1) 🌹 శ్రీమద్భగవద్గీత - 432 / Bhagavad-Gita - 432🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 220 / Sripada Srivallabha Charithamrutham - 220 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 100🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 123 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 36 / Sri Lalita Sahasranamavali - Meaning - 36 🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 63 🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 40 🌹
8) 🌹. శివగీత - 5 / The Shiva-Gita - 5🌹
9)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 10 🌹
10) 🌹. సౌందర్య లహరి - 47 / Soundarya Lahari - 47🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 346 / Bhagavad-Gita - 346 🌹
12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 174🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 51 🌹
14) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 47🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 62 🌹
16) 🌹 Seeds Of Consciousness - 126 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 65 🌹
18) 🌹 Guru Geeta - Datta Vaakya - 8 🌹
19) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 5 🌹
20) 🌹. సృష్టి దివ్య సృజనాత్మకత - మానవజన్మ - సూక్ష్మ సృష్టి - కారణసృష్టి 🌹
21) 🌹. సాయి తత్వం - మానవత్వం - 54 / Sai Philosophy is Humanity - 54🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 432 / Bhagavad-Gita - 432 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 41 , 42 🌴*
41. సఖేతి మత్వా ప్రసభం యదుక్తమ్
హే కృష్ణ హే యాదవ హే సఖేతి |
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి ||
42. యచ్చాపహాసార్థమసత్కృతో(సి
విహారశయ్యాసనభోజనేషు |
ఏకో(థవాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ||
🌷. తాత్పర్యం :
నీ మహిమము తెలియక నిన్ను మిత్రునిగా భావించి “ఓ కృష్ణా”, “ఓ యాదవా”, “ ఓ మిత్రమా” అని తొందరపాటుగా సంబోధించితిని. ప్రేమతోగాని లేదా మూర్ఖత్వముతోగాని నేనొరించిన దానినంతటిని కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతి గొనునప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు ఒంటరిగా కొన్నిమార్లు మరియు పలుమిత్రుల సమక్షమున మరికొన్నిమార్లు నిన్ను నేను వేళాకోళముగా అగౌరపరచితిని. ఓ అచ్యుతా! ఆ అపరాధములన్నింటికిని నన్ను క్షమింపుము.
🌷. భాష్యము :
శ్రీకృష్ణుడు విశ్వరూపముతో తన యెదుట వ్యక్తమైనప్పటికిని అతనితో గల స్నేహసంబంధమును అర్జునుడు స్మృతి యందుంచుకొనెను.
తత్కారణముగా అతడు క్షమార్పణ వేడుచు, స్నేహభావము వలన ఉత్పన్నమైనట్టి పలు సామాన్య వ్యవహారములకు తనను మన్నింపుమని శ్రీకృష్ణుని అర్థించుచున్నాడు.
ప్రియమిత్రునిగా భావించి శ్రీకృష్ణుడు తనకు తెలియపరచినను, శ్రీకృష్ణుడు ఆ విధమైన విశ్వరూపధారణము చేయగలడని తాను పూర్వము తెలియనట్లుగా అర్జునుడు అంగీకరించుచున్నాడు.
ఆ భగవానుని విభూతులను గుర్తెరుగాక “ ఓ మిత్రమా”, “ఓ కృష్ణా”, “ఓ యాదవా” అనెడి సంబోధనములచే తానెన్నిమార్లు అతనిని అగౌరవపరచెనో అర్జునుడు ఎరుగడు. అయినను కరుణాంతరంగుడైన శ్రీకృష్ణుడు అట్టి దివ్యవిభూతి సంపన్నుడైనను అర్జునునితో మిత్రుని రూపమున వ్యవహరించెను.
భక్తుడు మరియు భగవానుని నడుమగల దివ్యప్రేమయుత సంబంధమిదియే. శ్రీకృష్ణుడు మరియు జీవుల నడుమగల సంబంధము నిత్యమైనది, మరుపునకు రానిదని అర్జునుని ప్రవృత్తి ద్వారా మనము గాంచవచ్చును.
విశ్వరూప వైభవమును గాంచినప్పటికిని అర్జునుడు తనకు శ్రీకృష్ణునితో గల సన్నిహిత స్నేహసంభందమును మరువజాలడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 432 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 41, 42 🌴*
41. sakheti matvā prasabhaṁ yad uktaṁ
he kṛṣṇa he yādava he sakheti
ajānatā mahimānaṁ tavedaṁ
mayā pramādāt praṇayena vāpi
42. yac cāvahāsārtham asat-kṛto ’si
vihāra-śayyāsana-bhojaneṣu
eko ’tha vāpy acyuta tat-samakṣaṁ
tat kṣāmaye tvām aham aprameyam
🌷 Translation :
Thinking of You as my friend, I have rashly addressed You “O Kṛṣṇa,” “O Yādava,” “O my friend,” not knowing Your glories. Please forgive whatever I may have done in madness or in love. I have dishonored You many times, jesting as we relaxed, lay on the same bed, or sat or ate together, sometimes alone and sometimes in front of many friends. O infallible one, please excuse me for all those offenses.
🌹 Purport :
Although Kṛṣṇa is manifested before Arjuna in His universal form, Arjuna remembers his friendly relationship with Kṛṣṇa and is therefore asking pardon and requesting Kṛṣṇa to excuse him for the many informal gestures which arise out of friendship.
He is admitting that formerly he did not know that Kṛṣṇa could assume such a universal form, although Kṛṣṇa explained it as his intimate friend.
Arjuna did not know how many times he may have dishonored Kṛṣṇa by addressing Him “O my friend,” “O Kṛṣṇa,” “O Yādava,” etc., without acknowledging His opulence.
But Kṛṣṇa is so kind and merciful that in spite of such opulence He played with Arjuna as a friend. Such is the transcendental loving reciprocation between the devotee and the Lord.
The relationship between the living entity and Kṛṣṇa is fixed eternally; it cannot be forgotten, as we can see from the behavior of Arjuna.
Although Arjuna has seen the opulence in the universal form, he cannot forget his friendly relationship with Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 220 / Sripada Srivallabha Charithamrutham - 220 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 41
*🌴. దత్తదీక్షా ప్రహసనం (శ్రీపాదులకు 16ఏళ్ళు) - 2 🌴*
*🌻. దత్త దీక్ష 🌻*
అటు తరువాత ఏ పరిస్థితులలో శ్రీపాదులు పీఠికాపురం వదిలి వెళ్ళారో కూడా చెప్పసాగారు, "ఒకసారి ఒక దత్త భక్తు డైన సన్యాసి కుక్కుటేశ్వరాలయానికి వచ్చారు.
తాను దత్త దీక్షను ఇస్తానని, ఒక మండలం(40)రోజులు దత్తదీక్షను పాటించినట్లయితే అనుకున్న పనులు జరిగి తీరుతాయని ప్రకటించారు.
పీఠికాపుర బ్రాహ్మణులందరు దత్త దీక్షను స్వీకరించి వారికి పెద్ద మొత్తంలో దక్షిణ ఇవ్వసాగారు. అందులో కొంతభాగం ఆయన తిరిగి వారికే ఇవ్వసాగారు. ఈ బ్రాహ్మణులు మిగిలిన కులస్థులనుకూడా దత్తదీక్ష తీసుకొని ఆ సన్యాసికి భారీయెత్తున దక్షిణలనిచ్చి జన్మ చరితార్ధం చేసుకోమని బోధించసాగారు.
ఈ విషయమై బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పరిషత్తులు బాపనార్యులు గారి అధ్యక్షతన సమావేశమయ్యాయి. అందులో బాపనార్యులు గారు దత్తుడు అందరివాడని, అందువల్ల అన్ని కులాల వారు దీక్ష తీసుకోవచ్చని ప్రకటించారు.
కాని బ్రాహ్మణులు అందుకు అంగీకరించక, శూద్రులు అనాచారవంతులు కాబట్టి వారికి దీక్ష ఇవ్వకుండా, కేవలం దక్షిణ మాత్రం తీసుకొని వాళ్ళని తమ శక్తితో ఉద్ధరిస్తామని వాదించారు.
దానికి బాపనార్యులు అనాచారవంతులు అన్ని కులాల్లోను కొద్దోగొప్పో ఉంటారని, ఆ రకంగా దీక్ష లేకుండా ఉద్ధరించ గలిగే పక్షంలో ఏ కులం వారికి ప్రత్యేక దీక్షలు అక్కరలేదని, అయినా భూరి దక్షిణ అని చెప్పి వ్యక్తులను బలవంతపెట్ట కూడదని, అన్ని కులాల్లోను బీదవారు ఉంటారని, యథా శక్తితో సంతోషంగా ఇచ్చే దక్షిణతోనే దత్తుడు ప్రసన్నుల వుతారని తమ అభిప్రాయం వెలిబుచ్చారు.
దక్షిణలలో, సంభావనలలో భాగం పంచుకుంటున్న బ్రాహ్మణులు వాళ్ళ వితండవాదం విడవకుండా, "పరమహంస పరివ్రాజక మహా శయులవంటివారు మన ఊరు వస్తే మేళతాళాలతో, వేద మంత్రాలతో, పూర్ణ కుంభాలతో ఎదురు వెళ్ళి స్వాగతం ఇవ్వకపోగా దక్షిణ విషయంలో వెనకాడడం భావ్యం కాదని," చెప్పి బాపనార్యులను, అప్పలరాజశర్మగార్లను దీక్ష తీసుకొని దక్షిణ యిస్తారా? లేదా? అని నిష్కర్షగా ప్రశ్నించారు.
వారు నిజంగా పరమహంస పరివ్రాజకులంత వారే అయితే ఊరికి రావడానికి ముందే వర్తమానం పంపడం లాంటి కొన్ని పద్ధతులు అనుసరించి ఉండాల్సిందని, బ్రాహ్మణ పరిషత్తు అనేది సామూహిక సమస్యలు, ప్రయోజ నాల గురించి ఆలోచించాలే కాని వ్యక్తిగత శ్రేయస్సు గురించి పట్టించుకోకూడదని, తాము వ్యక్తిగత శ్రేయస్సు కోసం దత్తదీక్ష తీసుకోవడం తమ అభిమతం కాదని, అయితే తక్కినవాళ్ళు వారి అభీష్టం ప్రకారం దత్తదీక్ష తీసుకోవచ్చని బాపనార్యులు తేల్చి చెప్పారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 220 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
CHAPTER 22
*🌻 The Story of Gurudatta Bhatt Only Sripada will give the fruit written in Horoscope - 5 🌻*
Sripada was a good magician. While Mahalaya Pakshas were going on, Shresti who got the promise as well as Bapanarya who gave the promise, forgot this.
On the afternoon of Mahalaya amavasya (on the last day) Shresti had come to Bapanarya’s house. Sripada smiled and said, ‘Promise should not be given.
Once given, the promise should be fulfilled. If the promise was forgotten, atleast the person who got the promise should remind him. I am asking explanation in this context from both of you.’ Thus both realized their mistake.
This incident tells us that Sripada is not only capable of reminding but also capable of making them forget things. Both of them were upset for their fault. Consoling them, Sripada said, I am responsible for your forgetfulness.
Every man has the ‘I’ inside him in the form of ‘chaitanyam’. Jeeva is getting not only the body from the parents but also the chaitanyam called ‘I’.
There is a responsible ‘karma’ to be done by this ‘chaitanyam’ in this universal plan. It will be the bond of karma that is transferred to the son and then to his son and so on for generations.
After taking sanyas ashram only, one is liberated from this bond of karma. This promise need not be fulfilled with this limited name and form. This was transferred to the chaitanyam of the universal ‘I’.
So a person in the descendents of Bapanarya can take food and take dakshina from a person in the descendants of Shresti at any time and in any place. You should not ask me how, when and in what manner it happens.
The form of karma is very difficult to comprehend and is very subtle. Some karmas have the ‘physical time’ and ‘yoga time’ separately.
According to the ‘physical time’, this should have been done in this ‘Mahalaya Paksha’ only. But the ‘yoga time’ has not come. So it was pushed to distant future.”
Thus Sripada advised both of them. I asked Sri Bhatt to tell me in detail about ‘physical time’ (kaalam) and ‘yoga time’ which Sripada told them. Sri Bhatt mahasay said, “Apart from ‘physical kaalam’ and ‘physical desam’, there are ‘manasik kaalam’ and ‘manasik desam.”
In addition, there are ‘yoga kaalam’ and ‘yoga desam’. Suppose one person is having sixty years of age, he may be in continuous study as a 20 year old boy. Then his ‘physical age’ indicates his sixty years.
That is related to his body. But his mental (manasik) age is counted as 20 years. Similarly if a 20 year old young man has the responsibility as that of a 60 year old man, his physical age is 20, but that is related to the body.
His mental age is 60 years. Thus, the physical age and mental (manasik) age need not be the same. They can be different.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 100 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. భాగవత రహస్యము - 2 🌻*
ఎందరు వ్యక్తులున్నారో అన్ని విధములైన ఆదర్శములు వర్తించుచున్న ఈ మహాసముద్రమున ఎవని ఆదర్శము స్వతంత్ర సంచలనము పుట్టింపగలదు? వ్యక్తులలో ఆదర్శములున్నను వ్యక్తులు స్వభావ మహాసముద్రమున మునకలు వేయుచున్నారు.
ఈ రహస్యమునే నారదుడు వ్యాసునకు భాగవత రహస్యముగా బోధించెను. "కొండచిలువచే మ్రింగబడుచున్న ఇద్దరిలో ఒకరినొకరు వెలుపలకు లాగి రక్షింపలేరు" అని నారదుడు హెచ్చరిక చేసెను.
వ్యాసాదులు ఆరాధించినది సృష్టి మహాసముద్రము. అదియే జీవులలోన అంతర్యామియైన నారాయణుడు. అందు అందరును వర్తించుచున్నారు. వానికి అందరును వశులే.
ఈ అంతర్యామితత్త్వము మానవుని బహిరంతర్లోకములలో వ్యాపించియున్నది. దానిని ఆరాధించుచు వ్యాసాదులు రచనలు సాగించిరే గాని, పండితులు, విమర్శకుల, సంఘ సంస్కర్తల మొగములు చూచికాదు.
అట్టి రచనలకు పరిణత స్వరూపమై పరమావధియైన చరమావధిగా రూపుకట్టుకున్నది శ్రీమద్భాగవతము. అది ఈ సృష్టి రూపమున ఉన్న అంతర్యామికి సమర్పితము.
శాశ్వత కాలమునందు వచ్చుచు పోవుచున్న మానవుల మొత్తము స్వభావమైన మానవుడు భాగవతమునకు కథానాయకుడు. అతడు సృష్టి ఆది నుండి నేటి వరకును ఏయే లోకముల దారులలో దిగివచ్చెనో ఆ మొత్తము వైఖరిని అద్దము పట్టిచూపునది భాగవతము.
నారాయణుడు, చతుర్ముఖుడు, స్వాయంభువ మనవు, ఆది వరాహమూర్తి, కపిలాచార్యుడు, విష్ణువు, శివుడు, అంబిక, ధ్రువుడు, పృథు చక్రవర్తి, ప్రహ్లాదుడు, అంబరీషుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అను పాత్రలలో ఇందలి కథానాయకుడు సకల మానవధర్మ సంస్థాపనామూర్తియై రూపుకట్టెను. ఇన్నిటిని శ్రద్ధగా చదువుకున్నచో సృష్టి మొదలు నేటివరకును గల పురుషుడెవ్వడో, అతని శాశ్వత ధర్మస్వరూపమెట్టిదో విశదపడును.
ఈ కథలన్నియు ఒకే నారాయణుని వివిధ ధర్మ గుణముల వివరణములే గాని, వేర్వేరు కథలు కావు. ఇందలి పురుషార్థములను భక్తితో అధ్యయనము చేసినచో మానవునకు తెలియవలసినవి అన్నియు తెలియును.
.....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Masters of Wisdom - The Journey Inside - 122 🌹*
*🌴 The Art of Breathing - 6 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
🌻 The Practice of Breathing Exercises - 2 🌻
While inhaling and exhaling, we should travel through all centers, from the bridge of the nose to the base center. It is a traveling observation, but not a permanent concentration.
The idea behind this is that we become conscious of the existence of the subtle tissues of the body. This way, we can experience them, which enables their power to work through us.
When breathing, we should observe how the inhalation changes into exhalation at a certain point and vice versa. We should try to be focused at each point, but not to cling on to either one.
As soon as we can exercise this with ease, we forget the process itself and enter into the inner worlds.
When we listen to inhalation carefully, we can hear the sound SO; with exhalation, we hear HAM. SO-HAM means SAHA-AHAM, “This, I am.” It is the double-sound of the pulsation.
To listen to this double-sound of the pulsating principle is called the meditation of the soul.
This is the basic work. If we do it regularly for several years, Prana becomes regulated and we enter into our center.
🌻 🌻 🌻 🌻 🌻 🌻
Sources used: Master K.P. Kumar: On Healing / Hercules / notes from seminars.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 36 / Sri Lalita Sahasranamavali - Meaning - 36 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. శ్లోకం 68*
289. శ్రుతిసీమంత సిందూరీకృత పాదాబ్జధూళికా -
వేదములనెడు స్త్రీలయొక్క పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిఅన్ పాదపద్మము యొక్క ధూళిని కలిగినది.
290. సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా -
అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము.
*🌻. శ్లోకం 69*
291. పురుషార్థప్రదా -
పురుషునకు కావలసిన ప్రయోజనములను చక్కగా ఇచ్చునది.
292. పూర్ణా - పూర్ణురాలు.
293. భోగినీ -
భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది.
294. భువనేశ్వరీ -
చతుర్దశ భువనములకు అధినాథురాలు.
295. అంబికా - తల్లి.
296. అనాదినిధనా -
ఆది, అంతము లేనిది.
297. హరిబ్రహ్మేంద్ర సేవితా -
విష్ణువు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవింపబడునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 36 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 Sahasra Namavali - 36 🌻*
289 ) Sruthi seemantha kula sindhoori kritha padabjha dhooliga -
She whose dust from her lotus feet is the sindhoora fills up in the parting of the hair of the Vedic mother
290 ) Sakalagama sandoha shukthi samputa maukthika -
She who is like the pearl in the pearl holding shell of Vedas
291 ) Purashartha pradha -
She who gives us the purusharthas of Charity, assets, joy and moksha
292 ) Poorna -
She who is complete
293 ) Bhogini -
She who enjoys pleasures
294 ) Bhuvaneshwari -
She who is the Goddess presiding over the universe
295 ) Ambika -
She who is the mother of the world
296 ) Anadhi nidhana -
She who does not have either end or beginning
297 ) Hari brahmendra sevitha -
She who is served by Gods like Vishnu,Indra and Brahma
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 39 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రథమాధ్యాయం - సూత్రము - 25
*🌻. 25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా - 2 🌻*
అన్ని మార్గాలలో భక్తి మార్గం సులభం. ఇది ఎక్కువ మందికి సాధ్యంగా కనిపిస్తుంది. గమ్యమైన మోక్షం అన్ని యోగాలలో ఒక్కటే అయినా సాధన మార్గాలు భిన్నం.
ఒక్కొక్క మార్గం ఒక్కొక్కరికి కష్టమైతే, మరొక్కరికి సులభం అనిపిస్తుంది. భక్తిమార్గం మాత్రం సాధనలోకి వెంటనే ప్రవేశించడం వరకు అందరకూ తేలికే.
సాధన విషయానికి వస్తే అన్ని మార్గాలలోనూ అహంకార, మమకారాలను విడచిపెట్టి సంసార బంధం నుంచి విముక్తి పొందడం తప్పనిసరి. మోక్షం అనేది సాధనకు ఫలం కాదు. సాధనకు ఫలం బంధ విముక్తి.
బంధ విముక్తికై వారి వారి జన్మాంతర సంస్కారాలను బట్టి కొందరు జ్ఞానమార్గంలోను, మరికొందరు భక్తి మార్గంలోను, ఇంకా కొందరు యోగ మార్గం లోను సాధన చేస్తూ ఉంటారు.
ఎవరికి ఇష్టమైనది వారికి సులభం. ఇష్టం కానిది కష్టం. వీటిలో ఏది గొప్ప మార్గమో నిర్ణయించడం కష్టం.
పాతంజలి యోగమార్గం చిత్త వృత్తి నిరోధమే ప్రధానమంటుంది. ఇక్కడ బ్రహ్మానందానికి బదులు శూన్యత ఏర్పడుతుంది. దీనిని తమః ప్రధాన సమాధి అని కొందరు అంటారు.
కపిలుని సాంఖ్యం నిత్యమైన ఆత్మయే తానని, అనిత్యమైన దేహేంద్రియాలు తాను కాదని నిర్ణయిస్తుంది. తద్వారా పరోక్ష జ్ఞానం, పాండిత్యం కలుగుతాయి గాని, అపరోక్షానుభూతి కష్టతరమవుతుంది.
భక్తి మార్గమైతే అందరికీ అందుబాటులో ఉండి అవగాహన అవుతుంది. హృదయమంతా భగవంతునితో నింపుకోగలిగితే, పారవశ్యంలో దేహాదులను మరిస్తే, భక్తుడు గమ్యం చేరవచ్చు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. VEDA UPANISHAD SUKTHAM - 63 🌹*
*🌻 1. Annapurna Upanishad - 24 🌻*
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj
V-41. Due to the activity and inactivity of the vital breaths does empirical life start and subside. Through drill and application, reduce it to inactivity.
V-42. Due to the active and passive phases of ignorance do activities get started and cease. Dissolve it (ignorance) forcefully by winning a teacher and the instructions of the Shastras.
V-43. By a mere quiver of the non-objective knowledge or by the suppression of vital breaths is mind reduced to mindlessness; that is the supreme status.
V-44. Through the perception of Brahman, infallibly directed to it (bliss), behold that real bliss occasioned by the visioning of the knowable (as Brahman).
V-45. That indeed is the non-factitious bliss which the mind does not reach; it is free from decline and growth; it neither rises nor sets.
V-46. The mind of the knower is not called mind; mind indeed is the Truth of Spirit. Therefore, in the Fourth state, it transcends that state.
V-47. Having renounced all mental constructions, equable, and with a quiescent mind, be a sage, wedded to the Yoga of renunciation, possessing both knowledge and freedom.
V-48. The supreme Brahman is that which conforms to no act of mentation. (It is what remains) when mental activities completely die down and all masses of latent impulses have been liquidated.
V-49. By securing right knowledge, and by unremitting concentration, those who become enlightened in the wisdom of the Upanishads are the Sankhyas and the others are the Yogins.
V-50. Those are the Yogins, versed in Yoga, who, after the quiescence of the breaths through ascetic practices, achieve the status above sufferings, beginningless and endless.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 5 / The Siva-Gita - 5 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 4 🌻*
13. తతో న జాయతే భక్తి - శ్శివే కస్యాపి దేహినః,
తస్మాద విదుషో నైవ - జాయతే శూల పాణినః
14. యధా కధం చిజ్ఞాతాపి మధ్యే విచ్చిధ్యతే నృణామ్,
జాతం వాసి శివ జ్ఞానం - విశ్వాసం నభ జత్యలమ్
అందుచేత నెవడి కైనను, పరమ శివుని పై భక్తి యంకురింపదు. ఆ కతంబున, పరమ శివుని పై భక్తి కలుగ కుండును. ఇది నిస్సందేహము అట్లు కాకుండ యే ప్రకారము గానో ఎంతో ప్రయత్నము తోడనో పరమ శివుని పై భక్తి కలిగినా, అది మధ్యనే కొంత సమయమునకు అనేక అడ్డంకు లేర్పడి నిష్పలమగును. అటుల కానిచో భక్తి చేత ప్రేమ అంకురించుట క్వాచిత్కము.
15. యద్యేవ్యం దేవతా విఘ్నమా చ రన్తి తనూబృతామ్,
పౌరుషం తత్ర కస్యాస్తి - యేన ముక్తిర్భ విష్యతి?
సత్యం సూతాత్మజ! బ్రూహి - తత్రో పాయోస్తి వానవా ?
అది విని, శౌనకాదులు సూతుని గురించి యిట్లు పలికిరి ! ఓయీ సూతకుమారా! ఈ విధముగా నమరులు తమ యధికారము మేరకు తృప్తి నొందని మానవు లాచరించు జ్ఞాన పద్దతికి పలు అడ్డంకులు కలిగించిన ముక్తి పదంబును పొందుటెట్లు.?
పౌరుషము కలవాడు (పట్టుదల కలవారు ) వారొడ్డిన ఆటంకములను తొలగించే మార్గమేదైన కలదా ? అట్లుండినచో నా విధము మాకు తెలుపుమని అడుగగా సూతుండిట్లు పలికెను :
16. కోటి జన్మార్జి తై: పుణ్యై - శ్శివే భక్తి: ప్రజాయతే
ఇష్టా పూర్తా కర్మాణి - తేనా చరతి మానవః
కోటి జన్మల నుండి సంగ్రహించిన పుణ్య ఫలము (సుకృతము వలన ) మహేశ్వరుని పై భక్తి కుదురుతుంది.
అందుచేత (ఆ కారణమున ) మానవుడు తన ఇష్టానుసారముగా అనుష్టానము నాచరించుట, తటాకములను ద్రవ్వించుట, వృక్షములను నాటించుట చలి వేంద్రములను పెట్టించుట, క్షుదార్తులకు అన్న సత్రములను పెట్టించుట మొదలగు పుణ్య కార్యములను చేయ బూనెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 5 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 01:
*🌻 Bhakti Niroopana Yoga - 4 🌻*
13. 14. That's why Devotion for Parama Shiva doesn't take birth in anyone, due to the Gods devotion for Shiva
doesn't remain constant. In case with a lot of efforts if someone manages to gain devotion for Lord Shiva,
due to the disruption from the demigods, the devotion gets interrupted. But when that doesn't happen, Love
for Lord Shiva emerges out of the devotion.
15. Hearing all these from Suta, Saunakadi Munis questioned Suta in this manner: Hey Sutakumara! If in this manner Gods of heaven keep obstructing humans from walking on the path of Gyana, how would humans
attain salvation? For tenacious people is there any way to nullify the obstructions caused by Gods? If such
an alternative exists to escape the disturbances from gods, kindly preach that tos us.To their questions,
Suta answered this way:
16. One gets devotion towards Maheshwara only if he has accumulated Virtues over the past crores of births.
Due to that devotion he performs many tasks for the sake of the humanity.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 10 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. గోవుల కోసం రేఖ 🌻*
అయితే తాను కాలజ్ఞాన గ్రంధం రాయడంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతూ ఉండేవి. ఇలా జరగకుండా వుండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు. ”ఈ వలయం దాటి మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు” అని గోవులను ఆదేశించాడు. తర్వాత ప్రశాంతంగా తన కాలజ్ఞానాన్ని కొనసాగించారు.
పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు.ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది.
ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకుని కొండకు బయల్దేరారు వీరబ్రహ్మేంద్రస్వామి.
యధాప్రకారం గోవుల చుట్టూ ఒక వలయం గీసి, కాలజ్ఞానం రాసుకునేందుకు తాటియాకులు, చెట్ల ముళ్ళు కోసుకుని కొండ గుహలోకి వెళ్ళిపోయారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది.
తన దగ్గర గోవులకాపరిగా పనిచేస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ.
కానీ, గుహలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి భయపడింది. తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆవిడ భయపడింది. అప్పటికి ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది.
వీరబ్రహ్మేంద్రస్వామి గోవులను తోలుకుని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించి, తెలీక తాను చేసిన తప్పులన్నిటినీ మన్నించమని కోరింది.
”నాకు దూషణ అయినా, భూషణ అయినా ఒక్కటే. నీవయినా, తల్లి అయినా ఒక్కటే. ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే” అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ.
ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలు లేదని, సమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలనని, చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆరోజు కోసం ఎదురుచూడసాగింది అచ్చమ్మ.
వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రం యధాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి, అచ్చంమగారి ఇంటిలో ఒకచోట పాతిపెడుతూ ఉండేవారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. సౌందర్య లహరి - 47 / Soundarya Lahari - 47 🌹
📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ
47 వ శ్లోకము
🌴. ఇష్ట దేవత సాక్షాత్కారం, సకల ప్రయత్నాల యందు సఫలత 🌴
శ్లో:47. బ్రువౌ భుగ్నే కించి ద్భువన భయ భంగ వ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచి భ్యాం ధృతగుణమ్l
ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్టే ముష్టౌచ స్థగయతి నిగూఢాంతరముమేll
🌻. తాత్పర్యము :
అమ్మా ! భువనమును భయముల నుండి పోగొట్టు ఓ పార్వతీ దేవీ, కొంచెముగా వంగిన నీ కనుబొమ్మలు తుమ్మెదల గుంపు అల్లెత్రాడు వలె వరుసకట్టి కుడిచేతితో పట్టుకుని ముంజేయి కప్పినట్టి రతీదేవి భర్త అయిన మన్మధుని విల్లుని తలపిస్తున్నాయి. విల్లు వలె భాసిస్తున్నాయి. కదా !
🌻. జప విధానం - నైవేద్యం :--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 25 రోజులు జపం చేస్తూ, కొబ్బరికాయ, పండ్లు, తేనె నివేదించినచో ఇష్ట దేవత సాక్షాత్కారం, సకల ప్రయత్నాల యందు సఫలత లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SOUNDARYA LAHARI - 47 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 47
🌴 Obtaining grace of God and Victory in all efforts 🌴
47. Bhruvau bhugne kinchit bhuvana-bhaya-bhanga-vyasanini Tvadhiye nethrabhyam madhukara-ruchibhyam dhrita-gunam; Dhanur manye savye'tara-kara-grhitam rathipateh Prakoshte mushtau ca sthagayati nigudha'ntharam ume
🌻 Translation :
Oh goddess Uma, she who removes fear from the world, the slightly bent eye brows of yours, tied by a hoard of honey bees forming the string feel resembles the bow of the god of love held by his left hand .and having hidden middle part, hid by the wrist, and folded fingers.
🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 25 days, offering honey, fruits and coconut as prasadam, it is believed that they will be achieve success in all efforts and can have darshan of deity.
🌻 BENEFICIAL RESULTS:
Obtaining grace of God and all round success.
🌻 Literal Results:
Deep insight, intellect and control over situations and people.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 346 / Bhagavad-Gita - 346 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 27 🌴*
27. యత్కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కొన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ||
🌷. తాత్పర్యం :
ఓ కౌన్తేయ! నీవు ఏది ఒనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను,ఏ తపస్సు నాచరించినను వాటన్నింటిని నాకు అర్పణముగా ఒనరింపుము.
🌷. భాష్యము :
ఎట్టి పరిస్థితి యందును శ్రీకృష్ణభగవానుని మరవకుండునట్లుగా జీవితమును మలచుకొనుట ప్రతియొక్కరి ధర్మము. దేహపోషణ కొరకు ప్రతియొక్కరు కర్మ చేయవలసియే ఉన్నందున తనకొరకు కర్మ చేయుమని శ్రీకృష్ణుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు.
జీవనముకై ఆహారమును భుజించుట అవసరము గనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమునే ప్రసాదరూపమున మనుజుడు గ్రహింపవలెను. అదే విధముగా నాగరికుడైన మనుజుడు ధర్మకార్యములను ఒనరింపవలసియున్నందున వానిని తన కొరకే చేయుమని శ్రీకృష్ణుడు పలుకుచున్నాడు. అదియే అర్చనము.
ప్రతియొక్కరు ఏదియో ఒకదానిని దానమిచ్చు స్వభావమును కలిగియుందురు కావున దానిని తనకే ఒసగుమని శ్రీకృష్ణుడు ఉపదేశించుచున్నాడు. అనగా అధికముగా ప్రోగుపడిన ధనమును మనుజుడు కృష్ణచైతన్యోద్యమపు ప్రచారము కొరకై వినియోగించవలెను.
ధ్యానము ఈ యోగమునకు ఆచరణయోగ్యము కానిదైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు.
కనుక ఎవరైనను హరేకృష్ణ మాహా మంత్రమును జపమాలపై జపించుచు శ్రీకృష్ణుని ఇరువదినాలుగుగంటలు ధ్యానింపగలిగినచో భగవద్గీత యందలి షష్టాధ్యాయమున వివరింపబడినట్లు గొప్ప ధ్యానతత్పరుడు మరియు గొప్పయోగి కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 346 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 27 🌴*
27. yat karoṣi yad aśnāsi
yaj juhoṣi dadāsi yat
yat tapasyasi kaunteya
tat kuruṣva mad-arpaṇam
🌷 Translation :
Whatever you do, whatever you eat, whatever you offer or give away, and whatever austerities you perform – do that, O son of Kuntī, as an offering to Me.
🌹 Purport :
Thus, it is the duty of everyone to mold his life in such a way that he will not forget Kṛṣṇa in any circumstance.
Everyone has to work for maintenance of his body and soul together, and Kṛṣṇa recommends herein that one should work for Him.
Everyone has to eat something to live; therefore he should accept the remnants of foodstuffs offered to Kṛṣṇa.
Any civilized man has to perform some religious ritualistic ceremonies; therefore Kṛṣṇa recommends, “Do it for Me,” and this is called arcana.
Everyone has a tendency to give something in charity; Kṛṣṇa says, “Give it to Me,” and this means that all surplus money accumulated should be utilized in furthering the Kṛṣṇa consciousness movement.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 174 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴*
39. అధ్యాయము - 14
*🌻. శివపూజ - 7 🌻*
సంతతి ర్వర్థతే తస్య యది లక్షావధిః కృతా | ద్రోణార్థేన భవేల్లక్షం విధానం విధిపూర్వకమ్ || 50
ముద్గానాం పూజనే దేవశ్శివో యచ్ఛతి సుఖమ్ | ప్రస్థానాం సప్తకేనైవ ప్రస్థార్ధేనాథ వా పునః || 51
పల ద్వయముతే నైవ లక్షముక్తం పురాతనైః | బ్రాహ్మణాశ్చ తథా భోజ్యా రుద్ర సంఖ్యా ప్రమాణతః || 52
ప్రియంగు పూజ నాదేవ ధర్మాధ్యక్షే పరాత్మని | ధర్మార్థ కామా వర్థంతే పూజా సర్వ సుఖావహా || 53
ప్రస్థైకేన చ తస్యోక్తం లక్షమేకం పురాతనైః | బ్రహ్మ భోజం తథా ప్రోక్తమర్క సంఖ్యా ప్రమాణతః || 54
లక్ష పరిమాణము గల బియ్యమును అర్పించు భక్తునికి సంతానము వర్ధిల్లును. ద్రోణము అనే పరిమాణములో సగము లక్ష అగును. ఇది శాస్త్రీయ విధానము (50).
పెసలతో పూజించినచో శివుడు సుఖము నిచ్చును. ఏడున్నర ప్రస్థములకు (51)
రెండు పలములను కలిపినచో లక్ష అగునని పూర్వర్షులు చెప్పిరి. మరియు, పదకొండు మంది బ్రాహ్మణులకు భోజనము నిడవలెను (52).
ధర్మాధ్యక్షుడు, పరమాత్మయగు శివునకు ప్రియంగు ధాన్యము (కొర్ర ధాన్యము) ను సమర్పించినచో, ధర్మార్థకామములు వర్దిల్లి, సర్వసుఖములు కలుగును (53).
ఈ ధాన్యమును ఒక ప్రస్థముతో కూడ ఒక లక్ష ప్రమాణములో అర్పించవలెనని పూర్వర్షులు చెప్పిరి. మరియు పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనము నిడవలెనని చెప్పబడినది (54).
రాజి కాపూజనం శంభోశ్శత్రోర్మృత్యుకరం స్మృతమ్ | సార్షపానాం తథా లక్షం పలైర్వింశతి సంఖ్యయా || 55
తేషాం చ పూజనాదేవ శత్రోర్మృత్యురుదాహృతః |ఆఢీకానాం దలైశ్చైవ శోభయిత్వార్చయేచ్ఛివమ్ || 56
వృతా గౌశ్చ ప్రదాతవ్యా బలీవర్దస్తథైవ చ | మహిచసంభవా పూజా శత్రోర్నాశకరీ స్మృతా || 57
నానా సుఖకరీ హ్యేషా పూజా సర్వఫలప్రదా | ధాన్యానామితి ప్రోక్తం మయా తే మునిసత్తమ || 58
శంభుని నల్ల ఆవాలతో పూజించినచో శత్రువు మృత్యువును పొందును. ఇరువది పలముల తెల్ల ఆవాలు ఒక లక్ష మానమగును. (55).
లక్ష ఆవాలతో శివుని పూజించుట తోడనే శత్రువు నశించును. కందిపువ్వుల దళములతో శివుని అలంకరించి పూజిచవలెను (56).
దూడతో కూడిన ఆవును, ఎద్దును దానము చేయవలెను. మిరియాలతో పూజించినచో శత్రువు నశించునని చెప్పబడినది (57).
ఈ పూజ సర్వసుఖములను, సర్వఫలములను ఇచ్చును. ఓ మునిశ్రేష్ఠా! నేను నీకింతవరకు ధాన్యములతో పూజచేయు విధమును తెలిపితిని (58).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 51 🌹*
Chapter 13
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj
*🌻 The Winding and Unwinding of Sanskaras - 3 🌻*
The path to God is straight like a rod. One has to travel straight from one end of the rod to reach the other end.
If one has natural sanskaras, he follows the force which prope him on his journey, and so he reaches t unnatural sanskaras, he cannot help but zig he other end soon.
But if one has zag his way and he inevitably remains stuck in the same place. These unnatural sanskaras are like a rope that wraps itself tighter and tighter around the same spot, and one canno t continue his progress along the length of the rod.
The natural sanskaras are also like a rope, but they wrap progressively around and around the rod, reaching further and further toward the end. In the gross world, physical actions are necessary. In the subtle and mental worlds, subtle and mental actions are necessary.
Physical actions produce gross impressions, and if the physical actions are not natural, but are unnatural, then one gets very firmly bound in the gross world.
One is stuck in the gross wo rld, and it becomes virtually impossible for that person to progress toward the subtle and mental worlds. When the Avatar comes as a man it is in order to wipe out these unnatural impressions, and he wipes out these impressions by severing them.
Since these unnatural impressions have been produced by physical actions, the Avatar also has to perform physical actions to annihilate them.
Annihilation of unnatural sanskaras is his physical work in the gross world, and it is only when these unnatural knots of human consciousness are severed that we see he has come with a sword!
For his work in the subtle and mental planes, the Avatar does not have to exert. It is only for the gross world that he must exert, and when he exerts, he suffers in order to cut through the unnaturalness in human consciousness.
When his sword severs, it severs through to the root. The Avatar cuts through all the unnaturalness in the world, and gradually makes a path that becomes clear and natural for mankind to follow.
These unnatural sanskaras are called the "sins of the world," natural sanskaras are called the because they are obstructions to the path of Truth.
The "seeds of destiny," because they are what is necessary and essential for making the journey toward God. These unnatural sanskaras are obstructions in human consciousness in approaching the path of Truth, and because of them little progress in consciousness is ever made until the sword of Truth has severed their knots.
The unnatural sanskaras are always the obstruction s on the road toward Truth. The poor man who is afflicted with unnatural sanskaras walks on a road of thorns. When one gets thorns stuck in his foot, one cannot move on in his journey until the thorns are removed.
At this time the man calls out for help to remove them. The Avatar comes and uses a thorn to remove the thorns. Until the thorns are removed, further progress along the road is not possible.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 47 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 23
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆదిమూర్త్యాది పూజావిధి - 1 🌻*
*సర్వకార్య జయమునకు*
అథ త్రయోవింశో೭ధ్యాయః
అథాదిమూర్త్యాదిపూజావిధికథనమ్
నారద ఉవాచ:
వక్ష్యే పూజావిధిం విప్రా యం కృత్వా సర్వమాప్నుయాత్ | ప్రక్షాలితాం ఘ్రిరాచమ్య వాగ్యతః కృతరక్షణః 1
ప్రాజ్ముఖః స్వస్తికం బద్ద్వా పద్మాద్యపరమేవ వా | 2
యం భీజం నాభిమధ్యస్థం ధూమ్రం చణ్డానిలాత్మకమ్.
విశోషయేదశేషం తు ధ్యాయన్కాయత్తు కల్మషమ్ |
నారదుడు పలికెను.
విప్రులారా! ఏ పూజావిధిచే సర్వకార్యకామములును లభించునో దానిని చెప్పెదను. పాదప్రక్షాళనము చేసికొని, ఆచమనము చేసి, మౌన మవలంబించి, రక్ష చేసికొని, తూర్పుగా తిరిగి, స్వస్తికాసనమునందు కాని, పద్మాననము నందు గాని, మరొక ఆసనమునందు కాని కూర్చుండి, నాభి మధ్యలో నున్నదియు, ధూమ్రవర్ణము కలదియు, తీవ్ర వాయురూప మైనదియు అగు "యం" బీజమును ధ్యానించుచు శరీరమునుండి సకలకల్మషములను శోషింపచేయవలెను
క్షౌం హృత్పంజ్వజమధ్యస్థం బీజం తేజోనిధిం స్మరన్ 3
అథోర్ధ్వతిర్యగ్గాభీస్తు జ్వాలాభిః కల్మషం దహేత్ |
హృదయపద్మ మధ్యమునందున్న తేజోనిధి యగు "క్షౌం" అను బీజమును స్మరించుచు, క్రిందికిని, పైకిని, అడ్డముగను ప్రసరించే జ్వాలలచే కల్మషమును దహించవలెను.
శశజ్కాకృతివద్ధ్యాయేదమ్భరస్థం సుధామ్భుభిః 4
హృత్పద్మవ్యాపిభిర్దేహం స్వకమాప్లాపయేత్సుధీః | సుఘమ్నాయోనిమర్గేణ సర్వనాడీవిసర్పిభి. 5
ఆకాశమునందు చంద్రుని ఆకారము వంటి ఆకారమును ధ్యానము చేయవలెను.
దాని నుండి స్రవించుచున్నదియు, సుఘమ్నా నాడిద్వారా సమస్త నాడులందును వ్యాపించుచున్నదియు, హృదయ పద్మమును వ్యాపించుచున్నవియు ఆగు అమృతధారలచేత తన దేహమును ని పవలెను 4, 5
శోధయిత్వా న్య సేత్తత్త్వం కరశుద్ధిరథాస్త్రకమ్ | వ్యాపకం హస్తయోరాదో దక్షిణాఙ్గుష్ఠతోఙ్గకమ్ 6
మూలం దేహే ద్వాదశాఙ్గం న్యసేన్మన్త్రైర్ధ్విషట్కకైః | హృదయం చ శిరశ్చైవ శిఖావర్మాస్త్రలోచనే 7
ఉదరం చ తథా పృష్ఠం బాహూరూ జానుపాదకమ్ |
ముద్రాం దత్త్వా స్మర్వేద్వివ్ణుం జప్త్వాష్టశతమర్చయేత్. 8
శోధనము చేసి తత్త్వనానము చేయవలెను. పిమ్మట కరశుద్ధి కొరకు అస్త్రవ్యాపకముద్రలను, చేయవలెను. కుడిచేతి ఆంగుష్ఠమునుండి కరతలము వరకు న్యాసము చేయవలెను.
దేహమునందు పన్నెండు అక్షరముల మూల మంత్రముతో హృదయము, శిరస్సు, శిఖ వర్మ, అస్త్రము, నేత్రములు, ఉదరము, శరీరము వెనుక భాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్లు, పాదములు అను ద్వాదశాంగములపై న్యాసము చేయవలెను ముద్రనిచ్చి విష్ణువును స్మరించి, ఆష్టోత్తరశతజపము చేసి పూజింపవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 62 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 7 🌻*
13. పతితో సహగమనం చేసిన సతి స్వర్గసుఖాన్ని అనుభవిస్తుంది. కానీ బ్రాహ్మణస్త్రీ సహగమనం చేయకూడాదు. తపస్సు, యోగమును అనుసరించి తాను విరాగినిగా ఉండవలసిందే! బ్రాహ్మణస్తీకి సహగమన నిషేధం ఎందుకంటే, స్వర్గసుఖంకోరి భర్తతో వెళ్ళకూడదని. తను వేరుగా తన జీవుడియొక్క మార్గాన్ని అనుసరించి వెళ్ళవలసిందే!
అసలు విషయం ఏమిటంటే, మనుధర్మశాస్త్రానికి పూర్వం ఉండేటటువంటి ధర్మశాస్త్రములు అత్యుత్తమమైనవని, మనుధర్మశాస్త్రం అత్యుత్తమంకాదు అని అంగిరసుడు చెప్పాడని తరువాతివారు ఉదహరించారు.
14. అంగిరసుడిని ఇంద్రాగ్నితుల్యుడని చెప్పింది ఋగ్వేదం. అగ్ని అంగిరసుడేనని మరొకచోట చెప్పింది. అంగిరసుడె మొదట అగ్నిని ఆవాహనముచేసి మథించి గౌరవించినట్లు సుస్పష్టంగా తెలుస్తున్నది.
అగ్నిదేవుడికి అంగిరసుడంటే చాలా గౌరవము. అందుచేతనె యజ్ఞ యాగాదులలో అంగిరసులచే ప్రోక్తమైన పద్ధతిలో ఆవాహనముచేస్తేనే అగ్ని తృప్తిచెందుతాడని సంప్రదాయంగా అనుకుంటారు. అంటే అంగిరసుడు చెప్పిన విధంగా అగ్నిని ఆవాహనచేస్తేనే అగ్ని ప్రసన్నుడవుతాడు.
అధర్వణవేదంలో వాళ్ళను దేవతలుగాను, పితృదేవతలుగాను స్తోత్రంచేసారు. వాళ్ళను మహర్షులుగాను పేర్కొన్నారు. అంటే అంగిరసులు దేవతలు, పిత్రుదేవతలు, మహర్షులు అని మూడువిధాలుగా పేర్కొనబడ్డారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 126 🌹*
✍️ Nisargadatta Maharaj
📚. Prasad Bharadwaj
*🌻 All you need is to be aware of Being 🌻*
After all, you are what you are every moment of your life, but you are never conscious of it, except, maybe, at the point of awakening from sleep.
All you need is to be aware of being, not as a verbal statement, but as an ever-present fact.
The awareness that you are will open your eyes to what you are. It is all very simple. First of all, establish a constant contact with your self, be with yourself all the time.
Into self-awareness all blessings flow. Begin as a center of observation, deliberate cognizance, and grow into a center of love in action.
‘I am’ is a tiny seed which will grow into a mighty tree—quite naturally, without a trace of effort.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మనోశక్తి - Mind Power - 65 🌹*
*Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 Q 60:--మానవ దేహం యొక్క చరిత్ర - 1 🌻*
Ans :--
1) అంతర్ ప్రపంచాన్ని,జీవక్రియలను,
ప్రాణశక్తిని, విశ్వశక్తిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి అనుగుణంగా మన దేహంలోని జీవకణాల genetic నిర్మాణం ఉంది. మన దేహమంతా చైతన్య పదార్ధంతో నిండి ఉంది.
2) మానవ దేహం కొన్ని కోట్ల పరమాణువులు వల్ల ఏర్పడింది. పరమాణువులో electrons, protons, neutrons వుంటాయని మనందరికీ తెలుసు.
భూమికి,సూర్యునికి మధ్య చైతన్యశక్తి ఉండటం వల్ల వాటి మధ్య ఆకర్షణ కలిగింది. అలానే దేహంలోని ప్రతి పరమాణువు లోనూ కేంద్రకానికి ఎలక్ట్రాన్ కి మధ్య ఖాళీ ప్రదేశంలో కూడా చైతన్య శక్తి ఉంది. ఈ శక్తి వల్లే ఆకర్షణ కలిగి మన దేహం నిలిచి ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో పరమాణువు లోని electron కూడా తన చుట్టూ తాను తిరుగుతూ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
3) భూమికి సూర్యునికి మధ్య ఎంత దూరం ఉందో, పరమాణువు లోని కేంద్రకానికి electron కి మధ్య అంతే దూరం ఉంది.
4) భూమి మీదకు మానవులు ఎలాగైతే వివిధ దేహాకృతులతో వచ్చారో అలానే జంతువులు కూడా వివిధ దేహాకృతులతో భూమి మీదకు వచ్చాయి. ఈ రెండిటిలోనూ ఉన్నది ఆత్మే. ఈ రెండు జాతులు ఒకే పదార్ధంతో నిర్మింపబడ్డాయి..
5) భూమి మీద ఒక దేహాకృతిని తీసుకున్న జీవజాతి కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఫలానా దేహాకృతి ద్వారా చైతన్య పరిణామం జరుగట్లేదన్నప్పుడు ఆ జీవజాతి భూమి మీద నుండి నిష్క్రమించి ఇంకో లోకానికి పయనం అవుతాయి. అక్కడ ఆ లోకానికి అనుగుణంగా దేహాన్ని ఏర్పరుచుకుని చైతన్య పరిణామం చెందుతాయి.
ఇప్పుడు మనం కలిగివున్న మానవదేహం కూడా ఆత్మ చైతన్య పరిణామం (అనగా ప్రేమ, కరుణ లో ఉన్నతి సాధించడం ఒక కృష్ణుడి లాగా) చెందడం కోసమే భూమి మీద సృష్టింపబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 5 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
నచికేతుడు ఏం చేశాడు? మొదటి వరం అడిగాడు. ఓ వైవస్వతా! నా తండ్రి నన్ను మీ ఇంటికి పంపిన తరువాత నన్ను గురించి చింతించు చుండును.
కావున నా తండ్రి ఎటువంటి చింతన లేక, ప్రసన్న చిత్తంతో ఉండునటుల అనుగ్రహింపుము. మరియు మీరు నన్ను తిరిగి ఇంటికి పంపినప్పుడు, నా తండ్రి నన్ను బాగుగా గుర్తించి, ప్రేమతో మాట్లాడునట్లు అనుగ్రహింపుము...
ఎవరైనా మనల్ని వరం కోరుకోమంటే మనం ఏం అడుగుతాం? ముందు నా సంగతి ఏంటో చూడండి బాబూ అంటాం. అంతేనా కాదా? సర్వజీవులు అన్నీ కూడా స్వసుఖం అనేటువంటి దానిచేత ప్రేరేపితమై మాట్లాడుతూ వుంటాయి.
ఇక్కడ ఓ జ్ఞానీ! అని ఈ నచికేతుడిని ఎందుకు సంబోధించారో ఇప్పుడు ఈ మొదటి వరం అడగడంలోనే మనం తెలుసుకోవాలి. తను నిజానికి తండ్రి చేత బాధించబడి పంపబడ్డాడు. కానీ తండ్రి యొక్క క్షేమాన్ని కాంక్షించాడు మొట్టమొదట.
తనకు ఆయన గురువుగారు. తండ్రి మాత్రమే కాకుండా తపస్వి, గురువుగారు. ఆయన యొక్క అనుమతి వల్లనే ఆ యమాలయమునకు రాగలిగాడు.
ఈ సత్యాన్ని గ్రహించినటువంటి నచికేతుడు మొట్టమొదట వరాన్ని ఏ దిశగా కోరాడు? అంటే, తన గురువుగారు సంతోషంగా వుండాలి. అంతే కాకుండా తన యెడల వ్యగ్రత భావాన్ని లేకుండా తనను చూడాలి.
ఆ వరం కోరే విధానం కూడా ఎలా అడిగాడో చూడండి. ఆయన అభ్యర్థించాడు వరములు కోరుకోమని, ఈయన కోరికలు కూడా ఎంతో వినయశీలియై అభ్యర్థించాడు. ఇది చాలా ముఖ్యం.
మనం పిల్లల్ని ఏమైనా నీకేమి కావాలో కోరుకోరా అని అడిగేప్పడు కూడా మనలో అహం వ్యక్తమౌతుంది. ఇచ్చేచేయి నాదనేటటువంటి అహం పనిచేస్తుంది.
అడిగేవాడు కూడా అధికారంతోటి అడుగుతున్నాను. హక్కుగా అడుగుతున్నాను అనుకుంటాడు. కానీ, ఇచ్చేవారిలోనూ వినయశీలత, పుచ్చుకునే వారిలోనూ వినయశీలత ఎప్పుడైతే వుంటుందో ఇద్దరిలోనూ దివ్యత్వం రాణిస్తుంది.
మీరందరూ ఇంట్లో గృహస్థుగా మీరు సాధారణంగా రోజూ చేసే పని ఏమిటీ అనంటే, అన్నం వండుతారు, మీ భార్య పిల్లలు మీ భర్త గారు అందరూ కలిసి భోజనం చేసే ప్రయత్నం చేస్తారు.
సాధారణంగా గృహిణి స్థానంలో వున్నటువంటి భార్యగారు అందరికీ ఆహర సేవలను అందిస్తూ, వారికి అన్నీ వడ్డిస్తారన్నమాట! వడ్డించేటప్పడు ఎలా వడ్డించాలి? తినేటప్పుడు ఎలా వుండాలి? ఒక సేవను అందించేటప్పుడు ఎలా అందించాలి? అనేది చాలా ముఖ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ‘ఇచ్చే చేయి నాది’ అనే అహం ఉండకూడదు. ‘చేసేవాడను నేను, నేనే చేస్తున్నాను’ అనే అహంతో చేయకూడదు.
అలా గనుక చేశావనుకో అప్పుడు ఈశ్వరానుగ్రహానికి దూరం అవుతావు. పొందేవారు కూడా, సేవలను పొందేవారు కూడా ఈశ్వర ప్రసాదంగా ఆ సేవలను పొందాలి.
కానీ భౌతికమైన, ఐహికమైన, సుఖభోగ ఇంద్రియ లాలసతో ఆ ఇంద్రియ విషయార్థములుగా వాటిని స్వీకరించకూడదు. ఈ రకంగా ఒకరి యెడల మరొకరు మానవ సంబంధాలలో దివ్యత్వాన్ని అనుగమించేటటువంటి ప్రతిక్షేపణ చేసుకోవాలి.
ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే మనం అనుభూతం ఒనర్చుకునేటటువంటి పద్ధతిగా ఈ మానవసంబంధాలని కలిగివుంటావో అప్పుడు ప్రతి చోట మానవుడు దైవీ స్వరూపుడిగా మారిపోతాడు. నువ్వు దైవీభావనలోకి మారిపోతావు. ప్రతి చోట ‘నేను’ అన్న స్థానంలో ఆ ‘ఈశ్వరుడు’ వచ్చి కూర్చొంటాడు.
ప్రతీ చోట ‘నేను’ అన్న స్థానంలో ‘నేను’ను తొలగించి, ఆ ఈశ్వరుడిని ప్రత్యక్షంగా అందులో ప్రతిపాదించాలన్నమాట. అంతేకాకుండా, ప్రతిక్షేపించాలి. ‘నేను’ అన్న ప్రతీ చోట ‘ఈశ్వరుడు’ని పెట్టడం అభ్యాసం చేయాలి.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 8 🌹*
✍️ Sri GS Swami ji
📚. Prasad Bharadwaj
*🌻 Why do we need Guru? One should first and foremost have the yearning to find the light that is not touched by a shadow 🌻*
Because of that faith, he studied attentively and became proficient in Mathematics. This we understand.
Because the teacher recited the tables with great confidence, the student became convinced of the competence of the teacher, and was inspired.
The student, when he becomes proficient in Mathematics, realizes that his teacher not only is knowledgeable in the 100th multiplication table, but has a good grasp on the entire subject of Mathematics.
The childhood impression that he had, that the 100th multiplication table is great knowledge, he now realizes was very immature. Similarly, it is impossible in the field of spirituality, for us to gauge on our own, the greatness of Guru.
Like that youngster, generally, seeing some evidence in Guru, and following the example of spiritual seekers who are more advanced, some people choose their own Guru. Even here, there are some problems.
By seeing certain miracles, the grandeur, the skillful oratory, and the extensive propaganda, many people get fooled. Oh, so many followers, of so much of publicity, and such riches!
People become falsely impressed by these. Then what is the exact proof? First of all, why do we need Guru?
One should first and foremost have the yearning to find the light that is not touched by a shadow, to satisfy the three fundamental desires that we have mentioned before.
Only when such a thirst is present within you, and the search for guru begins, and association with some good souls occurs, then at some particular point, you will experience an extraordinary peace inside your heart.
It is only when you are filled with an eagerness for finding a spiritual Guru who is enlightened, that the possibility occurs that a competent Guru who is none other than the Supreme Soul, will enter your life.
We are on a search for Guru. We are exerting a serious effort with devotion and sincerity to find someone who has experienced the highest knowledge and we are eager to savor it ourselves.
Then Guru will certainly come into your life. When that happens, in His presence you forget all the turmoil that is in your life.
When you see that individual, when you experience the tremendous energy that permeates his presence, an inexplicable peace, and an indescribable joy is experienced.
The undisclosed fear within the heart concerning our problems is replaced by the confidence that our problems will be overcome. Let us look at an example.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సృష్టి దివ్య సృజనాత్మకత - మానవజన్మ - సూక్ష్మ సృష్టి - కారణసృష్టి 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
త్రిగుణాత్మకమైన అవిద్య బ్రహ్మచైతన్యంతో సృజనాత్మకశక్తిని పొందినది. కనుక బ్రహ్మముతో చైతన్యవంతమైన అవిద్యనుండి వరుస క్రమములో ఆకాశం (శబ్దం), ఆకాశం నుండి వాయువు (స్పర్శ), వాయువు నుండి అగ్ని (రూపం), అగ్ని నుండి జలం (రసము), జలం నుండి భూమి (గంధం) పుట్టినవి.
ఈ పంచభూతములు స్వయంప్రకాశం లేనివి. అందువలన బ్రహ్మచైతన్యం క్రమశః ముందుగా ఆకాశం, తరువాత వాయువు, అగ్ని, జలం, భూమిలోనికి వ్యాపించుటవలన అయస్కాంతక్షేత్రములోని ఇనుప మేకులు ఐస్కాంతీకరణ చెందినట్లుగా ఈ పంచ భూతములు చైతన్యవంతమైనవి. అవిద్యనుండి ఉద్భవించిన ఈ సూక్ష్మభూతములు చైతన్యవంతమైనవి.
అవిద్యనుండి ఉద్భవించిన ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను తన్మాత్రలు అందురు. అవిద్య లేక మూలప్రకృతి నుండి పుట్టిన మొదటి శబ్దమునే ఓంకారము అందురు. ఈ సృష్టి అంతయు ఆ ఓంకారము నుండే పుట్టినది.
ఈ సూక్ష్మ పంచమహాభూతములు సత్వ, రజో, తమో గుణములు మూడునూ కలిగియుండును. ఈ త్రిగుణాత్మకమైన మూల అజ్ఞానమును లేదా అవిద్యను కారణసృష్టి అందురు. సూక్ష్మ పంచమహా భూతములు ఇందులోని భాగమే.
*🌹. స్థూలసృష్టి – సూక్ష్మ సృష్టి 🌹*
పంచీకరణము అనగా పంచతన్మాత్రలు లేక సూక్ష్మ పంచమహా భూతములు వివిధ పాళ్ళలో కలియుట ద్వారా స్థూలసృష్టికి దారితీయుట.
అపంచీకరణము అనగా వేటితోను కలవని, కలపని, సూక్ష్మ పంచమహాభూతములు. దీనినే సూక్ష్మసృష్టి అందురు.
🌹🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సాయి తత్వం - మానవత్వం - 54 / Sai Philosophy is Humanity - 54 🌹*
🌴. అధ్యాయము - 7 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. బాబా పండరి ప్రయాణము - 1 🌻*
1. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను.
2. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందూరుబారులో మామల్తదారుగా నుండెను.
3. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబాయందు అతనికిగల భక్తి యను ఫలమానాటికి పండెను.
4. పండరీపురమును భూలోకవైకుంఠ మనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గొప్ప ధన్యుడు.
5. నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేసించవలసి యుండెను. శిరిడీలో యెవ్వరికీ ఉత్తరము వ్రాయక, హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యెను.
6. ముందుగా శిరిడీకిపోయి తన విఠోబాయగు బాబాను దర్శించి, ఆ తరువాత పండరికి పోవలెనను కొనెను.
7. నానాసాహెబు శిరిడీకి వచ్చు సంగతి యెవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sai Philosophy is Humanity - 54 🌹*
Chapter 7
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj
*🌻 Going to Pandharpur and Staying There - 1 🌻*
I shall now close this Chapter after relating a story illustrating how Sai Baba loved His devotees and anticipated their wishes and movements.
Mr. Nanasaheb Chandorkar, who was a great devotee of Baba, was Mamlatdar at Nandurbar in Khandesh. He got an order of transfer to Pandharpur.
His devotion to Sai Baba bore fruit, as he got an order to go and stay at Pandharpur which is regarded as the ‘BHUVAIKUNTHA’ - Heaven on earth.
Nanasaheb had to take immediate charge, so he left, immediately, for the place, without even writing or informing anybody at Shirdi.
He wanted to give a surprise visit to Shirdi - his Pandharpur, see and salute his Vithoba (Baba), and then proceed.
Nobody dreamt of Nanasaheb’s departure for Shirdi, but Sai Baba knew all about this, as His eyes were everywhere (omniscient).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹