1) 🌹 శ్రీమద్భగవద్గీత - 559 / Bhagavad-Gita - 559 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 128, 129 / Vishnu Sahasranama Contemplation - 128, 129🌹
3)🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 44 / Sri Devi Mahatyam - Durga Saptasati - 44🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 113🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 132 🌹
6) 🌹. శివగీత - 123 / The Siva-Gita - 123🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 59 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 108, 109 / Sri Lalita Chaitanya Vijnanam - 108, 109🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 471 / Bhagavad-Gita - 471🌹
10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 84 📚
11) 🌹. శివ మహా పురాణము - 282🌹
12) 🌹 Light On The Path - 37🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 169🌹
14) 🌹 Seeds Of Consciousness - 233 🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 108🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 72 / Sri Vishnu Sahasranama - 72 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 559 / Bhagavad-Gita - 559 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 02 🌴*
02. . శ్రీభగవానువాచ
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శ్రుణు ||
🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను : దేహధారి పొందిన త్రిగుణముల ననుసరించి శ్రద్ధ సాత్త్వికము, రాజసము, తామసము అనుచు మూడువిధములుగా నున్నది. ఈ విషయమును ఇప్పుడు ఆలకింపుము.
🌷. భాష్యము :
శాస్త్రపు విధినియమములను తెలిసియు బద్ధకత్వము లేదా సోమరితనము కారణముగా వానిని త్యజించు వాడు ప్రకృతి గుణములతో ప్రభావితుడైనట్టివాడు.
పూర్వజన్మమున సత్త్వరజస్తమో గుణములలో తామొనరించిన కర్మల ననుసరించి జీవులు వర్తమానమున ప్రత్యేక గుణమును పొందుచుందురు. ప్రకృతి త్రిగుణములతో జీవునకు గల ఈ సాంగత్యము అనంతకాలముగా సాగుచున్నది. అట్టి ప్రకృతి సంగత్వకారణముగా జీవుడు గుణసంబంధమున వివిధ స్వభావములను పొందుచుండును.
కాని అతడు ఆధ్యాత్మికగురువు యొక్క సాంగత్యము పొంది శాస్త్ర నియమనిబంధనలను పాటించినచో తన గుణస్వభావమును మార్చుకొనగలడు. అనగా మనుజడు క్రమముగా తమోగుణము నుండి సత్త్వగుణమునకు గాని, రజోగుణము నుండి సత్త్వగుణమునకు గాని తన స్థితిని మార్చుకొనగలడు.
సారాంశమేమనగా ఏదేని ఒక ప్రత్యేక గుణమునందలి గ్రుడ్డి నమ్మకము మనుజుని పూర్ణత్వస్థితికి గొనిపోలేదు. అతడు తప్పక ప్రతివిషయము శ్రద్ధ మరియు తెలివితో గురువు సమక్షమున పరిశీలించవలసియుండును. ఆ విధముగా అతడు తన స్థితిని ఉన్నతగుణమునకు మార్చుకొనగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 559 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 17 - The Divisions of Faith - 02 🌴*
02. . śrī-bhagavān uvāca
tri-vidhā bhavati śraddhā
dehināṁ sā svabhāva-jā
sāttvikī rājasī caiva
tāmasī ceti tāṁ śṛṇu
🌷 Translation :
The Supreme Personality of Godhead said: According to the modes of nature acquired by the embodied soul, one’s faith can be of three kinds – in goodness, in passion or in ignorance. Now hear about this.
🌹 Purport :
Those who know the rules and regulations of the scriptures but out of laziness or indolence give up following these rules and regulations are governed by the modes of material nature. According to their previous activities in the mode of goodness, passion or ignorance, they acquire a nature which is of a specific quality.
The association of the living entity with the different modes of nature has been going on perpetually; since the living entity is in contact with material nature, he acquires different types of mentality according to his association with the material modes. But this nature can be changed if one associates with a bona fide spiritual master and abides by his rules and the scriptures.
Gradually, one can change his position from ignorance to goodness, or from passion to goodness. The conclusion is that blind faith in a particular mode of nature cannot help a person become elevated to the perfectional stage.
One has to consider things carefully, with intelligence, in the association of a bona fide spiritual master. Thus one can change his position to a higher mode of nature.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 128, 129 / Vishnu Sahasranama Contemplation - 128, 129 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻128. వేదవిత్, वेदवित्, Vedavit🌻*
*ఓం వేదవిదే నమః | ॐ वेदविदे नमः | OM Vedavide namaḥ*
వేదం వేదార్థంచ యథావద్ వేత్తి వేదమును, వేదము వలన తెలియదగు వాస్తవతత్త్వమైన వేదార్థమును కూడా వాస్తవ రూపమున ఎరుగువాడు.
:: భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్స్మృతిర్జ్ఞాన మపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ॥ 15 ॥
నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందుండువాడను; నావలననే జీవునకు జ్ఞాపకశక్తి, జ్ఞానము, మఱపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను. మఱియు వేదము నెఱిగినవాడనుగూడ నేనే అయియున్నాను.
:: మహాభారతము ::
సర్వే వేదాః సర్వవేద్యాః సశాస్త్రా ।
సర్వే యజ్ఞాః సర్వ ఇజ్యాశ్చ కృష్ణః ।
విదుః కృష్ణం బ్రాహమణా స్తత్త్వతో యే ।
తేషాం రాజన్ సర్వయజ్ఞాః సమాప్తాః ॥
రాజా! సర్వవేదములును సర్వవేద్యములును, సర్వయజ్ఞములును, యజ్ఞములద్వారా ఆరాధించబడు సర్వదేవతలును కృష్ణుడే! ఏ బ్రహ్మతత్త్వవేత్తలు కృష్ణుని వాస్తవరూపమున ఎరుగుదురో వారికి సర్వ యజ్ఞ ఫలములును లెస్సగా పొందబడినవియే యగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 128🌹*
📚. Prasad Bharadwaj
*🌻128.Vedavit🌻*
*OM Vedavide namaḥ*
Vedaṃ vedārthaṃca yathāvad vetti / वेदं वेदार्थंच यथावद् वेत्ति He who knows the Vedās and the true essence of Vedās as well is Vedavit.
Bhagavad Gītā - Chapter 15
Sarvasya cāhaṃ hr̥di sanniviṣṭo mattaḥ ssmr̥tirjñāna mapohanaṃ ca,
Vedaiśca sarvairahameva vedyo vedāntakr̥dvedavideva cāham. (15)
:: श्रीमद्भगवद्गीता - पुरुषोत्तमप्राप्ति योग ::
सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्स्मृतिर्ज्ञान मपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् ॥ १५ ॥
I am seated in the hearts of all. From Me are memory, knowledge and their loss. I alone am the object to be known through all the Vedās; I am also the originator of the Vedānta and I myself am the knower of the Vedās.
Mahābhārata
Sarve vedāḥ sarvavedyāḥ saśāstrā,
Sarve yajñāḥ sarva ijyāśca kr̥ṣṇaḥ,
Viduḥ kr̥ṣṇaṃ brāhamaṇā stattvato ye,
Teṣāṃ rājan sarvayajñāḥ samāptāḥ.
:: महाभारत ::
सर्वे वेदाः सर्ववेद्याः सशास्त्रा ।
सर्वे यज्ञाः सर्व इज्याश्च कृष्णः ।
विदुः कृष्णं ब्राहमणा स्तत्त्वतो ये ।
तेषां राजन् सर्वयज्ञाः समाप्ताः ॥
All the Vedās, Śastrās, Yajñās and homās are Kr̥ṣṇa. Those Brāhmaṇās that know Kr̥ṣṇa in reality have performed all the yajñās.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः ।वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥
సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః ।వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥
Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ ।Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 129 / Vishnu Sahasranama Contemplation - 129🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻129. అవ్యఙ్గః, अव्यङ्गः, Avyaṅgaḥ🌻*
*ఓం అవ్యఙ్గాయ నమః | ॐ अव्यङ्गाय नमः | OM Avyaṅgāya namaḥ*
వ్యంగుడు అనగా అవయవములు సరిగా లేనివాడు. వ్యంగుడు కాని వాడు అవ్యంగుడు. జ్ఞానము, ఐశ్వర్యము లేదా ఈశ్వరత్వము, వైరాగ్యము, వీర్యము, యశము, శ్రీ అను ఈ మొదలగు సమస్తావయవములతో సమగ్రుడు అవ్యంగుడు.
లేదా వ్యంగ యస్య న విద్యతే స్పష్టరూపమున ప్రకాశమునంది ఎల్ల ప్రాణులకును సులభుడై గోచరించనివాడు.
:: భగవద్గీత - సాఙ్ఖ్య యోగము ::
అవ్యక్తోఽయమచిన్త్యోఽయమవికార్యోఽయముచ్యతే ।
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ॥ 25 ॥
అది ఇంద్రియములకు గోచరముకానిది, మనస్సుచే చింతింపశక్యము కానిది, వికారములు బోదింపదగనిది. కావున ఈ ప్రకారము తెలిసికొని నీవు దుఃఖింపతగవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 129🌹*
📚. Prasad Bharadwaj
*🌻129. Avyaṅgaḥ🌻*
*OM Avyaṅgāya namaḥ*
One who is self-fulfilled by knowledge and other great attributes and is free from every defect.
Vyaṅga yasya na vidyate / व्यङ्ग यस्य न विद्यते One who is not manifest to the senses.
Bhagavad Gītā - Chapter 2
Avyakto’yamacintyo’yamavikāryo’yamucyate,
Tasmādevaṃ viditvainaṃ nānuśocitumarhasi. (25)
:: श्रीमद्भगवद्गीता - साङ्ख्य योग ::
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥ २५ ॥
It is said that This is unmanifest; This is inconceivable; This is unchangeable. Therefore having known This thus, you ought not to grieve.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः ।वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥
సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః ।వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥
Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ ।Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 44 / Sri Devi Mahatyam - Durga Saptasati - 44 🌹*
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
*అధ్యాయము 12*
*🌻. ఫలశ్రుతి - 2 🌻*
10. బలి ఇచ్చేడప్పుడు, పూజ చేసేడప్పుడు, అగ్నికార్యం ఒనర్చేడప్పుడు, మహోత్సవ సందర్భాలలో ఈ నా చరిత్రమంతా చదువడమో వినడమూ జరగాలి.
11. పై విధంగా ఒనర్చితే ఆ బలిపూజను, ఆ అగ్నికార్యాన్ని తెలిసి చేసినా, తెలియక చేసినా నేను వాటిని ప్రీతితో పరిగ్రహిస్తాను.
12-13. ప్రతి సంవత్సరం శరత్కాలంలో మహాపూజ జరిగేడప్పుడు, ఈ నా మాహాత్మ్యాన్ని భక్తితో వినేవారు నా అనుగ్రహం వల్ల సర్వవిపద్వేదవల నుండియు విమోచన మంది, ధనధాన్య పుత్ర లాభమును నిస్సంశయముగా పొందుదురు.
14. నా గీ మాహాత్మ్యం, మంగళప్రదమైన నా ఉద్భవం, యుద్ధంలో నేను చూపిన పరాక్రమం వినే జనులు భయరహితులవుతారు.
15. నా మాహాత్మ్యాన్ని వినేవారికి శత్రువులు పూర్తిగా నశిస్తారు, శుభం కలిగి, వారి కుటుంబాలు సంతసిస్తాయి.
16. శాంతికర్మలు జరిగేటప్పుడు, చెడు కలలు వచ్చినప్పుడు, భయంకరమైన గ్రహపీడ కలిగిన ప్రతిచోట నా మాహాత్మ్యాన్ని వింటారు గాక!
17. "అలా చేస్తే, దుశ్శకునాలు, చెడుకలలు, భయంకరమైన గ్రహపీడలు నరునికి వస్తే శమిస్తాయి. మంచి కలలు వస్తాయి.
18. బాలగ్రహముల సోకితే బిడ్డలకు శాంతి కలుగుతుంది. నరుల కూడికలో చీలికలు కలిగితే మళ్ళీ నెయ్యము నెలకొల్పడానికి ఇది శ్రేష్ఠగుణం కలది.
19. చెడుత్రోవలు పట్టే వారందరి బలాన్ని ఇది సంపూర్ణంగా అణచివేస్తుంది. దీని పఠన మాత్రంతోనే రాక్షస భూత పిశాచాలు నశిస్తాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 44 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
*CHAPTER 12*
*🌻 Eulogy of the Merits - 2 🌻*
10. ‘When sacrifice is offered, during worship, in the fire-ceremony, and at a great festival, all this poem on my acts must be chanted and heard.
11. ‘I will accept with love the sacrifice and worship that are made and the fire-offering that is offered likewise, whether they are done with due knowledge (of sacrifice) or not.
12-13. ‘During autumnal season, when the great annual worship is performed, the man hearing this glorification of mine with devotion shall certainly through my grace, be delivered without doubt from all troubles and be blessed with riches, grains and children.
14. ‘Hearing this glorification and auspicious appearances of mine, and my feats of prowess in battles, a man becomes fearless.
15. ‘Enemies perish, welfare accrues and the family rejoices for those who listen to this glorification of mine.
16. ‘Let one listen to this glorification of mine everywhere, at a propitiatory ceremony, on seeing a bad dream, and when there is the great evil influence of planets.
17. ‘(By that means) evil portents subside, as also the unfavourable influence of planets, and the bad dream seen by men turns into a good dream.
18. ‘It creates peacefulness in children possessed by the seizes of children (i.e., evil spirits), and it is the best promoter of friendship among men when split occurs in their union.
19. ‘It diminishes most effectively the power of all men of evil ways. Verily demons, goblins, and ogres are destroyed by its mere chanting.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 112 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము -42 🌻*
పరమాత్మను దర్శింపగోరువారు ముందు వాక్కును అనగా కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, విషయములందు పోనీయక, వాటి నుండి మరల్చి, మనస్సునందు చేర్చవలెను.
ఇంద్రియములు గోళకముల ద్వారా బహిర్గతమై, రూపాదులను దహించుచున్నది. అట్లు గోళకముల ద్వారా బయటకు వ్యాపించకుండా, ఇంద్రియములు తమ స్వస్థానములో ఉండునట్లు చూడవలెను. అచట నుండి వాటికి అంతరముగా ఉన్న మనస్సునందు చేర్చవలెను. అప్పుడు మనస్సు కూడా బహిర్ముఖము కాకుండా స్వస్థానంలో ఉండును.
ఆ మనస్సును బుద్ధి యందు చేర్చవలెను. మనస్సు బాహ్యవిషయముల నుండి మరలినప్పుడు బుద్ధికి స్థూల విషయములను నిశ్చయించవలసిన అవసరము లేకపోవుట చేత ఏకాగ్రమై సూక్ష్మవస్తువులను పరిశీలించగలుగును. అట్టి బుద్ధిని తనకు అంతరముగా వున్న మహతత్త్వమునందు చేర్చవలెను. ఆ మహతత్త్వమును ఆత్మయందు చేర్చవలెను. సాంఖ్య విచారణచే సాధకులకు ఈ విధానము చాలా ఉపయోగముగా ఉండును.
ఈ రకముగా క్రమంగా ఎట్లా మరలించాలి? విరమించాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తు్న్నారు. బోధిస్తున్నారు. అంటే, సాధకులకు మొట్టమొదటిది వాక్ సంయమనం. అనగా మనో సంయమనము సాధించాలి, మనో జయాన్ని సాధించాలి అనేటువంటి సాధకులందిరికీ కూడా మొదట్టమొదటిది వాక్ సంయమనము.
అనగా అర్థం ఏమిటంటే, ఈ శరీరం అనే కోటకి, రెండు ద్వారములు ఉన్నాయి. ఒకటి ప్రధాన ద్వారము రాజద్వారము జిహ్వేంద్రియము. అట్లానే వెనుక ద్వారము ఉపస్థేంద్రియము. అంటే పునరుత్పత్తి కార్యక్రమములో పాల్గొనేటటువంటి ఉపస్థేంద్రియమేమో వెనుక ద్వారము.
అలాగే జిహ్వేంద్రియము. ఎప్పుడూ రెండు రెండు పనులు చేస్తుంది. రెండు రెండు పనులు చేసేటువంటి ఇంద్రియములు ఇవి రెండే. ఈ రెండింటి మీద అదుపు సంపాదిస్తే, వీటిని కనుక స్వాధీనమొనర్చుకొనగలిగితే, సాధకులకి యాభై శాతము విజయము వచ్చినట్లే!
అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోళకం కానీ, ఒక్కొక్క ఇంద్రియము కానీ, ఒక్కొక్క శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ.... తన్మాత్ర గానీ, లేదా సాక్షిగా ఉండవలసిన మనస్సులోనే బలహీనతగానీ లేదా బుద్ధియందే బలహీనతగానీ, వారి వారి యొక్క స్థితిని వారు స్వాధ్యాయం చేయాలన్నమాట! అధ్యయనం చేయాలి. ఎందుకంటే, ప్రతీరోజు తప్పక తమను తాము పరిశీలించుకొనడం అనే పనిని చేపట్టాలి. తనకి ఎక్కడ బలహీనత ఉంది? అనేది తానే గుర్తించాలి.
డాక్టరుగారి వద్దకు వెళ్ళినప్పుడు, ఏమండీ! నాకేమి సమస్య ఉందో మీరే గుర్తించాలి...! అన్నామనుకో? అప్పుడు వైద్యం ఎలా చేస్తాడు? చేయలేడు కదా! నీ సమస్య ఏమిటో, నువ్వు చెబితే తప్ప, దానిని ఆరోగ్యశాస్త్ర రీత్యా పరిశీలించి, ఏమి సలహా ఇవ్వాలో, ఏమి వైద్యం చేయాలో, ఆ విచారణ చేసి దాని ప్రకారం నీకు సహాయపడ గలుగుతాడు.
అట్లానే గురువుకూడా స్వాధ్యయన శీలియైనటువంటి సాధకుడికి మాత్రమే ఉపయోగపడగలుగుతాడు. అంతా మీరే గురువుగారు, అంతా మీరే గురువుగారు అని మనం ఎన్ని సార్లు చెప్పినప్పటికీ, నీ సమస్య ఏమిటో నువ్వు స్పష్టంగా గుర్తు పట్టగలిగేటటువంటి స్థాయికి ఎదిగేటట్లు చేస్తారు మొట్టమొదట.
అందుకనే ప్రతి ఒక్కరిని నాలుగు సంధ్యలలో ఉపాసనా క్రమాన్ని, ధ్యాన విశేషాల్ని, సాధనా బలాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయమని చెప్పేది. దాని వల్ల ఏమౌతుంది అంటే, ఒక సరైనటువంటి, క్రమమైనటువంటి, క్రమశిక్షణతో కూడినటువంటి, యమనియమాలతో కూడినటువంటి, ఆసనసిద్ధితో కూడినటువంటి, మనస్సుద్ధికారకమైనటువంటి, చిత్తశుద్ధి కారకమైనటువంటి జీవన ప్రయాణాన్ని నువ్వు కనుక చేస్తూవున్నప్పుడు తద్భిన్నమైన, తద్విరుద్ధమైన, తద్వ్యతిరిక్తమైన, ఆలోచనలు గానీ, స్వభావయుత ప్రేరణలు గానీ లేదా అరిషడ్వర్గాల యొక్క ఉత్ప్రేరకమైనటువంటి పరిస్థితులు గానీ, ఏవైనా ఏర్పడుతున్నప్పుడు నువ్వు సూక్ష్మంగా గుర్తించ గలిగేటటువంటి శక్తి నీకు కలుగుతుంది.
కలిగి వాటి నుంచి ఎలా విరమించాలి? అనేటటువంటి ప్రాధాన్యతని నువ్వు లక్ష్యం కొరకు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి, ఏ రకమైనటువంటి యమనియమాదులు లేకుండా కేవలం విషయవ్యావృత్తితోటి, విషయానురక్తులై జీవించేటటువంటి వారు ఈ సాధన బలాన్ని పొందలేరన్నమాట!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 133 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
125
The paths of worship vary depending on the differences between the practicants and their eligibility. That is why, here, they are initiating us into this special path of knowledge. The sloka says, “visuddha jnana yogatah”. A question arises here.
Among all knowledge, are there things like impure knowledge and pure knowledge? We may wonder if it is it not enough to just refer to it as “knowledge”. True. There is only pure knowledge. But, first, the bad thoughts piling up in you in so many different ways, in so many different aspects and in various different corners need to be eliminated.
Until then, you will not realize that knowledge. To drive away each aspect of your ignorance, each aspect of knowledge needs to be given to you. None of these directly confer you with self-realization. That is why these do not comprise pure (visuddha) knowledge .
But, since these rid you of a certain kind of ignorance, these comprise knowledge. That is why, this is referred to as impure (asuddha) knowledge.For example, take the sciences or the scriptures. If we use them properly, the impure knowledge will be the steps that lead us to pure knowledge.
Those that attain that path will attain the path of Jnana Yoga in their spiritual practice. Beginners often ask a stupid question, “How long do we have to do this worship?” The following answer is being given
Sloka:
Yavattisthati dehosau tavaddevi gurum smaret |Gurulopo na kartavyo nishtitopyadvaye pare ||
Siva says to Parvati that as long as the body exists, Guru has be meditated upon. Even if one is following the all-important non-dual discipline, one should not ignore the worship of Guru. We are given this body so we can worship God.
That is why, as long as the body is there, even if there is just one second left for the body, one must worship God. When they say “as long as the body exists”, it means, as long as the feeling that the body is mine, exists. First, this feeling should be destroyed and burnt away.
For this to happen, it may take several eons. In the meanwhile, you may receive different kinds of knowledge, some of it may be knowledge of non-duality to rid you of your ignorance. That is why they are talking about what happens in the meanwhile. Regardless, as long as the feeling that this body is yours exists, the worship of the Guru must continue.
This is a must. A question may arise here. Once we receive knowledge of non-duality (that the Guru and I are not separate), why should one continue to meditate? Because, at that point, it means that the Guru is meditating upon himself.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 123 / The Siva-Gita - 123 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 16
*🌻. మొక్షాదికారి నిరూపణము - 4 🌻*
పాతకే నాపి యుక్తో వా - ధ్యానా దేవ విముచ్యతే,
నేహాభి క్రమ నాశోస్తి - ప్రత్య వాయోన విద్యతే 16
స్వల్ప మప్యస్య ధర్మస్య -త్రాయతే మహతో భయాత్,
ఆశ్చర్యే వాభయే శోకే -క్షుతే వా మను నామయః 17
వ్యాజే నాపి స్మరన్మర్త్య - స్సయాతి పరమాం గతిమ్,
మహాపాపై రపి స్స్రు ష్టో - దేహాంతే యస్తు మాం స్మరేత్ 18
పంచాక్షరీం నో చ్చరతి -సయుక్తో నాత్ర సంశయః,
విశ్వం శివ మయం యస్తు - పశ్యత్యా త్మాన మాత్మనా 19
తస్య క్షేత్రే షు తీర్దేషు - కిం కార్యం వాన్య కర్మసు,
సర్వేణ సర్వదా కార్యం - భూతి రుద్రాక్ష ధారణమ్ 20
యుక్తే నాదాప్య యుక్తేన -శివ భక్తి మభీప్సతా,
నరో భస్మ సమాయుక్తో - రుద్రాక్షా న్యస్తు ధారయేత్ 21
ఈ ధ్యానమునకు ఆరంభ నాశములు లేవు. పాపము లేదు . ధర్మ సంబందమైనది చిన్నదైనను గొప్ప భయము (ఆపద ) వలన రక్షించును.
(ధ్యానము చేయు వానికి ఇతర భయము లేవి యుండువు) ఆశ్చర్య భయ శోక వ్యాజక్ష తములతోను నా నామమునుచ్చరించి నంతనే పరమ గతి నొందును.
(వ్యాజ మనగా నేదో మొక మిష సాకు పైన ఒక పేరు చెప్పుటలో వాడు శివా యని యుచ్చరిం చుట, క్షుతమున తుమ్ముట, తుమ్మి సంకీర్తన చేయుట ) మహాపాపముతో కూడిన వాడును, అవసానంబున నన్ను స్మరించినను పంచాక్షరీ మంత్రము నుచ్చరిం చినను ముక్తి గాంచుటలో సంశయమే మాత్రమును లేదు.
ప్రపంచమును శివ మయముగా దలచి నిర్మలమైన మనస్సు చేత పరమాత్మను సాక్షాత్క రించు వానికి తీర్దో క్షేత్రాది గమనముతో నగత్యము కూడ లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 123 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 16
*🌻 Mokshadhikari Nirupanam - 4 🌻*
There is no beginning or end to Dhyanam. One who meditates he becomes freed of all fears. Even by surprise or by fear or by sorrow one who utters my name attains to great virtues (parama gati).
Even a person who is a great sinner (mahapaapi), if by any means or due to any reason if just remembers me once or utters the Panchakshari Mantra (om namah Shivaya) once he would gain liberation beyond doubt.
One who sees this entire universe as Shivamayam (of being Shiva's form), he doesn't require to visit any sacred places of pilgrimage.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 59 / Sri Lalitha Sahasra Nama Stotram - 59 🌹
ప్రసాద్ భరద్వాజ
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 109, 110 / Sri Lalitha Chaitanya Vijnanam - 109, 110 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |*
*మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ‖ 40 ‖*
*🌻 109. 'మహాసక్తి' 🌻*
మహాసక్తి అనగా మహత్తరమైన శక్తి. శ్రీదేవి ఆసక్తి కలది అని అర్థము.
ఆసక్తి అనగా ఉత్సవరూప. అమితమైన ఉత్సాహము కలది శ్రీదేవి. ఆమె శివునితో సమయోగము నుండుటచే నిత్యము ఉత్సవము నందుండును. పరమాత్మతో యోగము చెందినవారు పరమానంద భరితులై ఉందురు. అట్టి యోగమున శివుని సహరూపమునుగొని సమయోగమున నిలచినదే శ్రీదేవి. ఆమె నారాధించిన వారికి అట్టి యోగస్థితిని ఆమె అనుగ్రహింప గలదు. ఆమె ఉద్భవమే ఉత్సాహ భరితము. ప్రజ్ఞా ప్రకృతుల సంయోగమున నున్న యోగులు కూడ అట్లే ఉత్సాహభరితులై యుందురు. మేలుకొనినది మొదలు నిదురించువరకు అట్టి ఉత్సాహముననే వారు జీవింతురు.
సృష్టియందు శివతత్త్వము అగ్నియై నిలచుటచే, అగ్ని తేజస్సు నందు ఆసక్తి కలది అనికూడ భావింపవచ్చును. సృష్టియందు నామ రూప సామ్యమును పొందుటయందుకూడ శ్రీదేవికి ఆసక్తి కలదు. తత్త్వమునకు గుణరూపము నేర్పరచి ఉత్సహించుచు నుండును. ఒంటి నలుగుతో వినాయకుని సృష్టించుట యందు ఈ ఉత్సాహమును కనపరచును.
అదే విధముగ ఆత్మ సమాగమమునందు కూడ ఆసక్తి కలది శ్రీదేవి. సృష్టితోను, శివునితోను సమాగమము చెంది చైతన్య స్వరూపిణియై అమితానందమును ఎల్లప్పుడునూ పొందుచు నున్నది శ్రీదేవి. ఆమె ఆసక్తి వర్ణనాతీతము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 109 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
Mahāsaktiḥ महासक्तिः (109)
Maha means festivals and asaktiḥ means great liking. She has a great liking for festivities. Here festival means Her union with Śiva. Festivities are of two kinds.
One that is celebrated internally (associated with mind) and another is external worship (associated with body). If this nāma is interpreted, based on Saundarya Laharī (verse 9) mahīṁ mūlādhāre, (meaning – the earth is placed in mūlādhāra) then it means only internal worship, worshipping Her subtlest form Kuṇḍalinī.
She likes internal worship. Maha means supremacy, ā means on all sides and Śaktī means supreme. Her supreme power is spread across everywhere. In this context, this nāma means that She is the Supreme power.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 110 / Sri Lalitha Chaitanya Vijnanam - 110 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |*
*మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ‖ 40 ‖*
*🌻 110. 'కుండలినీ' 🌻*
కుండలములు కలది శ్రీదేవి అని అర్ధము.
గోళాకారముగా సృష్టి నిర్మాణము గావించి, అందుండి అండాకారములుగా బ్రహ్మాండమునుండి పిండాండము వరకు సృష్టి నిర్మాణము చేయునది శ్రీలలిత అని అర్థము. మూలాధారమందలి అగ్ని తేజస్సు యందు ఉన్న జీవశక్తి కుండలినే.
తేజోరూపమైన ప్రాణాకారము కలిగి సర్పమువలె మూలమున స్థితిగొని యుండి, సుషుమ్న మార్గమున సహస్రారము వరకు వ్యాపింపగల తేజస్విని కుండలిని. ప్రాణుల యందలి జీవచైతన్యమే కుండలిని. ఈ కుండలినీ మార్గము సృష్టియందు సత్యలోకము నుండి భూలోకము వరకు తీగవలె చుట్టలు చుట్టలుగా వ్యాపించి యుండును.
భూమండలము, సూర్యమండలము, సవితృ మండలము, భర్గోదేవ మండలము వ్యాపించి సర్వమును నిర్వర్తించుచు నుండును. వాక్కు రూపమున ఉద్భవించునది కనుక వాగ్భవ అని కూడ కుండలినీ చైతన్యమును పిలుతురు. జీవ చైతన్యము ఏ లోకమున స్థితి గొనినదో ఆ లోకము వరకు వ్యాపించి కుండలిని యుండును.
మానవునియందు భౌతిక, ప్రాణమయ, మనోమయ కోశముల యందు వ్యాపించి, విజ్ఞానమయపు అంచుల వరకు కుండలినీ చైతన్యమున్నదని తెలుపుదురు. కారణము ఏమనగా మానవునికి భౌతికము, ప్రాణమయము, మనోమయము అగు లోకములు అవగతమై ఉండుటయే.
కొంత బుద్ధికూడ ప్రతిమానవునియందును ఉండుటచే, మూడున్నర చుట్టలుగా కుండలినీ చైతన్యమున్నదని అందురు. బుద్ధిలోకమున ప్రవేశించిన వారికి కుండలిని నాలుగు చుట్టలుగ ఉండును.
అట్లే ఆనందమయ లోకమున ఐదుగను, అనుపాదక లోకమున ఆరుగను, ఆదిలోకమున ఏడుగను చుట్టలు గలిగి యుండును. ఏడు చుట్టల కుండలినీ చైతన్యము వ్యాపించినపుడు, సహస్రారమందలి శివతత్త్వముతో చేరినప్పుడు, సుస్థిరురాలై యుండును. కుండలినీ చైతన్యము ఊర్ధ్వగతి చెందుట యనగా జీవుడు పరిణతి చెందుటయే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 110 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Kuṇḍalinī कुण्डलिनी (110) 🌻*
She is in the form of a three and a half coiled snake in mūlādhāra cakra. Her subtlest form is described in this single nāma. Her subtler form kāmakalā (nāma 322) is also described in a single nāma. But Vāc Devi-s used nāmas 13 to 54 to describe Her subtle form. This also goes to prove the importance of internal worship or meditation than the external rituals.
The vital energy of prāṇa is called kuṇḍalinī. This lies in the mūlādhāra cakra in the midst of fire that keeps biological body warm. Any modification in the intensity of this fire causes sickness. The sound of the Kuṇḍalinī can be felt by anyone. If one closes both his ears tightly, he can listen to a hissing sound, the sound of Kuṇḍalinī from within.
The base cakra is a triangle where icchā, jñāna and kriyā śakti-s (desire, knowledge and action) form the three sides. From these three śakti-s (potencies) the sound of OM a, u and m is generated.
Yoga-vāsiṣṭha (the compendium of teachings of sage Vāsiṣṭha to Lord Rāma) in nirvāna prakaraṇa (the last of six chapters) talks about Kuṇḍalinī. Sage Vāsiṣṭha says to Lord Rāma “Like the coiled body of a serpent when it sleeps…like a plantain flower it is exceedingly delicate within…hissing like an angry female serpent…causing fluctuations in the mind. All other nādi-s are connected with this.
This becomes purified only by the rays of jñāna or knowledge….thus this Śaktī rejoices in the name of puryaṣṭaka. Should the upward and downward actions of this Kuṇḍalinī śakti be arrested by the control of prāṇa and this prāṇa be made to rest in the heart, diseases will never affect those who have such control.” Yoga-vāsiṣṭha also talks about siddhi-s.
Kānci Paramācāryā in his magnum opus ‘Voice of God’ observed the following about Kuṇḍalinī yoga: “Kuṇḍalinī yoga is not the only path available to the seeker. Choose any path other than it, adhere to it with a mind that is one-pointed and with faith and sincerity.
As you advance to a high state on this path, your breathing will change automatically and it will be similar to that of one practising yoga-s. You may even be aware of it; the breathing will change on its own” and after saying that one’s breath will undergo modifications, he says, “....the movement of breath will impinge on the nerves in the roof of our head and touching the feet of Ambāl (referring to Śaktī) create a flow of ambrosia. Even in worldly life when we are in ecstasy of delight our breathing stops and we faint.
In this there is reflection of the emotion experienced by us during kumbhaka (holding breath). During this time we excalim: ‘Ah, I feel cool in the crown of my head.’ This also means that a tiny droplet of the ambrosia has trickleld on the nerves in the crown of the head. I have said this to show that even by following the path of devotion you can have inward experience of sublime nature.”
Viṣṇu Sahasranāma nāma 907 is kuṇḍaline.
{Further reading on puryaṣṭaka: (as told by sage Vāsiṣṭha to Lord Rama in Yoga-vāsiṣṭha - VI.5).
Brahman who is without beginning or end and which is the seed of the universe, becoming differentiated is jīva (soul); subjecting itself to the idea of separateness, it becomes ahaṃkāra (ego) with manana (contemplation), it becomes manas (mind); with the certainty of intelligence, it becomes buddhi (intellect); then the five elements (sound, etc) through indriyā-s (sensory organs).
With the thought of the body, it becomes the body itself; with the thought of a vessel, it becomes the vessel. A form (subtle body), having such a nature is called puryaṣṭaka body or eight constituents of the body. The eight constituents are mind, ego, intellect, sound, touch, sight, taste and smell, the last five together known as tanmātra-s.}
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 471 / Bhagavad-Gita - 471 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 16 🌴*
16. బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ |
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్ ||
🌷. తాత్పర్యం :
పరమాత్ముడు స్థావర, జంగములైన సర్వజీవుల అంతర్భాహ్యములలో నిలిచియుండును. సూక్ష్మత్వకారణముగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడును, ఆగ్రాహ్యుడును అయియున్నాడు. అతిదూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపముననే ఉండును.
🌷. భాష్యము :
పరమపురుషుడైన నారాయణుడు ప్రతిజీవి యొక్క అంతర్భాహ్యములలో నిలిచియుండునని వేదవాజ్మయము ద్వారా మనము తెలిసికొనగలము.
అతడు భౌతిక, ఆధ్యాత్మిక జగత్తులు రెండింటి యందును నిలిచియున్నాడు. అతడు అత్యంత దూరమున ఉన్నను మనకు సమీపముననే యుండును. ఇవియన్నియును వేదవచనములు. ఈ విషయమున కఠోపనిషత్తు (1.2.21) “ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వత:” అని పలికినది.
దివ్యానందమగ్నుడైన ఆ పరమపురుషుడు ఎట్లు తన ఐశ్వర్యముల ననుభవించునో మనము అవగతము చేసికొనజాలము. ఈ భౌతికేంద్రియములతో ఈ విషయమును గాంచుట గాని, అవగతము చేసికొనుట గాని చేయజాలము.
కనుకనే అతనిని తెలియుట యందు మన భౌతిక మనో, ఇంద్రియములు పనిచేయజాలవని వేదములు పలుకుచున్నవి. కాని కృష్ణభక్తిరసభావనలో భక్తియోగమును అవలంబించుచు మనస్సును, ఇంద్రియములను పవితమొనర్చుకొనినవాడు అతనిని నిత్యము గాంచగలడు.
శ్రీకృష్ణభగవానుని యెడ ప్రేమను వృద్ధిగావించుకొనినవాడు అతనిని నిర్విరామముగా నిత్యము గాంచగలడని బ్రహ్మసంహిత యందు నిర్ధారింపబడినది. భక్తియుక్తసేవ ద్వారానే అతడి దర్శింపబడి అవగతమగునని భగవద్గీత (11.54) యందును ఈ విషయము నిర్ధారింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 471 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 16 🌴*
16. bahir antaś ca bhūtānām
acaraṁ caram eva ca
sūkṣmatvāt tad avijñeyaṁ
dūra-sthaṁ cāntike ca tat
🌷 Translation :
The Supreme Truth exists outside and inside of all living beings, the moving and the nonmoving. Because He is subtle, He is beyond the power of the material senses to see or to know. Although far, far away, He is also near to all.
🌹 Purport :
In Vedic literature we understand that Nārāyaṇa, the Supreme Person, is residing both outside and inside of every living entity. He is present in both the spiritual and material worlds.
Although He is far, far away, still He is near to us. These are the statements of Vedic literature. Āsīno dūraṁ vrajati śayāno yāti sarvataḥ (Kaṭha Upaniṣad 1.2.21). And because He is always engaged in transcendental bliss, we cannot understand how He is enjoying His full opulence. We cannot see or understand with these material senses.
Therefore in the Vedic language it is said that to understand Him our material mind and senses cannot act. But one who has purified his mind and senses by practicing Kṛṣṇa consciousness in devotional service can see Him constantly.
It is confirmed in Brahma-saṁhitā that the devotee who has developed love for the Supreme God can see Him always, without cessation. And it is confirmed in Bhagavad-gītā (11.54) that He can be seen and understood only by devotional service. Bhaktyā tv ananyayā śakyaḥ.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹