కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 123
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 123 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 53 🌻
ఇది సాక్షాత్తు యమధర్మరాజు చేత ఉపదేశింప బడినటువంటిది. వైదికమైనటువంటిది. సనాతనమైనటువంటిది. గురుశిష్య సంవాదరూపమైనటువంటిది. యోగ్యులైన, అధికారులైనటువంటి వారికి, శిష్యులకి తెలియజేసినట్లైతే, వాళ్ళు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి అనువైనటువంటిది.
చెప్పినటువంటి వారు కూడా, ఆత్మనిష్ఠులై, బ్రహ్మనిష్ఠులై, బ్రహ్మలోకమున పూజించబడేటటుంవంటి, ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి వ్యాఖ్యానము. ఈ కఠోపనిషత్తు అంతర్గతమైనటువంటిదని, నచికేతోపాఖ్యానము అనే పేరున కూడా పిలుస్తారు.
ఎవరీ శ్రేష్ఠము, రహస్యమునైన నాచికేతోపాఖ్యానమును శుచియై, బ్రహ్మజ్ఞానుల సభయందు గాని, శ్రాద్ధకాలమందుగాని, వినిపించుట అనంత ఫలకారి అగును.
ఇది ఫలశృతి అన్నమాట. రహస్యమైనటువంటిది, శ్రేష్ఠమైనటువంటిది, అధికారులకు మాత్రమే సాధ్యమైనటువంటిది, సరియైనటువంటి సద్గురువు కృప చేత మాత్రమే సాధింపగలినటువంటిది అయినటువంటి ఈ ఆత్మోపదేశము, ఈ నాచికేతోపాఖ్యానము అనేటటువంటి దాని ద్వారా అందివ్వబడుతున్నటువంటిది.
ఇది సర్వకాల సర్వావస్థలలోను కూడా మానవులు ఆశ్రయించ దగినటువంటిది. బ్రహ్మజ్ఞానులు ఉన్నటువంటి సభలో ఈ కఠోపనిషత్తు తప్పక ఆశ్రయించ వలసినటువంటి ఉపనిషత్తు. అందువలననే, చాలా సాంప్రదాయములలో గురుపూర్ణిమ కాలములలో, ఈ కఠోపనిషత్తుని చదువుతారు.
ఇది చాలా విశేషఫలవంతమైనటువంటిది కాబట్టి, ఆత్మోపదేశమునకు అర్హమైన కాలము శ్రాద్ధకాలము. శ్రద్ధతో నిర్వహించబడి, జీవుని యొక్క జనన మరణ చక్రమంతా బోధించబడేటటువంటి, శ్రాద్ధకాలమందు కూడా ఈ ఆత్మోపదేశమునకు అర్హమైనటువంటి, నాచికేతోపాఖ్యానమును మానవులు తప్పక అధ్యయనం చేయాలి. అలా చేసినట్లయితే, అనంతమైనటువంటి ఫలం లభిస్తుంది. .- విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
06 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment