శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (Śrī Pōtulūri Vīrabrahmēndrasvāmi)

 M̶͖̱̠̗̏͌͜͝è̴̯̇̌̔̀͘s̷̺̼̋͂͐̊̀̊̎̚s̶̨̢͙̺̦̘͍̋ǎ̴̼̥͖̣̋̂̓͛̃g̵̙̙̦͉͑̽̋̆̅̒̽̽̈́ę̷͈͉̣̲̎̿̑͌̏͋́̚͝ş̵̠̲̺̣͔͎͎̩̱̐̀̓̂ ̵̻͕̭͑͜f̶̞̑̀̅̏̾̎͑̅͘r̵̺̣̻͋͆͑̏̏̈́̓ō̸̡̡͈̳̼͉̎͠m̸͇͙̜͎͚̈̈́͒͜ ̵̧̡̗̥̤̺͊͋̈͂̃͒̕͜ ̶͖͍̼̘͙͎̪̪̥́̏̍̂͊̄͝ ̵̙̰̳̥͎͎̼͒ ̵̠͐͌̀́1̶̠͇͑̊̓͐̍̎͋̄̈́͠ ̷̢͉͉̜̌̓͛̈̔̑͗̂̈́͜͜ ̶̖̔̎̈́̿̎̿̕͠ ̴̢͈̭̱̩̈̑͐̊̌̅̈́̓̿̕ ̴̼͒͑̂͆͋̽̚͝ ̸͈͖̇̆̋͆̊̍̽̕t̸̢̢͔̰͇̰͉̿̆̏̿͛̕o̷̬͍̗̯̫͋̊̄́̾́̚ ̴̨̜̗̦̮̭̩̰̎͂̾̓̊̋̌̾ ̷̭͑͌͐͊̈́͘ ̴̨̝̥̗̗̥́̎͆̔̄͗̉̉̿͝ ̷̧̨͚̥͎̦̯̩̈́͛̐́͂̈̊̐͜͝3̴̯́̑̂̀͛0̵̣͔̼͓̮̖̜̿ͅ ̵̡̩̦̬̗̯͈̞̝̃́͘̕ͅ.̷̡̜̝͙̯̩̳̲́̓̇͋̀̌́͝.̶̧̨̹̪̹̺̙̓̓͐̀͊.̸̲͍̰̖͓̫̋͘̚

̵̠̬̝̘̣̥̯̹̃͊̊̎͆̕͘C̶̢̨̮̰̟͈̹̙̞͗́̀̌́͑̈͋ơ̴̡̫͎̞̩̘̩̼͐̋̾̎̂͂̚̚̚ͅḿ̸̻̋̀͛̅̎̅͝ï̸̜͕̫̖͖ͅñ̸̪̺̙̹ͅg̵͎̣̥͉̘̼͉̰̥͜͝ ̷̪̃̾̎̽́S̶̨͓͙̥̗̩̀̽͗̔̈́̈́͑͋̎ͅơ̸̖͊́͐̋̉͑̎̌̍o̸̜̩͋̀̿ṋ̷̛̱̗͇͚̲͍̣̿͊̇̀̊̍̋̅̕.̷̮̺̩͈̣̏́̔̃̈́̑́̒̓̅͜ͅ.̶̡̨̰̰͇̱̉̓̈́̈́̅̓.̸̝͠͠.̸̫͓͇̓͑͆̏̿͜


🅼🅴🆂🆂🅰🅶🅴🆂 🅵🆁🅾🅼    1     🆃🅾    30 . . .

🅲🅾🅼🅸🅽🅶 🆂🅾🅾🅽 . . .


------------------------------------ x ------------------------------------


🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 31 🌹 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 1 🌻

ఒకరోజు సిద్ధయ్య వీర బ్రహ్మేంద్రస్వామితో చర్చను ప్రారంభించాడు.

“స్వామీ ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు? ఆయనను మనం ఎలా కనుగొంటాం?” అని సిద్ధయ్య ప్రశ్నించాడు.

అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి సిద్ధయ్యకు ఇలా వివరించారు.

“ఈ ప్రపంచంలో మన అనుభూతికి, జ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి వుంది. దానినే సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాం. దీనిని వేర్వేరు మతాలకు చెందినవారు వేర్వేరుగా గుర్తిస్తారు. కానీ,ఆ శక్తిమంతుడు ఒక్కడే! అతడే భగవంతుడని ఆస్తికులంటారు.అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని, పుట్టుక, మరణము లేని శక్తి అనీ నాస్తికులంటారు.దానిని మనం అన్వేషణ ద్వారా కనుగొనవచ్చు”

“మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచము మొత్తము పూర్తిగా కల్పితమైనదే! అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే, మరి మనకి కనబడుతున్న ఈ జీవులు, జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి.

జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం, తత్త్వం ఈ సృష్టికి ముందు నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీ, భగవంతుడనీ రకరకాల పేర్లతో పిలుస్తాం. కొలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.

సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.

ఈ ప్రపంచంలో జీవులు అనుభవించే అనుభూతులకు అతీతమైనది అది. తన కర్మకు తాను నిర్వరిస్తూ పోతుంది. తప్ప ఎవ్వరి అనుజ్ఞ కోసం, ప్రార్థనల కోసమూ ఆగదు. దానిని మనం భగవంతుడని పిలుస్తూ, అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ వుంటాం.

భగవంతుడికి లేదా ఈ అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు.అతడు ఆది లేనివాడు.అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు. కానీ ఇందులో ఏ ఒక్కటీ భగవంతుని గురించి లేదా ఈ ఏకత్వం గురించి చెప్పలేదు.

కేవలం మొక్కుబడిగా చేసే పూజలు, చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేదు. అలాగే స్వార్థం కోసం చేసే యజ్ఞాలతోనూ మనం భగవంతుని చూడలేం. నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమే, ఎలాంటి యజ్ఞాలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేశ్వరుడిని చూడగలరు.

భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు దైవం తెలీదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు, గుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్దిమంది మాత్రమే భగవంతుని చేరుకోగలరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

11.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 32 🌹 
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 2 🌻

ఇక జీవుని గురించి వివరిస్తాను. ఈ శరీరంలో 20 కోట్లకు పైన రోమ రంధ్రములున్నాయి. 70 ఎముకలు, మాంసముతో నిర్మితమయినదే ఈ స్థూల దేహము. ఇది సుఖకరమైన అనుభవాలను అందిస్తున్నట్టు భ్రాంతి కలిగించే దుఃఖస్వరూపం. 

సామాన్య మానవులే కాదు, యోగులు, ఋషులు కూడా వాంఛల ద్వారా మాత్రమే జీవించే ఈ శరీరం పట్ల, సుఖముల పట్ల, కోర్కెల పట్ల అనుబంధము పెంచుకుని ఎన్నో కష్టాలు పొందారు.

ఆత్మవేరు, శరీరం గుర్తించే నేను వేరు. అనేక కోరికల ఫలితంగా రూపుదిద్దుకునేదే నేను. ఆత్మకు ఈ వాంఛలు వర్తించవు.కేవలం నిమిత్త మాత్రముగా ప్రవర్తిస్తూ, జీవుని నడిపిస్తుంటుంది. దానికి ఇరువది అయిదు తత్త్వాలు, దశ నాడులు, సప్త ధాతువులచే నిర్మితమైన ఈ శరీరంలో ఏడు పుష్పములున్నాయి.

వీనిలో మొట్టమొదటిది మూలాధారం. గుద స్థానము నందు వుండే మూలధార చక్రమునకు విఘ్నేశ్వరుడు అధిదేవత.

రెండవది స్వాథిష్టాన చక్రము. ఆధార చక్రమునకు రెండు అంగుళములపై నాలుగు రేకులు కలిగి,మూడు కోణములతో తెల్లని రంగుతో, ప్రకాశవంతంగా, నిర్మలంగా వుంటుంది. ఇది జల తత్త్వాన్ని కలిగి వుంటుంది. ఈ చక్రమునకు బ్రహ్మదేవుడు అధిదేవత.

మూడవది మణిపూరకము. స్వాధిష్ఠాన చక్రమునకు పైన ఒక మణివలె ప్రకాశిస్తుంటుంది. నీలవర్ణము కలిగింది. మొత్తం పది రేకులతో వుంటుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత.

అనాహత చక్రము హృదయ స్థానములో పన్నెండు రేకులతో వుంటుంది. స్వర్ణ కాంతులను వెదజల్లుతూంటుంది .ఇది వాయు స్వభావం కలిగి వుంటుందని యోగుల భావన. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత.

విశుద్ధ అనేది ఐదవ చక్రము. అనాహిత చక్రమునకు పైన, కంఠములో వుంటుంది. పదహారు దళములుంటాయి.

ఆజ్ఞా చక్రము ఆరవది. విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళములపైన భ్రూ మధ్య స్థానంలో (త్రికూట స్థానము) ఉంటుంది. రెండు రేకులు కలిగి వుంటుంది. ఎరుపు, పసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతుంటుంది. దీనికి ఈశ్వరుడు అధిష్టాన దేవత.

సహస్రాకారము అనునది ఆజ్ఞా చక్రానికి పైన కపాలంలో, బ్రహ్మరంథ్రము వద్ద వుంటుంది. ఎనిమిది దళాలుంటాయి. వేయి రేకులు కలిగి వుంటుంది.

ప్రాణ వాయువునకు కుడి ఎడమ వేపుల ఇడ పింగళులు అనే నాడులు వున్నాయి. ఇడ పింగళులు సహస్రారము మొదలు ఆగ్నేయ చక్రం వరకు వ్యాపించి వుంటాయి. 

వీటిమధ్య సుషుమ్ననాడి వుంటుంది. ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి వుంటుంది. ఈ నాడుల యందు ప్రవహించే జీవ శక్తి జీవుని చలనంతో వుంచుతుంది”

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

13.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 33 🌹 
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 3 🌻

ఇప్పుడు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను. కుండలినీ శక్తిని జాగృతం చేయగలిగినవారు ఈ సృష్టిలో ఏదైనా సాధించగలుగుతారు. ఈ సృష్టిలో అతి కొద్ది మందికి మాత్రమే ఇది సాధించే శక్తి వుంటుంది. అది రకరకాల కారణాల వల్ల సాధ్యం కావచ్చు. యోగులు వేలమంది వుండవచ్చు. కానీ కుండలినీశక్తిని జాగృతం చేయగలిగినవారు అతి తక్కువ.

కఠోరమైన సాధన ద్వారా కుండలినీ శక్తిని మేల్కొలపగలుగుతారు. ఇది హఠ యోగం వల్ల సాధ్యపడుతుంది. లేదా మంత్ర జపం వల్ల కూడా సాధ్యమే! మన ఋషులలో ఎక్కువమంది ఈ శక్తిని సాధించనవారే! అందువల్లే వారు భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలిగేవారు. వివిధ మహిమలను ప్రదర్శించేవారు.

మన మనస్సు సాధారణ వాంఛల వేపే మొగ్గుతుంది.ఎంతటి సన్యాసి అయినా, యోగి అయినా కొద్ది క్షణాలసేపు అయినా కామ వాంఛలకు లొంగని వాడుండడు. అంతటి చంచలమైన మనస్సుపై అదుపు సాధించి ధ్యానంలో నిమగ్నం చేయటం అనేది అతి కొద్దిమంది సాధకులకే సాధ్యపడుతుంది. వారిలో కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగినవారు చాలా తక్కువ.

హఠయోగం ప్రకారం కుండలినీ శక్తి పీఠం గుదస్థానం మర్మస్థానం మధ్యలో వుంటుంది. స్త్రీలకు యోని స్థానంలో వుంటుంది. ఇది అండం ఆకారంలో వుంటుంది. సర్పం చుట్టలు చుట్టుకుని నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి వుంటుంది. ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి అంశమే కుండలిని. ఈ శక్తిని మేల్కొలిపితే ఆ భౌతికకాయం జీవంతో వున్నంతవరకు శక్తి వుంటుంది. శరీరంలోని నాడులన్నిటినీ మహాశక్తితో నింపుతుంది కుండలిని. మహా శక్తివంతమైన కుండలినీ శక్తిని జాగృతం చేయడమే యోగాభ్యాసంలోని అత్యున్నత స్థితి. మానవ శరీరమే దేవుని నిలయం. మన శరీరంలోనే ఎన్నో అధ్బుతాలున్నాయి. యోగ సాధన ద్వారా మాత్రమే వీటిని మనం దర్శించగలం" అని వివరించారు.

వీరబ్రహ్మంగారు తన శిష్యుడు సిద్దయ్యకి శరీరం గురించి, కుండలినీ శక్తిని గురించి వివరిస్తుండగా, కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహాస్యంగా విన్నాడు. అతడు తన అమాయకత్వంతో "బ్రహ్మంగారు చెప్పినదాని బట్టి శరీరం లో చాలా అధ్బుతాలు వున్నాయి. వాటిని నేను చూడాలి” అనుకుని ఇంటికి వెళ్లాడు.

అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్నికత్తితో నరికివేసి, అందులోతనకు ఏమైనా అద్భుతాలు కనబడతాయేమోనని చూశాడు. కానీ, కక్కయ్యకు రక్త మాంసాదులు తప్ప ఏమీ కనబడలేదు.

'అయ్యో ఆ అయ్యవారు చెప్పిన మాటలు విని నేను, నా భార్యను చంపాను. నాకు దేవుళ్ళు ఎవరూ కనబడకపోగా, పెండ్లాము ప్రాణం తీసిన వాడయ్యాను. దీనికంతటికీ కారణం బ్రహ్మంగారే! ఇదంతా నేను వెళ్లి ఆయననే అడుగుతాను. సమాధానం చెప్పకపోతే ఈ స్వామి దొంగోడు అని అందరికి చెబుతా' - అనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్లాడు. తర్వాత కక్కయ్య బ్రహ్మంగారికి జరిగినదంతా వివరించి, ఆయనను దూషించడం మొదలు పెట్టాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

14.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 34 🌹 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 4 🌻

కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపోయారు బ్రహ్మంగారు. తర్వాత "కక్కయ్యా! నేను చెప్పినదేదీ అసత్యం కాదు. నేను అసత్యాలేవి చెప్పను. దానికి ఋజువుగా మరణించిన నీ భార్యను నేను బతికిస్తాను ” అని అభయమిచ్చి అతని వెనుక బయల్దేరారు.

కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరంపై మంత్రజలం చల్లారు. ఆశ్చర్యకరంగా ఆమె పునర్జీవితురాలైంది.

ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మానందభరితుడైన కక్కయ్య బ్రహ్మంగారి కాళ్ళమీద పడ్డాడు. “నన్ను క్షమించండి ప్రభూ ! నేను మిమ్ముల్ని తెలుసుకోలేకపోయాను. ఇక ఎప్పటికీ నేను మీ శిష్యుడిగానే వుండిపోతాను” అని ప్రార్థించాడు.

“నా శిష్యులు ఎవ్వరూ నన్ను పూజించకూడదు. వారందరూ ఆ సర్వేర్వరుని కోసం అన్వేషిస్తూ వుండాలి. నువ్వు కూడా అదే విధంగా జీవించు" అని కక్కయ్యను ఆయన ఆదేశించి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు.

యధా ప్రకారం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన దేశాటనను కొనసాగించారు. గ్రామాల్లో తిరుగుతూ, ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపటం మొదలుపెట్టాడు.

తన మార్గాంతరంలో నంద్యాల చేరుకున్నారు. ఆ దగ్గరలో వున్నఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భోజనం చేసే సమయంలో దాహం వేసి, ఆ ఊరిలో వున్నఒక విశ్వబ్రాహ్మణుని యింటికి వెళ్లి, కొద్దిగా మంచినీరు ఇవ్వమని అడిగారు.

ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై వున్నందువల్ల, ఇంటిలో ఎవ్వరూ లేనందువల్ల పక్కనే వున్న బావి వద్దకు వెళ్లి నీరు తాగమని చెప్పాడు. కానీ బ్రహ్మంగారు ఆ మాటలను పట్టించుకొనక మళ్ళీ మంచినీరు ఇవ్వమని అడిగారు. దాంతో ఆ విశ్వబ్రాహ్మణుడు కోపం తెచ్చుకుని కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకువచ్చి, బ్రహ్మంగారికి ఇచ్చి దాహం తీర్చుకోమని ఎగతాళి చేశాడు. అతని అహంకారమును పోగొట్టాలని నిర్ణయించుకున్న బ్రహ్నంగారు ఆ మూసను చేతితో పట్టుకుని మంచి నీటి వలె తాగేశారు.

ఇది చూసిన ఆ విశ్వబ్రాహ్మణునికి భయం వేసింది. తర్వాత బ్రహ్మంగారు మామూలు మనిషి కాదని గ్రహించుకుని, ఆయన పాదాలపై పడి, తన తప్పును క్షమించమని ప్రార్థించాడు.

ఒక సందర్భంలో బ్రహ్మంగారు, తన శిష్యుడు కక్కయ్యను ఉద్దేశించి, "నాకు ఎవ్వరి మీదా ఆగ్రహం కలగదు. కేవలం అజ్ఞానం మీద తప్ప! ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా విజ్ఞానం అంకురిస్తుంది, విచక్షణ పెరుగుతుంది. ఇప్పుడు నేను నీ విషయంలో చేసిందే అదే. కాబట్టి ఇకపై నువ్వు వివేకవంతుడిలా ప్రవర్తించు. జరిగినదాని గురించి మరచిపో " అని జవాబిచ్చాడు.

“నా అజ్ఞానాన్ని తొలగించి, నాకు జ్ఞాన బోధ చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ నేను మీకు శిష్యుడిగానే వుండిపోతాను. మీరు అంగీకరించండి ” అని ప్రార్థించాడు.

అందుకు ఒప్పుకున్నబ్రహ్మంగారు, కక్కయ్యను స్వీకరించి, అతనికి సంతృప్తిని కలిగించారు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లాలోని కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి, నంద్యాలకు చేరుకున్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

15.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 35 🌹 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 5 🌻

నంద్యాలలో విశ్వబ్రాహ్మణులలో సంపన్నులను 'పాంచాననం 'అని పిలిచేవారు. వీరు చాలా అహంకారంతో ప్రవర్తించేవారు. సహాయం కోరి వచ్చిన వారితోనూ, ఇతరులతోనూ, వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా తలబిరుసుతనంతో కించపరుస్తూ మాట్లాడేవారు.

ఒకసారి బ్రహ్మంగారు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరిలోని కొందరు భక్తులు స్వామి వారికి భోజనాది వసతులు కల్పించారు. కానీ,పాంచాననం వారు మాత్రం తమకేమీ పట్టనట్టు వున్నారు.

ఇదంతా గమనించిన బ్రహ్మేంద్రస్వామి తానే వారి వద్దకు వెళ్లి "నాయనలారా నా తప్పేముంది? అతి పేదలమైన మేము క్షుద్భాదని ఓర్వలేక మా ఆకలి తీర్చగలరని మీ వద్దకు వచ్చాము. మాకు భోజన సదుపాయములు కల్పించి మా ఆకలి తీర్చగలవారు మీరొక్కరే అని భావిస్తున్నాను. అందువల్ల మీ దగ్గరికి వచ్చాం" అని పలికారు.

వారిలో ఒక వృద్ధుడు 'తినేందుకు ఎంత అన్నం అవసరం అవుతుందో చెప్పమని 'పరిహాస పూర్వకంగా అన్నాడు.

“మాకు ఎంత అవసరం అవుతుంది నాయనా?! ఏదో మా కడుపు నిండితే చాలు" అని బ్రహ్మంగారు జవాబిచ్చారు.

బ్రహ్మంగారిని ఏదో విధంగా అవమానపరచాలని అనుకున్నవారిలో ఒక వ్యక్తి "అబ్బే... మీరు మరీ అంత తక్కువ తింటే మాకు సంతృప్తి వుండదు స్వామిగారూ! మీరు మా అతిథి. మేం మీ కోసం పుట్టి బియ్యం వండి నైవేద్యం అందిస్తాం. మీరు ఏమీ మిగలకుండా తింటేనే మాకు ఆనందం కలుగుతుంది'' అని ఎగతాళిగా అన్నాడు.

“మీరు అంత అడిగినప్పుడు నేను కాదు అని ఎలా అనగలను నాయనా! అలాగే చేయండి ” అన్నారు బ్రహ్మంగారు.

ఆ విశ్వబ్రాహ్మణులు పుట్టి బియ్యం వండించారు. దానిని ఆరగించమని స్వామి వారిని, శిష్యులను భోజనానికి పిలిచారు.

వీరికి తగిన జవాబివ్వాల్సిందేనని నిశ్చయించుకున్న స్వామివారు తన శిష్యుడయిన సిద్ధయ్యను పిలిచి "ఈ అన్నం మొత్తం నువ్వొక్కడివే స్వీకరించి, మనకు అన్నం దానమిచ్చిన వారిని సంతుష్టులను చేయి" అని ఆజ్ఞాపించారు. తర్వాత ఆ అన్నపు రాశి నుంచి ఒక ముద్దను తీసుకుని పక్కకు నిలబడ్డాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం ఆ పుట్టి అన్నాన్ని కూడా వేగంగా ఆరగించేశాడు.

వెంటనే జీర్ణం చేసుకుని, తనకు మరింత అన్నం కావాలని సంజ్ఞ చేశాడు. దీన్ని చూసి నిర్ఘాంతపోయిన ఆ విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారు కావాలని ఈ విధంగా చేశారని గ్రహించారు. వారి శక్తిని గ్రహించి, తమ అహంకారాన్ని, అజ్ఞానాన్నిక్షమించమని కోరారు.

బ్రహ్మంగారు చిరునవ్వు నవ్వి, తన చేతిలో వున్నఅన్నపు ముద్దను సిద్ధయ్యకు తినిపించాడు. అప్పటికి గానీ అతనికి కడుపు నిండలేదు. తర్వాత ఆ విశ్వ బ్రాహ్మణులు స్వామికి పూజలు చేసి, తమకు తత్వోపదేశం చేయమని అభ్యర్థించారు. బ్రహ్మంగారు వారందరికీ జ్ఞానోపదేశం చేశారు.

తర్వాత స్వామివారు అక్కడి నుంచి బయల్దేరి అహోబిలం చేరి అక్కడ వున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచీ మళ్ళీ బయలుదేరి కడపకు చేరారు. కడప నవాబుకు తమ రాక గురించి తెలిపారు.

వెంటనే నవాబు తన పరివారంతో సహా బ్రహ్మంగారి దగ్గరకు వెళ్లి , ఆయనకు సకల గౌరవ సత్కారాలు చేసి, తమతో పాటు తోడ్కొని వెళ్లాడు.

బ్రహ్మంగారి మహిమలు గురించి విన్ననవాబు, ఏదో విధంగా స్వామి వారి మహిమలను చూడాలని నిర్ణయించుకుని, స్వామి దగ్గరకు వచ్చి, మరుసటి రోజు కచేరీ ముందు వున్న మైదానంలో జరిగే సభకు రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చిరునవ్వుతో "నీ మనస్సులో వున్న కోరిక తెలిసింది.నువ్వు అనుకున్నదానిని నేను చేసి చూపించగలను'' అని చెప్పి పంపించారు.

తన మనస్సులో బ్రహ్మంగారి మహిమను పరీక్షించాలి అనుకున్నట్టు ఈయన ఎలా కనిపెట్టారో అర్థంకాక నవాబు విస్మయంలో మునిగిపోయాడు. తాను ఏర్పాటు చేస్తున్న సభ గురించి అందరికీ తెలిసేలా చాటింపు వేయించాడు నవాబు.

మరుసటి రోజు సాయంత్రం ప్రజలందరూ సభా స్థలం వద్దకు చేరుకున్నారు. వీర బ్రహ్మేంద్రస్వామి తన శిష్యులతో సభకు వచ్చి ఆశీనులయ్యారు. నవాబు లేచి నిలబడి "స్వామీ! నా వద్ద ఒక చూడి గుర్రం వుంది. అది ఆడ గుర్రాన్ని కంటుందో లేక మగ గుర్రాన్ని కంటుందో తెలియజేయండి" అని కోరాడు.

స్వామి చిరునవ్వుతో ఆ గుర్రాన్ని సభకు తీసుకురమ్మని కోరగా , నవాబు స్వామివారి ఎదుటకు గుర్రాన్ని తెప్పించాడు. స్వామి ఆ గుర్రాన్ని చూసి "దీని గర్భంలో నాలుగు తెలుపురంగు కాళ్ళు, నొసట చుక్క, పువ్వుల తోక కలిగిన మగ గుర్రం ఉంది. అలాంటి వింత గుర్రమే జన్మిస్తుంది" అని చెప్పారు.

ఆ మాట విన్న తర్వాత కూడా నవాబుకి వున్న సందేహం దూరం కాలేదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

17.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 36 🌹 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మహిమలు పరీక్ష 🌻

వీరబ్రహ్మేంద్రస్వామికి మహిమలు ఉన్నాయో లేదో పరీక్షించాలి అని నవాబు అనుకున్నప్పుడు, నవాబును ఉద్దేశించి "ఆ గుఱ్ఱము గర్భములో వున్నశిశివును చూడటమే నీ ఉద్దేశ్యం అని నాకు అర్థమయింది. అది చూసేవరకూ కూడా నాపై నీక్కలిగిన సందేహం తొలిగిపోదు... అవునా!” అని నవ్వుతూ అడిగారు స్వామి.

నవాబు అవునని జవాబిచ్చాడు.

వీరబ్రహ్మంగారు నాలుగువేపులా డేరా కట్టించి, గుఱ్ఱం గర్భంలో వున్నపిల్లను బయటకు తీసి నవాబుకు చూపించారు. నవాబు దాన్ని తన చేతులతో అందుకుని, తెర బయటకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రజలందరికీ చూపించారు.అది బ్రహ్మంగారు వర్ణించినట్టే చిత్రమైన గుర్తులు కలిగి వుంది. అందురూ స్వామివారి శక్తిని కళ్ళారా చూసి, ఆశ్చర్యపోయారు.

తిరిగి బ్రహ్మేంద్రస్వామి ఆ గుఱ్ఱపు పిల్లని గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి, గుర్రాన్ని తిరిగి బ్రతికించి నవాబుకు ఇచ్చేశారు. ఈ సంఘటనతో నవాబుకు వీరబ్రహ్మంగారిమీద నమ్మకం పెరిగింది. తన భవిష్యత్తు చెప్పమని ప్రార్థించాడు.

🌻. శ్రీ స్వామి వారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట 🌻

నేను శ్రీ వీర భోజుండనయి ఉద్భవిస్తాను. ఈ కలియుగంలో 5000సంవత్సరములు గడిచేసరికి దుష్టశిక్షణ, శిష్టరక్షణకై వస్తాను.ఈలోపుగా సంభవించే కొన్ని పరిణామములను తెలియపరుస్తున్నాను విను...

ఉప్పుకొండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతాలు పుడతాయి. నిజాయితో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. జలప్రవాహాలు ముంచెత్తటంవల్ల 14 నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నేను రావటానికి ఇదే ఒక ప్రబల నిదర్శనం.

నాలుగు వర్ణాలవారు న్యాయం తప్పి నడుస్తారు.

దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి, మాడిపోతారు.

5972సంవత్సరం ధాత నామ సంవత్సరం మాఘ శుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి.

కోటిదూపాటిలోనూ, కొచ్చెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది.

జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. దీనిని నిరూపించుకోవడం కోసం తప్పుడు ప్రమాణాలు చేస్తారు. భర్త మరణించిన స్త్రీలు మరల ముత్తయిదువులవుతారు.

కోమటి కులంలో 25గోత్రముల వారు మాత్రమే నిలిచివుంటారు. ఉత్తర దేశంలో ఉత్తమభేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.

ఇది మహాత్మాగాంధీ గురించి చెప్పిన జ్యోతిష్యం అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. బ్రహ్మంగారు తాను చెప్పిన జోస్యంలో ఏ విధంగా అయితే 'మహాత్మ' అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరు మీద పేరు పొందటం మనందరికీ తెలిసినదే కదా! దేశ విదేశీయులందరూ కూడా ఆయనను 'మహాత్మ' పేరు మీదే సంభోదిస్తారు.

మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.

పట్టపగలు ఆకాశంలోనుంచి పిడుగుల వాన పడి, నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.

దక్షిణ ప్రాంతంలో అయిదు తలల మేకపోతు పుడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది.

ఇలాంటి వింతలూ ఇప్పటికే అనేకం జరిగాయి. పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టడం, ఇతర అనేక జంతువులు వికృత రూపంతో పుట్టడం ఎన్నోసార్లు వార్తల్లో విన్నాం.

బనగానపల్లెలోని కాలజ్ఞాన పాతర మీది వేపచెట్టుకు జాజిపూలు పూస్తాయి.

గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగానపల్లె నవాబు కొంత కాలమే పాలన చేస్తాడు. ఆ తరువాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు.

గోలకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణము ఏలతారు.

మహానంది మరుగున మహిమలు పుడతాయి.

నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించినవారిని నేను కాపాడుతాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వచ్చి మేమే వీర భోగ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటలను నమ్మరు. మూఢులుమాత్రం నమ్ముతారు.

మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు, అరికాలున తామరపద్మం కలిగిన వారు వస్తారు. వారిని నేనే అని భ్రమ వద్దు. నా రాకకు ఒక గుర్తు ఏమిటంటే కందిమల్లయ్యపల్లిలో నవరత్న మంటపం కడతారు. ఈ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


18.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 3͙7͙  🌹 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీ స్వామి వారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట - 2 🌻

“కంచికామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాదిమంది మృతి చెందుతారు.

ఆవు కడుపులోని దూడ పుట్టకుముందే బయటి ప్రజలకు కన్పిస్తుంది.

పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.

కృష్ణ, గోదావరుల మధ్య మహాదేవుడను వాడు జన్మించి శైవుడైనా, అన్నిమతాలనూ గౌరవిస్తూ, గుళ్ళూ గోపురాలూ నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఊగిసలాడుతారు.

కాశీ, కుంభకోణం, గోకర్ణ క్షేత్రాల మహాత్తులు తగ్గిపోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.

ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ, ఈ నిదర్శనాలు కనిపిస్తూంటాయి. పతివ్రతలు పతితలౌతారు. వావీ వరుసలు పాటించరు. ఆచారాలు అన్నీ సమసిపోతాయి.

రాయలవారి సింహాసనం కంపిస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.

శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి. మందులకు తగ్గవు. స్త్రీ పురుషులంతా దురాచారులు అవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.

ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.

వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవమతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలతాయి. బెండ్లు మునుగుతాయి. చివరికి శివశక్తి అంటూ లేకుండా పోతుంది.

విజయనగరాన కోటలోని రాయల సింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామాలలోని రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి. అప్పుడు బిజ్జలరాయని కొలువున రాయల సింహాసనం బయటపడుతుంది...'' ఇలా స్వామివారు కడప నవాబుకు కాలజ్ఞానము బోధించి, మంత్రదీక్ష యిచ్చి ఆశీర్వదించారు.

ఆయన అక్కడినుంచి బయలుదేరి పొద్దుటూరు మీదుగా అల్లాటపల్లె చేరారు. అక్కడ వీరభద్రాలయంలో పూజలు చేయించి బయలుదేరారు. సిద్ధయ్య, మిగిలిన శిష్యులు వెంట రాగా నెమ్మదిగా వెళ్తున్నారు.

ఇదే మార్గంలో అరణ్యంలో తొమ్మిదిమంది దొంగలు, దారిన పోయే బాటసారులను కొల్లగొడుతూ, హతమారుస్తూ వుండేవారు. అందువల్ల ఆ మార్గంలో ప్రయాణించేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ మార్గంలోనే బ్రహ్మంగారు ప్రయాణించడం మొదలుపెట్టారు.

సిద్ధయ్యతో ఇష్టాగోష్ఠి జరుపుతూ వస్తున్న స్వామివారి బండిని ఆ తొమ్మిది మంది దొంగలు ఆపారు. వారిని చూసి బండితోలే వ్యక్తి భయపడిపోయి, బండిని ఆపేశాడు.

కర్రలు ఎత్తి స్వామివారి పైకి పోయిన దొంగలు స్వామి వారి దృష్టి పడటంతోటే ఎత్తిన చేతులు ఎత్తినట్లే వుండిపోయారు. మాట్లాడదామంటే మాటలు కూడా రావటం ఆగిపోయాయి. అలాగే రాతి మనుషుల్లాగా వుండిపోయారు.

అది చూచి వీరబ్రహ్మంగారు బండి దిగి, వారందరినీ తీసుకురమ్మని సిద్ధయకు చెప్పారు. వెంటనే సిద్ధయ్య అందరినీ నెట్టుకుంటూ స్వామి వారి వద్దకు చేర్చాడు. స్వామివారు దొంగలందరిని స్వయంగా తాకి , వారి చేతులను కిందికి దించారు.

“నన్ను కొట్టి ఈ బండిలో వున్నధనాన్ని తీసుకోండి" అన్నారు.

జవాబు చెబుదామనుకున్నారు గానీ వారికి నోట మాట రాలేదు.

స్వామివారు కొంత విభూతి వారి నోటిలో వేశారు. అయినా వారు శరీరాన్ని కదపలేక పోయారు. పశ్చాత్తాప పడిన దొంగలు స్వామిని ప్రార్థించారు. దాంతో స్వామి వారిని క్షమించి వదిలివేశారు. స్వామివారు అక్కడినుంచి బయలుదేరి, పుష్పగిరి అగ్రహారం చేరారు.

🌻. పుష్పగిరి వాసులకు చెప్పిన కాలజ్ఞానం.... 🌻

నేను శ్రీ వీరభోగవసంతరాయలుగా, కలియుగంలో 5000సంవత్సరంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం భూమిపై అవతరిస్తాను.

మార్గశిర మాసంలో దక్షిణభాగంలో ధూమకేతువనే నక్షత్రం ఉదయిస్తుంది. మీ అందరికీ కన్పిస్తుంది. క్రోథి నామ సంవత్సరమున, మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీ వీర భోగ వసంతరాయలుగా వచ్చే సమయంలో దక్షిణాన నక్షత్రము ఒకటి పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి''

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


19.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 38  🌹 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీ స్వామి వారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట - 3 🌻

వేదములు అంత్య జాతుల పాలవుతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్తుల పంచన చేరతారు. విధవా వివాహాలు జరుగుతాయి. విప్రులు స్వ ధర్మాలు మాని ఇతర వృత్తులు చేపడతారు. బానిసత్వం చేస్తారు.

బ్రాహ్మణులను పిలిచేవారు వుండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముతారు. నేను తిరిగి అవతరించేసరికి బ్రాహ్మణులకు తినేందుకు తిండి, గుడ్డ కరువవుతాయి.

మీన రాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీర భోగ వసంత రాయలుగా ఉద్భవిస్తాను. నాలుగు మూరల ఖడ్గము పట్టి శ్రీశైల పర్వతం మీదికి వచ్చి, అక్కడి ధనమంతా పుణ్యాత్ములయిన వారికి పంచి ఇస్తాను.

నేను తిరిగి భూమి మీదకు ఎలా వస్తానో వివరిస్తాను - వినండి కేదారివనంలో నిరాహారినై తపం చేస్తాను.మూడు వరాలు పొంది, అచ్చటి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి,బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి అక్కడ మహా మునుల, మహార్షుల దర్శనము చేసుకుంటాను.

అక్కడినుండి బయలుదేరి, శ్రీశైలం మల్లిఖార్జునుని సేవిస్తాను.అనంతరం దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటాను.

మహానందిలో రెండు నెలలుండి, అక్కడి నుంచి శ్రావణ శుద్ధ పౌర్ణమి నాటికి వీరనారాయణపురం చేరుకుంటాను. అక్కడ కొంతకాలం నివసిస్తాను. నేను తిరిగి వచ్చేసరికి జనులు ధన మదాంధులుగా మారి అజ్ఞానంతో కొట్టుకుచస్తారు.

నా రాకకు ముందు సముద్రములోని జీవరాశులన్నీనశిస్తాయి. పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండ పగులకొడతారు.

కాశీదేశములో కలహాలు చెలరేగుతాయి.

మున్ముందు విధవా వివాహాలు విస్తృతంగా జరుగుతాయి. అవి సర్వసాధారణం అయిపోతాయి.

వావీ వరుసలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతి అవతారములను డబ్బులకు అమ్ముతారు. కులగోత్రములు, నీతి జాతి లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి.

భూమ్మీద ధనరాశులు ముక్కుటంగా ఉంటాయి. చివరికి అరణ్యాలల్లోనూ, అమితమైన ధనముంటుంది. నేను భూమిపై పెక్కు దుష్టాంతాలను పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమి మీద మంటలు పుడతాయి.

నాలుగు సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై పుణ్యక్షేత్రములు నశించిపోయేను.

నా రాకకు ముందు అనేక చిత్రములు కలిగేను. శృంగేరి, పుష్పగిరి పీఠములు పాంచాననం వారి పాలవుతాయి.

ఉత్తర దేశంలోకత్తులు తెగుతాయి. తూర్పుదేశం ధూళి అయిపోతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


20.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 40  🌹 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సిద్ధయ్యకు చేసిన జ్ఞాన బోధ 🌻

వీర బ్రహ్మేంద్ర స్వామి పుష్పగిరి నుండి వచ్చే మార్గమధ్యంలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సిద్దయ్య, స్వామివారి పాదాలు ఒత్తుతూ తనకు జ్ఞానబోధ చేయమని కోరాడు.

దానికి అంగీకరించిన బ్రహ్మేంద్రస్వామి అమూల్యమైన విషయాలను ప్రసంగించడం మొదలుపెట్టారు. “సిద్ధయ్యా, విను, జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు, ప్రాణాలు ఐదు. ఇవి అన్నీ కలిసి 24 తత్వములవుతాయి. . ధవళ, శ్యామల, రక్త, శ్వేత వర్ణముల మధ్య ప్రకాశించేది ‘ప్రకృతి’. అదే ‘క్షేత్రము’. అదే సర్వసాక్షి అయిన సచ్చిదానంద స్వరూపం.. ధవళ, శ్యామల, రక్త, పీత వర్ణాలలో రక్తవర్ణమే స్థూల శరీరం. శ్వేతవర్ణమే సూక్ష్మదేహం.. శ్యామలవర్ణమే కారణ శరీరం. వీటి నడుమ ప్రకాశించే పీత వర్ణమే మహా కారణ దేహము. ఈ కాయమూలా ప్రమాణం గురించి వివరిస్తాను విను...

''స్థూలకాయము ఒకటిన్నర అంగుళాల వ్యాసము గలది. కాయమూలము అంగుళముపైన వుంటుంది. వీటిని మించి ప్రకాశిస్తూ, వుండేదే ఆత్మ. అదే చైతన్యం. ఇవన్నియూ నేత్రములకు కనిపించేవే! నీకు అవి గోచరమయ్యే విధంగా నేను నా శక్తిని వినియోగిస్తాను’’ అని చెప్పి, సిద్ధయ్యకు వాటిని దర్శింపచేశారు స్వామి.దాంతో సిద్దయ్య సంతృప్తి పడ్డాడు. 

🌻. స్వామివారు పంచాననం వారికి కాలజ్ఞానమును చెప్పటం... 🌻 

శ్రీముఖ నామ సంవత్సరమున శ్రీ వీరభోగ వసంతరాయులనై వచ్చి పరిపాలనా బాధ్యత స్వీకరిస్తాను. మహానందికి ఉత్తరాన అనేకమంది మునులు పుట్టుకొస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.

5000 సంవత్సరం వచ్చేసరికి బ్రాహ్మణులు సంకరవృత్తులను చేస్తూ, తమ వైభవం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్ధులు, యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణకులము పూర్తిగా వర్ణసంకరం అవుతుంది.

ఆనాటికి ప్రజలలో దుర్భుద్ధులు అధికమవుతాయి. కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగును తాకుతుంది. రాజాధిరాజులు అణిగి వుంటారు. శూద్రులు విలాసాలను అనుభవిస్తూ, రాజుల హోదాలో వుంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతూ వుంటుంది. నా భక్తులయిన వారికి నేనిప్పుడే దర్శనమిస్తాను. కానీ వారి నెత్తురు భూమిమీద పారుతుంది. కొంత భూభారము తగ్గుతుంది. దుర్మార్గుల రక్తముతో భూమి తడుస్తుంది.

చీమలు నివసించే బెజ్జాల్లో చోరులు దూరతారు. దురాలోచనలు మితిమీరుతాయి. అందువల్ల చోరులు ప్రత్యేకముగా కనపడరు. బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళ్తుంది.

గడగ్, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలిపిరి, అరవరాజ్యము, వెలిగోడు, ఓరుగల్లు, గోలకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలనేంద్రియయములు, ఆయుధాల చేత, బాణముల వల్ల నశిస్తాయి.

ఉత్తర దేశాన భేరి కోమటి ‘గ్రంథి’ అనే మహాత్ముడు అవతరిస్తాడు.

అందరిచే పూజింపబడతాడు. . అందరూ పాటించవలసిన కొన్ని ధర్మములను గురించి నీకు చెబుతాను ... విను …

తాము భోజనము చేయబోయే ముందుగానే ఇతరులకు పెట్టటం ఉత్తమ ధర్మం. తాము భోజనం చేసి యింకొకరికి పెట్టటం మాధ్యమం, ఫలాపేక్షతో ఒకరికి అన్నదానం చేయటం అధమం. చాలకుండా అన్నం పెట్టటం అధమాధమం. దానాలన్నిటిలోనూ అన్నదానం అత్యుత్తమం.

కలియుగం 4808 సంవత్సరములు గడిచిన తరువాత కొట్లాటలు ఎక్కువవుతాయి. నిద్రాహార కాల పరిమితులు పాటించక మానవులు ధర్మహీనులవుతారు. శాంత స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు. పిల్లలు పెద్దలను ఆశ్రయించుటకు బదులు, పెద్దలే పిన్నలను ఆశ్రయిస్తారు. దుష్టమానవుల బలం పెరుగుతుంది. రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు. భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారు.

కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది. వావి వరసలు నశిస్తాయి.

బ్రాహ్మణనింద, వేదనింద, గురువుల నిందలు ఎక్కువవుతాయి.

జారుత్వం, చోరత్వం, అగ్ని, రోగ, దుష్టులవలన ప్రజలు పీడింపబడతారు.

అడవిమృగాలు పట్టణాలు, పల్లెలలో తిరుగుతాయి.

మాల, మాదిగలు వేదమంత్రాలు చదువుతారు.

ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి జన్మిస్తాయి.

రక్త వాంతులు, నోటిలో పుండ్లు వలన, తలలు పగలడం వలన జనం మరణిస్తారు (ఇది అణు దాడి వల్ల సంభవించే కాన్సర్ తదితర వ్యాధుల వల్ల జరగవచ్చు)

కొండల మీద మంటలు పుడతాయి.

జంతువులూ గుంపులు గుంపులుగా మరణిస్తాయి.

భారతదేశము పరుల పాలనలోకి వెళుతుంది.

ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు. కులం, ఆచారం నశిస్తాయి. మనుషులందరూ కలిసి మెలిసి, కుల మత వర్ణబేధాలు లేక ప్రవర్తిస్తారు.

ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి.

మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి.

ఒకే రేవున పులి, మేక నీరు తాగుతాయి.

వెంపలి మొక్కకు నిచ్చెనలు వేసే మనుష్యులు పుడతారు.

విజయనగర వైభవము నశిస్తుంది.

కాశీ నగరం పదిహేను రోజులు పాడుపడిపోతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


21.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 40  🌹 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సిద్ధయ్యకు చేసిన జ్ఞాన బోధ 🌻

వీర బ్రహ్మేంద్ర స్వామి పుష్పగిరి నుండి వచ్చే మార్గమధ్యంలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సిద్దయ్య, స్వామివారి పాదాలు ఒత్తుతూ తనకు జ్ఞానబోధ చేయమని కోరాడు.

దానికి అంగీకరించిన బ్రహ్మేంద్రస్వామి అమూల్యమైన విషయాలను ప్రసంగించడం మొదలుపెట్టారు. “సిద్ధయ్యా, విను, జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు, ప్రాణాలు ఐదు. ఇవి అన్నీ కలిసి 24 తత్వములవుతాయి. . ధవళ, శ్యామల, రక్త, శ్వేత వర్ణముల మధ్య ప్రకాశించేది ‘ప్రకృతి’. అదే ‘క్షేత్రము’. అదే సర్వసాక్షి అయిన సచ్చిదానంద స్వరూపం.. ధవళ, శ్యామల, రక్త, పీత వర్ణాలలో రక్తవర్ణమే స్థూల శరీరం. శ్వేతవర్ణమే సూక్ష్మదేహం.. శ్యామలవర్ణమే కారణ శరీరం. వీటి నడుమ ప్రకాశించే పీత వర్ణమే మహా కారణ దేహము. ఈ కాయమూలా ప్రమాణం గురించి వివరిస్తాను విను...

''స్థూలకాయము ఒకటిన్నర అంగుళాల వ్యాసము గలది. కాయమూలము అంగుళముపైన వుంటుంది. వీటిని మించి ప్రకాశిస్తూ, వుండేదే ఆత్మ. అదే చైతన్యం. ఇవన్నియూ నేత్రములకు కనిపించేవే! నీకు అవి గోచరమయ్యే విధంగా నేను నా శక్తిని వినియోగిస్తాను’’ అని చెప్పి, సిద్ధయ్యకు వాటిని దర్శింపచేశారు స్వామి.దాంతో సిద్దయ్య సంతృప్తి పడ్డాడు. 

🌻. స్వామివారు పంచాననం వారికి కాలజ్ఞానమును చెప్పటం... 🌻 

శ్రీముఖ నామ సంవత్సరమున శ్రీ వీరభోగ వసంతరాయులనై వచ్చి పరిపాలనా బాధ్యత స్వీకరిస్తాను. మహానందికి ఉత్తరాన అనేకమంది మునులు పుట్టుకొస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.

5000 సంవత్సరం వచ్చేసరికి బ్రాహ్మణులు సంకరవృత్తులను చేస్తూ, తమ వైభవం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్ధులు, యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణకులము పూర్తిగా వర్ణసంకరం అవుతుంది.

ఆనాటికి ప్రజలలో దుర్భుద్ధులు అధికమవుతాయి. కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగును తాకుతుంది. రాజాధిరాజులు అణిగి వుంటారు. శూద్రులు విలాసాలను అనుభవిస్తూ, రాజుల హోదాలో వుంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతూ వుంటుంది. నా భక్తులయిన వారికి నేనిప్పుడే దర్శనమిస్తాను. కానీ వారి నెత్తురు భూమిమీద పారుతుంది. కొంత భూభారము తగ్గుతుంది. దుర్మార్గుల రక్తముతో భూమి తడుస్తుంది.

చీమలు నివసించే బెజ్జాల్లో చోరులు దూరతారు. దురాలోచనలు మితిమీరుతాయి. అందువల్ల చోరులు ప్రత్యేకముగా కనపడరు. బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళ్తుంది.

గడగ్, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలిపిరి, అరవరాజ్యము, వెలిగోడు, ఓరుగల్లు, గోలకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలనేంద్రియయములు, ఆయుధాల చేత, బాణముల వల్ల నశిస్తాయి.

ఉత్తర దేశాన భేరి కోమటి ‘గ్రంథి’ అనే మహాత్ముడు అవతరిస్తాడు.

అందరిచే పూజింపబడతాడు. . అందరూ పాటించవలసిన కొన్ని ధర్మములను గురించి నీకు చెబుతాను ... విను …

తాము భోజనము చేయబోయే ముందుగానే ఇతరులకు పెట్టటం ఉత్తమ ధర్మం. తాము భోజనం చేసి యింకొకరికి పెట్టటం మాధ్యమం, ఫలాపేక్షతో ఒకరికి అన్నదానం చేయటం అధమం. చాలకుండా అన్నం పెట్టటం అధమాధమం. దానాలన్నిటిలోనూ అన్నదానం అత్యుత్తమం.

కలియుగం 4808 సంవత్సరములు గడిచిన తరువాత కొట్లాటలు ఎక్కువవుతాయి. నిద్రాహార కాల పరిమితులు పాటించక మానవులు ధర్మహీనులవుతారు. శాంత స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు. పిల్లలు పెద్దలను ఆశ్రయించుటకు బదులు, పెద్దలే పిన్నలను ఆశ్రయిస్తారు. దుష్టమానవుల బలం పెరుగుతుంది. రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు. భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారు.

కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది. వావి వరసలు నశిస్తాయి.

బ్రాహ్మణనింద, వేదనింద, గురువుల నిందలు ఎక్కువవుతాయి.

జారుత్వం, చోరత్వం, అగ్ని, రోగ, దుష్టులవలన ప్రజలు పీడింపబడతారు.

అడవిమృగాలు పట్టణాలు, పల్లెలలో తిరుగుతాయి.

మాల, మాదిగలు వేదమంత్రాలు చదువుతారు.

ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి జన్మిస్తాయి.

రక్త వాంతులు, నోటిలో పుండ్లు వలన, తలలు పగలడం వలన జనం మరణిస్తారు (ఇది అణు దాడి వల్ల సంభవించే కాన్సర్ తదితర వ్యాధుల వల్ల జరగవచ్చు)

కొండల మీద మంటలు పుడతాయి.

జంతువులూ గుంపులు గుంపులుగా మరణిస్తాయి.

భారతదేశము పరుల పాలనలోకి వెళుతుంది.

ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు. కులం, ఆచారం నశిస్తాయి. మనుషులందరూ కలిసి మెలిసి, కుల మత వర్ణబేధాలు లేక ప్రవర్తిస్తారు.

ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి.

మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి.

ఒకే రేవున పులి, మేక నీరు తాగుతాయి.

వెంపలి మొక్కకు నిచ్చెనలు వేసే మనుష్యులు పుడతారు.

విజయనగర వైభవము నశిస్తుంది.

కాశీ నగరం పదిహేను రోజులు పాడుపడిపోతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


24.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.   శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 41  🌹 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. స్వామివారు పంచాననం వారికి కాలజ్ఞానమును చెప్పటం... 2 🌻 

“గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగిపొర్లుతుంది. వేంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి.

కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుంది. ఆ రథాన్ని చూసిన వారి కళ్ళుపోయి, గుడ్డివారవుతారు. కర్ణాటక దేశంలో దేవాలయాలను తురకలు ధ్వంసం చేస్తారు.

కుక్కలు గుఱ్ఱాలను చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి.

నేల నెత్తురుతో తడిచిపోతుంది . చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి వుంటాయి. దుష్టశక్తులు విజ్రుంభిస్తాయి. అందువల్ల జననష్టం జరుగుతుంది. కాకులు కూస్తాయి, నక్కలు వూళలు వేస్తాయి. ఫలితంగా ప్రజలు మరింతమంది గుంపులుగా మరణిస్తారు.

కొండవీటి రాతిస్థంభం కూలిపోవటం తథ్యం.

కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి.

పసిబిడ్డలు మాట్లాడతారు. ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది.

కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కన్పిస్తాయి. అవి అయిదు నెలలపాటు వుంటాయి. వేంకటేశ్వరుని సొమ్ము దొంగలు అపహరిస్తారు.

కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు. ప్రజలు గ్రామాలు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. అనేక రకాలయిన జబ్బుల వలన పలువురు మరణిస్తారు.

అమావాస్య నాటి అర్థరాత్రి సమయాన ఉదయగిరి శిఖరం మీద చక్రాంకితుడైన ఒక పరమహంస ఎక్కి నిలిచి వుండడం చూసి, చంద్రగ్రహణం అని జనులు ఆశ్చర్యం చెందుతారు.

ఆకాశమార్గాన రెండు బంగారు హంసలు వచ్చి, పట్టణాల్లో సంచరిస్తాయి. దురాశాపరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి సర్వ నాశనమైపోతారు. ఆకాశాన తూర్పు పడమరలు కాషాయరంగున కనిపిస్తాయి. 

కొండల నుండి పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి.

వీరభోగవసంతరాయులునై నేను వచ్చులోపల ఇలాంటి వింతలూ అనేకం జరుగుతాయి’’ అని చెప్పి బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ముగించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం

25.Aug.2020

------------------------------------ x ------------------------------------




🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 42  🌹 

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. తన గత జన్మల గురించి చెప్పిన వీరబ్రహ్మేంద్రస్వామి 🌻

ఒకరోజు సిద్దయ్య స్వామికి సేవ చేస్తూ “స్వామీ! మీకు గతంలో కొన్నిసార్లు త్రేతా, ద్వాపర యుగాలలో కూడా జన్మించారని నాకు తెలిపారు. మీ పూర్వ జన్మల వివరాలను గురించి నాకు వివరిస్తారా?’’ అని అడిగాడు.

“నా గతజన్మల గురించిన వివరములు రహస్యములే అయినా, నీకు మాత్రం వివరించగలను’’ అని తన పూర్వ జన్మల గురించి చెప్పటం ప్రారంభించారు బ్రహ్మేంద్రస్వామి.

“బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను. ఆ తరువాత వెండి కొండ మీదకి వెళ్ళి 54 బ్రహ్మకల్పములు రాజ్యపాలన చేశాను. అప్పుడే మూడు యోజనాల పొడవైన కూర్మసిహాసనమును నిర్మించి, 290 బ్రహ్మకల్పాలు విష్ణుసేవ చేశాను. 

నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు ‘పంచ విధ ముక్తి’ అనే వరం ఇచ్చారు. తర్వాత నేను సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమమ వద్ద అన్ని విద్యలూ అభ్యసించి, మూడేళ్ళ తరువాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12000 గ్రంథములను పఠించి, అందులోని మర్మములన్నియూ గ్రహించాను.

వీటి ఫలితంగా నేను కాల అకాల మృత్యువులను జయించగలిగే శక్తిని సంపాదించాను. అనంతరం నా యోగబలం వల్ల దివ్య శరీరం ధరించి మూడువేల బ్రహ్మకల్పములు చిరంజీవిగా వున్నాను. ఆ తరువాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుచున్నాను విను.

మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మకల్పాలు వున్నాను. 

మూడవ అవతారంలో 1,09,00,000 వున్నాను. నాల్గవ అవతారంలో కోటి పదమూడు వందల పదిహేడు బ్రహ్మకల్పాలు వున్నాను. 

అయిదో అవతారంలో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల యాభై అయిదు వేల బ్రహ్మకల్పాలు వున్నాను. 

ఆరవ అవతారంలో ఆరువందల బ్రహ్మకల్పాలు వున్నాను. 

ఏడవ అవతారంలో 27,62,03,400 బ్రహ్మకల్పాలు బతికి వున్నాను.

ఎనిమిదో అవతారంలో 22,60,000 బ్రహ్మకల్పాలు వున్నాను. 

పదవ అవతారంలో కనిగిరిలో జన్మించాను. ఆ జన్మలో 70 లక్షలకు పైగా బ్రహ్మకల్పములలో జీవించాను.

ఇప్పుడు బనగానపల్లెలో వీరప్పయాచార్యుడనై 125 సంవత్సరములు తపస్సు చేశాను. వీరబ్రహ్మేంద్రస్వామిగా మొత్తము 175 సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను’’

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం 

26.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 43  🌹 

📚. ప్రసాద్ భరద్వాజ

నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయలవరకు చరిత్ర అంతమవుతుంది. తరువాత కాలంలో ఈ ఖండం మహ్మదీయుల పరమవుతుంది. శ్వేతముఖులు (తెల్లవాళ్ళు) భారత రాజ్యాన్ని ఏలతారు.

పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు. మొగలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమయిన రీతిగా, జనాన్ని నశింపచేస్తుంది.

వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారు, వివాహాలు చేసుకుని కాపురాలు చేస్తారు. గురువులు ఆడంబరంగా బతుకుతారు.

కుటుంబంలో సఖ్యత వుండదు. తల్లీ, తండ్రీ, పిల్లల మధ్య వాత్సల్యాలు వుండవు. ఒకరిమీద మరొకరికి నమ్మకం నశిస్తుంది. నా రాకకు ముందుగా, నా భక్తులు వారి శక్త్యానుసారము నా ధర్మ పరిపాలనకు అంకురార్పణలు చేస్తారు’’ అని సిద్ధయ్యకు వివిరించారు బ్రహ్మేంద్రస్వామి.

🌻. కర్నూలు నవాబుకు స్వామివారు కాలజ్ఞానము బోధించుట 🌻 

క్రోధ నామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి, సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీర భోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన ఒక గొప్ప నక్షత్రం ఉద్భవించి, అందరికీ కనిపిస్తుంది.

చండి పర్వతం, ఆలంపూర్ మొదలైన స్థాలములలో ఉత్పాతాలు పుడతాయి. ఈ ప్రాంతంలో పాలెగాళ్ళు, తమలో తాము ఘర్ఘణ పడి, చెడి అడవుల పాలై భ్రష్టులై పోతారు. నలు దిక్కుల యందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.

అమావాస్య రోజున పూర్ణచంద్రుని చూసి జనులు నశిస్తారు. కార్తీకం నిజమని నా మహిమను తలచుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది. 

తూర్పున శిరస్సు, పడమర తోకగా, తోక వెడల్పుగా ఇరువది బారల పొడవుగల నల్లని ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజులకు అందరికీ కన్పిస్తుంది. ఆకాశం ఎర్రబడి, ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి.

ఈశ్వరమ్మను. రంగరాజునకిచ్చి వివాహం చేసేనాటికి కందిమల్లయ్య పల్లె నవరత్న మండపాలతో పన్నెండు ఆమడల పట్నమవుతుంది. నా భక్తులు యావన్మంది యిక్కడకు వచ్చి కళ్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం’’

ఈ కాల జ్ఞానం విన్న తరువాత నవాబు, స్వామివారికి అనేక బహుమతులను అందజేశాడు. ఆ బహుమతులను బ్రహ్మగారి మఠంలోనే వుంచారు.

కొన్ని రోజుల తరువాత కొంతమంది దొంగలు ఈ వస్తువులను ఏ విధంగా అయినా దోచుకోవాలని అక్కడికి వచ్చారు. ఆ రాత్రి మఠంలో ప్రవేశించి ఆ వస్తువులను పట్టుకున్నారు. అంతే! వారికి కండరములు స్వాధీనంలో లేకుండా అయిపోయాయి. ఎంత ప్రయత్నించినా మాట కూడా మాట్లాడలేకపోయారు. భయంతో అలాగే నిలబడి చూడటం తప్ప వేరే ఏమీ చేయలేకపోయారు.

వారిని పట్టుకున్నారు ఆశ్రమవాసులు. ఇది తెలిసి అక్కడికి వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి. వారిని చూసినా, ఆయన కోపం తెచ్చుకోలేదు. పైగా వారికి తగిన బోధ చేయాలని నిర్ణయించుకుని, వారికీ సైతం కాలజ్ఞానాన్ని ఉపదేశించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం

27 Aug 2020

------------------------------------ x ------------------------------------



🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 44 🌹 

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. దొంగలకు చెప్పిన కాలజ్ఞానం 🌻

“దేశానికి ఆపదలు తప్పవు. ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. ఆరు మతాలూ ఒక్కటవుతాయి. నిప్పుల వాన కురుస్తుంది. నెల్లూరు జలమయం అవుతుంది. నెత్తురు ఏరులై పారుతుంది. 

ఏడు గ్రామాలకు ఒక గ్రామం, ఏడిళ్ళకు ఒక ఇల్లు మిగులుతాయి. ప్రజలు కత్తులతో పోట్లాడుకుంటారు. పార్వతి, బసవేశ్వరుల కంట నీరు కారుతుంది. కప్పలు కోడికూతలు కూస్తాయి. భూమి కంపిస్తుంది. అప్పుడు నేను సమాధిలో నుంచి వీర భోగ వసంతరాయులుగా మరల జన్మిస్తాను’’ అని వివరించారు.

🌻. సమాధి పొందే సమయం .... 🌻 

కొన్ని సంవత్సరములు పూర్తయిన తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు. తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందాచార్య స్వామికి పట్టాభిషేకము చేయదలిచి, ఈ విషయమై తన భక్తులందరికీ కాల జ్ఞాన సౌజన్య పత్రికను పంపారు.

🌻. కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా వుంది... 🌻 

“మేం ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారం 2.30 గంటలకు ఈ భౌతిక దేహాన్ని వదిలి జీవ సమాధి సిద్ధిని పొందదలచుకున్నాము. 

కనుక ఈ పీఠాధిపత్యం నా పెద్ద కుమారుడైన గోవిందాచార్య వారికి అప్పగించుకోదలిచాను. అది తిలకించి నా దగ్గర మూడు రోజులుండి, నేను సమాధిగతుడనగుట చూడవలెనని ఆహ్వానము. నేను వివరించబోవు కాలజ్ఞాన విశేషాలను విని తరించవచ్చును. 

అలా స్వయముగా వచ్చి కాలజ్ఞానాద్వైత తత్త్వబోధ వినలేని వారి కోసం ఈ పత్రికతో కొన్ని కాలజ్ఞాన విశేషాలను వివరించి యున్నాము. ఈ పత్రికనే వారు దీపారాధన, నైవేద్యములతో పూజించిన వారికి సకల శుభములు కలుగును.

నేను ఈ వీరబ్రహ్మేంద్రస్వామి అను పేరు ధరించి ఇప్పటికి 175 సంవత్సరములు గడిచాయి. ఇప్పుడు నేను సమాధి, నిష్టలో వుండాలని నిర్ణయించుకున్నాను. తిరిగి భూమి మీదకు వీరభోగవసంతరాయులుగా రాబోతున్నాను.

నేను వచ్చే సమయానికి ఈ కలి లోకంలో, ఎర్ర బొయీలు – శ్వేత ద్వీప వాసులు వస్తారు. శాలివాహన శకమునందే, వీరు మహ్మదీయులతో స్నేహం పొంది, భరతఖండం పాలిస్తారు.

హరిహరాదుల గుళ్ళల్లో పూజలు హరించి పోతాయి. ధనమధాందతచే సాధువులను, జ్ఞానులను, దూషణ చేస్తారు. భూమిపై వర్షములు కురిసినట్లుగానే వుంటాయి. కానీ పంటలు పండవు. పైరులు పండినట్లుగానే వుంటాయి. కానీ నిలవవు. బహు ధాన్య నామ సంవత్సరంలో, కనకదుర్గ మొదలయిన శక్తులు భూమి మీదకు వస్తాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం

28 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.   శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 45  🌹 

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా వుంది... 2 🌻 

“శ్రీశైలంలో తపస్సు చేస్తాను. నంద నామ సంవత్సరంలో నేను తపస్సు ప్రారంభించబోయే ముందు, భూమి మీద కొన్ని నక్షత్రాలు రాలిపడతాయి. భూమి గడగడ వణుకుతుంది. అనేకమంది ప్రజలు మరణిస్తారు. శుభ కృత నామ సంవత్సరంలో కార్తీక మాసంలో, దక్షిణ భాగంలో అనేక ఉత్పాతాలు కనబడతాయి. అదే సమయంలో ధూమకేతు నక్షత్రం ఆవిర్భవిస్తుంది. అందువల్ల అనేకమంది మరణిస్తారు.

నేను సమాధి విడిచి విష్ణు అంశతో కలికి అవతారం ఎత్తుతాను. ప్రమాదినామ సంవత్సరానికి ఎనిమిదేళ్ళవాడినై ఎర్ర బొయీలతో కలిసి వారికి అంతర్య బుద్ధులు కల్పిస్తాను.

అక్కడినుండి శాలివాహనశకం 5407 సంవత్సరము నాటికి, సరిగా పింగళనామ సంవత్సరంలో భయంకరమైన కొట్లాటలు ప్రారంభమవుతాయి. కాళయుక్త నామ సంవత్సరం వరకూ, ఉత్తరదేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి. ఆనందనామ సంవత్సరంలో మార్గశిర బహుళ అష్టమీ గురువారం మల్లిఖార్జునుడు భ్రమరాంబా సమేతంగా వింధ్యపర్వతానికి చేరతాడు.

రక్తాక్షినామ సంవత్సరంలో విజయవాడకు వచ్చి, అక్కడ పోతులూరి వారి కన్యను పెళ్ళాడి, పట్టాభిషిక్తుడనవుతాను. దుర్ముఖినామ సంవత్సరం, కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని, దుష్ట నిగ్రహం ఆరంభిస్తాను. నేను వచ్చేసరికి కలియుగ ప్రమాణం 4094 అవుతుంది.

నా భక్తులయిన వారును సదా నమ్మి ఓం, హ్రీం, క్ల్రీం, శ్రీం, శివాయ శ్రీ వీరబ్రహ్మణే నమః అను బీజ సంపుటయైన మహామంత్రమును ఎప్పుడూ పలుకుతుంటే, వారికి నేను మోక్షం ప్రసాదిస్తాను’’

పుత్రుడు గోవిందాచార్యుల స్వామికి బ్రహ్మంగారు తెల్పిన భవిష్యత్ శ్రీ వీరబ్రహ్మంగారు, తన కుమారులకు చెప్పిన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే, మొదటగా శ్రీ బ్రహ్మంగారు విశ్వనాథ అవధూతగా పుడతారు. 

ఆ తరువాత ముప్పరంలో స్వర్ణ అమరలింగేశ్వర స్వామిగా, చెరుకూరి శివరామయోగిగా జన్మిస్తారు. ఆ తరువాత వీర భోగ వసంతరాయుల అవతారం.

“నాయనా! నేను కంది మల్లయ్యపల్లె చేరి వీర బ్రహ్మ నామతో యిప్పటి వరకు 175 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ నేను ఈ కలియుగంలోని సామాన్యుల మనస్సులను మార్చి, కేవలం పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను.

ఇప్పుడు ఈ బాధ్యతను నీవే స్వీకరించవలసి వుంది. వీరి ఆలోచనలను ఏ విధంగా మార్చగలవో అది నీ యిష్టం. నేను ఈ దినము సమాధి నిష్ఠలో ప్రవేశించేందుకు నిశ్చయించుకున్నాను. నీ సోదర సోదరీమణులను జాగ్రత్తగా సంరక్షించుకో. 

నీకొక రహస్యాన్ని తెలియజేస్తున్నాను. నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది. ఆమె భూత, భవిష్యత్, వర్తమానములను తెలిసిన బ్రహ్మజ్ఞాని. ఈ కలియందలి మూఢులకు నేనెట్లు మహిమలు చూపానో, ఆమె కూడా అద్భుతములైన మహిమలు ప్రదర్శిస్తుంది.

ఆమె వాక్కులు వెంటనే ఫలిస్తాయి. చివరికామె ఆ విధంగానే సమాధి నిష్టను పొందుతుంది. నా విధంగానే అంటే ... నాకు ఏ విధంగా మఠములున్నాయో, అదే విధంగా ఆమెకు కూడా మఠములుంటాయి. 

నాకే విధంగా పూజలు జరుగుతున్నాయో అలానే ఆమెకు కూడా పూజలు జరుగుతాయి. ఆ దేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవలసి వుంది. ఇక సిద్ధుని విషయంలో అసలు రహస్యం చెబుతాను విను. అతడు ఈశ్వరాంశ సంభూతుడు. 

ఈతడు ఒక క్షత్రియుని ఇంత పుట్టి గోహత్య చేయటంవల్ల ఇలా మహమ్మదీయ వంశంలో జన్మించాడు. ఆ గోహత్య పాపపరిహారం కోసమే యిప్పుడు నా సేవకుడయ్యాడు.

🌻. గోవిందమ్మకు జ్ఞాన బోధ 🌻

బోధ వైశాఖ శుద్ధ దశమి, ఆదివారం అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శుభ సమయమైనందున తాను సమాధి పొందగలనని వీరబ్రహ్మంగారు ప్రకటించారు.

గోవిందమ్మ విలపించటం ప్రారంభించారు. అప్పుడు గోవిందమ్మను ఉద్దేశించి బ్రహ్మంగారు “నాకు మరణం లేదు, నీకు వైధవ్యం లేదు. నీవు సుమంగళిగా జీవించు. సమాధిని చీల్చుకుని నేను వీరభోగ వసంతరాయులనై భూమి మీద అవతరిస్తాను. 

నా ధర్మ పాలనతో భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను తిరిగి అవతరించే వరకు ఏమేం జరుగుతాయో నీకు క్రమక్రమంగా వివరిస్తాను’’ అంటూ కాలజ్ఞాన బోధ మొదలుపెట్టారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం

29 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 46  🌹 

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా వుంది... 3 🌻

“బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్షమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పోగు తాకుతుంది. కంచికామాక్షి నేత్రాల కన్నీరు ఒలుకుతుంది. కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.

బనగాపల్లెలో నా ప్రథమ భక్తురాలు అచ్చమ్మవంశము సర్వనాశనమై, వారి వంశం అంతరించిపోతుంది. నారాయణమ్మ వంశస్తులే మఠాధిపతులవుతారు. నువ్వు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు’’ అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టారు.

🌻. సమాధికి ముందు కాలజ్ఞానము 🌻

“నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాలతాయి. ఏడు గ్రామాలకు ఒక గ్రామమవుతుంది. అంటే ప్రాణనష్టం జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి. ధూమకేతువు అనే నక్షత్రం పుడుతుంది. చిన్న చిన్న పాలెగాళ్ళ సామ్రాజ్యాలు అంతమైపోతాయి. ఎర్రబోయీల జీవన విధానాలను వీరు అనుసరిస్తారు.

విరోధి నామ సంవత్సరంలో లింగాలపాటిలో ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి ‘అంకమ్మ’ అనే పేరుతో లోకమంతా సంచరించి, దగ్ధం చేసి తిరిగి నందికొండ వస్తుంది.

పింగళనామ సంవత్సరంలో ధూమకేతు పుట్టి అదృశ్యమవుతుంది.

గొప్ప దేశములు, దేవాలయములు నశిస్తాయి. సిద్దాత్రి నామ సంవత్సరాన అద్దంకి సీమలో భూమి వణుకుతుంది.

రౌద్రినామ సంవత్సరాన ఆషాఢమాసంలో, మహా ధ్వని చేస్తూ నక్షత్రాలు రాలుతాయి. అప్పుడు పర్వత గుహల్లో ఉదక పానీయములు తయారు చేస్తారు. బంగాళ దేశంలో కాళి ప్రత్యక్షమై శక్తి రూపియై రక్తం గటగటా తాగుతుంది. బెజవాడ గోలకొండ అంత పట్నమవుతుంది.

మేఘం, అగ్నిసర్పాకారంగా వచ్చి ధ్వనులు చేస్తాయి. పిడుగులు, శ్రీశైలాన నంది చెరువులో ఆరెదొండచెట్టు పుడుతుంది. భ్రమరాంబ గుడిలో మొసళ్ళు చొరబడటంతో గుడి పాడయి పోయెను. ఈశాన్యంలో పాతాళగంగ కృంగి మల్లిఖార్జునుడు అదృశ్యమైపోతాడు.

పాతాళ గంగలో శాపవశాత్తూ వున్న చంద్రగుప్తునికి కలికి అవతార పురుషుని పాదం సోకి, శాప విముక్తుడవుతాడు. ఆకాశాన విషగాలి పుట్టి, ఆ గాలి వల్ల, రోగాల వల్ల జనులు నశిస్తారు.

తిరుపతి వేంకటేశ్వరుని గుళ్ళో మొసళ్ళు ప్రవేశించి, మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి వుంచుతారు. గరుడధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి. తిరువళ్ళువరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి.

ఆకాశాన మూడు నక్షత్రములు ఉదయించి, కన్పించకుండానే అదృశ్యమవుతాయి. ఆనంద నామ సంవత్సరంలో శ్రీశైల మల్లిఖార్జునుడు ఉత్తరాన వింధ్య పర్వతాలకు పోయి, నిజ రూపం చూపుతాడు. అప్పుడు ఆ రాజ్యం తల్లడిల్లిపోతోంది. దేశాన కొత్త కొత్త జాతులు పుట్టుకొస్తాయి. అన్ని కులాలవారు మద్యపాన ప్రియులవుతారు.

రాజులకు రాజ్యాలు ఉండవు. వ్యవసాయ వృత్తినే అవలంభిస్తారు. అన్ని జాతుల వారు వింత వింత వస్త్రాలు ధరిస్తారు. బ్రాహ్మణులకు పీటలు, యితరులకు మంచాలు వస్తాయి. బ్రాహ్మణులు విదేశీ విద్యలు, విజ్ఞానానికి భూములను అమ్ముకుంటారు. ప్రభుత్వ బంట్లుగా ఉద్యోగాలు చేస్తూ బతుకుతారు. వానిలో కూడా బ్రాహ్మణులకు ఆధిక్యత లేకపోగా అన్య కులాల వారే ఆధిక్యత పొంది వారి కింద పని చేస్తారు. 

జీవనోపాధి కోసం ఏ వృత్తినయినా చేసే స్థితికి వస్తారు. పౌరోహిత్యం కూడా కొనసాగక బ్రాహ్మణులు బాధలు పడతారు. విదేశీ విజ్ఞానం విద్యలు నేర్చుకుంటారు. ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఉన్నత స్థితికి చేరుకుంటారు’’

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం

30.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 47  🌹 

📚. ప్రసాద్ భరద్వాజ
చివరి భాగము

🌻. సమాధికి ముందు కాలజ్ఞానము - 2 🌻

ఫాల్గుణ మాసంలో నేను వీరభోగ వసంతరాయులనై శ్రీశైలం వెళ్ళి అక్కడి ధనాన్ని బీదలకు పంచిపెడతాను. తరువాత ఉగ్రమైన తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నుండి మూడు వరాలు పొందుతాను. 

విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి రోజున బెజవాడ ఇంద్రకీలాద్రికి వస్తాను. అక్కడ ఋషులను దర్శించి, తరువాత కార్తవీర్యార్జున దత్తాత్రేయులవారి వద్ద పలు విద్యలు అభ్యసించి, ఆది దత్తాత్రేయులవారిని దర్శించి, అక్కడి నుండి మహానందికి వెళ్ళి రెండు నెలలు గడుపుతాను. అనంతరం శ్రావణ నక్షత్ర యుక్త కుంభ లగ్నాన వీరనారాయణపురం చేరతాను. అక్కడ 15 దినములు గడుపుతాను.

కలియుగాన 3040 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి పుణ్యతీర్థాలు క్రమ క్రమంగా తమ పవిత్రతను కోల్పోవటం జరుగుతుంది. గంగానది పూర్తిగా అంతర్థానమయిపోతుంది.

ప్రపంచాన ధనమే అన్నింటికీ మూలమౌతుంది. పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది. నూట యిరవై తిరుపతులు నీటిపాలయిపోతాయి. నాలుగు సముద్రాల మధ్య నున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది. సముద్రాలు కలుషితమయిపోతాయి. జల చరములు – ఎక్కడివక్కడే నశించిపోతాయి. 

బంగారు గనుల కోసం కొండల్లో బతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు. కాశీనగరంలో కొట్లాటలు జరుగుతాయి. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువ అయిపోతాయి. కలహాలు, కల్లోలాలు మితిమీరిపోయాయి. కుటుంబంలో సామరస్యత వుండదు. వావీ వరసలు వల్లకాట్లో కలుస్తాయి.

సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. రెంటాల చెరువు క్రింద ఆపదలు పుడతాయి. వినాయకుడు వలవల ఏడుస్తాడు. గోలుకొండ క్రింద బాలలు పట్నాలు ఏలుతారు. శృంగేరి, పుష్పగిరి పీఠాలు పంచాననం వారి వశమవుతాయి. హరిద్వార్ లో మర్రిచెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వారానికి వెళ్ళే దారి మూసుకుపోతుంది. అహోబిలంలోని ఉక్కుస్థంభం కొమ్మలు రెమ్మలతో, జాజిపూలు పూస్తుంది. నా రాకకు ముందుగా స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు. కులాధిక్యత నశించి వృత్తిలో ఎక్కువ తక్కువలు అంటూ లేక అందరూ సమానమయిపోతారు’’

🌻. సమాధి తర్వాత తిరిగి దర్శనం 🌻

నవమి నాటి రాత్రికి సిద్దయ్యను బనగానపల్లెకు పంపి పువ్వులు తెప్పించమని గోవిందమాంబకి ఆదేశించారు స్వామి. వెంటనే సిద్దయ్య బనగానపల్లెకు ప్రయాణం అయ్యాడు.

సిద్దయ్య తిరిగి వచ్చేసరికి స్వామి సమాధిలో ప్రవేశించటం పూర్తయిపోయింది. అది తెలుసుకున్న సిద్దయ్య తీవ్రంగా దుఃఖించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. సమాధి నుంచి అది తెలుసుకున్న బ్రహ్మంగారు సిద్దయ్యను పిలిచి, సమాధిపై వున్న బండను తొలగించమని తిరిగి పైకి వచ్చారు.

అప్పుడు సిద్దయ్య కోరిక ప్రకారం ‘పరిపూర్ణ స్థితిని’ బోధించారు.

బ్రహ్మంగారు వైదిక ధర్మమును అవలంభించారు. అయితే, ఎప్పుడూ కుల మతాతీతులుగా ప్రవర్తించారు తప్ప ఏనాడూ సంకుచిత కులాభిమానమును గానీ, మాట ద్వేషమును గానీ ప్రదర్శించలేదు. దూదేకుల కులస్థుడైన సైదులును తన శిష్యునిగా స్వీకరించి, అనేక విషయాలను, శాస్త్ర రహస్యాలను అతనికి వివరించారు.

సమాధి అయిన తరువాత కూడా అతనికే దర్శనమిచ్చి దండ కమండల పాదుకలు, ముద్రికను కూడా ప్రసాదించారు. తమ కొడుకులకు కూడా యివ్వని ప్రాముఖ్యత దూదేకుల సైదులుకు ఇచ్చారు. అతనిని సిద్దునిగా మార్చి, ‘సిద్దా’ అనే మకుటంతో పద్యాలు చెప్పారు. అలాగే కడప, బనగానపల్లె, హైదరాబాదు, కర్నూలు నవాబులకు జ్ఞానబోధ చేసి శిష్యులుగా స్వీకరించారు.

🌻. కందిమల్లాయపాలెం – చింతచెట్టు 🌻

కందిమల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి యింటి ఆవరణలో, 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో దాచారు. పైన ఒక చింతచెట్టు నాటినట్లు తెలుస్తోంది. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి వుంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, మరేవైనా ప్రమాదాలు కలిగే ముందు, సూచనగా ఆ చెట్టుకు వున్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి, జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది.

అలాగే ఈ చెట్టుక్కాసిన చింతకాయలు లోపల నల్లగా వుండి, తినడానికి పనికి రాకుండా వుంటాయి. చెట్ల పంగ నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి, గడ్డ కట్టి కుంకుమలా వుంటుందట. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు, ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెలో వున్న వృద్దులందరూ ఆ చెట్టు గూర్చి చెప్పగలుగుతారు.

ఆ చింతచెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే వుంటుంది.

ఓం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామియే నమః 🙏

🌻. సమాప్తం... 🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం

31.Aug.2020

------------------------------------ x ------------------------------------

------------------------------------ x ------------------------------------



No comments:

Post a Comment