శ్రీ లలితా సహస్ర నామములు - 103 / Sri Lalita Sahasranamavali - Meaning - 103

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 103 / Sri Lalita Sahasranamavali - Meaning - 103 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥ 🍀

🍀 499. రక్తవర్ణా -
ఎర్రని రక్త వర్ణంలో ఉండునది.

🍀 500. మాంసనిష్ఠా -
మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది.

🍀 501. గుడాన్నప్రీతమానసా -
గుడాన్నములో ప్రీతి కలది.

🍀 502. సమస్త భక్త సుఖదా -
అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖసంతోషాలను ప్రసాదించునది.

🍀 503. లాకిన్యంబా స్వరూపిణీ - 
లాకినీ దేవతా స్వరూపముగా నున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 103 🌹

📚. Prasad Bharadwaj

🌻 103. raktavarṇā māṁsaniṣṭhā guḍānna-prīta-mānasā |
samastabhakta-sukhadā lākinyambā-svarūpiṇī || 103 || 🌻

🌻 499 ) Raktha varna -
She who is of the colour of blood

🌻 500 ) Mamsa nishta -
She who is in flesh

🌻 501 ) Gudanna preetha manasa -
She who likes rice mixed with jaggery

🌻 502 ) Samastha bhaktha sukhadha -
She who gives pleasure to all her devotees

🌻 503 ) Lakinyambha swaroopini -
She who is famous in the name of “Lakini”

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

13 Jul 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 54

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 54 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మోక్షము 🌻

సాధన యొక్క పరమావధి మోక్షమే! అయితే ధర్మార్థ కామ‌ మోక్షాలను చతుర్విద పురుషార్థాలుగా వ్యవహరింపబడే వాటిలో‌ మోక్షం అనేది ఒక పురుషార్థమనీ, మొదటి మూడింటినీ సమతూకంగా నడిపి వాటిలో సామ్యం సాధించగలిగిన జీవి అనుభవించే స్థితి మోక్షమని పెద్దలు చెప్పారు.

మోక్షమనేది సాధించాల్సిన వేరే స్థితి కాదు. జీవుడు సహజముగా‌ మోక్షస్థితిలోనే ఉంటాడు.

కానీ, క్రమేణ తెచ్చుకున్న బంధాల ఉచ్చు బిగిసిన‌ కొద్దీ పురుషార్థా‌ల నడుమ సమతూకం చెదిరి, మోక్షం అనే అనందస్థితి నుండి బంధమనే సంసార స్థితిలోనికి జారి, ఇక్కడి నుండి‌ చూస్తే మోక్షం వేరే సాధించాల్సిన ఒక మెట్టు లాగ కనిపిస్తుంది.

🌹 🌹 🌹 🌹 🌹

13 Jul 2021

శ్రీ శివ మహా పురాణము - 426

🌹 . శ్రీ శివ మహా పురాణము - 426🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 25

🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 3 🌻

ఆ బ్రహ్మణులిట్లు పలుకగా ఆ పార్వతీ దేవి వారి యెదుట పరమ రహస్యమే అయిననూ సత్యము నిట్లు పలికెను.(22)

పార్వతి ఇట్లు పలికెను -

మునివరులారా! నా మాటను ప్రీతితో మనస్సును లగ్నము చేసి వినుడు . నేను నా బుద్ధితో ఆలోచించి నిశ్చయించిన నా విచారము చెప్పెదను (23)

అసంభవమగు నా మాటలను విని మీరు పరిహాసము చెసెదరు. ఓ విప్రులారా! మీ ఎదుట వర్ణించుటకు సంకోచము అగుచున్నది. నేనేమి చేయుదును? (24)

ఈ నా మనస్సు నియంత్రింప సంభవము కానిది. నావశము లేదు. అసంభవమగు కర్మలనపేక్షించుచున్నది ఈ నా మనస్సు నీటిపై ఎత్తైన మహా ప్రాసాదమును నిర్మింపగోరుచున్నది.(25)

రుద్రుడు నాకు భర్త కావలననే కొర్కెను మనస్సులో నిడుకొని, దేవర్షియగు నారదుని అనుమతిని పొంది తీవ్రమగు తపస్సును చేయుచున్నాను.(26)

రెక్కలు లేని నా మనస్సును అనే పక్షి హఠాత్తుగా ఆకాశమునందు ఎగురుచున్నది. కరుణా సముద్రుడగు శంకరస్వామి దాని యాశను పరిపూర్ణము చేయును గాక ! (27)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆమె యొక్క ఈ మాటలను విని ఆ మహర్షులు నవ్వి ఆ పార్వతిని ప్రీతితో ఆదరించి (మనస్సులో) మాయమాటలను ఇట్లు పలికిరి(28)

ఋషులు ఇట్లు పలికిరి-

వ్యర్థముగా తాను పండితుడనను ధారణ గలవాడు, క్రూరమగు మనస్సు గలవాడు అగు ఆ దేవర్సి యొక్క చరిత్ర నీకు తెలియదు. ఓ పార్వతీ! నీవు సహజముగా బుద్ధిమంతురాలవే (29)

నారదుడు మోసపు మాటలను చెప్పి ఇతరుల మనస్సులను కల్లోల పెట్టును. అతని మాటలను విన్నవారికి అన్ని విధమలుగా హాని కలుగును (30)

మేము నీకు క్రమముగా బోధించెదము. నీవు మంచి బుద్ధితో ఈ చక్కని వృత్తాంతమును విని ప్రీతితో దానిని తెలుసుకొని మనస్సులో నిశ్చయించుము (31) బ్రహ్మపుత్రుడగు దక్షుడు తండ్రి ఆజ్ఞచే తన భార్య యందు పదివేల పుత్రులను గని, ఆ ప్రియపుత్రులను తపస్సు చేయుడని నియోగించెను. (32)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

13 Jul 2021

గీతోపనిషత్తు -226

🌹. గీతోపనిషత్తు -226 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 11

🍀 10. ప్రణవ నాదము - అక్షరమనగా క్షరము కానిది. నాశము లేనిది. శాశ్వతమైనది. అక్షరమనగా అక్ష+ర, అనగా అక్షముగా కొని రాబడినది. మూలము నుండి నవావరణ సృష్టిగ కొనువచ్చునది. అనగా ఓంకారము. దానినే 'ప్రణవ'మని కూడ అందురు. దాని యందే భూత భవిష్యత్ వర్తమాన కాలములున్నవి. అదియే తానుగ వ్యాకోచ సంకోచములు చెందుచు శాశ్వతమై యున్నది. దానిని వేదవిదులు 'ఓం' అను నాదముగ గుర్తించిరి. త్రికాలము లకు, త్రిలోకములకు మూలమగు అనాహత నాదముగ గుర్తించిరి. 🍀

యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః |
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే || 11

తాత్పర్యము :

అక్షరమని దేనిని గూర్చి వేదవిదులు పలుకు చున్నారో, దేనియందు యమ నియమాది నియమముల నభ్య సించుచు, ఇంద్రియ వాంఛలను విసర్జించి యతులు ప్రవేశించు చున్నారో, దేనియందు ఇచ్ఛతో జిజ్ఞాసువులు బ్రహ్మచర్యమున చరించు చున్నారో ఆ పదమును (స్థితిని) గూర్చి నీకు సంగ్రహముగ తెలి పెదను.

వివరణము :

అక్షరమనగా క్షరము కానిది. నాశము లేనిది. శాశ్వతమైనది. అక్షరమనగా అక్ష+ర, అనగా అక్షముగా కొని రాబడినది. మూలము నుండి నవావరణ సృష్టిగ కొనువచ్చునది. అనగా ఓంకారము. దానినే 'ప్రణవ'మని కూడ అందురు. దాని యందే భూత భవిష్యత్ వర్తమాన కాలములున్నవి.

మూలమే అక్షముగ అనేకానేకమైన ప్రకృతి స్థితులను ఏర్పరచుకొనుచు సృష్టిగ వ్యక్తమై, స్థితియందుండి మరల తిరోగమనము చెందుచు, సృష్టియందు లయమైన పిదప కూడ ఉండునటు వంటిది. అదియే తానుగ వ్యాకోచ సంకోచములు చెందుచు శాశ్వతమై యున్నది.

దానిని వేదవిదులు 'ఓం' అను నాదముగ గుర్తించిరి. త్రికాలము లకు, త్రిలోకములకు మూలమగు అనాహత నాదముగ గుర్తించిరి. వేదవిదులు దీనియందాసక్తిగొని, దానితో అనుసంధానము చెంది సమస్తమును దర్శించి, వివరించిరి. వేదవిదులు అనగా వేదము తెలిసిన వారని అర్థము.

వేదమనగా ఓంకారము. ఓంకారము ననుభూతి చెందుటవలన సర్వమును విదితమగును. అది నశించని నాదము. కనుకనే వేద సంప్రదాయమున ప్రధానముగ ఓంకారమును శిశుప్రాయము నుండి పరిచయము చేయుదురు. నిత్యము మనయందు జరుగుచున్న నాదమును అంతరంగమున గుర్తించి, దానితో కూడియుండుట ప్రణవనాద ఉపాసనము. యతులు, అనగా తమను తాము యమించుకొనినవారు. ధర్మమునకు కట్టుబడి యుండువారు.

త్రికరణశుద్ధి, అహింస, అపరిగ్రహము, బాహ్యాంతర శుచి, శాస్త్ర అధ్యయనము, స్వా అధ్యయనము పాటించుచు, తమను తాము ఈశ్వరునకు సమర్పణము చేసుకొనువారు. మరియు బ్రహ్మము నందు ప్రవేశించి వసించుట కిచ్చగించువారు.

బ్రహ్మచర్య మనగా బ్రహ్మమునందు ప్రవేశించి, అందే చరించుచు, అందే వసించుట. అట్లు వేదవిదులు దేనిని గూర్చి భాషింతురో, యతులు రాగరహితులై దేనియందు వసింతురో, బ్రహ్మచారులు ఎందు స్థిరపడుట కిచ్చగింతురో, అట్టి పరమపదమును చేరు విధానమును తెలుపబోవుచున్నానని భగవానుడు ఈ శ్లోకమున పలికెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

13 Jul 2021

13-JULY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 226 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 427🌹 
3) 🌹 Light On The Path - 173🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -54🌹  
5) 🌹 Osho Daily Meditations - 43🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 103 / Lalitha Sahasra Namavali - 103🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 103 / Sri Vishnu Sahasranama - 103🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -226 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 11

*🍀 10. ప్రణవ నాదము - అక్షరమనగా క్షరము కానిది. నాశము లేనిది. శాశ్వతమైనది. అక్షరమనగా అక్ష+ర, అనగా అక్షముగా కొని రాబడినది. మూలము నుండి నవావరణ సృష్టిగ కొనువచ్చునది. అనగా ఓంకారము. దానినే 'ప్రణవ'మని కూడ అందురు. దాని యందే భూత భవిష్యత్ వర్తమాన కాలములున్నవి. అదియే తానుగ వ్యాకోచ సంకోచములు చెందుచు శాశ్వతమై యున్నది. దానిని వేదవిదులు 'ఓం' అను నాదముగ గుర్తించిరి. త్రికాలము లకు, త్రిలోకములకు మూలమగు అనాహత నాదముగ గుర్తించిరి. 🍀*

యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః |
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే || 11

తాత్పర్యము : 
అక్షరమని దేనిని గూర్చి వేదవిదులు పలుకు చున్నారో, దేనియందు యమ నియమాది నియమముల నభ్య సించుచు, ఇంద్రియ వాంఛలను విసర్జించి యతులు ప్రవేశించు చున్నారో, దేనియందు ఇచ్ఛతో జిజ్ఞాసువులు బ్రహ్మచర్యమున చరించు చున్నారో ఆ పదమును (స్థితిని) గూర్చి నీకు సంగ్రహముగ తెలి పెదను.

వివరణము : 
అక్షరమనగా క్షరము కానిది. నాశము లేనిది. శాశ్వతమైనది. అక్షరమనగా అక్ష+ర, అనగా అక్షముగా కొని రాబడినది. మూలము నుండి నవావరణ సృష్టిగ కొనువచ్చునది. అనగా ఓంకారము. దానినే 'ప్రణవ'మని కూడ అందురు. దాని యందే భూత భవిష్యత్ వర్తమాన కాలములున్నవి. 

మూలమే అక్షముగ అనేకానేకమైన ప్రకృతి స్థితులను ఏర్పరచుకొనుచు సృష్టిగ వ్యక్తమై, స్థితియందుండి మరల తిరోగమనము చెందుచు, సృష్టియందు లయమైన పిదప కూడ ఉండునటు వంటిది. అదియే తానుగ వ్యాకోచ సంకోచములు చెందుచు శాశ్వతమై యున్నది. 

దానిని వేదవిదులు 'ఓం' అను నాదముగ గుర్తించిరి. త్రికాలము లకు, త్రిలోకములకు మూలమగు అనాహత నాదముగ గుర్తించిరి. వేదవిదులు దీనియందాసక్తిగొని, దానితో అనుసంధానము చెంది సమస్తమును దర్శించి, వివరించిరి. వేదవిదులు అనగా వేదము తెలిసిన వారని అర్థము. 

వేదమనగా ఓంకారము. ఓంకారము ననుభూతి చెందుటవలన సర్వమును విదితమగును. అది నశించని నాదము. కనుకనే వేద సంప్రదాయమున ప్రధానముగ ఓంకారమును శిశుప్రాయము నుండి పరిచయము చేయుదురు. నిత్యము మనయందు జరుగుచున్న నాదమును అంతరంగమున గుర్తించి, దానితో కూడియుండుట ప్రణవనాద ఉపాసనము. యతులు, అనగా తమను తాము యమించుకొనినవారు. ధర్మమునకు కట్టుబడి యుండువారు. 

త్రికరణశుద్ధి, అహింస, అపరిగ్రహము, బాహ్యాంతర శుచి, శాస్త్ర అధ్యయనము, స్వా అధ్యయనము పాటించుచు, తమను తాము ఈశ్వరునకు సమర్పణము చేసుకొనువారు. మరియు బ్రహ్మము నందు ప్రవేశించి వసించుట కిచ్చగించువారు. 

బ్రహ్మచర్య మనగా బ్రహ్మమునందు ప్రవేశించి, అందే చరించుచు, అందే వసించుట. అట్లు వేదవిదులు దేనిని గూర్చి భాషింతురో, యతులు రాగరహితులై దేనియందు వసింతురో, బ్రహ్మచారులు ఎందు స్థిరపడుట కిచ్చగింతురో, అట్టి పరమపదమును చేరు విధానమును తెలుపబోవుచున్నానని భగవానుడు ఈ శ్లోకమున పలికెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 426🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 25

*🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 3 🌻*

ఆ బ్రహ్మణులిట్లు పలుకగా ఆ పార్వతీ దేవి వారి యెదుట పరమ రహస్యమే అయిననూ సత్యము నిట్లు పలికెను.(22)

పార్వతి ఇట్లు పలికెను -

మునివరులారా! నా మాటను ప్రీతితో మనస్సును లగ్నము చేసి వినుడు . నేను నా బుద్ధితో ఆలోచించి నిశ్చయించిన నా విచారము చెప్పెదను (23)

అసంభవమగు నా మాటలను విని మీరు పరిహాసము చెసెదరు. ఓ విప్రులారా! మీ ఎదుట వర్ణించుటకు సంకోచము అగుచున్నది. నేనేమి చేయుదును? (24)

ఈ నా మనస్సు నియంత్రింప సంభవము కానిది. నావశము లేదు. అసంభవమగు కర్మలనపేక్షించుచున్నది ఈ నా మనస్సు నీటిపై ఎత్తైన మహా ప్రాసాదమును నిర్మింపగోరుచున్నది.(25)

 రుద్రుడు నాకు భర్త కావలననే కొర్కెను మనస్సులో నిడుకొని, దేవర్షియగు నారదుని అనుమతిని పొంది తీవ్రమగు తపస్సును చేయుచున్నాను.(26)

రెక్కలు లేని నా మనస్సును అనే పక్షి హఠాత్తుగా ఆకాశమునందు ఎగురుచున్నది. కరుణా సముద్రుడగు శంకరస్వామి దాని యాశను పరిపూర్ణము చేయును గాక ! (27)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆమె యొక్క ఈ మాటలను విని ఆ మహర్షులు నవ్వి ఆ పార్వతిని ప్రీతితో ఆదరించి (మనస్సులో) మాయమాటలను ఇట్లు పలికిరి(28)

ఋషులు ఇట్లు పలికిరి-

వ్యర్థముగా తాను పండితుడనను ధారణ గలవాడు, క్రూరమగు మనస్సు గలవాడు అగు ఆ దేవర్సి యొక్క చరిత్ర నీకు తెలియదు. ఓ పార్వతీ! నీవు సహజముగా బుద్ధిమంతురాలవే (29)

నారదుడు మోసపు మాటలను చెప్పి ఇతరుల మనస్సులను కల్లోల పెట్టును. అతని మాటలను విన్నవారికి అన్ని విధమలుగా హాని కలుగును (30)

మేము నీకు క్రమముగా బోధించెదము. నీవు మంచి బుద్ధితో ఈ చక్కని వృత్తాంతమును విని ప్రీతితో దానిని తెలుసుకొని మనస్సులో నిశ్చయించుము (31) బ్రహ్మపుత్రుడగు దక్షుడు తండ్రి ఆజ్ఞచే తన భార్య యందు పదివేల పుత్రులను గని, ఆ ప్రియపుత్రులను తపస్సు చేయుడని నియోగించెను. (32)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 173 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 Regard the three truths. They are equal. - 10 🌻*

The child soul must behave as such, and every religion must be prepared to meet and to feed the child soul, but that is no reason why it should have no stronger food for those who are more advanced. The souls who have passed through the earlier stages of growth long ago in other lives now wish to understand the great Plan – to know something about the world in which they live and the scheme by which it was made and is kept going. 

Many of our brothers have found, with great relief and a certain amount of surprise, that Theosophy was capable of supplying them with that knowledge, without destroying their religion in any way. There is nothing in the original teaching which in any way contradicts any science, although there has been an anti-scientific tendency coupled with ecclesiastical teaching ever since the Middle Ages. It is only because it happens to have been especially unfortunate in the loss of the higher teaching that it distinctly needs supplementing at the present day.

607. The Chohan then concludes Part I with the words:

608. These written above are the first of the rules which are written on the walls of the Hall of Learning. Those that ask shall have. Those that desire to read shall read. Those who desire to learn shall learn. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 54 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మోక్షము 🌻

సాధన యొక్క పరమావధి మోక్షమే! అయితే ధర్మార్థ కామ‌ మోక్షాలను చతుర్విద పురుషార్థాలుగా వ్యవహరింపబడే వాటిలో‌ మోక్షం అనేది ఒక పురుషార్థమనీ, మొదటి మూడింటినీ సమతూకంగా నడిపి వాటిలో సామ్యం సాధించగలిగిన జీవి అనుభవించే స్థితి మోక్షమని పెద్దలు చెప్పారు.  

మోక్షమనేది సాధించాల్సిన వేరే స్థితి కాదు. జీవుడు సహజముగా‌ మోక్షస్థితిలోనే ఉంటాడు. 

కానీ, క్రమేణ తెచ్చుకున్న బంధాల ఉచ్చు బిగిసిన‌ కొద్దీ పురుషార్థా‌ల నడుమ సమతూకం చెదిరి, మోక్షం అనే అనందస్థితి నుండి బంధమనే సంసార స్థితిలోనికి జారి, ఇక్కడి నుండి‌ చూస్తే మోక్షం వేరే సాధించాల్సిన ఒక మెట్టు లాగ కనిపిస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 43 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 BELIEVE IN POETRY 🍀*

*🕉 Life is an inexhaustible treasure, but only the heart if the poet can know it. 🕉*

Love is the only poetry there is. All other poetry is just a reflection of it. The poetry may be in sound, the poetry may be in stone, the poetry may be in the architecture, but basically these are all reflections of love caught in different mediums. But the soul of poetry is love, and those who live love are the real poets. They may never write poems, they may never compose any music-they may never do anything that people ordinarily think of as art-but those who live love, love utterly, totally, are the real poets. 

Religion is true if it creates the poet in you. If it kills the poet and creates the so-called saint, it is not religion. It is pathology, a kind of neurosis garbed in religious terms. Real religion always releases poetry in you, and love and art and creativity; it makes you more sensitive. You throb more, your heart has a new beat to it. 

Your life is no longer a boring, stale phenomenon. It is constantly a surprise, and each moment opens new mysteries. Life is an inexhaustible treasure, but only the heart of the poet can know it. I don't believe in philosophy, I don't believe in theology, but I believe in poetry.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 103 / Sri Lalita Sahasranamavali - Meaning - 103 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।*
*సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥ 🍀*

🍀 499. రక్తవర్ణా - 
ఎర్రని రక్త వర్ణంలో ఉండునది.

🍀 500. మాంసనిష్ఠా - 
మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది.

🍀 501. గుడాన్నప్రీతమానసా -
 గుడాన్నములో ప్రీతి కలది.

🍀 502. సమస్త భక్త సుఖదా - 
అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖసంతోషాలను ప్రసాదించునది.

🍀 503. లాకిన్యంబా స్వరూపిణీ - లాకినీ దేవతా స్వరూపముగా నున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 103 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 103. raktavarṇā māṁsaniṣṭhā guḍānna-prīta-mānasā |*
*samastabhakta-sukhadā lākinyambā-svarūpiṇī || 103 || 🌻*

🌻 499 ) Raktha varna -   
She who is of the colour of blood

🌻 500 ) Mamsa nishta -   
She who is in flesh

🌻 501 ) Gudanna preetha manasa -   
She who likes rice mixed with jaggery

🌻 502 ) Samastha bhaktha sukhadha -   
She who gives pleasure to all her devotees

🌻 503 ) Lakinyambha swaroopini -   
She who is famous in the name of “Lakini”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 103 / Sri Vishnu Sahasra Namavali - 103 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*ఉత్తరాభాద్ర నక్షత్ర తృతీయ పాద శ్లోకం*

*🍀 103. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః*
*తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః || 103 ‖ 🍀*
 
 🍀 959) ప్రమాణ: - 
స్వయముగానే జ్ఞానస్వరూపుడై యున్నవాడు.

🍀 960) ప్రాణ నిలయ: - 
సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు.

🍀 961) ప్రాణభృత్ - 
ప్రాణములను పోషించువాడు.

🍀 962) ప్రాణజీవన: - 
ప్రాణ వాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు.

🍀 963) తత్త్వం - 
సత్యస్వరూపమైనందున భగవానుడు తత్త్వం అని తెలియబడిన వాడు.

🍀 964) తత్త్వవిత్ - 
సత్యవిదుడైన భగవానుడు తత్త్వవిత్ అని స్తుతించబడువాడు.

🍀 965) ఏకాత్మా - 
ఏకమై, అద్వితీయమైన పరమాత్మ

🍀 966) జన్మమృత్యు జరాతిగ: - 
పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుచెందుట, కృశించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 103 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Uttara Bhadra 3rd Padam* 

*🌻 103. pramāṇaṁ prāṇanilayaḥ prāṇabhṛt prāṇajīvanaḥ |*
*tattvaṁ tattvavidekātmā janmamṛtyujarātigaḥ || 103 || 🌻*

🌻 959. Pramāṇaṁ: 
One who is self-certifying, as He is Pure Consciousness.

🌻 960. Prāṇanilayaḥ: 
The home or dissolving ground of the Pranas.

🌻 961. Prāṇa-bhṛt: 
One who strengthens the Pranas as food (Anna).

🌻 962. Prāṇa-jīvanaḥ:
He who keeps alive human beings with Vayus (airs) known as Prana, Apana etc.

🌻 963. Tattvaṁ: 
Means Brahman, just as words like Amruta, Satya, Paramartha, etc.

🌻 964. Tatvavid: 
One who knowns His own true nature.

🌻 965. Ekātmā: 
One who is the sole being and the spirit (Atma) in all.

🌻 966. Janma-mṛtyu-jarātigaḥ: 
One who subsists without being subject to the six kinds of transformations - being born, existing, temporarily, growing, transforming, decaying and dying.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹