నిర్మల ధ్యానాలు - ఓషో - 386
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 386 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనిషి స్వేచ్ఛతో ఎట్లాంటి తలరాత లేకుండా భూమికి వచ్చాడు. ఎట్లా ప్రవర్తించాలన్నది నీ చేతిలో వుంది. నీ జీవన గమనాన్ని ప్రతి అడుగులో నువ్వు మార్చుకోవచ్చు. 🍀
మనిషి కాలంలోనో లేదా శాశత్వంలోనో జీవిస్తాడు. రెండు ప్రత్యామ్నాయాలూ వున్నాయి. ఏదీ విధి కాదు. తల రాత కాదు. మనిషి స్వేచ్ఛతో ఎట్లాంటి తలరాత లేకుండా భూమికి వచ్చాడు. భవిష్యత్తులో బహిరంగంగా ఎట్లా ప్రవర్తించాలన్నది నీ చేతిలో వుంది. నీ జీవన గమనాన్ని ప్రతి అడుగులో నువ్వు మార్చుకోవచ్చు. కోట్ల మంది కాలంలో జీవిస్తూ వుంటారు. కారణం వాళ్ళు గుంపులో పుట్టారు. వాళ్ళకు శాశ్వతత్వం గురించి ఏమీ తెలీదు. వాళ్ళ తల్లిదండ్రులు, గురువులు, నాయకులు అందరూ కాలంలో జీవించారు. వాళ్ళ చుట్టూ వున్న సమస్త ప్రపంచం కాలంలో వుంది. జీవన్మరణాల మధ్య వుంది.
అందువల్ల ప్రతి పసివాడూ అనుకరిస్తాడు. అందువల్లే ప్రతి బిడ్డా నేర్చుకుంటాడు. అందువల్లే నిబద్ధింప బడతాడు. అందరూ కాలాన్ని భూత, వర్తమాన, భవిష్యత్తులుగా చెబుతారు. అది పూర్తిగా తప్పు. కాలానికి గతం, భవిష్యత్తు మాత్రమే వున్నాయి. వర్తమానంలో శాశ్వతత్వముంది. వర్తమానం కాలానికి సంబంధించదు. అది రూపాంతరం. వర్తమానంలో జీవించడమంటే కాలాన్ని దాటి జీవించడం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment