1) 🌹 14, JULY 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 398 / Bhagavad-Gita - 398 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 26 / Chapter 10 - Vibhuti Yoga - 26 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 245 / Agni Maha Purana - 245 🌹
🌻. శివ పూజా విధి వర్ణనము - 1 / Mode of worshipping Śiva (śivapūjā) - 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 110 / DAILY WISDOM - 110 🌹
🌻 19. చైతన్యం యొక్క విషయం స్పృహతో సంబంధం కలిగి ఉండాలి / 19. The Content of Consciousness has to be Related to Consciousness 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 376 🌹*
6) 🌹. శివ సూత్రములు - 112 / Siva Sutras - 112 🌹
🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 15 / 2-07. Mātrkā chakra sambodhah - 15 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 14, జూలై, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, రోహిణి వ్రతం, Pradosh Vrat, Rohini Vrat🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 53 🍀*
*56. మఙ్గలం మఙ్గలం నిత్యం మఙ్గలం జయమఙ్గలం ।*
*మఙ్గలం శ్రీమహాలక్ష్మి మఙ్గలం శుభమఙ్గలమ్ ॥*
*ఇతి శ్రీమహాలక్ష్మీసుప్రభాతం సంపూర్ణం.
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : పూర్ణయోగము యొక్క లక్ష్యము - ఇహజీవనాన్ని క్రొత్త రీతిలో రూపాంతరం చెందించడం పూర్ణయోగ లక్ష్యం. జీవనాన్ని ఆత్మధర్మ మందు ప్రతిష్ఠించడమూ, అందు కొరకై దేహ ప్రాణ మనో వ్యాపారముల మూలములను మనస్సున కతీతమైన చేతనకు బదలాయించడమూ ఇచట జరగవలసి వున్నది.🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాఢ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 19:18:15 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: రోహిణి 22:28:46 వరకు
తదుపరి మృగశిర
యోగం: దండ 08:28:59 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: కౌలవ 06:48:51 వరకు
వర్జ్యం: 13:55:40 - 15:37:56
మరియు 28:30:18 - 30:14:06
దుర్ముహూర్తం: 08:26:21 - 09:18:41
మరియు 12:48:00 - 13:40:20
రాహు కాలం: 10:43:43 - 12:21:50
గుళిక కాలం: 07:27:29 - 09:05:36
యమ గండం: 15:38:04 - 17:16:11
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 19:02:28 - 20:44:44
సూర్యోదయం: 05:49:21
సూర్యాస్తమయం: 18:54:18
చంద్రోదయం: 02:37:10
చంద్రాస్తమయం: 16:12:28
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 22:28:46 వరకు తదుపరి
మానస యోగం - కార్య లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 398 / Bhagavad-Gita - 398 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 26 🌴*
*26. అశ్వత్థ: సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద: |*
*గంధర్వాణాం చిత్రరథ: సిద్దానాం కపిలో ముని: ||*
🌷. తాత్పర్యం :
*నేను వృక్షములలో రావిచెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలుడను అయి యున్నాను.*
🌷. భాష్యము :
*అత్యంత ఉన్నతమును మరియు సుందరమును అగు వృక్షములలో రావిచెట్టు ఒకటి. భారతదేశజనులు తమ ప్రాత:కాల కర్మలలో ఒకటిగా దానిని అర్చింతురు. విశ్వములలో గొప్ప భక్తునిగా పరిగణింపబడెడి నారదుడు దేవతలలో సైతము పూజలనందును. కనుకనే భక్తుని రూపున అతడు శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. గంధర్వలోకము మనోహరముగా గానము చేయువారితో నిండియుండును. వారి ఉత్తమగాయకుడు చిత్రరథుడు.*
*సిద్దులలో దేవహుతి తనయుడైన కపిలుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. శ్రీకృష్ణుని అవతారమైన అతడు తెలిపిన తత్త్వము శ్రీమద్భాగవతమున వివరింపబడినది. తదనంతర కాలమున వేరొక కపిలుడు ప్రసిద్ధి పొందినను అతని తత్త్వము నాస్తికమైనట్టిది. కావుననే వారి నడుమ గొప్ప అంతరము కలదు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 398 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 26 🌴*
*26. aśvatthaḥ sarva-vṛkṣāṇāṁ devarṣīṇāṁ ca nāradaḥ*
*gandharvāṇāṁ citrarathaḥ siddhānāṁ kapilo muniḥ*
🌷 Translation :
*Of all trees I am the banyan tree, and of the sages among the demigods I am Nārada. Of the Gandharvas I am Citraratha, and among perfected beings I am the sage Kapila.*
🌹 Purport :
*The banyan tree (aśvattha) is one of the highest and most beautiful trees, and people in India often worship it as one of their daily morning rituals. Amongst the demigods they also worship Nārada, who is considered the greatest devotee in the universe.*
*Thus he is the representation of Kṛṣṇa as a devotee. The Gandharva planet is filled with entities who sing beautifully, and among them the best singer is Citraratha. Amongst the perfect living entities, Kapila, the son of Devahūti, is a representative of Kṛṣṇa. He is considered an incarnation of Kṛṣṇa, and His philosophy is mentioned in the Śrīmad-Bhāgavatam. Later on another Kapila became famous, but his philosophy was atheistic. Thus there is a gulf of difference between them.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 245 / Agni Maha Purana - 245 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 74*
*🌻. శివ పూజా విధి వర్ణనము - 1 🌻*
*మహేశ్వరుడు చెప్పెను : స్కందా! ఇపుడు శివపూజా విధానమును చెప్పుచున్నాను. ఆచమనము చేసి ప్రణవ జపము చేయుచు సూర్యునకు అర్ఘ్య మీయవలెను. పిమ్మట పూజామండపద్వారమును 'ఫట్' అను మంత్ర ముచ్చరించుచు ఉదకముతో తడిపి, ప్రారంభమున 'హాం' బీజముతో నంది మొదలగు ద్వారపాలకులను పూజింపవలెను. ద్వారముపై ఉదుంబరవృక్షము స్థాపించి, లేదా భావన చేసి, దాని పై భాగముపై గణపతి - సరస్వతీ - లక్ష్మీ దేవులను పూజించవలెను. దక్షిణభాగమున నందిని, గంగను, వామభాగమున మహాకాలుని, యమునను పూజింపవలెను. పిమ్మట దివ్యదృష్టి ప్రసరింప చేసి దివ్యవిఘ్నములను తొలగించుకొనవలెను. వాటిని ఉద్దేశించి పుష్పములు విసరి, ''ఆకాశచారివిఘ్నము లన్నియు తొంగిపోయినవి.'' అని భావన చేయవలెను. కుడి మణవతో మూడు పర్యాయములు భూమిపై కొట్టి, ఇట్లు చేయుటచే భూతములపై నున్న సర్వవిఘ్నములు తొలగి నట్లు భావన చేయవలెను. పిమ్మట యజ్ఞమండపము యొక్క కడప దాటవలెను. ఎడమ కొమ్మ పట్టుకొని లోపల ప్రవేశించి, ఉదుంబరవృక్షమున అస్త్రన్యానము చేసి, మండపమధ్యమున పీఠాధారభూమిపై ''ఓం హాం వాస్త్వధిపతయే బ్రహ్మణే నమః'' అను మంత్రముతో వాస్తుదేవతాపూజ చేయవలెను.*
*నిరీక్షణాశస్త్రములచే శుద్ధము చేయబడిన గడ్డుకములను చేతిలో గ్రహించి, భావన ద్వారా శివాజ్ఞ గైకొని, సాధకుడు మౌనముగా గంగాది నదీతటమునకు వెళ్ళి, అచట తన శరీరమును పవిత్రము చేసికొని గాయత్రి మంత్రజపము చేయుచు వస్త్రముతో వడగట్టిన జలముతో జలాశయమునందు ఆ గడ్డుకములను నింపవలెను. లేదా హృదయబీజమును (మనః) ఉచ్చరించుచు నింపవలెను. పూజకై కావలసిన గంధ - అక్షత - పుష్పాది సకలద్రవ్యములను దగ్గర ఉంచుకొని, భూశుద్ధి మొదలగు కర్మలు చేయవలెను. ఉత్తరాభిముఖుడై, ఆరాధ్యదేవతకు కుడి ప్రక్క శరీరాంగములపై మాతృకాన్యాసము చేసి, సంహారముద్రతో అర్ఘ్యముకొరకై ఉదకము గ్రహించి మంత్రోచ్చారణపూర్వకముగ శిరస్సుకు తగల్చి, దానిని దేవతకు సమర్పించుటకై దగ్గర ఉంచుకొనవలెను. పిమ్మట భోగ్యము లగు కర్మల భోగమునకై కూర్మముద్రను ప్రదర్శించి ద్వాదశ దల హృదయకమలమున తన ఆత్మను ధ్యానించవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 245 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 74*
*🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 1 🌻*
The Lord said:
I. I shall describe the (mode of) worshipping Śiva [i.e., śivapūjā]. After having sipped water, and repeated the syllable Oṃ, one should wash the entrance of the temple with water (consecrated by the) mantra of the weapon and worship the guardian deities of the door-ways and of the oblations etc.
2-3. One should worship goddess Sarasvatī (consort.of Lord Brahmā), Lakṣmī (consort of Lord Viṣṇu) and Gaṇa at the threshold, Nandin (attendant of Lord Śiva) and the Ganges on the right and Mahākāla (form of Śiva) and the Yamunā (river) on the left imagining himself as having divine sight, and after having driven the spirits and impediments present in the sky by throwing a consecrated flower.
4. One should kick the earth thrice with the right heels and enter the place of worship after leaping across the threshold holding the left door frame.
5. Having entered (the temple) by placing the right foot (first) and placing the weapons at the threshold, one should worship at its centre (repeating the following): Oṃ, hāṃ, (obeisance) to Brahmā, the presiding deity of the dwelling place.
6. Then he should go to the river Ganges silently carrying pure golden pitchers by means of searching instruments, after having obtained permission from Śiva.
7. One should fill them with waters of the river filtered with the cloth after the repetition of gāyatrī or the hṛdayamantra, and purifying one’s body.
8. The materials for worship such as the perfumes, unbroken rice and flowers etc. should be placed in front of the place and the purification of five material components (of the earth) should be done.
9. Having placed (these materials) on the right side of the deity with a pleasing face and having lifted these showing saṃhāra mudrā (posture of the fingers representing destruction), one should place them on the head with (the repetition of) the mantra.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 110 / DAILY WISDOM - 110 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 19. చైతన్యం యొక్క విషయం స్పృహతో సంబంధం కలిగి ఉండాలి 🌻*
*చైతన్యం యొక్క పరిమితిని ఏ విధంగానూ గ్రహించలేరు. చైతన్యాన్ని తన వెలుపల ఉన్న ఏదైనా పరిమితం చేస్తుందని ఊహించడం కూడా అసాధ్యమైన విషయం. వాస్తవానికి, చైతన్యానికి వెలుపల ఏదో ఉందనే భావన సైతం పూర్తిగా అసంభవం. ఎందుకంటే చైతన్యానికి బాహ్యమైనది కూడా చైతన్యంలో భాగం కావాలి. లేకపోతే, చైతన్యానికి వెలుపల ఏదో ఉందనే స్పృహ కూడా ఉండదు.*
*చైతన్యం కానిది చైతన్యంలో భాగం కావడం సాధ్యం కాదు. ఎందుకంటే చైతన్యంలో భాగం కావడానికి ఆ విషయానికి చైతన్యంతో సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ చైతన్య భాగం మరియు చైతన్యం మధ్య ఈ సంబంధం మళ్లీ ఒక ప్రశ్నార్థకమైన ప్రతిపాదన. ఎందుకంటే చైతన్యానికి వెలుపల ఉన్న విషయం చైతన్యంతో సంబంధం కలిగి ఉంది తనలో భాగం ఎలా ఔతుంది? కాబట్టి చైతన్యానికి వెలుపల, చైతన్యం కానిది, చైతన్యంతో సంబంధం లేని ఒక విషయాన్ని అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 110 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 19. The Content of Consciousness has to be Related to Consciousness 🌻*
*One can conceive anything but the finitude of consciousness. It is impossible to imagine that consciousness can be limited by anything external to it. In fact, the concept of there being something external to consciousness is itself an unwarranted intervention of a total impossibility, for that which is external to consciousness has also to become a content of consciousness; else, there could not be even a consciousness that there is something external to consciousness.*
*It is also not possible that what is alien to consciousness in character can be its content, for the content of consciousness has to be related to consciousness in order to become its content at all. Now, this relation between the content and consciousness is again a questionable proposition, inasmuch as any relation between consciousness and its content should again be related to consciousness in some way or the other. It is impossible to hold the notion of anything which is unrelated to consciousness, or what is not a content of consciousness or what is dissimilar to consciousness in character.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 376 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. లోపలి నిశ్శబ్ద అనుభవం అసాధారణమైంది. దేనితోనూ పోల్చలేనిది. అంత విలువైన అనుభవం ఏదీ లేదు. కారణం దాని నించీ అన్ని అనుభవాలూ పుడతాయి. నిశ్శబ్దం లేకుంటే సత్యం లేదు. స్వేచ్ఛ లేదు. 🍀*
*జీవితంలోని అసాధారణమయిన అనుభవం నిశ్శబ్దం. లేని పక్షంలో జీవితం ఎంతో అల్లరిగా వుంటుంది. బయట శబ్దముంది. లోపల శబ్దముంది. రెండూ కలిసి ఎవడికయినా పిచ్చెక్కిస్తాయి. సమస్త ప్రపంచాన్నీ పిచ్చెక్కిస్తాయి. వ్యక్తి లోపలి శబ్దాన్ని ఆపాలి. బయటి శబ్దం మన అదుపులో లేనిది. దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. కానీ మనం లోపలి శబ్దాన్ని ఆపవచ్చు. ఒకసారి లోపలి శబ్దం ఆగితే నిశ్శబ్దం నిలబడితే బయటి శబ్దం సమస్య కాదు. దాన్ని నువ్వు ఎంజాయ్ చేయవచ్చు. ఎట్లాంటి సమస్య లేకుండా దాంట్లో జీవించవచ్చు.*
*లోపలి నిశ్శబ్ద అనుభవం అసాధారణమైంది. దేనితోనూ పోల్చలేనిది. అంత విలువైన అనుభవం ఏదీ లేదు. కారణం దాని నించీ అన్ని అనుభవాలూ పుడతాయి. సమస్త మత ఆలయానికి యిది పునాది. నిశ్శబ్దం లేకుంటే సత్యం లేదు. స్వేచ్ఛ లేదు. దేవుడు లేడు. నిశ్శబ్దం వల్ల ప్రతిదీ స్థలాన్ని మార్చుకుంటుంది. నీ దృష్టి మారుతుంది. నిశ్శబ్దం చూడలేని దాన్ని చూపిస్తుంది. తెలియని దాన్ని తెలిసేలా చేస్తుంది. దాని అసాధారణ గుణమది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 112 / Siva Sutras - 112 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 15 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*
*విసర్గ అనేది ఇప్పటి వరకు చర్చించబడిన శివుని ఐదు శక్తులకు పరాకాష్ట. అవి చిత్ శక్తి, ఆనంద శక్తి, ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి మరియు క్రియా శక్తి. ఈ ప్రతి శక్తిలో, మిగిలిన నాలుగు కూడా సహజీవనం చేస్తాయి. ఒక నిర్దిష్ట శక్తి యొక్క ప్రధాన స్వభావం కారణంగా వీటిని ప్రత్యేక శక్తులు అంటారు. ఈ ఐదు శక్తులలో సూక్ష్మమైనది చిత్ శక్తి, దీని నుండి ఆకాశము (ఈథర్), గాలి, అగ్ని, నీరు మరియు భూమి అనే ఐదు స్థూల మూలకాలు సృష్టించబడ్డాయి. శివుడు ఎల్లప్పుడూ సూక్ష్మం నుండి స్థూలానికి మరియు స్థూలo నుండి సూక్ష్మానికి కదులుతాడు. అందువల్ల, పదహారు అచ్చుల ముగింపులో, అవగాహన రావడం ప్రారంభం అవుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 112 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-07. Mātrkā chakra sambodhah - 15 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴*
*The visarga is the culmination point of five energies of Śiva discussed so far. They are cit śakti, ānanda śakti, icchā śakti, jñāna śakti and kriyā śakti. In each of these energies, the other four also co-exist. These śakti-s are so called because of the predominant nature of a particular śakti. The subtlest of these five energies is cit śakti, from which the five gross elements ether, air, fire, water and earth are created. Śiva always moves from subtle to gross and gross to subtle. Therefore, at the end of all the sixteen vowels, perception begins to happen.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj