శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 109, 110 / Sri Lalitha Chaitanya Vijnanam - 109, 110

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 59 / Sri Lalitha Sahasra Nama Stotram - 59 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 109, 110 / Sri Lalitha Chaitanya Vijnanam - 109, 110 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ‖ 40 ‖


🌻 109. 'మహాసక్తి' 🌻

మహాసక్తి అనగా మహత్తరమైన శక్తి. శ్రీదేవి ఆసక్తి కలది అని అర్థము.

ఆసక్తి అనగా ఉత్సవరూప. అమితమైన ఉత్సాహము కలది శ్రీదేవి. ఆమె శివునితో సమయోగము నుండుటచే నిత్యము ఉత్సవము నందుండును. పరమాత్మతో యోగము చెందినవారు పరమానంద భరితులై ఉందురు. అట్టి యోగమున శివుని సహరూపమునుగొని సమయోగమున నిలచినదే శ్రీదేవి. ఆమె నారాధించిన వారికి అట్టి యోగస్థితిని ఆమె అనుగ్రహింప గలదు. ఆమె ఉద్భవమే ఉత్సాహ భరితము. ప్రజ్ఞా ప్రకృతుల సంయోగమున నున్న యోగులు కూడ అట్లే ఉత్సాహభరితులై యుందురు. మేలుకొనినది మొదలు నిదురించువరకు అట్టి ఉత్సాహముననే వారు జీవింతురు.

సృష్టియందు శివతత్త్వము అగ్నియై నిలచుటచే, అగ్ని తేజస్సు నందు ఆసక్తి కలది అనికూడ భావింపవచ్చును. సృష్టియందు నామ రూప సామ్యమును పొందుటయందుకూడ శ్రీదేవికి ఆసక్తి కలదు. తత్త్వమునకు గుణరూపము నేర్పరచి ఉత్సహించుచు నుండును. ఒంటి నలుగుతో వినాయకుని సృష్టించుట యందు ఈ ఉత్సాహమును కనపరచును.

అదే విధముగ ఆత్మ సమాగమమునందు కూడ ఆసక్తి కలది శ్రీదేవి. సృష్టితోను, శివునితోను సమాగమము చెంది చైతన్య స్వరూపిణియై అమితానందమును ఎల్లప్పుడునూ పొందుచు నున్నది శ్రీదేవి. ఆమె ఆసక్తి వర్ణనాతీతము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 109 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


Mahāsaktiḥ महासक्तिः (109)

Maha means festivals and asaktiḥ means great liking. She has a great liking for festivities. Here festival means Her union with Śiva. Festivities are of two kinds.

One that is celebrated internally (associated with mind) and another is external worship (associated with body). If this nāma is interpreted, based on Saundarya Laharī (verse 9) mahīṁ mūlādhāre, (meaning – the earth is placed in mūlādhāra) then it means only internal worship, worshipping Her subtlest form Kuṇḍalinī.

She likes internal worship. Maha means supremacy, ā means on all sides and Śaktī means supreme. Her supreme power is spread across everywhere. In this context, this nāma means that She is the Supreme power.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 110 / Sri Lalitha Chaitanya Vijnanam - 110 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ‖ 40 ‖


🌻 110. 'కుండలినీ' 🌻

కుండలములు కలది శ్రీదేవి అని అర్ధము.

గోళాకారముగా సృష్టి నిర్మాణము గావించి, అందుండి అండాకారములుగా బ్రహ్మాండమునుండి పిండాండము వరకు సృష్టి నిర్మాణము చేయునది శ్రీలలిత అని అర్థము. మూలాధారమందలి అగ్ని తేజస్సు యందు ఉన్న జీవశక్తి కుండలినే.

తేజోరూపమైన ప్రాణాకారము కలిగి సర్పమువలె మూలమున స్థితిగొని యుండి, సుషుమ్న మార్గమున సహస్రారము వరకు వ్యాపింపగల తేజస్విని కుండలిని. ప్రాణుల యందలి జీవచైతన్యమే కుండలిని. ఈ కుండలినీ మార్గము సృష్టియందు సత్యలోకము నుండి భూలోకము వరకు తీగవలె చుట్టలు చుట్టలుగా వ్యాపించి యుండును.

భూమండలము, సూర్యమండలము, సవితృ మండలము, భర్గోదేవ మండలము వ్యాపించి సర్వమును నిర్వర్తించుచు నుండును. వాక్కు రూపమున ఉద్భవించునది కనుక వాగ్భవ అని కూడ కుండలినీ చైతన్యమును పిలుతురు. జీవ చైతన్యము ఏ లోకమున స్థితి గొనినదో ఆ లోకము వరకు వ్యాపించి కుండలిని యుండును.

మానవునియందు భౌతిక, ప్రాణమయ, మనోమయ కోశముల యందు వ్యాపించి, విజ్ఞానమయపు అంచుల వరకు కుండలినీ చైతన్యమున్నదని తెలుపుదురు. కారణము ఏమనగా మానవునికి భౌతికము, ప్రాణమయము, మనోమయము అగు లోకములు అవగతమై ఉండుటయే.

కొంత బుద్ధికూడ ప్రతిమానవునియందును ఉండుటచే, మూడున్నర చుట్టలుగా కుండలినీ చైతన్యమున్నదని అందురు. బుద్ధిలోకమున ప్రవేశించిన వారికి కుండలిని నాలుగు చుట్టలుగ ఉండును.

అట్లే ఆనందమయ లోకమున ఐదుగను, అనుపాదక లోకమున ఆరుగను, ఆదిలోకమున ఏడుగను చుట్టలు గలిగి యుండును. ఏడు చుట్టల కుండలినీ చైతన్యము వ్యాపించినపుడు, సహస్రారమందలి శివతత్త్వముతో చేరినప్పుడు, సుస్థిరురాలై యుండును. కుండలినీ చైతన్యము ఊర్ధ్వగతి చెందుట యనగా జీవుడు పరిణతి చెందుటయే.
సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 110 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Kuṇḍalinī कुण्डलिनी (110) 🌻

She is in the form of a three and a half coiled snake in mūlādhāra cakra. Her subtlest form is described in this single nāma. Her subtler form kāmakalā (nāma 322) is also described in a single nāma. But Vāc Devi-s used nāmas 13 to 54 to describe Her subtle form. This also goes to prove the importance of internal worship or meditation than the external rituals.

The vital energy of prāṇa is called kuṇḍalinī. This lies in the mūlādhāra cakra in the midst of fire that keeps biological body warm. Any modification in the intensity of this fire causes sickness. The sound of the Kuṇḍalinī can be felt by anyone. If one closes both his ears tightly, he can listen to a hissing sound, the sound of Kuṇḍalinī from within.

The base cakra is a triangle where icchā, jñāna and kriyā śakti-s (desire, knowledge and action) form the three sides. From these three śakti-s (potencies) the sound of OM a, u and m is generated.

Yoga-vāsiṣṭha (the compendium of teachings of sage Vāsiṣṭha to Lord Rāma) in nirvāna prakaraṇa (the last of six chapters) talks about Kuṇḍalinī. Sage Vāsiṣṭha says to Lord Rāma “Like the coiled body of a serpent when it sleeps…like a plantain flower it is exceedingly delicate within…hissing like an angry female serpent…causing fluctuations in the mind. All other nādi-s are connected with this.

This becomes purified only by the rays of jñāna or knowledge….thus this Śaktī rejoices in the name of puryaṣṭaka. Should the upward and downward actions of this Kuṇḍalinī śakti be arrested by the control of prāṇa and this prāṇa be made to rest in the heart, diseases will never affect those who have such control.” Yoga-vāsiṣṭha also talks about siddhi-s.

Kānci Paramācāryā in his magnum opus ‘Voice of God’ observed the following about Kuṇḍalinī yoga: “Kuṇḍalinī yoga is not the only path available to the seeker. Choose any path other than it, adhere to it with a mind that is one-pointed and with faith and sincerity.

As you advance to a high state on this path, your breathing will change automatically and it will be similar to that of one practising yoga-s. You may even be aware of it; the breathing will change on its own” and after saying that one’s breath will undergo modifications, he says, “....the movement of breath will impinge on the nerves in the roof of our head and touching the feet of Ambāl (referring to Śaktī) create a flow of ambrosia. Even in worldly life when we are in ecstasy of delight our breathing stops and we faint.

In this there is reflection of the emotion experienced by us during kumbhaka (holding breath). During this time we excalim: ‘Ah, I feel cool in the crown of my head.’ This also means that a tiny droplet of the ambrosia has trickleld on the nerves in the crown of the head. I have said this to show that even by following the path of devotion you can have inward experience of sublime nature.”

Viṣṇu Sahasranāma nāma 907 is kuṇḍaline.

{Further reading on puryaṣṭaka: (as told by sage Vāsiṣṭha to Lord Rama in Yoga-vāsiṣṭha - VI.5).

Brahman who is without beginning or end and which is the seed of the universe, becoming differentiated is jīva (soul); subjecting itself to the idea of separateness, it becomes ahaṃkāra (ego) with manana (contemplation), it becomes manas (mind); with the certainty of intelligence, it becomes buddhi (intellect); then the five elements (sound, etc) through indriyā-s (sensory organs).

With the thought of the body, it becomes the body itself; with the thought of a vessel, it becomes the vessel. A form (subtle body), having such a nature is called puryaṣṭaka body or eight constituents of the body. The eight constituents are mind, ego, intellect, sound, touch, sight, taste and smell, the last five together known as tanmātra-s.}

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


25 Nov 2020

No comments:

Post a Comment