శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 395 / Sri Lalitha Chaitanya Vijnanam - 395

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 395 / Sri Lalitha Chaitanya Vijnanam - 395🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀

🌻 395. 'ప్రసిద్ధా'🌻

'నేను' అని తెలియబడునది శ్రీదేవి. మనకు మన మున్నామని తెలియజేయునది శ్రీమాత. నిద్రలో మన మున్నప్పుడు వున్నామను జ్ఞప్తి యుండదు. ఉండుట యుండును గాని ఎరుక వుండదు. మన యందలి ఎరుకగ వుండి నిద్ర నుండి లేపినపుడు ప్రతి ఒక్కరును “నేను వున్నాను” అనుకొందురు. ఈ నేనుగ నున్నది శ్రీదేవియే. మన మున్నట్లు మనకు తెలియ చేయునది శ్రీదేవి. మన అందరి యందును 'నేను'గ మేల్కాంచునది.

ప్రతి ఒక్కరునూ నేను, నేను అందురు. ఎవరా నేను? ఈ నేను మన నామము కాదు. మన రూపము కాదు. కులము, మతము, జాతీయత, లింగ భేదములతో సంబంధము లేక అందరునూ నేను అందురు. పసివారి నుండి వృద్ధుల వరకు తమను గూర్చి సంబోధించినపుడు నేను అందురు. ఈ నేను అనునది మన యందలి చైతన్యమే. ఇట్లందరి యందు ప్రసిద్ధి గాంచినది శ్రీమాత. ఇంత ప్రసిద్ధిగ శ్రీమాతయే అందరియందు నేనుగ ఉన్ననూ, దానిని గమనింప లేకపోవుట ఆశ్చర్యమే. శ్రీమాత సుప్రసిద్ధ. మన యందలి నేను అను ఎఱుకకు ఆమె మూలము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 395 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari
Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻

🌻 395. Prasiddhā प्रसिद्धा 🌻

She is well known to everybody as She is highly celebrated. She is in the form of inner Self of all living beings. When someone says ‘I’, it actually means Her, as She is the Self.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

09 Aug 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 226. ధ్యానము ఒక దివ్య ఔషధం / Osho Daily Meditations - 226. MEDICINAL USE OF MEDITATION

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 226 / Osho Daily Meditations - 226 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 226. ధ్యానము ఒక దివ్య ఔషధం 🍀

🕉. బయటి నుండి ఒత్తిడి వచ్చినప్పుడల్లా, ధ్యానంలోకి నేరుగా ప్రవేశించడం కష్టం అవుతుంది. కాబట్టి ధ్యానానికి ముందు, పదిహేను నిమిషాలు, ఒత్తిడిని రద్దు చేయడానికి ఏదైనా చేయండి. 🕉

పదిహేను నిమిషాల పాటు, నిశ్శబ్దంగా కూర్చుని, ప్రపంచం మొత్తాన్ని ఒక కలగా భావించండి - దానిలో ఎటువంటి ప్రాముఖ్యత లేదు. రెండవది, ముందుగానే లేదా తరువాత మీరు, మరియు ప్రతిదీ కూడా అదృశ్యం అవుతుందని గుర్తుంచుకోండి. మీరు ఎల్లప్పుడూ ఇక్కడ ఉండరు, కాబట్టి ఏదీ శాశ్వతం కాదు. మూడవది: మీరు కేవలం సాక్షి మాత్రమే. ఇది గడిచి పోతున్న కల, సినిమా. ఈ మూడు విషయాలను గుర్తుంచుకోండి - ఈ ప్రపంచం మొత్తం ఒక కల అని మరియు ప్రతిదీ గడిచిపోతుంది, మీరు కూడా అని. మృత్యువు సమీపిస్తోంది. కానీ అది సాక్షాత్తు సాక్షి మాత్రమే. కాబట్టి మీరు కూడా కేవలం సాక్షి మాత్రమే.

శరీరాన్ని రిలాక్స్ చేయండి, పదిహేను నిమిషాలు సాక్ష్యంగా మారండి. ఆపై ధ్యానం చేయండి. మీరు దానిలోకి ప్రవేశించ గలుగుతారు, ఆపై ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ధ్యానం సరళంగా మారిందని మీకు అనిపించినప్పుడల్లా, దానిని ఆపండి; లేకుంటే అది అలవాటు అవుతుంది. ధ్యానంలోకి ప్రవేశించడం కష్టంగా ఉన్నప్పటి నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే దీనిని ఉపయోగించాలి. మీరు ప్రతిరోజూ చేస్తే, అది ప్రభావం కోల్పోతుంది, ఆపై అది పనిచేయదు. కాబట్టి దీన్ని ఔషధంగా వాడండి. విషయాలు తప్పుగా జరుగుతున్నప్పుడు, దీన్ని చేయండి, తద్వారా మార్గం క్లియర్ అవుతుంది మరియు మీరు విశ్రాంతి తీసుకోగలరు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 226 🌹

📚. Prasad Bharadwaj

🍀 226. MEDICINAL USE OF MEDITATION 🍀

🕉. Whenever there is pressure from the outside, direct entry into meditation becomes difficult. So before meditation, for fifteen minutes, do something to cancel the pressure. 🕉

For fifteen minutes, simply sit silently and think of the whole world as a dream-and it is! Think of the whole world as a dream and that there is nothing of any significance in it. Second, remember that sooner or later everything will disappear you also. You were not always here, you will not always be here. So nothing is permanent. And third: You are just a witness. This is a passing dream, a film. Remember these three things-that this whole world is a dream and everything is going to pass, even you.

Death is approaching and the only reality is the witness, so you are just a witness. Relax the body, witness for fifteen minutes, and then meditate. You will be able to get into it, and then there will be no trouble. But whenever you feel that this meditation has become simple, stop it; otherwise it will become habitual. It has to be used only in specific conditions when it is difficult to enter meditation. If you do it every day, it will lose the effect, and then it will not work. So use it medicinally. When things are going wrong, do it so it will clear the way and you will be able to relax.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

09 Aug 2022

శ్రీ శివ మహా పురాణము - 607 / Sri Siva Maha Purana - 607

🌹 . శ్రీ శివ మహా పురాణము - 607 / Sri Siva Maha Purana - 607 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 06 🌴

🌻. కుమారుని లీల - 2 🌻

భక్తుల ప్రాణప్రియులైన వాడా! సద్గుణ నిలయుడవగు నీవు త్రిగుణాతీతుడవు. శంభునకు ప్రియచసుతుడవగు నీవు శంభు స్వరూపడవు. సచ్చిదానందరూపుడవగు నీవు ప్రసన్నుడవై సుఖములనిచ్చెదవు. త్రిపురారి యగు శంకరుని కుమారుడవగు నీవు సర్వము తెలిసిన వాడవు. పవిత్ర ప్రేమకు నీవు సర్వదా వశుడవై యుందువు. ఆరు మోయులు గల నీకు సాధువులు, భక్తులు ప్రీతి పాత్రులు.

సర్వేశ్వరుడవగు నీవు సుఖముల నిచ్చెదవు. సాధవులకు ద్రోహము చేయువారిని నీవు సంహరించెదవు. శంకరుడు నీ తండ్రి. నీవు బ్రహ్మాండములను పాలించు ప్రభుడవు. దేవతలు మొదలగు వారందరు నీ పాదములను సేవించెదరు. నీకు సేవ ప్రియమైనది. నన్ను రక్షించుము (12). శత్రువులకు భయమును కలిగించువాడా! శంకర స్వరూపా! జనులకు శరణునొసగి సుఖములనిచ్చే నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను. ఓ స్కందా! నా విన్నపమును నీ చెవిలో వేసుకొనుము. జనుల మనస్సులో నీ భక్తి సర్వదా ఉండునట్లు చేయుము (13).

సర్వసమర్ధుడవగు నీవు ఎవనికి రక్షకుడవో, వానిని బలవంతుడు, సమర్ధుడు, రెండు పార్శ్యములయందు దృఢమగు రక్షణ నేర్పరుచుకున్నవాడు అగు శత్రువైననూ, తక్షకుడే అయిననూ, రాక్షసుడైననూ ఏమి చేయగలడు? (14) అనేక గురువులను శుశ్రూష చేసినవాడైననూ నిన్ను స్తుతింప సమర్ధుడు గాడు. మంద బుద్ది అగు నేను ఎట్లు స్తుతించగలను? గొప్ప వారిచే పూజింపబడే ఓ స్కందా! నేను శుచియైననూ, కాక పోయిననూ, ఎట్లున్ననూ, నీ పాదపద్మముల పరాగమును ప్రార్థించుచున్నాను (15).

ఓ సర్వేశ్వరా! భక్తవత్సలా! కరుణా సముద్రా! నేను నీ వాడను. సేవకుడను. ఓ మహాప్రభూ! నీ సేవకుని వంద తప్పులనైననూ నీవు లెక్కించవు. ఓ విభూ! భక్తుని అల్పమగు భక్తిని కూడా నీవు గుర్తించెదవు. నీవు భృత్యుల దుఃఖములను పోగొట్టెదవు. ఓ భగవాన్‌! నీ కంటె వేరుగా రక్షకుడు లేడు. నా కంటె ఎక్కువ మూర్ఖుడగు మానవుడు లేడు (16) .

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 607🌹

✍️ J.L. SHASTRI

📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 06 🌴

🌻 The miraculous feat of Kārttikeya - 2 🌻

12. You love devotees as your own vital air. You are the receptacle of all attributes. You are beyond three attributes. You are the beloved of Śiva. You are Śiva Himself. You confer welfare. You are the bestower of happiness with delight. You are the great Existent and cosmic consciousness. You are the son of Śiva, the omniscient who ḍestroyed the three cities of Asuras. You are always subservient to great and pious love. You have six faces. You love the saintly persons who kneel to you. You are the lord of all people and their benefactor. You destroy those, who harass the good. You are the preceptor of even Śiva. You are the lord of the entire universe. Your feet are served by all the gods. O lover of service, save me.

13. O Skanda, terrible to the enemies, the benefactor of the devotees, I bow to your lotus-like feet. You are the refuge of people and source of their happiness. Please hear my submission through your ears. Please instil into the heart of everyone the feelings of devotion to you.

14. If you are the protector with efficient honour what harm can an opponent do even if he be strong and efficient and protected on either side? What harm can even Takṣaka[1] or even a carnivorous animal do unto him.

15. Even the preceptor of the gods cannot eulogise you adequately. Then tell me, how can I a foolish and wretched creature? O Skanda, pure or impure, noble or ignoble, of whatever nature I be, I pray unto the dust of your lotus-like feet.

16. O lord of all, ocean of mercy, favourably disposed to devotees, I am your own servant. May even a hundred sins of your own servant or a leader of the Gaṇas be forgiven. O lord, you know even the slightest act of devotion done anywhere. You are the destroyer of the distress of your servants. O lord, there is no other protector save you and no other wretched vulgar person than I.

Continues....

🌹🌹🌹🌹🌹

09 Aug 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 91 / Agni Maha Purana - 91

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 91 / Agni Maha Purana - 91 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 30

🌻. కమలములలోని దేవతల మండల విధి -2 🌻

పిమ్మట వెలుపలి ఆవరణమునందు పాయు-ఉపస్థల పూజ చేసి, పండ్రెండు మాసాల అధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువది యారు తత్త్వములను పూజించవలెను. మాసాధిపతుల పూజ చక్రాబ్జముపై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను అచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులు గల చూర్ణములు చల్లవలెను.

ఎచట ఏ రంగుగల చూర్ఱము చల్లవలెనో చెప్పదను; వినుము కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలెను. సమస్తరేఖులును సమప్రమాణము గలవై తెల్ల రంగలో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటనవ్రేలంత లావుగా ఉండవలెను.

ఒక హస్తము మండలమునందలి రేఖలు బొటనవ్రేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు వేయవలెను. కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములం దున్న కోష్ఠములను ఎఱ్ఱని రంగు గల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగా యోగపీఠమును యథేష్టముగ అన్ని రంగులతోను అలంకరింపవలెను. వీథిని లతలతోడను, పత్రాదులతోడను అలంకరింపవలెను. పీఠద్వారమును తెల్లని రంగు గల చూర్ణముతోను, శోభాస్థానములను ఎఱ్ఱని చూర్ణములతోడను నింపవలెను.

ఉపశోభలపై నీలి రంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా చిత్రింపవలెను. ఇది భద్రమండలముపై రంగు లుంచు విధానము. ఇతరమండలముపై గూడ ఈ విధముగనే అనేకవిధము లగు వర్ణములు గల చూర్ణములు చల్లవలెను. త్రికోణమండలము తెలుపు - ఎరుపు - నలుపురంగులతో అలంకరింపవలెను. ద్వికోణమును ఎరుపు-పసుపురంగులతో అలంకరింపవలెను. చక్రకమలమునందలి నాభిస్థానమును నలుపురంగు చూర్ఱముతో అలంకరిపవలెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 91 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 30

🌻 Mode of worship of different gods in specially drawn lotus figures - 1 🌻

10. Having worshipped the anus and penis one has to worship the lords of the twelve months as well as the twenty-six forms commencing with Puruṣottama in the external enclosure.

11. Among these the Lords of the months are to be worshipped in the lotus of the disc. Then the eight, six, five or four (total twenty-three) principles of the primordial matter (are to be worshipped) in another (lotus).

12-13. Then one has to dust in a drawn circular altar. (You) hear. The pericarp should be of yellow colour, and all the lines equal and white. (They) should be two cubits long and one thumb in breadth. Half the length are white. The joints (should be coloured) white, black or dark-blue.

14. The filaments should be red and yellow-coloured. The corners should be filled with red. The yogic seat should be bedecked with any of the colours according to one’s own desire.

15. The pathway is decorated with canopy of creepers and leaves. The entrance to the altar (should be painted) white, bright-red and yellow.

16. Ornamentation of all the white corners (is done) with blue (colour). It has been said that the altar bhadraka should be filled (with the colours) and in this way the other (altars) are filled.

17. The three corners should be decorated with pale, red and black, the two corners with red and yellow (and) the centre of the circle by black.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

09 Aug 2022

కపిల గీత - 52 / Kapila Gita - 52

🌹. కపిల గీత - 52 / Kapila Gita - 52🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు,
📚. ప్రసాద్‌ భరధ్వాజ

2వ అధ్యాయము

🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 8 🌴

08. కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః
భోక్తృత్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతేః పరమ్

కార్య-కారణ సంబంధానికి, కర్తృత్వభావానికి ప్రకృతే కారణమని మహర్షులు ఎరుగుదురు. ప్రకృతికతీతుడైన పురుషుడు సుఖదుఃఖాది అనుభవములకు కారణము.

శరీరాన్ని కార్యం అంటారు. ఇంద్రియములు కారణము. శరీర ఇంద్రియాలకు కర్తృత్వాన్ని ఆపాదిస్తున్నాము. జీవుడు ఉన్న శరీరమునకు, ఇంద్రియమునకు పని చెప్పడములో, చేస్తున్నదీ, అనుభవిస్తున్నదీ శరీరము మాత్రమే. కానీ చేస్తున్నది శరీరమైతే, భోక్తృత్వమును తనకు ఆపాదించు కుంటున్నాడు. "ఇవనీ నేనే చేస్తున్నా" అని ఆపాదించు కున్నందుకే మరలా మరలా శరీరములో బంధించబడి అనేక జన్మలు ఎత్తుతాడు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 52 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 8 🌴

08. kārya-kāraṇa-kartṛtve kāraṇaṁ prakṛtiṁ viduḥ
bhoktṛtve sukha-duḥkhānāṁ puruṣaṁ prakṛteḥ param

The cause of the conditioned soul's material body and senses, and the senses' presiding deities, the demigods, is the material nature. This is understood by learned men. The feelings of happiness and distress of the soul, who is transcendental by nature, are caused by the spirit soul himself.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

09 Aug 2022

09 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹09, AUGUST 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మంగళ గౌరి వ్రతం, Mangala Gauri Vrat 🌻

🍀. శ్రీ ఆంజనేయ మంగళాష్టకం - 4 🍀

6. కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |
మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళమ్

7. భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |
సృష్టికారణ భూతాయ ఆంజనేయాయ మంగళమ్

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : బాధానుభవ ప్రయోజనం - ఎవరికీ బాధ అంటే గిట్టదు. బాధను తప్పించుకోవడానికే ప్రయత్నిస్తారు. నిరసన ప్రకటిస్తారు. కాని, ఆ బాధలే అనుభవించక పోతే, మనస్సులో, హృదయంలో, శరీరంలో అపార బహుళ ఆనందానుభవ శక్తి సంపద లభ్యపడదు. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: శుక్ల ద్వాదశి 17:47:47 వరకు

తదుపరి శుక్ల త్రయోదశి

నక్షత్రం: మూల 12:18:38 వరకు

తదుపరి పూర్వాషాఢ

యోగం: వషకుంభ 23:36:31 వరకు

తదుపరి ప్రీతి

కరణం: బవ 07:25:36 వరకు

వర్జ్యం: 20:50:48 - 22:16:16

దుర్ముహూర్తం: 08:31:07 - 09:22:19

రాహు కాలం: 15:33:31 - 17:09:31

గుళిక కాలం: 12:21:31 - 13:57:30

యమ గండం: 09:09:30 - 10:45:30

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46

అమృత కాలం: 06:31:20 - 07:58:00

మరియు 29:23:36 - 30:49:04

సూర్యోదయం: 05:57:30

సూర్యాస్తమయం: 18:45:31

చంద్రోదయం: 16:27:02

చంద్రాస్తమయం: 02:36:09

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: ధనుస్సు

ఛత్ర యోగం - స్త్రీ లాభం 12:18:38

వరకు తదుపరి మిత్ర యోగం -

మిత్ర లాభం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 09 - AUGUST - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

 1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 09, మంగళవారం, ఆగస్టు 2022 భౌమ వాసరే  Tuesday 🌹
2) 🌹 కపిల గీత - 52 / Kapila Gita - 52 🌹 సృష్టి తత్వము - 8
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 91 / Agni Maha Purana - 91 🌹
4) 🌹. శివ మహా పురాణము - 607 / Siva Maha Purana -607 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 226 / Osho Daily Meditations - 226 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 395 / Sri Lalitha Chaitanya Vijnanam - 395 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹09, AUGUST 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ మంగళవారం, Tuesday,  భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు  : మంగళ గౌరి వ్రతం, Mangala Gauri Vrat 🌻*

*🍀. శ్రీ ఆంజనేయ మంగళాష్టకం - 4 🍀*

*6. కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |*
*మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళమ్*
*7. భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |*
*సృష్టికారణ భూతాయ ఆంజనేయాయ మంగళమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : బాధానుభవ ప్రయోజనం - ఎవరికీ బాధ అంటే గిట్టదు. బాధను తప్పించుకోవడానికే  ప్రయత్నిస్తారు. నిరసన ప్రకటిస్తారు. కాని, ఆ బాధలే  అనుభవించక పోతే, మనస్సులో, హృదయంలో, శరీరంలో  అపార బహుళ ఆనందానుభవ శక్తి సంపద లభ్యపడదు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: శుక్ల ద్వాదశి 17:47:47 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: మూల 12:18:38 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: వషకుంభ 23:36:31 వరకు
తదుపరి ప్రీతి
కరణం: బవ 07:25:36 వరకు
వర్జ్యం: 20:50:48 - 22:16:16
దుర్ముహూర్తం: 08:31:07 - 09:22:19
రాహు కాలం: 15:33:31 - 17:09:31
గుళిక కాలం: 12:21:31 - 13:57:30
యమ గండం: 09:09:30 - 10:45:30
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: 06:31:20 - 07:58:00
మరియు 29:23:36 - 30:49:04
సూర్యోదయం: 05:57:30
సూర్యాస్తమయం: 18:45:31
చంద్రోదయం: 16:27:02
చంద్రాస్తమయం: 02:36:09
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
ఛత్ర యోగం - స్త్రీ లాభం 12:18:38
వరకు తదుపరి మిత్ర యోగం -
మిత్ర లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 52 / Kapila Gita - 52🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు,
📚. ప్రసాద్‌ భరధ్వాజ*
2వ అధ్యాయము

*🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం  - 8 🌴*

*08. కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః*
*భోక్తృత్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతేః పరమ్*

*కార్య-కారణ సంబంధానికి, కర్తృత్వభావానికి ప్రకృతే కారణమని మహర్షులు ఎరుగుదురు. ప్రకృతికతీతుడైన పురుషుడు సుఖదుఃఖాది అనుభవములకు కారణము.*

*శరీరాన్ని కార్యం అంటారు. ఇంద్రియములు కారణము. శరీర ఇంద్రియాలకు కర్తృత్వాన్ని ఆపాదిస్తున్నాము. జీవుడు ఉన్న శరీరమునకు, ఇంద్రియమునకు పని చెప్పడములో, చేస్తున్నదీ, అనుభవిస్తున్నదీ శరీరము మాత్రమే. కానీ చేస్తున్నది శరీరమైతే, భోక్తృత్వమును తనకు ఆపాదించు కుంటున్నాడు.  "ఇవనీ నేనే చేస్తున్నా" అని ఆపాదించు కున్నందుకే మరలా మరలా శరీరములో బంధించబడి అనేక జన్మలు ఎత్తుతాడు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 52 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️  Swami Prabhupada.   📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 8 🌴*

*08. kārya-kāraṇa-kartṛtve kāraṇaṁ prakṛtiṁ viduḥ*
*bhoktṛtve sukha-duḥkhānāṁ puruṣaṁ prakṛteḥ param*

*The cause of the conditioned soul's material body and senses, and the senses' presiding deities, the demigods, is the material nature. This is understood by learned men. The feelings of happiness and distress of the soul, who is transcendental by nature, are caused by the spirit soul himself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 91 / Agni Maha Purana - 91 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 30*

*🌻. కమలములలోని దేవతల మండల విధి -2 🌻*

పిమ్మట వెలుపలి ఆవరణమునందు పాయు-ఉపస్థల పూజ చేసి, పండ్రెండు మాసాల అధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువది యారు తత్త్వములను పూజించవలెను. మాసాధిపతుల పూజ చక్రాబ్జముపై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను అచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులు గల చూర్ణములు చల్లవలెను.

ఎచట ఏ రంగుగల చూర్ఱము చల్లవలెనో చెప్పదను; వినుము కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలెను. సమస్తరేఖులును సమప్రమాణము గలవై తెల్ల రంగలో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటనవ్రేలంత లావుగా ఉండవలెను.

ఒక హస్తము మండలమునందలి రేఖలు బొటనవ్రేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు వేయవలెను. కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములం దున్న కోష్ఠములను ఎఱ్ఱని రంగు గల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగా యోగపీఠమును యథేష్టముగ అన్ని రంగులతోను అలంకరింపవలెను. వీథిని లతలతోడను, పత్రాదులతోడను అలంకరింపవలెను. పీఠద్వారమును తెల్లని రంగు గల చూర్ణముతోను, శోభాస్థానములను ఎఱ్ఱని చూర్ణములతోడను నింపవలెను.

ఉపశోభలపై నీలి రంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా చిత్రింపవలెను. ఇది భద్రమండలముపై రంగు లుంచు విధానము. ఇతరమండలముపై గూడ ఈ విధముగనే అనేకవిధము లగు వర్ణములు గల చూర్ణములు చల్లవలెను. త్రికోణమండలము తెలుపు - ఎరుపు - నలుపురంగులతో అలంకరింపవలెను. ద్వికోణమును ఎరుపు-పసుపురంగులతో అలంకరింపవలెను. చక్రకమలమునందలి నాభిస్థానమును నలుపురంగు చూర్ఱముతో అలంకరిపవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 91 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 30*
*🌻 Mode of worship of different gods in specially drawn lotus figures - 1 🌻*

10. Having worshipped the anus and penis one has to worship the lords of the twelve months as well as the twenty-six forms commencing with Puruṣottama in the external enclosure.

11. Among these the Lords of the months are to be worshipped in the lotus of the disc. Then the eight, six, five or four (total twenty-three) principles of the primordial matter (are to be worshipped) in another (lotus).

12-13. Then one has to dust in a drawn circular altar. (You) hear. The pericarp should be of yellow colour, and all the lines equal and white. (They) should be two cubits long and one thumb in breadth. Half the length are white. The joints (should be coloured) white, black or dark-blue.

14. The filaments should be red and yellow-coloured. The corners should be filled with red. The yogic seat should be bedecked with any of the colours according to one’s own desire.

15. The pathway is decorated with canopy of creepers and leaves. The entrance to the altar (should be painted) white, bright-red and yellow.

16. Ornamentation of all the white corners (is done) with blue (colour). It has been said that the altar bhadraka should be filled (with the colours) and in this way the other (altars) are filled.

17. The three corners should be decorated with pale, red and black, the two corners with red and yellow (and) the centre of the circle by black.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 607 / Sri Siva Maha Purana - 607 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 06 🌴*
*🌻. కుమారుని లీల  - 2 🌻*

భక్తుల ప్రాణప్రియులైన వాడా! సద్గుణ నిలయుడవగు నీవు త్రిగుణాతీతుడవు. శంభునకు ప్రియచసుతుడవగు నీవు శంభు స్వరూపడవు. సచ్చిదానందరూపుడవగు నీవు ప్రసన్నుడవై సుఖములనిచ్చెదవు. త్రిపురారి యగు శంకరుని కుమారుడవగు నీవు సర్వము తెలిసిన వాడవు. పవిత్ర ప్రేమకు నీవు సర్వదా వశుడవై యుందువు. ఆరు మోయులు గల నీకు సాధువులు, భక్తులు ప్రీతి పాత్రులు.

సర్వేశ్వరుడవగు నీవు సుఖముల నిచ్చెదవు. సాధవులకు ద్రోహము చేయువారిని నీవు సంహరించెదవు. శంకరుడు నీ తండ్రి. నీవు బ్రహ్మాండములను పాలించు ప్రభుడవు. దేవతలు మొదలగు వారందరు నీ పాదములను సేవించెదరు. నీకు సేవ ప్రియమైనది. నన్ను రక్షించుము (12). శత్రువులకు భయమును కలిగించువాడా! శంకర స్వరూపా! జనులకు శరణునొసగి సుఖములనిచ్చే నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను. ఓ స్కందా! నా విన్నపమును నీ చెవిలో వేసుకొనుము. జనుల మనస్సులో నీ భక్తి సర్వదా ఉండునట్లు చేయుము (13).

సర్వసమర్ధుడవగు నీవు ఎవనికి రక్షకుడవో, వానిని బలవంతుడు, సమర్ధుడు, రెండు పార్శ్యములయందు దృఢమగు రక్షణ నేర్పరుచుకున్నవాడు అగు శత్రువైననూ, తక్షకుడే అయిననూ, రాక్షసుడైననూ ఏమి చేయగలడు? (14) అనేక గురువులను శుశ్రూష చేసినవాడైననూ నిన్ను స్తుతింప సమర్ధుడు గాడు. మంద బుద్ది అగు నేను ఎట్లు స్తుతించగలను? గొప్ప వారిచే పూజింపబడే ఓ స్కందా! నేను శుచియైననూ, కాక పోయిననూ, ఎట్లున్ననూ, నీ పాదపద్మముల పరాగమును ప్రార్థించుచున్నాను (15).

ఓ సర్వేశ్వరా! భక్తవత్సలా! కరుణా సముద్రా! నేను నీ వాడను. సేవకుడను. ఓ మహాప్రభూ! నీ సేవకుని వంద తప్పులనైననూ నీవు లెక్కించవు. ఓ విభూ! భక్తుని అల్పమగు భక్తిని కూడా నీవు గుర్తించెదవు. నీవు భృత్యుల దుఃఖములను పోగొట్టెదవు. ఓ భగవాన్‌! నీ కంటె వేరుగా రక్షకుడు లేడు. నా కంటె ఎక్కువ మూర్ఖుడగు మానవుడు లేడు (16) .

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 607🌹*
*✍️  J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  06 🌴*

*🌻 The miraculous feat of Kārttikeya - 2 🌻*

12. You love devotees as your own vital air. You are the receptacle of all attributes. You are beyond three attributes. You are the beloved of Śiva. You are Śiva Himself. You confer welfare. You are the bestower of happiness with delight. You are the great Existent and cosmic consciousness. You are the son of Śiva, the omniscient who ḍestroyed the three cities of Asuras. You are always subservient to great and pious love. You have six faces. You love the saintly persons who kneel to you. You are the lord of all people and their benefactor. You destroy those, who harass the good. You are the preceptor of even Śiva. You are the lord of the entire universe. Your feet are served by all the gods. O lover of service, save me.

13. O Skanda, terrible to the enemies, the benefactor of the devotees, I bow to your lotus-like feet. You are the refuge of people and source of their happiness. Please hear my submission through your ears. Please instil into the heart of everyone the feelings of devotion to you.

14. If you are the protector with efficient honour what harm can an opponent do even if he be strong and efficient and protected on either side? What harm can even Takṣaka[1] or even a carnivorous animal do unto him.

15. Even the preceptor of the gods cannot eulogise you adequately. Then tell me, how can I a foolish and wretched creature? O Skanda, pure or impure, noble or ignoble, of whatever nature I be, I pray unto the dust of your lotus-like feet.

16. O lord of all, ocean of mercy, favourably disposed to devotees, I am your own servant. May even a hundred sins of your own servant or a leader of the Gaṇas be forgiven. O lord, you know even the slightest act of devotion done anywhere. You are the destroyer of the distress of your servants. O lord, there is no other protector save you and no other wretched vulgar person than I.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 226 / Osho Daily Meditations  - 226 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 226. ధ్యానము ఒక దివ్య ఔషధం 🍀*

*🕉. బయటి నుండి ఒత్తిడి వచ్చినప్పుడల్లా, ధ్యానంలోకి నేరుగా ప్రవేశించడం కష్టం అవుతుంది. కాబట్టి ధ్యానానికి ముందు, పదిహేను నిమిషాలు, ఒత్తిడిని రద్దు చేయడానికి ఏదైనా చేయండి. 🕉*
 
*పదిహేను నిమిషాల పాటు, నిశ్శబ్దంగా కూర్చుని, ప్రపంచం మొత్తాన్ని ఒక కలగా భావించండి - దానిలో ఎటువంటి ప్రాముఖ్యత లేదు. రెండవది, ముందుగానే లేదా తరువాత మీరు, మరియు ప్రతిదీ  కూడా అదృశ్యం అవుతుందని గుర్తుంచుకోండి. మీరు ఎల్లప్పుడూ ఇక్కడ ఉండరు, కాబట్టి ఏదీ శాశ్వతం కాదు. మూడవది: మీరు కేవలం సాక్షి మాత్రమే. ఇది గడిచి పోతున్న కల, సినిమా. ఈ మూడు విషయాలను గుర్తుంచుకోండి - ఈ ప్రపంచం మొత్తం ఒక కల అని మరియు ప్రతిదీ గడిచిపోతుంది, మీరు కూడా అని. మృత్యువు సమీపిస్తోంది.  కానీ అది సాక్షాత్తు సాక్షి మాత్రమే. కాబట్టి మీరు కూడా కేవలం సాక్షి మాత్రమే.*

*శరీరాన్ని రిలాక్స్ చేయండి, పదిహేను నిమిషాలు సాక్ష్యంగా మారండి. ఆపై ధ్యానం చేయండి. మీరు దానిలోకి ప్రవేశించ గలుగుతారు, ఆపై ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ధ్యానం సరళంగా మారిందని మీకు అనిపించినప్పుడల్లా, దానిని ఆపండి; లేకుంటే అది అలవాటు అవుతుంది. ధ్యానంలోకి ప్రవేశించడం కష్టంగా ఉన్నప్పటి నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే దీనిని ఉపయోగించాలి. మీరు ప్రతిరోజూ చేస్తే, అది ప్రభావం కోల్పోతుంది, ఆపై అది పనిచేయదు. కాబట్టి దీన్ని ఔషధంగా వాడండి. విషయాలు తప్పుగా జరుగుతున్నప్పుడు, దీన్ని చేయండి, తద్వారా మార్గం క్లియర్ అవుతుంది మరియు మీరు విశ్రాంతి తీసుకోగలరు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 226 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 226. MEDICINAL USE OF MEDITATION 🍀*

*🕉. Whenever there is pressure from the outside, direct entry into meditation becomes difficult. So before meditation, for fifteen minutes, do something to cancel the pressure. 🕉*
 
*For fifteen minutes, simply sit silently and think of the whole world as a dream-and it is! Think of the whole world as a dream and that there is nothing of any significance in it. Second, remember that sooner or later everything will disappear you also. You were not always here, you will not always be here. So nothing is permanent. And third: You are just a witness. This is a passing dream, a film. Remember these three things-that this whole world is a dream and everything is going to pass, even you.*

*Death is approaching and the only reality is the witness, so you are just a witness.  Relax the body, witness for fifteen minutes, and then meditate. You will be able to get into it, and then there will be no trouble. But whenever you feel that this meditation has become simple, stop it; otherwise it will become habitual. It has to be used only in specific conditions when it is difficult to enter meditation. If you do it every day, it will lose the effect, and then it will not work. So use it medicinally. When things are going wrong, do it so it will clear the way and you will be able to relax.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 395 / Sri Lalitha Chaitanya Vijnanam  - 395🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।*
*మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀*

*🌻 395. 'ప్రసిద్ధా'🌻*

*'నేను' అని తెలియబడునది శ్రీదేవి. మనకు మన మున్నామని తెలియజేయునది శ్రీమాత. నిద్రలో మన మున్నప్పుడు వున్నామను జ్ఞప్తి యుండదు. ఉండుట యుండును గాని ఎరుక వుండదు. మన యందలి ఎరుకగ వుండి నిద్ర నుండి లేపినపుడు ప్రతి ఒక్కరును “నేను వున్నాను” అనుకొందురు. ఈ నేనుగ నున్నది శ్రీదేవియే. మన మున్నట్లు మనకు తెలియ చేయునది శ్రీదేవి. మన అందరి యందును 'నేను'గ మేల్కాంచునది.*

*ప్రతి ఒక్కరునూ నేను, నేను అందురు. ఎవరా నేను? ఈ నేను మన నామము కాదు. మన రూపము కాదు. కులము, మతము, జాతీయత, లింగ భేదములతో సంబంధము లేక అందరునూ నేను అందురు. పసివారి నుండి వృద్ధుల వరకు తమను గూర్చి సంబోధించినపుడు నేను అందురు. ఈ నేను అనునది మన యందలి చైతన్యమే. ఇట్లందరి యందు ప్రసిద్ధి గాంచినది శ్రీమాత. ఇంత ప్రసిద్ధిగ శ్రీమాతయే అందరియందు నేనుగ ఉన్ననూ, దానిని గమనింప లేకపోవుట ఆశ్చర్యమే. శ్రీమాత సుప్రసిద్ధ. మన యందలి నేను అను ఎఱుకకు ఆమె మూలము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 395 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma   📚. Prasad Bharadwaj*

*🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari*
*Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻*

*🌻 395. Prasiddhā प्रसिद्धा 🌻*

*She is well known to everybody as She is highly celebrated.  She is in the form of inner Self of all living beings. When someone says ‘I’, it actually means Her, as She is the Self.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages 

Join and Share 

https://t.me/ChaitanyaVijnanam

https://t.me/Spiritual_Wisdom 

www.facebook.com/groups/chaitanyavijnanam/ 

https://dailybhakthimessages.blogspot.com

https://incarnation14.wordpress.com/

https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages

https://chaitanyavijnanam.tumblr.com/

https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj