మార్గశిర మాసం - ముక్తికి మార్గం Margashira Masam - The path to liberation


🌹 నేటి నుంచి మార్గశిర మాసం ప్రారంభం - "మార్గశిర మాసం" - ముక్తికి మార్గం 🌹
🌻 మార్గశిర మాసం విశిష్టత 🌻
ప్రసాద్ భరద్వాజ


🌹 Margashira month begins from today - "Margashira month" - the path to liberation 🌹
🌻 Margashira month's special features 🌻
Prasad Bharadwaja


చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు.

ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.

భగవద్గీతలోని విభూతియోగంలో - "మాసానాం మార్గశీర్షం"

మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.

ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని , సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం , సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి , అగ్నితేజము కూడా మన మనస్సును , బుద్ధిని వికసింపజేస్తాయి .

అందుకే.... మార్గశిర మాసంలో - ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి , శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి.

ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో.


.. 🍀 "ఓం నమో నారాయణాయ'" 🍀

అనే మంత్రాన్ని స్మరించాలి .

ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని , 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.

మార్గశిర శుద్ధ షష్ఠి - 'స్కంద షష్ఠి'.

శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి.

తెలుగువారు దీన్ని ""'సుబ్రహ్మణ్య షష్ఠి'"" అని అంటారు

మార్గశిర శుద్ధ ఏకాదశి - 'వైకుంఠ ఏకాదశి'.

దీనినే 'మోక్ష్తెకాదశి' అని అంటారు .

ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి , శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.

మోక్షదా ఏకాదశి ... "గీతాజయంతి".

సమస్తమానవాళికి ధర్మ నిధి , భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు.

త్రిమూర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు.

ఈ "దత్తాత్రేయ జయంతి" ని మార్గశిరంలోనే శుక్లపూర్ణిమ నాడు జరుపుకుంటారు.

మార్గశిర శుక్ల త్రయోదశినాడు

"హనుమద్‌వ్రతం", "మత్స్యద్వాదశి", "ప్రదోష వ్రతం" ఆచరించడం పరిపాటి .


ఈ మాసంలోనే....

" అనంత తృతీయ , నాగపంచమి , సుబ్రమణ్యషష్టి , పరశురామ జయంతి , సంకటహర చతుర్ధి , ఫలసప్తమి , కాలభైరవాష్టమి , రూపనవమి , సఫలా ఏకాదశి , కృష్ణ (మల్ల) ద్వాదశి , యమదర్శన త్రయోదశి , ప్రదోష వ్రతం , శ్రీమహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుస్సంక్రాంతినే "ధనుర్మాసం" అనిఅంటాము. తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం

కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది.

ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

🌹 🌹 🌹 🌹 🌹

పోలిస్వర్గం పోలి పాడ్యమి శుభాకాంక్షలు భక్తులందరికి Polisvargam Poli Padyami Greetings to all the devotees



🌹 పోలిస్వర్గం పోలి పాడ్యమి శుభాకాంక్షలు భక్తులందరికి - పూజా విధానం, పురాణ గాధ 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Polisvargam Poli Padyami Greetings to all the devotees - Puja method, Purana Gadha 🌹

Prasad Bharadwaja



కార్తీకమాసం కార్తీక నవంబరు 20 అమావాస్యతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది.


అయితే మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజునే పోలి స్వర్గం అని ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీకమాసంలో నియమాలు పాటించి నిత్యం స్నానం, దీపం నియమాలు పాటించిన వారు... పోలిస్వర్గం రోజు వేకువజామునే దీపాలు నీటిలో వదలడంతో వ్రతం పూర్తైందని భావిస్తారు.

నెల రోజులు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారికి పోలిస్వర్గం ముగింపు రోజు అయితే... నెలరోజులూ నియమాలు పాటించనివారు ఆ కార్తీక వ్రత ఫలితాన్ని పొందేందుకు పోలిస్వర్గం రోజు దీపాలు నదిలో విడిచిపెడతారు.

ఈ ఏడాది పోలిస్వర్గం ఎప్పుడు?

సాధారణంగా కార్తీకమాసం అమావాస్య తర్వాత మార్గశిర పాడ్యమి రోజుని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజే దీపాలు విడిచిపెట్టి కార్తీకవ్రతాన్ని ముగిస్తారు. అయితే పోలిస్వర్గం ఈ ఏడాది శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజు అమ్మవారిని ఇంటినుంచి పంపించకూడదని అందుకే ఈ ఏడాది కార్తీక వ్రతం ముగింపు శుక్రవారం కాకుండా శనివారం అనుసరించాలంటున్నారు.

సాధారణంగా పోలి పాడ్యమి శుక్రవారం వచ్చినప్పుడు ఆ రోజు పోలమ్మను స్వర్గానికి పంపించరు. బదులుగా శనివారం చేస్తారు. శుక్రవారం లక్ష్మీదేవి రోజు.. పోలమ్మను లక్ష్మీదేవిగా భావిస్తారు... అందుకే పోలమ్మను స్వర్గానికి శనివారం పంపించాలని చెబుతారు కొందరు పండితులు. ఈ విషయంపై స్థానికంగా మీరు విశ్వసించే పండితులు చెప్పిన విధానం, ఇంటిపెద్దల సలహాలు అనుసరించడం మంచిది..


🍀 ఇంతకీ పోలిస్వర్గం అని ఎందుకంటారు? దీని వెనుకున్న పురాణ కథేంటి? ఈ రోజు ఏం చేయాలి? 🍀

🍁 పోలి పాడ్యమి కథ 🍁


పూర్వకాలంలో ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్లుండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. కానీ ఆ భర్తే ఆమెకు శాపంగా మారింది. ఆ భక్తి చూసి అత్త ఓర్వలేకపోయింది..అందుకే నలుగురు కోడళ్లను ప్రేమగా చూసేది కానీ పోలిని బాధలు పెట్టేది. పూజలు చేయనిచ్చేది కాదు. కార్తీకమాసం రావడంతో నలుగురు కోడళ్లను తీసుకుని నిత్యం నదీ స్నానానికి వెళ్లి అక్కడ దీపాలు వెలిగించేది. చిన్న కోడలు నదికి రాకుండా ఇంట్లో పనులన్నీ చేయించేది. నిరాశచెందని పోలి..అత్త, నలుగురు తోడికోడళ్లు వెళ్లిపోయిన వెంటనే స్నానమాచరించి ఇంటి దగ్గరే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేది. ఇంటి పెరట్లో ఉన్న పత్తిని తీసి ఒత్తి చేసి..వెన్న రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా బుట్ట బోర్లించేది. నెలరోజులూ క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి. ఆఖరి రోజైన మార్గశిర పాడ్యమి రోజు కూడా అంతా నదికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుడిని ప్రార్థించింది పోలి. వెంటనే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన అత్త, నలుగురు తోడికోడళ్లు ఇదేంటి, నెల రోజులు తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకెళుతున్నారని. అందుకు పోలి చేసిన పూజల గురించి చెప్పారు దేవదూతలు. తాము కూడా పోలితో పాటూ స్వర్గానికి వెళ్లాలంటూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూజలు చేయడం కాదు. కల్మషం లేని భక్తితో పూజలు చేసినప్పుడే ఆ పూజలు ఫలిస్తాయని చెప్పారు దేవదూతలు.

కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలి పాడ్యమి రోజు దేవుడి దగ్గర, తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకుని ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గ ప్రాప్తి లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది. నెల రోజులు నియమాలు పాటించని వారు ఈ రోజు 30 వత్తులు వెలిగిస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం. ఈ రోజు దీపదానం ఆచరిస్తే మంచి జరుగుతుంది.

పోలిస్వర్గం కథ పూర్తిగా..తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునే కథ... కార్తీకమాసంలో నిత్యం దీపారాధన, పూజలు చేయడం కాదు..కల్మషం లేకుండా భగవంతుడిని ఆరాధించినప్పుడే మీకు జరగాల్సిన మంచి జరుగుతుందన్నది ఈ కథలో ఆంతర్యం.

🌹🌹🌹🌹🌹

పోలి స్వర్గం పాడ్యమి విశిష్టత The uniqueness of the heavenly world (a YT Short)



https://youtube.com/shorts/au7kbOVLM1g


🌹 పోలి స్వర్గం పాడ్యమి విశిష్టత 🌹
🌹 The uniqueness of the heavenly world 🌹


Prasad Bharadwaja
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



మార్గశిర మాసం విశిష్టత - మార్గశిర మాసం - ముక్తికి మార్గం Margasira Masa Significance - Way To Moksha (A YT video)




https://youtu.be/BU8EqysDC5U


🌹 మార్గశిర మాసం విశిష్టత - మార్గశిర మాసం - ముక్తికి మార్గం MARGASIRA MASA SIGNIFICANCE - WAY TO MOKSHA 🌹

మార్గశిర మాసంలో వచ్చే అన్ని విశిష్ట పండుగల విశేషాలు, చేయవలసిన విధులు ఈ వీడియోలో తెలుసుకోండి. మృగశిర నక్షత్రం కలసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెల మార్గశీర్ష మాసం. “మాసానాం మార్గశీర్షోహం” అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుక మార్గశిర మాసం విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో శివుని, మార్గాశిరంలో విష్ణువును, పుష్యమాసంలో సూర్య భగవానుని ఇలా అయిదు మాసాలలో అయిదు దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని మన మహర్షులు సష్ట పరచారు.

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹