శ్రీ శివ మహా పురాణము - 543 / Sri Siva Maha Purana - 543
🌹 . శ్రీ శివ మహా పురాణము - 543 / Sri Siva Maha Purana - 543 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴
🌻. బ్రహ్మ మోహితుడగుట - 3 🌻
ఆయనయే తమోగుణ ప్రధానుడై కాలాగ్ని రుద్రుడైనాడు. కాని పరమాత్మ గుణాతీతుడు. ఆయన సదా శివుడు, సర్వవ్యాపి, మహేశ్వరుడు (22). ఓ విశ్వమూర్తీ! మహేశ్వరా! అవ్యక్తము నుండి పుట్టిన భూతాదియగు మహత్తత్త్వము, భూత తన్మాత్రలు, మరియు ఇంద్రియములు నీ చేతనే అధిష్టితములై ఉన్నవి (23).
మహదేవా! పరమేశ్వరా! కరుణానిధీ! శంకరా! దేవదేవా!ఈశ్వరా! పురుషోత్తమా! ప్రసన్నుడవు కమ్ము (24). సప్త సముద్రములు నీ వస్త్రములు. దిక్కులు నీ మహాబుజములు. ద్యులోకము నీ శిరస్సు. ఆకాశము నాభి. వాయువు నాసిక (25).
అగ్ని, సూర్యుడు, చంద్రుడు నీ కన్నులు. ఓ ప్రభూ! మేగములు నీ కేశములు. నక్షత్రములు, గ్రహములు మొదలగునవి నీ అలంకారములు (26). ఓ దేవదేవా! విభూ! పరమేశ్వరా! నేను నిన్ను ఎట్లు స్తోత్రము చేయగలను? నీవు వాక్కులకు అందవు. ఓ శంకరా! నీవు మనస్సునకైననూ గోచరము కావు (27).
ఐదు మోములు గలవాడు ఏభై కోట్ల రూపములు గలవాడు, భూర్భువస్సువర్లోకములకు ప్రభువు, సర్వోత్తముడు, జ్ఞాన స్వరూపుడు అగు రుద్రునకు నమస్కారము (28). ఇదమిత్థముగా నిర్దేశింప శక్యము కానివాడు, నిత్యుడు, విద్యుత్తువలో ప్రకాశించు రూపముగలవాడు అగు శంకర దేవునకు అనేక అబివాదములు (29). కోటి విద్యుత్తుల కాంతి గలవాడు, సుందరమగు ఎనిమిది రూపములను దరించి లోకమంతయూ వ్యాపించి యున్నవాడు అగు శంకరునకు అనేక నమస్కారములు (30).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 543 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴
🌻 The delusion of Brahmā - 3 🌻
22. Your Rājasika manifestation is Brahmā, the grandfather. O lord, thanks to your grace, Viṣṇu is Puruṣottama by your Sāttvika nature.
24. O great lord of universal form, the manifest, the great principle, the elements, the Tanmātras, and the sense-organs are presided over by you.
25. O supreme lord, O merciful Śiva, O lord of gods, be pleased, O best of Beings, be pleased.
26. The seven oceans[3] are your clothes. The quarters are your long arms. The firmament is your head, O allpervasive. The sky is your navel. The wind is your nose.
27. O lord, the fire, the sun and the moon are your eyes. The clouds are your hair. The planets and the stars are your ornaments.
28. O lord of gods, how shall I eulogise you? O supreme lord, you are beyond description. O Śiva, you are incomprehensible to the mind.
29. Obeisance to Thee, the five-faced Rudra. Obeisance to thee, with fifty crores of forms. Obeisance to thee, the lord of three deities. Obeisance to the most excellent one. Obeisance to the principle of learning.
30. Obeisance, Obeisance to the inexpressible, the eternal, the lightning-flamed, the flame-coloured. Obeisance to lord Śiva.
31. Obeisance, obeisance to thee stationed m the world with the form resembling a crore of lightning streaks, consisting of eight corners and very lustrous.
Continues....
🌹🌹🌹🌹🌹
02 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment