శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 346 / Sri Lalitha Chaitanya Vijnanam - 346


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 346 / Sri Lalitha Chaitanya Vijnanam - 346🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀

🌻 346. 'విజయా'🌻


విజయ స్వరూపము శ్రీమాత అని అర్థము. సంధ్యాకాలము కొంచెము దాటిన పిదప నక్షత్రములు కొంచెము ప్రకాశించు కాలము విజయ అని పిలువబడును. ఈ కాలమున ప్రారంభించు కార్యములు విజయవంతమగును. అట్లే దినములో పదునొకండవ ముహూర్తమును విజయ అని వర్ణింతురు. విజయమును కోరు వారందరూ పయనించుటకు అది ఉత్తమ కాలమని తెలుప బడినది. ఆ సమయమున కాలము విజయ రూపమై యుండునట. ఆశ్వయుజ మాసమునందు శుక్లపక్ష దశమి తిథి యందు నక్షత్రోదయ కాలము సర్వ కార్యార్థ సిద్ధి నొసగును. ఈ తిథి విజయ దశమి అని ప్రసిద్ధి గాంచినది.

విశేషమగు జయము కలిగించునది గనుక శ్రీమాత విజయగ వర్ణింపబడినది, కీర్తింపబడినది. దేవీ పురాణమందు 68 శివ తీర్థములు పేర్కొనబడినవి. వానిలో కాశ్మీరమున గల శివతీర్థమును విజయ తీర్థమని తెలిపిరి. ఆ శివ తీర్థములకు శ్రీమాతయే అధ్యక్షురాలు. విశ్వకర్మ శాస్త్రమందు తెలుపబడిన గృహ నిర్మాణములలో విజయ అనునది విశేష రూపము గల గృహముగ తెలుపబడినది. పాండవులలో అర్జునుని విజయుడని కీర్తించినారు. అతని నెప్పుడునూ శ్రీమాత విజయ రూపము ఆవరించి యుండెడిదట. విజయదశమినాడు విజయుడు ఒంటరిగ కురుసైన్యమును నిర్జించి విరటుని గోవులను కాపాడినాడు. అంతః శత్రువులను, బాహ్యశత్రువులను జయించిన వారు విజయులు. యోగులు, సిద్ధులు అట్టివారు. వారి యందు శ్రీమాత పరిపూర్ణ సాన్నిధ్య ముండును. విజయ నామము అత్యంత శుభప్రదమైనది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 346 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala

Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻

🌻 346. Vijayā विजया (346) 🌻


She is always victorious. She wins all Her battles against evil doers who are known as demons. It can also be said that She has conquered Śiva’s love, hence victorious. During dasara festival, 10th day evening (known as vijaya dasami, meaning victorious 10th day of dasara festival) twilight time is considered as the most auspicious time to commence any event. There is a tithi nitya devi (worshipped in Śrī Cakra) by name Vijayā.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


09 Feb 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 147


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 147 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. గురువు 🌻


గురువనగా అయస్కాంతము. శిష్యుడనగా ఇనుప ముక్క. అయస్కాంతపు సాన్నిధ్యముచే ఇనుపముక్క అయస్కాంతము అగుచున్నది.ఇనుమునకు అయస్కాంతము సాన్నిధ్యము ఇచ్చినదే కాని అయస్కాంత తత్త్వమును ధారపోయలేదు.

అట్లే గురువు శిష్యునకు తన భావములను, నమ్మకములను, ఆచారములను రుద్దడు. రుద్దుట రాజకీయ లక్షణము అది పార్టీలు, మతములు మార్చుటకు పనికి వచ్చును. కాని శిష్యుని గురువుగా సృష్టించుటకు పనికిరాదు. జీవునికి దైవముగా రెండవజన్మము ఇచ్చుటకు పనికిరాదు.

ఇనుములో అయస్కాంత ధర్మము నిద్రాణమై యున్నది. దానిని మేల్కొలుపుటకు మాత్రమే అయస్కాంతము తన సాన్నిధ్యమును ప్రసాదించును. అట్లే గురువు ప్రయోగించినది ఉద్బోధము (Induction) అను ప్రక్రియే గాని, బోధ (Conduction) అను పద్ధతి కాదు.

...... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


09 Feb 2022

శ్రీ శివ మహా పురాణము - 517


🌹 . శ్రీ శివ మహా పురాణము - 517 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 44

🌻. మేన యొక్క మంకు పట్టు - 3 🌻


నారదుడిట్లు పలికెను -

శివుని యథార్థమగు సుందరరూపము నీకు తెలియనిది కాదు. ఆయన ఈ రూపమును లీలచే ధరించినవాడు. ఇది వాస్తవరూపము కాదు (26). ఓ పతివ్రతా! కావున నీవు కోపమును విడిచి స్వస్థురాలవు కమ్ము. మొండి పట్టుదలను వీడి కార్యమును నడిపించుము. పార్వతిని శివునకు ఇమ్ము (27).

బ్రహ్మ ఇట్లు పలికెను -

నీ ఆ మాటను విని ఆ మేన నీతో 'లెమ్ము, ఇచటినుండి దూరముగా పొమ్ము; నీవు దుష్టుడవు, అధమాధముడవు' అని పలికెను (28). ఆమె ఇట్లు పలకగా ఇంద్రాది సకల దేవతలు, దిక్పాలకులు వరుసగా వచ్చి ఇట్లు పలికిరి (29).

దేవతలిట్లు పలికిరి -

ఓ మేనా! నీవు పితరుల కుమార్తెవు. మా మాటను ప్రీతితో వినుము. ఈయన సాక్షాత్తుగా పరమానందము నొసగు పరమ శివుడు (30). నీ కుమార్తె మిక్కిలి దుస్సహమగు తపస్సును చేయగా, మంచి భక్తుల యందు ప్రేమ గల శంభుడు దయతో దర్శనమును, వరమును ఇచ్చి యున్నాడు (31)

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు మేన చాల సేపు దుఃఖించి, 'భయం కరాకరుడగు కైలాసపతికి నేను కన్యను ఈయను' అని పలికెను (32). ఓ దేవతలారా! మీరందరు యోజన చేసి ఈ పార్వతి యొక్క పరమ సౌందర్యమును వ్యర్థము చేయుటకు ఏల పూనుకొంటిరి? (33) ఓ మహర్షీ! ఆమె ఇట్లు పలుకగా, వసిష్ఠుడు మొదలగు సప్తర్షులు ముందుకు వచ్చి ఇట్లు పలకిరి (34).

సప్తర్షులిట్లు పలికిరి -

హిమవత్పత్నీ! నీవు పితృ దేవతల కుమార్తెవు. నీ కార్యమును సాధించుటకై మేము వచ్చితిమి. మేము చెప్పిన వచనములలో విరోధము మాకు తోచుట లేదు (35). శంకరుని దర్శనము సర్వోత్కృష్టమైన లాభము. ఆయన నీ దానమును స్వీకరించుటకై నీ గృహమునకు వచ్చి యున్నాడు (36). వారిట్లు పలుకగా జ్ఞానవిహీనురాలగు మేన మునుల వాక్యమును వమ్ము చేసి కోపముతో ఆ ఋషులకు ఇట్లు బదులిడెను (37)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Feb 2022

గీతోపనిషత్తు -319


🌹. గీతోపనిషత్తు -319 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 23 -2 📚


🍀 23-2. త్రికరణశుద్ధి - దైవము సర్వవ్యాపి. సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు. అతడు సర్వజీవుల నధిష్టించి వారి హృదయములలో నున్నాడు. అన్నిట, అంతట, అన్ని కాలముల యందు తెలియబడు ఈశ్వరుని ఒక ప్రదేశమునకు, ఒక కాలమునకు, ఒక రూపమునకు పరిమితము చేయుట మనోవికాసము లేనివారు మాత్రమే చేయుదురు. అట్టివారు గూడ శ్రద్ధ భక్తి కలిగి త్రికరణ శుద్ధితో భజించి నపుడు, ప్రార్థించినపుడు తాను ప్రసన్నుడై వారి మార్గదర్శకత్వము వహింతునని పరమాత్మ సూచించు చున్నాడు. భక్తితోపాటు జ్ఞానము కూడ వికసింపవలెను. జ్ఞానము లేని భక్తి మూఢత్వము కలిగించును. 🍀


23. యో వ్యన్య దేవతాభక్తా యజంతే శ్రద్ధయాన్వితా: |
తే2 పి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్ ||


తాత్పర్యము : విధి పూర్వకము కాకున్నను, భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఇతర దేవతలను ఆరాధించుచున్నారో, వారు కూడ నన్నే ఆరాధించు చున్నారు.

వివరణము : ఉన్నది ఒకే దైవము. అన్ని రూపములు అతని నుండే ఏర్పడినవి. అన్ని నామములు కూడ అతని నుద్దేశించినవే. అతడు సర్వవ్యాపి. సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు. అతడు సర్వజీవుల నధిష్టించి వారి హృదయములలో నున్నాడు. అన్నిట, అంతట, అన్ని కాలముల యందు తెలియబడు ఈశ్వరుని ఒక ప్రదేశమునకు, ఒక కాలమునకు, ఒక రూపమునకు పరిమితము చేయుట మనోవికాసము లేనివారు మాత్రమే చేయుదురు.

వీరి మూలము గనే మతకల్లోలములు, యుద్ధములు పుట్టును. అట్టివారు గూడ శ్రద్ధ భక్తి కలిగి త్రికరణ శుద్ధితో భజించి నపుడు, ప్రార్థించినపుడు తాను ప్రసన్నుడై వారి మార్గదర్శకత్వము వహింతునని పరమాత్మ సూచించుచున్నాడు. భక్తితోపాటు జ్ఞానము కూడ వికసింపవలెను. జ్ఞానము లేని భక్తి మూఢత్వము కలిగించును. కనుక భక్తి శ్రద్ధలతో ఆరాధనము సలుపువారికి దైవము జిజ్ఞాస కలిగించును. జ్ఞానమునందాసక్తి కలిగించును. జ్ఞాన సముపార్జనము జరుగుచుండగ భగవంతుని స్వరూప స్వభావములు, లక్షణములు క్రమముగ భక్తునికి అవగతమగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


09 Feb 2022

09 - FEBRUARY - 2022 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 09, బుధవారం, ఫిబ్రవరి 2022 సౌమ్య వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 23-2 - 319 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 517🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -147🌹  
5) 🌹 Osho Daily Meditations - 136🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 346 / Sri Lalitha Chaitanya Vijnanam - 346 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 09, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహాగణపతి ధ్యానం 🍀*

*హస్త్రీంద్రాననమిందుచూడ మరుణచ్ఛాయం త్రినేత్రం*
*రసాదాశ్లిష్టం ప్రియయా సపద్మ కరయా స్వాంకస్థయా సంతతమ్ |*
*బీజాపూరగదేక్షుకార్ముకల సచ్ఛక్రాబ్జపాశోత్పల*
*వ్రీహ్యగ్రస్వవిషాణరత్న కలశాన్ హస్తైర్వహంతం భజే*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కర్తవ్యము వీడిన వారు స్వారీ చేయుచున్న గుఱ్ఱపు పగ్గములను వదిలిన వాడివలె మార్గము చెడి అగమ్యమగు స్థితిని చేరును. 🍀*

*పండుగలు మరియు పర్వదినాలు : లేవు*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శిశిర ఋతువు, మాఘ మాసం
తిథి: శుక్ల-అష్టమి 08:32:48 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: కృత్తిక 24:24:19 వరకు
తదుపరి రోహిణి
యోగం: బ్రహ్మ 17:50:51 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: బవ 08:31:48 వరకు
సూర్యోదయం: 06:45:26
సూర్యాస్తమయం: 18:15:12
వైదిక సూర్యోదయం: 06:49:06
వైదిక సూర్యాస్తమయం: 18:11:31
చంద్రోదయం: 12:16:55
చంద్రాస్తమయం: 00:44:09
సూర్య సంచార రాశి: మకరం 
చంద్ర సంచార రాశి: వృషభం
వర్జ్యం: 10:56:00 - 12:43:44
దుర్ముహూర్తం: 12:07:19 - 12:53:18
రాహు కాలం: 12:30:18 - 13:56:32
గుళిక కాలం: 11:04:05 - 12:30:18
యమ గండం: 08:11:39 - 09:37:52
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 21:42:24 - 23:30:08
సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి 24:24:19
వరకు తదుపరి శుభ యోగం - కార్య జయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -319 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 23 -2 📚*
 
*🍀 23-2. త్రికరణశుద్ధి - దైవము సర్వవ్యాపి. సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు. అతడు సర్వజీవుల నధిష్టించి వారి హృదయములలో నున్నాడు. అన్నిట, అంతట, అన్ని కాలముల యందు తెలియబడు ఈశ్వరుని ఒక ప్రదేశమునకు, ఒక కాలమునకు, ఒక రూపమునకు పరిమితము చేయుట మనోవికాసము లేనివారు మాత్రమే చేయుదురు. అట్టివారు గూడ శ్రద్ధ భక్తి కలిగి త్రికరణ శుద్ధితో భజించి నపుడు, ప్రార్థించినపుడు తాను ప్రసన్నుడై వారి మార్గదర్శకత్వము వహింతునని పరమాత్మ సూచించు చున్నాడు. భక్తితోపాటు జ్ఞానము కూడ వికసింపవలెను. జ్ఞానము లేని భక్తి మూఢత్వము కలిగించును. 🍀*

*23. యో వ్యన్య దేవతాభక్తా యజంతే శ్రద్ధయాన్వితా: |*
*తే2 పి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్ ||*

*తాత్పర్యము : విధి పూర్వకము కాకున్నను, భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఇతర దేవతలను ఆరాధించుచున్నారో, వారు కూడ నన్నే ఆరాధించు చున్నారు.*

*వివరణము : ఉన్నది ఒకే దైవము. అన్ని రూపములు అతని నుండే ఏర్పడినవి. అన్ని నామములు కూడ అతని నుద్దేశించినవే. అతడు సర్వవ్యాపి. సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు. అతడు సర్వజీవుల నధిష్టించి వారి హృదయములలో నున్నాడు. అన్నిట, అంతట, అన్ని కాలముల యందు తెలియబడు ఈశ్వరుని ఒక ప్రదేశమునకు, ఒక కాలమునకు, ఒక రూపమునకు పరిమితము చేయుట మనోవికాసము లేనివారు మాత్రమే చేయుదురు.*

*వీరి మూలము గనే మతకల్లోలములు, యుద్ధములు పుట్టును. అట్టివారు గూడ శ్రద్ధ భక్తి కలిగి త్రికరణ శుద్ధితో భజించి నపుడు, ప్రార్థించినపుడు తాను ప్రసన్నుడై వారి మార్గదర్శకత్వము వహింతునని పరమాత్మ సూచించుచున్నాడు. భక్తితోపాటు జ్ఞానము కూడ వికసింపవలెను. జ్ఞానము లేని భక్తి మూఢత్వము కలిగించును. కనుక భక్తి శ్రద్ధలతో ఆరాధనము సలుపువారికి దైవము జిజ్ఞాస కలిగించును. జ్ఞానమునందాసక్తి కలిగించును. జ్ఞాన సముపార్జనము జరుగుచుండగ భగవంతుని స్వరూప స్వభావములు, లక్షణములు క్రమముగ భక్తునికి అవగతమగును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 517 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 44

*🌻. మేన యొక్క మంకు పట్టు - 3 🌻*

నారదుడిట్లు పలికెను -

శివుని యథార్థమగు సుందరరూపము నీకు తెలియనిది కాదు. ఆయన ఈ రూపమును లీలచే ధరించినవాడు. ఇది వాస్తవరూపము కాదు (26). ఓ పతివ్రతా! కావున నీవు కోపమును విడిచి స్వస్థురాలవు కమ్ము. మొండి పట్టుదలను వీడి కార్యమును నడిపించుము. పార్వతిని శివునకు ఇమ్ము (27).

బ్రహ్మ ఇట్లు పలికెను -

నీ ఆ మాటను విని ఆ మేన నీతో 'లెమ్ము, ఇచటినుండి దూరముగా పొమ్ము; నీవు దుష్టుడవు, అధమాధముడవు' అని పలికెను (28). ఆమె ఇట్లు పలకగా ఇంద్రాది సకల దేవతలు, దిక్పాలకులు వరుసగా వచ్చి ఇట్లు పలికిరి (29).

దేవతలిట్లు పలికిరి -

ఓ మేనా! నీవు పితరుల కుమార్తెవు. మా మాటను ప్రీతితో వినుము. ఈయన సాక్షాత్తుగా పరమానందము నొసగు పరమ శివుడు (30). నీ కుమార్తె మిక్కిలి దుస్సహమగు తపస్సును చేయగా, మంచి భక్తుల యందు ప్రేమ గల శంభుడు దయతో దర్శనమును, వరమును ఇచ్చి యున్నాడు (31)

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు మేన చాల సేపు దుఃఖించి, 'భయం కరాకరుడగు కైలాసపతికి నేను కన్యను ఈయను' అని పలికెను (32). ఓ దేవతలారా! మీరందరు యోజన చేసి ఈ పార్వతి యొక్క పరమ సౌందర్యమును వ్యర్థము చేయుటకు ఏల పూనుకొంటిరి? (33) ఓ మహర్షీ! ఆమె ఇట్లు పలుకగా, వసిష్ఠుడు మొదలగు సప్తర్షులు ముందుకు వచ్చి ఇట్లు పలకిరి (34).

సప్తర్షులిట్లు పలికిరి -

హిమవత్పత్నీ! నీవు పితృ దేవతల కుమార్తెవు. నీ కార్యమును సాధించుటకై మేము వచ్చితిమి. మేము చెప్పిన వచనములలో విరోధము మాకు తోచుట లేదు (35). శంకరుని దర్శనము సర్వోత్కృష్టమైన లాభము. ఆయన నీ దానమును స్వీకరించుటకై నీ గృహమునకు వచ్చి యున్నాడు (36). వారిట్లు పలుకగా జ్ఞానవిహీనురాలగు మేన మునుల వాక్యమును వమ్ము చేసి కోపముతో ఆ ఋషులకు ఇట్లు బదులిడెను (37)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 147 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. గురువు 🌻*

*గురువనగా అయస్కాంతము. శిష్యుడనగా ఇనుప ముక్క. అయస్కాంతపు సాన్నిధ్యముచే ఇనుపముక్క అయస్కాంతము అగుచున్నది.ఇనుమునకు అయస్కాంతము సాన్నిధ్యము ఇచ్చినదే కాని అయస్కాంత తత్త్వమును ధారపోయలేదు.*

*అట్లే గురువు శిష్యునకు తన భావములను, నమ్మకములను, ఆచారములను రుద్దడు. రుద్దుట రాజకీయ లక్షణము అది పార్టీలు, మతములు మార్చుటకు పనికి వచ్చును. కాని శిష్యుని గురువుగా సృష్టించుటకు పనికిరాదు. జీవునికి దైవముగా రెండవజన్మము ఇచ్చుటకు పనికిరాదు.*

*ఇనుములో అయస్కాంత ధర్మము నిద్రాణమై యున్నది. దానిని మేల్కొలుపుటకు మాత్రమే అయస్కాంతము తన సాన్నిధ్యమును ప్రసాదించును. అట్లే గురువు ప్రయోగించినది ఉద్బోధము (Induction) అను ప్రక్రియే గాని, బోధ (Conduction) అను పద్ధతి కాదు.*

...... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 136 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 136. GOING INTO FEAR 🍀*

*🕉 Whenever there is fear, never try to escape from it. In fact, take hints from fear. Those are the directions in which you need to travel. Fear is simply a challenge. It calls you: "Come!" 🕉*
 
*Whenever something is really good, it is also scary, because it brings you some insights. It forces you toward certain changes. It brings you to a brink from where, if you go back, you will never forgive yourself. You will always remember yourself as a coward. If you go ahead, it is dangerous. That's what is scary. Whenever there is some fear, always remember not to go back, because that is not the way to solve it. Go into it. If you are afraid of the dark night, go into the dark night-because that is the only way to overcome it.*

*That is the only way to transcend the fear. Go into the night; there is nothing more important than that. Wait, sit there alone, and let the night work. If you fear, tremble. Let the trembling be there, but tell the night, "Do whatever you want to do. I am here." After a few minutes you will see that everything has settled. The darkness is no longer dark, it has come to be luminous. You will enjoy it. You can touch it-the velvety silence, the vastness, the music. You will be able to enjoy it, and you will say, "How foolish I was to be afraid of such a beautiful experience!”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 346 / Sri Lalitha Chaitanya Vijnanam - 346🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।*
*వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀*

*🌻 346. 'విజయా'🌻* 

*విజయ స్వరూపము శ్రీమాత అని అర్థము. సంధ్యాకాలము కొంచెము దాటిన పిదప నక్షత్రములు కొంచెము ప్రకాశించు కాలము విజయ అని పిలువబడును. ఈ కాలమున ప్రారంభించు కార్యములు విజయవంతమగును. అట్లే దినములో పదునొకండవ ముహూర్తమును విజయ అని వర్ణింతురు. విజయమును కోరు వారందరూ పయనించుటకు అది ఉత్తమ కాలమని తెలుప బడినది. ఆ సమయమున కాలము విజయ రూపమై యుండునట. ఆశ్వయుజ మాసమునందు శుక్లపక్ష దశమి తిథి యందు నక్షత్రోదయ కాలము సర్వ కార్యార్థ సిద్ధి నొసగును. ఈ తిథి విజయ దశమి అని ప్రసిద్ధి గాంచినది.*

*విశేషమగు జయము కలిగించునది గనుక శ్రీమాత విజయగ వర్ణింపబడినది, కీర్తింపబడినది. దేవీ పురాణమందు 68 శివ తీర్థములు పేర్కొనబడినవి. వానిలో కాశ్మీరమున గల శివతీర్థమును విజయ తీర్థమని తెలిపిరి. ఆ శివ తీర్థములకు శ్రీమాతయే అధ్యక్షురాలు. విశ్వకర్మ శాస్త్రమందు తెలుపబడిన గృహ నిర్మాణములలో విజయ అనునది విశేష రూపము గల గృహముగ తెలుపబడినది. పాండవులలో అర్జునుని విజయుడని కీర్తించినారు. అతని నెప్పుడునూ శ్రీమాత విజయ రూపము ఆవరించి యుండెడిదట. విజయదశమినాడు విజయుడు ఒంటరిగ కురుసైన్యమును నిర్జించి విరటుని గోవులను కాపాడినాడు. అంతః శత్రువులను, బాహ్యశత్రువులను జయించిన వారు విజయులు. యోగులు, సిద్ధులు అట్టివారు. వారి యందు శ్రీమాత పరిపూర్ణ సాన్నిధ్య ముండును. విజయ నామము అత్యంత శుభప్రదమైనది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 346 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala*
*Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻*

*🌻 346. Vijayā विजया (346) 🌻*

*She is always victorious. She wins all Her battles against evil doers who are known as demons. It can also be said that She has conquered Śiva’s love, hence victorious. During dasara festival, 10th day evening (known as vijaya dasami, meaning victorious 10th day of dasara festival) twilight time is considered as the most auspicious time to commence any event. There is a tithi nitya devi (worshipped in Śrī Cakra) by name Vijayā.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹