శ్రీ మదగ్ని మహాపురాణము - 142 / Agni Maha Purana - 142


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 142 / Agni Maha Purana - 142 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 44

🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 1🌻

హయగ్రీవుడు చెప్పెను. ఇపుడు వాసుదేవాది ప్రతిమల లక్షణము చెప్పదను వినుము. ఆలయమును పూర్వాభిముఖముగ గాని, ఉత్తరాభి ముఖముగగాని శిలనుంచి, దానికి పూజచేసి. శిల్పి, ఆ శిలకు మధ్య సూత్రముంచి దానిని తొమ్మిది భాగములు చేయవలెను. తొమ్మిదవ భాగమును గూడ పండ్రెండు భాగములుగ విభజించిన పిమ్మట ఒక్కొక్క భాగము అతని అంగుళముతో ఒక్క అంగుళముండును. రెండు అంగుళముము ''గోలకము'' దీనికి ''కాలనేత్ర'' మని కూడ పేరు.

పైన చెప్పిన తొమ్మిది భాగములలో ఒక భాగమును మూడు భాగములుగా విభజించి దానితో సీలమండలుగా చేయవలెను. ఒక భాగము మోకాలు కొరకు, మరొక భాగము కంఠము కొరకు నిశ్చయించ ఉంచుకొనవలెను. ముకుటమునకు ఒక జానెడు, ముఖమునకు ఒక జానెడు, కంఠమునకు ఒక జానెడు, హృదయమునకై ఒక జానెడు ఉంచవలెను. నాభికిని, లింగమునకు మధ్య ఒక జానెడు దూరముండవలెను. తొడలు రెండు జానలు కాళ్ళు రెండు జానలు ఉండవలెను. ఇపుడు సూత్రముల కొలతను వినుము - పాదములపై రెండు సూత్రములు, కాళ్ళపై రెండు సూత్రములు, మోకాళ్ళపై రెండు సూత్రములు రెండు తొడలపై రెండేసి సూత్రములు ఉపయోగింపవలెను.

లింగముపై మరి రెండు సూత్రములు కటి ప్రదేశముపై నడుము నిర్మించుటకు మరి రెండు సూత్రములును ఉపయోగింపవలెను. నాభి యందు కూడ రెండు సూత్రములు ఉపయోగింపవలెను. అట్లే హృదయమునందును. కంఠము నందును రెండు సూత్రము లుంచవలెను. లలాటముపై మరి రెండు సూత్రములు, శిరస్సుపై మరి రెండు సూత్రములు ఉపయోగంచవలెను. బుద్ధిమంతుడైన శిల్పి ముకుటముపై ఒక సూత్రముంచవలెను. పైన ఏడు సూత్రములు మాత్రమే ఉంచవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 142 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 44

🌻Characteristics of the image of Vāsudeva - 1 🌻


The Lord said:

1-2. I shall describe to you the characteristics of the image of Vāsudeva and other gods. Having placed the stone to the north of the temple facing either the east or the north and worshipped it, the sculptor should divide the stone into nine parts along the central line after making the offering.

3. In the twelve divisions (of the line) a division is said to be an aṅgula (a finger breadth). Two aṅgulas are known to be a golaka. It is also said to be a kālanetra.

4. Having divided one of the nine divisions into three, (with one part) the region of the calves should be made. In the same way a part is to be used for the knees and part for the neck.

5. The crown should be of a measure of a tāla (12 aṅgulas). In the same way the face (should be) of the measure of a tāla. The neck and heart should also be a tāla each.

6. The navel and the genital part should be a tāla apart. (The length) of the thighs should be two tālas. (The length) of the part from the ankle to the knee should be two tālas. Listen now to (the description) (of the drawing) of lines (on the body).

7. Two lines should be drawn on the foot, and (two) more in between the calves (and knees). Two lines about the kneesand two more in between the thighs and the knees should be drawn.

8. One line should be drawn over the genital part, and one more about the waist. Another (line) (should) then (be drawn) above the navel for accomplishing the girdle.

9. Then (a line) should be drawn on the heart and two lines on the neck. One such line should be drawn on the forehead and one more on the head.

10. One more line should be drawn on the crown by the learned. O Brahman! seven vertical lines should be drawn.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment