మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 147
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 147 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. గురువు 🌻
గురువనగా అయస్కాంతము. శిష్యుడనగా ఇనుప ముక్క. అయస్కాంతపు సాన్నిధ్యముచే ఇనుపముక్క అయస్కాంతము అగుచున్నది.ఇనుమునకు అయస్కాంతము సాన్నిధ్యము ఇచ్చినదే కాని అయస్కాంత తత్త్వమును ధారపోయలేదు.
అట్లే గురువు శిష్యునకు తన భావములను, నమ్మకములను, ఆచారములను రుద్దడు. రుద్దుట రాజకీయ లక్షణము అది పార్టీలు, మతములు మార్చుటకు పనికి వచ్చును. కాని శిష్యుని గురువుగా సృష్టించుటకు పనికిరాదు. జీవునికి దైవముగా రెండవజన్మము ఇచ్చుటకు పనికిరాదు.
ఇనుములో అయస్కాంత ధర్మము నిద్రాణమై యున్నది. దానిని మేల్కొలుపుటకు మాత్రమే అయస్కాంతము తన సాన్నిధ్యమును ప్రసాదించును. అట్లే గురువు ప్రయోగించినది ఉద్బోధము (Induction) అను ప్రక్రియే గాని, బోధ (Conduction) అను పద్ధతి కాదు.
...... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
09 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment