శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 346 / Sri Lalitha Chaitanya Vijnanam - 346
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 346 / Sri Lalitha Chaitanya Vijnanam - 346🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀
🌻 346. 'విజయా'🌻
విజయ స్వరూపము శ్రీమాత అని అర్థము. సంధ్యాకాలము కొంచెము దాటిన పిదప నక్షత్రములు కొంచెము ప్రకాశించు కాలము విజయ అని పిలువబడును. ఈ కాలమున ప్రారంభించు కార్యములు విజయవంతమగును. అట్లే దినములో పదునొకండవ ముహూర్తమును విజయ అని వర్ణింతురు. విజయమును కోరు వారందరూ పయనించుటకు అది ఉత్తమ కాలమని తెలుప బడినది. ఆ సమయమున కాలము విజయ రూపమై యుండునట. ఆశ్వయుజ మాసమునందు శుక్లపక్ష దశమి తిథి యందు నక్షత్రోదయ కాలము సర్వ కార్యార్థ సిద్ధి నొసగును. ఈ తిథి విజయ దశమి అని ప్రసిద్ధి గాంచినది.
విశేషమగు జయము కలిగించునది గనుక శ్రీమాత విజయగ వర్ణింపబడినది, కీర్తింపబడినది. దేవీ పురాణమందు 68 శివ తీర్థములు పేర్కొనబడినవి. వానిలో కాశ్మీరమున గల శివతీర్థమును విజయ తీర్థమని తెలిపిరి. ఆ శివ తీర్థములకు శ్రీమాతయే అధ్యక్షురాలు. విశ్వకర్మ శాస్త్రమందు తెలుపబడిన గృహ నిర్మాణములలో విజయ అనునది విశేష రూపము గల గృహముగ తెలుపబడినది. పాండవులలో అర్జునుని విజయుడని కీర్తించినారు. అతని నెప్పుడునూ శ్రీమాత విజయ రూపము ఆవరించి యుండెడిదట. విజయదశమినాడు విజయుడు ఒంటరిగ కురుసైన్యమును నిర్జించి విరటుని గోవులను కాపాడినాడు. అంతః శత్రువులను, బాహ్యశత్రువులను జయించిన వారు విజయులు. యోగులు, సిద్ధులు అట్టివారు. వారి యందు శ్రీమాత పరిపూర్ణ సాన్నిధ్య ముండును. విజయ నామము అత్యంత శుభప్రదమైనది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 346 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻
🌻 346. Vijayā विजया (346) 🌻
She is always victorious. She wins all Her battles against evil doers who are known as demons. It can also be said that She has conquered Śiva’s love, hence victorious. During dasara festival, 10th day evening (known as vijaya dasami, meaning victorious 10th day of dasara festival) twilight time is considered as the most auspicious time to commence any event. There is a tithi nitya devi (worshipped in Śrī Cakra) by name Vijayā.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment