ఒక్కో సంవత్సరాన్ని ఒక్కొక్క పేరుతో ఎందుకు పిలుస్తాము? Why do we call each year by a different name?



🌹. ఒక్కో సంవత్సరాన్ని ఒక్కొక్క పేరుతో ఎందుకు పిలుస్తాము? 🌹

ఈ పేర్ల వెనుక ఓ పురాణ గాథ ఉంది. అదేంటంటే విష్ణుమాయ కారణంగా నారదుడికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓ యుద్ధంలో వారంతా చనిపోతారు. నారద మహర్షి విష్ణుని ప్రార్థించగా ఆయన కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలు కాలచక్రంలో తిరుగుతుంటారు, ఆ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయంటూ వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి.

🍀. అరవై వసంతాలు.. వాటి అర్థాలు 🍀


1.ప్రభవ : యజ్ఞములు ఎక్కువగా జరుగుతాయని అర్థం.

2. విభవ : ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు.

3. శుక్ల : సమృద్ధిగా పంటలు పండుతాయనే సంకేతమిస్తుంది.

4. ప్రమోదూత : అందరికీ ఆనందం పంచుతుందని అర్థం.

5. ప్రజాపతి : అన్నింటా అభివృద్ధి చెందడాన్ని సూచిస్తుంది.

6. ఆంగీరస : భోగభాగ్యములు కలగాలనే అర్థాన్నిస్తుంది.

7. శ్రీముఖ : వనరులన్నీ సమృద్ధిగా అందుతాయని అర్థం.

8. భావ : సద్భావనలు, ఉన్నత భావాలు కలిగి ఉండాలని తెలుపుతుంది.

9. యువ : సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో ప్రజలు సుఖంగా ఉండాలి.

10.ధాత : అనారోగ్య బాధలు తొలుగుతాయని, ఔషధాలు ఫలిస్తాయని చెబుతుంది.

11.ఈశ్వర : అందరూ క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అర్థం.

12. బహుధాన్య : దేశమంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది.

13. ప్రమాది : వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి.

14. విక్రమ : సమృద్ధిగా పంటలు పండిస్తూ, అన్నింటా విజయం సాధిస్తారని అర్థం.

15.వృష : వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలుపుతుంది.

16. చిత్రభాను : అంచనాలకు అందని ఫలితాలు పొందుతారు.

17. స్వభాను : ప్రజలకు క్షేమం, ఆనందం, ఆరోగ్యం అందుతాయని అర్థం.

18. తారణ : సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి.

19. పార్ధివ : సంపద సిద్ధిస్తుంది.

20.వ్యయ : అతివృష్టి, అధిక ఖర్చులని సూచిస్తుంది.

21. సర్వజిత్తు : ప్రజలకు అనుకూలించే వర్షాలు కురుయును.

22. సర్వధారి : అందరూ సుభిక్షంగా ఉండాలని అర్థం.

23. విరోధి : వర్షాలు తక్కువగా కురుస్తాయి.

24. వికృతి : అశుభ, ప్రతికూల ఫలితాలు సూచిస్తుంది.

25. ఖర : సామాన్య పరిస్థితులు ఉంటాయి

26. నందన : ప్రజలు ఆనందంతో ఉంటారు.

27. విజయ : శత్రువుపై విజయం సాధిస్తారు.

28. జయ : కార్యసిద్ధి, రుగ్మతలను జయిస్తారు.

29. మన్మధ : భోగభాగ్యాలు సిద్ధించి, ఆరోగ్యంగా ఉంటారు. బాధలు తొలిగిపోతాయి.

30. దుర్ముఖి : ఇబ్బందులున్నా క్షేమకర ఫలితాలు పొందుతారు.

31. హేవిళంబి : ప్రజలంతా సంతోషంగా ఉంటారు.

32. విళంబి : అంతా సుభిక్షంగా ఉంటారిని అర్థం.

33.వికారి : శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.

34. శార్వరి : పంటల దిగుబడి సాధారణంగా ఉంటుంది.

35. ప్లవ : నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి.

36. శుభకృత : ప్రజలు సుఖంగా జీవిస్తారు.

37. శోభకృత : సుఖసంతోషాలు వెల్లువిరుస్తాయి.

38. క్రోధి : కోప స్వభావంతో సామాన్య ఫలితాలు పొందుతారు.

39. విశ్వావసు : ధనం సమృద్ధిగా లభిస్తుంది.

40. పరాభవ : ఓటములు ఎదురవుతాయి.

41. ప్లవంగ : నీరు సమృద్ధిగా లభించును.

42. కీలక : పంటలు విశేషంగా పండుతాయి.

43. సౌమ్య : అందరికీ శుభాలు కలుగుతాయి.

44. సాధారణ : సామాన్య ఫలితాలు కలుగుతాయి

45.విరోధికృత : ప్రజల్లో వైరుధ్య భావాలు ఏర్పడతాయి.

46. పరీధావి : భయాలు కలుగుతాయి.

47. ప్రమాదీచ : ప్రమాదాలు ఎక్కువగా సంభవించును.

48. ఆనంద : అంతా ఆనందమయమేనని అర్థం

49. రాక్షస : క ఠినత్వం పెరగుతుంది. దుస్సంఘటనలు సంభవిస్తాయి

50. నల : సస్య సమృద్ధి కలుగుతుంది

51.పింగళ : సామాన్య ఫలితాలు కలుగుతాయి

52.కాళయుక్తి : కాలానికి అనుగుణమైన ఫలితాలు వస్తాయి

53.సిద్ధార్థి : అన్ని కార్యాలు సిద్ధిస్తాయి

54.రౌద్రి : బాధలు కలుగుతాయి

55.దుర్మతి : సామాన్య వర్షాలు కురుస్తాయి

56.దుందుభి : ధాన్య సమృద్ధితో పాటు అంతా క్షేమంగా ఉంటారు.

57.రుధిరోద్గారి : ప్రమాదాలు అధికం

58. రక్తాక్షి : అశుభాలకు సంకేతం, సామాన్య ఫలితాలు వస్తాయి

59.క్రోధన : అన్నింటా విజయం సిద్ధిస్తుంది.

60.అక్షయ : అధిక సంపదలను సూచిస్తుంది.

🌹 🌹 🌹 🌹 🌹


02 Apr 2022

UGADI, Hindu ShubhaKruth New Year Wishes


🌹 UGADI, Hindu ShubhaKruth New Year Wishes 🌹

May this new year bring great joy, happiness, and enthusiasm to you. Happy Hindu New Year to you and your family.

Every year, the month of Chaitra marks the beginning of the New Year (which falls in March or April in the Georgian calendar). The first day of the Hindu New Year, known as Nav Samvatsar, is celebrated on the Pratipada Tithi of the Shukla Paksha of the Chaitra lunar month.


सूर्य संवेदना पुष्पे, दीप्ति कारुण्यगंधने।
लब्ध्वा शुभं नववर्षेऽस्मिन कुर्यात्सर्वस्य मंगलम्॥

जिस तरह सूर्य प्रकाश देता है, संवेदना करुणा को जन्म देती है, पुष्प सदैव महकता रहता है, उसी तरह आने वाला हमारा यह नूतन वर्ष आपके लिए हर दिन, हर पल के लिए मंगलमय हो ।


As the sun gives light, the sensation gives birth to compassion, and the flowers always spread their fragrance. The same way, may our new year be a pleasant one for us every day, every moment.


Prasad Bharadwaj

02 Apr 2022

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀


🌻 360-2. 'తనుమధ్యా' 🌻


సమస్త వస్తువుల నడుమ, లోకముల నడుమ, దేవునికి జీవునికి నడుమ తానున్ననూ వున్నట్లు తెలియబడదు. సన్నని నడుము అనగా ఇదియే. జీవునికి దేవునికి నడుమ నుండుటచే ఆమెను దాటుట దుర్లభము. ఆమె అనుగ్రహముగనే జీవుడు దేవుని చేరగలడు. శ్రీమాత మధ్యవర్తి. ఇరుజీవుల మధ్య కూడ ఆమెయే మధ్యవర్తి. ప్రేమతో కలియుటకుగాని, ద్వేషముతో విడిపోవుటకు గాని కారణము ఆమెయే.

జీవుల యందు స్వభావమై నిలచి రాగద్వేషములను జీవుల సంస్కారమును బట్టి పెంపొందించు చుండును. స్వభావములను సంస్కరించును కూడ. సమస్తము నందూ తనను గుర్తించి ఆరాధించు వారికి పరస్పరత్వమును అనుగ్రహించును. జీవులను కలుపుటయే గాక దైవముతో కూడ జీవులను కలుపును. అన్ని విషయములయందు ఈమెయే మధ్యస్థ అని తెలియవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 360-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻

🌻 360. Tanumadhyā तनुमध्या 🌻


She has slender waist. Please refer nāma 85 also. There is a meter by name tanumadhya. Meter or chandas refers to the number of alphabets or words in a verse as per Sanskrit literature.

She is said to be in the form of this meter. Kṛṣṇa says, (Bhagavad Gīta X.35)” Gāyatrī candasāmahaṁ (गायत्री चन्दसामहं)” that He is in the form Gāyatrī meter.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Apr 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 162. శరణాగతి / Osho Daily Meditations - 162. SURRENDER

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 162 / Osho Daily Meditations - 162 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 162. శరణాగతి 🍀


🕉. మీ లోతైన స్థితిలో ఎక్కడైతే మీ చింతలన్నీ కరిగిపోయి, పూర్తిగా విశ్రాంతిగా ఉండవచ్చో అక్కడ మీరు పూర్తిగా శరణాగతి చెందాలను కుంటారు. కానీ మీరు, అందరూ బాహ్యంలో లొంగుబాటు చెందడానికి భయపడతారు. 🕉

సాధారణంగా మనం ఎవరో అనుకుంటాం - కానీ మనం ఏమీ కాదు! మీరు లొంగిపోవడానికి ఏమి ఉంది?--కేవలం బూటకపు అహం, మీరు ఎవరో అనే ఆలోచన మాత్రమే ఉంది. ఇది కేవలం కల్పితం. మీరు కల్పనను అప్పగించినప్పుడు, మీరు నిజమైన వారు అవుతారు. మీరు నిజంగా మీ వద్ద లేనిదాన్ని అప్పగించినప్పుడు, మీరు ఉన్నవారు అవుతారు. కానీ మేము అంటిపెట్టుకుని ఉంటాము అని అంటాము. ఎందుకంటే మన జీవితమంతా మనం స్వతంత్రంగా ఉండటానికి శిక్షణ పొందాము. మన జీవితమంతా జీవించడానికి పోరాటం తప్ప మరేమీ కాదన్నట్లుగా, పోరాడటానికి శిక్షణ పొందాము. కార్యాచరణ అలా చేయబడింది. శరణాగతి ప్రారంభించినప్పుడే నిజమైన జీవితం తెలుస్తుంది.

అప్పుడు మీరు పోరాటం మానేసి ఆనందించడం ప్రారంభిస్తారు. కానీ పశ్చిమంలో, అహం యొక్క భావన చాలా బలంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిని జయించటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ప్రకృతిని జయించడం గురించి కూడా మాట్లాడతారు; పూర్తిగా మూర్ఖత్వం! మనం ప్రకృతిలో భాగం. దానిని ఎలా జయించగలము? మనం దానిని నాశనం చేయగలము, జయించలేము. అలానే ఈ ప్రకృతి మొత్తం నాశనం చేయబడింది; మొత్తం జీవావరణ శాస్త్రం చెదిరి పోయింది. జయించడానికి ఏమీ లేదు. నిజానికి మనం ప్రకృతిని దానిలాగానే ఉండనిస్తూ, ప్రకృతిలో ఒకడిగా కలిసి ముందుకు కదలాలి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 162 🌹

📚. Prasad Bharadwaj

🍀 162. SURRENDER 🍀


🕉 Deep down you would like to move in a total surrender where all your worries are dissolved and you can simply rest. But you are afraid; everybody is afraid of surrendering. 🕉

Ordinarily we think we are somebody--and we are nothing! What have you got to surrender?--just a bogus ego, just an idea that you are somebody. It is just a fiction. When you surrender the fiction, you become the real. When you surrender that which you don't really have, you become that which you are. But we cling, because for our whole lives we have been trained to be independent. For our whole lives we have been trained, programmed to fight, as if the whole of life is nothing but a struggle to survive. Life is known only when you start surrendering.

Then you stop fighting and start enjoying. But in the west, the concept of the ego is very strong, and everybody is trying to conquer something. People even talk of conquering nature; absolutely foolish! We are part of nature how can we conquer it? We can destroy it, we cannot conquer it. That’s the whole of nature is destroyed by and by; the whole ecology is disturbed. There is nothing to conquer. In fact, one has to move with nature, in nature, and-to allow nature to be.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 173


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 173 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భక్తి యోగము - 2 🌻


ఒక్కొక్కడు తన పరిసర రూపములను ఇతరులుగా గమనించును గనుక ఇతరులను గూర్చిన మంచిచెడ్డలను నిర్ణయించుచు కాలము వ్యర్థము చేసికొని చెడిపోవును .

అట్లుగాక ఇతరుల రూపమున ఒక్కడే సంచరించు చున్నాడనియు, వాడే భగవంతుడనియు స్మరించు చున్నచో , ఇతరులలోని సద్గుణములు, సత్ప్రవర్తనములు, ఇతరులు ఆచరించు సత్కార్యములు, భగవంతునివిగా తెలిసి, అతని గుణకీర్తనము చేయుట సాధ్యపడును. ఇదియే భక్తి యోగము .


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹



02 Apr 2022

శ్రీ శివ మహా పురాణము - 543 / Sri Siva Maha Purana - 543


🌹 . శ్రీ శివ మహా పురాణము - 543 / Sri Siva Maha Purana - 543 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴

🌻. బ్రహ్మ మోహితుడగుట - 3 🌻


ఆయనయే తమోగుణ ప్రధానుడై కాలాగ్ని రుద్రుడైనాడు. కాని పరమాత్మ గుణాతీతుడు. ఆయన సదా శివుడు, సర్వవ్యాపి, మహేశ్వరుడు (22). ఓ విశ్వమూర్తీ! మహేశ్వరా! అవ్యక్తము నుండి పుట్టిన భూతాదియగు మహత్తత్త్వము, భూత తన్మాత్రలు, మరియు ఇంద్రియములు నీ చేతనే అధిష్టితములై ఉన్నవి (23).

మహదేవా! పరమేశ్వరా! కరుణానిధీ! శంకరా! దేవదేవా!ఈశ్వరా! పురుషోత్తమా! ప్రసన్నుడవు కమ్ము (24). సప్త సముద్రములు నీ వస్త్రములు. దిక్కులు నీ మహాబుజములు. ద్యులోకము నీ శిరస్సు. ఆకాశము నాభి. వాయువు నాసిక (25).

అగ్ని, సూర్యుడు, చంద్రుడు నీ కన్నులు. ఓ ప్రభూ! మేగములు నీ కేశములు. నక్షత్రములు, గ్రహములు మొదలగునవి నీ అలంకారములు (26). ఓ దేవదేవా! విభూ! పరమేశ్వరా! నేను నిన్ను ఎట్లు స్తోత్రము చేయగలను? నీవు వాక్కులకు అందవు. ఓ శంకరా! నీవు మనస్సునకైననూ గోచరము కావు (27).

ఐదు మోములు గలవాడు ఏభై కోట్ల రూపములు గలవాడు, భూర్భువస్సువర్లోకములకు ప్రభువు, సర్వోత్తముడు, జ్ఞాన స్వరూపుడు అగు రుద్రునకు నమస్కారము (28). ఇదమిత్థముగా నిర్దేశింప శక్యము కానివాడు, నిత్యుడు, విద్యుత్తువలో ప్రకాశించు రూపముగలవాడు అగు శంకర దేవునకు అనేక అబివాదములు (29). కోటి విద్యుత్తుల కాంతి గలవాడు, సుందరమగు ఎనిమిది రూపములను దరించి లోకమంతయూ వ్యాపించి యున్నవాడు అగు శంకరునకు అనేక నమస్కారములు (30).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 543 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴

🌻 The delusion of Brahmā - 3 🌻


22. Your Rājasika manifestation is Brahmā, the grandfather. O lord, thanks to your grace, Viṣṇu is Puruṣottama by your Sāttvika nature.

24. O great lord of universal form, the manifest, the great principle, the elements, the Tanmātras, and the sense-organs are presided over by you.

25. O supreme lord, O merciful Śiva, O lord of gods, be pleased, O best of Beings, be pleased.

26. The seven oceans[3] are your clothes. The quarters are your long arms. The firmament is your head, O allpervasive. The sky is your navel. The wind is your nose.

27. O lord, the fire, the sun and the moon are your eyes. The clouds are your hair. The planets and the stars are your ornaments.

28. O lord of gods, how shall I eulogise you? O supreme lord, you are beyond description. O Śiva, you are incomprehensible to the mind.

29. Obeisance to Thee, the five-faced Rudra. Obeisance to thee, with fifty crores of forms. Obeisance to thee, the lord of three deities. Obeisance to the most excellent one. Obeisance to the principle of learning.

30. Obeisance, Obeisance to the inexpressible, the eternal, the lightning-flamed, the flame-coloured. Obeisance to lord Śiva.

31. Obeisance, obeisance to thee stationed m the world with the form resembling a crore of lightning streaks, consisting of eight corners and very lustrous.


Continues....

🌹🌹🌹🌹🌹


02 Apr 2022

గీతోపనిషత్తు -345


🌹. గీతోపనిషత్తు -345 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 31 📚


🍀 31-2. అనన్య భక్తి - అనన్యభక్తి కారణముగ ఎప్పుడునూ భగవంతునితో కూడియుండుట సంభవించును. తాను భగవంతుని యందు పూర్ణముగ చేరి యుండుట చేత భగవంతు డతని యందు పూర్ణముగ వసించి, ఇచ్ఛా జ్ఞాన క్రియలను నడుపుచు నుండును. భగవత్సంకల్పమే తన సంకల్పముగను, భగవద్ జ్ఞానమే తన జ్ఞానముగను, భగవత్ శక్తియే తన క్రియాశక్తిగను వ్యక్తమగు చుండును. ఎందరో అనన్యభక్తి మార్గమున దైవమును చేరిరి. 🍀

31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వ చ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి |

తాత్పర్యము : దురాచారుడు సాధువగుట, ధర్మాత్ము డగుట, శాశ్వతమగు శాంతిని పొందుట- అనన్య భక్తిచే శీఘ్రముగ జరుగును. గుర్తుంచుకొనుము. నా భక్తుడు ఎన్నడునూ చెడడు.

వివరణము : అనన్యభక్తి క్రమముగ ప్రేమగ మారును. కబీర్దాసు, సూరదాసు వంటి మహాభక్తులు అనన్యభక్తి కారణముగనే అనేకానే కము లగు అద్భుతమగు కార్యములను నిర్వర్తించి చూపినారు. పుట్టు గ్రుడ్డియగు సూరదాసు కన్నులున్న వానివలెనే ప్రపంచమున తిరుగాడినాడు. అనన్యభక్తి కారణముగ ఎప్పుడునూ భగవంతునితో కూడియుండుట సంభవించును. తాను భగవంతుని యందు పూర్ణముగ చేరి యుండుట చేత భగవంతు డతని యందు పూర్ణముగ వసించి, ఇచ్ఛా జ్ఞాన క్రియలను నడుపుచు నుండును. భగవత్సంకల్పమే తన సంకల్పముగను, భగవద్ జ్ఞానమే తన జ్ఞానముగను, భగవత్ శక్తియే తన క్రియాశక్తిగను వ్యక్తమగు చుండును.

తాను దైవము నందుండగ, తన నుండి దైవము చూపుచున్న లీలలకు పరవశుడై, తన్మయము చెందుచు విశ్వమును మరచి విశ్వజుని యందు వర్తించును. ఎందరో అనన్యభక్తి మార్గమున దైవమును చేరిరి. పరమ పదమున శాశ్వత స్థానము గొనిరి. వారికి మోక్షమును గూర్చిన చింతయే యుండదు. వారున్న స్థితియే మోక్షము. వారికి ప్రత్యేకించి సుఖశాంతులను గూర్చిన ప్రయత్నము లుండవు. వారెచ్చట యున్న అచ్చటే శాంతి యుండును. వారి రూపముననే సత్యము, సుఖము ఉండును. అన్ని విషయము లందాసక్తి గలవారు, వాని కొరకై ప్రయత్నించు వారు సుఖశాంతులకు దూరమైపోవుచు నుందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


02 Apr 2022

ఉగాది విశిష్టత - చరిత్ర Significance Of Ugadi



🌹. ఉగాది విశిష్టత - చరిత్ర🌹

🍀. 'శుభకృత్‌' ఉగాది శుభాకాంక్షలు - ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండాలని కోరుకుంటూ 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ


ఉగాదిలో 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఆ శబ్దానికి ప్రతిరూపం ఉగాదిగా రూపొందింది.

ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు. ప్లవ నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృత్‌' నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

🍀. ఉగాది విశిష్టత - చరిత్ర 🍀

చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.


🍀. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత.. 🍀

ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.


🌻. బెల్లం - తీపి - ఆనందానికి ప్రతీక

🌻. ఉప్పు - జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం

🌻. వేప పువ్వు - చేదు- బాధకలిగించే అనుభవాలు

🌻. చింతపండు - పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు

🌻. పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు

🌻. కారం - సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు

🌹 🌹 🌹 🌹 🌹


02 Apr 2022

02 - APRIL - 2022 ఉగాది, శనివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 02, శనివారం, ఏప్రిల్ 2022 స్ధిర వాసరే 🌹
*🍀. 'శుభకృత్‌' ఉగాది శుభాకాంక్షలు 🍀
🌹. ఉగాది విశిష్టత - చరిత్ర 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 31-2 - 345 - అనన్య భక్తి🌹 
3) 🌹. శివ మహా పురాణము - 543 / Siva Maha Purana - 543 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -173🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 162 / Osho Daily Meditations - 162 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-2 🌹
🌹 UGADI, 2022, ShubhaKruth Hindu New Year Wishes 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. 'శుభకృత్‌' ఉగాది శుభాకాంక్షలు మరియు శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*శ్రీరామ నవరాత్రులు ప్రారంభం*
*స్థిర వాసరే, 02, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఉగాది, శ్రీరామ చైత్ర నవరాత్రులు, గుడిపౌడ్వ, SriRama Chaitra Navratri, Gudi Padwa, Ugadi. 🌻*

*🍀. ఉగాది ప్రసాద ప్రాశన శ్లోకం – శ్రీ రామ స్తోత్రం 🍀*

*శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ |*
*సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం |*

*శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి*
*శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి ।*
*శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి*
*శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆత్మబోధ, తత్వబోధ రోజు చేసుకుంటే మనం చేసే పనులు ఆగామి, సంచిత కర్మలుగా మారవు.- మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*
🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శఖ : 1944, శుభకృత్‌ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శుక్ల పాడ్యమి 11:59:53 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: రేవతి 11:22:44 వరకు
తదుపరి అశ్విని
యోగం: ఇంద్ర 08:29:06 వరకు
తదుపరి వైధృతి
కరణం: బవ 12:01:54 వరకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: 07:48:42 - 08:38:00
రాహు కాలం: 09:14:58 - 10:47:23
గుళిక కాలం: 06:10:08 - 07:42:33
యమ గండం: 13:52:13 - 15:24:38
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:43
అమృత కాలం: -
సూర్యోదయం: 06:10:08
సూర్యాస్తమయం: 18:29:28
చంద్రోదయం: 06:51:56
చంద్రాస్తమయం: 19:32:24
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మీనం
ధాత్రి యోగం - కార్య జయం 11:22:44
వరకు తదుపరి సౌమ్య యోగం 
- సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఉగాది విశిష్టత - చరిత్ర🌹*
 *🍀. 'శుభకృత్‌' ఉగాది శుభాకాంక్షలు - ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండాలని కోరుకుంటూ 🍀*
📚. ప్రసాద్‌ భరధ్వాజ

*ఉగాదిలో 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఆ శబ్దానికి ప్రతిరూపం ఉగాదిగా రూపొందింది.*

*ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు. ప్లవ నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృత్‌' నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.*

*🍀. ఉగాది విశిష్టత - చరిత్ర 🍀*

*చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.*

*శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.*

*🍀. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత.. 🍀*

*ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.*

*🌻. బెల్లం - తీపి - ఆనందానికి ప్రతీక*
*🌻. ఉప్పు - జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం*
*🌻. వేప పువ్వు - చేదు- బాధకలిగించే అనుభవాలు*
🌻. చింతపండు - పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన *పరిస్థితులు*
*🌻. పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు*
*🌻. కారం - సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -345 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 31 📚*
 
*🍀 31-2. అనన్య భక్తి - అనన్యభక్తి కారణముగ ఎప్పుడునూ భగవంతునితో కూడియుండుట సంభవించును. తాను భగవంతుని యందు పూర్ణముగ చేరి యుండుట చేత భగవంతు డతని యందు పూర్ణముగ వసించి, ఇచ్ఛా జ్ఞాన క్రియలను నడుపుచు నుండును. భగవత్సంకల్పమే తన సంకల్పముగను, భగవద్ జ్ఞానమే తన జ్ఞానముగను, భగవత్ శక్తియే తన క్రియాశక్తిగను వ్యక్తమగు చుండును. ఎందరో అనన్యభక్తి మార్గమున దైవమును చేరిరి. 🍀*

*31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వ చ్ఛాంతిం నిగచ్ఛతి |*
*కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి |*

*తాత్పర్యము : దురాచారుడు సాధువగుట, ధర్మాత్ము డగుట, శాశ్వతమగు శాంతిని పొందుట- అనన్య భక్తిచే శీఘ్రముగ జరుగును. గుర్తుంచుకొనుము. నా భక్తుడు ఎన్నడునూ చెడడు.*

*వివరణము : అనన్యభక్తి క్రమముగ ప్రేమగ మారును. కబీర్దాసు, సూరదాసు వంటి మహాభక్తులు అనన్యభక్తి కారణముగనే అనేకానే కము లగు అద్భుతమగు కార్యములను నిర్వర్తించి చూపినారు. పుట్టు గ్రుడ్డియగు సూరదాసు కన్నులున్న వానివలెనే ప్రపంచమున తిరుగాడినాడు. అనన్యభక్తి కారణముగ ఎప్పుడునూ భగవంతునితో కూడియుండుట సంభవించును. తాను భగవంతుని యందు పూర్ణముగ చేరి యుండుట చేత భగవంతు డతని యందు పూర్ణముగ వసించి, ఇచ్ఛా జ్ఞాన క్రియలను నడుపుచు నుండును. భగవత్సంకల్పమే తన సంకల్పముగను, భగవద్ జ్ఞానమే తన జ్ఞానముగను, భగవత్ శక్తియే తన క్రియాశక్తిగను వ్యక్తమగు చుండును.*

*తాను దైవము నందుండగ, తన నుండి దైవము చూపుచున్న లీలలకు పరవశుడై, తన్మయము చెందుచు విశ్వమును మరచి విశ్వజుని యందు వర్తించును. ఎందరో అనన్యభక్తి మార్గమున దైవమును చేరిరి. పరమ పదమున శాశ్వత స్థానము గొనిరి. వారికి మోక్షమును గూర్చిన చింతయే యుండదు. వారున్న స్థితియే మోక్షము. వారికి ప్రత్యేకించి సుఖశాంతులను గూర్చిన ప్రయత్నము లుండవు. వారెచ్చట యున్న అచ్చటే శాంతి యుండును. వారి రూపముననే సత్యము, సుఖము ఉండును. అన్ని విషయము లందాసక్తి గలవారు, వాని కొరకై ప్రయత్నించు వారు సుఖశాంతులకు దూరమైపోవుచు నుందురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 543 / Sri Siva Maha Purana - 543 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴*

*🌻. బ్రహ్మ మోహితుడగుట - 3 🌻*

ఆయనయే తమోగుణ ప్రధానుడై కాలాగ్ని రుద్రుడైనాడు. కాని పరమాత్మ గుణాతీతుడు. ఆయన సదా శివుడు, సర్వవ్యాపి, మహేశ్వరుడు (22). ఓ విశ్వమూర్తీ! మహేశ్వరా! అవ్యక్తము నుండి పుట్టిన భూతాదియగు మహత్తత్త్వము, భూత తన్మాత్రలు, మరియు ఇంద్రియములు నీ చేతనే అధిష్టితములై ఉన్నవి (23). 

మహదేవా! పరమేశ్వరా! కరుణానిధీ! శంకరా! దేవదేవా!ఈశ్వరా! పురుషోత్తమా! ప్రసన్నుడవు కమ్ము (24). సప్త సముద్రములు నీ వస్త్రములు. దిక్కులు నీ మహాబుజములు. ద్యులోకము నీ శిరస్సు. ఆకాశము నాభి. వాయువు నాసిక (25).

అగ్ని, సూర్యుడు, చంద్రుడు నీ కన్నులు. ఓ ప్రభూ! మేగములు నీ కేశములు. నక్షత్రములు, గ్రహములు మొదలగునవి నీ అలంకారములు (26). ఓ దేవదేవా! విభూ! పరమేశ్వరా! నేను నిన్ను ఎట్లు స్తోత్రము చేయగలను? నీవు వాక్కులకు అందవు. ఓ శంకరా! నీవు మనస్సునకైననూ గోచరము కావు (27). 

ఐదు మోములు గలవాడు ఏభై కోట్ల రూపములు గలవాడు, భూర్భువస్సువర్లోకములకు ప్రభువు, సర్వోత్తముడు, జ్ఞాన స్వరూపుడు అగు రుద్రునకు నమస్కారము (28). ఇదమిత్థముగా నిర్దేశింప శక్యము కానివాడు, నిత్యుడు, విద్యుత్తువలో ప్రకాశించు రూపముగలవాడు అగు శంకర దేవునకు అనేక అబివాదములు (29). కోటి విద్యుత్తుల కాంతి గలవాడు, సుందరమగు ఎనిమిది రూపములను దరించి లోకమంతయూ వ్యాపించి యున్నవాడు అగు శంకరునకు అనేక నమస్కారములు (30).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 543 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴*

*🌻 The delusion of Brahmā - 3 🌻*

22. Your Rājasika manifestation is Brahmā, the grandfather. O lord, thanks to your grace, Viṣṇu is Puruṣottama by your Sāttvika nature.

24. O great lord of universal form, the manifest, the great principle, the elements, the Tanmātras, and the sense-organs are presided over by you.

25. O supreme lord, O merciful Śiva, O lord of gods, be pleased, O best of Beings, be pleased.

26. The seven oceans[3] are your clothes. The quarters are your long arms. The firmament is your head, O allpervasive. The sky is your navel. The wind is your nose.

27. O lord, the fire, the sun and the moon are your eyes. The clouds are your hair. The planets and the stars are your ornaments.

28. O lord of gods, how shall I eulogise you? O supreme lord, you are beyond description. O Śiva, you are incomprehensible to the mind.

29. Obeisance to Thee, the five-faced Rudra. Obeisance to thee, with fifty crores of forms. Obeisance to thee, the lord of three deities. Obeisance to the most excellent one. Obeisance to the principle of learning.

30. Obeisance, Obeisance to the inexpressible, the eternal, the lightning-flamed, the flame-coloured. Obeisance to lord Śiva.

31. Obeisance, obeisance to thee stationed m the world with the form resembling a crore of lightning streaks, consisting of eight corners and very lustrous.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 173 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

 *🌻. భక్తి యోగము - 2 🌻* 

ఒక్కొక్కడు తన పరిసర రూపములను ఇతరులుగా గమనించును గనుక ఇతరులను గూర్చిన మంచిచెడ్డలను నిర్ణయించుచు కాలము వ్యర్థము చేసికొని చెడిపోవును .  

అట్లుగాక ఇతరుల రూపమున ఒక్కడే సంచరించు చున్నాడనియు, వాడే భగవంతుడనియు స్మరించు చున్నచో , ఇతరులలోని సద్గుణములు, సత్ప్రవర్తనములు, ఇతరులు ఆచరించు సత్కార్యములు, భగవంతునివిగా తెలిసి, అతని గుణకీర్తనము చేయుట సాధ్యపడును. ఇదియే భక్తి యోగము .

...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 162 / Osho Daily Meditations - 162 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 162. శరణాగతి 🍀*

*🕉. మీ లోతైన స్థితిలో ఎక్కడైతే మీ చింతలన్నీ కరిగిపోయి, పూర్తిగా విశ్రాంతిగా ఉండవచ్చో అక్కడ మీరు పూర్తిగా శరణాగతి చెందాలను కుంటారు. కానీ మీరు, అందరూ బాహ్యంలో లొంగుబాటు చెందడానికి భయపడతారు. 🕉*

*సాధారణంగా మనం ఎవరో అనుకుంటాం - కానీ మనం ఏమీ కాదు! మీరు లొంగిపోవడానికి ఏమి ఉంది?--కేవలం బూటకపు అహం, మీరు ఎవరో అనే ఆలోచన మాత్రమే ఉంది. ఇది కేవలం కల్పితం. మీరు కల్పనను అప్పగించినప్పుడు, మీరు నిజమైన వారు అవుతారు. మీరు నిజంగా మీ వద్ద లేనిదాన్ని అప్పగించినప్పుడు, మీరు ఉన్నవారు అవుతారు. కానీ మేము అంటిపెట్టుకుని ఉంటాము అని అంటాము. ఎందుకంటే మన జీవితమంతా మనం స్వతంత్రంగా ఉండటానికి శిక్షణ పొందాము. మన జీవితమంతా జీవించడానికి పోరాటం తప్ప మరేమీ కాదన్నట్లుగా, పోరాడటానికి శిక్షణ పొందాము. కార్యాచరణ అలా చేయబడింది. శరణాగతి ప్రారంభించినప్పుడే నిజమైన జీవితం తెలుస్తుంది.*

*అప్పుడు మీరు పోరాటం మానేసి ఆనందించడం ప్రారంభిస్తారు. కానీ పశ్చిమంలో, అహం యొక్క భావన చాలా బలంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిని జయించటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ప్రకృతిని జయించడం గురించి కూడా మాట్లాడతారు; పూర్తిగా మూర్ఖత్వం! మనం ప్రకృతిలో భాగం. దానిని ఎలా జయించగలము? మనం దానిని నాశనం చేయగలము, జయించలేము. అలానే ఈ ప్రకృతి మొత్తం నాశనం చేయబడింది; మొత్తం జీవావరణ శాస్త్రం చెదిరి పోయింది. జయించడానికి ఏమీ లేదు. నిజానికి మనం ప్రకృతిని దానిలాగానే ఉండనిస్తూ, ప్రకృతిలో ఒకడిగా కలిసి ముందుకు కదలాలి.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 162 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 162. SURRENDER 🍀*

*🕉 Deep down you would like to move in a total surrender where all your worries are dissolved and you can simply rest. But you are afraid; everybody is afraid of surrendering. 🕉*
 
*Ordinarily we think we are somebody--and we are nothing! What have you got to surrender?--just a bogus ego, just an idea that you are somebody. It is just a fiction. When you surrender the fiction, you become the real. When you surrender that which you don't really have, you become that which you are. But we cling, because for our whole lives we have been trained to be independent. For our whole lives we have been trained, programmed to fight, as if the whole of life is nothing but a struggle to survive. Life is known only when you start surrendering.*

*Then you stop fighting and start enjoying. But in the west, the concept of the ego is very strong, and everybody is trying to conquer something. People even talk of conquering nature; absolutely foolish! We are part of nature how can we conquer it? We can destroy it, we cannot conquer it. That’s the whole of nature is destroyed by and by; the whole ecology is disturbed. There is nothing to conquer. In fact, one has to move with nature, in nature, and-to allow nature to be.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*

*🌻 360-2. 'తనుమధ్యా' 🌻* 

*సమస్త వస్తువుల నడుమ, లోకముల నడుమ, దేవునికి జీవునికి నడుమ తానున్ననూ వున్నట్లు తెలియబడదు. సన్నని నడుము అనగా ఇదియే. జీవునికి దేవునికి నడుమ నుండుటచే ఆమెను దాటుట దుర్లభము. ఆమె అనుగ్రహముగనే జీవుడు దేవుని చేరగలడు. శ్రీమాత మధ్యవర్తి. ఇరుజీవుల మధ్య కూడ ఆమెయే మధ్యవర్తి. ప్రేమతో కలియుటకుగాని, ద్వేషముతో విడిపోవుటకు గాని కారణము ఆమెయే.*

*జీవుల యందు స్వభావమై నిలచి రాగద్వేషములను జీవుల సంస్కారమును బట్టి పెంపొందించు చుండును. స్వభావములను సంస్కరించును కూడ. సమస్తము నందూ తనను గుర్తించి ఆరాధించు వారికి పరస్పరత్వమును అనుగ్రహించును. జీవులను కలుపుటయే గాక దైవముతో కూడ జీవులను కలుపును. అన్ని విషయములయందు ఈమెయే మధ్యస్థ అని తెలియవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 360-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 79. Tapatrayagni santapta samahladana chandrika*
*Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻*

*🌻 360. Tanumadhyā तनुमध्या 🌻*

*She has slender waist. Please refer nāma 85 also. There is a meter by name tanumadhya. Meter or chandas refers to the number of alphabets or words in a verse as per Sanskrit literature.*

*She is said to be in the form of this meter. Kṛṣṇa says, (Bhagavad Gīta X.35)” Gāyatrī candasāmahaṁ (गायत्री चन्दसामहं)” that He is in the form Gāyatrī meter.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 UGADI, Hindu ShubhaKruth New Year Wishes 🌹*

*May this new year bring great joy, happiness, and enthusiasm to you. Happy Hindu New Year to you and your family.*

*Every year, the month of Chaitra marks the beginning of the New Year (which falls in March or April in the Georgian calendar). The first day of the Hindu New Year, known as Nav Samvatsar, is celebrated on the Pratipada Tithi of the Shukla Paksha of the Chaitra lunar month.*

*सूर्य संवेदना पुष्पे, दीप्ति कारुण्यगंधने।*
*लब्ध्वा शुभं नववर्षेऽस्मिन कुर्यात्सर्वस्य मंगलम्॥*

*जिस तरह सूर्य प्रकाश देता है, संवेदना करुणा को जन्म देती है, पुष्प सदैव महकता रहता है, उसी तरह आने वाला हमारा यह नूतन वर्ष आपके लिए हर दिन, हर पल के लिए मंगलमय हो ।*

*As the sun gives light, the sensation gives birth to compassion, and the flowers always spread their fragrance. The same way, may our new year be a pleasant one for us every day, every moment.*
*Prasad Bharadwaj*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹