🌹 05, AUGUST 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 05, AUGUST 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 05, AUGUST 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 216 / Kapila Gita - 216🌹 
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 26 / 5. Form of Bhakti - Glory of Time - 26 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 808 / Vishnu Sahasranama Contemplation - 808 🌹 
🌻808. కున్దరః, कुन्दरः, Kundaraḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 769 / Sri Siva Maha Purana - 769 🌹
🌻. విష్ణు జలంధర యుద్ధము - 5 / The fight between Viṣṇu and Jalandhara - 5 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 023 / Osho Daily Meditations - 023 🌹 
🍀 23. ముఖ్యమైనవి / 23. ESSENTIALS 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 468 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 468 - 1 🌹 
🌻 468. 'వామదేవీ' - 1 / 468. 'Vamadevi' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 05, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 09 🍀*
 
*16. ద్రాఘీయాన్ నీలకేశీ చ జాగ్రదంబుజలోచనః |*
*ఘృణావాన్ ఘృణిసమ్మోహో మహాకాలాగ్నిదీధితిః*
*17. జ్వాలాకరాళవదనో మహోల్కాకులవీక్షణః |*
*సటానిర్భిన్నమేఘౌఘో దంష్ట్రారుగ్వ్యాప్తదిక్తటః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నిక్కమైన సఖ్యం సులభ్యం కాదు - నిక్కమైన సఖ్యం సర్వసాధారణంగా సకృత్తుగా మాత్రమే ఒనగూరుతుంది, నిస్స్వార్థంగా ప్రేమించే నిక్కమైన మిత్రులు అనేకులను సంపాదించడం మరుమరీచిక వంటిదని నిశ్చయంగా చెప్పుకోవచ్చు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ చవితి 09:41:31 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 26:55:42
వరకు తదుపరి రేవతి
యోగం: సుకర్మ 23:11:50 వరకు
తదుపరి ధృతి
కరణం: బాలవ 09:43:31 వరకు
వర్జ్యం: 13:37:00 - 15:05:40
దుర్ముహూర్తం: 07:39:12 - 08:30:37
రాహు కాలం: 09:09:11 - 10:45:36
గుళిక కాలం: 05:56:22 - 07:32:46
యమ గండం: 13:58:25 - 15:34:50
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 22:29:00 - 23:57:40
సూర్యోదయం: 05:56:22
సూర్యాస్తమయం: 18:47:40
చంద్రోదయం: 21:50:28
చంద్రాస్తమయం: 09:24:06
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ధూమ్ర యోగం - కార్యభంగం,
సొమ్ము నష్టం 26:55:42 వరకు తదుపరి
ధాత్రి యోగం - కార్య జయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 216 / Kapila Gita - 216 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 26 🌴*

*26. ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరమ్|*
*తస్య భిన్నదృశో మృతుర్విదధే భయముల్బణమ్॥*

*తాత్పర్యము : మానవుడు ఆత్మకును, పరమాత్మకును ఏ మాత్రముగా నైనను భేదమున్నట్లు భావించినచో, అట్టి భేదభావమును దర్శించు వానికి మృత్యు రూపుడనగు నేను తీవ్రమగు భయముసు కలిగించెదను.*

*వ్యాఖ్య : తనను గొప్పవాడిగా భావించుకొని, పక్కవారిని తక్కువచేసేవాడిని, నేనేమీ అనను, తనకూ ఇతరులకూ ఏ చిన్ని భేధాన్నైనా చూస్తే, అలాంటి వానికి, మృత్యువు మహా ఘోరమైన భయాన్నిస్తుంది. "వాడు వేరు, నేను వేరు" అనే భావన వీడాలి. "నన్ను పెద్దవాన్ని చేయడానికి స్వామి వీడిని చిన్నవాడిని చేసాడు. నా పెద్దతనానికి వాడి చిన్నతనం గొప్ప కారణం అని" భావించి కృతజ్ఞ్యతా భావముతో ఉండాలి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 216 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 5. Form of Bhakti - Glory of Time - 26 🌴*

*26. ātmanaś ca parasyāpi yaḥ karoty antarodaram*
*tasya bhinna-dṛśo mṛtyur vidadhe bhayam ulbaṇam*

*MEANING : As the blazing fire of death, I cause great fear to whoever makes the least discrimination between himself and other living entities because of a differential outlook.*

*PURPORT : There are bodily differentiations among all varieties of living entities, but a devotee should not distinguish between one living entity and another on such a basis; a devotee's outlook should be that both the soul and Supersoul are equally present in all varieties of living entities.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 808 / Vishnu Sahasranama Contemplation - 808🌹*

*🌻808. కున్దరః, कुन्दरः, Kundaraḥ🌻*

*ఓం కున్దరాయ నమః | ॐ कुन्दराय नमः | OM Kundarāya namaḥ*

కున్దాని కున్దకుసుమసదృశాని ఫలాని యః ।
శుద్ధాని రాతిదదాతి లాత్యాదత్త ఉతాచ్యుతః ॥
కున్దర ఇత్యుచ్యతే స రలయోర్వృత్యభేదతః ॥
కుం ధారాం దారయామాస హిరణ్యాక్షజిఙ్ఘాంసయా ॥
వారాహరూపమాస్థాయ వేతి వా కున్దరో హరిః ॥

*కుంద పుష్పములను అనగా మొల్ల పూవులను పోలు శుద్ధములగు ఫలములను భక్తులకు ఇచ్చును లేదా వారినుంచి గ్రహించును.*

*లేదా హిరణ్యాక్షుని సంహరింపదలచి వరాహరూపమును ధరించి భూమిని చీల్చెను అను అర్థమున కుందరః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 808🌹*

*🌻808. Kundaraḥ🌻*

*OM Kundarāya namaḥ*

कुन्दानि कुन्दकुसुमसदृशानि फलानि यः ।
शुद्धानि रातिददाति लात्यादत्त उताच्युतः ॥
कुन्दर इत्युच्यते स रलयोर्वृत्यभेदतः ॥
कुं धारां दारयामास हिरण्याक्षजिङ्घांसया ॥
वाराहरूपमास्थाय वेति वा कुन्दरो हरिः ॥

Kundāni kundakusumasadr‌śāni phalāni yaḥ,
Śuddhāni rātidadāti lātyādatta utācyutaḥ.
Kundara ityucyate sa ralayorvr‌tyabhedataḥ.
Kuṃ dhārāṃ dārayāmāsa hiraṇyākṣajiṅghāṃsayā.
Vārāharūpamāsthāya veti vā kundaro hariḥ.

*He bestows fruits of actions which are pure as kunda flower. Or the One who is offered kunda flowers by the devotees.*
*Pierced or clove the earth taking the form of a boar to kill Hiraṇyākṣa.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥
కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥
Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,Amr‌tāṃśo’mr‌tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 769 / Sri Siva Maha Purana - 769🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 17 🌴*

*🌻. విష్ణు జలంధర యుద్ధము - 5 🌻*

*అపుడు వారద్దరు మహాబలులు చేతులతో పిడికిళ్లతో మోకాళ్లతో మల్ల యుద్ధమును చేసిరి. ఆ శబ్దముతో భూమి ప్రతిధ్వనించెను (33). ఓ మహర్షీ! విష్ణువు చిరకాలము ఆ రాక్షసునితో యుద్ధమును చేసి ఆశ్చర్యమును పొందినవాడై మనస్సులో క్లేశమును, అలసటను పొందెను (34). మాయను ఎరింగిన వారిలో శ్రేష్ఠడు, మాయకు ఆధీశ్వరుడు అగు విష్ణుభగవానుడు అపుడు ప్రసన్నుడై. ఆ రాక్షసరాజును ఉద్దేశంచి మేఘంగంభీరమగు స్వరముతో నిట్లనెను (35).*

*విష్ణువు ఇట్లు పలికెను- ఓయీ! రాక్షసశ్రేష్ఠా! యుద్ధములో సహింప శక్యము గాని పరాక్రమము గల నీవు ధన్యుడవు. ఏలయన, మహాప్రభుడవగు నీవు గొప్ప ఆయుధములకైననూ భయపడుట లేదు (36). క్రూరములగు ఇవే ఆయుధములను ప్రయోగించగా గొప్ప బలము, తేజస్సు గల వీరులైన రాక్షసులు చాలామంది తెగిన దేహములు గలవారై మృతిని చెందిరి (37). ఓ గొప్ప రాక్షసుడా! నీ యుద్ధముచే నేను ప్రసన్నుడనైతిని. నీవు మహాత్ముడవు. స్థావర జంగమాత్మక మగు ముల్లోకములలో నీతో సమమగు వీరుడు కానరాడు (38). ఓ రాక్షసరాజా! వరమును కోరుకొనుము. నీ విక్రమమునకు నేను సంతసించితిని. నీకు ఈయరాని వరమునైననూ ఇచ్చెదను. నీ మనసులోని మాటను బయటపెట్టుము. (39).*

*సనత్కుమారుడిట్లు పలికెను - మాయను వశము చేసుకొన్నవాడు, పాపములను పోగొట్టువాడు అగు ఆ విష్ణువుయొక్క ఈ మాటను విని మహాబుద్ధిశాలి, రాక్షసుడునగు జలంధరుడు ఇట్లు బదులిడెను (40).*

*జలంధరుడిట్లు పలికెను- బావా! నీవు సంతుష్టుడవైనచో, నాకీ వరమునిమ్ము. నీవు నీ గణములతో, మరియు మా చెల్లెలితో గూడి నా ఇంటిలో నివసించుము (41).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 769🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 17 🌴*

*🌻 The fight between Viṣṇu and Jalandhara - 5 🌻*

33. Then both of them equally powerful had a hand to hand fight hitting each other with arms, fists and knees. They filled the earth with reverberating sounds.

34. Fighting with the Asura thus, for a long time, O excellent sage, Viṣṇu was surprised. He felt dejected in the heart.

35. Then he the foremost among the magic-wielders assumed a delightful aspect. He addressed the king of Asuras in a thundering voice.

Viṣṇu said:—
36. “O excellent Asura, you are blessed. You are invincible in war. Since you are a great lord you are not at all afraid of even great weapons.

37. Many Asuras have been killed by these very same weapons in great battles. The wicked and haughty people have been pierced through their bodies and killed.

38. O great Asura, I am delighted by this fight with you. You are really great. A hero like you has not been seen in the three worlds including the mobile and immobile beings.

39. O lord of Asuras, choose a boon. I am pleased at your valour. I shall give you anything even that which cannot be given, whatever is in your mind.

Sanatkumāra said:—
40. On hearing these words of Viṣṇu, skilled in magic, the intelligent king of the Asuras replied thus.

Jalandhara said:—
41. O Brother-in-law, if you are pleased give me this boon. You stay in my house with all your followers, my sister and myself.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 23 / Osho Daily Meditations  - 23 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 23. ముఖ్యమైనవి / 23. ESSENTIALS 🍀*

*🕉. ధ్యానం అంటే తానుగా ఉండడం, ప్రేమ అంటే తన ఉనికిని మరొకరితో పంచుకోవడం. ధ్యానం మీకు నిధిని ఇస్తుంది మరియు దానిని పంచుకోవడానికి ప్రేమ మీకు సహాయం చేస్తుంది. ఇవి రెండు అత్యంత ప్రాథమిక విషయాలు, మిగతావన్నీ అనవసరం. 🕉*

*రోమ్‌కు వెళ్లే ముగ్గురు ప్రయాణికుల గురించి పాత కథనం ఉంది. వారు మంత్రిని పరామర్శిస్తారు, అతను మొదటి వ్యక్తిని అడుగుతాడు, 'మీరు ఇక్కడ ఎంతకాలం ఉంటారు?' ఆ వ్యక్తి 'మూడు నెలలు' అంటాడు. మంత్రి ఇలా అంటాడు, 'అప్పుడు మీరు చాలా రోమ్‌ని చూడగలుగుతారు. అతను ఎంతకాలం ఉండబోతున్నాడు అనేదానికి సమాధానంగా, రెండవ ప్రయాణికుడు అతను కేవలం ఆరు వారాలు మాత్రమే ఉండగలనని సమాధానమిస్తాడు. మంత్రి ఇలా అంటాడు, 'అప్పుడు మీరు మొదటివాని కంటే ఎక్కువ చూడగలుగుతారు.' మూడవ యాత్రికుడు తాను రోమ్‌లో కేవలం రెండు వారాలు మాత్రమే ఉంటానని చెప్తాడు, దానికి పోప్ ఇలా సమాధానమిస్తాడు, 'మీరు అదృష్టవంతులు, ఎందుకంటే మీరు చూడాల్సినవన్నీ చూడగలుగుతారు!'*

*ప్రయాణికులు అయోమయంలో పడ్డారు, ఎందుకంటే వారు మనస్సు యొక్క యంత్రాంగాన్ని అర్థం చేసుకోలేదు. ఒక్కసారి ఆలోచించండి, మీకు వెయ్యి సంవత్సరాల జీవితకాలం ఉంటే, మీరు చాలా విషయాలను కోల్పోతారు, ఎందుకంటే మీరు పనులను వాయిదా వేస్తూ ఉంటారు. కానీ జీవితం చాలా చిన్నది కాబట్టి, ఎవరైనా వాయిదా వేయలేరు. అయినప్పటికీ ప్రజలు వాయిదా వేస్తారు - ఏంతో కొల్పోతారు. మీరు జీవించడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉందని ఎవరైనా మీకు చెబితే ఆలోచించండి. మీరు ఏమి చేస్తారు? అనవసర విషయాల గురించి ఆలోచిస్తూనే ఉంటారా? లేదు, మీరు అదంతా మర్చిపోతారు. మీరు ప్రేమిస్తారు మరియు ప్రార్థిస్తారు మరియు ధ్యానం చేస్తారు, ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అసలు విషయాలు, ముఖ్యమైన విషయాలు, మీరు వాయిదా వేయరు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 23 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 23. ESSENTIALS 🍀*

*🕉  Meditation means to be oneself, and love means to share one's being with somebody else. Meditation gives you the treasure, and love helps you to share it. These are the two most basic things, and all else is nonessential.  🕉*

*There is an old anecdote about three travelers who go to Rome. They visit the minister, who asks of the first, "How long are you going to be here?" The man says, "For three months." The minister says, "Then you will be able to see much of Rome. " In answer to how long he was going to stay, the second traveler replies that he can only stay for six weeks. The Minister says, "Then you will be able to see more than the first."The third traveler says he will only be in Rome for two weeks, to which the pope replies, "You are fortunate, because you will be able to see everything there is to see!"*

*The travelers were puzzled, because they didn't understand the mechanism of the mind. Just think, if you had a lifespan of a thousand years, you would miss many things, because you would go on postponing things. But because life is so short, one cannot afford to postpone. Yet people do postpone-and at their own cost. Imagine if somebody were to tell you that you have only one day left to live. What will you do? Will you go on thinking about unnecessary things? No, you will forget all that. You will love and pray and meditate, because only twenty-four hours are left. The real things, the essential things, you will not postpone.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 468 - 1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 468  - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।*
*సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀*

*🌻 468. 'వామదేవీ' - 1 / 468. 'Vamadevi' - 1 🌻*

*శివుని వామ భాగముగా నుండు దేవి అని అర్థము. ప్రకృతి పురుషు లిరువురునూ శాశ్వతముగ కూడియే యుందురు. సృష్టి యందు, సృష్టికావల కూడ అట్లే యుందురు. వారిరువురూ కలసిన తత్త్వమే దైవము. వారు శివశక్తులని, రాధాకృష్ణులని వర్ణింతురు. వారు కుడి, ఎడమలుగ ఒకే రూపమున వసింతురు. ఎడమ భాగమును సంస్కృతమున వామ భాగమందురు. వామ భాగము ప్రకృతి భాగము. కుడి భాగము పురుష భాగము. ఎడమ భాగమందు వుండు ప్రకృతిని వామదేవి అందురు. వామదేవి సృష్టి కార్యము నిర్వర్తించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 468 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita*
*sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻*

*🌻 468. 'Vamadevi' - 1 🌻*

*Vama Devi is the left part of Shiva. Male and Female are eternally united in the Nature. In the world and beyond the world it is the same. God is the philosophy of their unification. They are described as Siva Shakti and Radhakrishna. They live in the same form, right and left. The left part is called vama part in Sanskrit. The left part is the nature part. The right part is the male part. The nature in the left part is calledVamadevi. Vamadevi performs the work of the creation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 122 : 2-08. śarīram havih - 4 / శివ సూత్రములు - 122 : 2-08. శరీరం హవిః - 4


🌹. శివ సూత్రములు - 122 / Siva Sutras - 122 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-08. శరీరం హవిః - 4 / 2-08. śarīram havih - 4 🌻

🌴. ఆత్మ శుద్ధి అనే యాగంలో దేహమే నైవేద్యంగా ఉంటుంది, అందులో పాల్గొనే శక్తులకు నైవేద్యంగా మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను జ్ఞాన అగ్నిలో పోస్తారు. 🌴


అహం అనేది నేను అనే చైతన్యం ద్వారా ప్రతిబింబిస్తుంది, అది మూడు రకాల శరీరాలలోకి చొచ్చుకుపోయి చాలా కాలం పాటు ఇమడనిస్తే, ఈ నేను అను చైతన్యాన్ని నాశనం చేయడం కష్టమవుతుంది. ఆధ్యాత్మిక మార్గం యొక్క ప్రారంభ దశలో, శరీరంలోని మూడు స్థాయిలలోని నేను అను చైతన్యాన్ని భగవంతుని చైతన్యం లేదా శివ చైతన్యం అనే అగ్నిలోకి సమర్పించి నట్లయితే, అహం మళ్లీ మళ్లీ పెరగకుండా బూడిదగా మారుతుంది. ఈ నైవేద్యాలను సమర్పించడం మాత్రమే సరిపోదు కానీ అహం యొక్క చెడులు బూడిదగా మారాయని మరియు ఇప్పుడు ఉనికిలో ఉన్నది శివుడని లేదా శివునికి చెందినదని పదే పదే ధృవీకరిస్తున్నారు. అటువంటి రూపాంతరం చెందిన యోగి శివుని యొక్క గొప్ప మంత్రమైన నమశివాయను పునరావృతం చేయడు, కానీ అతను స్వయంగా శివునిగా మారి ఆత్మవిశ్వాసంతో శివోహాన్ని ధృవీకరిస్తాడు, అంటే నేను శివుడిని.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 122 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-08. śarīram havih - 4 🌻

🌴. The body is the oblation in the sacrifice of self-purification in which the impurities of the mind and body are poured in to the fire of knowledge as an offering to the shaktis who participate in it. 🌴


Ego is reflected through I consciousness that percolates into all three types of bodies and if this percolation is allowed to happen for long, destroying this I consciousness becomes difficult. In the early stage of spiritual path, if I consciousness in all the three levels of a body are offered as oblations into the fire of God consciousness or Śiva consciousness, ego is burnt into ashes not to rear again. It is not just enough to offer these oblations but repeatedly affirm that evils of ego have been reduced to ashes and what exists now is that of Śiva or belong to Śiva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 386


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 386 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనిషి స్వేచ్ఛతో ఎట్లాంటి తలరాత లేకుండా భూమికి వచ్చాడు. ఎట్లా ప్రవర్తించాలన్నది నీ చేతిలో వుంది. నీ జీవన గమనాన్ని ప్రతి అడుగులో నువ్వు మార్చుకోవచ్చు. 🍀


మనిషి కాలంలోనో లేదా శాశత్వంలోనో జీవిస్తాడు. రెండు ప్రత్యామ్నాయాలూ వున్నాయి. ఏదీ విధి కాదు. తల రాత కాదు. మనిషి స్వేచ్ఛతో ఎట్లాంటి తలరాత లేకుండా భూమికి వచ్చాడు. భవిష్యత్తులో బహిరంగంగా ఎట్లా ప్రవర్తించాలన్నది నీ చేతిలో వుంది. నీ జీవన గమనాన్ని ప్రతి అడుగులో నువ్వు మార్చుకోవచ్చు. కోట్ల మంది కాలంలో జీవిస్తూ వుంటారు. కారణం వాళ్ళు గుంపులో పుట్టారు. వాళ్ళకు శాశ్వతత్వం గురించి ఏమీ తెలీదు. వాళ్ళ తల్లిదండ్రులు, గురువులు, నాయకులు అందరూ కాలంలో జీవించారు. వాళ్ళ చుట్టూ వున్న సమస్త ప్రపంచం కాలంలో వుంది. జీవన్మరణాల మధ్య వుంది.

అందువల్ల ప్రతి పసివాడూ అనుకరిస్తాడు. అందువల్లే ప్రతి బిడ్డా నేర్చుకుంటాడు. అందువల్లే నిబద్ధింప బడతాడు. అందరూ కాలాన్ని భూత, వర్తమాన, భవిష్యత్తులుగా చెబుతారు. అది పూర్తిగా తప్పు. కాలానికి గతం, భవిష్యత్తు మాత్రమే వున్నాయి. వర్తమానంలో శాశ్వతత్వముంది. వర్తమానం కాలానికి సంబంధించదు. అది రూపాంతరం. వర్తమానంలో జీవించడమంటే కాలాన్ని దాటి జీవించడం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 120 : 29. The Spiritual Way of Life / నిత్య ప్రజ్ఞా సందేశములు - 120 : 29. ఆధ్యాత్మిక జీవన విధానం




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 120 / DAILY WISDOM - 120 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 29. ఆధ్యాత్మిక జీవన విధానం / 29. The Spiritual Way of Life 🌻


ఆధ్యాత్మిక జీవన విధానం బహుశా అన్ని కళలు మరియు శాస్త్రాలలో అత్యంత ఆసక్తికరమైనది మరియు నిగూఢమైనది. జీవితాన్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడంలో మరియు జీవించడంలో ఈ కష్టం వెనుక కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎన్ని సూక్ష్మమైన కారకాలతో ముడిపడి ఉండి తన్ రోజువారీ జీవితంలో ఈ సూక్ష్మతకు అనుగుణంగా ఎన్ని సునిశిత మార్పులు చేయాలంటే ఒక సామాన్య మనిషికి ఇవి చేయడం సాధ్యపడే విషయం కాదు.

ఎందుకంటే మనిషి తన వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో నిరంతర సునిశితమైన ఆచరణ కాకుండా అప్పటికే అతనికి అలవాటు పడ్డ, లేదా అప్పటికే సమాజంలో ఉన్న మూస పద్ధతుల్లో, అతని ప్రవృత్తుల ఆధారంగా జీవనం సాగిస్తున్నాడు కాబట్టి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఆదర్శంతో నిండిపోవడంతో ఒక అరుదైన అదృష్టం అని చెప్పాలి. దీనికి కొన్నిసార్లు బయట కారణాలు ఉండొచ్చు, కొన్నిసార్లు దాని కారణం ఆ వ్యక్తికి కూడా తెలియకపోవచ్చు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 120 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 29. The Spiritual Way of Life 🌻


The spiritual way of life is perhaps the most intriguing and enigmatic of all arts and sciences. The reason behind this difficulty in understanding and living the life spiritual is that this arduous adventure on the part of an individual is connected with so many subtle factors and calls for such dextrous adjustments from moment to moment that the entire process or effort is practically beyond the reach of the common man.

Its is because man is used to what we may call a happy-go-lucky attitude of total abandon to instincts, prejudices, routines and movements along beaten tracks of stereotyped conduct and behaviour in his personal and social life. It is by a rare good fortune, we should say, that a person gets fired up with the spiritual ideal, sometimes by causes which are immediately visible and at other times for reasons not clearly intelligible even to one’s own self.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 254 / Agni Maha Purana - 254


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 254 / Agni Maha Purana - 254 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 74

🌻. శివ పూజా విధి వర్ణనము - 10 🌻


ఆగ్నేయమునందు చంద్రుడు ఉజ్జ్వలమైన హృదయమును, ఈశాన్యమునందు సువర్ణసమాన కాంతి గల శిరస్సును నైరృతియందు ఎఱ్ఱని రంగు గల శిఖను, వాయవ్యమునందు నల్లని రంగు గల కవచమును పూజింపవలెను. అగ్ని వర్ణ మగు నేత్రమును, కృష్ణ పింగల వర్ణమగు అస్త్రమును పూజించి, కమలముపై చతుర్ముఖు డగు బ్రహ్మయు, చతుర్భుజుడగు విష్ణువు, ఇతర దేవతలును ఉన్నట్లు భావన చేసి వారి పూజ చేయవలెను. పూర్వాదిదిక్కులందు కోరలతో భయంకరము లగు వజ్రతుల్యాస్త్రములు పూజించవలెను. ''ఓం హాం హూం శివాయ నమః'' అను మంత్రముతో మూల స్థానమునందు పూజ చేయవలెను. ''ఓం హాం హృదయాయ నమః'' ''హీం శిరసే హ్వహా'' అను మంత్రముతో హృదయ శిరస్సులను ''హూం శిఖాయై వషట్‌'' అను మంత్రముతో శిఖను ''హై కవచాయ హుం' అను మంత్రముతో కవచమును ''హః అస్త్రా య ఫట్‌'' అని అస్త్రమును పూజించవలెను. పిమ్మట పరివారసమేతు డగు ఈశ్వరునకు క్రమముగ పాద్య - ఆచమన - ఆర్ఘ్య - గంధ - పుష్ప - ధూప - దీప - నైవేద్య - ఆచమనీయ - కరోద్వర్తన - తాంబూల - ముఖవాస - దర్పణము లను మసర్పించవలెను.



సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 254 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 74

🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 10 🌻

72. The heart should be worshipped in the south-east, the moon on the north-east, the golden-coloured Śiva together with the tuft and blood on the south-west, Kṛṣṇa and armour on the north-west.

73. These gods having four faces and four arms should be worshipped in the petals in the east etc. along with the divine weapon similar to thunder and fierce teeth.

74. Hauṃ salutations to Śiva at the base, Oṃ hāṃ hūṃ hīṃ hoṃ in the head, hṛṃ to the tuft, haiṃ to the armour, haḥ to the weapons and to one with the attendants.

75-76. Waters for washing the feet, for rinsing the mouth and respectful offering, perfumes, flowers, incense, lamp, food offerings and water for rinsing again, should be given to lord Śiva. Intertwined blades of kuśa and unbroken rice should be placed on the head (of the image) of the lord. Perfumes, betel, piece of cloth for wiping the face and a mirror (should also be -offered to the deity).


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 408: 10వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 408: Chap. 10, Ver. 36

 

🌹. శ్రీమద్భగవద్గీత - 408 / Bhagavad-Gita - 408 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 36 🌴

36. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయోస్మిస్మి వ్యవసా యోస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ||


🌷 . తాత్పర్యము : నేను మోసములలో జూదమును, జేజస్వులలో తేజస్సునై యున్నాను. ఆలాగుననే జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే.

🌻. భాష్యము : విశ్వమనదంతటను పలువిధములైన మోసకారులు కలరు. వారి పలువిధములైన మోసములలో జూదము అగ్రగణ్యమై యున్నందున అది శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. అనగా పరమపురుషునిగా శ్రీకృష్ణుడు సామాన్యపురుషుని కన్నను గొప్ప వంచన చేయగలడు. ఒకవేళ అతడు ఎవ్వరినైనను వంచింప దలచినచో ఎవ్వరును వంచన యందు అతనిని అధిగమింపలేరు. అనగా శ్రీకృష్ణుని ఘనత ఒక రంగమునందే గాక, అన్ని రంగములందు గొప్పదై యున్నది.

జయించు వారిలో జయమును, తేజస్సులలో తేజస్సును అతడే. యత్నశీలురులలో ఘన యత్నశీలుడు, సాహసులలో అతిసాహసుడు మరియు బలము గలవారిలో అతిబలశాలి అతడే. శ్రీకృష్ణుడు ధరత్రిపై అవతరించినపుడు ఎవ్వరును అతని శక్తిని అధిగమింపలేకపోయిరి. అతడు చిన్ననాతనే గోవర్ధనపర్వతము నెత్తెను. అట్టి శ్రీకృష్ణుని మోసమునందు గాని, తేజస్సునందు గాని, జయమునందు గాని, యత్నమునందు గాని మరియు బలమునందు గాని ఎవ్వరును అధిగమింపలేరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 408 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 36 🌴

36. dyūtaṁ chalayatām asmi tejas tejasvinām aham
jayo ’smi vyavasāyo ’smi sattvaṁ sattvavatām aham


🌷 Translation : I am also the gambling of cheats, and of the splendid I am the splendor. I am victory, I am adventure, and I am the strength of the strong.

🌹 Purport : There are many kinds of cheaters all over the universe. Of all cheating processes, gambling stands supreme and therefore represents Kṛṣṇa. As the Supreme, Kṛṣṇa can be more deceitful than any mere man. If Kṛṣṇa chooses to deceive a person, no one can surpass Him in His deceit. His greatness is not simply one-sided – it is all-sided. Among the victorious, He is victory. He is the splendor of the splendid. Among the enterprising and industrious, He is the most enterprising, the most industrious.

Among adventurers He is the most adventurous, and among the strong He is the strongest. When Kṛṣṇa was present on earth, no one could surpass Him in strength. Even in His childhood He lifted Govardhana Hill. No one can surpass Him in cheating, no one can surpass Him in splendor, no one can surpass Him in victory, no one can surpass Him in enterprise, and no one can surpass Him in strength.

🌹 🌹 🌹 🌹 🌹


04 Aug 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 04, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi 🌻

🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 03 🍀

05. త్రిపురా భైరవీ విద్యా హంసా వాగీశ్వరీ శివా ।
వాగ్దేవీ చ మహారాత్రిః కాలరాత్రిస్త్రిలోచనా ॥

06. భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా ।
కాళీ కరాళవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మానవ ప్రేమలలో సఖ్యం విశిష్టత - ఇతర సంబంధాలకంటే ఆత్మ సంబంధం ప్రాబల్యం వహించినప్పుడే మానవ ప్రేమలకు సుస్థిరత్వం ఏర్పడుతుంది. ప్రాణకోశ వృత్తి ప్రాబల్యం తక్కువగా వున్న హేతువు చేత మానవ ప్రేమలలోకెల్ల

సఖ్యం విశేషకాలం మన్నగల అవకాశం వున్నది. అహంకారంతో కూడిన జ్వాలయే అయినా ప్రశాంతంగా ప్రజ్వరిల్లి వెలుగూ వెచ్చదనమూ ఇవ్వగల శక్తి దాని కుంటుంది. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: కృష్ణ తదియ 12:46:18

వరకు తదుపరి కృష్ణ చవితి

నక్షత్రం: శతభిషం 07:08:47

వరకు తదుపరి పూర్వాభద్రపద

యోగం: శోభన 06:13:10 వరకు

తదుపరి అతిగంధ్

కరణం: విష్టి 12:49:18 వరకు

వర్జ్యం: 12:53:52 - 14:20:20

దుర్ముహూర్తం: 08:30:29 - 09:21:58

మరియు 12:47:51 - 13:39:19

రాహు కాలం: 10:45:36 - 12:22:06

గుళిక కాలం: 07:32:35 - 09:09:06

యమ గండం: 15:35:08 - 17:11:38

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 00:46:42 - 02:11:26

మరియు 21:32:40 - 22:59:08

సూర్యోదయం: 05:56:05

సూర్యాస్తమయం: 18:48:09

చంద్రోదయం: 21:10:16

చంద్రాస్తమయం: 08:24:14

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు: సౌమ్య యోగం - సర్వసౌఖ్యం

07:08:47 వరకు తదుపరి ధ్వాoక్ష యోగం

- ధన నాశనం, కార్య హాని

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹