శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బర్బరాలకా ॥ 111 ॥ 🍀

🌻 547. 'బర్బరాలకా’ - 3 🌻


నిత్య సంస్కారములు లేనివారి యందు క్రమముగ మలినములు చేరును. కాలక్రమమున మలిన జీవనమును ప్రోత్సహించు బుద్ధి కూడ కలుగును. వీరినే మ్లేచ్ఛులు అందురు. మ్లేచ్ఛు లనగా మలినములందు యిచ్ఛ గలవారు. ఆధునిక యుగమున ఈ సంస్కారహీనతను స్పష్టముగ దర్శించ వచ్చును. శ్రీమద్రామాయణమున ఆదికవి వాల్మీకి మహర్షి అయోధ్య వాసులను, లంకావాసులను సరిపోల్చినాడు. అయోధ్యవాసులు సంస్కరింప బడిన శిరోజములు కలవారని, నిత్యమూ స్నానపానాదులను దైవారాధననూ గావించు ప్రశాంతచిత్తులుగా వర్ణించినాడు. లంకా వాసులు విరబోసికొనిన శిరోజములు కలవారని, రజస్తమోగుణ మాలిన్య ముతో జీవించువారని తెలిపినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 547. 'Barbaralaka' - 3 🌻


Impurities gradually accumulate in those who do not have daily rituals. In the course of time, there will come a mindset to encourage impure living as well. These are the Mlechhas. Mlechchas mean those who are fond of filth. This lack of culture can be clearly seen in the modern age. In Srimadramayana, sage Valmiki compared the people of Ayodhya and the people of Lanka. He described the people of Ayodhya as having groomed hair, having a daily bath, doing daily worship of God and as calm souls. He said that the people of Lanka have loose hair and live with impurities of Rajasthamogunas.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 76 Siddeshwarayanam - 76


🌹 సిద్దేశ్వరయానం - 76 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 రత్న ప్రభ - 3 🏵


రత్నప్రభ వాళ్ళమ్మతో కలిసి స్వామి వారివెంట తీర్ధయాత్రలకు వెళ్ళింది. ఆయా క్షేత్రాలలో తాము ఎన్నివందల సంవత్సరాల క్రింద ఉన్నది. పూర్వజన్మ విశేషాలు ఆ దేవతా మహిమవల్ల జరిగిన అద్భుతాలు స్వామివారు తెలియజేసేవారు. వారు మాటాడుతున్నప్పుడల్లా ఆ సమయాలలో తానుకూడా వారితో ఉన్నట్లు అనిపించేది. ఈ విధంగా దీర్ఘప్రయాణాలు చేసి చివరకు కామాఖ్య చేరుకొన్నారు. కామాఖ్య కాళి గురించి కాళీపురాణంలోని విశేషాలు స్వామివారు చెపుతుంటే దిగ్భ్రాంతి కలిగింది.

ఆ ఊరిలో ఉండగా సంవత్సరాని కొకసారి జరిగే మహోత్సవములు వచ్చినవి. నాగ భూమి నుండి దిగంబర సాధువులెందరో ఆ కార్యక్రమాలలో పాల్గొనటానికి వచ్చారు. ఒకపూట అద్భుతమైన ఖడ్గ చాలన ప్రదర్శన జరిగింది. నిప్పులలో దూకేవారు, నారసాలు గుచ్చుకొనేవారు, కొరడాలతో కొట్టుకొనేవారు చిత్ర విచిత్ర తీవ్ర సాధకులక్కడ కనిపించారు. దీర్ఘకాలం ఉపవాసాలుండి, ఎండలో పంచాగ్ని మధ్యంలో నిల్చుని, శీతకాలంలో గొంతు లోతు చన్నీళ్ళలో నిల్చొని కఠోర నియమాలతో ప్రాచీనులు తపస్సుచేస్తే – ఈ మార్గంలో శరీరాన్ని హింసిస్తూ సూదులతో పొడుచుకొంటూ కత్తులతో గుచ్చుకొంటూ, కర్రతో, కొరడాతో బాదుకొంటూ తామస మంత్రాలు చేస్తుంటే ఆ మంత్ర దేవతలు తొందరగా అనుగ్రహిస్తారని స్వామివారు తమ ప్రసంగాలలో తెలియజేశారు.

అక్కడి ఉత్సవాలలో ప్రధానమైనరోజు స్వామివారు ఒక ఎర్రని గుడ్డలో చిన్న యంత్రం పెట్టియిచ్చి దానిని రాత్రి తలక్రింద పెట్టుకొని నిద్రించమని చెప్పారు. కామాఖ్యలో పరమేశ్వరి యోనిపూజించబడుతుంది. ఆ శిలాఖండం నుండి - ఆ దేవి రజస్వలయైన దానికి గుర్తుగా రక్తం స్రవిస్తూ ఉంటుంది. ఆ వస్త్ర ఖండాలను మహాప్రసాదంగా తీసుకొని పూజలో పెట్టుకొంటారు. ఆ వస్త్ర ఖండంలో కాళీయంత్రం ఉంచి యిచ్చారు స్వామివారు.

రాత్రి ఉపవాసం ఉండి భూశయనం చేసి కాళీదేవిని స్మరిస్తూ కండ్లు మూసుకొని పడుకొన్నది రత్నప్రభ. అప్పటికి మొదటిజాముదాటి రెండవజాము ప్రవేశించింది. నిద్రలో ఉన్నదో లేక మెలకువగా ఉన్నదో తెలియని స్థితిలో ఉన్నట్లుండి శరీరంలో నుండి బయటకు వచ్చినట్లు అనిపించింది. చూస్తే తాను ఆకాశంలో ఉంది. శరీరం క్రింద కనిపిస్తున్నది. గగనయానం చేస్తూ నీలిమబ్బుల మధ్య ఒక గుహలో ప్రవేశించింది. సుదీర్ఘమైన ఈ అంధకార కందరంలో వెళ్ళి వెళ్ళి చివరకు బయటకు వస్తే ఒక కాంతి పుంజం. ఆ తేజోమధ్యంలో కాళి - కాలభైరవుడు కనిపిస్తున్నారు. చిత్రం! ఇద్దరూ చాలా సుందరంగా ప్రేమమూర్తులుగా భాసిస్తున్నారు.

కాళీదేవి భైరవునితో ఇలా అంది "భైరవస్వామీ! ఈ బాలిక బృందావనంలో రాధాదేవి చెలికత్తెయైన ఇందులేఖ యొక్క అంశ. మనోరమ అనే పేరుతో ఉండి నా భక్తుడైన ఒక సిద్ధునితో అనుబంధం కలిగి భువనేశ్వరారణ్యంలోని నామందిరంలో కొంతకాలం మంత్రసాధన చేసింది. ఆ మంత్రమునే మళ్ళీ మీరిప్పుడు నా భక్తురాలికి ప్రసాదించండి. నాలో రాధాదేవి అంశయైన శ్యామకాళి మీలో కృష్ణుని అంశయైన కృష్ణభైరవుడు పూర్ణత్వ ప్రాభవం పొందటం జరిగింది. కనుక రాధాకృష్ణ భక్తురాలైన ఈ జీవి మీ అనుగ్రహానికి అర్హురాలు." కాళీ ప్రియుడైన కృష్ణ భైరవుడు రత్నప్రభకు కాళీమంత్రాన్ని ఉపదేశించాడు.

రత్నప్రభ అత్యంత వినమ్రమూర్తియై ఇద్దరికి పాదనమస్కారం చేసి ఆ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టింది. ప్రారంభించిన కాసేపటికి ఆజ్ఞాచక్రంలో కదలిక వచ్చింది. మూసిన తలుపులు తెరుచుకొన్నట్లు అక్కడ సంచలనం కలిగి దివ్యదృష్టి లభించింది. వరుసగా తన జన్మపరంపర గోచరిస్తున్నది. బృందావనంలో రాధాదేవి పరివారంలో శ్యామ అనేపేరుతో ఉండి - జనమేజయుని సర్పయాగంలో హోమకుండంలో పడి దహనం కాకుండా రాధాదేవి కరుణవల్ల రక్షించబడిన సిద్ధనాగుడనే నాగజాతి తపస్వికి ఆ ధామంలో సేవచేసింది. రాధా శరీరంలోని రాసేశ్వరి బయటకువెళ్ళి కృష్ణునితో కలిసి దివ్యభూమికలోకి ప్రవేశించిన తర్వాత మిగిలిన ఉశీనర రాజకుమారి రాధ - సిద్ధాశ్రమానికి తపస్సు చేసుకోటానికి వెళ్ళిపోయింది.

అనంతరం శ్యామ సిద్ధనాగునితో ఉంది. రాధాదేవి సంకల్పంవల్ల ప్రపంచంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే ప్రణాళికలో భాగంగా తాను ఎన్నో జన్మలు తీసుకోవలసి వచ్చింది. సిద్ధనాగుడు కూడా పరమేశ్వరి ఇచ్ఛవల్ల జన్మపరంపర పొందటం జరిగింది. అతడు భైరవనాధుడనే సిద్ధునిగా, భానుదేవుడనే రాజయోగిగా ఉన్నప్పుడు ఆయనకు సేవచేసింది. ప్రవరసేనుడనే మహారాజుగా బృందావన ప్రాంతాన్ని పరిపాలించినపుడు ఆ నరపాలుని భార్య నాగావళిగా రాధాదేవిని కొలిచింది. ఆ సిద్ధేశ్వరుడు డెహ్రాడూన్ ప్రాంతంలో జన్మించినపుడు అనూరాధా అనే కాళీసఖిగా ఉండి భౌతికరూపం తీసుకొని ఆయనతో కాపురంచేసి సంతానంకని మళ్ళీ అమ్మ పరివారంలోకి వెళ్ళింది. తరువాత కొంతకాలం హిమాలయాలలో సిద్ధాశ్రమంలో లలితాదేవి ఆలయంలో కింకరిగా హిరణ్య అనేపేరుతో ఉంది. అక్కడ తాంత్రిక సాధనలుచేసి డాకినీ సిద్ధిని పొందింది. హిమాలయాలలో డాకిని అంటే దేవయోని జాతికి చెందిన దివ్యశక్తులు గల అప్సరస వంటిది.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 539: 14వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 539: Chap. 14, Ver. 15

 

🌹. శ్రీమద్భగవద్గీత - 539 / Bhagavad-Gita - 539 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 15 🌴

15. రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ||


🌷. తాత్పర్యం : రజోగుణమునందుండి మరణించినవాడు కామ్యకర్మరతుల యందు జన్మించును. తమోగుణము నందుండి మరణించినవాడు జంతుజాలమున జన్మించును.

🌷. భాష్యము : ఆత్మ మానవజన్మ స్థాయిని పొందిన పిమ్మట తిరిగి పతనము నొందదనెడి అభిప్రాయమును కొందరు కలిగియున్నారు. కాని అట్టి భావన సరియైనది కాదు. ఈ శ్లోకము ననుసరించి తమోగుణమును వృద్ధిపరచుకొనినవాడు మరణానంతరము జంతురూపమునకు పతనము నొందును. తిరిగి ఆ స్థితి నుండి పరిణామ సిద్ధాంతము ద్వారా మానవజన్మను పొందుటకు జీవుడు తనను తాను ఉద్ధరించు కొనవలెను.

కనుక మనవజన్మ యెడ నిజముగా శ్రద్ధగలవారు సత్త్వగుణము నవలంబించి, సత్సాంగత్యమున గుణముల నధిగమించి కృష్ణభక్తిభావనలో నిలువవలెను. ఇదియే మానవజన్మ యొక్క లక్ష్యమై యున్నది. లేనిచో మానవుడు తిరిగి మానవజన్మనే పొందుచున్న హామీ ఏదియును లేదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 539 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 15 🌴

15. rajasi pralayaṁ gatvā karma-saṅgiṣu jāyate
tathā pralīnas tamasi mūḍha-yoniṣu jāyate

🌷 Translation : When one dies in the mode of passion, he takes birth among those engaged in fruitive activities; and when one dies in the mode of ignorance, he takes birth in the animal kingdom.

🌹 Purport : Some people have the impression that when the soul reaches the platform of human life it never goes down again. This is incorrect. According to this verse, if one develops the mode of ignorance, after his death he is degraded to an animal form of life. From there one has to again elevate himself, by an evolutionary process, to come again to the human form of life.

Therefore, those who are actually serious about human life should take to the mode of goodness and in good association transcend the modes and become situated in Kṛṣṇa consciousness. This is the aim of human life. Otherwise, there is no guarantee that the human being will again attain to the human status.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 09, JUNE 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

🍀🌹 09, JUNE 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 539 / Bhagavad-Gita - 539 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 50 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 50 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 76 🌹
🏵 రత్నప్రభ - 3 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 3 🌹 
🌻 547. 'బర్బరాలకా’ - 3 / 547. 'Barbaralaka' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 539 / Bhagavad-Gita - 539 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 15 🌴*

*15. రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే |*
*తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ||*

*🌷. తాత్పర్యం : రజోగుణమునందుండి మరణించినవాడు కామ్యకర్మరతుల యందు జన్మించును. తమోగుణము నందుండి మరణించినవాడు జంతుజాలమున జన్మించును.*

*🌷. భాష్యము : ఆత్మ మానవజన్మ స్థాయిని పొందిన పిమ్మట తిరిగి పతనము నొందదనెడి అభిప్రాయమును కొందరు కలిగియున్నారు. కాని అట్టి భావన సరియైనది కాదు. ఈ శ్లోకము ననుసరించి తమోగుణమును వృద్ధిపరచుకొనినవాడు మరణానంతరము జంతురూపమునకు పతనము నొందును. తిరిగి ఆ స్థితి నుండి పరిణామ సిద్ధాంతము ద్వారా మానవజన్మను పొందుటకు జీవుడు తనను తాను ఉద్ధరించు కొనవలెను.*

*కనుక మనవజన్మ యెడ నిజముగా శ్రద్ధగలవారు సత్త్వగుణము నవలంబించి, సత్సాంగత్యమున గుణముల నధిగమించి కృష్ణభక్తిభావనలో నిలువవలెను. ఇదియే మానవజన్మ యొక్క లక్ష్యమై యున్నది. లేనిచో మానవుడు తిరిగి మానవజన్మనే పొందుచున్న హామీ ఏదియును లేదు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 539 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 15 🌴*

*15. rajasi pralayaṁ gatvā karma-saṅgiṣu jāyate*
*tathā pralīnas tamasi mūḍha-yoniṣu jāyate*

*🌷 Translation : When one dies in the mode of passion, he takes birth among those engaged in fruitive activities; and when one dies in the mode of ignorance, he takes birth in the animal kingdom.*

*🌹 Purport : Some people have the impression that when the soul reaches the platform of human life it never goes down again. This is incorrect. According to this verse, if one develops the mode of ignorance, after his death he is degraded to an animal form of life. From there one has to again elevate himself, by an evolutionary process, to come again to the human form of life.*

*Therefore, those who are actually serious about human life should take to the mode of goodness and in good association transcend the modes and become situated in Kṛṣṇa consciousness. This is the aim of human life. Otherwise, there is no guarantee that the human being will again attain to the human status.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 76 🌹*

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

*🏵 రత్న ప్రభ - 3 🏵*

*రత్నప్రభ వాళ్ళమ్మతో కలిసి స్వామి వారివెంట తీర్ధయాత్రలకు వెళ్ళింది. ఆయా క్షేత్రాలలో తాము ఎన్నివందల సంవత్సరాల క్రింద ఉన్నది. పూర్వజన్మ విశేషాలు ఆ దేవతా మహిమవల్ల జరిగిన అద్భుతాలు స్వామివారు తెలియజేసేవారు. వారు మాటాడుతున్నప్పుడల్లా ఆ సమయాలలో తానుకూడా వారితో ఉన్నట్లు అనిపించేది. ఈ విధంగా దీర్ఘప్రయాణాలు చేసి చివరకు కామాఖ్య చేరుకొన్నారు. కామాఖ్య కాళి గురించి కాళీపురాణంలోని విశేషాలు స్వామివారు చెపుతుంటే దిగ్భ్రాంతి కలిగింది.*

*ఆ ఊరిలో ఉండగా సంవత్సరాని కొకసారి జరిగే మహోత్సవములు వచ్చినవి. నాగ భూమి నుండి దిగంబర సాధువులెందరో ఆ కార్యక్రమాలలో పాల్గొనటానికి వచ్చారు. ఒకపూట అద్భుతమైన ఖడ్గ చాలన ప్రదర్శన జరిగింది. నిప్పులలో దూకేవారు, నారసాలు గుచ్చుకొనేవారు, కొరడాలతో కొట్టుకొనేవారు చిత్ర విచిత్ర తీవ్ర సాధకులక్కడ కనిపించారు. దీర్ఘకాలం ఉపవాసాలుండి, ఎండలో పంచాగ్ని మధ్యంలో నిల్చుని, శీతకాలంలో గొంతు లోతు చన్నీళ్ళలో నిల్చొని కఠోర నియమాలతో ప్రాచీనులు తపస్సుచేస్తే – ఈ మార్గంలో శరీరాన్ని హింసిస్తూ సూదులతో పొడుచుకొంటూ కత్తులతో గుచ్చుకొంటూ, కర్రతో, కొరడాతో బాదుకొంటూ తామస మంత్రాలు చేస్తుంటే ఆ మంత్ర దేవతలు తొందరగా అనుగ్రహిస్తారని స్వామివారు తమ ప్రసంగాలలో తెలియజేశారు.*

*అక్కడి ఉత్సవాలలో ప్రధానమైనరోజు స్వామివారు ఒక ఎర్రని గుడ్డలో చిన్న యంత్రం పెట్టియిచ్చి దానిని రాత్రి తలక్రింద పెట్టుకొని నిద్రించమని చెప్పారు. కామాఖ్యలో పరమేశ్వరి యోనిపూజించబడుతుంది. ఆ శిలాఖండం నుండి - ఆ దేవి రజస్వలయైన దానికి గుర్తుగా రక్తం స్రవిస్తూ ఉంటుంది. ఆ వస్త్ర ఖండాలను మహాప్రసాదంగా తీసుకొని పూజలో పెట్టుకొంటారు. ఆ వస్త్ర ఖండంలో కాళీయంత్రం ఉంచి యిచ్చారు స్వామివారు.*

*రాత్రి ఉపవాసం ఉండి భూశయనం చేసి కాళీదేవిని స్మరిస్తూ కండ్లు మూసుకొని పడుకొన్నది రత్నప్రభ. అప్పటికి మొదటిజాముదాటి రెండవజాము ప్రవేశించింది. నిద్రలో ఉన్నదో లేక మెలకువగా ఉన్నదో తెలియని స్థితిలో ఉన్నట్లుండి శరీరంలో నుండి బయటకు వచ్చినట్లు అనిపించింది. చూస్తే తాను ఆకాశంలో ఉంది. శరీరం క్రింద కనిపిస్తున్నది. గగనయానం చేస్తూ నీలిమబ్బుల మధ్య ఒక గుహలో ప్రవేశించింది. సుదీర్ఘమైన ఈ అంధకార కందరంలో వెళ్ళి వెళ్ళి చివరకు బయటకు వస్తే ఒక కాంతి పుంజం. ఆ తేజోమధ్యంలో కాళి - కాలభైరవుడు కనిపిస్తున్నారు. చిత్రం! ఇద్దరూ చాలా సుందరంగా ప్రేమమూర్తులుగా భాసిస్తున్నారు.*

*కాళీదేవి భైరవునితో ఇలా అంది "భైరవస్వామీ! ఈ బాలిక బృందావనంలో రాధాదేవి చెలికత్తెయైన ఇందులేఖ యొక్క అంశ. మనోరమ అనే పేరుతో ఉండి నా భక్తుడైన ఒక సిద్ధునితో అనుబంధం కలిగి భువనేశ్వరారణ్యంలోని నామందిరంలో కొంతకాలం మంత్రసాధన చేసింది. ఆ మంత్రమునే మళ్ళీ మీరిప్పుడు నా భక్తురాలికి ప్రసాదించండి. నాలో రాధాదేవి అంశయైన శ్యామకాళి మీలో కృష్ణుని అంశయైన కృష్ణభైరవుడు పూర్ణత్వ ప్రాభవం పొందటం జరిగింది. కనుక రాధాకృష్ణ భక్తురాలైన ఈ జీవి మీ అనుగ్రహానికి అర్హురాలు." కాళీ ప్రియుడైన కృష్ణ భైరవుడు రత్నప్రభకు కాళీమంత్రాన్ని ఉపదేశించాడు.
రత్నప్రభ అత్యంత వినమ్రమూర్తియై ఇద్దరికి పాదనమస్కారం చేసి ఆ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టింది. ప్రారంభించిన కాసేపటికి ఆజ్ఞాచక్రంలో కదలిక వచ్చింది. మూసిన తలుపులు తెరుచుకొన్నట్లు అక్కడ సంచలనం కలిగి దివ్యదృష్టి లభించింది. వరుసగా తన జన్మపరంపర గోచరిస్తున్నది. బృందావనంలో రాధాదేవి పరివారంలో శ్యామ అనేపేరుతో ఉండి - జనమేజయుని సర్పయాగంలో హోమకుండంలో పడి దహనం కాకుండా రాధాదేవి కరుణవల్ల రక్షించబడిన సిద్ధనాగుడనే నాగజాతి తపస్వికి ఆ ధామంలో సేవచేసింది. రాధా శరీరంలోని రాసేశ్వరి బయటకువెళ్ళి కృష్ణునితో కలిసి దివ్యభూమికలోకి ప్రవేశించిన తర్వాత మిగిలిన ఉశీనర రాజకుమారి రాధ - సిద్ధాశ్రమానికి తపస్సు చేసుకోటానికి వెళ్ళిపోయింది.*

*అనంతరం శ్యామ సిద్ధనాగునితో ఉంది. రాధాదేవి సంకల్పంవల్ల ప్రపంచంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే ప్రణాళికలో భాగంగా తాను ఎన్నో జన్మలు తీసుకోవలసి వచ్చింది. సిద్ధనాగుడు కూడా పరమేశ్వరి ఇచ్ఛవల్ల జన్మపరంపర పొందటం జరిగింది. అతడు భైరవనాధుడనే సిద్ధునిగా, భానుదేవుడనే రాజయోగిగా ఉన్నప్పుడు ఆయనకు సేవచేసింది. ప్రవరసేనుడనే మహారాజుగా బృందావన ప్రాంతాన్ని పరిపాలించినపుడు ఆ నరపాలుని భార్య నాగావళిగా రాధాదేవిని కొలిచింది. ఆ సిద్ధేశ్వరుడు డెహ్రాడూన్ ప్రాంతంలో జన్మించినపుడు అనూరాధా అనే కాళీసఖిగా ఉండి భౌతికరూపం తీసుకొని ఆయనతో కాపురంచేసి సంతానంకని మళ్ళీ అమ్మ పరివారంలోకి వెళ్ళింది. తరువాత కొంతకాలం హిమాలయాలలో సిద్ధాశ్రమంలో లలితాదేవి ఆలయంలో కింకరిగా హిరణ్య అనేపేరుతో ఉంది. అక్కడ తాంత్రిక సాధనలుచేసి డాకినీ సిద్ధిని పొందింది. హిమాలయాలలో డాకిని అంటే దేవయోని జాతికి చెందిన దివ్యశక్తులు గల అప్సరస వంటిది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 547 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 547 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బర్బరాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 547. 'బర్బరాలకా’ - 3 🌻*

*నిత్య సంస్కారములు లేనివారి యందు క్రమముగ మలినములు చేరును. కాలక్రమమున మలిన జీవనమును ప్రోత్సహించు బుద్ధి కూడ కలుగును. వీరినే మ్లేచ్ఛులు అందురు. మ్లేచ్ఛు లనగా మలినములందు యిచ్ఛ గలవారు. ఆధునిక యుగమున ఈ సంస్కారహీనతను స్పష్టముగ దర్శించ వచ్చును. శ్రీమద్రామాయణమున ఆదికవి వాల్మీకి మహర్షి అయోధ్య వాసులను, లంకావాసులను సరిపోల్చినాడు. అయోధ్యవాసులు సంస్కరింప బడిన శిరోజములు కలవారని, నిత్యమూ స్నానపానాదులను దైవారాధననూ గావించు ప్రశాంతచిత్తులుగా వర్ణించినాడు. లంకా వాసులు విరబోసికొనిన శిరోజములు కలవారని, రజస్తమోగుణ మాలిన్య ముతో జీవించువారని తెలిపినాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 547 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 547. 'Barbaralaka' - 3 🌻*

*Impurities gradually accumulate in those who do not have daily rituals. In the course of time, there will come a mindset to encourage impure living as well. These are the Mlechhas. Mlechchas mean those who are fond of filth. This lack of culture can be clearly seen in the modern age. In Srimadramayana, sage Valmiki compared the people of Ayodhya and the people of Lanka. He described the people of Ayodhya as having groomed hair, having a daily bath, doing daily worship of God and as calm souls. He said that the people of Lanka have loose hair and live with impurities of Rajasthamogunas.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj