🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 54 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. మోక్షము 🌻
సాధన యొక్క పరమావధి మోక్షమే! అయితే ధర్మార్థ కామ మోక్షాలను చతుర్విద పురుషార్థాలుగా వ్యవహరింపబడే వాటిలో మోక్షం అనేది ఒక పురుషార్థమనీ, మొదటి మూడింటినీ సమతూకంగా నడిపి వాటిలో సామ్యం సాధించగలిగిన జీవి అనుభవించే స్థితి మోక్షమని పెద్దలు చెప్పారు.
మోక్షమనేది సాధించాల్సిన వేరే స్థితి కాదు. జీవుడు సహజముగా మోక్షస్థితిలోనే ఉంటాడు.
కానీ, క్రమేణ తెచ్చుకున్న బంధాల ఉచ్చు బిగిసిన కొద్దీ పురుషార్థాల నడుమ సమతూకం చెదిరి, మోక్షం అనే అనందస్థితి నుండి బంధమనే సంసార స్థితిలోనికి జారి, ఇక్కడి నుండి చూస్తే మోక్షం వేరే సాధించాల్సిన ఒక మెట్టు లాగ కనిపిస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹
13 Jul 2021
No comments:
Post a Comment