మైత్రేయ మహర్షి బోధనలు - 63

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 63 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 49. ప్రణాళిక - ప్రదేశము 🌻

ప్రణాళిక, ప్రదేశముకన్న ముఖ్యము. ఒక ప్రదేశమున నీవు దివ్య ప్రణాళికను చాల కాలముగ నిర్వర్తించు చున్నావనుకొనుము. అంతకన్న మిన్నగ మరియొక ప్రదేశమున నిర్వర్తింపబడుటకు

అవకాశమున్నచో ప్రదేశమును మార్చుటకు సందేహింపకుము. ప్రణాళికను బట్టి ప్రదేశముగాని, ప్రదేశమును బట్టి ప్రణాళిక కాదు. ప్రణాళికను, ప్రదేశవ్యామోహమున కుదింపవద్దు. భౌతికమునకు, పదార్థమునకు లోబడిన చైతన్యము కలవారు ప్రదేశములకు కట్టుబడి యుందురు. ఇది కూడ ఒక బంధనమే.

ప్రదేశ బంధనము కన్న ప్రణాళిక బంధనము మేలు. అందులకే భూగోళము నందలి మా ఆశ్రమములు సూక్ష్మ పదార్థ నిర్మితములై ప్రణాళికను బట్టి మారు చుండును. పూర్వకాలమున యతులు, ఋషులు, సంచరించు సన్యాసులు మూడు రాత్రులకు మించి ఒక చోట నుండకపోవుటకు కారణ మిదియే. పదార్థమునకు బంధించు గుణము సహజము. చైతన్యమునకు ప్రవహించు గుణము సహజము. జీవుడు చైతన్య స్వరూపుడు గనుక జీవన ప్రయాణమునకు అడ్డము కలిగించు పదార్థములను విసర్జించుచూ ముందుకు సాగవలెను.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

25 Jan 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 127

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 127 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనల్ని మళ్ళీ మళ్ళీ ప్రపంచంలోకి పంపుతూ వుంటారు. జీవితంలోకి తిరిగి మళ్ళీ మళ్ళీ అడుగుపెడుతూనే వుంటాం. నువ్వు పాఠం పూర్తిగా నేర్చుకోనంత వరకు నిన్ను వెనక్కి పంపుతూనే వుంటారు. కాబట్టి పాఠం నేర్చుకోవాలి. 🍀

నేనొక సంగీతకారుడి గురించి విన్నాను. ఆయన పాట పాడేవాడు. ఆ పాట వినే వాళ్ళంతా గొప్ప సంగీత ప్రియులు. ఆయన పాడడం ముగించాక జనమంతా 'మళ్ళీ మళ్ళీ పాడు' అనే వాళ్ళు. ఆయన మళ్ళీ పాడేవాడు. జనం ఆనందించే వాళ్ళు. ఆయన పాడడమయ్యాకా ' మళ్ళీ మళ్ళీ ' అనేవాళ్ళు. మూడోసారి పాడాకా జనం బిగ్గరగా మళ్ళీ మళ్ళీ అంటూ అరిచేవాళ్ళు. దానికాయన 'ఈసారి నేను వేరే పాటలు పాడుతాను' అనేవాడు.

అప్పుడు ఆ గుంపులోంచి ఒకతను 'నువ్వు ఈ పాటని సరిగా పాడేంత వరకు మేము మళ్ళీ మళ్ళీ పాడమని అంటూనే వుంటాం' అన్నాడు. జీవితంలో జరిగేది అదే. మనల్ని మళ్ళీ మళ్ళీ ప్రపంచంలోకి పంపుతూ వుంటారు. జీవితంలోకి తిరిగి మళ్ళీ మళ్ళీ అడుగు పెడుతూనే వుంటాం. నువ్వు పాఠం పూర్తిగా నేర్చుకోనంత వరకు నిన్ను వెనక్కి పంపుతూనే వుంటారు. కాబట్టి పాఠం నేర్చుకోవాలి.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

25 Jan 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 546/ Vishnu Sahasranama Contemplation - 546

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 546/ Vishnu Sahasranama Contemplation - 546🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 546. చక్రగదాధరః, चक्रगदाधरः, Cakragadādharaḥ 🌻

ఓం చక్రగదాధరాయ నమః | ॐ चक्रगदाधराय नमः | OM Cakragadādharāya namaḥ

చక్రగదాధరః, चक्रगदाधरः, Cakragadādharaḥ

మనస్తత్త్వాత్మకం చక్రం బుద్ధితత్త్వాత్మికాం గదామ్ ।
ధారయన్ లోకరక్షకార్థముక్తశ్చక్రగదాధరః ॥

చక్రమును, గదను ధరించువాడు. మనస్తత్త్వరూపమగు చక్రమును, బుద్ధి తత్త్వమగు గదను లోక రక్షార్థము ధరించుచున్నందున విష్ణువు చక్రగదాధరుడని చెప్పబడుచున్నాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::

వ. మఱియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును, సరసిజోదర కరసరోరుహంబందు రాజహంస రుచిరంబయిన పాంచజన్యంబును, నరాతిభట శోణిత కర్దమలిప్తాంగంబై భగవత్ప్రీతికారణి యగు కౌమోదకియును, బంధురసుగంధ గంధానుబంధ మంథర గంధవహాహూయమాన పుష్పంధయ ఝంకారనాద విరాజితంబైన వైజయంతీ వనమాలికయును, జీవతత్త్వంబైన కౌస్తుభ మణియును, బ్రత్యేకంబ ధ్యానంబు సేయందగు, వెండియు భక్త సంరక్షణార్థం బంగీకరించు దివ్య మంగళ విగ్రహంబున కనురూపంబును, మకరకుండల మణి నిచయమండిత ముకురోపమాన నిర్మల గండ మండలంబును, సంతత శ్రీనివాసంబు లయిన లోచన పంకజంబులును గలిగి లాలితభ్రూలతాజుష్టంబును, మధుకర సమాన రుచి చికుర విరాజితంబును నైన ముఖకమలంబును ధ్యానంబు గావింపవలయు, మఱియు శరణాగతుల కభయ ప్రదంబు లగుచునెగడు పాణిపంకేరుహంబుల మనంబునఁ దలఁప వలయు. (937)

శత్రుసమూహాలకు సహింపరాని వేయి అంచుల సుదర్శన చక్రాన్నీ, సరోజనాభుని కరసరోజంలో రాజహంసవలె విరాజిల్లే పాఞ్చజన్య శంఖాన్నీ, నిశాచరుల నెత్తురు చారికలతోకూడి దామోదరునికి ఆమోదదాయకమైన కౌమోదకీగదనూ, హృదయంలో పదిలపరచుకోవాలి.

గప్పుమంటున్న క్రొంగ్రొత్త నెత్తావుల గుబుల్కొన్న కమ్మ తెమ్మరల పిలుపులందుకొని సంగీతాలు పాడే కోడె తుమ్మెదలతో కూడిన వైజయంతీ వనమాలికనూ, అఖిలలోకాలకూ ఆత్మస్వరూపమైన కౌస్తుభమణినీ, వైకుంఠనాథుని కంఠసీమలో వేర్వేరుగా ధ్యానించాలి.

భక్త రక్షణ పరాయణుడైన నారాయణుని దివ్య మంగళ స్వరూపానికి అనురూపమై మకరకుండలాల మణికాంతులు జాలువారే చక్కని చెక్కుటద్దాలతో ఎల్లవేళలా జయశ్రీకి మందిరాలైన అందాల కందమ్ములతో వంపులు తిరిగిన సొంపైన కనుబొమలతో, ఎలదేటి కదుపులవంటి నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముకుందుని ముఖకమలాన్ని ధ్యానం చేయాలి. ఆర్తులై శరణాగతులైన భక్తులకు అభయాన్ని ఇచ్చే చక్రపాణి పాణిపద్మాలను హృదయపద్మములో భావన చేయాలి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 546🌹

📚. Prasad Bharadwaj

🌻546.Cakragadādharaḥ🌻

OM Cakragadādharāya namaḥ

मनस्तत्त्वात्मकं चक्रं बुद्धितत्त्वात्मिकां गदाम् ।
धारयन् लोकरक्षकार्थमुक्तश्चक्रगदाधरः ॥

Manastattvātmakaṃ cakraṃ buddhitattvātmikāṃ gadām,
Dhārayan lokarakṣakārthamuktaścakragadādharaḥ.

Cakram, the discuss is of the nature of manastattva; gadā the club is of the nature of the buddhi tattva. He is the bearer of the cakra and the gadā for protecting the world; so He is Cakragadādharaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे अष्टाविंशोऽध्यायः ::

बाहूंश्च मन्दरगिरेः परिवर्तनेन निर्णिक्तबाहुवलयानधिलोकपालान् ।
सञ्चिन्तयेद्दससतारमसह्यतेजः सङ्खं च तत्करसरोरुहराजहंसम् ॥ २७ ॥
कौमोदकीं भगवतो दयितां स्मरेत दिग्धमरातिभटशोणितकर्दमेन ।
मलां मधुव्रतवरूथगिरोपघुष्टां चैत्यस्य तत्त्वममलं मणिमस्य कण्ठे ॥ २८ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 28

Bāhūṃśca mandaragireḥ parivartanena nirṇiktabāhuvalayānadhilokapālān,
Sañcintayeddasasatāramasahyatejaḥ saṅkhaṃ ca tatkarasaroruharājahaṃsam. 27.
Kaumodakīṃ bhagavato dayitāṃ smareta digdhamarātibhaṭaśoṇitakardamena,
Malāṃ madhuvratavarūthagiropaghuṣṭāṃ caityasya tattvamamalaṃ maṇimasya kaṇṭhe. 28.

The yogi should further meditate upon the Lord's four arms, which are the source of all the powers of the gods who control the various functions of material nature. Then the yogi should concentrate on the polished ornaments, which were burnished by Mount Mandara as it revolved. He should also duly contemplate the Lord's discus, the Sudarśana cakra, which contains one thousand spokes and a dazzling luster, as well as the conch, which looks like a swan in His lotuslike palm.

The yogi should meditate upon His club, which is named Kaumodaki and is very dear to Him. This club smashes the demons, who are always inimical soldiers, and is smeared with their blood. One should also concentrate on the nice garland on the neck of the Lord, which is always surrounded by bumblebees, with their nice buzzing sound, and one should meditate upon the pearl necklace on the Lord's neck, which is considered to represent the pure living entities who are always engaged in His service.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

25 Jan 2022

25-JANUARY-2022 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 25, జనవరి 2022 మంగళవారం, భౌమ వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 149 / Bhagavad-Gita - 149 - 3-30 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 546 / Vishnu Sahasranama Contemplation - 546 🌹
4) 🌹 DAILY WISDOM - 224🌹 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 129🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 63🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు, శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 25, జనవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ ఆంజనేయ స్తోత్రం - 2 🍀*

*3. మౌంజీకౌపీనసంయుక్తం హేమయజ్ఞోపవీతినమ్ |*
*పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్రధారిణమ్*

*4. శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితమ్ |*
*మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*పండుగలు : స్వామి వివేకానంద జయంతి, కాలాష్టమి* 
*Swami Vivekananda Jayanti, Kalashtami*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ సప్తమి 07:49:20
వరకు తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: చిత్ర 10:55:20
వరకు తదుపరి స్వాతి
సూర్యోదయం: 06:49:12
సూర్యాస్తమయం: 18:07:28
వైదిక సూర్యోదయం: 06:52:59
వైదిక సూర్యాస్తమయం: 18:03:43
చంద్రోదయం: 00:40:10
చంద్రాస్తమయం: 11:45:04
సూర్య సంచార రాశి: మకరం
యోగం: ధృతి 09:13:58 వరకు
తదుపరి శూల
కరణం: బవ 07:48:20 వరకు
చంద్ర సంచార రాశి: తుల
వర్జ్యం: 16:19:48 - 17:52:36
దుర్ముహూర్తం: 09:04:52 - 09:50:05
రాహు కాలం: 15:17:54 - 16:42:41
గుళిక కాలం: 12:28:21 - 13:53:07
యమ గండం: 09:38:46 - 11:03:33  
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 04:36:36 - 06:11:12
మరియు 25:36:36 - 27:09:24
ధ్వాo క్ష యోగం - ధన నాశనం,
కార్య హాని 10:55:20 వరకు తదుపరి
ధ్వజ యోగం - కార్య సిధ్ధి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 149 / Bhagavad-Gita - 149 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 30 🌴*

*30. మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యా ధ్యాత్మచేతసా |*
*నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వర: ||*

🌷. తాత్పర్యం :
*కావున ఓ అర్జునా! నన్ను గూర్చిన సంపూర్ణజ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి, కర్మలనన్నింటిని నాకు అర్పించి మాంద్యమునకు వీడి యుద్ధము చేయుము.*

🌷. భాష్యము :
శ్రీమద్భగవద్గీత యొక్క ప్రయోజనము ఈ శ్లోకము స్పష్టముగా తెలియజేయుచున్నది. సైనిక క్రమశిక్షణ వలె విధ్యుక్తధర్మములను నిర్వహించుటకు ప్రతియొక్కరు సంపూర్ణ కృష్ణభక్తిరసభావితులు కావలసియున్నదని శ్రీకృష్ణభగవానుడు భోధించుచున్నాడు. అటువంటి ఉత్తరువు విషయమును కొంత కష్టతరము కావించినను కృష్ణునిపై ఆధారపడి కర్మలను నిర్వహింపవలసియే యున్నది. ఏలయన అదియే జీవుని నిజస్థితియై యున్నది.

జీవుని నిత్యమైన సహజస్థితి భగవానుని కోరికలకు లోబడియుండుట కావున అతడెన్నడును భగవానుని సహాయము లేకుండా స్వతంత్రునిగా ఆనదము ననుభవింపలేడు. కనుకనే సైన్యాధ్యక్షుని మాదిరిగా శ్రీకృష్ణుడు అర్జునుని యుద్ధము చేయమని ఆజ్ఞాపించుచున్నాడు. ప్రతియొక్కరు భగవానుని అనుగ్రహము కొరకు సర్వమును త్యాగము చేయుటయే గాక విధ్యుక్తధర్మములను సైతము ఎటువంటి యజమానిత్వము లేకుండా నిర్వహింప వలసి యున్నది. 

అర్జునుడు ఇచ్చట భగవానుని ఆజ్ఞను గూర్చి చింతింప నవసరము లేదు. కేవలము దాని అమలు పరచిన చాలును. శ్రీకృష్ణభగవానుడు సర్వాత్మలకు అత్మయైనవాడు. కనుక స్వంతభావన ఏమాత్రము లేకుండా ఆ పరమపురుషును పైననే సంపూర్ణముగా ఆధారపడెడివాడు (అనగా కృష్ణభక్తిరస భావితుడు) “ఆధ్యాతిమిక చేతనుడు” అని పిలువబడును. “నిరాశీ:” అనగా ప్రభువు ఆజ్ఞమేరకు వర్తించుచు, కర్మఫలములను కోరనివాడని భావము. కృష్ణభక్తిభావన యందు పనిచేయువాడు నిక్కముగా దేనిపైనను మమత్వమును చూపడు. అట్టి భావనయే “నిర్మమత్వభావనము”(ఏదియును నాదికాదు) అనబడును. 

నామమాత్ర బందువుల యెడ గల బంధుత్వ కారణమున అట్టి కటిన ఉత్తరువును పాటించుటకు ఏదేని విముఖత కలిగినచో దానిని శీఘ్రమే త్యజించవలెను. ఆ విధముననే మనుజుడు “విగతజ్వరుడు” (అలసత్వము లేనివాడు) కాగలడు. ప్రతి యొక్కడు తన గుణము మరియు స్థితి ననుసరించి ఒక ప్రత్యేకమైన కర్మనొనరింప వలసియుండును. పైన తెలిపిన విధముగా అట్టి విధ్యుక్తధర్మములను కృష్ణభక్తిభావనలో నిర్వహింపవలెను. అది మనుజుని ముక్తి పథమునకు నడిపించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 149 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 30 🌴*

*30. mayi sarvāṇi karmāṇi sannyasyādhyātma-cetasā*
*nirāśīr nirmamo bhūtvā yudhyasva vigata-jvaraḥ*

🌷 Translation : 
*Therefore, O Arjuna, surrendering all your works unto Me, with full knowledge of Me, without desires for profit, with no claims to proprietorship, and free from lethargy, fight.*

🌷 Purport :
This verse clearly indicates the purpose of the Bhagavad-gītā. The Lord instructs that one has to become fully Kṛṣṇa conscious to discharge duties, as if in military discipline. Such an injunction may make things a little difficult; nevertheless duties must be carried out, with dependence on Kṛṣṇa, because that is the constitutional position of the living entity. The living entity cannot be happy independent of the cooperation of the Supreme Lord, because the eternal constitutional position of the living entity is to become subordinate to the desires of the Lord. Arjuna was therefore ordered by Śrī Kṛṣṇa to fight as if the Lord were his military commander. 

One has to sacrifice everything for the good will of the Supreme Lord, and at the same time discharge prescribed duties without claiming proprietorship. Arjuna did not have to consider the order of the Lord; he had only to execute His order. The Supreme Lord is the soul of all souls; therefore, one who depends solely and wholly on the Supreme Soul without personal consideration.

This consciousness is called nirmama, or “nothing is mine.” And if there is any reluctance to execute such a stern order, which is without consideration of so-called kinsmen in the bodily relationship, that reluctance should be thrown off; in this way one may become vigata-jvara, or without feverish mentality or lethargy. Everyone, according to his quality and position, has a particular type of work to discharge, and all such duties may be discharged in Kṛṣṇa consciousness, as described above. That will lead one to the path of liberation.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 546/ Vishnu Sahasranama Contemplation - 546🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 546. చక్రగదాధరః, चक्रगदाधरः, Cakragadādharaḥ 🌻*

*ఓం చక్రగదాధరాయ నమః | ॐ चक्रगदाधराय नमः | OM Cakragadādharāya namaḥ*

చక్రగదాధరః, चक्रगदाधरः, Cakragadādharaḥ

*మనస్తత్త్వాత్మకం చక్రం బుద్ధితత్త్వాత్మికాం గదామ్ ।*
*ధారయన్ లోకరక్షకార్థముక్తశ్చక్రగదాధరః ॥*

*చక్రమును, గదను ధరించువాడు. మనస్తత్త్వరూపమగు చక్రమును, బుద్ధి తత్త్వమగు గదను లోక రక్షార్థము ధరించుచున్నందున విష్ణువు చక్రగదాధరుడని చెప్పబడుచున్నాడు.*

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
వ. మఱియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును, సరసిజోదర కరసరోరుహంబందు రాజహంస రుచిరంబయిన పాంచజన్యంబును, నరాతిభట శోణిత కర్దమలిప్తాంగంబై భగవత్ప్రీతికారణి యగు కౌమోదకియును, బంధురసుగంధ గంధానుబంధ మంథర గంధవహాహూయమాన పుష్పంధయ ఝంకారనాద విరాజితంబైన వైజయంతీ వనమాలికయును, జీవతత్త్వంబైన కౌస్తుభ మణియును, బ్రత్యేకంబ ధ్యానంబు సేయందగు, వెండియు భక్త సంరక్షణార్థం బంగీకరించు దివ్య మంగళ విగ్రహంబున కనురూపంబును, మకరకుండల మణి నిచయమండిత ముకురోపమాన నిర్మల గండ మండలంబును, సంతత శ్రీనివాసంబు లయిన లోచన పంకజంబులును గలిగి లాలితభ్రూలతాజుష్టంబును, మధుకర సమాన రుచి చికుర విరాజితంబును నైన ముఖకమలంబును ధ్యానంబు గావింపవలయు, మఱియు శరణాగతుల కభయ ప్రదంబు లగుచునెగడు పాణిపంకేరుహంబుల మనంబునఁ దలఁప వలయు. (937)

శత్రుసమూహాలకు సహింపరాని వేయి అంచుల సుదర్శన చక్రాన్నీ, సరోజనాభుని కరసరోజంలో రాజహంసవలె విరాజిల్లే పాఞ్చజన్య శంఖాన్నీ, నిశాచరుల నెత్తురు చారికలతోకూడి దామోదరునికి ఆమోదదాయకమైన కౌమోదకీగదనూ, హృదయంలో పదిలపరచుకోవాలి.

గప్పుమంటున్న క్రొంగ్రొత్త నెత్తావుల గుబుల్కొన్న కమ్మ తెమ్మరల పిలుపులందుకొని సంగీతాలు పాడే కోడె తుమ్మెదలతో కూడిన వైజయంతీ వనమాలికనూ, అఖిలలోకాలకూ ఆత్మస్వరూపమైన కౌస్తుభమణినీ, వైకుంఠనాథుని కంఠసీమలో వేర్వేరుగా ధ్యానించాలి.

భక్త రక్షణ పరాయణుడైన నారాయణుని దివ్య మంగళ స్వరూపానికి అనురూపమై మకరకుండలాల మణికాంతులు జాలువారే చక్కని చెక్కుటద్దాలతో ఎల్లవేళలా జయశ్రీకి మందిరాలైన అందాల కందమ్ములతో వంపులు తిరిగిన సొంపైన కనుబొమలతో, ఎలదేటి కదుపులవంటి నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముకుందుని ముఖకమలాన్ని ధ్యానం చేయాలి. ఆర్తులై శరణాగతులైన భక్తులకు అభయాన్ని ఇచ్చే చక్రపాణి పాణిపద్మాలను హృదయపద్మములో భావన చేయాలి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 546🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻546.Cakragadādharaḥ🌻*

*OM Cakragadādharāya namaḥ*

मनस्तत्त्वात्मकं चक्रं बुद्धितत्त्वात्मिकां गदाम् ।
धारयन् लोकरक्षकार्थमुक्तश्चक्रगदाधरः ॥

*Manastattvātmakaṃ cakraṃ buddhitattvātmikāṃ gadām,*
*Dhārayan lokarakṣakārthamuktaścakragadādharaḥ.*

*Cakram, the discuss is of the nature of manastattva; gadā the club is of the nature of the buddhi tattva. He is the bearer of the cakra and the gadā for protecting the world; so He is Cakragadādharaḥ.*

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे अष्टाविंशोऽध्यायः ::
बाहूंश्च मन्दरगिरेः परिवर्तनेन निर्णिक्तबाहुवलयानधिलोकपालान् ।
सञ्चिन्तयेद्दससतारमसह्यतेजः सङ्खं च तत्करसरोरुहराजहंसम् ॥ २७ ॥
कौमोदकीं भगवतो दयितां स्मरेत दिग्धमरातिभटशोणितकर्दमेन ।
मलां मधुव्रतवरूथगिरोपघुष्टां चैत्यस्य तत्त्वममलं मणिमस्य कण्ठे ॥ २८ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 28
Bāhūṃśca mandaragireḥ parivartanena nirṇiktabāhuvalayānadhilokapālān,
Sañcintayeddasasatāramasahyatejaḥ saṅkhaṃ ca tatkarasaroruharājahaṃsam. 27.
Kaumodakīṃ bhagavato dayitāṃ smareta digdhamarātibhaṭaśoṇitakardamena,
Malāṃ madhuvratavarūthagiropaghuṣṭāṃ caityasya tattvamamalaṃ maṇimasya kaṇṭhe. 28.

The yogi should further meditate upon the Lord's four arms, which are the source of all the powers of the gods who control the various functions of material nature. Then the yogi should concentrate on the polished ornaments, which were burnished by Mount Mandara as it revolved. He should also duly contemplate the Lord's discus, the Sudarśana cakra, which contains one thousand spokes and a dazzling luster, as well as the conch, which looks like a swan in His lotuslike palm.

The yogi should meditate upon His club, which is named Kaumodaki and is very dear to Him. This club smashes the demons, who are always inimical soldiers, and is smeared with their blood. One should also concentrate on the nice garland on the neck of the Lord, which is always surrounded by bumblebees, with their nice buzzing sound, and one should meditate upon the pearl necklace on the Lord's neck, which is considered to represent the pure living entities who are always engaged in His service.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 224 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 11. Do You Want Only Yourself as the True Spirit? 🌻*

*When you search for the Spirit of the world as a whole, the Spirit of your own Self, when you search for your Self, you conclude there is no need in searching for anything else. Here is the condition that you have to fulfil before studying the Upanishads. Do you want only your Self as the true Spirit, commensurate with the Spirit of the universe, or do you want many other things also? Those who want many other things are not fit students of the Upanishadic or even the Bhagavadgita philosophy, because the Upanishads and the Gita take you to the very essence of things, which is the Reality of all things.*

*When you get That, attain That, reach That, identify yourself with That, you will not have to ask for anything else. It is like the sea of Reality, and nothing is outside it. But if desire still persists—a little bit of pinching and a discovery of a frustration, and emotional tension: “Oh, I would like to have this”—and it is harassing you, then you had better finish with all your desires. You should fulfil all your requirements and not come to the Upanishadic teacher with the disease of a frustrated, unfulfilled desire.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 127 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనల్ని మళ్ళీ మళ్ళీ ప్రపంచంలోకి పంపుతూ వుంటారు. జీవితంలోకి తిరిగి మళ్ళీ మళ్ళీ అడుగుపెడుతూనే వుంటాం. నువ్వు పాఠం పూర్తిగా నేర్చుకోనంత వరకు నిన్ను వెనక్కి పంపుతూనే వుంటారు. కాబట్టి పాఠం నేర్చుకోవాలి. 🍀*

*నేనొక సంగీతకారుడి గురించి విన్నాను. ఆయన పాట పాడేవాడు. ఆ పాట వినే వాళ్ళంతా గొప్ప సంగీత ప్రియులు. ఆయన పాడడం ముగించాక జనమంతా 'మళ్ళీ మళ్ళీ పాడు' అనే వాళ్ళు. ఆయన మళ్ళీ పాడేవాడు. జనం ఆనందించే వాళ్ళు. ఆయన పాడడమయ్యాకా ' మళ్ళీ మళ్ళీ ' అనేవాళ్ళు. మూడోసారి పాడాకా జనం బిగ్గరగా మళ్ళీ మళ్ళీ అంటూ అరిచేవాళ్ళు. దానికాయన 'ఈసారి నేను వేరే పాటలు పాడుతాను' అనేవాడు.*

*అప్పుడు ఆ గుంపులోంచి ఒకతను 'నువ్వు ఈ పాటని సరిగా పాడేంత వరకు మేము మళ్ళీ మళ్ళీ పాడమని అంటూనే వుంటాం' అన్నాడు. జీవితంలో జరిగేది అదే. మనల్ని మళ్ళీ మళ్ళీ ప్రపంచంలోకి పంపుతూ వుంటారు. జీవితంలోకి తిరిగి మళ్ళీ మళ్ళీ అడుగు పెడుతూనే వుంటాం. నువ్వు పాఠం పూర్తిగా నేర్చుకోనంత వరకు నిన్ను వెనక్కి పంపుతూనే వుంటారు. కాబట్టి పాఠం నేర్చుకోవాలి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 63 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 49. ప్రణాళిక - ప్రదేశము 🌻*

*ప్రణాళిక, ప్రదేశముకన్న ముఖ్యము. ఒక ప్రదేశమున నీవు దివ్య ప్రణాళికను చాల కాలముగ నిర్వర్తించు చున్నావనుకొనుము. అంతకన్న మిన్నగ మరియొక ప్రదేశమున నిర్వర్తింపబడుటకు
అవకాశమున్నచో ప్రదేశమును మార్చుటకు సందేహింపకుము. ప్రణాళికను బట్టి ప్రదేశముగాని, ప్రదేశమును బట్టి ప్రణాళిక కాదు. ప్రణాళికను, ప్రదేశవ్యామోహమున కుదింపవద్దు. భౌతికమునకు, పదార్థమునకు లోబడిన చైతన్యము కలవారు ప్రదేశములకు కట్టుబడి యుందురు. ఇది కూడ ఒక బంధనమే.*

*ప్రదేశ బంధనము కన్న ప్రణాళిక బంధనము మేలు. అందులకే భూగోళము నందలి మా ఆశ్రమములు సూక్ష్మ పదార్థ నిర్మితములై ప్రణాళికను బట్టి మారు చుండును. పూర్వకాలమున యతులు, ఋషులు, సంచరించు సన్యాసులు మూడు రాత్రులకు మించి ఒక చోట నుండకపోవుటకు కారణ మిదియే. పదార్థమునకు బంధించు గుణము సహజము. చైతన్యమునకు ప్రవహించు గుణము సహజము. జీవుడు చైతన్య స్వరూపుడు గనుక జీవన ప్రయాణమునకు అడ్డము కలిగించు పదార్థములను విసర్జించుచూ ముందుకు సాగవలెను.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/