Showing posts with label Kanuma. Show all posts
Showing posts with label Kanuma. Show all posts

సంక్రాంతి పండుగ వీడ్కోలు ముక్కనుమ శుభాకాంక్షలు / Mukkanuma Greetings


https://youtube.com/shorts/Mz5WS-ztEds


🌹 సంక్రాంతి పండుగ వీడ్కోలు ముక్కనుమ శుభాకాంక్షలు MUKKANUMA GREETINGS 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


సన్నాయి మేళంతో బసవన్నల ఆటలతో కనుమ పండుగ శుభాకాంక్షలు Kanuma Festival Greetings (a YT Short)



https://youtube.com/shorts/H4aBbRGSIrw

🌹 సన్నాయి మేళంతో బసవన్నల ఆటలతో కనుమ పండుగ శుభాకాంక్షలు

Kanuma Festival Greetings 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share


🌹🌹🌹🌹🌹


కనుమ పండుగ, మాస శివరాత్రి, మరియు ప్రదోష వ్రతం శుభాకాంక్షలు / Greetings on Kanuma festival, Masa Shivaratri, and Pradosha Vratam

🌹 ఈ కనుమ మీ కష్టాలను తొలగించి కమ్మని అనుభూతులను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ కనుమ పండుగ, మాస శివరాత్రి, ప్రదోష వ్రతం శుభాకాంక్షలు అందరికి 🌹

🍀 కనుమ, ముక్కనుమ విశిష్టత 🍀

ప్రసాద్ భరద్వాజ



🌹 Wishing you all a very happy Kanuma festival, Masa Shivaratri, and Pradosha Vratam, with the heartfelt hope that this Kanuma will remove your hardships and bring you sweet experiences. 🌹

🍀 Significance of Kanuma and Mukkanuma 🍀

Prasad Bharadwaj




కనుము పండుగ కర్షకుల పండుగ . ఈ రోజు పాడిపంటలను, పశుసంపదలను లక్ష్మీస్వరూపంగా పూజిస్తారు. ఈ పండుగ రోజున ఆడపడుచులు పసుపుకుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు. సంవత్సరమంతా రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులను కృతజ్ఞతా పూర్వకంగా ఈ రోజున అలంకరించి పూజిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు.

గంగిరెద్దుల వాళ్లు ఇల్లిల్లూ తిరుగుతూ ఎద్దుల అందరికి ఆశీర్వాదాలు ఇస్తూ ఆడి పాడి అలరిస్తారు. సంక్రాంతికి వారు సంపాదించేది. సంవత్సరమంతా వస్తుందని చెబుతారు. కొన్ని ప్రాంతాలలో ప్రభలను ఊరేగిస్తారు. కనుమ నాడు 'మినుములు' తినాలనే ఆచారం ఉంది. అందుకే 'మినప గారెలు చేసుకొని తింటారు.

నాలుగోరోజు ముక్కనుమ నాడు, ఆనందాల నుంచి ఆధ్యాత్మికంలోకి వస్తారు. చాలా ఊళ్లలో గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టి సంబరాలు జరుపుతారు. రంగు రంగు ముగ్గులకు స్వస్తి పలికి రథం ముగ్గులను ఇళ్ల ముందు వేసి పండుగను వీడ్కోలు పలు కుతారు.

🌹🌹🌹🌹🌹


కనుమ శుభాకాంక్షలు అందరికి Kanuma, Magh Bihu Good Wishes to All


🍀 కనుమ శుభాకాంక్షలు అందరికి, Magh Bihu Good Wishes to All 🍀

ప్రసాద్ భరద్వాజ

🌹🍀. కనుమ పండుగ విశిష్టత 🍀🌹

ఇది ప్రధానంగా వ్యవసాయదారులకు ప్రీతిప్రాప్తమైన పండుగ. తమకు సహకరించిన గోవులను, పశువులను, వ్యవసాయపనిముట్లను భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. ఆవులు, పాడిగేదెలు, కోడెదూడలు, పెయ్యలు, ఎడ్లకు కుంకుమ బోట్లు పెట్టి భక్తి చాటుకుంటారు. కొన్నిచోట్ల తప్పెట్లు తాళాలతో వీటిని ఊరేగిస్తారు. ఈరోజు ప్రయాణాలు పెట్టుకోరు.

కనుమ పండుగలో అంతర్లీనంగా శాస్త్ర, సామాజిక అంశాలు ఎన్నెన్నో వున్నాయి.. నువ్వులు, జొన్నలు, సజ్జలు, బియ్యం వంటి ధాన్యాలు-బీర, పొట్ల, చిక్కుడు, గుమ్మడి వంటి కూరగాయలతో ఆహార పదార్థాలను వండి తినడం ఆరోగ్యకరం.. కొంత మంది ముక్కనుమ పండుగను కూడా జరుపుకుంటారు. ఇలా ఆ మూడునాళ్లూ మురిపాలతో, ముచ్చట్లతో గడిచిపోతుంది. ప్రతి ఇల్లూ ఆనందాల లోగిలిగా మారిపోతుంది.

🌿🌼 ఈ రోజు ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు, సేకరిస్తారు .కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు. కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి, అనగా, మద్ది మాను, నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. అది నిజమే కావచ్చు, ఎంచేతంటే అందులో వున్నవన్ని, ఔషధాలు, వన మూలికలే గదా. 🌼🌿


🌹🌹🌹🌹🌹


కనుమ పండుగ విశిష్టత - కనుమ శుభాకాంక్షలు, Significance of Kanuma - Good Wishes on Kanuma


🌹. కనుమ పండుగ విశిష్టత - కనుమ శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kanuma to All. 🌹

ప్రసాద్ భరద్వాజ

🍀. కనుమ పండుగ విశిష్టత 🍀


సంక్రాంతి (Sankranthi) తరువాత వచ్చే పండుగే కనుమ పండుగ (Kanuma festival). కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూరులో బాగా జరుపుకుంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. అయితే సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం..

కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను (Orange color dress) ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను (Cattle) పూజించడం ఆచారంగా పాటిస్తారు.

ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి (Pongali) వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం (Poli challadam) అని అంటారు. పోలి చల్లడం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.

ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం (Believe). ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పూలు బెలూన్లతో అందంగా అలంకరించి (Beautifully decorated), కాళ్ళకు గజ్జలు, మెడలో గంటలు వేసి పూజిస్తారు. ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటారు.

వారికి పంట పండించడంలో (Harvesting the crop) సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు. అయితే కొన్ని పల్లెల్లో కనుమకు ఒక ప్రత్యేకత (Specialization) ఉంది. ఈ రోజున మినుములు తినాలనే ఆచారముంది. అందుకే వారు మినపగారెలను చేసుకొని తింటారు.

ఈ రోజున ఇంటికి వచ్చిన ఆడపడుచును, కొత్త అల్లుళ్లను తిరుగు ప్రయాణం (Return journey) చేయనివ్వరు. కనుమ రోజున మాంసాహారం (Non-vegetarian) వండుతారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కోలాహలంగా, సందడిగా ఇంటి వాతావరణం కనిపిస్తుంది. గాలి పటాలు ఎగుర వేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఈ పండుగను జరుపుకుంటారు.

కనుమ రోజున పెరుగును (Yogurt) దానం చేస్తే విశేష ఫలితం పొందుతారు. కొన్ని ప్రాంతాలలో కనుమ పండుగ రోజు పెద్ద ఎత్తున ఎద్దుల బండి పోటీలు (Bullock cart races), కోడిపందాలు నిర్వహిస్తుంటారు. వీటిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం విశేషం. ఈ కనుమ పండుగ వాతావరణం అంతా పల్లెటూరిలో అందంగా కనిపిస్తుంది.

ఇలా సంక్రాంతి చివరి రోజులు జరుపుకునే కనుమ రోజుతో సంక్రాంతి పండుగ పూర్తవుతుంది. కనుమ పండుగ రోజున రైతులు పంట పండించడంలో సహాయపడిన పశువులను అందంగా అలంకరించి వాటికి ప్రత్యేక పూజలు చేయడం విశేషం. అందుకే కనుమ పండుగను పశువుల పండుగ (Cattle Festival) అని కూడా అంటారు.

- నవ్య

🌹 🌹 🌹 🌹 🌹

మకర సంక్రాంతి, Makar Sankranti Pongal


🌹. మకర సంక్రాంతి విశిష్టత 🌹

🍀. మకర సంక్రాంతి శుభాకాంక్షలు, Good Wishes on Makar Sankranti Pongal 🍀

ప్రసాద్ భరద్వాజ


జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడం వరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటి వరకూ దక్షిణాయనంలో సంచరిస్తూ వస్తున్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన శుభదినం కూడా ఇది.

సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష బ్రహ్మ. కాల చక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉండే పరమాత్మ స్వరూపం. ఉత్తరాయనంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరుగు రోజు. అదే మకర సంక్రాంతి. భోగి తర్వాత రోజు వచ్చేదే సంక్రాంతి.

సంక్రాంతి రోజునే శ్రీ మహా విష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చారు. ధర్మస్తాపన జరిగి అధర్మమును రూపుమాపిన రోజు సంక్రాంతి.

మకర సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు సంక్రాంతి పర్వదినాన నిర్వర్తించాలి. సూర్యోదయాకి ముందే నువ్వుల పిండితో శరీరాకి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాలం బాధలు నివారించుకోవడానికి స్నాన జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. నువ్వులు ఉష్ణవర్థకమైనవే కాకుండా బలవర్ధక మైనట్టివి.

మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నంటిలోనూ ఇది విశిష్టమైనది. ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైన కాలం. ఈ సమయంలో పూజ, పునష్కారాలు, యజ్ఞయా గాదులు చేసి దేవతలను మెప్పించాలి. అలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల నమ్మకం.


🌹. కనుము విశిష్టత 🌹

సంక్రాంతి పండుగల్లో చివరి రోజు కనుము. కనుము కర్షకుల పండుగ. పాడి పంటలను, పశు సంపదను, లక్ష్మీ స్వరూపంగా అర్పించే రోజు. ప్రకృతి స్వరూపిణీ అయిన అమ్మ ఆరాధన విశేషమే ఈ రోజు. తెలంగాణ ప్రాంతంలో ముత్తైదువులను తమ ఇంటికి ఆహ్వాంచి, పసుపు, కుంకుమలు, నువ్వుల పిండి మొదలైనవి ఇచ్చి 'సువాసి' పూజలు చేస్తారు. ఏడాదంతా పాడిపంటలకు తోడ్పడిన పశువులకు కృతజ్ఞతలు చెప్పడాకి 'కనుము' పండుగను జరుపుకుంటారు. మనది వ్యవసాయిక దేశం కనుక మనుష్యులకే కాదు, పశు పక్ష్యాదులకు ఇది పండుగే.

మనకు ఎంతో ఆనందాన్ని, సకల సౌభాగ్యాలను, శుభములనిచ్చే సంక్రాంతి పండుగలను భక్తి ప్రపత్తులతో పూజిద్దాం, తరిద్దాం.

🌹🌹🌹🌹🌹

కనుమ శుభాకాంక్షలు Kanuma Subhakankshalu: కనుమ పండగ విశిష్టత Significane of Kanuma : If you feed them, your anomalies will be removed


🌹. కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికి. 🌹

🔥.ఈ కనుమ మన జీవితాలలో సిరి సంపదలను, ఐశ్వర్యమును, సత్స్‌ సంభందములను నెలకొల్పి, అంతః వెలుగు వైపు మన ప్రయాణాన్ని సుగమము చేయుగాక. మనలో దివ్యత్వమును నింపుగాక. 🔥

ప్రసాద్‌ భరధ్వాజ

🌹. Good Wishes and Subhakankshalu on Kanuma Festival to all. 🌹

🔥. Let This Kanuma fill our Lives with all Resources, Good Relations, and Help us in our Journey towards Inner Light and fill with Divinity. 🔥

Prasad Bharadwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. కనుమ పండగ విశిష్టత 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


సంక్రాంతి పండగలో భాగంగా చివరగా జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. దీన్నె పశువులు పండగ అని కూడా అంటారు. ఏడాదంతా వివిధ రకాల వ్యవసాయ పనుల్లో తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు. ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమ ప్రసిద్ధి. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు.

కనుమ రోజు అడవిలో దొరికే వివిధ వనమూలికతో కూడిన మిశ్రమాన్ని పశువులకు తినిపిస్తారు. దీనిని ఉప్పుచెక్క అని కూడా అంటారు. ఏడాది కొకసారి పశువులకు ఉప్పుచెక్కను తినిపిస్తే అది వాటికి సర్వరోగ నివారణిగా పనిచేస్తుందని రైతుల నమ్మకం.

ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తీసుకెళ్లి, వాటికి శుభ్రంగా స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను రంగులు అద్దుతూ, ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలతో అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలి వేసి వాటికి విశ్రాంతినిస్తారు.

సాయంత్రం ఊరిలో కాటమరాజు విగ్రహాన్ని పున:ప్రతిష్టించి ఆయనకు కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు. వచ్చే ఏడాదిలో కూడా పాడిసంపద వృద్ధి చెంది, పంటలు సమృద్ధిగా పండితే మరింత ఘనంగా పూజలు చేస్తామని కాటమరాజుకు మొక్కులు సమర్పించుకుంటారు. కనుమ రోజు ఇంట్లో పసందైన వంటకాలు వండుతారు. కుటుంబ సభ్యులు వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం కనుమను ఘనంగా జరుపుకుంటారు.

🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



🌹. కనుమ రోజు వీటికి ఇవి ఆహారంగా ఇస్తే మీ దోషాలు అన్ని తొలగిపోతాయి ! 🌹

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

సంక్రాంతి తరువాత మరుసటి రోజు వచ్చే కనుమ పండగని తెలుగు వారు బాగా జరుపుకుంటారు. అయితే , ఈ రోజున గోమాతలకు , ఇంకా ఇతర జంతువులకు ప్రజలు సేవలు చేస్తుంటారు.

దేవతలందరు కూడా గోమాతలో ఉంటారు కాబట్టి 12 రాశుల వారు తమ నవగ్రహ దోషాలను తొలగించుకునేందుకు గోమాతకు పదార్దాలను తినిపించినట్లైతే ఫలితం ఉంటుంది. అలాగే , కాలభైరవుడు అనగా ఎంతో విశ్వాసం గల జంతువైన శునకముకు కూడా కనుమ రోజు కొన్ని పదార్థాలను తినిపిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అయితే ఆ కొన్ని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

కనుమ పండుగ రోజు ఉదయం గాని సాయంత్రం గాని... గోధుమపిండి , బెల్లం , ఓ చెంచా పాలతో 5 గాని , 7 గాని , 11 గానీ రొట్టెలను నెయ్యితో కాల్చి తయారుచేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే , ఈ రొట్టెలను మగవారు కానీ ఆడవారు కానీ ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. నవగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవారు ఆడవారు అయితే రొట్టెలను కాల్చేటప్పుడు ఎడమచేతిని ఎక్కువగా వాడాలి.. మగవారు అయితే కుడిచేతిని ఎక్కువగా వాడాలి. రొట్టెలను తయారు చేసిన తర్వాత...

గోమాత చుట్టూ ప్రదక్షణలు చేసి ఆ తర్వాత గోమాత యొక్క కుడికాలు వద్ద ఉన్న దూలిని తీసుకుని నుదుటన బొట్టు పెట్టుకోవాలి. తరువాత తయారు చేసినటువంటి రొట్టెలను గోమాతకు తినిపించాలి. ఇలా గోమాతకు సేవలు చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇకపోతే కాలభైరవుడైన శునకముకు ఎలా తినిపించాలంటే..

మీరు 7 , 11 లేదా 19 రొట్టెలను తయారు చేసుకోవాలి. అయితే వీటిని గోధుమపిండి , కొద్దీగా బెల్లం , కొన్ని తేనె చుక్కలు , కొంచెం పాలు లతో తయారు చేయాలి. ఈ రొట్టెలను కాల్చేటప్పుడు మీరు ఆవాల నూనె ను వాడటం మంచిది. కాలసర్ప దోషం , పంచమ రాహు , అష్టమ రాహు , రాహు కేతువుల పీడలు తొలగించుకోవడానికి ఆవాల నూనె ను వాడటం మంచిది.

అయితే ఈ తయారు చేసినటువంటి రొట్టెలను శునకాలకి ఎలా సమర్పించాలి అంటే.. మొదటిగా మీ వీధి లో ఉన్నటువంటి శునకాల వద్దకు వెళ్ళాలి. ఒకవేళ మీరు శునకాన్ని పెంచినా.. వాటికి మాత్రం మీరు ఈ రొట్టెలను తినిపించ కూడదు.

కేవలం వీధిలో ఉంటున్న శునకాలకి మాత్రమే రొట్టాలను తినిపించాలి. రొట్టెల తినిపించేటప్పుడు మొదటిగా.. మీ కుడి చేతితో రొట్టె ముక్కలు చేసి ఎడమచేత్తో శునకాల కి అందించాలి. శునకాలు రొట్టెలను తిన్న తర్వాత... మీ ఇంటికి వెళ్లి మట్టి కుందిలలో దీపారాధన చేసి మీ మనసులోని కోరికను కోరుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా దోషాలు ఉంటే అది తొలగిపోవాలని దీపారాధన ముందు మీరు కోరుకునవలేను.

🌹 🌹 🌹 🌹 🌹


16 Jan 2022

కనుమ ప్రాధాన్యత - పశువుల పండుగ Kanuma Significance - Cattle Festival


🌹. కనుమ ప్రాధాన్యత - పశువుల పండుగ 🌹

పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఈ పండగలో మూడవ రోజు కనుమ అని పశువుల పండుగ. పంట పొలాల నుండి తమ ఇంటికొచ్చిన పంటను భారతీయ హిందూ ధర్మం ప్రకారం ఒక గొప్పనైన సంస్కృతి ఆచరిస్తారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహయపడిన పశువును అవి చేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామేకాక, పశువులు, పక్షులతో పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు.

పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి, వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు.

తమకి సుఖసంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తోన్న పాత్రను రైతులు మరిచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు 'కనుమ' రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజున వాళ్లు పశువులను నదీ తీరాలకు గానీ, చెరువుల దగ్గరికి గాని తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు.

ఆ పశువుల నుదుటున పసుపు, కుంకుమదిద్ది వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. అలంకరణ పూర్తయిన తరువాత వాటిని పూజించి హారతిని ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు. ఈ పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి కార్యక్రమము చేస్తుంటారు.

🌹 🌹 🌹 🌹 🌹


15 Jan 2022