🍀 22 - OCTOBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

🌹🍀 22 - OCTOBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹
🌹 22 - OCTOBER అక్టోబరు - 2022 SATURSDAY శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 274 / Bhagavad-Gita -274 - 6వ అధ్యాయము 41 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 673 / Vishnu Sahasranama Contemplation - 673 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 635 / Sri Siva Maha Purana - 635 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 352 / DAILY WISDOM - 352 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 251 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹22, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు :లేవు 🌻*

*🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 11 🍀*

*20. క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధకరాయ చ కళత్రపుత్రశత్రుత్వ కారణాయ నమో నమః*
*21. పరిపోషితభక్తాయ పరభీతిహరాయ చ భక్తసంఘమనోఽభీష్ట ఫలదాయ నమో నమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : క్రోధద్వేషాలు విసర్జించు - క్రోధానికి అతీతం కాగలిగినప్పుడు శక్తి మహోదాత్తం. వినాశం చాల ఘనమైనదిగా కనుపించే మాట వాస్తవమే. కాని, క్రోధంచే సాధించబడి నప్పుడది తన ఘనతను కోల్పోతుంది. క్రోధం, పగ, — ఇవి నీచ మానవ ప్రకృతికి చెందినవి. వీటిని విసర్జించు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 18:04:13 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 13:51:26
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: బ్రహ్మ 17:12:28 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: తైతిల 17:58:13 వరకు
వర్జ్యం: 21:16:12 - 22:55:08
దుర్ముహూర్తం: 07:44:06 - 08:30:42
రాహు కాలం: 09:05:40 - 10:33:02
గుళిక కాలం: 06:10:53 - 07:38:17
యమ గండం: 13:27:49 - 14:55:11
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 07:05:24 - 08:46:48
సూర్యోదయం: 06:10:53
సూర్యాస్తమయం: 17:49:58
చంద్రోదయం: 03:15:16
చంద్రాస్తమయం: 15:58:04
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: సింహం
లంబ యోగం - చికాకులు, అపశకునం
13:51:26 వరకు తదుపరి ఉత్పాద 
యోగం - కష్టములు, ద్రవ్య నాశనం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 274 / Bhagavad-Gita - 274 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 41 🌴*

*41. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ: సమా: |*
*శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే ||*

🌷. తాత్పర్యం :
*యోగభ్రష్టులైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరముల సుఖముల ననుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును.*

🌷. భాష్యము :
 యోగమునందు కృతకృత్యులు కానివారికి రెండుతరగతులుగా విభజింపవచ్చును. వారే 1. యోగమునందు కొద్దిపాటి పురోగతి పిమ్మట పతనము నొందినవారు 2. యోగమునందు తీవ్ర అభ్యాసము చేసిన పిమ్మట పతనము నొందినట్టివారు. కొలదికాల యోగాభ్యాసము పిమ్మట పతనమైనవాడు పుణ్యలోకములను (పుణ్యజీవులు ప్రవేశించుటకు అనుమతి కలిగిన) పొందును. అచ్చట చిరకాల జీవనము పిమ్మట అతడు తిరిగి ఈ లోకమునకు పంపబడి పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబమున గాని లేదా ధనవంతులైనవారి ఇంట గాని జన్మమునొందును.

ఈ అధ్యాయపు చివరి శ్లోకమున వివరింపబడినట్లు కృష్ణభక్తిభావన యందు పూర్ణత్వమును పొందుటయే యోగము యొక్క నిజప్రయోజనమై యున్నది. కాని అంత దీర్ఘకాలము యోగమును అభ్యసింపజాలాక భౌతికాకర్షణలచే ప్రభావితులై యోగమునందు కృతకృత్యులు కాలేనివారికి భగవత్కరుణచే వారి విషయభావనలను తృప్తిపరచుకొను అవకాశము కల్పింపబడును. ఆ పిదప వారికి పవిత్రమైన కుటుంబమున గాని లేదా ధనవంతులైనవారి ఇంట గాని జీవించు అవకాశము ఒసగబడును. అట్టి కుటుంబములందు జన్మించినవారు తమకు లభించిన సౌకర్యములను సద్వినియోగపరచుకొని తిరిగి కృష్ణభక్తిభావన యందు అభ్యుదయమును పొందుటకు యత్నించు నవకాశము కలదు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 274 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 41 🌴*

*41. prāpya puṇya-kṛtāṁ lokān uṣitvā śāśvatīḥ samāḥ*
*śucīnāṁ śrīmatāṁ gehe yoga-bhraṣṭo ’bhijāyate*

🌷 Translation : 
*The unsuccessful yogī, after many, many years of enjoyment on the planets of the pious living entities, is born into a family of righteous people, or into a family of rich aristocracy.*

🌹 Purport :
The unsuccessful yogīs are divided into two classes: one is fallen after very little progress, and one is fallen after long practice of yoga. The yogī who falls after a short period of practice goes to the higher planets, where pious living entities are allowed to enter. After prolonged life there, one is sent back again to this planet, to take birth in the family of a righteous brāhmaṇa Vaiṣṇava or of aristocratic merchants.

The real purpose of yoga practice is to achieve the highest perfection of Kṛṣṇa consciousness, as explained in the last verse of this chapter. But those who do not persevere to such an extent and who fail because of material allurements are allowed, by the grace of the Lord, to make full utilization of their material propensities. And after that, they are given opportunities to live prosperous lives in righteous or aristocratic families. Those who are born in such families may take advantage of the facilities and try to elevate themselves to full Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 673/ Vishnu Sahasranama Contemplation - 673🌹*

*🌻673. మహాతేజః, महातेजः, Mahātejaḥ🌻*

*ఓం మహాతేజసే నమః | ॐ महातेजसे नमः | OM Mahātejase namaḥ*

తేజస్వినో యస్యయేన తేజసా భాస్కరాదయః ।
తత్తేజో మహదస్యేతి మహాతేజాస్సకేశవః ॥
సయేన సూర్య తేజసేద్ధ ఇతి శ్రుతేః ।
యదాదిత్యగతం తేజో జ్గద్భాసయతేఽఖిలమ్ ॥
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం ।
ఇతి గీతాసు హరిణా స్వయమేవ సమీరణాత్ ॥
క్రౌర్య శౌర్యాదిభిర్ధర్మైః మహద్భిస్సమలఙ్కృతః ।
ఇతి వాఽయం మహాతేజా ఇతి సఙ్కీర్త్యతే హరిః ॥

*ఎవనికి సంబంధించిన తేజస్సు చేత సూర్యుడు మొదలగువారు తేజోవంతులు అగుచున్నారో ఆతండు మహాతేజః. లేదా క్రౌర్య, శౌర్యాది ధర్మరూపమగు మహాతేజము ఎవనికి గలదో అట్టివాడు; ఈ ధర్మములచే సమలంకరింపబడినవాడు మహాతేజః.*

'యేన సూర్య స్తపతి తేజసేద్ధః' (తైత్తిరీయ బ్రాహ్మణము 3.12.9.7) - 'ఏ తేజముచే ప్రకాశించజేయబడిన వాడగుచు సూర్యుడును తపించుచున్నాడో' అను శ్రుతి వచనము దీనిని సమర్థించుచున్నది.

:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ ।
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ॥ 12 ॥

*సూర్యుని యందు ఏ తేజస్సు ప్రపంచము నంతను ప్రకాశింప జేయుచున్నదో, అట్లే చంద్రునియందును, అగ్నియందును ఏ తేజస్సుగలదో - అది అంతయు నాదిగా నెరుంగుము.*

:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే శతతమః సర్గః ::
అథ మన్త్రాన్ అభిజపన్ రౌద్రమస్త్రమ్ ఉదీరయన్ ।
శరాన్ భూయః సమాదాయ రామః క్రోధసమన్వితః ।
ముమోచ చ మహాతేజాః చాప మాయమ్య వీర్యవాన్ ॥ 36 ॥

*మహాతేజస్వియు, గొప్ప పరాక్రమశాలియు ఐన శ్రీరాముడూ మిక్కిలి క్రుద్ధుడై, మంత్రములను జపించి, రౌద్రాస్త్రమును తదితర శస్త్రములను రావణునిపై ప్రయోగించెను.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 673🌹*

*🌻673. Mahātejaḥ🌻*

*OM Mahātejase namaḥ*

तेजस्विनो यस्ययेन तेजसा भास्करादयः ।
तत्तेजो महदस्येति महातेजास्सकेशवः ॥
सयेन सूर्य तेजसेद्ध इति श्रुतेः ।
यदादित्यगतं तेजो ज्गद्भासयतेऽखिलम् ॥
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धिमामकं ।
इति गीतासु हरिणा स्वयमेव समीरणात् ॥
क्रौर्य शौर्यादिभिर्धर्मैः महद्भिस्समलङ्कृतः ।
इति वाऽयं महातेजा इति सङ्कीर्त्यते हरिः ॥

Tejasvino yasyayena tejasā bhāskarādayaḥ,
Tattejo mahadasyeti mahātejāssakeśavaḥ.
Sayena sūrya tejaseddha iti śruteḥ,
Yadādityagataṃ tejo jgadbhāsayate’khilam.
Yaccandramasi yaccāgnau tattejo viddhimāmakaṃ,
Iti gītāsu hariṇā svayameva samīraṇāt.
Kraurya śauryādibhirdharmaiḥ mahadbhissamalaṅkr‌taḥ,
Iti vā’yaṃ mahātejā iti saṅkīrtyate hariḥ.

*He by whose brilliance the sun etc., are brilliant, that great brilliance is His. Or since He is endowed with the great qualities of fierceness and valor, He is Mahātejaḥ.*

'येन सूर्य स्तपति तेजसेद्धः' (तैत्तिरीय ब्राह्मण ३.१२.९.७) / 'Yena sūrya stapati tejaseddhaḥ' (Taittirīya brāhmaṇa 3.12.9.7) - 'Illumined by which brilliance the sun shines'.

:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योग ::
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥ १२ ॥

Śrīmad Bhagavad Gīta -Chapter 15
Yadādityagataṃ tejo jagadbhāsayate’khilam,
Yaccandramasi yaccāgnau tattejo viddhi māmakam. 12.

*That light in the sun which illumines the whole world, that which is in the moon and that which is in fire - know that light to be mine.*

:: श्रीमद्रामायणे युद्धकाण्डे शततमः सर्गः ::
अथ मन्त्रान् अभिजपन् रौद्रमस्त्रम् उदीरयन् ।
शरान् भूयः समादाय रामः क्रोधसमन्वितः ।
मुमोच च महातेजाः चाप मायम्य वीर्यवान् ॥ ३६ ॥

Śrīmad Rāmāyaṇa - Book 6, Chapter 100
Atha mantrān abhijapan raudramastram udīrayan,
Śarān bhūyaḥ samādāya rāmaḥ krodhasamanvitaḥ,
Mumoca ca mahātejāḥ cāpa māyamya vīryavān. 36.

*Thereupon, seizing hold of more arrows, reciting sacred incantations and making use of the missile presided over by Rudra and stretching his bow, the valiant Rama of great splendor was filled with anger and released those arrows.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 635 / Sri Siva Maha Purana - 635 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 12 🌴*
*🌻. కార్తికేయ స్తుతి - 5 🌻*

పర్వతములలో మేరువు నీవే. నక్షత్రములలో చంద్రుడవు నీవే.ఋషులలో వసిష్ఠుడవు నీవే. మరియు దేవతలలో ఇంద్రుడవు నీవే(43). వేదములన్నింటిలో ఓంకారము నీవే. మహేశ్వరా! రక్షించుము. నీవు లోకహితమును గోరి ప్రాణులకు రసమును, పుష్టిని ఇచ్చి రక్షించుచున్నావు (44).

మహేశ్వరా! మహాత్మా! ప్రాణుల పుణ్యపాపములకు సాక్షివి నీవే. ఓ దేవ దేవా! నీ వచనమును పాలించు మమ్ములను ఆనందింపజేయుము (45). కోట్లాది రూపములలో నిన్ను దర్శించి యున్నాము. కాని నీ విభూతులకు అంతమును కనలేకపోయినాము. ఓ దేవదేవా! నీవు నమస్కారము (46).

బ్రహ్మా ఇట్లు పలికెను -
విష్ణువు మొదలగు దేవతలందరు స్కందుని ఎదుట నిడుకొని శివుని ఎదుట నిలబడి ఇట్లు స్తుతించి అనేక నమస్కారములను చేసిరి (47). సర్వేశ్వరుడు, జగన్నాథుడు, దయానిధి అగు శివుడు దేవతల స్తోత్రమును విని మిక్కిలి ప్రసన్నుడై నవ్వెను (48). పరమేశ్వరుడు, దీనులకు బంధువు, సత్పురుషులకు గతి అగు శంకరుడు మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గలవాడై దేవ శ్రేష్ఠులగు విష్ణువు మొదలగు వారితో నిట్లనెను (49).

శివుడిట్లు పలికెను -
ఓ హరీ! ఓ బ్రహ్మా!దేవతలారా! నా మాటను శ్రద్ధగా వినుడు. దయానిధి యగు నేను సత్పురుషులను, దేవతలగు మిమ్ములను అన్నివిధములగు రక్షించెదను (50). నేను దుష్టులను దండించి, భక్తులను ప్రేమించే త్రిలోకనాథుడనగు శంకరుడను. నేను ప్రాణులన్నిటినీ సృష్టించి, పాలించి, సంహరించెదను. అయిననూ నాకు వికారము లేదు (51). ఓ దేవ శ్రేష్ఠులారా! మీకు దుఃఖము కలిగిన సందర్భము లన్నింటిలో సుఖమును పొందుట కొరకై మీరు నన్ను సేవించెదరు గాక! (52)

బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు మొదలగు దేవతలు మరియు మునిశ్రేష్ఠులు అపుడు శివునిచే ఈ విధముగా ఆజ్ఞాపించబడిన వారై, ఆనందముతో శివపార్వతులకు, కుమార స్వామికి ప్రణమిల్లిరి (53). ఓ మునీ! వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క, మరియు శంకరపుత్రుని యొక్క సుందరమగు కీర్తిని గానము చేయుచూ పరమానందమును పొంది తమ స్థానములకు వెళ్ళిరి (54).

పరమేశ్వరుడగు శివుడు పార్వతితో, కుమార స్వామితో, గణములతో కూడి ఆ పర్వతము నందు ఆనందముతో నివసించెను (55). ఓ మునీ! నీకు కుమారుని చరితమును, సుఖకరము దివ్యము అగు శివుని చరితమును పూర్ణముగా చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరు చున్నావు? (56)

శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో కార్తికేయకస్తుతి అనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 635🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 12 🌴*

*🌻 The story of Śiva and Pārvatī including that of Kārttikeya - 5 🌻*

44. You are Oṃkāra among all Vedic passages; O great lord, be our protector. For the benefit of the worlds you nourish the Beings.

45. O great lord, O fortunate one, O scrutinizer of the good and evil, O lord of gods, make us flourish as those who carry out your instructions.

46. In your millions and millions of forms we are unable to realize your true self. O lord of gods, obeisance be to you.

Brahmā said:—
47. After eulogising thus and bowing to him frequently, Viṣṇu and other gods stood before him after placing Skanda ahead.

48. On hearing the eulogy of the gods, Śiva, the lord of all, the self-ruler was delighted. The compassionate lord then laughed.

49. Śiva the great Īśāna, the kinsman of the distressed, the goal of the good, became delighted and spoke to Viṣṇu and other important gods.

Śiva said:—
50. O Viṣṇu, O Brahmā, O gods, listen to my words with attention. I am merciful. I shall by all means protect you, the gods.

51. The lord of the three worlds is a slayer of the wicked. He is favourably disposed to his devotees. He is the creator, sustainer and annihilator of all yet free from aberrations.

52. O excellent gods, whenever you are faced with misery you shall worship me for your happiness.

Brahmā said:—
53-54. O sage, thus ordered, Viṣṇu, the other gods and the sages bowed to Śiva, Pārvatī, and Kumāra joyously, and returned to their abodes in great delight singing the pleasant glory of Śiva, Pārvatī and their son.

55. Śiva stayed on the mountain joyously along with Pārvatī, the Gaṇas and Kumāra. Lord Śiva was much pleased.

56. Thus O sage, the divine and pleasant story of Kumāra and Śiva has been narrated to you. What else do you wish to hear?

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 352 / DAILY WISDOM - 352 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*

*🌻17. ధ్యానం అంటే నిజమైన మతాన్ని ఆచరించడం🌻*

*ఒకరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, వారు నిజమైన మతాన్ని ఆచరిస్తున్నట్లు. కానీ, ఎవరైనా అలా చేయడం ద్వారా ఒక నిర్దిష్ట మతపరమైన తెగకు, వ్యవస్థకు చెందిన వారు కాదు. మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం మతపరంగా జీవిస్తాము, ఎందుకంటే మతం అనేది మనిషి మరియు దేవుని మధ్య, ఆత్మ మరియు సంపూర్ణత మధ్య ఉన్న సంబంధం. ఆ సంబంధాన్ని జీవితంలో ధృవీకరించడం మతం యొక్క లక్ష్యం. మతం అనేది ఒక దేవాలయానికి లేదా చర్చికి సంబంధించిన చర్య కాదు. ఇది భగవంతునితో ఒకరి చైతన్యం యొక్క సంబంధాన్ని అంతర్గతంగా అంగీకరించడం. ఆ భగవంతుడే అనేక రూపాలలో ఒక్కో మతంలో ఒక్కోలా వ్యక్తీకరించబడతాడు. మనం పవిత్రమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు, మనం నిజంగా దేవుని ఆలయంలో ఉంటాము.*

*మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, మనం దైవసన్నిధిలోనే ఉంటాము. దేవాలయం లేదా చర్చి అనేవి ప్రపంచంలోని అనుభావిక విషయాలు కంటే ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమించే మతాన్ని సూచిస్తాయి. చర్చి ప్రపంచానికి చెందినది కాదు. ఇది లౌకికానికి పైన ఉండే ఒక ఒక దైవిక వృత్తి. ఆలయాలు ఉన్నత దైవీ విలువలతో, విషయాలతో నిండి ఉంటాయి. అక్కడ కూర్చున్న వారెవరూ ద్వంద్వాలకు చెందినవారు కాదు, దైవానికి చెందినవారు. ఈ ప్రపంచం దేశకాలాలకు లోబడి ఉంటుంది. ఈ పరిమితిని అధిగమించడమే మన ప్రయత్నం. ధ్యానంలో మాత్రమే ఒకడు నిజమైన మతస్థుడు అవుతాడు. ఇతర కార్యకలాపాలలో ఒకరు తిరిగి శారీరక వ్యక్తిత్వంలోకి జారిపోతారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 352 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*

*🌻17. Meditation is Practising True Religion🌻*

*When one is in a mood of meditation, one is practising true religion, but by so doing one does not belong to any particular religious cult. We live religion when we are in a state of meditation, because religion is the relation between man and God, between the soul and the Absolute. The affirmation of it in life is religion's aim. Religion is not the act of belonging to a creed, a temple, or a church. It is an inward acceptance of one's conscious relation with the Almighty, who presents Himself as the degrees of Deity in the different religions. When we are in a holy mood, we are really in the temple of God.*

*When we are in a state of meditation, we are in the church of Christ. The temple or the church is this very transcendence which is the spirit of religion that occupies a position superior to the empirical subjects and objects of the world. The church does not belong to the world. It is a divine occupation, lifted above the mundane. The temples are trans-earthly atmospheres which have in their precincts whatever is of value. Anyone seated there does not belong to sides or parties, but to the Divine Whole. This world is nothing but a spatio-temporal complex of subjects and objects. And our endeavour is to overcome this limitation. One becomes truly religious only in meditation. In other activities one sinks back into the bodily individuality.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 251 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. దేవుడు ప్రేమ, కవి, గాయకుడు, నాట్యకారుడు, సృష్టికర్త. జనం వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడాన్ని ఇష్టపడతాడు. తమంత తాము ఎదిగే వాళ్ళని దైవం ప్రేమిస్తాడు. 🍀*

*జీవితమన్నది ఆనందించడానికి. జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి. దేవుడు ఈ జీవితాన్ని సృజించాడు. దేవుడు మరీ కఠోర నియమాల్ని పాటించేవాడు కాడు. అట్లా అయితే ఈ పూలు, ఇంద్రధనసు, సీతాకోక చిలుకలూ ఎందుకుంటాయి? ఏం ప్రయోజనం కోసం వున్నాయి? దేవుడు కఠినుడు కాడు. అది మాత్రం కచ్చితం. దేవుడు ప్రేమ, కవి, గాయకుడు, నాట్యకారుడు, సృష్టికర్త. ఆయన సమగ్రవాది కాడు. ఆయన అభివృద్ధికి పరిశోధనని యిష్టపడతాడు. జనం వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడాన్ని ఆయన ఇష్టపడతాడు.*

*తమంత తాము ఎదిగే వాళ్ళని దైవం ప్రేమిస్తాడు. వాళ్ళు తప్పులు చేస్తారని ఆయనకు తెలుసు. తప్పులు చెయ్యకుండా ఎవరూ నేర్చుకోలేరని ఆయనకు తెలుసు. దేవుడు సన్యాసి కాడు. అది మాత్రం కచ్చితం. ఒక వేళ దేవుడనే వాడుంటే అతను తప్పకుండా నా సన్యానుల్లో ఒకడయ్యే వాడు. జీవితాన్ని, అస్తిత్వాన్ని గాఢంగా ప్రేమించేవాడు. లేకుంటే అతనీ సృష్టిని చేసేవాడు కాడు. మీరు కొత్త రకమయిన, సంగీతం, నాట్యం, ఉత్సవం కలిసిన మతభావనను తెలుసుకోవాలి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 409 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 409 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 2🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀

🌻 409. ‘శివప్రియా'- 2 🌻


ప్రేమ సమానత్వమునకు నిదర్శనము. ఆధిక్యము హెచ్చుతగ్గులకు నిదర్శనము. పురుషులు తాము అధికులను కొందురు. అట్టి పురుషులు తెలియని వారు. అట్లే స్త్రీలు కూడ తాము అధికులమని ఋజువు చేయుటకు ప్రయత్నింతురు. ఇరువురు సమానులే గాని ఎవరునూ ఒకరి కన్న ఇంకొకరు అధికులు కారు. ఆధిక్య భావము అజ్ఞానము, సమభావము జ్ఞానము. సమదర్శనులే తెలిసినవారని శ్రీకృష్ణుడు గీతయందు తెలిపెను. సమదర్శనము లేనిచోట దివ్యసాన్నిధ్య ముండదు. శివప్రియా అను నామము ఇట్టి సమభావమును ప్రకటించుచున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻

🌻 409. 'Shivapriya'- 2 🌻

Love is proof of equality. Dominance is indicative of inequality. Men tend to think they are superior. Such men are ignorants. Similarly, women also try to prove that they are superior. Both are equal and neither is superior to the other. Superiority is ignorance, equality is wisdom. Lord Krishna said in the Gita that only those who envision equality are wise. Where there is no equality in outlook, there is no reaching Divine. The name Shivapriya declares this equality.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 255. భగవంతుని పాట / Osho Daily Meditations - 255. S0NG OF GOD


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 255 / Osho Daily Meditations - 255 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 255. భగవంతుని పాట 🍀

🕉. మనమందరం ఒకే గాయకుడి విభిన్న పాటలం, ఒకే నర్తకి యొక్క విభిన్న హావభావాలం. 🕉


ప్రతి జీవి దేవుని పాట: ప్రత్యేకమైనది, వ్యక్తిగతమైనది, సాటిలేనిది, పునరావృతం చేయలేనిది. ఒకే మూలం నుండి అది వస్తోంది. ఒక్కో పాటకి ఒక్కో రుచి ఉంటుంది, అందం ఉంటుంది, సంగీతం ఉంటుంది, శృతి ఉంటుంది కానీ, గాయకుడు ఒకడే. మనమందరం ఒకే గాయకుడి విభిన్న పాటలము. ఒకే నర్తకి యొక్క విభిన్న హావభావాలం. అనుభూతిని ప్రారంభించడం ధ్యానం. అప్పుడు సంఘర్షణ అదృశ్య మవుతుంది, అసూయలు అసాధ్యమవుతాయి మరియు హింసను ఊహించ లేము. ఎందుకంటే ప్రపంచం అంతటా మన స్వంత ప్రతిబింబాలు తప్ప మరెవ్వరూ లేరు. సముద్రపు అలలన్నింటిలాగే మనం కూడా ఒకే మూలానికి చెందిన వారమైతే, ఈ సంఘర్షణ, పోటీ, ఉన్నతమైన లేదా తక్కువ అనే భావనలు, అసలు ఈ అర్ధం లేనివన్నీ ఏమిటి?

ఎవరూ గొప్పవారు కాదు మరియు ఎవరూ తక్కువ కాదు: ప్రతి ఒక్కరూ కేవలం తాను లేదా ఆమె మాత్రమే. మరియు ప్రతి ఒక్కరూ చాలా ప్రత్యేకమైన వారు. ఇంతకు ముందు మీలాంటి వ్యక్తి మరెవరూ లేరు మరియు మీలాంటి వ్యక్తి మళ్లీ ఉండే అవకాశం లేదు. వాస్తవానికి, మీరు వరుసగా రెండు క్షణాలు ఒకేలా ఉండరు. నిన్న మీరు వేరొక వ్యక్తి, నేడు మీరే మరొకరు. రేపు, ఎవరికీ తెలియదు. ప్రతి జీవి ఒక ప్రవాహం: స్థిరమైనది కొనసాగే మార్పు, ప్రవహించే నది. మీరు ఒకే నదిలో రెండుసార్లు అడుగు పెట్టలేరు అని చెప్తారు. నేను మీకు చెప్తున్నాను, మీరు ఒకే నదిలో ఒక్కసారి కూడా అడుగు పెట్టలేరు, ఎందుకంటే నది నిరంతరం ప్రవహిస్తుంది మరియు నది మన జీవితాన్ని సూచిస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 255 🌹

📚. Prasad Bharadwaj

🍀 255. S0NG OF GOD 🍀

🕉. We are all different songs of the same singer, different gestures of the same dancer. 🕉


Each being is a song of God: unique, individual, incomparable, unrepeatable, but still coming from the same source. Each song has its own flavor, its own beauty, its own music, its own melody, but the singer is the same. We are all different songs of the same singer, different gestures of the same dancer. To start feeling it is meditation. Then conflict disappears, jealousies become impossible, and violence is unthinkable, because there is nobody other than our own reflections all over the world. If we belong to the same source, just like all the waves of the ocean, then what is the point of conflict, competition, feeling superior or inferior, and all that nonsense?

Nobody is superior and nobody is inferior: Everybody is simply just himself or herself. And everybody is so unique that there has never been any other individual like you before, and there is no possibility of there ever being an individual like you again. In fact, you yourself are not the same for two consecutive moments. Yesterday you were a different person, today it is just somebody else. Tomorrow, one never knows. Each being is a flux: a constant change, a river flowing. Heraclitus says that you cannot step in the same river twice. And I say to you, you cannot step in the same river even once, because the river is constantly flowing. And the river represents life.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 120 / Agni Maha Purana - 120


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 120 / Agni Maha Purana - 120 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 38

🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 3🌻


విష్ణ్వాలయమునకు వెల్లవేసినవారును, దానిపై బంధూకపుష్పముల చిత్రములు వేసినవారును విష్ణులోకమును పొందుదురు. కూలిపోయిన లేదా కూలిపోవుచున్న లేదా సగము కూలిపోయిన దేవాలయమును జీర్ణోద్ధారణము చేసినవానికి క్రొత్తదేవాలయము నిర్మించినవానికంటె రెట్టింపు ఫలము లభించును. కూలిపోయిన విష్ణ్వాంయమును మరల నిర్మించి రక్షించిన వాడు సాక్షాత్‌ భగవత్స్వరూపుడు.

భగవంతుని ఆలయము నందు ఇటుకలు ఎంతకాల ముండునో అంతవరకును, వాటిని నిర్మించినవాడు, తన కులముతో కూడ, విష్ణులోకములో నుందును. ఇహలోకమునందును, పరలోకమునందును గూడ ఆతడే పూజనీయుడు; అతడే పుణ్యవంతుడు.

శ్రీకృష్ణునకు ఆలయము కట్టించిన పుణ్యాత్ముడే పుట్టినవారిలో లెక్క. అతడే తన వంశమును రక్షించువాడు. విష్ణు-శివ-సూర్య-దేవ్యాదులకు ఆలయమును నిర్మించువాడే ఈ లోకమునందు కీర్తి పొందును. ఎంతో శ్రమపడి సంపాదించిన ధనమును, శ్రీకృష్ణాలయమును నిర్మించుటకు వినియోగింపక, కేవలము దానిని రక్షించుచుండు మూమార్ఖునకు దానివల్ల ఏమి ప్రయోజనము కలుగును?

పితరులు, బ్రాహ్మణులు, దేవతలు-వీరికై తన ధనమును వినియోగించని వాని ధనము, బంధువులకు ఉపకరించని వాని ధనము వ్యర్థము. దానమునకు గాని, భోగమునకు గాని, ధర్మాచరణమునకు గాని, కీర్తి కొరకు గాని ఉపకరించని ధనమునకు స్వామి అయి ఏమి ప్రయోజనము? అందుచే పూర్వజన్మాదృష్టముచేత గాని, పురుష ప్రయత్నముచేత గాని, మరి ఏఉపాయాంతరముచేత గాని లభించిన ధనమును ఉత్తమబ్రహ్మణులకు దానము చేయవలెను; స్థిరకీర్త లభించుటకు ఉపయోగించవలెను. దానికీర్త్యాదుకంటె గూడ దేవాలయనిర్మాణము ఉత్తమ మైనది గాన బుద్ధిమంతుడు విష్ణ్వాదిదేవతలకు ఆలయములు కట్టించవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 120 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 38

🌻 Benefits of constructing temples - 3 🌻


18. Those who decorate (the temple) of Viṣṇu with the bandhūka flowers and an oint with fragrant paste, also reach the place of the lord. (Having erected the temple of Hari), a person obtains two-fold merits after having elevated the fallen, the falling and half-fallen. He who brings about the fall of a man is the protector of one fallen.

19. By (erecting) a temple of Viṣṇu one reaches his region. As long as the bricks remain in the temple of Hari, the founder of that family is honoured in the world of Viṣṇu. He becomes pious and adorable in this world as well as the next.

20. He who builds a temple for Kṛṣṇa, the son of Vasudeva is born as a man of good deeds and his family gets purified.

21. He who builds an abode for Viṣṇu, Rudra, Sun or the goddess etc. acquires fame. What is the use of the hoarded riches for an ignorant person?

22-23. If one does not cause an abode for Kṛṣṇa to be built (with wealth) acquired by hard (work) (and) if one’s wealth could not be enjoyed by manes, brahmins, celestials and relatives, his acquisition of wealth is useless. As death is certain for a man so also the destruction of wealth.

24. One who does not spend his riches for charities or for enjoyments is stupid and is being bound even while alive, while the riches are flickery.

25. Is there any merit in being the lord of wealth acquired either accidentally or by one’s effort, if it is not spent for acquiring fame or for philanthropy?


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

కపిల గీత - 81 / Kapila Gita - 81


🌹. కపిల గీత - 81 / Kapila Gita - 81🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 37 🌴

37. చాలనం వ్యూహనం ప్రాప్తిర్నేతృత్వం ద్రవ్యశబ్దయోః|
సర్వేంద్రియాణామాత్మత్వం వాయోః కర్మాభిలక్షణమ్॥


చెట్లకొమ్మలను చలింపజేయుటకు, తృణాదులను ఒకచోట చేర్చుట, సర్వత్ర వ్యాపించుట, వస్తువులయొక్క వాసనలను (గంధమును) ఘ్రాణేంద్రియము (ముక్కు) కడకును. శబ్దముసు శ్రోత్రేంద్రియము (చెవులు) కడకును చేర్చుట అట్లే సమస్త ఇంద్రియములకును కార్యశక్తిని కలిగించుట అనునవి వాయువుయొక్క వృత్తుల (కార్యముల) లక్షణములు.

ప్రతీ దాన్ని కదిలించడం గాలి యొక్క గుణం. దగ్గరగా ఉన్న దాన్ని విడదీసేదీ, దూరముగా ఉన్నవాటిని దగ్గరకు చేసేదీ వాయువు. ఈ రెండిటికీ కదలిక కావాలి. ద్రవ్యమునూ(గంధమును) శబ్దమునూ మన దగ్గరకు తీసుకుని వస్తుంది. అన్ని ఇంద్రియములనూ ధరించేది వాయువు. మన ఇంద్రియాలు అన్నీ ఆకాశములోనే ఉన్నాయి. అవి కింద పడకుండా ఆపేది వాయువు. అలాగే అన్ని గోళాలు ఆకాశములో ఉన్నాయి కానీ కింద పడవు, అలాగే అవయవ రంధ్రాలలో ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలను ధరించేది వాయువు. చక్షురింద్రియం, ఘ్రానేంద్రియం వంటివి ఇంకో గోళం (అవయవము) లోకి వెళ్ళకుండా ఉండటానికి కారణం వాయువు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Kapila Gita - 81 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 37 🌴

37. cālanaṁ vyūhanaṁ prāptir netṛtvaṁ dravya-śabdayoḥ
sarvendriyāṇām ātmatvaṁ vāyoḥ karmābhilakṣaṇam


The action of the air is exhibited in movements, mixing, allowing approach to the objects of sound and other sense perceptions, and providing for the proper functioning of all other senses.

We can perceive the action of the air when the branches of a tree move or when dry leaves on the ground collect together. Similarly, it is only by the action of the air that a body moves, and when the air circulation is impeded, many diseases result. Paralysis, nervous breakdowns, madness and many other diseases are actually due to an insufficient circulation of air. In the Āyur-vedic system these diseases are treated on the basis of air circulation. If from the beginning one takes care of the process of air circulation, such diseases cannot take place.

From the Āyur-veda as well as from the Śrīmad-Bhāgavatam it is clear that so many activities are going on internally and externally because of air alone, and as soon as there is some deficiency in the air circulation, these activities cannot take place. Here it is clearly stated, netṛtvaṁ dravya-śabdayoḥ. Our sense of proprietorship over action is also due to the activity of the air. If the air circulation is stifled, we cannot approach a place after hearing. If someone calls us, we hear the sound because of the air circulation, and we approach that sound or the place from which the sound comes. It is clearly said in this verse that these are all movements of the air. The ability to detect odors is also due to the action of the air.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

21 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹21, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : రమా ఏకాదశి, గోవత్స ద్వాదశి, Rama Ekadashi, Govatsa Dwadashi 🌻

🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -17 🍀


17. సౌఖ్యప్రదే ప్రణతమానసశోకహన్త్రి అమ్బే ప్రసీద కరుణాసుధయాఽఽర్ద్రదృష్ట్యా ।
సౌవర్ణహారమణినూపురశోభితాఙ్గి శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : మానవ లక్ష్యం - ఆనందమే ఈశ్వరుడు మానవజాతికి నిర్దేశించిన లక్ష్యం. దీనిని నీవు మొదట నంపాదించు కోగలిగితే పిమ్మట నీతోటి వారికి పంచిపెట్ట గలుగుతావు. మానవుడు స్వర్గ సుఖమసుకోని, పుణ్య సంపద అనుకోనీ తనకు మాత్రమే సంపాదించుకునేది సరియైన సంపాదన కానేరదు.🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ ఏకాదశి 17:24:44 వరకు

తదుపరి కృష్ణ ద్వాదశి

నక్షత్రం: మఘ 12:29:08 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: శుక్ల 17:47:34 వరకు

తదుపరి బ్రహ్మ

కరణం: బాలవ 17:18:45 వరకు

వర్జ్యం: 20:56:20 - 22:37:48

దుర్ముహూర్తం: 08:30:36 - 09:17:16

మరియు 12:23:55 - 13:10:35

రాహు కాలం: 10:33:05 - 12:00:35

గుళిక కాలం: 07:38:06 - 09:05:36

యమ గండం: 14:55:34 - 16:23:04

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23

అమృత కాలం: 09:53:18 - 11:37:06

సూర్యోదయం: 06:10:37

సూర్యాస్తమయం: 17:50:33

చంద్రోదయం: 02:24:07

చంద్రాస్తమయం: 15:22:04

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: సింహం

కాల యోగం - అవమానం 12:29:08

వరకు తదుపరి సిద్ది యోగం -

కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

Faith does not mean Belief


🌹 Faith does not mean Belief 🌹

Two things have to be remembered. One is that faith does not mean belief. Belief is of the mind and faith is of the heart. Faith is a love affair and belief is only an intellectual conviction. Belief can be easily destroyed by arguments; faith can never be destroyed. No argument can destroy faith because it is not based on arguments in the first place. But belief is based in arguments. Belief is philosophical; faith is religious. Belief is a false coin. It looks like faith but it is fake. faith is never static.

Belief is always static. Faith is like a river: moving, dynamic, alive, increasing — like a tree growing, new foliage coming, new buds opening, new flowers. It is always a movement from one peak to another peak, from one perfection to another perfection, from one joy to another joy, from one mystery to another mystery. It is a non-ending pilgrimage. Belief is dead, it is like a corpse. It never moves. It is like a pond, stagnant, it stinks. And the world is full of believers; that’s why there is so much misery, so much ignorance, so much superstition.

The whole earth is stinking for the simple reason that people have lost all contact with real religiousness. river is a river, all rivers are rivering, moving, going towards the ocean. same with Faith it is always increasing, and the person who lives in faith grows, grows to ultimate heights. And the person who lives in beliefs is a dead person. He trusts in something which is dead, and the ultimate result is that he becomes dead himself. Avoid beliefs and risk everything for faith.

🌹 🌹 🌹 🌹 🌹

రమా ఏకాదశి Rama Ekadashi

రమా ఏకాదశి

(21-10-2022)

⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️


"ఏకాదశి వ్రతం నామ సర్వకామఫలప్రదం || కర్తవ్యం సర్వదా విప్రైర్ విష్ణు ప్రీణన కారణం |

రమా ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణధర్మరాజ సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది.

"ఓ జనార్దనా! ఆశ్వీయుజమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని నాకు వివరించవలసినది" అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు.

అపుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ "ఓ రాజసింహమా! ఆ ఏకాదశి పేరు రమా ఏకాదశి. అది సమస్త పాపాలను హరిస్తుంది. ఇపుడు ఆ పవిత్ర ఏకాదశి మహిమను విను" అని పలుకసాగాడు.

చాలాకాలం క్రిందట ముచుకుందుడనే ప్రఖ్యాతరాజు ఉండేవాడు. అతడు స్వర్గరాజు ఇంద్రునికి మంచి మిత్రుడు. యమరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వంటి మహోన్నతులతో కూడ అతనికి స్నేహం ఉండేది. సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణుభక్తిలో అనురక్తుడై ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు.

కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది. సర్వోత్తమ నదియైన చంద్రభాగా యొక్క
పేరును ఆ అమ్మాయికి పెట్టారు. యుక్తవయస్సు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనునితో పరిణయము జరిగింది.

ఒకసారి శోభనుడు ఏకాదశిరోజు తన మామగారి ఇంటికి వచ్చాడు. అది చూసిన చంద్రభాగ కలవరపడినదై తనలో తాను "ఓ దేవా! ఇప్పుడేమి చేయాలి? నా భర్త దుర్బలుడు; ఆకలిని తట్టుకోలేడు. నా తండ్రి మరీ కఠినుడు. ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుని పంపి ఎవ్వరూ ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడ వేస్తాడు”. అని అనుకోసాగింది.

ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో "ఓ ప్రియపత్నీ! ఇపుడు నన్నేమి చేయమంటావు? నా ప్రాణం రక్షింపబడడానికి, అలాగే రాజాజ్ఞ ఉల్లంఘించకుండ ఉండడానికి ఏం చేయాలో చెప్పు" అని అన్నాడు.

అపుడు చంద్రభాగ తన భర్తతో "స్వామీ! మనుషుల మాట అటుంచండి. నా తండ్రి రాజ్యంలో ఏనుగులు, గుఱ్ఱాలు, ఇతర జంతువులకు కూడ ఈ రోజు ఆహారం ఉండదు. కనుక ప్రభూ! ఇక
మనుషులెట్లా తినగలుగుతారు. ఒకవేళ తప్పకుండ తినవలసియే ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసికోండి."

భార్య మాటలు వినిన శోభనుడు ఆమెతో "నీవు చెప్పింది అక్షరాల సత్యమే. కాని నాకు ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలని ఉంది. నాకు ఏది జరగవలసి ఉందో అది జరిగియే తీరుతుంది కదా!" అని అన్నాడు.

ఈ విధంగా తలచిన శోభనుడు పవిత్ర ఏకాదశివ్రతపాలనకు ఉద్యుక్తుడయ్యాడు. కాని అతడు ఆకలిదప్పికలతో నీరసించిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. వైష్ణవులు, పుణ్యాత్ములు అందరూ ప్రసన్నులయ్యారు. ఓ రాజసింహమా! ఆ రాత్రి వారంతా సంకీర్తన అర్చనలతో గడిపివేసారు. కాని ఆ రేయి గడపడం శోభనునికి అసాధ్యమైంది. సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు. ముచుకుందుడు శోభనునికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహనసంస్కారాలు చేసాడు. ముచుకుందుని ఆజ్ఞ చంద్రభాగ సతీసహగమనం మేరకు మానుకుంది. భర్తకు అంత్యక్రియలు జరిగిన తరువాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది. "రాజా! ఇంతలో రమా ఏకాదశి వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురమనే రాజ్యానికి జుగా జన్మించాడు. అది మందర పర్వతము పైన ఉన్నది. రత్నఖచితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది, మణిఖచితమగు గోడలు కలిగినదియైన ఐశ్వర్యయుత ప్రాసాదములో అతడు నివసించసాగాడు. మణిమయమైన బంగారు కిరీటమును ధరించిన అతనికి తెల్లని ఛత్రము పట్టబడియుండేది. కర్ణకుండలములతో, కంఠాభరణములతో, బంగారు భుజకీర్తులతో కంకణములతో అలంకృతుడై అతడు రాజ్యసింహాసనమున కూర్చునేవాడు. గంధర్వులచే, అప్సరసలచే సేవింపబడుచు అతడు స్వర్గరాజు ఇంద్రుని వలె గోచరించెడివాడు. "

ఒకరోజు ముచుకుందపుర నివాసియైన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్ధయాత్రలు చేస్తూ వచ్చాడు. శోభనుడు ముచుకుందుని అల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు. బ్రాహ్మణుని చూడగానే రాజు లేచి నిలబడి, చేతులు జోడించి నమస్కరించాడు. తరువాత అతడు బ్రాహ్మణుని కుశల మడిగాడు. తరువాత ముచుకుందుడు, తన భార్య చంద్రభాగ, ముచుకుందపుర జనుల గురించిన క్షేమసమాచారాలు కూడ అడిగాడు. అపుడు బ్రాహ్మణుడు అందరి క్షేమసమాచారాలు తెలిపాడు. అక్కడ ప్రతియొక్కరు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో "రాజా! ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెన్నడును చూడలేదు. నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది" అని అడిగాడు.

"ఆశ్వీయుజ కృష్ణపక్షంలో వచ్చే రమాఏకాదశిని పాటించిన ప్రభావము వలననే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది. ఓ బ్రాహ్మణోత్తమా! ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానమేమిటో నాకు చెప్పవలసినది. నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది. ఈ విషయాలను చంద్రభాగకు తెలపండి. ఆమె దీనిని సుస్థిరమొనర్చగలిగే సామర్థ్యము కలిగినట్టిది" అని శోభనుడు అన్నాడు.శోభనుని మాటలను వినిన బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వచ్చి విషయమంతా చంద్రభాగకు వివరించాడు. అది వినిన చంద్రభాగ అమితానందభరితురాలు అయింది. తాను విన్నదంతా కలలాగా ఉన్నదని ఆమె పలికింది.అపుడు సోమశర్మ ఆమెతో "అమ్మా! నేను నీ భర్తను

దేవపురిలో స్వయంగా చూసాను. ఆ పురము సూర్యప్రభలతో వెలిగిపోతోంది. కాని ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నీవు సుస్థిరం చేయాలి" అని అన్నాడు. అది వినిన చంద్రభాగ తనను తన భర్త చెంతకు తీసికొని వెళ్ళమని బ్రాహ్మణుని అర్ధించింది. తన పుణ్యపరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది. భార్యాభర్తలైన తాము కలిసికొనే ఏర్పాట్లు చేయమని, ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యము కలుగుతుందని ఆమె బ్రాహ్మణునితో అన్నది.

తదనంతరము సోమశర్మ చంద్రభాగను మందరపర్వత సమీపంలో ఉన్నట్టి వామదేవుని ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. దేదీప్యమానమగు ముఖవర్చస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథను వినిన తరువాత వామదేవుడు ఆమెకు వేదమంత్రోపదేశం చేసాడు. వామదేవుడు ఒసగిన మంత్ర ప్రభావం వలన ఏకాదశి వ్రతమహిమ వలన చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. తరువాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలిసికొన్నది.

భార్యను చూడగానే శోభనుడు పరమానందభరితుడై పూర్ణ సంతుష్టిని పొందాడు. అపుడు చంద్రభాగ తన భర్తతో "ప్రభూ! నా మంచిమాటలు వినండి. నేను నా తండ్రి ఇంట్లో ఎనిమిదేండ్ల వయస్సు నుండే ఏకాదశివ్రత పాలనము చేస్తున్నాను. ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతము వరకు దీనిని సమృద్ధిగా నిలుపు గాక!" అని అన్నది. ఆ తరువాత ఆమె వివిధ నగలతో అలంకృతమైన దివ్యశరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది. రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడ దివ్యశరీరాన్ని పొంది మందరపర్వత చరియలలో విహరించాడు. కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటిది.

శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ "రాజా! పరమమంగళమైన రమా ఏకాదశి మహిమను నీకు వివరించాను. దీనిని కచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్యాపాతకము వంటి పాపం నుండైనా విస్సందేహముగా బయటపడతాడు. నల్లగోవు, తెల్లగోవు రెండు కూడ తెల్లనిపాలే ఇచ్చినట్లు కృష్ణపక్ష ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి రెండు కూడ వ్రతానుయాయులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడు" అని చెప్పి ముగించాడు.


హరినామ స్మరణం...

సమస్తపాప హరణం

⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️