🍀 10 - AUGUST - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

 🌹 10 - AUGUST - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 10, ఆగస్టు 2022 బుధవారం, సౌమ్య వాసరే Wednesday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 245 / Bhagavad-Gita - 245 -6-12 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 644 / Vishnu Sahasranama Contemplation - 644 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 323 / DAILY WISDOM - 323 🌹   
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 223 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 

*🌹10 August 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు :  లేవు  🌺*

*🍀. నారాయణ కవచము - 15 🍀*

*23. చక్రం యుగాంతానల తిగ్మనేమి భ్రమత్సమంతాద్భగవ త్ప్రయుక్తమ్ |*
*దందగ్ధి దందగ్ధ్యరి సైన్యమాశు కక్షం యథా వాతసఖో  హుతాశః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀.  నేటి సూక్తి :   భగవానుడు తొలుత అత్యంత బాధాకరుడుగా ముసుగు వేసుకొని కనిపించినా, అదంతా మన మంచికేనని తుదకాయన నిరూపించు కుంటాడు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి:  శుక్ల త్రయోదశి 14:17:10 వరకు
తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: పూర్వాషాఢ 09:40:07 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: ప్రీతి 19:36:20 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: తైతిల 14:15:10 వరకు
వర్జ్యం: 16:44:20 - 18:09:12
దుర్ముహూర్తం: 11:55:47 - 12:46:56
రాహు కాలం: 12:21:22 - 13:57:15
గుళిక కాలం: 10:45:28 - 12:21:22
యమ గండం: 07:33:40 - 09:09:34
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: 05:23:48 - 06:49:12
మరియు 25:13:32 - 26:38:24
సూర్యోదయం: 05:57:46
సూర్యాస్తమయం: 18:44:58
చంద్రోదయం: 17:30:12
చంద్రాస్తమయం: 03:42:15
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ
సౌఖ్యం 09:40:07 వరకు తదుపరి
వజ్ర యోగం - ఫల ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 245 / Bhagavad-Gita -  245 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం  - 12 🌴*

*12. తత్రైకాగ్రం మన: కృత్వా యతచిత్తేన్ద్రియక్రియ: |*
*ఉపవిశ్యాసనే యుజ్ఞ్యాద్ యోగమాత్మవిశుద్ధయే*

🌷. తాత్పర్యం :
*పిదప అతడు దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియమనోకర్మలను నియమించి, మనస్సును ఏకాగ్రపరచి హృదయశుద్ధి కొరకు యోగము నభ్యసించవలెను.*

🌷. భాష్యము :
 ఆత్మనిగ్రహము లేనివాడు మరియు మనోచంచలము కలవాడు ధ్యానమును కొనసాగింపలేడు. కలియుగమునందు జనులు అల్పాయుష్కులు, ఆధ్యాత్మిక పురోగతి యందు బద్ధకస్తులు, వివిధములైన తాపత్రయములచే సదా కలతనొందనివారు యగుట చేతనే ఆత్మానుభవమునకు హరినామసంకీర్తనము ఉత్తమమార్గమని బృహన్నారదీయ పురాణమునందు తెలుపబడినది.

హరేర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం |
కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా

“కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగము నందు హరినామ కిర్తనమే ఏకైక ముక్తిమార్గము. దానికి మించి వేరొకమార్గము లేదు. వేరొకమార్గము లేదు. వేరొకమార్గము లేదు.”
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 245 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 12 🌴*

*12. tatraikāgraṁ manaḥ kṛtvā yata-cittendriya-kriyaḥ*
*upaviśyāsane yuñjyād yogam ātma-viśuddhaye*

🌷 Translation :
*The yogī should then sit on it very firmly and practice yoga to purify the heart by controlling his mind, senses and activities and fixing the mind on one point.*

🌹 Purport :
One who is not self-controlled and whose mind is not undisturbed cannot practice meditation. Therefore, in the Bṛhan-nāradīya Purāṇa it is said that in Kali-yuga (the present yuga, or age), when people in general are short-lived, slow in spiritual realization and always disturbed by various anxieties, the best means of spiritual realization is chanting the holy name of the Lord.

harer nāma harer nāma harer nāmaiva kevalam
kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā

“In this age of quarrel and hypocrisy the only means of deliverance is chanting the holy name of the Lord. There is no other way. There is no other way. There is no other way.”
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 644 / Vishnu  Sahasranama Contemplation - 644🌹*

*🌻644. శౌరిః, शौरिः, Śauriḥ🌻*

*ఓం శౌరయే నమః | ॐ शौरये नमः | OM Śauraye namaḥ*

శౌరిః, शौरिः, Śauriḥ

*శూరకులోద్భవత్వాచ్ఛౌరిరుచ్యతే*

*శూరుడు అను యాదవుని వంశమున పురుష సంతతిగా జనించినందున శౌరిః. (వాసుదేవుడు వసుదేవుని పుత్రుడు. వసుదేవుని తండ్రి శూరసేనుడు)*

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
చ. హరి దన నాభిపంకరుహమందు జనించిన యట్టి భారతీ
    శ్వరుఁ డతిభక్తి వేఁడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై
    పరఁగ జనించి భూభారముఁ బాపిన భవ్యులు రేవతీందిరా
    వరు లట శూరసేనుని నివాసమునన్ సుఖ మున్నవారలే? (49)

*తన నాభి కమలము నుండి పుట్టిన బ్రహ్మదేవుడు పరమభక్తితో ప్రార్థింపగా శ్రీహరి - బలరాముడుగా, కృష్ణుడుగా యదువంశములో ఉదయించినాడు. అటుల పుట్టి భూభారమును పోగొట్టిన మహోదయులు, రేవతీరుక్మిణీ హృదయప్రియులు అయిన రామకృష్ణులు తమ తాతగారు అయిన శూరసేనుని గృహములో సుఖముగా ఉన్నారా?*

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 644🌹*

*🌻644.  Śauriḥ🌻*

*OM Śauraye namaḥ*

*शूरकुलोद्भवत्वाच्छौरिरुच्यते / Śūrakulodbhavatvācchaurirucyate*

*Since the Lord took birth in Śūra clan, He is called Śauriḥ. (Vasudeva is the father of Lord Vāsudeva; Vasudeva is son of Śūrasena).*

:: श्रीमद्भागवते दशमस्कन्धे द्वितीयोऽध्यायः ::
ततो जग्न्मङ्गलमच्युतांशं समाहितं शूरसुतेन देवी ।
दधार सर्वात्मकमात्मभूतं काष्ठा यथानन्दकरं मनस्तः ॥ १८ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 2
Tato jagnmaṃgalamacyutāṃśaṃ samāhitaṃ śūrasutena devī,
Dadhāra sarvātmakamātmabhūtaṃ kāṣṭhā yathānaṃdakaraṃ manastaḥ. 18.

*Thereafter, accompanied by plenary expansions, the fully opulent Lord, who is all-auspicious for the entire universe, was transferred from the mind of Vasudeva to the mind of Devakī. Devakī, having thus been initiated by Vasudeva, became beautiful by carrying Lord Kr‌s‌n‌a, the original consciousness for everyone, the cause of all causes, within the core of her heart, just as the east becomes beautiful by carrying the rising moon.*

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥
కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥
Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 323 / DAILY WISDOM - 323 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*✍️ .స్వామి కృష్ణానంద   📝. ప్రసాద్ భరద్వాజ*

*🌻 18. మనలోని అతీంద్రియ మూలకం 🌻*

*క్షణికావేశం మరియు చంచలత్వంతో కూడిన జీవితంలో, ప్రతిచోటా అశాశ్వతం రాజ్యమేలుతూ, శాశ్వతమైన విలువ కలిగింది ఏదీ లేకుండా, చివరకు దేనిపైనా నియంత్రణ లేని ఈ ప్రపంచంలో మీరు ఎలాంటి ఆనందాన్ని ఆశిస్తున్నారు? బహుశా నశ్వరమైన ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఆనందం ఉండదేమో. అయినా మనం కోరుకునేది ఆనందం అయినప్పటికీ ఈ ప్రపంచంలో ఎవరూ సంతోషంగా ఉండలేరు. మన విధానంలో పరస్పర వైరుధ్యం కనిపిస్తోంది. క్షణికం, తాత్కాలికం, మరియు అయోమయమైన ఈ ప్రపంచంలో మీరు శాశ్వత ఆనందాన్ని ఎలా ఆశిస్తున్నారు?*

*అయినా మన హృదయం శాశ్వతమైన ఆనందం కోసం తహతహలాడుతుంది. అది ఒక్క క్షణం ఆనందాన్ని, మరుసటి క్షణం వినాశనాన్ని కోరుకోదు. వాస్తవానికి, మనం కోరుకునే ఆనందం ఆది-భౌతికమైనది, అతీతమైనది. మనం అనుభవించే, గ్రహించే ఇంద్రియ సంబంధమైన విషయాలు మనం కోరుకునే ఆనందం కావు. మనలో ఒక అతీతమైన ఆది భౌతికత పనిచేస్తోంది. మీరు మీ స్వయంలో లేదా పరంలో  ఆ అతీంద్రియ మూలకాన్ని సంప్రదించగలిగితే, మీరు మీ ఆనందానికి మూలాన్ని అందుకో గలుగుతారు. ఇది మతం యొక్క పని.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 323 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda  📚. Prasad Bharadwaj*

*🌻 18. The Transcendent Element in Us 🌻*

*In a life which is characterised by momentariness and fluxation, with temporality reigning supreme everywhere, and nothing permanent worth the while, with no control finally over anything, what kind of happiness are you expecting in this world? Perhaps happiness that is going to be enduring and not merely fleeting cannot be had in a world which is fleeting by its nature. Nobody can be happy in this world, yet it is happiness that we seek. It looks like a contradiction in our approach. Involved in a world of fluxation and temporality, how do you expect permanent happiness?*

*Yet our heart seems to be yearning for permanent happiness. It doesn't want a joy for one moment, and destruction the next moment.  Actually, the joy that we seek is super-physical, super-terrestrial; it is transcendent. All that we empirically experience, sensorially perceive or contact, what we feel psychologically in terms of sense perception is not the joy that we seek, finally. There is a transcendent super-physical element operating in us, and if you can contact that transcendent element in your own self or in the world, you may be contacting the source of your joy. This is the work of religion.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 223 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀.  ప్రేమను మించి ఏదీ లోతుల్లోకి వెళ్ళలేదు. అది శరీరాన్ని మాత్రమే కాదు, మనసును మాత్రమే కాదు ఆత్మను కూడా ఓదారుస్తుంది. అపుడు వ్యక్తి సమస్తమవుతాడు. నువ్వు స్వచ్ఛమైన చైతన్యంతో వుంటావు. 🍀*

*ప్రపంచంలో ఓదార్పు నిచ్చే గొప్ప శక్తి ప్రేమ. ప్రేమను మించి ఏదీ లోతుల్లోకి వెళ్ళలేదు. అది శరీరాన్ని మాత్రమే కాదు, మనసును మాత్రమే కాదు ఆత్మను కూడా ఓదారుస్తుంది. వ్యక్తి ప్రేమిస్తే అతని గాయాలన్నీ మాయమవుతాయి. అపుడు వ్యక్తి సమస్తమవుతాడు. సమస్తం కావడమంటే పవిత్రం కావడమే. సమస్త కాని పక్షంలో పవిత్రం కానట్లే. భౌతిక ఆరోగ్యమన్నది పైపైన విషయం దాన్ని వైద్యం ద్వారా బాగుపరచవచ్చు. సైన్సు ద్వారా నిర్వహించవచ్చు.*

*కానీ లోపలి కేంద్రాన్ని లోపలి ఆరోగ్యాన్ని ప్రేమ ద్వారా మాత్రమే బాగుపరచవచ్చు. ప్రేమ రహస్యం తెలిసిన వాళ్ళకు జీవితంలోని గొప్ప రహస్యం తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకు బాధలుండవు. వాళ్ళకు వృద్ధాప్యం, మరణం వుండదరు. శరీరం ముసలిది అవుతుంది. శరీరం నశిస్తుంది. కాని నువ్వు స్వచ్ఛమైన చైతన్యంతో వుంటావు. నీకు జనన మరణాలు వుండవు. ఆ స్వచ్ఛమైన చైత్యంతో వుండటమంటే స్వచ్ఛమైన వునికితో వున్నట్లే. అప్పుడు దాని ఆనందం ఆవిర్భవిస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment