🍀 13 - DECEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 13 - DECEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹13 - DECEMBER డిసెంబరు - 2022 SUNDAY మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 296 / Bhagavad-Gita -296 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -16వ శ్లోకము.
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 657 / Sri Siva Maha Purana - 657 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 008 / DAILY WISDOM - 008 🌹 8. జీవితం యొక్క ఉన్నతమైన మూలం - The Great Root of Life
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 273 🌹
6) 🌹. శివ సూత్రములు - 10/ Siva Sutras - 10 🌹. 4. జ్ఞానాధిష్ఠానం మాతృక - 1 - Jñānādhiṣṭhānaṁ mātṛkā - 1

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹13, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 5 🍀*

*9. కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే |*
*జలే స్థలే తథాఽఽకాశే వాహనేషు చతుష్పథే*
*10. గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే |*
*యే స్మరంతి హనూమన్తం తేషాం నాస్తి విపత్ క్వచిత్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నాలోని భగవత్సంకల్పం తెలుసుకోడం ఎలా ? ఇందుకు అహంకారాన్ని నాలోంచి నేను తొలగించి వెయ్యాలి. నా యందలి ప్రతి పొర లోంచీ దానిని వేటాడి తరిమి వెయ్యాలి. విశుద్దమైన నా నగ్నాత్మను ఆయన అనంత లీలావిశేషములలో ఓలలాడించాలి. అప్పుడే ఆయన సాక్షాత్కరిస్తారు.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: కృష్ణ పంచమి 21:22:44
వరకు తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: ఆశ్లేష 26:33:54 వరకు
తదుపరి మఘ
యోగం: వైధృతి 30:54:01 వరకు
తదుపరి వషకుంభ
కరణం: కౌలవ 08:06:04 వరకు
వర్జ్యం: 13:58:24 - 15:46:12
దుర్ముహూర్తం: 08:50:06 - 09:34:32
రాహు కాలం: 14:56:39 - 16:19:57
గుళిక కాలం: 12:10:02 - 13:33:20
యమ గండం: 09:23:25 - 10:46:44
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:32
అమృత కాలం: 24:45:12 - 26:33:00
మరియు 26:35:42 - 28:22:34
సూర్యోదయం: 06:36:48
సూర్యాస్తమయం: 17:43:15
చంద్రోదయం: 22:06:37
చంద్రాస్తమయం: 10:37:11
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు : ఆనంద యోగం - కార్య సిధ్ధి
26:33:54 వరకు తదుపరి కాలదండ 
యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 296 / Bhagavad-Gita - 296 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 16 🌴*

*16. చతుర్విధా భజన్తే మాం జనా: సుకృతినోర్జున |*
*ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ*

🌷. తాత్పర్యం :
*ఓ భరతవంశ శ్రేష్టుడా! ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్త్వజ్ఞానము నన్వేషించువాడు అనెడి నాలుగురకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్తసేవ నొనరింతురు.*

🌷. భాష్యము :
దుష్కృతులకు భిన్నముగా శాస్త్రములందు తెలుపబడిన నియమములకు కట్టుబడి వర్తించు ఇట్టివారు “సుకృతిన:” అనబడుదురు. అనగా వారు శాస్త్రములందలి సాంఘిక మరియు నైతికనియమములను పాటించుచు దాదాపు శ్రీకృష్ణభగవానుని యెడ భక్తిని కలిగియుందురు. అటువంటి వారిలో ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, పరతత్త్వజ్ఞానము కొరకై అన్వేషించువారు అనెడి నాలుగుతరగతుల వారు గలరు. ఇట్టివారు వివిధ పరిస్థితులలో భక్తియుక్తసేవ నొనర్చుటకు భగవానుని దరిచేరుదురు. తాము చేయు భక్తికి కొంత ప్రతిఫలమును కోరియుండుటచే వాస్తవమునకు వారు శుద్ధభక్తులు కారు. శుద్ధభక్తి యనునది ఆశలకు మరియు భౌతికలాభాపేక్షకు అతీతమైనట్టిది. అటువంటి శుద్ధభక్తిని భక్తిరసామృతసింధువు (1.1.11) ఈ విధముగా నిర్వచించినది.

అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మాద్యనావృతం |
అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా 

“కామ్యకర్మల ద్వారా గాని, తాత్త్వికకల్పనల ద్వారా గాని భౌతికలాభాపేక్ష లేకుండగ అనుకూల్యముగా శ్రీకృష్ణభగవానునికి ప్రతియొక్కరు దివ్యమైన ప్రేమయుక్తసేవ నొనరింపవలసియున్నది. అదియే శుద్ధమైన భక్తియుతసేవ యనబడును.”

ఈ నాలుగుతెగల మనుజులు భక్తియోగమును నిర్వహించుటకై శ్రీకృష్ణభగవానుని దరిచేరినపుడు శుద్ధభక్తుని సాంగత్యములో పరిశుద్ధులై వారును శుద్ధభక్తులు కాగాలరు. కాని దుష్కృతులైన వారి జీవనము స్వార్థపూరితము,క్రమరహితము, ఆధ్యాత్మికగమ్యశూన్యమై యుండుట వలన వారికి భక్తిలో నెలకొనుట అతికష్టము కాగలదు. కాని అదృష్టవశాత్తు ఒకవేళ వారు శుద్ధభక్తుని సాంగత్యమును పొందినచో వారును శుద్ధభక్తులు కాగలరు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 296 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 7 - Jnana Yoga - 16 🌴*

16. catur-vidhā bhajante māṁ janāḥ su-kṛtino ’rjuna
ārto jijñāsur arthārthī jñānī ca bharatarṣabha

🌷 Translation : 
O best among the Bhāratas, four kinds of pious men begin to render devotional service unto Me – the distressed, the desirer of wealth, the inquisitive, and he who is searching for knowledge of the Absolute.

🌹 Purport :
Unlike the miscreants, these are adherents of the regulative principles of the scriptures, and they are called su-kṛtinaḥ, or those who obey the rules and regulations of scriptures, the moral and social laws, and are, more or less, devoted to the Supreme Lord. Out of these there are four classes of men – those who are sometimes distressed, those who are in need of money, those who are sometimes inquisitive, and those who are sometimes searching after knowledge of the Absolute Truth. These persons come to the Supreme Lord for devotional service under different conditions. These are not pure devotees, because they have some aspiration to fulfill in exchange for devotional service. Pure devotional service is without aspiration and without desire for material profit. The Bhakti-rasāmṛta-sindhu (1.1.11) defines pure devotion thus:

anyābhilāṣitā-śūnyaṁ jñāna-karmādy-anāvṛtam
ānukūlyena kṛṣṇānu- śīlanaṁ bhaktir uttamā

“One should render transcendental loving service to the Supreme Lord Kṛṣṇa favorably and without desire for material profit or gain through fruitive activities or philosophical speculation. That is called pure devotional service.”

When these four kinds of persons come to the Supreme Lord for devotional service and are completely purified by the association of a pure devotee, they also become pure devotees. As far as the miscreants are concerned, for them devotional service is very difficult because their lives are selfish, irregular and without spiritual goals. But even some of them, by chance, when they come in contact with a pure devotee, also become pure devotees.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 657 / Sri Siva Maha Purana - 657 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 17 🌴*
*🌻. గణేశుడు మరల జీవించుట - 1 🌻*

నారదుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! నీవు మహాజ్ఞానివి. చెప్పుము. ఇంతవరకు వృత్తాంతము నంతనూ వింటిని. ఆ మహాదేవి ఏమి చేసినది? ఈ వృత్తాంతమును యథా తథముగా వినగోరు చున్నాను (1).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! వినుము. జగదంబ యొక్క చరితమును, తరువాత జరిగిన వృత్తాంతమును నీకు నిశ్చితముగా చెప్పెదను (2). ఆ గణశుడు సంహరింపబడగానే, గణములు మద్దెళ్లను, పటహములను మ్రోగించి గొప్ప ఉత్పవమును చేసిరి (3). శివుడు గణశుని శిరస్సును ఛేదించి దుఃఖమును పొందెను. ఓ మహర్షీ! పార్వతీ దేవి ఆ వార్తను విని మిక్కిలి కోపించెను (4). నేనేమి చేయెదెను? ఎచటకు వెళ్లెదను? అయ్యో! ఆపద వచ్చినది. ఇపుడు నా ఈ మహాదుఃఖము తొలగిపోవు ఉపాయమేది గలదు? (5)

దేవతలు, గణములు అందరు కూడి నా కుమారుని ఈనాడు నాశనము చేసినారు. నేను వారినందరినీ నశింపజేసెదను. లేదా ప్రలయమును కలిగించెను (6). ఇట్లు దుఃఖించినదై సర్వలోకములకు అధీశ్వరియగు ఆమె కోపించి వెనువెంటనే లక్షల సంఖ్యలో శక్తులను నిర్మించెను (7). అట్లు నిర్మించ బడిన ఆ శక్తులు అగ్నిశిఖలవలె మండిపడుతూ జగన్మాత యగు ఆ పార్వతికి నమస్కరించి, 'తల్లీ! ఆదేశించుము' అని పలికెను (8). ఓ మహర్షీ! శంభుని శక్తి, ప్రకృతి, మహామాయ అగు ఆమె ఆ మాటను విని మిక్కిలి కోపించి వారందరితో ఇట్లు బదులిడెను (9).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 657🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 17 🌴*

*🌻 The Resuscitation of Gaṇeśa - 1 🌻*

Nārada said:—
1. O Brahmā, of great intellect, please narrate. When the entire news was heard what did the great goddess Pārvatī do? I wish to hear all in fact.

Brahmā said:—
2. O foremost among sages, listen. I shall mention the story of the mother of the universe in the manner that it happened afterwards.

3. When Gaṇeśa was killed, the Gaṇas were very jubilant. They played on Mṛdaṅgas and Paṭahas.

4. After cutting off the head of Gaṇeśa even as Śiva became sorry, goddess Pārvatī became furious, O great sage.

5. “O what shall I do? Where shall I go? Alas, great misery has befallen me. How can this misery, this great misery be dispelled now?

6. “My son has been killed by all the gods and the Gaṇas. I shall destroy them all or create a deluge.”

7. Lamenting thus, the great goddess of all the worlds angrily created in a moment hundreds and thousands of Śaktis.

8. Śaktis who were thus created, bowed to Pārvatī, the mother of the universe and blazing brilliantly spoke—“O mother, be pleased to command.”

9. O great sage, on hearing that, Pārvatī, the Śakti of Śiva, the Prakṛti, the great Māyā, spoke to them all in great fury.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 08 / DAILY WISDOM - 08 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 8. జీవితం యొక్క ఉన్నతమైన మూలం 🌻*

*ఏ సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా ప్రతిదీ తెలుస్తుందో ఆ సత్యం ఉపనిషత్తులలో విచారణ మరియు అన్వేషణ యొక్క అంశం. దార్శనికులు ఉనికి యొక్క లోతుల్లో మునిగి, అనంతమైన జీవశక్తి యొక్క స్వభావాన్ని రుచి చూశారు. వారు విశ్వం యొక్క మూలంలోకి ప్రవేశించారు. ఆ మూలం యొక్క అంతర్గత పనితీరును అర్థం చేసుకోవడం ద్వారా ఆ మూలం యొక్క శాఖల పనితీరును కూడా అర్థం చేసుకోగలిగారు. వేరుకు నీరు పోసినప్పుడు, శాఖలకు సైతం నీరు అందుతుంది.*

*బంగారం యొక్క గుణం తెలుసుకున్నప్పుడు, అన్ని ఆభరణాల యొక్క గుణం కూడా తెలియ బడుతుంది; అలాగే సత్యాన్ని గ్రహించినప్పుడు, ప్రతిదీ గ్రహించ బడుతుంది; ఎందుకంటే, సత్యం ఒక్కటే. ఉపనిషత్తుల నుండి తత్వశాస్త్రం యొక్క ఏ వ్యవస్థ ఉద్భవించినప్పటికీ, సత్యం ఏమిటంటే అన్ని వ్యవస్థలు అవిభాజ్యమైన, విషయ వస్తువులకు అతీతమైన, ఉన్నతమైన వాస్తవాన్ని ప్రతిపాదిస్తాయి.*

కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 8 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
*📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj*

*🌻 8. The Great Root of Life 🌻*

*The Truth, “knowing which everything becomes known” is the subject of enquiry and the object of quest in the Upanishads. The Seers dived into the very depth of Existence and tasted the nature of the Limitless Life. They entered into the Root of the universe and the branches could easily realise their inner being through an investigation into the essential workings of the Great Root of Life. When the root is watered, the branches are automatically watered.*

*When gold is known, all the ornaments also are known; when Truth is realised, everything is realised; for, Truth is One. Whatever system of philosophy may be derived from the Upanishads, the obvious truth goes without saying that they propound a theory that holds Reality to be indivisible, objectless and transcendent.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 273 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. పడిపోవడం సులభం. దానికి ఎట్లాంటి ప్రయత్నమూ అక్కర్లేదు. పైకి వెళ్ళడానికి, శిఖరాన్ని అందుకోవడానికి నువ్వు తీవ్ర ప్రయత్నం చేయాలి. ప్రతిక్షణం పట్లా అప్రమత్తంగా వుండాలి. 🍀*

*మనిషి నిచ్చెన. మనిషికి ఎన్నో అవకాశాలు వున్నాయి. అందువల్ల ప్రమాదం, గౌరవం కీర్తి, బాధ వున్నాయి. పడిపోవడం సులభం. ఎప్పుడూ సులభమే. దానికి ఎట్లాంటి ప్రయత్నమూ అక్కర్లేదు. పైకి వెళ్ళడానికి ప్రయత్నం అవసరం. మరింత పైకి వెళ్ళడానికి మరింత ప్రయత్నం అవసరం. శిఖరాన్ని అందుకోవడానికి నువ్వు తీవ్ర ప్రయత్నం చేయాలి. మనిషి అన్నీ తనకు ఆందాయి అనుకోకూడదు.*

*మనిషి సంభవాల స్ఫటికం. మనిషిలో ఔన్నత్యమూ అదే, మనిషి కష్టము అదే. వునికిలో అత్యంత ఆందోళన కలిగిన జంతువు మనిషే. అతనెప్పుడూ నాలుగు రోడ్ల కూడలిలో వుంటాడు. అతను ప్రతిక్షణం పట్లా అప్రమత్తంగా వుండాలి. ఏదయినా జరగచ్చు. జరగక పోవచ్చు. వీలు కావచ్చు. కాకపోవచ్చు. సత్వాన్వేషణ అన్నది ఒక నిర్ణయం. అంతిమ శిఖరాన్ని అందుకునే నిర్ణయం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 10 / Siva Sutras - 10 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
1- శాంభవోపాయ
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻4. జ్ఞానాధిష్ఠానం మాతృక - 1 🌻*
*🌴. తల్లి నుండి జ్ఞానానికి ఆధారం అక్షరాలు.🌴*

*జ్ఞాన అంటే సూత్రం 2లో చర్చించబడినట్లు, పరిమిత జ్ఞానం, అధిష్ఠానం అంటే అధిదేవత మరియు మాతృక అంటే సర్వోన్నతమైన తల్లి (లలితా సహస్రనామం నామం 577 మాతృక వర్ణ రూపిణి యొక్క సంక్షిప్త వివరణ ఏమిటంటే 51 అక్షర రూపంగా ఉన్న అమ్మ అని అర్థం. ఈ యాభై ఒక్క వర్ణమాలను ఆరు సమూహాలుగా విభజించి మూలాధారం నుండి ఆజ్ఞ వరకు ఆరు చక్రాలలో పూజిస్తారు.ఈ వర్ణమాలలు వేర్వేరు రంగులను కలిగి ఉంటాయి మరియు విశ్వశాస్త్ర అధ్యయనాలకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. అచ్చులు మరియు హల్లులకు శివశక్తులకు మధ్య ఒక సంబంధం రూపొందించబడింది.*

*అచ్చులు ఎల్లప్పుడూ చురుగ్గా మరియు చైతన్యవంతంగా ఉంటాయి కాబట్టి అచ్చులు శక్తితో పోల్చబడతాయి; హల్లులను శివునితో పోలుస్తారు. శివ-శక్తి కలయిక లేకుండా, విశ్వం ఉనికిలో ఉండదు, ఎందుకంటే అవి బ్రహ్మంలోని రెండు విభిన్న అంశాలు. అదే విధంగా, అచ్చులు-హల్లులు కలయిక లేకుండా ధ్వని ఉనికిలో ఉండదు. శబ్దం శబ్ద బ్రాహ్మణం నుండి ఉద్భవించింది, అయితే విశ్వం బ్రహ్మం నుండి ఉద్భవించింది. శక్తి శబ్ద బ్రాహ్మణం. ఈ వివరణ దృష్ట్యా, మాతృక అంటే అక్షరాలు అని కూడా అర్థం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 10 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻4. Jñānādhiṣṭhānaṁ mātṛkā - 1 🌻*
*🌴. The basis of knowledge from Mother is alphabets.🌴*

*Jñāna means knowledge discussed in sūtrā 2, the limited knowledge, adhiṣṭhānaṁ means resting upon and mātṛkā means the Supreme Mother (Lalithā Sahasranāmam nāmā 577 mātṛka varṇa rūpinī. A brief interpretation of this nāmā: She is in the form of 51 alphabets of Sanskrit called mātṛka. These fifty one alphabets are split into six groups and worshipped in the six chakras from mūlādhārā to ājñā. These alphabets have different colors and is said to be closely related to cosmological studies. A comparative narration is drawn between Shiva and Śaktī and vowels and consonants.*

*Vowels are always active and dynamic in nature and therefore vowels are compared to Śaktī; consonants are compared to Shiva. Without Shiva-Shakthi combine, the universe cannot exist, as they are two different aspects of the Brahman. In the same way, sound cannot exist without vowels-consonants combine. The sound originates from Śabda Brahman, whereas the universe originates from the Brahman. She is the Śabda Brahman.) In view of this interpretation, mātṛkā also means letters.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 418 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 418 -3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 418 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 418 -3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀

🌻 418. 'జడశక్తిః' - 3🌻


మానవ శరీరమున ఎముకలే అత్యంత ఘనమగు పదార్థము. ఈ ఆవరణ లన్నియూ వాని వాని శక్తులు కలిగి యున్నవి. ఇవన్నియూ జడముచే ఆవరింపబడిన శక్తులే. ఇట్లు చిత్ శక్తి, జడశక్తి రెండు శక్తులను వినియోగించుచు శ్రీమాత ఏడు లోకముల నేర్పరచును. వీరే శ్రీ భూ దేవతలు. చిత్ శక్తి ఎంత అవసరమో, సృష్టికార్యమున జడశక్తి కూడ అంతయే అవసరము. నిజమునకు శ్రీమాతయే రెండుగ భాసించు చున్నది. ఆవిరి, నీరు, మంచుగడ్డవలె అవరోహణ క్రమమును మరల మంచుగడ్డ నీరు ఆవిరి వలె ఆరోహణ క్రమము నేర్పరచును. ఇందు జీవులు వారి వారి చైతన్య స్థితిని బట్టి ఏడు లోకములందు వసించు చుందురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 418 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika
Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻

🌻 418. 'Jadashaktih' - 3🌻


Bones are the hardest material in the human body. All these layers have their own powers. All these are forces have inherent inertia. By using Chit Shakti ( life energy )and Jada Shakti (inertia), Sri Mata creates and rules the seven worlds. These are Sri Bhu Devas. As much as Chit Shakti is needed, so too is Jada Shakti in creation. The truth is that Srimata is twofold. Steam, water and ice follow descending order and ice follows ascending order as water and steam. Living beings live in the seven worlds according to their state of consciousness.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


ఓషో రోజువారీ ధ్యానాలు - 277. మారనిది / Osho Daily Meditations - 277. UNCHANGING


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 277 / Osho Daily Meditations - 277 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 277. మారనిది 🍀

🕉. మీరు క్షణికం కాదు, శాశ్వతం, మారుతున్న వారు కాదు, మార్పులేని వారు అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. 🕉


ఒక పువ్వులో రెండు భాగాలు ఉన్నాయి: రూపం - ఆపైది, రూపం వెనుక దాగి ఉంటుంది, నిరాకారమైనది. ఇది మారదు. కానీ శరీర భాగాన్ని నిరంతరం మారుస్తూ ఉంటుంది. పువ్వులు వస్తాయి మరియు పోతాయి. కానీ వాటి అందం అలాగే ఉంటుంది. కొన్నిసార్లు అది ఒక రూపంలో వ్యక్తమవుతుంది, కొన్నిసార్లు అది నిరాకారమైనదిగా మారుతుంది. మళ్ళీ పువ్వులు ఉంటాయి మరియు అందం తనను తాను నొక్కి చెబుతుంది. పువ్వులు వాడిపోతాయి మరియు అందం అవ్యక్తంగా మారుతుంది.

మనుషుల్లో, పక్షుల్లో, జంతువులతో, ప్రతి విషయంలోనూ అదే జరుగుతోంది. మనకు రెండు కోణాలు ఉన్నాయి: మనం వ్యక్తమయ్యే పగటి భాగం మరియు మనం వ్యక్తీకరించ బడనప్పుడు రాత్రి భాగం. కానీ మనం శాశ్వతం. మనం ఎల్లప్పుడూ ఉన్నాము మరియు మనం ఎల్లప్పుడూ ఉంటాము. ఉండటం కాలానికి మించినది. అది మార్పుకు అతీతం. ప్రారంభంలో ఇది ఇలా ఉండవచ్చు అని గుర్తుంచుకోండి, అప్పుడు మీరు దాని వాస్తవికతను అనుభవించడం ప్రారంభిస్తారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 277 🌹

📚. Prasad Bharadwaj

🍀 277. UNCHANGING 🍀

🕉. Always remember that you are not the momentary but the eternal, not the changing but the unchanging. 🕉


In a flower there are two constituents: one that is constantly changing the body part, the form-and then, hidden behind the form, the formless, which is unchanging. Flowers come and go, but their beauty remains. Sometimes it is manifested in a form, sometimes it dissolves back into the formless. Again there will be flowers, and beauty will assert itself. Then the flowers will fade and the beauty will move into the unmanifest.

And the same is happening with human beings, with birds, with animals, with everything. We have two dimensions: the day part when we become manifested, and the night part when we become unmanifested--but we are eternal. We have been always, and we will be always. Being is beyond time and beyond change. In the beginning just remember it "as if:' then you will start feeling the reality of it.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 142 / Agni Maha Purana - 142


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 142 / Agni Maha Purana - 142 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 44

🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 1🌻

హయగ్రీవుడు చెప్పెను. ఇపుడు వాసుదేవాది ప్రతిమల లక్షణము చెప్పదను వినుము. ఆలయమును పూర్వాభిముఖముగ గాని, ఉత్తరాభి ముఖముగగాని శిలనుంచి, దానికి పూజచేసి. శిల్పి, ఆ శిలకు మధ్య సూత్రముంచి దానిని తొమ్మిది భాగములు చేయవలెను. తొమ్మిదవ భాగమును గూడ పండ్రెండు భాగములుగ విభజించిన పిమ్మట ఒక్కొక్క భాగము అతని అంగుళముతో ఒక్క అంగుళముండును. రెండు అంగుళముము ''గోలకము'' దీనికి ''కాలనేత్ర'' మని కూడ పేరు.

పైన చెప్పిన తొమ్మిది భాగములలో ఒక భాగమును మూడు భాగములుగా విభజించి దానితో సీలమండలుగా చేయవలెను. ఒక భాగము మోకాలు కొరకు, మరొక భాగము కంఠము కొరకు నిశ్చయించ ఉంచుకొనవలెను. ముకుటమునకు ఒక జానెడు, ముఖమునకు ఒక జానెడు, కంఠమునకు ఒక జానెడు, హృదయమునకై ఒక జానెడు ఉంచవలెను. నాభికిని, లింగమునకు మధ్య ఒక జానెడు దూరముండవలెను. తొడలు రెండు జానలు కాళ్ళు రెండు జానలు ఉండవలెను. ఇపుడు సూత్రముల కొలతను వినుము - పాదములపై రెండు సూత్రములు, కాళ్ళపై రెండు సూత్రములు, మోకాళ్ళపై రెండు సూత్రములు రెండు తొడలపై రెండేసి సూత్రములు ఉపయోగింపవలెను.

లింగముపై మరి రెండు సూత్రములు కటి ప్రదేశముపై నడుము నిర్మించుటకు మరి రెండు సూత్రములును ఉపయోగింపవలెను. నాభి యందు కూడ రెండు సూత్రములు ఉపయోగింపవలెను. అట్లే హృదయమునందును. కంఠము నందును రెండు సూత్రము లుంచవలెను. లలాటముపై మరి రెండు సూత్రములు, శిరస్సుపై మరి రెండు సూత్రములు ఉపయోగంచవలెను. బుద్ధిమంతుడైన శిల్పి ముకుటముపై ఒక సూత్రముంచవలెను. పైన ఏడు సూత్రములు మాత్రమే ఉంచవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 142 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 44

🌻Characteristics of the image of Vāsudeva - 1 🌻


The Lord said:

1-2. I shall describe to you the characteristics of the image of Vāsudeva and other gods. Having placed the stone to the north of the temple facing either the east or the north and worshipped it, the sculptor should divide the stone into nine parts along the central line after making the offering.

3. In the twelve divisions (of the line) a division is said to be an aṅgula (a finger breadth). Two aṅgulas are known to be a golaka. It is also said to be a kālanetra.

4. Having divided one of the nine divisions into three, (with one part) the region of the calves should be made. In the same way a part is to be used for the knees and part for the neck.

5. The crown should be of a measure of a tāla (12 aṅgulas). In the same way the face (should be) of the measure of a tāla. The neck and heart should also be a tāla each.

6. The navel and the genital part should be a tāla apart. (The length) of the thighs should be two tālas. (The length) of the part from the ankle to the knee should be two tālas. Listen now to (the description) (of the drawing) of lines (on the body).

7. Two lines should be drawn on the foot, and (two) more in between the calves (and knees). Two lines about the kneesand two more in between the thighs and the knees should be drawn.

8. One line should be drawn over the genital part, and one more about the waist. Another (line) (should) then (be drawn) above the navel for accomplishing the girdle.

9. Then (a line) should be drawn on the heart and two lines on the neck. One such line should be drawn on the forehead and one more on the head.

10. One more line should be drawn on the crown by the learned. O Brahman! seven vertical lines should be drawn.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 695 / Vishnu Sahasranama Contemplation - 695


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 695 / Vishnu Sahasranama Contemplation - 695🌹

🌻695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ🌻

ఓం వాసుదేవాయ నమః | ॐ वासुदेवाय नमः | OM Vāsudevāya namaḥ

వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

వసుదేవస్య తనయో వాసుదేవ ఇతీర్యతే

వసుదేవుని పురుష సంతానము అనగా తనయుడు కనుక వాసుదేవః.


:: పోతన భాగవతము - దశమ స్కంధము ::

మఱియుం గృష్ణు నుద్దేశించి తొల్లి యీ శిశువు ధవళారుణ పీతవర్ణుండై యిప్పుడు నల్లనైన కతంబునఁ గృష్ణుం డయ్యె, వసుదేవునకు నొక్కెడ జన్మించిన కారణంబున వాసుదేవుండయ్యె, నీ పాపనికి గుణరూపకర్మంబు అనేకంబులు గలుగుటంజేసి నామంబు లనేకంబులు గలవు. ఈ శాబకుని వలన మీరు దుఃఖంబులఁ దరియింతు, రీ యర్భకునిచేత దుర్జనశిక్షణంబును సజ్జనరక్షణంబును నగు, నీ కుమారుండు నారాయణ సమానుండని చెప్పి తన గృహమ్మున క మ్మునీశ్వరుండు సనియె. నందుండును బరమానందంబున నుండె నంత. (288)

తరువాత గర్గ మహర్షి యశోదా కుమారుని ఉద్దేశించి ఇల అన్నాడు - "ఈ శిశువు పూర్వం తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండేవాడు. ఇప్పుడు నల్లనైనాడు కనుక 'కృష్ణు'డని పిలవండి. ఇతడు వసుదేవునకు జన్మించినవాడుగనుక 'వాసుదేవుడు' అని పేరుగూడ చెల్లుతుంది. ఈ బిడ్డడికి గుణములు, రూపములు, కర్మములు ఎన్నో ఉండడంవల్ల ఇంకా ఎన్నో పేర్లు వహిస్తాడు. ఈ బాలునివలన మీరు అన్ని దుఃఖములను అతిక్రమించుతారు. వీని చేత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణా జరుగుతాయి. నాయనా! నీ కుమారుడు నారాయణునితో సమానుడు సుమా! అని చెప్పి గర్గ మహాముని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మహానుభావుడైన ఋషీంద్రుడు తన కుమారుని గురించి మంచిమాటలు చెప్పినందుకు నందుడు చాలా ఆనందించాడు.


332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 695🌹

🌻695. Vāsudevaḥ🌻

OM Vāsudevāya namaḥ



वसुदेवस्य तनयो वासुदेव इतीर्यते /

Vasudevasya tanayo vāsudeva itīryate


Since He is Vasudeva's son, He is called Vāsudevaḥ.


:: श्रीमद्भागवते दशमस्कन्धे अष्टमोऽध्यायः ::

प्रागयं वसुदेवस्य क्वचिज्जातस्त्वात्मजः ।
वासुदेव इति श्रीमानभिज्ञाः सम्प्रचक्षते ॥ १४ ॥


Śrīmad Bhāgavata - Canto 10, Chapter 8

Prāgayaṃ vasudevasya kvacijjātastvātmajaḥ,
Vāsudeva iti śrīmānabhijñāḥ saṃpracakṣate. 14.


Garga Muni indirectly disclosed, “This child was originally born as the son of Vasudeva, although He is acting as your child. Generally He is your child, but sometimes He is the son of Vasudeva.”


332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 103 / Kapila Gita - 103


🌹. కపిల గీత - 103 / Kapila Gita - 103🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 59 🌴

59. నాడ్యోఽస్య నిరభిద్యంత తాభ్యో లోహితమాభృతమ్|
నద్యస్తతః సమభవన్నుదరం నిరభిద్యత॥


ఈ విధముగా ఆ విరాట్ పురుషునకు నాడులు ఏర్పడెను. వాటి నుండి రక్తము, దాని నుండి నదులు ఆవిష్కృతములయ్యెను. తదుపరి ఉదరము ప్రకటమయ్యెను.

నాడులకు ఇంద్రియం రక్తమూ, అధిష్ఠాన దేవత నదులు. నదులు సక్రమముగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అందుకే నదీ స్నానం చేసే వారు. నదులు రక్తమునకు అధిష్ఠాన దేవత. మనలో రక్తం ప్రవహిస్తూ ఉన్నట్లే, భూగోళములో కూడా నదులు ప్రవహిస్తూ ఉంటాయి.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 103 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 59 🌴

59. nāḍyo 'sya nirabhidyanta tābhyo lohitam ābhṛtam
nadyas tataḥ samabhavann udaraṁ nirabhidyata


The veins of the universal body became manifested and thereafter the red corpuscles, or blood. In their wake came the rivers (the deities presiding over the veins), and then appeared an abdomen.

Blood veins are compared to rivers; when the veins were manifested in the universal form, the rivers in the various planets were also manifested. The controlling deity of the rivers is also the controlling deity of the nervous system. In Āyur-vedic treatment, those who are suffering from the disease of nervous instability are recommended to take a bath by dipping into a flowing river.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

Daily Panchang నిత్య పంచాంగము 12 Dec 2022


🌹12, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 11 🍀


19. కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః |
నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః

20. బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః |
నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాలసః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : పాపపుణ్యాలు - మనలను బానిసగా చేసుకొనే అలవాటే పాపమనేది. అట్లే పుణ్యమనేది కేవలం మానవునకు కలిగిన ఒక అభిప్రాయం. కనుక నీవు నేరుగా భగవంతుని దర్శించి, ఆయన సంకల్పానుసారం ఏ మార్గం నీకు నిర్దిష్టమైతే ఆ మార్గం అనుసరించు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మార్గశిర మాసం

తిథి: కృష్ణ చవితి 18:50:04 వరకు

తదుపరి కృష్ణ పంచమి

నక్షత్రం: పుష్యమి 23:36:41 వరకు

తదుపరి ఆశ్లేష

యోగం: ఇంద్ర 30:07:13 వరకు

తదుపరి వైధృతి

కరణం: బాలవ 18:49:05 వరకు

వర్జ్యం: 05:36:40 - 07:24:36

దుర్ముహూర్తం: 12:31:47 - 13:16:14

మరియు 14:45:07 - 15:29:34

రాహు కాలం: 07:59:34 - 09:22:54

గుళిక కాలం: 13:32:54 - 14:56:14

యమ గండం: 10:46:14 - 12:09:34

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:31

అమృత కాలం: 16:24:16 - 18:12:12

మరియు 24:45:12 - 26:33:00

సూర్యోదయం: 06:36:14

సూర్యాస్తమయం: 17:42:53

చంద్రోదయం: 21:15:20

చంద్రాస్తమయం: 09:55:31

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు : ధాత్రి యోగం - కార్య జయం

23:36:41 వరకు తదుపరి సౌమ్య యోగం

- సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹