శ్రీ లలితా సహస్ర నామములు - 148 / Sri Lalita Sahasranamavali - Meaning - 148

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 148 / Sri Lalita Sahasranamavali - Meaning - 148 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 148. దురారాధ్యా, దురాదర్షా, పాటలీ కుసుమప్రియా ।
మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా ॥ 148 ॥ 🍀

🍀 770. దురారాధ్యా ;
కష్ట సాధ్యమైన ఆరాధన కలిగినది

🍀 771. దురాధర్షా :
చుచూటకు కష్ట సాధ్యమైనది

🍀 772. పాటలీ కుసుమప్రియా :
పాటలీపుష్పమునందు ప్రీతి కలిగినది

🍀 773. మహతీ :
గొప్పదైనది

🍀 774. మేరునిలయా :
మేరుపర్వతము నివాసముగా కలిగినది

🍀 775. మందారకుసుమప్రియా :
మందారపువ్వులు అంటే ప్రీతి కలిగినది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 148 🌹

📚. Prasad Bharadwaj

🌻 148. Duraradhya duradhatsha patali kusumapriya
Hamati merunilaya mandara kusumapriya ॥ 148 ॥ 🌻

🌻 770 ) Dhuraradhya -
She who is rarely available for worship

🌻 771 ) Dhuradharsha -
She who cannot be won

🌻 772 ) Patali kusuma priya -
She who likes the buds of Patali tree

🌻 773 ) Mahathi -
She who is big

🌻 774 ) Meru nilaya -
She who lives in Meru mountain.

🌻 775 ) Mandhara kusuma priya -
She who likes the buds of Mandhara tree

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

07 Nov 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 100

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 100 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భాగవత రహస్యము - 2 🌻

ఎందరు వ్యక్తులున్నారో అన్ని విధములైన ఆదర్శములు వర్తించుచున్న ఈ మహాసముద్రమున ఎవని ఆదర్శము స్వతంత్ర సంచలనము పుట్టింపగలదు? వ్యక్తులలో ఆదర్శములున్నను వ్యక్తులు స్వభావ మహాసముద్రమున మునకలు వేయుచున్నారు.

ఈ రహస్యమునే నారదుడు వ్యాసునకు భాగవత రహస్యముగా బోధించెను. "కొండచిలువచే మ్రింగబడుచున్న ఇద్దరిలో ఒకరినొకరు వెలుపలకు లాగి రక్షింపలేరు" అని నారదుడు హెచ్చరిక చేసెను.

వ్యాసాదులు ఆరాధించినది సృష్టి మహాసముద్రము. అదియే జీవులలోన అంతర్యామియైన నారాయణుడు. అందు అందరును వర్తించుచున్నారు. వానికి అందరును వశులే.

ఈ అంతర్యామితత్త్వము మానవుని బహిరంతర్లోకములలో వ్యాపించియున్నది. దానిని ఆరాధించుచు వ్యాసాదులు రచనలు సాగించిరే గాని, పండితులు, విమర్శకుల, సంఘ సంస్కర్తల మొగములు చూచికాదు.

అట్టి రచనలకు పరిణత స్వరూపమై పరమావధియైన చరమావధిగా రూపుకట్టుకున్నది శ్రీమద్భాగవతము. అది ఈ సృష్టి రూపమున ఉన్న అంతర్యామికి సమర్పితము.

శాశ్వత కాలమునందు వచ్చుచు పోవుచున్న మానవుల మొత్తము స్వభావమైన మానవుడు భాగవతమునకు కథానాయకుడు. అతడు సృష్టి ఆది నుండి నేటి వరకును ఏయే లోకముల దారులలో దిగివచ్చెనో ఆ మొత్తము వైఖరిని అద్దము పట్టిచూపునది భాగవతము.

నారాయణుడు, చతుర్ముఖుడు, స్వాయంభువ మనవు, ఆది వరాహమూర్తి, కపిలాచార్యుడు, విష్ణువు, శివుడు, అంబిక, ధ్రువుడు, పృథు చక్రవర్తి, ప్రహ్లాదుడు, అంబరీషుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అను పాత్రలలో ఇందలి కథానాయకుడు సకల మానవధర్మ సంస్థాపనామూర్తియై రూపుకట్టెను. ఇన్నిటిని శ్రద్ధగా చదువుకున్నచో సృష్టి మొదలు నేటివరకును గల పురుషుడెవ్వడో, అతని శాశ్వత ధర్మస్వరూపమెట్టిదో విశదపడును.

ఈ కథలన్నియు ఒకే నారాయణుని వివిధ ధర్మ గుణముల వివరణములే గాని, వేర్వేరు కథలు కావు. ఇందలి పురుషార్థములను భక్తితో అధ్యయనము చేసినచో మానవునకు తెలియవలసినవి అన్నియు తెలియును.

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

07 Nov 2021

వివేక చూడామణి - 148 / Viveka Chudamani - 148

🌹. వివేక చూడామణి - 148 / Viveka Chudamani - 148🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 31. ఆత్మ దర్శనం -3 🍀

487. ఎవరి చూపులు చంద్రుని కాంతి వంతమైన కిరణములవలె చల్లగా ఉండి, శారీరక సంబంధమైన అన్ని అలసటలను తొలగించి, శారీరక రుగ్మతులను తొలగిస్తుందో అట్టి నీవు ఒక్క క్షణములో నన్ను నీలో చేర్చుకొని ఆత్మను అవగతం చేసుకొని శాశ్వతమైన బ్రహ్మానంద స్థితిలో ఉంచినావు.

488. నేను నీ చేత దీవించబడినాను. నేను నా జీవితములో అత్యున్నత స్థితిని పొందితిని. నేను మార్పులతో కూడిన అన్ని బంధనాల నుండి విడుదల పొందితిని. నేను శాశ్వతానంద సారమును, శాశ్వితుడను. ఇందంతా తమ దయ వలనే కదా!

489. నేను అన్ని బాధల నుండి విడివడినాను. నా యొక్క శారీరక బంధనాలన్నింటి నుండి విడివడి, నాశనం లేని పవిత్రమైన, శాశ్వతమైన, కల్మషం లేని అనంతమైన ఆత్మను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 148 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 31. Soul Realisation - 3 🌻

487. Whose glance, like the shower of concentrated moonbeams, has removed my exhaustion brought on by the afflictions of the world, and in a moment admitted me to the undecaying status of the Atman, the Bliss of infinite majesty !

488. Blessed am I; I have attained the consummation of my life, and am free from the clutches of transmigration; I am the Essence of Eternal Bliss, I am infinite – all through thy mercy !

489. I am unattached, I am disembodied, I am free from the subtle body, and undecaying, I am serene, I am infinite, I am taintless and eternal.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

07 Nov 2021

శ్రీ శివ మహా పురాణము - 471

🌹 . శ్రీ శివ మహా పురాణము - 471 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 34

🌻. అనరణ్యుడు - 3 🌻

ఇంతలో ప్రాజ్ఞుడు, గొప్ప బ్రాహ్మణుడు అగు గురువు, బుద్ధిమంతుడగు పురోహితుడు రాజ సన్నిధికి విచ్చేసిరి (23). రాజు వారిద్దరికీ నమస్కరించి పూజించి వారి యెదుట భోరుమనెను. వారు ప్రశ్నించగా ఆతడు ఉచితరీతిని వృత్తాంతమునంతనూ నివేదించెను (24). అపుడు వేదవేత్తయగు గురువు, పండితుడగు పురోహితుడు కలిసి నీతి శాస్త్రజ్ఞులు గనుక, రాజునకు ఇట్లు బోధించిరి (25). శోకముచే వ్యాకులమైన మనస్సుగల రాజపత్నులకు, రాజకుమారులకు, రాజకన్యకు వారిద్దరు అందరికీ హితమును కలిగించే ఉత్తమనీతిని సాదరముగా విన్నవించిరి (26).

గురువు, రాజ పురోహితుడు ఇట్లు పలికిరి-

మహాప్రాజ్ఞా! రాజా! మంచి మితమును కలిగించు మా ఇద్దరి మాటను వినుము. బంధువర్గముతో గూడి దుఃఖించకుము. శాస్త్రమునందు సద్బుద్ధిని కలిగియుండుము (27). రాజా! ఈనాడుగాని, సంవత్సరము తరువాత గాని అమ్మాయిని యోగ్యుడగు బ్రాహ్మణునకు గాని, లేదా ఎవరికో ఒకనికి గాని ఈయవలసినదే గదా! (28) ముల్లోకములలో బ్రాహ్మణునికంటె యోగ్యమగు పాత్ర మాకు గానరాలేదు. కావున కుమార్తెను మహర్షికి ఇచ్చి నీ సంపదలన్నిటినీ రక్షించు కొనుము (29). రాజా ! ఒక్కరి కొరకై సర్వము నశించే సందర్భములో వానిని విడిచి సర్వమును రక్షించవలెను. ఈ నీతి శరణాగతుని విషయములో వర్తించదు (30).

వసిష్ఠుడిట్లు పలికెను-

రాజు ఆ బుద్ధిమంతుల మాటలను విని అనేక పర్యాయములు రోదించి, కన్యను అలంకరించి, ఆ మహర్షికి అప్పజెప్పెను. (31). ఓ శైలరాజా! ఆ ముని కన్యను స్వీకరించెను. ఆతడు అక్ష్మివంటి ఆ పద్మను ఆనందముతో పరిణయమాడి యథావిధిగా తన గృహమునకు దోడ్కొని వెళ్లెను (32). రాజు వృద్ధునకు కుమార్తె నిచ్చుటచే అందరినీ వీడి మనస్సులో దుఃఖము గలవాడై తపస్సు కొరకు అడవికి పోయెను (33). ఆయన భార్య తన ప్రాణనాథుడు అడవికి పోగానే భర్తయొక్క వియోగము, కుమార్తె యొక్క దుఃఖమును సహింపలేకపోయెను. ఓ పర్వతరాజా! ఆసుందరి ప్రాణములను విడిచి పెట్టెను (34).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

07 Nov 2021

గీతోపనిషత్తు -272

🌹. గీతోపనిషత్తు -272 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 11-2

🍀 11-2. దైవానుగ్రహము - అన్నివేళల యందును వ్యాపించి, శాశ్వతముగ వసించియున్న వానిని ఎందైనను చూడవచ్చును. ఎప్పుడైనను చూడవచ్చును. ఎక్కడైనను చూడవచ్చును. చూడలేకపోవుట గ్రుడ్డితనమే! మూఢత్వమే! అందుకని, మూఢుడగుట చేతనే తనను చూడలేరని, తాను భూతమహేశ్వరుడైనను కూడ చూడలేకున్నారని తెలిపినాడు. తానే స్వయముగ శరీరము ధరించి జీవులలో తిరుగుచున్నను చూడలేకపోవుట ఎంత దురదృష్టము! ఇది జీవుల దుస్థితి. కన్ను లెదుట నున్నది వైకుంఠమే అని తెలిసినను మరచుట నిర్లక్ష్యమే కదా! 🍀

అవజావంతి మాం మూఢా మానుషీం తమమాశ్రితమ్ |
పరం భావ మజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11

తాత్పర్యము : సమస్త భూతములకు ఈశ్వరుడగు నన్ను మూఢులు తెలియలేకున్నారు. శరీరము ధరించి యున్నను కూడ నన్ను తెలియలేక అలక్ష్యము చేయుచున్నారు.

వివరణము : ఇట్లంతటను అన్నివేళల యందును వ్యాపించి, శాశ్వతముగ వసించియున్న వానిని ఎందైనను చూడవచ్చును. ఎప్పుడైనను చూడవచ్చును. ఎక్కడైనను చూడవచ్చును. చూడలేకపోవుట గ్రుడ్డితనమే! మూఢత్వమే! అందుకని, మూఢుడగుట చేతనే తనను చూడలేరని, తాను భూతమహేశ్వరుడైనను కూడ చూడలేకున్నారని తెలిపినాడు.

అంతేగాక, తానే స్వయముగ శరీరము ధరించి జీవులలో తిరుగుచున్నను చూడలేకపోవుట ఎంత దురదృష్టము! ఇది జీవుల దుస్థితి. కన్ను లెదుట నున్నది వైకుంఠమే అని తెలిసినను మరచుట నిర్లక్ష్యమే కదా! ఎక్కడో దేవుడున్నాడని వెదుకులాడు వారందరు మూర్ఖ్యులే కదా! తమ యందు, తమ పరిసరముల యందు ఈశ్వరుడే నిండియున్నను చూడలేరు.

స్వయముగ తాను ఏ రూపము ధరించినను చూడలేరు. చూడలేని వారు మరికొందరు చూడలేని వారిని ఆశ్రయించి, స్పష్టముగ నున్న వస్తువును చూడ లేకుండుట వింతలన్నిటిలోనికి పతాకస్థాయి చేరిన వింత. పరమాత్మ తానే స్వయముగ రూపుగట్టుకొని శ్రీకృష్ణుడుగ షోడశ కళలతో భూమి పై క్రీడార్ధముగ చరించినాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

07 Nov 2021

7-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 07, ఆది వారం, నవంబర్ 2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 272  🌹  
3) 🌹. శివ మహా పురాణము - 471🌹 
4) 🌹 వివేక చూడామణి - 148 / Viveka Chudamani - 148🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -100🌹  
6) 🌹 Osho Daily Meditations - 89🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 148 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 148🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*07, నవంబర్‌ 2021, - భానువారము*  
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 3వ రోజు 🍀*

*నిషిద్ధములు: ఉప్పు కలిసినవి, ఉసిరి*
*దానములు: ఉప్పు*
*పూజించాల్సిన దైవము: పార్వతి*
*జపించాల్సిన మంత్రము:*  
*ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం,  
శరద్‌ ఋతువు, కార్తీక మాసం
తిథి: శుక్ల తదియ 16:23:12 వరకు 
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: జ్యేష్ఠ 21:06:05 వరకు 
తదుపరి మూల
యోగం: అతిగంధ్ 19:07:13 వరకు 
తదుపరి సుకర్మ
కరణం: గార 16:25:12 వరకు
వర్జ్యం: 04:39:04 - 06:04:48 మరియు
28:19:40 - 29:46:36 
దుర్ముహూర్తం: 16:10:53 - 16:56:33
రాహు కాలం: 16:16:35 - 17:42:14
గుళిక కాలం: 14:50:56 - 16:16:35
యమ గండం: 11:59:37 - 13:25:16
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 13:13:28 - 14:39:12
సూర్యోదయం: 06:16:59
సూర్యాస్తమయం: 17:42:14
చంద్రోదయం: 08:43:31
చంద్రాస్తమయం: 20:04:43
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
కాల యోగం - అవమానం 21:06:05 వరకు 
తదుపరి సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -272 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్* 
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 11-2
 
*🍀 11-2. దైవానుగ్రహము - అన్నివేళల యందును వ్యాపించి, శాశ్వతముగ వసించియున్న వానిని ఎందైనను చూడవచ్చును. ఎప్పుడైనను చూడవచ్చును. ఎక్కడైనను చూడవచ్చును. చూడలేకపోవుట గ్రుడ్డితనమే! మూఢత్వమే! అందుకని, మూఢుడగుట చేతనే తనను చూడలేరని, తాను భూతమహేశ్వరుడైనను కూడ చూడలేకున్నారని తెలిపినాడు. తానే స్వయముగ శరీరము ధరించి జీవులలో తిరుగుచున్నను చూడలేకపోవుట ఎంత దురదృష్టము! ఇది జీవుల దుస్థితి. కన్ను లెదుట నున్నది వైకుంఠమే అని తెలిసినను మరచుట నిర్లక్ష్యమే కదా! 🍀*

*అవజావంతి మాం మూఢా మానుషీం తమమాశ్రితమ్ |*
*పరం భావ మజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11*

*తాత్పర్యము : సమస్త భూతములకు ఈశ్వరుడగు నన్ను మూఢులు తెలియలేకున్నారు. శరీరము ధరించి యున్నను కూడ నన్ను తెలియలేక అలక్ష్యము చేయుచున్నారు.*

*వివరణము : ఇట్లంతటను అన్నివేళల యందును వ్యాపించి, శాశ్వతముగ వసించియున్న వానిని ఎందైనను చూడవచ్చును. ఎప్పుడైనను చూడవచ్చును. ఎక్కడైనను చూడవచ్చును. చూడలేకపోవుట గ్రుడ్డితనమే! మూఢత్వమే! అందుకని, మూఢుడగుట చేతనే తనను చూడలేరని, తాను భూతమహేశ్వరుడైనను కూడ చూడలేకున్నారని తెలిపినాడు.* 

*అంతేగాక, తానే స్వయముగ శరీరము ధరించి జీవులలో తిరుగుచున్నను చూడలేకపోవుట ఎంత దురదృష్టము! ఇది జీవుల దుస్థితి. కన్ను లెదుట నున్నది వైకుంఠమే అని తెలిసినను మరచుట నిర్లక్ష్యమే కదా! ఎక్కడో దేవుడున్నాడని వెదుకులాడు వారందరు మూర్ఖ్యులే కదా! తమ యందు, తమ పరిసరముల యందు ఈశ్వరుడే నిండియున్నను చూడలేరు.* 

*స్వయముగ తాను ఏ రూపము ధరించినను చూడలేరు. చూడలేని వారు మరికొందరు చూడలేని వారిని ఆశ్రయించి, స్పష్టముగ నున్న వస్తువును చూడ లేకుండుట వింతలన్నిటిలోనికి పతాకస్థాయి చేరిన వింత. పరమాత్మ తానే స్వయముగ రూపుగట్టుకొని శ్రీకృష్ణుడుగ షోడశ కళలతో భూమి పై క్రీడార్ధముగ చరించినాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 471 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 34

*🌻. అనరణ్యుడు - 3 🌻*

ఇంతలో ప్రాజ్ఞుడు, గొప్ప బ్రాహ్మణుడు అగు గురువు, బుద్ధిమంతుడగు పురోహితుడు రాజ సన్నిధికి విచ్చేసిరి (23). రాజు వారిద్దరికీ నమస్కరించి పూజించి వారి యెదుట భోరుమనెను. వారు ప్రశ్నించగా ఆతడు ఉచితరీతిని వృత్తాంతమునంతనూ నివేదించెను (24). అపుడు వేదవేత్తయగు గురువు, పండితుడగు పురోహితుడు కలిసి నీతి శాస్త్రజ్ఞులు గనుక, రాజునకు ఇట్లు బోధించిరి (25). శోకముచే వ్యాకులమైన మనస్సుగల రాజపత్నులకు, రాజకుమారులకు, రాజకన్యకు వారిద్దరు అందరికీ హితమును కలిగించే ఉత్తమనీతిని సాదరముగా విన్నవించిరి (26).

గురువు, రాజ పురోహితుడు ఇట్లు పలికిరి-

మహాప్రాజ్ఞా! రాజా! మంచి మితమును కలిగించు మా ఇద్దరి మాటను వినుము. బంధువర్గముతో గూడి దుఃఖించకుము. శాస్త్రమునందు సద్బుద్ధిని కలిగియుండుము (27). రాజా! ఈనాడుగాని, సంవత్సరము తరువాత గాని అమ్మాయిని యోగ్యుడగు బ్రాహ్మణునకు గాని, లేదా ఎవరికో ఒకనికి గాని ఈయవలసినదే గదా! (28) ముల్లోకములలో బ్రాహ్మణునికంటె యోగ్యమగు పాత్ర మాకు గానరాలేదు. కావున కుమార్తెను మహర్షికి ఇచ్చి నీ సంపదలన్నిటినీ రక్షించు కొనుము (29). రాజా ! ఒక్కరి కొరకై సర్వము నశించే సందర్భములో వానిని విడిచి సర్వమును రక్షించవలెను. ఈ నీతి శరణాగతుని విషయములో వర్తించదు (30).

వసిష్ఠుడిట్లు పలికెను-

రాజు ఆ బుద్ధిమంతుల మాటలను విని అనేక పర్యాయములు రోదించి, కన్యను అలంకరించి, ఆ మహర్షికి అప్పజెప్పెను. (31). ఓ శైలరాజా! ఆ ముని కన్యను స్వీకరించెను. ఆతడు అక్ష్మివంటి ఆ పద్మను ఆనందముతో పరిణయమాడి యథావిధిగా తన గృహమునకు దోడ్కొని వెళ్లెను (32). రాజు వృద్ధునకు కుమార్తె నిచ్చుటచే అందరినీ వీడి మనస్సులో దుఃఖము గలవాడై తపస్సు కొరకు అడవికి పోయెను (33). ఆయన భార్య తన ప్రాణనాథుడు అడవికి పోగానే భర్తయొక్క వియోగము, కుమార్తె యొక్క దుఃఖమును సహింపలేకపోయెను. ఓ పర్వతరాజా! ఆసుందరి ప్రాణములను విడిచి పెట్టెను (34).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 148 / Viveka Chudamani - 148🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 31. ఆత్మ దర్శనం -3 🍀*

487. ఎవరి చూపులు చంద్రుని కాంతి వంతమైన కిరణములవలె చల్లగా ఉండి, శారీరక సంబంధమైన అన్ని అలసటలను తొలగించి, శారీరక రుగ్మతులను తొలగిస్తుందో అట్టి నీవు ఒక్క క్షణములో నన్ను నీలో చేర్చుకొని ఆత్మను అవగతం చేసుకొని శాశ్వతమైన బ్రహ్మానంద స్థితిలో ఉంచినావు. 

488. నేను నీ చేత దీవించబడినాను. నేను నా జీవితములో అత్యున్నత స్థితిని పొందితిని. నేను మార్పులతో కూడిన అన్ని బంధనాల నుండి విడుదల పొందితిని. నేను శాశ్వతానంద సారమును, శాశ్వితుడను. ఇందంతా తమ దయ వలనే కదా! 

489. నేను అన్ని బాధల నుండి విడివడినాను. నా యొక్క శారీరక బంధనాలన్నింటి నుండి విడివడి, నాశనం లేని పవిత్రమైన, శాశ్వతమైన, కల్మషం లేని అనంతమైన ఆత్మను. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 148 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 31. Soul Realisation - 3 🌻*

487. Whose glance, like the shower of concentrated moonbeams, has removed my exhaustion brought on by the afflictions of the world, and in a moment admitted me to the undecaying status of the Atman, the Bliss of infinite majesty !

488. Blessed am I; I have attained the consummation of my life, and am free from the clutches of transmigration; I am the Essence of Eternal Bliss, I am infinite – all through thy mercy !

489. I am unattached, I am disembodied, I am free from the subtle body, and undecaying, I am serene, I am infinite, I am taintless and eternal.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 100 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. భాగవత రహస్యము - 2 🌻*

ఎందరు వ్యక్తులున్నారో అన్ని విధములైన ఆదర్శములు వర్తించుచున్న ఈ మహాసముద్రమున ఎవని ఆదర్శము స్వతంత్ర సంచలనము పుట్టింపగలదు? వ్యక్తులలో ఆదర్శములున్నను వ్యక్తులు స్వభావ మహాసముద్రమున మునకలు వేయుచున్నారు. 

ఈ రహస్యమునే నారదుడు వ్యాసునకు భాగవత రహస్యముగా బోధించెను. "కొండచిలువచే మ్రింగబడుచున్న ఇద్దరిలో ఒకరినొకరు వెలుపలకు లాగి రక్షింపలేరు" అని నారదుడు హెచ్చరిక చేసెను. 

వ్యాసాదులు ఆరాధించినది సృష్టి మహాసముద్రము. అదియే జీవులలోన అంతర్యామియైన నారాయణుడు. అందు అందరును వర్తించుచున్నారు. వానికి అందరును వశులే. 

ఈ అంతర్యామితత్త్వము మానవుని బహిరంతర్లోకములలో వ్యాపించియున్నది. దానిని ఆరాధించుచు వ్యాసాదులు రచనలు సాగించిరే గాని, పండితులు, విమర్శకుల, సంఘ సంస్కర్తల మొగములు చూచికాదు. 

అట్టి రచనలకు పరిణత స్వరూపమై పరమావధియైన చరమావధిగా రూపుకట్టుకున్నది శ్రీమద్భాగవతము. అది ఈ సృష్టి రూపమున ఉన్న అంతర్యామికి సమర్పితము. 

శాశ్వత కాలమునందు వచ్చుచు పోవుచున్న మానవుల మొత్తము స్వభావమైన మానవుడు భాగవతమునకు కథానాయకుడు. అతడు సృష్టి ఆది నుండి నేటి వరకును ఏయే లోకముల దారులలో దిగివచ్చెనో ఆ మొత్తము వైఖరిని అద్దము పట్టిచూపునది భాగవతము. 

నారాయణుడు, చతుర్ముఖుడు, స్వాయంభువ మనవు, ఆది వరాహమూర్తి, కపిలాచార్యుడు, విష్ణువు, శివుడు, అంబిక, ధ్రువుడు, పృథు చక్రవర్తి, ప్రహ్లాదుడు, అంబరీషుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అను పాత్రలలో ఇందలి కథానాయకుడు సకల మానవధర్మ సంస్థాపనామూర్తియై రూపుకట్టెను. ఇన్నిటిని శ్రద్ధగా చదువుకున్నచో సృష్టి మొదలు నేటివరకును గల పురుషుడెవ్వడో, అతని శాశ్వత ధర్మస్వరూపమెట్టిదో విశదపడును. 

ఈ కథలన్నియు ఒకే నారాయణుని వివిధ ధర్మ గుణముల వివరణములే గాని, వేర్వేరు కథలు కావు. ఇందలి పురుషార్థములను భక్తితో అధ్యయనము చేసినచో మానవునకు తెలియవలసినవి అన్నియు తెలియును.

.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 89 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 89. ACCIDENTS 🍀*

*🕉 Always think if the positive side of things: There was an accident, but you are still alive, so you transcended it. 🕉*

Don't take too much note of accidents. Rather, take note that you survived. That is the real thing. You defeated those accidents, and you survived. So there is nothing to worry about. Always think of the positive side of things: The accident happened, but you are still alive, so you transcended it. You proved your mettle, you proved stronger than the accident.

But I can understand that fear will arise if such things happen again and again. You fall into wells, and do things like that, then the fear of death is bound to arise in the mind. But death is going to happen anyway, whether you fall into a well or not. The most dangerous place to avoid, if you want to avoid death, is your bed, because ninety-nine percent of deaths happen there-rarely in a well! Death is going to happen anyhow; it doesn't matter how it happens. And if one has to choose between the bed and the well, I think the well is far better; it has something aesthetic about it.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 148 / Sri Lalita Sahasranamavali - Meaning - 148 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 148. దురారాధ్యా, దురాదర్షా, పాటలీ కుసుమప్రియా ।*
*మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా ॥ 148 ॥ 🍀*

🍀 770. దురారాధ్యా ; 
కష్ట సాధ్యమైన ఆరాధన కలిగినది 

🍀 771. దురాధర్షా : 
చుచూటకు కష్ట సాధ్యమైనది 

🍀 772. పాటలీ కుసుమప్రియా :
 పాటలీపుష్పమునందు ప్రీతి కలిగినది
 
🍀 773. మహతీ : 
గొప్పదైనది 

🍀 774. మేరునిలయా : 
మేరుపర్వతము నివాసముగా కలిగినది 

🍀 775. మందారకుసుమప్రియా :
 మందారపువ్వులు అంటే ప్రీతి కలిగినది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 148 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 148. Duraradhya duradhatsha patali kusumapriya*
*Hamati merunilaya mandara kusumapriya ॥ 148 ॥ 🌻*

🌻 770 ) Dhuraradhya -   
She who is rarely available for worship

🌻 771 ) Dhuradharsha -   
She who cannot be won

🌻 772 ) Patali kusuma priya -   
She who likes the buds of Patali tree

🌻 773 ) Mahathi -   
She who is big

🌻 774 ) Meru nilaya -   
She who lives in Meru mountain.

🌻 775 ) Mandhara kusuma priya -   
She who likes the buds of Mandhara tree

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹