శ్రీ లలితా సహస్ర నామములు - 85 / Sri Lalita Sahasranamavali - Meaning - 85

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 85 / Sri Lalita Sahasranamavali - Meaning - 85 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀

🍀 388. నిత్యక్లిన్నా -
ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడుపబడి యుండునది.

🍀 389. నిరుపమా -
పోల్చిచెప్పుటకు ఉపమానము ఏమియు లేనిది.

🍀 390. నిర్వాణసుఖదాయినీ -
సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చునది.

🍀 391. నిత్యాషోడాశికారూపా - 
నిత్యాదేవతలగానున్న పదహారు కళల రూపము.

🍀 392. శ్రీకంఠార్థశరీరిణీ -
శివుని సగము శరీరముగా నున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 85 🌹

📚. Prasad Bharadwaj

🌻 85. nityaklinnā nirupamā nirvāṇa-sukha-dāyinī |
nityā-ṣoḍaśikā-rūpā śrīkaṇṭhārdha-śarīriṇī || 85 || 🌻

🌻 388 ) Nithya klinna -
She in whose heart there is always mercy

🌻 389 ) Nirupama -
She who does not have anything to be compared to

🌻 390 ) Nirvanasukha dayini -
She who gives redemption

🌻 391 ) Nithya shodasika roopa -
She who is of the form sixteen goddesses

🌻 392 ) Sri kandartha sareerini -
She who occupies half the body of Lord Shiva

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

05 Jun 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 36

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 36 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సాధన- సమిష్టి జీవనము 🌻

ప్రస్తుతము వర్తిస్తున్న కుంభయుగములో ఆధ్యాత్మిక సాధనకు సమిష్టి జీవనములో భాగస్వామ్యము తప్పనిసరి అని పరమగురువులు ఉపదేశిస్తున్నారని అందరికీ తెలుసు.‌

సంఘములో మెలగడంలో ఎగుడుదిగుడులు సర్దుకోక పోవడం వల్ల సాధన స్తంభిస్తుందనేది యథార్థము.

సాధకుడు జపతపాలు, ప్రార్థనా హోమాలు శ్రద్ధగా నెరవేర్చవచ్చు. ఇవన్నీ భక్తి సాధనకు సామాగ్రియే గాని భక్తి కావు.

🌻. సమాజంలో నిరంతరమూ అంతర్యామిని దర్శిస్తూ, అ అనుభూతిలో ప్రతి కర్తవ్యము ‌అంతర్యామికి అర్చనగా చేయడంలో సాధన ఎదుగుతుంది. 🌻

సాధకుడు ఇందుకుగాను తాను పూజించే ఏ గురువును అయినా ఇష్టదేవతనయినా సరే సర్వాంతర్యామిగా ముందు భావనలో రూఢీచేసుకోవాలి.

అలా లేని సందర్భంలోనే,‌ వివిధమార్గాలు, వివిధ గురువులు, మతాలు గోచరించి, ఎక్కువ తక్కువలు, కలహాలు ఏర్పడతాయి.‌

అంతే కాదు సాధకుడు నిర్వర్తించే జపతపాదులు గాని, సేవాకార్యక్రమాలు గాని యావజ్జీవితము శ్రద్ధగా అనుష్ఠించాలి. మంచి పనులను ఏ మాత్రము విడువకుండా, ప్రతిదినము ఒకే సమయానికి అభ్యాసం చేస్తూ పోతేగాని, వానిలో దృఢత్వము రాదు, శ్రద్ధ ఏర్పడదు.

ప్రారంభించినప్పుడు కలిగే ఉత్సాహము, కార్యదీక్ష కొన్నేండ్లు అయ్యేసరికు క్రమంగా మాటు పడుతుంటాయి. ఇక సేవ యాంత్రికముగా‌ మాత్రమే‌ సాగుతుంటుంది. సాధకుని ద్వారా జరిగే సేవ వలన సమాజంలో వారికి ప్రయోజనం చేకూరవచ్చునే గాని, అతనికి మాత్రం వికాసము, పరిశుద్ధి లభింపక, ఎదుగుదల ఆగిపోవును.

🌹 🌹 🌹 🌹 🌹

05 Jun 2021

శ్రీ శివ మహా పురాణము - 408

🌹 . శ్రీ శివ మహా పురాణము - 408🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 22

🌻. పార్వతీ తపోవర్ణనము - 4 🌻

గ్రీష్మ కాలములో చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లు చుండగా ఆమె మధ్యలో కూర్చుండి రాత్రింబగళ్లు నిరంతరముగా మంత్రమును జపించెను (40). వర్షకాలమునందు ఆమె వేదికపై స్థిరమగు ఆసనములో కూర్చుండి, లేదా రాయిపై గూర్చుండి నిరంతరముగా జపము చేయుచుండగా, ఆమెపై జలధారలు వరషించెడివి (41).

భక్తి యందు తత్పరురాలైన ఆ పార్వతి ఆహారము లేనిదై శీతకాలములో మంచు కురియు రాత్రులందు కూడా నీటి మధ్యలో నిరంతరముగా నిలబడి తపస్సును చేసెను (42). ఈ విధముగా శివాదేవి పంచాక్షరీ జపమునందు నిమగ్నురాలై తపస్సును చేయుచూ, సర్వకామనలను ఫలములను ఇచ్చు శివుని ద్యానించెను (43).

ఆమె ప్రతిదినము సఖురాండ్రతో గూడి తాను పాతిన శుభకరమగు వృక్షములకు నీరు పోసెడిది. ఆమె అచట అతిథులకు ఆనందముతో స్వాగత సత్కారముల నిచ్చెడి (44). దృఢమగు చిత్తముగల ఆ పార్వతి సహింప శక్యము గాని గాలిని, చలిని, వర్షమును, మరియు ఎండలను, ఇట్టి వివిధ వాతావరణములను సహించెను (45).

ఆమె తనకు సంప్రాప్తమైన వివిధ దుఃఖములను లెక్క చేయలేదు. ఓ మహర్షి ఆమె మనస్సును శివుని యందు మాత్రమే లగ్నము చేసి నిర్వికారముగా నుండెను (46). ఆ దేవి ముందు ఫలములను ఆ తరువాత పత్రములను భుజించి తపస్సు చేసెను. ఆమె ఇట్లు వరుసగా అనేక సంవత్సరములను తపస్సుతో గడిపెను (47).

పర్వత పుత్రియగు ఆ శివాదేవి తరువాత పత్రములను కూడ విడనాడి, ఆహారమును భుజించకుండగనే తపస్సును చేయుటలో నిమగ్నమాయెను (48). ఆమె పత్రములను కూడ భుజించుట మానివేసినది గనుక, ఆ పార్వతీ దేవికి దేవతలు అపర్ణ అను పేరును ఇచ్చిరి (49).

ఆ పార్వతి ఒంటి కాలిపై నిలబడి శివుని స్మరిస్తూ పంచాక్షర మంత్రమును జపిస్తూ గొప్ప తపస్సును చేసెను (50). నార బట్టలను ధరించిన ఆమె యొక్క కేశములు జడలు గట్టినవి. శివుని ఆరాధించుట యందు లగ్నమైన మనస్సు గల ఆ దేవి తపస్సును చేయుటలో మునులను కూడ జయించెను (51).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

05 Jun 2021

గీతోపనిషత్తు -208

🌹. గీతోపనిషత్తు -208 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 46, 47, Part 4

🍀 45-4. యోగీభవ - హనుమంతుడు పరులు గుర్తింప లేని మహాయోగి. హనుమంతుని జీవితము తనకొరకు జీవింపబడ లేదు. దైవము కొరకే తన ఉనికి. అతడు సహజయోగి. అతని యందు నాలుగు వేదములు భాసించును. అతనిని మించిన జ్ఞాని లేడు. కాని అతడు జ్ఞానమునకు తగులుకొని యుండడు. 🍀

అతడు మహత్తరమగు కార్యములను నిర్వర్తించెను. అతడు సాధించిన కార్యములు అనితర సాధ్యము. కాని వానిని గూర్చిన జ్ఞప్తి కూడ అతనికి ఉండదు. అతడు నిత్య తపస్వి. విశ్వాత్మ రాముని చింతనలో తనను తాను మరచి యుండును.

తాను భక్తుడనని, యోగినని, జ్ఞానినని, శక్తివంతుడనని భావింపడు. తన భావన, తను భావన లేక కేవలము బ్రహ్మము వలె వసించి యుండును. శ్రీకృష్ణుడు అర్జునునకు యోగమును బోధించు సమయమున అర్జునుని రథము పై జెండావలె యుండెను.

అధర్మమునకు ప్రతికూలముగ, ధర్మమునకు అనుకూలముగ వాయువులను ప్రసరింపజేసి అర్జునునకు తోడ్పడెను. అతడి యునికి ఎవరు గుర్తించిరి? సహాయము పొందినవారు కూడ గుర్తింపలేని రీతులలో సహాయము చేయు మహాయోగి.

అట్టివాడు కృష్ణుడు అర్జునునికి బోధించినపుడు అచటనే యున్నాడు. అతని యునికి కృష్ణునికే తెలుసును. యోగులను గూర్చి ఎంత వివరించినను అది అసంపూర్ణమే యగును. అందువలన శ్రీకృష్ణుడు అర్జునునికి జీవిత గమ్యమును నిర్వచించి మార్గమును నిర్దేశించెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

05 Jun 2021

5-JUNE-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 208🌹  
2) 🌹. శివ మహా పురాణము - 408🌹 
3) 🌹 Light On The Path - 155🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -36🌹  
5) 🌹 Osho Daily Meditations - 25🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 85 / Lalitha Sahasra Namavali - 85🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 85 / Sri Vishnu Sahasranama - 85🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -208 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 46, 47, Part 4

*🍀 45-4. యోగీభవ - హనుమంతుడు పరులు గుర్తింప లేని మహాయోగి. హనుమంతుని జీవితము తనకొరకు జీవింపబడ లేదు. దైవము కొరకే తన ఉనికి. అతడు సహజయోగి. అతని యందు నాలుగు వేదములు భాసించును. అతనిని మించిన జ్ఞాని లేడు. కాని అతడు జ్ఞానమునకు తగులుకొని యుండడు. 🍀

అతడు మహత్తరమగు కార్యములను నిర్వర్తించెను. అతడు సాధించిన కార్యములు అనితర సాధ్యము. కాని వానిని గూర్చిన జ్ఞప్తి కూడ అతనికి ఉండదు. అతడు నిత్య తపస్వి. విశ్వాత్మ రాముని చింతనలో తనను తాను మరచి యుండును. 

తాను భక్తుడనని, యోగినని, జ్ఞానినని, శక్తివంతుడనని భావింపడు. తన భావన, తను భావన లేక కేవలము బ్రహ్మము వలె వసించి యుండును. శ్రీకృష్ణుడు అర్జునునకు యోగమును బోధించు సమయమున అర్జునుని రథము పై జెండావలె యుండెను. 

అధర్మమునకు ప్రతికూలముగ, ధర్మమునకు అనుకూలముగ వాయువులను ప్రసరింపజేసి అర్జునునకు తోడ్పడెను. అతడి యునికి ఎవరు గుర్తించిరి? సహాయము పొందినవారు కూడ గుర్తింపలేని రీతులలో సహాయము చేయు మహాయోగి. 

అట్టివాడు కృష్ణుడు అర్జునునికి బోధించినపుడు అచటనే యున్నాడు. అతని యునికి కృష్ణునికే తెలుసును. యోగులను గూర్చి ఎంత వివరించినను అది అసంపూర్ణమే యగును. అందువలన శ్రీకృష్ణుడు అర్జునునికి జీవిత గమ్యమును నిర్వచించి మార్గమును నిర్దేశించెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 408🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 22

*🌻. పార్వతీ తపోవర్ణనము - 4 🌻*

గ్రీష్మ కాలములో చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లు చుండగా ఆమె మధ్యలో కూర్చుండి రాత్రింబగళ్లు నిరంతరముగా మంత్రమును జపించెను (40). వర్షకాలమునందు ఆమె వేదికపై స్థిరమగు ఆసనములో కూర్చుండి, లేదా రాయిపై గూర్చుండి నిరంతరముగా జపము చేయుచుండగా, ఆమెపై జలధారలు వరషించెడివి (41).

భక్తి యందు తత్పరురాలైన ఆ పార్వతి ఆహారము లేనిదై శీతకాలములో మంచు కురియు రాత్రులందు కూడా నీటి మధ్యలో నిరంతరముగా నిలబడి తపస్సును చేసెను (42). ఈ విధముగా శివాదేవి పంచాక్షరీ జపమునందు నిమగ్నురాలై తపస్సును చేయుచూ, సర్వకామనలను ఫలములను ఇచ్చు శివుని ద్యానించెను (43). 

ఆమె ప్రతిదినము సఖురాండ్రతో గూడి తాను పాతిన శుభకరమగు వృక్షములకు నీరు పోసెడిది. ఆమె అచట అతిథులకు ఆనందముతో స్వాగత సత్కారముల నిచ్చెడి (44). దృఢమగు చిత్తముగల ఆ పార్వతి సహింప శక్యము గాని గాలిని, చలిని, వర్షమును, మరియు ఎండలను, ఇట్టి వివిధ వాతావరణములను సహించెను (45).

ఆమె తనకు సంప్రాప్తమైన వివిధ దుఃఖములను లెక్క చేయలేదు. ఓ మహర్షి ఆమె మనస్సును శివుని యందు మాత్రమే లగ్నము చేసి నిర్వికారముగా నుండెను (46). ఆ దేవి ముందు ఫలములను ఆ తరువాత పత్రములను భుజించి తపస్సు చేసెను. ఆమె ఇట్లు వరుసగా అనేక సంవత్సరములను తపస్సుతో గడిపెను (47).

పర్వత పుత్రియగు ఆ శివాదేవి తరువాత పత్రములను కూడ విడనాడి, ఆహారమును భుజించకుండగనే తపస్సును చేయుటలో నిమగ్నమాయెను (48). ఆమె పత్రములను కూడ భుజించుట మానివేసినది గనుక, ఆ పార్వతీ దేవికి దేవతలు అపర్ణ అను పేరును ఇచ్చిరి (49). 

ఆ పార్వతి ఒంటి కాలిపై నిలబడి శివుని స్మరిస్తూ పంచాక్షర మంత్రమును జపిస్తూ గొప్ప తపస్సును చేసెను (50). నార బట్టలను ధరించిన ఆమె యొక్క కేశములు జడలు గట్టినవి. శివుని ఆరాధించుట యందు లగ్నమైన మనస్సు గల ఆ దేవి తపస్సును చేయుటలో మునులను కూడ జయించెను (51).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 155 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 When the disciple is ready to learn, then he is accepted, acknowledged, recognized. It must be so, for he has lit his lamp, and it cannot be hidden. - 6 🌻*

567. That is much the wisest. It is the same with the work we are given to do. If it seems outwardly to be a failure, we should not allow that to discourage us. We may not have achieved the result that we expected,’ but we may have achieved exactly the result which the Master intended. He does not always tell us all that is in His mind. 

He will set us a piece of work to do, and we think that what is to us the obvious result of that work is necessarily what He is aiming to get from it. It may be that He has in His mind quite another idea. He may even wish to train the worker in a particular way – not to be disappointed by failure, for example; or it might have reference to something else of which the worker knew nothing at all. I have had several instances of that in the course of my experience of occultism. We were told to do certain things, and supposed them to be aimed at a certain result, which did not come. 

We wondered; but in after years it has been seen that something quite different would not have been attained when it was, if that work had not been done. I have no doubt at all that in that case the Master gave us the work, not with the object we supposed, but with the other object of which we knew nothing.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 36 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : వేణుమాధవ్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. సాధన- సమిష్టి జీవనము 🌻*

ప్రస్తుతము వర్తిస్తున్న కుంభయుగములో ఆధ్యాత్మిక సాధనకు సమిష్టి జీవనములో భాగస్వామ్యము తప్పనిసరి అని పరమగురువులు ఉపదేశిస్తున్నారని అందరికీ తెలుసు.‌

సంఘములో మెలగడంలో ఎగుడుదిగుడులు సర్దుకోక పోవడం వల్ల సాధన స్తంభిస్తుందనేది యథార్థము. 

సాధకుడు జపతపాలు, ప్రార్థనా హోమాలు శ్రద్ధగా నెరవేర్చవచ్చు. ఇవన్నీ భక్తి సాధనకు సామాగ్రియే గాని భక్తి కావు. 

*🌻. సమాజంలో నిరంతరమూ అంతర్యామిని దర్శిస్తూ, అ అనుభూతిలో ప్రతి కర్తవ్యము ‌అంతర్యామికి అర్చనగా చేయడంలో సాధన ఎదుగుతుంది. 🌻*

సాధకుడు ఇందుకుగాను తాను పూజించే ఏ గురువును అయినా ఇష్టదేవతనయినా సరే సర్వాంతర్యామిగా ముందు భావనలో రూఢీచేసుకోవాలి. 

అలా లేని సందర్భంలోనే,‌ వివిధమార్గాలు, వివిధ గురువులు, మతాలు గోచరించి, ఎక్కువ తక్కువలు, కలహాలు ఏర్పడతాయి.‌ 

అంతే కాదు సాధకుడు నిర్వర్తించే జపతపాదులు గాని, సేవాకార్యక్రమాలు గాని యావజ్జీవితము శ్రద్ధగా అనుష్ఠించాలి. మంచి పనులను ఏ మాత్రము విడువకుండా, ప్రతిదినము ఒకే సమయానికి అభ్యాసం చేస్తూ పోతేగాని, వానిలో దృఢత్వము రాదు, శ్రద్ధ ఏర్పడదు. 

ప్రారంభించినప్పుడు కలిగే ఉత్సాహము, కార్యదీక్ష కొన్నేండ్లు అయ్యేసరికు క్రమంగా మాటు పడుతుంటాయి. ఇక సేవ యాంత్రికముగా‌ మాత్రమే‌ సాగుతుంటుంది. సాధకుని ద్వారా జరిగే సేవ వలన సమాజంలో వారికి ప్రయోజనం చేకూరవచ్చునే గాని, అతనికి మాత్రం వికాసము, పరిశుద్ధి లభింపక, ఎదుగుదల ఆగిపోవును.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 25 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 HAPPINESS 🍀*

*🕉 There are no outside causes of happiness or unhappiness; these things are just excuses. By and by we come to realize that it is something inside us that goes on changing, that has nothing to do with outside circumstances. 🕉*

How you feel is something inside you, a wheel that keeps on moving. Just watch it--and it is very beautiful, because in being aware of it, something has been attained. Now you understand that you are free from outside excuses, because nothing has happened on the outside and yet your mood has changed within a few minutes from happiness to unhappiness, or the other way around.

This means that happiness and unhappiness are your moods and don't depend on the outside. This is one of the most basic things to be realized, because then much can be done. The second thing to understand is that your moods depend on your unawareness. 

So just watch and become aware. If happiness is there, just watch it and don't become identified with it. When unhappiness is there, again just watch. It is just like morning and evening. In the morning you watch and enjoy the rising sun. When the sun sets and darkness descends, that too you watch and enjoy.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 85 / Sri Lalita Sahasranamavali - Meaning - 85 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।*
*నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀*

🍀 388. నిత్యక్లిన్నా - 
ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడుపబడి యుండునది.

🍀 389. నిరుపమా - 
పోల్చిచెప్పుటకు ఉపమానము ఏమియు లేనిది.

🍀 390. నిర్వాణసుఖదాయినీ -
 సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చునది.

🍀 391. నిత్యాషోడాశికారూపా - నిత్యాదేవతలగానున్న పదహారు కళల రూపము.

🍀 392. శ్రీకంఠార్థశరీరిణీ - 
శివుని సగము శరీరముగా నున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 85 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 85. nityaklinnā nirupamā nirvāṇa-sukha-dāyinī |*
*nityā-ṣoḍaśikā-rūpā śrīkaṇṭhārdha-śarīriṇī || 85 || 🌻*

🌻 388 ) Nithya klinna -   
She in whose heart there is always mercy

🌻 389 ) Nirupama -   
She who does not have anything to be compared to

🌻 390 ) Nirvanasukha dayini -   
She who gives redemption

🌻 391 ) Nithya shodasika roopa -   
She who is of the form sixteen goddesses

🌻 392 ) Sri kandartha sareerini -   
She who occupies half the body of Lord Shiva

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 85 / Sri Vishnu Sahasra Namavali - 85 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*శ్రవణం నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🍀 85. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః !*
*ఆర్కో వాజనసః శృంగీ జయంతః సర్వ విజ్జయీ !! 85 !! 🍀*

🍀 790. ఉద్భవః - 
ఉత్క్రష్టమైన జన్మగలవాడు.

🍀 791. సుందరః - 
మిక్కిలి సౌందర్యవంతుడు.

🍀 792. సుందః - 
కరుణాస్వరూపుడు.

🍀 793. రత్నగర్భః - 
రత్నమువలె సుందరమైన నాభి గలవాడు.

🍀 794. సులోచనః - 
అందమైన నేత్రములు కలవాడు.

🍀 795. అర్కః - 
శ్బ్రహ్మాదుల చేత అర్చింపబడువాడు.

🍀 796. వాజసనః - 
అర్థించువారలకు అన్నపానాదులు నొసంగువాడు.

🍀 797. శృంగీ - 
శృంగము గలవాడు.

🍀 798. జయంతః - 
సమస్త విజయములకు ఆధారభూతుడు.

🍀 799. సర్వవిజ్జయీ - 
సర్వము తెలిసినవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 85 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Sravana 1st Padam*

*🌻 85. udbhavaḥ sundaraḥ sundō ratnanābhaḥ sulōcanaḥ |*
*arkō vājasanaḥ śṛṅgī jayantaḥ sarvavijjayī || 85 || 🌻*

🌻 790. Udbhavaḥ: 
One who assumes great and noble embodiments out of His own will.

🌻 791. Sundaraḥ: 
One who has a graceful attractiveness that surprises everyone.

🌻 792. Sundaḥ: 
One who is noted for extreme tenderness (Undanam).

🌻 793. Ratna-nābhaḥ: 
Ratna indicates beauty; so one whose navel is very beautiful.

🌻 794. Sulōcanaḥ: 
One who has brilliant eyes, that is, knowledge of everything.

🌻 795. Arkaḥ: 
One who is being worshipped even by beings like Brahma who are themselves objects of worship.

🌻 796. Vājasanaḥ: 
One who gives Vajam (food) to those who entreat Him.

🌻 797. Śṛṅgī: 
One who at the time of Pralaya (cosmic dissolution) assumed the form of a fish having prominent antenna.

🌻 798. Jayantaḥ: 
One who conquers enemies easily.

🌻 799. Sarvavijjayī: 
The Lord is 'Sarvavit' as He has knowledge of everything. He is 'Jayi' because He is the conqueror of all the inner forces like attachment, anger etc., as also of external foes like Hiranyaksha.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹