు,
21. ఇందులో కాస్త ఉత్తములు వాళ్ళు. వాళ్ళు ఉపవాసములుచేసి, తీర్థములు సేవించి వేదాధ్యయనము చేసేవాళ్ళు. దేహాన్ని కృశింపచేసుకుంటూ ఎవో వ్రతములు చేసుకోవటం అనే లక్షణం కొందరిలో ఉంటుంది. ఆ లక్షణాలతో సద్గృహస్థులై ధర్మాన్ని ఆచరిస్తూ సుపుత్రులను పొందుతారు. వాళ్ళకేమో ఇహసుఖము ఉంటుంది, ఆముష్మిక సుఖమూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ కూడా సుఖపడతారు. అయితే వారిలో ధనమోహం ఉండదు. సుఖంగా ఉంటూనే, ధనానికి కట్టుపడరు. అజ్ఞానంలో ఉండరు. వాళ్ళు ఇక్కడ సమృద్ధిని పొందుతారు.తరువాత స్వర్గాన్ని చూస్తారు.
22. నాస్తికుడు ఇక్కడమాత్రమే సుఖాన్ని అనుభవించి నరకానికే వెళతాడు, పుణ్యంచేయకపోవటంచేత.
ధనాన్ని స్వార్థంకోసం మూటకట్టుకోవటమేతప్ప దానిని సద్వినియోగం చెయాలేనివాళ్ళు ఇక్కడే సుఖం ఉందని అనుకుంటారు. ధనాదుల్ని పొందికూడా ధర్మమార్గంలో ఉండటంచేత ఇహమూ, పరమూ రెండూ పొందుతారు ఉత్తములు. అది రెండోతరగతి.
23. మరొక తరగతి, నాస్తికులే! వాళ్ళళ్ళో సత్యంలేదు. ఆచారంలేదు. భక్తిలేదు. ఇదికాక ఏది చేయకూడదో అదే చేస్తారు. వాళ్ళు పాపం చేస్తుంటారు. మూర్ఖత్వంతో తమకు ధనం మాత్రం ఉంటే చాలు అనే భావంతో బ్రతుకుతారు. ఆ పాపం తమ కోసమే నిత్యమూ చేస్తుంటారు. పాపం చేయటానికే తమ ధనాన్ని వాడుకుంటారు. అటువంటి వాల్లు ఇక్కడకూడా నరకమే అనుభవిస్తారు, చనిపోయిన తరువాత ఎలాగూ నరకమే పొందుతారు. ఐహికమూ, ఆముష్మికము రెండూ వీరికి లేవు.
24. ఆ విధంగా మనుష్యులను మూడుతరగతులుగా విభజించారు. ఇక్కడ సుఖం ఉండి, పరసుఖం లేనివాడు. ఇక్కడా, అక్కడా కూడా సుఖం కలిగినవాడు, ఇక్కడా అక్కదా ఖూడా సుఖంపొందలేనివాడు. ఐహికంలోనూ, ఆముష్మికం లోనూ ఇలా ఉన్నారు మనుష్యులు. వాళ్ళ కర్మ ఇలా ఉంది.
25. తరువాత ధర్మరాజు, “బ్రాహ్మణులయొక్క సదాచారసంపత్తివల్ల వాళ్ళకు వచ్చే తేజస్సు, శక్తుల వంటివాటి స్వరూపమేదో” చెప్పమన్నాడు. “బ్రాహ్మణుడికి అసాధ్యం అనేది ఎమీలేదు. వేద వేదాంగములు చదివి ధర్మ మార్గంలో జీవిస్తూ విరాగులైనటువంటి బ్రాహ్మణులు తపస్సుచేస్తే, అన్నిటికీ వాళ్ళు సమర్థులే అవుతారు. తపస్సు, శమదమాది షట్సంపతులన్నీ కలిగిన బ్రాహ్మణుడికి అసాధ్యమేదీ లేదు” అని మార్కండేయుడు ధర్మరాజుకు ధర్మబోధ చేశాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
06 Dec 2020
No comments:
Post a Comment