1) 🌹 22, FEBRUARY 2023 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 330 / Bhagavad-Gita -330 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 20 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 177 / Agni Maha Purana - 177 🌹 🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 4 / The dimensions of different varieties of the Liṅga - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 042 / DAILY WISDOM - 042 🌹 🌻 11. ధ్యాన వస్తువు / 11. The Object of Meditation🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 306 🌹
6) 🌹. శివ సూత్రములు - 44 / Siva Sutras - 44 🌹
🌻 14. దృశ్యం శరీరం - 3 / 14. Dṛśyaṁ śarīram - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹22, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. శ్రీ గణేశ హృదయం - 11 🍀*
11. యస్యోదరాద్విశ్వమిదం ప్రసూతం
బ్రహ్మాణి తద్వజ్జఠరే స్థితాని |
ఆనంత్యరూపం జఠరం హి యస్య
లంబోదరం తం ప్రణతోఽస్మి నిత్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సంసిద్ధికి మార్గం - మనస్సును ప్రశాంతంగా ఉంచుకో, దాని కతీతమైవున్న దివ్యశక్తిని గుర్తించు. నీ లోపలకు దానికి దారి యిచ్చి, అది నీయందు పనిచేయ డానికి అవకాశం కల్పించు. సంసిద్ధికి ఇదే సరియైన మార్గం. మనస్సులో ఆశాంతి సంసిద్ధికి మార్గం కానేరదు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల తదియ 27:25:46 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 28:51:27
వరకు తదుపరి రేవతి
యోగం: సద్య 23:46:18 వరకు
తదుపరి శుభ
కరణం: తైతిల 16:42:36 వరకు
వర్జ్యం: 15:31:24 - 17:00:08
మరియు 26:22:00 - 43:38:16
దుర్ముహూర్తం: 12:06:17 - 12:53:01
రాహు కాలం: 12:29:39 - 13:57:17
గుళిక కాలం: 11:02:01 - 12:29:39
యమ గండం: 08:06:44 - 09:34:22
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 24:23:48 - 25:52:32
సూర్యోదయం: 06:39:06
సూర్యాస్తమయం: 18:20:13
చంద్రోదయం: 08:13:18
చంద్రాస్తమయం: 20:32:07
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 28:51:27 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 330 / Bhagavad-Gita - 330 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 20 🌴*
*20. పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తోవ్య క్తాత్సనాతన: |*
*య: స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ||*
🌷. తాత్పర్యం :
*వ్యక్తావ్యక్తములయ్యెడి ఈ భౌతికప్రకృతి కన్నను పరమైనదియు, శాశ్వతమైనదియు నగు అవ్యక్తప్రకృతి వేరొక్కటి కలదు. అది పరమోత్కృష్టమును, నాశరహితమును అయియున్నది. ఈ జగము నందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచి యుండును.*
🌷. భాష్యము :
శ్రీకృష్ణుని ఉత్కృష్టమైన అంతరంగశక్తి దివ్యమును, శాశ్వతమును అయియున్నది. బ్రహ్మదేవుని పగటి సమయమున వ్యక్తమై, రాత్రికాలమున నశించు భౌతికప్రకృతి యందలి మార్పులకు అది అతీతమైనది.
అనగా శ్రీకృష్ణుని ఉన్నతశక్తి భౌతికప్రకృతి గుణమునకు సంపూర్ణముగా విరుద్ధమైనది. ఉన్నత ప్రకృతి మరియు న్యునప్రకృతి యనునవి ఇదివరకే సప్తమాధ్యాయమున వివరింపబడినవి.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 330 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 20 🌴*
*20 . paras tasmāt tu bhāvo ’nyo ’vyakto ’vyaktāt sanātanaḥ*
*yaḥ sa sarveṣu bhūteṣu naśyatsu na vinaśyati*
🌷 Translation :
*Yet there is another unmanifest nature, which is eternal and is transcendental to this manifested and unmanifested matter. It is supreme and is never annihilated. When all in this world is annihilated, that part remains as it is.*
🌹 Purport :
Kṛṣṇa’s superior, spiritual energy is transcendental and eternal. It is beyond all the changes of material nature, which is manifest and annihilated during the days and nights of Brahmā. Kṛṣṇa’s superior energy is completely opposite in quality to material nature. Superior and inferior nature are explained in the Seventh Chapter.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 177 / Agni Maha Purana - 177 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 54*
*🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 4 🌻*
భూతములచేత-అనగా ఐదుచేత భాగించినపుడు శేషము పృథివి అయిన శభము. అగ్నిచేత-అనగా మూడుచేత భాగించినపుడు-శేషము ఆహవనీయాగ్నియైన శుభము. లింగము పొడవును సగము చేసి, దానిని ఎనిమిదిచే భాగించగా శేషము ఏడు వచ్చనచో ఆ లింగము ''అఢ్యము'' ఐదు కంటె అధికము శేషమైనచో ''అనాఢ్యము'' ఆరు అంశల కంటె అధికము శైషమైనచో అది ''దేవేజ్యము''. మూడు అంశల కంటె అధికము శేషించినచో అది ''అర్కతుల్యము''. ఈ నాలుగు విధములగు లింగములును చతుష్కోణములుగ నుండను. ఐదవది ''వర్ధమాన లింగము'', దీనికి వ్యాసము కంటె ఆనాహము అధికము. ఆనాహము వ్యాసముతో సమానముగ ఉండుట, దాని కంటె పెద్దదిగా ఉండుట అను దానినిపట్టి, ఈ లింగములలో రెండు భేదములుండును. విశ్కర్మ శాస్త్రానుసారము ఈ అన్నింటి భేదము లనేకములు చెప్పబడగలవు. స్థూలత్వాదులచే అఢ్యాది లింగములలో మరల మూడు భేదము లుండును. వాటికి ఒక్కొక్క యవ చొప్పున పెంచగా మొత్తము ఎనిమిది విధముల లింగము లేర్పుడును. హస్తమానమును పట్టి 'జన' మను లింగమునకు గూడ మూడు భేదము లగును. దానిని సర్వ సమలింగమున కలిపివేయవలెను.
అనాఢ్యము, దేవార్చితము, అర్కతుల్యము అను లింగములకు గూడ ఐదేసి భేదములగుటచే ఇరువదియైదు అగును. ఏక-జిన-భక్త-భేదములచే డెబ్బదియైదు భేదము లగును. అన్నియు కలుపగా పదునైదువేల, నాలుగు వందల శివలింగములగును . ఎనిమిది అంగుళముల విస్తారముగల లింగము కూడ ఏకాంగుళమానము, హస్తమానము, గర్భమానము అను మానత్రయము ననుసరించి తొమ్మిది భేదము లగును. వీటి నన్నింటిని కోణ-అర్ధకోణము లందున్న సూత్రములచే వీటి కోణములను విభజింపవలెనని ఒక్కొక్క విభాగము మొక్క విస్తారము, లింగ మధ్యభాగ విస్తారతుల్యముగ భావించి మధ్య-ఊర్ధ్వ-అధో విభాగము లేర్పరుపవలను. మధ్యమ విభాగముపై నున్న అష్ట కోణము లేదా షోడశకోణము అగు విభాగము శివుని అంశము. మూల భాగమునుండి జానువు పర్యంతము ఉండు లింగాధోబాగము బ్రహ్మ యొక్క అంశము. జానువు నుండి నాభి వరకును ఉన్న లింగ మధ్యభాగమున విష్ణు యొక్క అంశము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 177 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 54*
*🌻The dimensions of different varieties of the Liṅga - 4 🌻*
26-27. Among the elements, the earth is auspicious. Among the fires, the consecrated fire (from the household’s perpetual fire) is auspicious. Half of the said length having been divided in order into seven, eight, five, nine and five parts there would be symmetrical representation of Śiva, Viṣṇu and Brahman.
28. The fifth one is known as the Vardhamāna. There would be two kinds based on the increase of breadth and length. Many kinds are described according to Viśvakarma (the divine architect).
29. The āḍhya class would be of three kinds on account of the size. Measured by the barley grains it would be eight parts, by the arm it would be three parts. The last one endowed equally is known as jina.
30-31. (There would be) twenty-five liṅgas in the first (variety) which are worshipped by the celestials. Then being divided into thirty-five there would be 14000 and 1400 varieties. Thus (we have) the eight aṅgula’s extent from the nine cubit adytum.
32. One has to mark the angular points by means of threads placed at the angular and middle ofangular points. Having made the expansion from the middle, three parts should be fixed from the middle.
33. There would be eight angular parts above the division. Two angular parts represent the part of Śiva. From the foot to the knee portion (of the liṅga) is Brahmā. (From the knee) to the navel is Viṣṇu.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 42 / DAILY WISDOM - 42 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 11. ధ్యాన వస్తువు 🌻*
*ధ్యానవస్తువు అనేది మన స్థితికి అనుగుణంగా ఉండే వాస్తవికత నుండి అయి ఉండాలి. ఇది ఒక సూత్రం లాగా మీకు అనిపించవచ్చు. మన ప్రస్తుత స్థాయి జ్ఞానం మరియు గ్రహణశక్తికి ఖచ్చితమైన ప్రతిరూపమైన దాని గురించి మాత్రమే మనం ధ్యానం చేయాలి. వస్తువు ఎంపికలో ఎలాంటి తప్పులు ఉండకూడదు. వస్తువును సరిగ్గా ఎంచుకుంటే, మనస్సు సహజంగానే నియంత్రణలోకి వస్తుంది.*
*మనస్సు యొక్క చంచలత్వం మరియు బాధ ప్రారంభంలో ఎంపిక లో చేసిన తప్పు కారణంగానే ఉంటుంది. తరచుగా మనం అత్యుత్సాహం వలన మన తలకు మించిన దాని కోసం ప్రయత్నిస్తాము. తన అవగాహనకు, అవసరాలకు మించిన అటువంటి విప్లవాత్మకమైన సత్యాన్ని అంగీకరించడానికి మనస్సు సిద్ధంగా ఉండదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 42 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 11. The Object of Meditation 🌻*
*The object of meditation is the degree of reality aligned to our state of being. This is a sentence which may appear like an aphorism. We have to meditate only on that which is the exact counterpart of our present level of knowledge and comprehension. There should not be any mistake in the choice of the object. If the object is properly chosen, the mind will spontaneously come under control.*
*The restlessness and the resentment of the mind is due to a wrong choice that is made in the beginning. Often we are too enthusiastic and try to go above our own heads. The mind is not prepared to accept such a sudden revolution which is beyond not only its comprehension but also its present needs or necessities.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 307 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. వివేకవంతులు దేవుడికి లొంగి పోతారు. తమకి ఆక్రమించు కొమ్మని ఆహ్వానిస్థారు. దేవుణ్ణి సొంతం చేసుకోలేవు, నువ్వు దేవుడికి సొంతం కావచ్చు. వ్యక్తి లొంగిపోవాలి. సంపూర్ణంగా లొంగిపోవాలి. 🍀*
*విజయానికి ప్రేమ ఒక్కటే వంతెన. కానీ అది వింతైన వంతెన. కానీ ప్రేమకు అవసరమయిన మొదటి విషయం ఆత్మ సమర్పణ. అది లొంగిపోవడం ద్వారా పొందే విజయం. అందువల్ల అక్కడ అద్భుత సౌందర్యముంది. అది దౌర్జన్య పూరితం కాదు, స్వీకరించే తత్వం. అది ఆక్రమించడం ద్వారా కాదు. లొంగిపోవడం ద్వారా విజయం సాధిస్తుంది.*
*దేవుణ్ణి ఆక్రమించు కోవాలనుకున్న వాళ్ళు బుద్ధిహీనులు. అది వాళ్ళ వల్ల కాదు. వివేకవంతులు దేవుడికి లొంగి పోతారు. తమకి ఆక్రమించు కొమ్మని ఆహ్వానిస్థారు. దేవుణ్ణి సొంతం చేసుకోలేవు, నువ్వు దేవుడికి సొంతం కావచ్చు. ప్రేమ లొంగిపోవడానికి సిద్ధపడుతుంది. వ్యక్తి లొంగి పోవాలి. సంపూర్ణంగా లొంగిపోవాలి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 044 / Siva Sutras - 044 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 14. దృశ్యం శరీరం - 3 🌻*
*🌴. ఈ శరీరం కనిపించే నేను. ఇది తనలో నిజమైన స్వయాన్ని అదృశ్యంగా కలిగి ఉంది. 🌴*
*ఎవరైనా కింది స్థాయిలను అధిగమించగలిగితే, అతను పరమాత్మ యొక్క సర్వవ్యాప్తతను అనుభవించడం ప్రారంభిస్తాడు. యోగి మూడు సాధారణ స్థాయి చైతన్యాలను అధిగమించి, అలా చేయడం ద్వారా, అతను విశ్వ వ్యాప్త చైతన్యం అయిన శివుడిని గుర్తించడం ప్రారంభిస్తాడు. ఫలితంగా బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతాడు.*
*అతను మొత్తం విశ్వాన్ని శివునిగా భావిస్తాడు. అతనికి శివునికి మించిన స్థితి లేదు. అతని వ్యక్తిగత అనుభవం శివునికి భిన్నంగా లేదు, వేడికి అగ్నికి భిన్నంగా లేనట్లుగా. మాయ వలన ఏర్పడిన ఈ వ్యక్తిగత అహంకారమే అన్ని కష్టాలకు కారణం. వాస్తవంగా సర్వం ఈశ్వర మయం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 044 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 14. Dṛśyaṁ śarīram - 3 🌻*
*🌴. The body is the visible self. It houses the true self, which is invisible.🌴*
*If one is able to transcend the lower levels, he begins to feel omnipresence of the Divine. The yogi transcends all the three normal level of consciousness and by doing so, he begins to recognize Shiva, the universal consciousness within, resulting in bliss.*
*He feels the whole universe as a single entity, Shiva. For him there is no other state other than Shiva. His individual experience is not distinct from Shiva, like the heat is not different from fire. Individual identification is the cause for pains and miseries. Individual identification unfolds only due to mistaken identity caused by māya. Reality is sarvaṃ īsvara mayaṃ (सर्वं ईस्वर मयं)*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj