🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 16
🌻. మొక్షాదికారి నిరూపణము - 4 🌻
పాతకే నాపి యుక్తో వా - ధ్యానా దేవ విముచ్యతే,
నేహాభి క్రమ నాశోస్తి - ప్రత్య వాయోన విద్యతే 16
స్వల్ప మప్యస్య ధర్మస్య -త్రాయతే మహతో భయాత్,
ఆశ్చర్యే వాభయే శోకే -క్షుతే వా మను నామయః 17
వ్యాజే నాపి స్మరన్మర్త్య - స్సయాతి పరమాం గతిమ్,
మహాపాపై రపి స్స్రు ష్టో - దేహాంతే యస్తు మాం స్మరేత్ 18
పంచాక్షరీం నో చ్చరతి -సయుక్తో నాత్ర సంశయః,
విశ్వం శివ మయం యస్తు - పశ్యత్యా త్మాన మాత్మనా 19
తస్య క్షేత్రే షు తీర్దేషు - కిం కార్యం వాన్య కర్మసు,
సర్వేణ సర్వదా కార్యం - భూతి రుద్రాక్ష ధారణమ్ 20
యుక్తే నాదాప్య యుక్తేన -శివ భక్తి మభీప్సతా,
నరో భస్మ సమాయుక్తో - రుద్రాక్షా న్యస్తు ధారయేత్ 21
ఈ ధ్యానమునకు ఆరంభ నాశములు లేవు. పాపము లేదు . ధర్మ సంబందమైనది చిన్నదైనను గొప్ప భయము (ఆపద ) వలన రక్షించును.
(ధ్యానము చేయు వానికి ఇతర భయము లేవి యుండువు) ఆశ్చర్య భయ శోక వ్యాజక్ష తములతోను నా నామమునుచ్చరించి నంతనే పరమ గతి నొందును.
(వ్యాజ మనగా నేదో మొక మిష సాకు పైన ఒక పేరు చెప్పుటలో వాడు శివా యని యుచ్చరిం చుట, క్షుతమున తుమ్ముట, తుమ్మి సంకీర్తన చేయుట ) మహాపాపముతో కూడిన వాడును, అవసానంబున నన్ను స్మరించినను పంచాక్షరీ మంత్రము నుచ్చరిం చినను ముక్తి గాంచుటలో సంశయమే మాత్రమును లేదు.
ప్రపంచమును శివ మయముగా దలచి నిర్మలమైన మనస్సు చేత పరమాత్మను సాక్షాత్క రించు వానికి తీర్దో క్షేత్రాది గమనముతో నగత్యము కూడ లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 123 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 16
🌻 Mokshadhikari Nirupanam - 4 🌻
There is no beginning or end to Dhyanam. One who meditates he becomes freed of all fears. Even by surprise or by fear or by sorrow one who utters my name attains to great virtues (parama gati).
Even a person who is a great sinner (mahapaapi), if by any means or due to any reason if just remembers me once or utters the Panchakshari Mantra (om namah Shivaya) once he would gain liberation beyond doubt.
One who sees this entire universe as Shivamayam (of being Shiva's form), he doesn't require to visit any sacred places of pilgrimage.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
25 Nov 2020
No comments:
Post a Comment