శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 464 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 464 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 464. 'కాంతిమతి' - 1 🌻


కాంతియే మతిగా కలది శ్రీమాత అని అర్థము. మతి అంత కాంతితో నిండుట పూర్ణ దివ్యత్వమునకు సంకేతము. మతి కాంతి వంతముగను, కాంతివిహీనముగ కూడ నుండుట కవకాశ కలదు. 'మతి' అనగా మనస్సు. మనస్సు కళాకళలుగ నుండును. అమావాస్య నుండి పౌర్ణమి వరకు అనేక కళలతో మనస్సు చంచలముగ నుండుట సహజము. చంద్రుడే మన మనస్సు అని వేదములు తెలియజేయు చున్నవి. "చంద్రమా మనసో జాతః" అన్నది సూక్తము. చంద్రునికే కళలు వున్నప్పుడు మనస్సునకు కూడ కళలుండును. చంద్రునికే గ్రహణమున్నప్పుడు మనస్సునకు మాత్రము గ్రహణము పట్టదా? మనస్సు ప్రధానముగ జీవించువారు మానవులు. మనోకాంతి హెచ్చుతగ్గులతో జీవునికి స్పృహ, నిస్పృహ కలుగుచుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻

🌻 464. 'Kantimati' - 1 🌻


Kantimati means the one whose mind is filled with light. A mind filled with such light is a sign of complete divinity. As the mind can be filled with light, so there exists a possibility that the mind can be filled with darkness. 'Mati' means mind. Mind is luminous. From new moon to full moon, it is natural for the mind to be restless with many phases. The Vedas tell us that the moon is our mind. The saying is 'Chandrama Manaso Jatah'. When the moon has phases, the mind also has phases. When the moon itself is eclipsed, doesn't the mind gets eclipsed? Humans are the living beings of the mind. With the ups and downs of the mind, the living being becomes conscious and depressed.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment