శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 395 / Sri Lalitha Chaitanya Vijnanam - 395
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 395 / Sri Lalitha Chaitanya Vijnanam - 395🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀
🌻 395. 'ప్రసిద్ధా'🌻
'నేను' అని తెలియబడునది శ్రీదేవి. మనకు మన మున్నామని తెలియజేయునది శ్రీమాత. నిద్రలో మన మున్నప్పుడు వున్నామను జ్ఞప్తి యుండదు. ఉండుట యుండును గాని ఎరుక వుండదు. మన యందలి ఎరుకగ వుండి నిద్ర నుండి లేపినపుడు ప్రతి ఒక్కరును “నేను వున్నాను” అనుకొందురు. ఈ నేనుగ నున్నది శ్రీదేవియే. మన మున్నట్లు మనకు తెలియ చేయునది శ్రీదేవి. మన అందరి యందును 'నేను'గ మేల్కాంచునది.
ప్రతి ఒక్కరునూ నేను, నేను అందురు. ఎవరా నేను? ఈ నేను మన నామము కాదు. మన రూపము కాదు. కులము, మతము, జాతీయత, లింగ భేదములతో సంబంధము లేక అందరునూ నేను అందురు. పసివారి నుండి వృద్ధుల వరకు తమను గూర్చి సంబోధించినపుడు నేను అందురు. ఈ నేను అనునది మన యందలి చైతన్యమే. ఇట్లందరి యందు ప్రసిద్ధి గాంచినది శ్రీమాత. ఇంత ప్రసిద్ధిగ శ్రీమాతయే అందరియందు నేనుగ ఉన్ననూ, దానిని గమనింప లేకపోవుట ఆశ్చర్యమే. శ్రీమాత సుప్రసిద్ధ. మన యందలి నేను అను ఎఱుకకు ఆమె మూలము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 395 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj
🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari
Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻
🌻 395. Prasiddhā प्रसिद्धा 🌻
She is well known to everybody as She is highly celebrated. She is in the form of inner Self of all living beings. When someone says ‘I’, it actually means Her, as She is the Self.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 Aug 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment